ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ లో సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆమె పదవీ కాలాన్ని జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకూ మూడు నెలలకు పెంచుతూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30 వ తేదీ ( సెప్టెంబర్ నెలాఖరు)న సీఎస్ పదవీ కాలం ముగియనుండడంతో మరో మూడు నెలల కాలం పాటు సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ సీఎస్ పదవీ కాలం పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ విషయంలో జర్నలిస్టులు చాలా అప్రమత్తంగా ఉం డాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్య క్షులు గంట్లశ్రీనుబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా విషయంలో ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా సాక్షిలో పనిచేస్తున్న మురళీ క్రిష్ణ పట్నాయక్ కరోనా వైరస్ కు విశాఖ మధువరాడలో బలికావడం బాధాకరమన్నారు. జర్నలిస్టులను కూడా కోవిడ్ వారియర్స్ గా గుర్తిమచి తక్షణమే రూ.50లక్షల జీవిత భీమా కల్పించాలన్నారు. వర్కింగ్ జర్నలి స్టులు పనిచేయకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి తెలియదన్నారు. కానీ ప్రాణాలకి తెగించి విధి నిర్వహణకు వెళుతున్న సమయంలో కొన్నిసార్లు జర్నలిస్టులు మృత్యువాత పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల విషయంలో నిర్ధిష్ట ప్రకటన చేయాలని శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.
చేనేత సామాజిక వర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామ ని సీనియర్ బీజేపీ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన విశా ఖలో మీడియాతో మాట్లాడారు. చేనేత సామాజిక వర్గం సమస్య లు కేంద్ర జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఆప్కోల అభివృద్ధి సొసైటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవా ల్సింది గా మంత్రిని కోరతామన్నారు. ఇప్పటికే విశాఖజిల్లాతో పాటు రాష్ట్రంలోని చేనేత కార్మికులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా చేనేతసామాజిక వర్గాన్ని ఏకం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర కమిటీలోనూ చర్చించనున్నట్టు రామ్ కుమార్ వివరించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి ఈవోకి కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. ఈఓతోపాటు ఆలయంలో మరో 18 మందికి పాజిటివ్‌గా వచ్చింది. మరోపైపు రామకృష్ణ ఘనాపాటి వేద పండితులు కరోనా వైరస్ కారణంగానే మృతి చెందారు. అమ్మవారి దేవస్థానంలో అత్యధిక మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు విపరీతంగా పెరుగుతు న్నప్పటికీ భక్తులు ఎక్కడా భయపడకుండా ఆలయాలకి తరలి వస్తున్నారు. ఇటు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మ ఆలయం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉంటుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. బక్తులను సామాజిక దూరం, శానిటైజర్ చేలిన తరువాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
జర్నలిస్టులకు గీతం హాస్పిటల్ లో 20 పడకల ప్రత్యేక వార్డు ను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చెప్పారు. శుక్రవారం విజెఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లశ్రీనుబాబు ఆధ్వర్యంలో కార్యవర్గం జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించగా కలెక్టర్ తక్షణమే స్పందించి గీతంలో 20పడకలను అందుబాటులో ఉంచుతామని చెప్పారని శ్రీనుబాబు చెప్పారు. ఈ సందర్బంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, విజెఎఫ్ జర్నలిస్టుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అహర్నిసలు కృషిచేస్తుం దన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా జర్నలి స్టులు చేసే సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఆరోగ్యబీమా, హెల్త్ కార్డ్ రెవిన్యువల్ విషయం లోనూ ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ ని కోరామన్నారు. జర్నలిస్టుల సమస్యలను విన్న కలెక్టర్ విజెఎఫ్ వినతినికి ప్రభుత్వానికి పంపి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్, దాడిరవికుమార్, కార్యవర్గ సభ్యులు ఈశ్వర్రావు, లక్ష్మి, నానాజీ, గిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేయడానికి స‌్థానిక సం స్థల్లో ప్రత్యేకా ధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 108 కార్పొ రేష న్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకా ధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపా లకశాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్‌లో, జూన్ 30న మున్సిపాలిటీలలో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తుంది కానీ..స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో శ్రీకాకుళంలో అక్టోబర్ 10 వరకు మాత్రమే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించగా మిగతా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలోనూ డిసెంబర్ 31 వరకు ఈ పాలనను పొడిగించింది. మరోవైపు విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టు ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టైంది.
