2020-21 సంవత్సరానికి గాను 6 సంవత్సరాల బి.టెక్ కోర్స్ ప్రవేశనిమిత్తం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ ఆర్అండ్‌బి కార్యాలయములో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గురువారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటి) నోటిఫికేషన్‌ను మంత్రి విడుదల చేసారు. ఈసందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధి యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్ జియుకెటి) ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, వారి ప్రతిభాస్ధాయిని అనుసరించి బి.టెక్ కోర్సులలో ప్రవేశాలు ఉంటాయని మంత్రి అన్నారు. ఎ ంపికైన అభ్యర్ధులు ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయిలో గల త్రిబుల్ ఐటిల్లో సమీకృత విద్యతోకూడిన బి.టెక్ చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. ఈకోర్సుతోపాటు రెండు సంవత్సరాలు, మూడుసంవత్సరాల డిప్లమో కోర్సులలోకూడా కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణులై ప్రతిభాస్ధాయి ఆధారంగా యన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం తిరుపతి, డా. వైయస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెంలలో చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. 100 మార్కులు ఆధారంగా నిర్వహించే కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి 10వ తరగతి సిలబస్‌లోనే పరీక్ష ఉంటుందని, రెండుగంటలపాటు నిర్వహించే ఈపరీక్ష 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయని, నెగిటివ్ మార్కులు లేవని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యస్‌యస్‌సి (10వ తరగతి) స్ధాయిలో ఉన్న గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలు ఈప్రవేశపరీక్షకు సిలబస్ అని, మల్టీబుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ఓయంఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్ ఉంటుందని మంత్రి అన్నారు. మోడల్ క్వశ్చన్ పేపర్ ను అభ్యర్ధుల సౌకర్యార్ధం యూనివర్సిటీ వెబ్ సైట్ ూూూ.సగషీష.n లో అందుబాటులో ఉంచామని మంత్రి అన్నారు. పరీక్ష ఓయంఆర్ షీట్ పద్ధతిలో నిర్వహిస్తారని మంత్రి అన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎ గ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార ఈప్రవేశ పరీక్షల నిర్వాహణ బాధ్యతను అప్పజెప్పడమైనదని మంత్రి అన్నారు. ఈకామన్ ఎ ంట్రన్స్ టెస్టుకు సంబంధించి ఓసి అభ్యర్ధులు రూ. 300 లు, బిసి అభ్యర్ధులు రూ. 200 లు, యస్‌సి, యస్‌టి అభ్యర్ధులు రూ. 100 లు కామన్ ఎ ంట్రన్స్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుందని మంత్రి సురేష్ అన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద కోవిడ్-19 నియమనిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. పరీక్ష వ్రాసే అభ్యర్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్షకు హాజరుకావాలని అన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేస్తామని, సిబ్బంది కోవిడ్ నియమనిబంధనలు పాటించేలాగా చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అంబులెన్స్ వివరాలను ప్రతీ పరీక్షా కేంద్రంలో సమాచారం అందుబాటులో ఉంచామని మంత్రి అన్నారు. కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్ కు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసామని, ఈనెల అక్టోబరు 28 నుండి నవంబరు 10 వరకు అభ్యర్ధులు ఫీజులు చెల్లించి ధరఖాస్తులు పంపవచ్చునని మంత్రి అన్నారు. ఆన్‌లైన్ లో www.rgukt.in లో ధరఖాస్తులు సమర్పించడానికి నవంబరు 10వ తేదీ ఆఖరు తేది అని మంత్రి అన్నారు. రూ. 1000 లు అపరాధరుసుంతో ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరితేది నవంబరు 15 అని మంత్రి అన్నారు. అభ్యర్ధులు నవంబరు 22న హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని, నవంబరు 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని మంత్రి అన్నారు. ప్రాధమికపరీక్షల సమాధానాలు (కీషీట్) అదేరోజు విడుదల చేస్తామని, ప్రాధమికపరీక్షల సమాధానాలమీద అభ్యంతరాలను 30.11.2020న ప్రచురిస్తామని, ఫైనల్ కీ డిశంబరు 1న ప్రచురిస్తామని మంత్రి అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధుల సహాయం కొరకు సహాయకేంద్రాలు (హెల్ప్‌లైన్) పనిజేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 6 సంవత్సరాల సమీకృత బి.టెక్ కోర్సుకు సంబంధించి 4 వేల సీట్లు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల డిప్లమో కోర్సులకు సంబంధించి 6 వేల సీట్లు ఉన్నాయని, కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణులు అయి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని మంత్రి అన్నారు. 100 మంది కంటే అభ్యర్ధులు ఎ క్కువుగా ఉంటే ఆమండలంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, 100 మంది అభ్యర్ధులుకంటే తక్కువుగా ఉంటే దగ్గరలోని పరీక్షా కేంద్రానికి అభ్యర్ధులను కేటాయిస్తామని మంత్రి అన్నారు. నాన్ లోకల్ అభ్యర్ధులకు ప్రవేశాల్లో15 శాతం కేటాయించామని ఇందుకు సంబంధించి తెలంగాణా రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసామని, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ ,ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ , మెదక్, నల్గొండలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామని మంత్రి సురేష్ అన్నారు.
