1 ENS Live Breaking News

వేడుక‌గా శ్రీవారి పార్వేట ఉత్స‌వం

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రిగింది. సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణోత్స‌వ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేశారు. శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టిటిడి ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.  కోవిడ్‌-19 నిబంధ‌న‌ల కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ ‌మండ‌పం ఆవ‌ర‌ణంలో టిటిడి అట‌వీ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏడుకొండ‌లతో పాటు శేషాచ‌లాన్ని త‌ల‌పించేలా రూపొందించిన న‌మూనా అడ‌విలో వివిధ ర‌కాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వ‌న్య‌మృగాల బొమ్మ‌ల‌ను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేట‌లో పాల్గొన్నారు. అనంత‌రం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేశారు.         పార్వేట ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుప‌ల ఈవో మీడియాతో మాట్లాడుతూ లోక‌క‌ల్యాణం, క‌రోనా నివార‌ణ కోసం శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోనే ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా పార్వేట ఉత్స‌వాన్ని కూడా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసిన జీయ‌ర్‌స్వాముల‌కు, అర్చ‌క‌స్వాముల‌కు, అధికారుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.  ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్  భ‌ర‌త్ గుప్తా, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇలు  జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నాగేశ్వ‌ర‌రావు, డిఎఫ్‌వో చంద్ర‌శేఖ‌ర్‌, విజివోలు  మ‌నోహ‌ర్‌,  ప్ర‌భాక‌ర్‌, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-25 21:06:46

26 నుంచి శ్రీవారి టైంస్లాట్ టోకెన్ల జారీ..

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ సోమవారం నుండి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు. రోజుకు 3 వేల చొప్పున టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందిస్తారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తులను మాత్ర‌మే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమ‌లకు అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టిటిడి అధికారులుు కోరుతున్నారు. భక్తులకు టిక్కెట్లను అందించేందుకు టిటిడి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లును చేసింది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ఈ ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీచేస్తున్నట్టు అధికారులు మీడియాకి వివరించారు.

Tirumala

2020-10-25 15:59:39

కబ్జాకోరు గీతం గుర్తింపుని యూజీసి రద్దుచేయాలి..