మినిమం గవర్నమెంట్ మాగ్జిమం గవర్నెన్స్ లో భాగంగా కేంద్రం ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డును రద్దు చేసి తప్పు చేసిందని ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అదికార ప్రతినిది కెకె సంజీవరావు అన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా చేనేత కార్మికులు ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి సిద్దంగా ఉన్న తరుణంలో కేంద్రం తమ సంతోషాలపై నీళ్ళు జల్లడం తగదన్నారు. దేశ వ్తాప్తంగా జరిగిన చేనేత కార్మికుల ఉద్యమ ఫలితంగా న్యూ హ్యాండ్లూం & టెక్సటైల్ పాలసీలో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న చేనేత కార్మికులకు ఉత్పత్తి, వినియోగం, విస్తరణ, మార్కెటింగ్ విషయంలో దిశ దశ చూపడానికి 1992లో ఆల్ ఇండియా హ్యాండ్లూం బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. గత 28 సంవత్సరాల నుంచి నేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగం అభివృద్ధికి బోర్డు ప్రభుత్వానికి సలహా సూచనలిస్తు దేశయ చేనేత ఉత్పత్తులకు విదేశీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలోను, అలాగే చేనేత బడ్జట్ కేటాయింపులలో క్రీయాశీలకంగా వ్యవహరించిందని సంజీవరావు అన్నారు. చేనేత దేశ వారసత్వ సాంస్కృతి సంపదని ఈ రంగాన్ని పరిరక్షించుకోవడం దేశ పౌరులుగా మనందరి భాద్యతని అన్నారు. స్వతంత్ర సమరస్పూర్తికి చిహ్నమైన చేనేత రంగం స్వదేశీ ఉత్పత్తి అయినందున కేంద్ర ప్రభుత్వం తక్షణం తమ నిర్ణయాన్ని వాపసు తీసుకివాలని లేదా బోర్డు స్థానే సమీకృత చేనేత డవ్లప్మెంట్ & వీవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి అంపశయ్య మీద ఉన్న చేనేత రంగానికి పునర్జీవం కల్పించి వ్యవసాయం తర్వత జీవన ఉపాది పొందుతున్న కోట్లాది మంది చేనేత కార్మికులకు న్యాయం చేయాలని సంజీవరావు డిమాండ్ చేసారు.
కెకె సంజీవరావు,
అదికార ప్రతినిది
ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్, 9246657227
తేది : 06.08.2020
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫి కేషన్ ను విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగస్ట్ 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే అధికారపార్టీ వైఎస్సార్సీపి ఈ స్థానానికి అభ్యర్ధిని కూడా ఖరారు చేసింది.
విశాఖ మహానగరంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నగరవా సులు చాలా అప్రమత్తంగా ఉండాలని బిసి సంఘం యు వ జన విభాగం మహిళా కార్యదర్శి దనుకోటి రమ సూచిం చారు. గురువా రం విశాఖలో ఆమె మీడియాతో మాట్లా డుతూ, కరోనా వైరస్ తరిమికొట్టేందుకు ప్రతీఒక్కరూ సామాజిక దూరం పాటించ డంతోపాటు మాస్కులు ధరించాలన్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకు రాకూడదన్నారు. వైరస్ దరిచేరకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బలవర్ధక ఆహారం తీసుకోవా లన్నారు. తరచుగా చేతులను రెండు నిమిషాలపాటు కడుక్కోవా లన్నారు. నాన్యమైన శానిటైజర్లను వినియోగించడం ద్వారా వైరస్ ను దరిచేరకుండా చేసుకోవచ్చని రమ తెలియజేశారు. బిసి సంఘం తరపున ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్టు రమ వివరించారు.
ఏం పిల్లడో ఎల్దామొస్తవా అంటూ ప్రముఖ జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు పాడిన గీతాలు ఎందరినో ఆలోచింప జేస్తాయి. విశాఖలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంగపండు పాడిన చైతన్య గీతాలు ఎందరినో ఆలోచింపజేశాయి.
అర్హులైన గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయా లని ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ఆయన పర్యటనలో భాగంగా బుధవారం జి.కె.వీధి పంచాయతీ గుమ్మల్లగొంది కాఫీ తోటలు పరిశీలించారు. కాఫీ రైతులు పొత్తూరి రాజారావు, కకూరి వెంకటరమణ కాఫీ తోటల్లో పర్యటించారు. కా ఫీ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు?ఏడాదికి కాఫీ, మిరియాలు సాగుపై వస్తున్న ఆదాయం ఐటీడీఏ ,గిరిజన సంక్షేమశాఖ అందిస్తు న్న ప్రోత్సాహకాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం చాపగెడ్డ ఎపి ఎఫ్ డి సి కాఫీ ఎస్టేట్ పరిశీలించారు. కాఫీ వీడింగ్ సస్యరక్షణ పనులు,కాఫీ దిగుబడి , అడిగి తెలుసుకొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగో పాల రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ఏపిఎఫ్ డిసి అధికారు లు ,అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ఒక ఉత్తమ వాగ్గేయ కారుని కోల్పోయిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు ప్రశాదరావు హఠాత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు. ఈ సందర్భంగా శీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, వంగపండు ఎన్నో ఉద్యోమాలకు తన గొంతును పెకిలించారని అన్నారు. ఉత్తరాంధ్రా సమస్యలపై వంగపండు చేసిన గానం చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. అలాంటి మంచి మనిషి లేరనే విషయాన్ని కళారంగం కూడా జీర్ణించుకోలే కపోతుందని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదిన గొంతు మూగబోవడం చాలా విచారించదగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రా కళారంగానికి ఆయన పేరుతో మంచి కార్యక్రమం చేపట్టి ఆయన బావజాలాన్ని అజరామరం చేయాలని శ్రీనుబాబు కోరారు.