కోవిడ్ నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ రాష్ట్రంలో నవంబరు 2వ తేదీ నుండి అన్ని పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి విద్యార్ధుల చదువుతోపాటు వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారని మంత్రి అన్నారు. విద్యాశాఖ పరిస్ధితులను ఎ ప్పటికప్పుడు సమీక్షిస్తూ నవంబరు 2వ తేదీ నుండి నెలరోజులుపాటు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తామని మంత్రి అన్నారు. కోవిడ్ దృష్ట్యా పరిస్ధితులను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. పాఠశాలల్లో ప్రతీరోజూ 15 నిమిషాలపాటు క్లాస్ రూమ్‌లలో కోవిడ్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తారని మంత్రి అన్నారు. కోవిడ్ కారణంగా పాఠశాలల్లో పనిదినాలు కోల్పోయామని ఈదృష్ట్యా 2020-21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తూ సిలబస్‌ను తగ్గించడం, ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వాహణ, టెక్నాలజీ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలవారికి ఆఫ్ లైన్ క్లాస్‌ల నిర్వాహణపై సమీక్ష నిర్వహించి విద్యార్ధులు విద్యాసంవత్సరం నష్ట పోకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈసమావేశంలో రాజీవ్ గాంధి యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్ జియుకెటి) వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, కామన్స్ ఎ ంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ ప్రొఫెసర్ డి. హరినారాయణ, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎ గ్జామినేషన్స్ ఏ. సుబ్బారెడ్డి, త్రిబుల్ ఐటి నూజివీడు డైరెక్టరు ప్రొఫెసర్ యస్‌యస్‌వి. గోపాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్రమ అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి,ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి , ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన గురువారం ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేదిక నుంచి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ ఉద్యోగ ప్రకటన శుభవార్త ప్రకటించారు. 6500 ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీచేయనున్నట్టు సీఎం ప్రకటించారు. పోలీస్ శాఖలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్ దృష్ట్యా, అదనంగా కావాల్సిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబరులో నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చామన్నారు. జనవరి నుంచి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరినట్టు సీఎం వైయస్ జగన్ వెల్లడించారు. అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా పోలీసు సంక్షేమ నిధికి ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకూ పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది..
