1 ENS Live Breaking News

వైద్యం తరువాత అసరాాగా రూ.5వేలు..

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం అండగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయలో అండ. డిశ్చార్జైన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు. కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో పెద్దదిక్కుగా మారిందీ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  ముందు చూపునకు మచ్చుతునక' అంటూ ప్రశంసలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు పూర్తిస్థాయిలో కార్పోరేట్ వైద్యం అందించింన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రకెక్కిందన్నారు. ఆపదలో కూడా 108 అంబులెన్సులు అదేస్థాయిలో ఆపద్బాందవుడిగా పనిచేస్తున్నాయన్నారు. 104 ద్వారా ప్రతీ గ్రామంలో ఉచిత వైద్యసేవలు, పరీక్షలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

Visakhapatnam

2020-10-18 15:04:05

56 కార్పొరేషన్ల చైర్మన్ జాబితా ప్రకటన..

ఆంధ్రప్రదేశ్ లో 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎం.శంకరనారాయణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. వెనుబడిన వర్గాల వారికి రాజ్యాధికారం అందివ్వడం ద్వారా బీసీల ఆర్యాధ్యుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. విజయవాడ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను మంత్రులు ప్రకటించారు. ముందుగా డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన వర్గాలను ఆదుకోవాలని పాదయాత్ర సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. బీసీలు వెనుకబడి వర్గాలు కాదు సమాజానికి వెన్నుముక అని సీఎం జగన్ రుజువు చేశారన్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలోనే రూ.33,500 కోట్ల రూపాయలు వెచ్చించారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, 728 మందికి చైర్మన్లగా, డైరెక్టర్లగా అవకాశమిచ్చారన్నారు. క్యాబినెట్ లో కూడా వెనుబడిన కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. బీసీ కూలానికి చెందిన తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. వెనుబడిన కులాలంతా పండగ జరుపుకునే సమయమని ఆనందం వ్యక్తంచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ కులాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని నామినేట్ అయిన చైర్మన్లకు ఆయన పిలుపునిచ్చారు.  నా జన్మ ధన్యమైంది : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ... 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను ప్రకటించే అవకాశం రావడంతో తన జన్మ ధన్యమైందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీసీలకు రాజ్యాధికారం కల్పిండంతో చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు అని, దేశ చరిత్రలో ఎన్నడూ ఇంతమంది బీసీలకు అధికారమిచ్చిన దాఖలాల్లేవని అన్నారు. వెనుబడిక వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పలువురు బీసీ నాయకులకు మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చారన్నారు. ఒక్కో కార్పొరేషన్లో చైర్మన్ సహా 12 మంది డైరెక్టర్లు ఉంటారన్నారు. సామాజిక స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చైర్మన్లను ఎంపిక చేశారన్నారు. అనంతరం ఆయన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను ప్రకటించారు.  హ్యాట్సాఫ్ సీఎం సార్... : మంత్రి బొత్స సత్యనారాయణ.... ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వెనుకబడిన కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని, ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అదే సభలో ఉన్న తమకు ఇది సాధ్యమేనా..? అని ప్రశ్న తలెత్తిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అసాధ్యమనుకున్న విషయాన్ని సుసాధ్యం చేశారన్నారు. పదవుల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, 728 మంది వెనుబడిన కులాలకు చెందిన వారిని చైర్మన్లగా, డైరెక్టర్లగా నియమిస్తూ... ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారన్నారు. బీసీ కులాలు జీవితాంతం వెనుకబడి ఉండిపోయేలా కాకుండా వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాల్లో నిలపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిస్తూ, బీసీలకు అండగా నిలిచారని కొనియాడారు. ప్రతి బడ్జెట్ లోనూ బలహీన వర్గాల అభ్యున్నతికి అత్యధిక నిధులు కేటయిస్తున్నారన్నారు. తమ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి బీసీలంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు.  చరిత్రలో నిలిచిపోయే రోజు : ఎంపి మోపిదేవి వెంకటరమణ... ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. నిన్నటి వరకూ ఓటు బ్యాంకుగా నిలిచిన బీసీలు ఇకపై పాలనలో భాగస్వాములవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుబడి ఉండడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గుర్తించారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. అదే సమయంలో బీసీలకు పాలనలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో తనలాంటి వారెందరికో మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో మహిళలకు 50 శాతం అవకాశమివ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దానిలో భాగంగా కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపికలో మహిళలకు 50 శాతం మేర అవకాశమిచ్చారన్నారు. డైరెక్టర్ల ఎంపికలోనూ ఇదే పంథా కొనసాగుతుందన్నారు. 728 మంది బీసీ నాయకులకు రాజ్యాధికారం కల్పించడం ఏపీ చరిత్రలోనే సాహసోపేతమైన చర్య అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శంకరనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

Velagapudi

2020-10-18 15:00:30

ఎన్టీఆర్ కి భారత్నకై కోటి ఉత్తరాల ఉద్యమం..

మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటించాలనే ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ బలపడుతోంది. ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఎన్టీఆర్ ను బీజేపి ప్రభుత్వమైనా గుర్తించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి రిజిస్టర్ పోస్టు లేఖల ద్వారా తమ డిమాండ్ ను తెలియజేస్తున్నారు. డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం, యునైటెడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చైర్మన్, లక్షల లేఖల ఉద్యమ నిర్వాహకులు ఎస్ఎల్ఎన్ స్వామి రోజుకి 30 నుంచి 50 రిజిస్టర్ పోస్టు లేఖల ద్వారా ఉద్యమాన్ని ముందుకి నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, తెలుగు సినీ రంగం చరిత్రలోనే ఎన్టీఆర్ నటన ఎనలేనిదన్నారు. అలాంటి మహానటుడిని కేంద్రం ప్రభుత్వం నేటికీ గుర్తించకపోవడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులంతా కలసి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టి కేంద్రానికి తమ వినతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పోస్ట్ ఎన్టీఆర్ ఉద్యోగులు చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. ప్రతినిత్యం రిజిస్టర్ పోస్టు ద్వారా తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ ఉద్యమయంలో ప్రతీ ఎన్టీఆర్ అభిమాని కలసి రావాలని ఆయన పిలుపునచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తనకున్న అభిమానాన్ని మీడియాకి తెలియజేశారు.

Visakhapatnam

2020-10-18 13:57:16

సింహ‌ వాహనంపై న‌ర‌సింహ‌స్వామిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.  శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు, ఆల‌‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2020-10-18 10:32:25

హంస వాహనంపై స‌ర‌స్వ‌తిదేవి గా..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి  అలంకారంలో దర్శనమిచ్చారు.  హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.  ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  డిపి.అనంత‌,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన వేణుగోపాల దీక్షితులు, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  కాగా, న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఆది‌‌వారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Tirumala

2020-10-17 20:09:38

కనకమ్మ ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

ఉత్తరాంధ్రావాసుల ఇలవేల్పు విశాఖలోని బురుజుపేట శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శనివారం ఈ మేరకు ఆలయంలో నిర్వహించిన రాట మహోత్సవంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దుర్గమ్మ, కనకమహాలక్ష్మి అమ్మవార్లు కరుణతో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో నియంత్రణ జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్సవాలు నిర్వహించాలని ఈఓకి సూచించారు. ఆలయంలోకి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Kanaka Mahalaxmi temple

2020-10-17 19:23:40

చిన్న‌శేష వాహ‌నంపై కృష్ణుడిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  డిపి.అనంత‌,  వేమిరెడ్డి ప్ర‌శాంతి,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్  జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

Tirumala

2020-10-17 11:45:59

పెద్ద‌శేష వాహ‌నంపై గోవింద‌రాజ‌స్వామిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మొద‌టిరోజు శుక్ర‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలో పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రిగింది.  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి అలంకారంలో అనుగ్ర‌హించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం... స‌ర్పానాం అస్మి వాసుకిః... తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి  అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.   కాగా, బ్ర‌హ్మోత్స‌వాల్లో రెండో రోజైన శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చిన్న‌శేష వాహ‌నం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు హంస వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిస్తారు.         ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో పి.బ‌సంత్ కుమార్‌, బోర్డు స‌భ్యులు  డిపి.అనంత‌,  వేమిరెడ్డి ప్ర‌శాంతి,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2020-10-16 21:02:47

ఈవోను క‌లిసిన అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు..

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల‌కు చెందిన 9 మంది అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు శుక్ర‌వారం తిరుమల ఈవో డా.కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డిని తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. టిటిడి కార్య‌క‌లాపాల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ప‌రిశీలించేందుకు అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది అధిక మాసం కార‌ణంగా రెండు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని, గురువారం అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని వివ‌రించారు. శుక్ర‌వారం నుండి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, ప్ర‌ధానంగా అక్టోబ‌రు 20న గ‌రుడసేవ జ‌రుగుతుంద‌ని తెలిపారు. అనంత‌రం టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్యశాల‌లు,  విద్యాసంస్థ‌లు, ఎస్వీబీసీ గురించి వివరించారు. అదేవిధంగా టిటిడిలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు. టిటిడి నిర్వ‌హిస్తున్న వివిధ ట్ర‌స్టులు, వేద విద్య‌వ్యాప్తికి తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రించారు. అనంత‌రం అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు టిటిడి అద‌న‌పు ఈఓ  ఎవి.ధ‌ర్మారెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

