ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి గురువారం తన కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా వీరిలో 5గురు ఏయూ విద్యార్థులు కావడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఏయూ విద్యార్థులు ఎంపిక కావడం వర్సిటీ ప్రతిష్టను ఇనుమడింప చేయడమన్నారు. ఇటువంటి అవకాశాలు విద్యార్థి జీవితంలో అరుదుగా వస్తాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎంపికైన విద్యార్థులు...
రెండు దశల్లో జరిగిన ఎంపికల్లో ఏయూ పరిధిలో 5గురు విద్యార్థులు ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా 200 మంది వలంటీర్లను రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొనడానికి ఎంపిక చేశారు. వీరిలో మన రాష్ట్రం మెత్తం నుంచి 10 మంది ఎంపిక కాగా, ఏయూ నుంచి 5 వలంటీర్లు ఎంపికయ్యారు. డి.యువరాజు, బి.అనీల్ కుమార్, బి.గాయత్రి తుషార, బూసి ఏంజిలీనా, మేరుగు భావనలు ఎంపికయ్యారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏయూఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎస్.హరనాథ్, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర ఇటిఐ కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పలు రైళ్ల సర్వీసులకు నెలాఖరు వరకూ పొడిగించినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాఠి తెలియజేశారు. బుధవారం ఈ మేరకు విశాఖలోని రైల్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుమారు 24 రూట్లలో రైళ్లు పొడిగింపు వివరాలను తెలియజేశారు. ప్రజల అవసరాన్ని తీర్చాలనే ఉద్దేశ్యంతో పండుగ ప్రత్యేక రైలు సర్వీసుల సేవలను విస్తరించాలని రైల్వే నిర్ణయిందని చెప్పారు. పొడిగించిన తేదీల ఆధారంగా ప్రయాణీకులు తమ రిజర్వేషన్లు చేయించుకోవాలని ఆయన వివరించారు. ఈ క్రింది సర్వీసులు తేదీల వారీగా పొడిగించినట్టు ఆయన వివరించారు.
1. భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ శనివారం భువనేశ్వర్ నుండి బయలుదేరి 30.01.2021 వరకు పొడిగించారు.
2. ఆదివారం తిరుపతి నుండి బయలుదేరే రైలు నెంబర్ 08480 తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 31.01.2021 వరకు పొడిగించారు.
3. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ గురువారం భువనేశ్వర్ నుండి బయలుదేరి 28 జనవరి -2021 వరకు పొడిగించారు.
4. రైలు నెంబర్ 02840 చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి 29 జనవరి -2021 వరకు పొడిగించారు.
5. ఆదివారాలు భువనేశ్వర్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 02845 భువనేశ్వర్-బెంగళూరు కాంట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 31, 2021 వరకు పొడిగించారు.
6. రైలు నెంబర్ 02846 బెంగళూరు కాంట్- భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుండి బెంగళూరు క్యాంట్ నుండి బయలుదేరి ఫిబ్రవరి 1, 2021 వరకు పొడిగించారు.
7. మంగళవారం భువనేశ్వర్ నుండి బయలుదేరిన రైలు నెంబర్ 02898 భువనేశ్వర్-పుదుచ్చేరి వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 26, 2021 వరకు పొడిగించారు.
8. బుధవారం పుదుచ్చేరి నుండి బయలుదేరిన రైలు నెంబర్ 02897 పుదుచ్చేరి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 27 వ జనవరి -2021 వరకు పొడిగించారు.
9. శుక్రవారం భువనేశ్వర్ నుండి బయలుదేరే రైలు నంబర్ 08496 భువనేశ్వర్-రామేశ్వరం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 29 జనవరి -2021 వరకు పొడిగించారు.
10. ఆదివారం రామేశ్వరం నుండి బయలుదేరిన రైలు నెంబర్ 08495 రామేశ్వరం-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 31, 2021 వరకు పొడిగించారు.
11. ఆదివారాలు పూరీ నుండి బయలుదేరే రైలు నెంబర్ 02859 పూరి-చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 31, 2021 వరకు పొడిగించారు.
12. సోమవారం నెంబర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 02860 చెన్నై సెంట్రల్-పూరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 1, 2021 వరకు పొడిగించారు.
13. సోమవారం మరియు శుక్రవారాలలో విశాఖపట్నం నుండి బయలుదేరిన రైలు నెం .02851 విశాఖపట్నం-నిజాముద్దీన్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 29 జనవరి -2021 వరకు పొడిగించారు.