కోట్ల రూపాయల విలువైన 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జాచేసిన గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ గుర్తింపుని యూజిసి తక్షణమే రద్దు చేయాలని AP ప్రజా సంఘాల జెఎసి అధ్యకులు జెటి రామారావు డిమాండ్ చేసారు. ఆదివారం ఆయ విశాఖలో మీడియాతో మాట్లాడారు. యూనివర్శటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) ఇది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వర్శిటీలు, ప్రైవేటు, డీమ్డ్ యూనిర్శిటీలకు గుర్తింపు నిచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ. యూజిసి ఏదైనా యూనివర్శిటీకి గుర్తింపు ఇవ్వాలంటే సిబ్బంది, అద్యాపకులు, వసతులు, భూములు, క్రీడా మైదానాలు ఇలా అన్నీ యూజీసి నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే గుర్తింపు ఇస్తుంది. ఆ సంస్థ ద్రుష్టికి గీతం భూ కబ్జాల విషయం తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. లేదంటే అవన్నీ సక్రమంగా ఉన్నాయని యూజిసీని కూడా నమ్మించే ప్రయత్నం గీతం చేస్తుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక్కోసారి ప్రభుత్వ యూనివర్శిటీలకు సైతం నిబంధనలు సరిగా లేవని నిధులు ఆపేసిన చరిత్ర యూజిసికి వుందనే విషయాన్ని జెటి గుర్తుచేశారు. ప్రస్తుతం గీతం ప్రభుత్వానికి చెందిన 40.50 ఎకరాల భూమి, విద్యాసంస్థల ప్రాంగణంలో 33 ఎకారాలు అక్రమని విశాఖ అర్భన్ ఆర్డీఓ పెంచల కిశోర్ స్పష్టం చేశారన్నారు. ఈ నేపథ్యం అందులోని నిర్మాణాలు అక్రమం, ఇలాంటి సమయంలో అక్రమ నిర్మాణాలు, కట్టడాలు ప్రభుత్వం కూల్చేస్తే విద్యార్ధుల పరిస్థితి ఏంటని యూజిసి, నిబంధనలన్నీ సక్రమంగా వుంటేనే అలాంటి విద్యాసంస్థలను గుర్తిస్తుంది. అపుడు విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధులను ద్రుష్టిలో వుంచుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థ యూజీసీ ఆ నిర్ణయం తీసుకుంటుంటి. అలా అనుకున్నప్పుడు యూజిసి నిబంధనల ప్రకారం గీతం విద్యాసంస్థ ఆస్తులు, నిర్మాణాలు సక్రమం కావు...అన్నీ అక్రమాలే అలాంటి సమయంలో యూజిసి గీతం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందాని విద్యార్ధుల్లో ఆందోళన మొదలైందన్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు విద్యార్ధులకే యూజిసికి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్న జెటీ తాను లిఖిత పూర్వకంగా యూజిసికి ఫిర్యాదు చేస్తానన్నారు. కానీ అలాంటిదేమీ లేదని విద్యాసంస్థల పీఆర్వో మీడియా ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పడం కూడా హాస్యాస్పదమన్నారు. అసలు విశాఖపట్నానికి గీతం వలనే పేరువచ్చిందని, ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ కే తమ గీతం సంస్థ ద్వారా పేరు, గుర్తింపు వచ్చిందని పీఆర్వో టివి5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం దయ్యాలు వేదాలు వల్లించినట్టేనన్నారు. విశాఖ కీర్తి ఇప్పటికే ప్రపంచవ్యామన్న విషయాన్ని అక్రమ భూ ఖబ్జా కోరు గీతం యాజమాన్యం తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇప్పటికే యూజిసి రెండు దఫాలుగా విడుదల చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి నోటీసులు ఇచ్చిందని వాటి విద్యార్ధుల తల్లిదండ్రులు పరిశీలించుకోవాలన్నారు. దీంతో అప్పటి వరకూ డీమ్డ్ యూనివర్శిటీ అని బోర్డు పెట్టుకున్న గీతం...యూజీజీ లేఖలతో గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అని పేరు మార్చుకుందని కూడా జెటి వివరించారు.  ఇలాంటి అక్రమ ఆస్తుల సంస్థలకు తక్షణమే గుర్తింపు రద్దుచేసి విద్యార్ధుల భవిష్యత్తు కాపాడాలని ప్రజాసంఘాల జేఏసి కన్వీనర్ జెటి.రామారావు డిమాండ్ చేశారు. అక్రమంగా ప్రభుత్వ భూములను ఖబ్జాచేసే గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీకి యూజీసి తక్షణమే గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రత్యేక లేఖ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, యూజిసికి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్టు ఆయన మీడియాకి తెలియజేశారు..

Visakhapatnam

2020-10-25 10:47:48

2020-10-24 20:05:35

గీతం వలనే ఏపీకి, వైజాగ్ కి గుర్తింపు వచ్చింది..

విశాఖపట్నానికి గీతం వలనే గుర్తింపు వచ్చిందట.. గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ  స్థాపించి ఏకంగా 40 సంవత్సరాలు అయిందట...అంతేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తమ సంస్థ ద్వారా మాత్రమే గుర్తింపువచ్చిందట.. పైగా ప్రపంచవ్యాప్తంగా గీతం పేరున్న యూనివర్శిటీ అట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ విద్యా సంస్థలో పీఆర్వో.. సుమారు రూ.800 కోట్ల రూపాయల(ప్రభుత్వ లెక్కల ప్రకారం) విలువ చేసే 40.50 ఎకరాల విలువైన భూమిని ఆక్రమించిన గీతం సంస్థకి తమ సంస్థ ద్వారా విశాఖకి పేరొచ్చిందని చెప్పాలని ఎలా అనిపించదనే విషయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏకంగా ప్రభుత్వమే గీతం విద్యాసంస్త ఒక భూ కబ్జా సంస్థ అని లిఖితపూర్వకంగా నోటీసులిచ్చి మరీ అక్రమనిర్మాణాలను శనివారం కూల్చేసి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. వాస్తవానికి పీఆర్వో(పౌర సంబంధాల అధికారి) అంటే సంస్థ, యూనివర్శిటీ ఏర్పాటు కోసం( తేదీలతో సహా తెలిసి వుండాలి, లేదంటే చేత్తో యూజిసి ఇచ్చిన గుర్తింపు పత్రాలను ప్రజలకు చూపుతూ మీడియాలో మాట్లాడాలి) పూర్తిగా తెలిసుండాలి..అసలు గీతం టుబీ యూనివర్శిటీ అయ్యే 13 ఏళ్లు పూర్తిగా కాలేదు.. అలాంటిది ఎలాంటి సమాచారం కూడా, అసలు విషయం తెలియకుండా గీతం తరుపున ఆ పీఆర్వో ఓ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. గీతం కోసం లేనిపోని గొప్పలు చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది.  గీతం పీఆర్వో చెప్పిన మాటల ప్రకారం గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటినీ 1980లోనే ఏర్పాటు చేశారు. కానీ యూజీసి అధికారిక లేఖల ప్రకారం, నిబంధనలు అనుసరించి గీతం టుబి డీమ్డ్ వర్శిటీ 13.08.2007లో ఏర్పాటు చేసినట్టువుంది. ఇప్పటికీ టుబీ డీమ్డ్ యూనివర్శిటీగా మారి 11 సంవత్సరాలు మాత్రమే పూర్తి కావాలి...కానీ ఏకంగా 29 సంవత్సరాలు కలిపి మరీ చెప్పారు గీతం పీఆర్వో. .వాస్తవానికి గీతం విద్యాసంస్థలు ఏర్పాటు జరిగింది మాత్రం 1980లోనే.. విద్యాసంస్థలకి.. విశ్వవిద్యాలయానికి చాలా తేడానే వుంది ఆ విషయకో...లేదంటే తెలిసీ జనాలను మసి పూసి మారేడు కాయ చేయాలని అలా ప్రకటించుకుకన్నారో తెలీదు కానీ..  అందులోనూ యూజిసి నిబంధనల ప్రకారం గీతం ఇంకా గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీగా మాత్రమే వున్న విద్యా సంస్థ ఏర్పాటు చేసి 40 ఏళ్లు అయ్యిందని నమ్మించే ప్రయత్నంచేశారు పీఆర్వో. ఒక్క గీతం మాత్రమే కాదు పాటు దేశవ్యాప్తంగా 127 డీమ్డ్ యూనివర్శిటీలు.. డీమ్డ్ టుబీ యూనివర్శిటీలుగానే ఉన్నాయి. ఆవిషయాన్ని ద్రువీకరిస్తూ.. మేం చెప్పినట్టు నడుచుకోవాలనంటూ స్పీడ్ పోస్టు ద్వారా రెండు సార్లు లేఖలు పంపింది. అందులో ఏ రాష్ట్రంలో ఏ యూనివర్శిటీ డీమ్డ్ గా వుంది, టుబీ డీమ్డ్ గా వుందో తెలియజేసింది కూడా. పైగా తాము ప్రకటించే వరకూ కొన్ని నిబంధనలు కూడా లక్ష్హణ రేఖగా పెట్టింది. అంటే వీటికి పూర్తిస్థాయి అనుమతులు రావాల్సివుందని చెప్పకనే చెప్పింది.. దానికి సంబంధించిన నకలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యూజీసీ లేఖ(మార్చినెలలో ఒకసారి, మే నెలలో ఒకసారి 2020న) విడుదల చేసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి న్యూస్ కార్డ్ ద్వారా తెలియజేసింది. వాటిని మరోసారి ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం చూపిస్తోంది కూడా. ఒక యూనివర్శిటీ వలన ప్రాంతానికి పేరు రాదు.. ప్రాంతం వలన యూనివర్శిటీకి పేరొస్తుంది...అలాంటి  ప్రపంచవ్యాప్తంగా పేరున్న సిటీ ఆఫ్ డెస్టినీ గా కీర్తించబడుతున్న విశాఖపట్నానికి తమ సంస్థ ద్వారానే పేరు వచ్చిందని చెప్పుకోవడాన్ని బట్టి చేస్తే గీతం యాజమాన్యం ప్రజలను, విద్యార్ధులను ఎలా ప్రలోభాలకు గురిచేయాలని చూస్తుందో అర్ధం చేసుకోవచ్చు.. గీతం వర్శిటీ ఏర్పాటై 40 ఏళ్లు దాటిందని టివి5 ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీఆర్వో చెప్పారు. కావాలంటే ఆ వీడియోను సంబంధిత ఛానల్ వెబ్ సైట్ లో పొందుపరిచారు గమనించవచ్చు.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నికార్శైన ఆధారాలతో మాత్రమే వార్తలను రాస్తుంది... పేలవంగా వుండే ఆధారాలతో కాదు.. ఈఎన్ఎస్ లైవ్ ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..!

Githam College

2020-10-24 20:04:13

ఉద్యోగుల 3 డీఏల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా పర్వదినాన శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న 3 డీఏ(కరువు భత్యం)ల చెల్లించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించడానికి  ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.  జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని, దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆఖరిగా జూలై 2019 నాటి 3 డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ. 3802 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో జమ చేయనున్నారు. దీంతో 4.49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏల చెల్లింపుపై ప్రభుత్వం ఆదేశించడం శుభపరిణామమని  సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. వాయిదా పడ్డ జీతాలను కూడా నవంబర్‌ 1 నుంచే చెల్లించడానికి అంగీకరించడం పట్ల  సీఎం వైఎస్ జగన్ కి ధన్యవాదాలు చెబుతూ,  సీఎం  ఉద్యోగుల సంక్షేమం కోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం ఉద్యోగులకు మేలు చేయడానికి  సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు.

Velagapudi

2020-10-24 19:32:17

గాంధీజీపేరుతో భూ ఆక్రమణలా..అయినా వదలం

గాంధీజీ పేరుతో పెట్టిన విద్యాసంస్థలో యామాన్యం వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను సిగ్గులేకుండా  ఆక్రమణలు చేయడం ఎంత దారుణమైన సంఘటనో టిడిపి నేతలు ఎల్లోమీడియా చెప్పాలని అనకాపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాద్ అన్నారు. శనివారం విశాఖలోనీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడారు. గీతం టుబీ యూనివర్శిటీ ప్రాంగణంలోనే 22 ఎకరాల భూమిని యాజమాన్యం కబ్జాచేసిన విషయం సంస్థ ప్రైవేటు సర్వేయర్లు, ప్రభుత్వ సర్వేయర్లు చేసిన తనిఖీలో బయటపడిందన్నారు. వాస్తవాలను దైర్యంగా బయటపెట్టలేని ఎల్లోమీడియా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఖబ్జాచేసిన భూములు స్వాధీనం చేసుకుందని బురచల్లుతోందన్నారు. రూ.800 కోట్ల విలువైన 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకోవడం ప్రజలు తప్పని తేల్చితే చేస్తున్న పనులు వదిలేసి వచ్చేస్తామన్నారు. కోట్లాది రూపాయల ఆక్రమించేస్తే  నోరు మెదపని ఎల్లోమీడియా, ఇపుడు చంద్రబాబు కుటుంభ సభ్యునిగా, బాలక్రిష్ణ అల్లుడు భరత్ కి ఏదో అన్యాయం జరిగిపోతుందని బాధపడటం చూస్తే ఏమనాలో తెలియడం లేదన్నారు. ఒక ప్రైవేటు విద్యాసంస్థ 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఖబ్జాచేస్తే చూస్తు ఊరుకోవాలా అని ప్రశ్నించారు. గీతం విషయంలో 5 నెలల క్రితమే రెవిన్యూ, జీవిఎంసీ నోటీలసులు ఇచ్చాయనే ఆధారాలు మీడియాకి చూపించారు ఎమ్మెల్యే అమర్. మరో 18 ఎకరాల భూమి కూడా గీతం విద్యాసంస్థల ఆధీనంలోనే ఉందన్నారు. భూ ఆక్రమణదారులను ఎవరినీ విడిచిపెట్టే ప్రశక్తిలేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ysrcp office vizag

2020-10-24 15:03:52

ఏపి ఎడ్‌సెట్‌ ‌లో 99.07% మందికి అర్హత..

రాష్ట్ర వ్యాప్తంగా బిఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2020 ‌ఫలితాలను శనివారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి విడుదల చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఐఏఎస్‌ఇ ‌ప్రాంగణంలోని ఎడ్‌సెట్‌ ‌కార్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షకు 15658 మంది దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. వీరిలో 10363 మంది పరీక్షకు హాజరయ్యారని వీరిలో 10267 మంది పరీక్షలో అర్హత సాధించారన్నారు. ఎడ్‌సెట్‌కు అర్హత సాధించిన వారి శాతం 99.07గా ఉందన్నారు. అక్టోబరు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలో పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సెట్‌ ‌కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.‌శివ ప్రసాద్‌ , ‌డీన్‌ ఆచార్య టి.షారోన్‌ ‌రాజు తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా పరిశీలిస్తే గణితంలో 99.74, భౌతిక శాస్త్రంలో 99.41, బయలాజికల్‌ ‌సైన్సెస్‌లో 99.03, సోషల్‌ ‌స్టడీస్‌లో 98.37, ఇంగ్లీషులో 98.83 శాతం మంది అర్హత సాధించడం జరిగిందన్నారు. గణితంలో వి.కిరణ్మయి(తూర్పుగోదావరి-రాజమండ్రి), ఫిజికల్‌ ‌సైన్స్‌లో ఫాతిమా షిఫానా ఏఆర్‌ (‌విశాఖపట్నం)  బయలాజికల్‌ ‌సైన్స్‌లో సతీష్‌ ‌చోడవరపు(క్రిష్ణాజిల్లా),  సోషల్‌ ‌స్టడీస్‌లో బొల్ల రవితేజ రెడ్డి (ప్రకాశంజిల్లా) , ఇంగ్లీషులో ఎం.అమీర్‌ ‌బాషాలు (కర్నూలు) ప్రధమ ర్యాంకులను సాధించారన్నారు. 

ఆంధ్రాయూనివర్శిటీ

2020-10-24 12:30:29

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర స్నానం..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌ని‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి. ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్ ఎదురుగా నూత‌నంగా ఏర్పాటు చేసిన  చిన్న పుష్క‌రిణిలో ఆల‌య అర్చ‌కులు సుదర్శన చక్రాన్ని ముంచి, ప‌విత్ర స్నానం చేయించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ‌వారి అనుగ్ర‌హంతో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన శ‌నివారం ఉదయం 6.00 గంటల నుండి శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారని తెలిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించార‌న్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్స‌వంతో శ్రీ వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ‌ని వివ‌రించారు. బ్ర‌హ్మోత్స‌వాలు నిర్విఘ్నంగా నిర్వ‌హించిన జీయ్యంగార్లు, ఆల‌య అర్చ‌కులు, అధికారులు, సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.   స్న‌ప‌న తిరుమంజ‌నం సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం  చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.  తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల‌తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.          ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్  కోన రఘుపతి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతిరెడ్డి,  కుపేంద్ర‌రెడ్డి, డా. నిశ్చిత‌,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-24 12:15:50

గీతం సింహభాగమే దురాక్రమణ..