ఉత్తరాంధ్ర ఒక ఉత్తమ వాగ్గేయ కారుని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు ప్రశాదరావు హఠాత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు. ఈ సందర్భంగా విశాఖలో పోలాకి మీడియాతో మాట్లాడుతూ, వంగపండు ఎన్నో ఉద్యోమాలకు తన గొంతును పెకిలించారని అన్నారు. ఉత్తరాంధ్రా సమస్యలపై వంగపండు చేసిన గానం చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. అలాంటి మంచి మనిషి లేరనే విషయాన్ని కళారంగం కూడా జీర్ణించుకోలే కపోతుందని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరులూదిన గొంతు మూగబోవడం చాలా విచారించదగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రా కళారంగానికి ఆయన పేరుతో మంచి కార్యక్రమం చేపట్టి ఆయన బావజాలాన్ని అజరామరం చేయాలని పోలాకి శ్రీనివాస్ కోరారు.
కరోనాపై పోరులో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత మైన ప్రచారం కల్పించాలని సమాచార శాఖ కమిషనర్ టీ విజయ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల సమాచార శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూకరోనా పట్ల ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకో వాలి, కోవిడ్ బారినపడిన వారు తీసుకోవలసిన జాగ్రత్త లను పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలన్నారు. వార్తలను రాసేటప్పుడు మీడియా సమన్వయం పాటించే విధంగా సమాచా రాన్ని అందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదిస్తూ ప్రతిరోజు covid 19 సమాచా రాన్ని టీవీ పత్రిక విలేకరులకు అందించాలన్నారు. covid 19 అనుమానిత లక్షణాలున్న విలేకరులకు వైద్య పరీక్షలు చేయిం చడం, క్వారంటైన్, ఐసోలేషన్ ఆసుపత్రులలో లేదా హోమ్ క్వారంటైన్ లలో వైద్యం అందేలా సహాయం అందించాలన్నారు. అవసరమైన వారికి కోవిడ్ పరీక్షలు జరిపించాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న కోవిడ్ వైద్య పరీక్షలు, వైద్య సేవల పట్ల విలేకరులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నుండి జాయింట్ డైరెక్టర్ కస్తూరిబాయి, ఈ ఆర్ ఐ కృష్ణ రావు పాల్గొనగా, విశాఖపట్నం నుండి సమాచార శాఖ ఉపసంచాలకులు వి మణిరామ్, పి ఆర్ ఓ వెంకట రాజు గౌడ్, డివైఈ ఇంద్రావతి, డివిజినల్ పిఆర్ఓ సాయిబాబా, ఏపీ ఆర్ ఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులు గా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవు తున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటి స్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ పేషెంట్లకు అరగం టలో బెడ్ కేటాయించాలని చెప్పడమే కాకుండా.. ఎవరైనా నిరా కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది. కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది.
వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
*జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు ఇలా ఉన్నాయి. *శ్రీకాకుళం - 7995225220, విజయనగరం - 9491012012, విశాఖపట్టణం - 9000782783, తూర్పు గోదావరి - 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ - 9100997444, గుంటూరు - 9121008008, ప్రకాశం - 9063455577, నెల్లూరు - 9704501001, చిత్తూరు - 9491077099, అనంతపురం - 9493188891, కడప - 9849900960, కర్నూలు - 9849902412.*
*నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..*
*AMC, విశాఖపట్నం - 92466 16864*
*SMC, విజయవాడ - 98484 36653*
*SVIMS, తిరుపతి - 94935 47709*
*GMC, అనంతపురం - 98494 99761*
*GMC (RIMS), కడప - 92478 99544*
*ఇట్లు*
*పి.సాయికుమార్*
*అసిస్టెంట్ డైరెక్టర్*
*సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్.*
*8008566613.*
*చైర్మన్*
*అభ్యుదయ ఎంప్లాయీస్*
*అసోసియేషన్.*
*ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ*
*8008566613.*