ఆంధ్రప్రదేశ్ లో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద, లంచగొండితనం, అవినీతి, రౌడీయిజమ్, నేర ప్రవర్తన మీద నిజాయితీగా, నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి స్పష్టం చేశారు. దిశ బిల్లు తీసుకు రావడం దగ్గరి నుంచి, రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడం, వాటిలో ఎక్కువగా మహిళలనే నియమించడం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ బిల్లుకు కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘దేశంలోనే మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం ఏపీ అన్న సీఎం ఆ దిశలో సంకేతాలు ఇచ్చి, గట్టి చర్యలు తీసుకునేందుకు, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హోం మంత్రిని, నా సోదరి సుచరితమ్మను హోం మంత్రిగా కూడా చేయడం జరిగింది’ అని సీఎం తెలిపారు. హోమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎ ప్పుడూ అండగా ఉంటుందని పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె గుర్తు చేసారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ సేవా యాప్ కూడా తీసుకొచ్చామని హోం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ విధి నిర్వాహణలో అనేకమంది పోలీసులు వీరమరణం పొంది పోలీసులందరికీ వారు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు విధినిర్వాహణలో అమరులయ్యారని వారికి పోలీస్ శాఖ తరపున నివాళులు అర్పిస్తున్నామన్నారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారన్నారు. 6వ బెటాలియన్ కమాండెంట్ పి.వి. హనుమంతప్ప పేరేడ్‌కు సారథ్యం వహించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, శాసనసభ్యులు జోగి రమేష్, యం. జగన్మోహనరావు, దూలం నాగేశ్వరరావు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పోలీస్ ఉన్నతాధికారులు ద్వారకాతిరుమలరావు, అనురాధ, సంజయ్, ఆర్అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రటరి యంటి. కృష్ణబాబు, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, నగరసిపి బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు పుష్పక విమానంలో అభయమిచ్చారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు 750 కేజిల బరువు ఉంటుంది. ఇందులో 150 కేజిల మల్లి, కనకాంబరం, మొల్లలు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు ఉపయోగించారు. శ్రీవారి పుష్పక విమానాన్ని మూడు దశలలో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుడళ్వార్ నమస్కరిస్తున్నట్లుగా, మొదటి దశలో అష్టలక్ష్ములు, రెండవ దశలో ఏనుగులు, చిలకలు, మూడవ దశలో నాగ పడగల ప్రతిమలతో రూపొందించారు. తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది, టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన 10 మంది వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన విమానంను సిద్ధం చేశారని టిటిడి గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. తమిళనాడు చెన్నైకు చెందిన దాత శ్రీ రాంప్రసాద్ బట్టు శ్రీవారి పుష్పక విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహాకారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒడిశాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు. తిరుమల అదనపు ఈవో బంగ్లాలో బుధవారం ఉదయం దాత ఈ విరాళం డిడిని అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్వీబీసీ ద్వారా స్వామివారి సేవలను నేరుగా చూసే దర్శనభాగ్యం ఏర్పడుతుందని అన్నారు. త్వరలోనే అన్ని భాషల్లోనూ స్వామివారి ప్రసరాలు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా స్వామిసేవలు, స్వామి దర్శనాలు మరింత మందికి చేరువ చేయాలని కూడా ఆయన అదనపు ఈఓని కోరారు. ప్రస్తుతం కరోనా సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిసేవలు చేస్తూ, స్వామి దర్శనాలు అందరికీ అయ్యేలా చేస్తున్నారని, ఇదే ఒరవడిని రానున్నరోజుల్లో కూడా అందించాలన్నారు. శ్రీవారి భక్తిఛానల్ యాడ్స్ ఫ్రీ ఛానల్ గా చేసే ఆలోచన చాలా మంచిదని తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామిని, స్వామి సేవలను భక్తి ఛానల్ ద్వారా తదేకంగా చూసే అవకాశం వుంటుందన్నారు...