Tirumala

2020-10-16 19:39:39

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు శుక్ర‌‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌ట్టారు. ఆ త‌రువాత ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అర్చ‌కులు కంక‌ణ‌ధార‌ణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  డిపి.అనంత‌, వేమిరెడ్డి ప్ర‌శాంతి, ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు, కంక‌ణ‌భ‌ట్టార్  రామ‌కృష్ణ దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజిఓ మ‌నోహ‌ర్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-16 14:00:08

అక్రిటిడేషన్ కమిటీపై కోరి తెచ్చుకున్న కష్టాలు..

రాష్ట్ర సమాచార పౌరసంబంధాలశాఖ ప్రెస్ జర్నలిస్టులకు మంజూరు చేసే అక్రిడిటేషన్ కమిటీల విషయంలో అష్టకష్టాలు పడుతూ వస్తూ ప్రభుత్వానికి జర్నలిస్టుల నుంచి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తోంది. ఆది నుంచి కోర్టు కేసులతోనే కాలం వెళ్లదీయక తప్పడం లేదు. దానికి కారణంగా విచక్షణా రహితంగా అక్రిడిటేషన్ ల మంజూరులో నియమ నిబంధనలు మార్చడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. దేశ రాజధానిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) నిబంధనలు కాదని ఆంధ్రప్రదేశ్ లో సమాచారశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలే దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అక్రిడిటేషన్ల విషయంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా, సమయానికి అక్రిడిటేషన్లు ఇవ్వలేకపోతున్నాయి. పాత కార్డులకే ఎక్సటెన్షన్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నాయి.  ప్రపంచ దేశాల్లో సైతం దేశ రాజధానిని, అక్కడి పిఐబీని ప్రమాణికంగా తీసుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఒక్కోసారి ఒక్కోవిధంగా అక్రిడిటేషన్ల విషయంలో నియమనిబంధనలు మార్చడంతోపాటు, కొందరు యూనియన్ నాయకుల ఒత్తిడితో ప్రత్యేక జీఓలు బయటకు తీసుకున్న సమాచారశాఖ అధికారుల తీరు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంతేకాకుండా జర్నలిస్టులు కాని వారికి అత్యధికంగా అక్రిడిటేషన్లు రావడం, కొన్ని జిల్లాల్లో ఏకంగా వీటికి బేరాలు పెట్టడంతో అక్రిడిటేషన్లకు మంచి డిమాండ్ ఏర్పండింది. కొన్నిజిల్లాల్లో కమిటీ సభ్యులను అడ్డం పెట్టుకొని సమాచారశాఖ ఇష్టానుసారం కొన్ని పత్రికలకు అడిగినన్ని అక్రిడిటేషన్లు మంజూరు చేయడం కూడా యావత్ కమిటీలనే ప్రశ్నార్ధకం చేసింది. ప్రభుత్వ నిబంధనలు కాకుండా కొన్నిజిల్లాల్లో సమాచారశాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి పత్రికలు, లోకల్ కేబుల్ టివిలు, ఫైబర్ నెట్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నా, సమాచారశాఖ అధికారులకు భజనలు చేసే వారికి మంజూరైనన్ని అక్రిడిటేషన్లు నిజంగా సంస్థలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించే సంస్థలకు దక్కక పోవడం విశేషం. ఈ విషయంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు చేసినప్పటికీ సమాచారశాఖలోని అధికారులు వారియొక్క సొంతతెలివితో జీఓలు విడుదల చేసి కోర్టులకు సమాధానం చెప్పుకునేలా చేస్తున్నాయి. కొన్ని యూనియన్లు ఏకంగా అక్రిడిటేషన్ కమిటీలే వద్దని చెబుతున్నాయి. నిజంగా ప్రభుత్వంలోని సమాచారశాఖ నేరుగా విచారణ చేసి వర్కింగ్ జర్నలిస్టులకు, పీఐబి నిబంధనల మేరకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరుతున్నాయి. కానీ ఆవిషయాన్ని కూడా సమాచారశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదు. తమ సొంత నిర్ణయాలతో జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ విషయంలో ఏడాదికో నిబంధన అమలు చేస్తూ, జర్నలిస్టులను అష్ట కష్టాలు పెడుతుంది. 2017లో ఇచ్చిన అక్రిడిటేషన్ నేటికీ ఎక్స్ టెన్షన్ లలో మాత్రమే సమాచారశాఖ నేటికీ కొనసాగిస్తుందంటే ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ విషయంలో పీఐబి నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు సమయానికి అందించాలని పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Velagapudi

2020-10-16 12:29:30

దుర్గమ్మకి ఇష్టమైన శుక్రవారమే ఫ్లైఓవర్ ప్రారంభం..

బెజవాడకు నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ.. విజయవాడకు తలమానికంగా నిలిచే బెంజ్‌ సర్కిల్, 2.3 కిలోమీటర్ల పొడవైన కనకదుర్గ ఫ్‌లైఓవర్లు నేడు ప్రారంభం  కానున్నాయి. ఈరోజు(శుక్రవారం దుర్గమ్మకు ఎంతో ఇష్టమైన రోజు)  ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్ మోహనరెడ్డి వర్చువల్‌ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం రెండు సార్లు వాయిదా పడి నేడు ప్రారంభానికి నోచుకుంది. ఈ సుదీర్ఘవంతెన ప్రారంభం అయితే విజయవాడ వాసులకు కష్టాలు చాలా వరకూ తీరిపోయినట్టే. అంతేకాదు, దేశంలో తిపెద్ద వంతెనగా కూడా కేంద్రం కూడా దీనిని గుర్తించింది. దీనిని పగలు, రాత్రి సమయాల్లో ప్రత్యేకంగా షూట్ చేయించి మరీ ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు, దేశ ప్రజలు చూసే విధంగా సోషల్ మాద్యమాల్లో పెట్టింది. ఒక రకంగా ఈ దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం ఒక చరిత్రగానే చెప్పాలి. 2020 ఆఖరు నెలల్లో ప్రారంభమవుతున్న అతి పెద్ద ప్రాజెక్టుగా కూడా ఈ ప్లైఓవర్ నిలవనుంది..

దుర్గగుడి ఫ్లైఓవర్

2020-10-16 09:14:16

వరద సహాయం తక్షణమే చేయండి..

రాష్ట్రవ్యాప్తంగా తుఫాను వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి తక్షణ సహాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బాదితులను మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలన్నారు. అంతేకాకుండా పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేవించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్న సీఎం వారికి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు ముందస్తుగా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తం చేసి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో కూడా తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు పేరుకుపోయిన చోట్ల బ్లీచింగ్ చల్లించి చల్లించి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల కార్యదర్శిలు ద్వారా వాస్తవ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు. 

Velagapudi

2020-10-16 08:51:43

న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు గురు‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా అంకురార్ప‌ణ ఘ‌ట్టం నిర్వ‌హించిన అనంత‌రం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు.   అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.  ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  పి.బ‌సంత్ ‌కుమార్‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు, కంక‌ణ‌భ‌ట్టార్  రామ‌కృష్ణ దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజిఓ  మ‌నోహ‌ర్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-15 20:57:05

తిరుపతిలో 20ఏళ యువతిపై పాస్టర్ అత్యాచారం..

ఆంధ్రప్రదేశ్ లో ఫాస్టర్లు ప్రార్ధనల ముసుగులో అత్యాచారాలు పెరుగుతున్నాయి..మొన్న విశాఖజిల్లా గాజువాకలో ఒక పాస్టర్ ఒ యువతిపై అత్యాచారం చేయగా నేడు తిరుపతిలో మరోపాస్టర్ 20ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసుల్లో పోసు కేసులు తప్పా, చర్యలు లేకపోవడంతో రాష్ట్రంలో ఏదోమూల పాస్టర్ల అఘాయిత్యాలు పెచ్చు పెరుగుతున్నాయి. ఇక తిరుపతిలోని అఘాయిత్యానికి గురైన బాధితురాలి  తల్లి మీడియాకు తెలిపిన వివరాలు తెలుసుకుంటే... "తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె పనికి చేరింది. అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి సరుకు డెలివరీ ఇవ్వాలని, మా అమ్మాయిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లి రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామసమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి ఇంటికి వచ్చాక మాకు ఈ ఘోరం గురించి తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దిశ పోలీస్ స్టేషన్‌కు వెళితే, వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అన్నారు. మా అమ్మాయిని వేరే పని చేసుకోమని సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ ఘోరంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం" అని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పంపారు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పలువురు విపక్ష నాయకులు పరామర్శించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్‌తో పాటుగా, టీఎన్‌ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నాకు దిగాయి.

తిరుపతి

2020-10-15 10:23:49