 ఎవరైనా ఆక్రమణలు చేస్తే తాము కొనుగోలు చేసిన స్థలానికి పక్కనున్న స్థలాలను ఖబ్జా చేస్తారు...విచిత్రంగా గీతం టూబి డీమ్డ్ యూనివర్శిటీ మాత్రం జీవిఎంసీ రోడ్డుకు ఆనుకొని వున్న రోడ్ సైడ్ ప్రభుత్వ స్థలాలన్ని తమ సొంత భాగంలా కలిపేసుకొని మరీ కట్టడాలు నిర్మించేసింది. అదికాస్త నికార్శైన ఖబ్జా అని నిగ్గుతేల్చిన రెవిన్యూశాఖ ముందు సింహభాగమైన, గీతం బ్రాండ్ అయిన వెలకమ్ బోర్డు ప్రాంతాన్ని, సెక్యూరిటీ చెకింగ్ ప్రాంతాన్ని కుప్పకూల్చింది.  ఈ ప్రాంతం గూండా ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ ఈ గీతం విద్యాసంస్థల ప్రాంతాన్ని చూసినప్పుడల్లా అనే ఒకే ఒక్క మాట...అధికారం చేతుల్లో ఉంటే ఆర్అండ్ బీ రోడ్డుని కూడా కబ్జా చేసేయొచ్చు అని. అంతేకాకుండా ఈ విద్యా సంస్థకు ఎదురుగా వున్న కొండ ప్రాంతాన్ని కూడా కాస్త తమకు అనుకూలంగా చేసుకొని పార్కింగ్ స్థలం కోసం చదును చేసుకుందీ ఈ విద్యాసంస్థ. ఇవేవో మామూలు లెక్కలు కాదు ఆర్డీఓ పెంచల కిషోర్ స్వయంగా దగ్గరుండి మరీ అంగుళం అంగుళం కొలతలు వేయించి మరీ ఆక్రమణలు రికార్డు చేసిన అరుదైన సంఘటన. వడ్డీంచేవాడు మనోడైతే ఎలాంటి ప్రభుత్వ స్థలమైనా ఆక్రమించేయొచ్చు అనడానికి గీతం విద్యాసంస్థలు ఆక్రమించిన 40.50 ఎకరాల ప్రభుత్వభూమే ప్రధాన ఉదాహరణ. ఆక్రమణలు తొలగించడమే కాదు.. ప్రభుత్వ భూమిని గుర్తిస్తూ, హద్దులతో సహా స్వాధీనం చేసుకుంది రెవిన్యూ శాఖ. అంతేకాదు ఎన్నేళ్ల నుంచి ఆక్రమించిన స్థలాన్ని తమ సొంత ఆస్తుల్లా వినియోగించుకుంటుందనే విషయమై రెవిన్యూ అధికారులు ప్రత్యేక నివేదిక తయారు చేస్తున్నారు. పైగా ఇదే విషయమై సిట్ బ్రుంద్రం కూడా దర్యాప్తు చేస్తుంది. విచిత్రం ఏంటంటే ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలు చేసి, చూడచక్కగా మొక్కలు కూడా పెంచితే ప్రభుత్వ అధికారులు కళ్లుమూసుకుంటారనుకున్న గీతం యాజమాన్యానికి ఆధారాలతో సహా కూలదోస్తారని అనుకోలేదు పాపం. అయితే తమ ఆస్తులన్నీ సక్రమమే అంటోంది గీతం విద్యాసంస్థ. సక్రమం అయినపుడు అధికారులు ఆధారాలతో సహా ఎందుకు కూలదోస్తారని అడిగితే న్యాయపరంగా వెళతామని కూడా చెబుతోంది.. ఒక ప్రైవేటు యూనివిర్శిటీ ఇలా ప్రభుత్వ స్తలాలు ఆక్రమించి నిర్మాణాలు చేయడం, ఇన్నేళ్ల తరువాత దానిని ప్రభుత్వం ఆధారాలతో సహా గుర్తించి కూలగొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ విషయం ఎన్ని మలుపుతు తిరుగుతుందో వేచిచూడాలి..

Githam College

2020-10-24 11:53:16

2020-10-23 23:25:34

అశ్వవాహనంపై కల్కిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్ర‌వారం రాత్రి శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్  కోన రఘుపతి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు. కాగా, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన శ‌నివారం ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్లో స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.   ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతిరెడ్డి,  కుపేంద్ర‌రెడ్డి, డా. నిశ్చిత‌,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-23 22:53:09