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలో శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు బుధవారం విద్యాలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పుష్పయాగం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు.అనంతరం శ్రీచక్రనవార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ జె.మాధవి మాట్లాడుతూ, అమ్మవారి రూపాలను భక్తులు తిలకించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి, మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, అమ్మవారి దర్శనాలు కల్పించినట్టు ఆమె వివరించారు. నవరాత్రి ఉత్సవాల్లో దాతలు కె.వీరభద్రరావు, ఎస్.రాము సహకారంతో అమ్మవారికి ఈరోజు అలంకరణ చేపడుతున్నట్టు ఈఓ వివరించారు. కాగా రేపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మిగా దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాకుండా అమ్మవారికి లక్ష తులసీ పూజ కూడా చేపడతామని ఈఓ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాంబాబు, పర్యవేక్షకులు త్రిమూర్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎ నర్జి కార్పోరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు యస్. రమణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని తమ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎ నర్జీ ఎ క్స్‌పోర్టు పాలసి-2020, సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటు, తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం వంటి జిల్లాలో సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈప్రాంతంలో ఎ క్కువుగా మెట్ట, సాగుచేయలేని భూములు ఉన్నాయని వాటిని దీర్ఝకాలిక లీజుకు తీసుకుని పెద్దఎ త్తున సౌర, పవన మరియు పవన-సౌర హైబ్రీడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇక్కడ డవలపర్లు పవర్ ఫ్లాంట్లు నిర్మిస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటుందన్నారు. సింగిల్ విండో విధానంతో ఇందుకు సంబంధించిన ఎ నర్జీ ఎ క్స్‌పోర్టు పాలసీని రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కర్నూలు, వైయస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్ధ్యం గల ఆల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎ నర్జీ పవర్ పార్క్‌లను ప్రోత్సహించడానికి ప్రతిపాదించడమైనదని చెప్పారు. నూతనపాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్ధ్యం స్ధాపించడం ద్వారా వేలకోట్లరూపాయలు పెట్టుబడులు ద్వారా కరువుపీడిత ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో 7 ప్రాంతాలలో 6,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. వైయస్ఆర్ కడపజిల్లాలో గండికోటలో 600 మెగావాట్లు, అనంతపురం జిల్లా చిత్రావతిలో 500 మెగావాట్లు, నెల్లూరు జిల్లా సోమశిలలో 1200 మెగావాట్లు, కర్నూలు జిల్లా వోక్‌లో 800 మెగావాట్లు, విజయనగరం జిల్లాలో కురుకుట్టిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో 1000 మెగావాట్లు, విశాఖపట్నం జిల్లా ఎ ర్రవరంలో 1000 మెగావాట్లుతో పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుకు అవసరమైన సాధ్యత డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఇతర వివరణాత్మక నివేదికలను 30 నెలల కాలపరిమితిలో వాటిని అందించేందుకు బిడ్డర్లను ఎ ంపిక చేసామన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, దేవాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రభుత్వ విభాగాలలో ఇంతవరకూ 19.50 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ప్రోత్సహించడం జరిగిందన్నారు. క్రొత్త జాతీయ బయోగ్యాస్, సేంద్రీయ ఎ రువు కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 3 లక్షల బయోగ్యాస్ ఫ్లాంట్లు నిర్మించబడ్డాయన్నారు. రాష్ట్రంలో మొదటిదశలో ప్రస్తుతం 300 ఎ లక్ట్రిక్ కార్లు వినియోగంలో ఉన్నాయన్నారు. రెండవదశ క్రింద రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతోపాటు ప్రధాన జిల్లా కేంద్రాలలోని 83 ప్రాంతాల్లో 460 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుకానున్నాయని చెప్పారు. వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చేవారి సమాచారం నిమిత్తం జాబితాలను అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తమ సంస్ధ హర్యానాలోని మనేసార్‌లోని ఐక్యాట్‌తో సమన్వయం చేసుకుని ఆటోకాంపోనెంట్స్, వెహికల్స్, ఇంటిలిజెన్స్ టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటుకు 250 కోట్ల రూపాయల పెట్టుబడితో టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకోసం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ నుండి ప్రభుత్వం యల్ఓఐ పొందిందన్నారు. ఆటోలకు ఎ లక్ట్రిక్ రిక్ట్రోఫిట్ కిట్స్ అందించే విషయంలో కూడా అధ్యయనం జరుగుతున్నదన్నారు. ఇప్పటికే క్రొత్తఆటోలు రూపొందుతుండగా, పాతవాటిని బ్యాటరీలతోకూడిన ఎ లక్ట్రిక్ రెట్రోఫిట్ కిట్స్‌తో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వాటిమార్పుకు ఒక ఆటోకు రూ. 50 నుండి 60 వేలు ఖర్చుకాగలదని, అయితే దీర్ఝకాలికంగా ఇంధనంపై ఖర్చును నియంత్రించుకోవచ్చునన్నారు. ఈసందర్భంగా సోలార్, విండ్ ప్రాజెక్ట్స్, విండ్-సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్ట్స్, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్, తదితర ప్రాజెక్టులను నెరెడ్‌క్యాప్ (యన్ఆర్ఇడిసిఏపి) ప్రోత్సహిస్తున్న తీరును ఆయన వివరించారు.