గ్రామవాలంటీర్లు తోక జాడిస్తే వేటు వేయడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. వరుసగా 3రోజులు విధులకి హాజరు కాకపోతే వెంటనే 6వరోజు తొలగించి ఆ స్థానాన్ని7వ తేదీన ఖాళీగా ప్రకటిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీ ఏర్పడ్డ వాలంటరీ పోస్టులను 14 రోజుల్లో భర్తీచేస్తారు. వలంటీర్లు,వారం లోసోమ,బుధ,శుక్రవారాల్లోతప్పసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. హాజరునుఎప్పటికప్పుడు గ్రామ,వార్డు సచివాలయ అధికారులు,పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం జిల్లాలో ఖాళీల భర్తీకి సచివాలయ జెసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కమిషనర్లు, ఎంపీడీఓలు భర్తీకి చర్యలు తీసుకుంటారు. పోస్టుల భర్తీకి,స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. చాలా చోట్ల గ్రామవాలంటీర్లు విధులకు హాజరు కాకపోవడం, సక్రమంగా సేవలు అందించకపోవడంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులతో చెప్పించుకొని మరీ వీరు విధులకు హాజరు కావడంలేదు.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఇన్చార్జి మంత్రి పేర్ని నానిలు అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో వరద బాధితులతో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి మాట్లాడారు. అనంతరం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరికీ రూ.2వేలు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తామని వివరించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి రుద్రమకోటలో వర బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద బాధితులకు సహాయక శిబిరాల్లో ఎక్కడ లోపం రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పిన మంత్రులు వసతి శిబిరాల్లో నాణ్యమైన ఆహారం.. పిల్లలకు బిస్కెట్ పాకెట్స్, పాలు, రొట్టెలు ప్రభుత్వం తరపున అందిస్తున్నామన్నారు. ఇక్కడ పనిచేసే అధికారులు మానవతా ద్రుక్పదంతో పనిచేసి బాధితులకు సేవలు చేయాలని అన్నారు. ఎలాంటి అవసరం ఏర్పడినా తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ, అధికార యంత్రాంగ మంతా వరద బాధిత పనుల్లోనే నిమగ్నమై వుంటుందని వివరించారు.
విశాఖతోపాటు ఉత్తరాంధ్రా అభివ్రుద్ధిని కావాలనే టిడిని అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని అనకాపల్లి ఎమ్మల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్ నాధ్ మండి పడ్డారు. విశాఖలో గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో అభివ్రుద్ధి వైఎస్సార్ తరువాత, సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే జరిగిందని కాదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అమర్ సవాల్ విసిరారు. విశాఖపై కావాలనే విషయం చిమ్ముతూ, అభివ్రుద్ధికి అడ్డం పడుతున్నారని అన్నారు. ఎక్కడో తెలంగాణలోని హైదరాబాదులో కూర్చొని జూమ్ యాప్ ద్వారా రాజకీయం చేసే చంద్రబాబు విశాఖ అభివ్రుద్ధికి మోకాలు అడ్డుపెట్టడం మానుకోవాలన్నారు. దేశంలోనే కరోనా నియంత్రణ విషయం సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదర్శంగా నిలిస్తే దానిని తట్టుకోలేని చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ రఘురామక్రిష్ణరాజు లాంటి తేడా రాజకీయ నాయకులతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయనడం 40ఏళ్ల పొలిటిక్ ఇండస్ట్రీకి సిగ్గుచేటన్నారు. విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయని విశాఖ వాసులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ అభివ్రుద్ధిపైనా నిరుద్యోగ నిర్మూళనపైనా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని అమర్ ప్రశ్నించారు...
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది... ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింప జేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్మిక పరిషత్ సహా కార్మికుల వినతిపై స్పందించి ఆర్టీసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ కృష్ణబాబునుని కలసి నిన్న వినతి పత్రం అందించారు కార్మిక పరిషత్ నేతలు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింప జేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు 36 మంది మరణించిన నేపథ్యంలో..వారందరికీ బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. మృతుల వివరాలు సహా తగిన డాక్యుమెంట్స్ పంపాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్స్‌కు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 లోపు అన్ని డాక్యుమెంట్స్ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎండీ ఆదేశించారు.
అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఏడాదిలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అనేక మార్పులు తెచ్చామన్న ఆయన ప్రజలకు గ్రామస్థాయిలోనే పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలన్నీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చంద్రబాబు మాపై ఎన్ని విమర్శలు చేసినా అనుకున్నది చేసి చూపించమన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష 26వేల మందికి శాస్వత ఉద్యోగాలు కల్పించిన ఘనతకూడా సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఈ ఉద్యోగాల పరంపర రాష్ట్రంలో నిరాటంకంగా కొనసాగుతుందన్నారు.
‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కనుక మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉండండి... నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు ఆ విషషయం చెప్పడానికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ సీఎం జగన్ తెలిపారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ సమీక్షకు కాకినాడ నుంచి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బిసి సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు.
‘‘వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టండి. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
భద్రాద్రిలో గోదారమ్మ వరద ఉద్రుతి నుంచి శాంతిస్తోంది...క్రమేనా నీటి ప్రవాహం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ రాత్రికి ఎగున వర్షాలు పడకపోతే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్న గోదావరి రాజమహేంద్రవరం దవళేశ్వర వద్ద తమ ఉద్రుతిని చూపిస్తుంది. ఇదే సమయంలో గోదవారీ నదీ పాయల నుంచి వచ్చే వరద నీరు ఏకం కావడతో బ్యారేజికి వరదనీటి తాకిడి అధికమవుతుంది. ఈరోజు ఉదయం వర్షాలు సక్రమంగా పడకపోవడంతో ఇక్కడ కూడా వరదనీటి ఉద్రుతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్న అధికారులు వరద ప్రవాహం తగ్గితే తప్పా గేట్టు పూర్తిగా మూసే పరిస్థితి లేదని చెబుతున్నారు. కానీ లోతట్టు ప్రాంతాల వారికి మాత్రం ముప్పు మాత్రం పొంచే వుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రంపచోడవరం డివిజిన్ లో చాలా గ్రామాలు జలమయం అయ్యాయి.
కరోనా టైమ్ లో ఆన్ క్లాసులు మాట ఎలా ఉన్నా..పాఠశాల విద్యార్ధినిలు మాత్రం సెక్స్ వీడియోలు చూడాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలోఆన్‌లైన్ క్లాసెస్ కోసం ఏర్పాటు చేసిన విద్యార్థినుల గ్రూప్‌లో సెక్స్ వీడియో కలకలం రేపింది. జిల్లాలోని పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్ పాఠశాల విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం తరగతికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో ఎనిమిదో తరగతి విద్యార్థినుల గ్రూప్‌లో గుర్తు తెలియని వ్యక్తి సెక్స్ వీడియో పోస్ట్ చేశారు. వీడియో గ్రూప్‌లో పోస్ట్ చేసి రెండురోజులైనా కనీసం డిలీట్ చేయలేదు. ఆ తరగతి ఉపాధ్యాయులు కూడా పట్టించుకోకపోవడంతో విషయం సీరియస్ అయింది. విద్యార్థినుల గ్రూప్‌లో సెక్స్ వీడియో వ్యవహారం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు నేరుగా ఎంఈవో ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ క్లాసెస్ గ్రూప్‌లో అసభ్యకర వీడియో పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి...