14. రైలు నెంబర్ 02852 హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం ద్వి వీక్లీ ఎక్స్‌ప్రెస్ బుధ, ఆదివారాల్లో హజ్రత్ నిజాముద్దీన్ నుండి బయలుదేరుతుంది జనవరి 31, 2021 వరకు పొడిగించారు.
15. మంగళవారం, బుధ, గురువారాలు, శని, ఆదివారాల్లో విశాఖపట్నం నుండి బయలుదేరిన రైలు నెంబర్ 02887 విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 21, 2021 వరకు పొడిగించారు.
16. హజరత్ నిజాముద్దీన్ నుండి బయలుదేరిన రైలు నెం .02888 హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం, శుక్ర, శని, ఆదివారాలు మరియు మంగళవారాల్లో ఫిబ్రవరి 2, 2021 వరకు పొడిగించారు.
17. విశాఖపట్నం-చెన్నై వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సోమవారం విశాఖపట్నం నుండి బయలుదేరి జనవరి 25, 2021 వరకు పొడిగించారు.
18. మంగళవారం చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే రైలు నెం .02870 చెన్నై సెంట్రల్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 26 జనవరి -2021 వరకు పొడిగించారు.
19. రాయగడ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ద్వారా విశాఖపట్నం-లోక్మాన్య తిలక్ టెర్మినస్ రైలు నెంబర్ 02857 ఆదివారం విశాఖపట్నం నుండి బయలుదేరి 31 జనవరి -2021 వరకు పొడిగించారు.
20. రైలు నెంబర్ 02858 లోక్మాన్య తిలక్ టెర్మినస్-విశాఖపట్నం ద్వారా రాయగడ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ద్వారా లోక్మాన్య తిలక్ టెర్మినస్ నుండి మంగళవారం బయలుదేరుతుంది ఫిబ్రవరి 2, 2021 వరకు పొడిగించారు.
21. విశాఖపట్నం-గాంధీధామ్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ గురువారం విశాఖపట్నం నుండి బయలుదేరి 28 జనవరి -2021 వరకు పొడిగించారు.
22. ఆదివారం గాంధీధామ్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 08502 గాంధీధామ్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 31, 2021 వరకు పొడిగించారు.
23. రైలు నెంబర్ 07488 విశాఖపట్నం-కుడపా రోజువారీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ జనవరి 31, 2021 వరకు పొడిగించారు.
24. రైలు నంబర్ 07487 కడపా- విశాఖపట్నం రోజువారీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 1 -2021 వరకు పొడిగించారు.
విశాఖ ఉక్కులో రూ.2500 కోట్ల తో నిర్మాణమైన కోక్ ఒవెన్ బ్యాటరీ -5 ప్రారంభం ఒక చారిత్రక అంశమని స్టీల్ సీఎండీ పీకే రథ్ పేర్కొన్నారు. మంగళవారం ఉక్కులోని నిర్మాణమైన బ్యాటరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారంలో ఉద్యోగుల అవిశ్రాంత శ్రమతోనే ఈ ప్రాజెక్టు విజయవంతంగా ప్రారంభమైనందని అన్నారు. ఈరోజే కోల్ తో మొదటిసారిగా చార్జు చేయడం కూడా శుభపరిణామమన్నారు. ప్లాంటులోని 76 ఒవెన్లు 24గంటలలోపే చార్జ్ చేసే అవకాశం దీని ద్వారా ఏర్పడిందని చెప్పారు. ఈప్రాజెక్టును బిఈసి కన్సారియం, మిసర్స్ టాటా ప్రాజెక్టు సంయుక్తంగా సకాంలో రూపొందించిందన్నారు. ఈ బ్యాటరీ మొదటి కోక్ పుషింగ్ కార్యక్రమంలో మొకాన్ సీఎండీ అతుల్ భట్, స్టీల్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఇందులో భాగంగా డిసెంబరు 25న శుక్రవారం తెల్లవారుజామున 12.05 నుండి 1.30 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.30 నుండి 2.30 గంటల వరకు ఏకాంతంగా అభిషేకం చేపడతారు. నిజపాద దర్శనం ఉండదు. ఆ తరువాత ఏకాంతంగా తోమాల సేవ, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 4.30 గంటల నుండి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఉదయం 9 గంటలకు స్వర్ణరథం..
ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుండి 10 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు.
డిసెంబరు 26న చక్రస్నానం..
డిసెంబరు 26వ తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గల స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు..
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో డిసెంబరు 24 నుండి డిసెంబరు 26వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాదీ సంవత్సరానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
ఆలయంలో ఉదయం 6 నుండి 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, అనంత, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జైన్ టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనాన్ని సోమవారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత జైన్ వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ జి.సురేష్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.