గ్రామసచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా యానిమల్ హజ్బండరీ అసిస్టెంట్ పోస్టులు రెండోసారి నోటిఫికేషన్ లో కూడా భారీగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం ఈ పోస్టులకి సంబంధించి అర్హులైన వారు చాలా తక్కువ మంది ఉండటమే. గ్రామ, వార్డు సచివాలయంలో యానిమల్ హజ్బండరీ సహాయకుల పోస్టుకి డిప్లమా యానిమల్ హజ్బండరీ చేసి ఉండాలి. అలా కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నా ప్రస్తుతం చాలా పోస్టులు మిగిలిపోయాయి. తొలుత ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నవారికి మార్కులు చాలా తక్కువగా వచ్చినప్పటికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. అయినా చాలా పోస్టులు మిగిలిపోయాయి. ఇపుడు యానిమల్ హజ్బండరీ కోర్సు చేసినవారు తక్కువగా ఉండటంటో దరఖాస్తులు తక్కువ, పోస్టులు ఎక్కువ అన్నట్టు అయిపోయాయి. వాస్తవానికి బీఎస్సీ కోర్సు చేసిన వారిని తొలుత ఈ పోస్టులకు అర్హులుగా చేయాలని ప్రభుత్వం భావించినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. కాగా చాలా చోట్ల ఈ కోర్సుకి సంబంధించి ఏడాది కోర్సులు చేసిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది...
నటి, రాజకీయ నాయకురాలు మాధవీలతపై సైబర్ క్రైమ్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాధవీలత.. తన ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ పెట్టడంతో, వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఆమెపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో గోపీకృష్ణ పిర్యాదు స్వీకరించిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం ఆమెపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మాదవీలత హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన పోస్టులపై అటు నెటిజెన్లు కూడా తీవ్రంగా మండి పడుతున్నారు. చేసిన పోస్టులపై మాటల్లో చెప్పరాని విధంగా తిట్ల దండకాన్ని కూడా కామెంట్ల రూపంలో పోస్టు చేస్తున్నారు. ఇటీవల కాలంలో హిందులకు సంబంధించి కించపరిచే విధంగా చేస్తున్న పోస్టుల సంఖ్య సోషల్ మీడియాలో పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది..
కృష్ణా బ్యారేజ్ వద్ద వరద నీటితో క్రిష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజిలోని 70 గేట్లును ఒక అడుగుమేర లేపి నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు అధికారులు. ఎగువున కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి అత్యధిక మొత్తంలో వరదనీరు వచ్చిచేరుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు ఆ ప్రాంతాలన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు.
తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో బూర్గంపహాడ్ మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తక్షణమే వెళ్లిపోవాలని అధికారులు మైకు ద్వారా ప్రచారం చేపట్టారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గోదారి ఉగ్ర రూపం రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నది. గోదావరి గట్టు వెంబడి ఉన్నవారిని, నదీపరీవాహక ప్రాంతాల వారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా లంక ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు తరలించారు. ఈ ప్రాంతాన్ని చూడటానికి వెళ్లకుండా గోదావరి కట్ట ప్రాంతంలో ఆంక్షలు అమలు చేశారు. గోదారి పూర్తిగా నిండుగా ప్రవహించడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు...
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయాలని కమిషనర్ గిరీష సూచించారు. ప్రజల సౌకర్యార్ధం తొమ్మిది ప్రాంతాల్లో కోవిడ్ 19 పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలాన్నరు. పరీక్షా కేంద్రాలు వరుసగా..
1. అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ వద్ద
2. అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, చాపల మార్కెట్ ఎదురుగా.
3. అర్బన్ హెల్త్ సెంటర్ సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, నెహ్రూ నగర్.
4. అర్బన్ హెల్త్ సెంటర్ పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు.
5. అర్బన్ హెల్త్ సెంటర్ ఆటోనగర్, రేణిగుంట రోడ్డు.
6. అర్బన్ హెల్త్ సెంటర్ శివ జ్యోతి నగర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవకోన.
7. హార్ట్ హెల్త్ సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్డు.
8. మున్సిపల్ హెల్త్ సెంటర్, ప్రకాశం రోడ్డు.
9. అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీలామహల్ రోడ్డు, తిరుపతి.
నగర ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే నే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని, కోవిడ్ లక్షణాలు లేకపోతే రాకూడదని తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో సాయంత్రం 5 గంటల పైన దుకాణాలు తెరిచిన చోనగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయవలెను.