1 ENS Live Breaking News

చిరంజీవికి బర్త్ డే విషెస్‌ చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చిరంజీవిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు. సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ని కార్యకర్తలు, నాయకులు వారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని పంచుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో తమ అభిమాన నటుడి కోసం చేసిన సేవా కార్యక్రమాలను ప్రముఖంగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ చూసినా చిరంజీవి జన్మదిన వీడియోలు, ఫోటోలు మాత్రమే దర్శనమివ్వడం విశేషం...

Amaravati

2020-08-22 21:04:53

వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న చందన రమేష్

తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి బలం కొద్ది కొద్దిగా వీగిపోతుంది. రాజమండ్రి రూరల్  మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ శనివారం సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనితో రాజమండ్రి రూరల్ మొత్తం వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టడం ఖాయమని చెబుతున్నారు.  ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయంలో చేరిన ఆయన తనతోపాటు  కుమారుడు చందన నాగేశ్వర్ ను కూడా పార్టీలో చేర్చారు. ఈయనకి రూరల్ ప్రాంతంలోని యువతలో మంచి పట్టువుండటంతో టిడిపికి గట్టి దెబ్బే తగిలినట్టు అయ్యింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పరిపాలన, నిరుపేదలకు అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని పార్టీలోకి చేరడానికి ప్రేరేపించాయని అన్నారు. రాజమండ్రితోపాటు, రూరల్ ప్రాంతంలోని పార్టీ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేయడంతోపాటు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకి సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు.

Amaravati

2020-08-22 19:33:02

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు సిజె..జెకె మహేశ్వరి

 ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం  ఈఓ సింఘాల్ ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా సిజె మాట్లాడుతూ, మంచిరోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ  హరీంద్ర నాథ్ పాల్గొన్నారు.  తరువాత  శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు అర్బన్ ఎస్పీ  రమేష్ రెడ్డి, ఆలయ డిప్యూటి ఈఓ  ఝాన్సి, అర్చకులు బాబు స్వామి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం  అర్చకులు  జె కె మహేశ్వరికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఎస్పీ  రమేష్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి కి స్వామివారి చిత్రపటం అందించి శాలువతో సత్కరించారు. జిల్లా జడ్జి  రవీంద్ర బాబు, న్యాయమూర్తులు పవన్,  ధనుంజయులు నాయుడు పాల్గొన్నారు.

Tirumala

2020-08-22 19:10:40

ముంపు ప్రాంతా ప్రజలకు ఇబ్బంది రాకూడదు..సీఎం

కృష్ణానదిలోకి భారీగా వరదలపై సీఎం వైయస్‌.జగన్‌ అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈమధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు.  కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడనుంచి ప్రజలను ఖాళీచేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆమేరకు చర్యలు చేపట్టాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. వారికి ఆహారం, మందులు, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. 

Amaravati

2020-08-22 18:59:41

ఎన్ఆర్ఏతో నిరుద్యోగులకు ఎంతో మేలు: రామ్ కుమార్

నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని సీనియర్ బీజేపి నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుమారు 20 ప్రభుత్వ ఉద్యోగ ఏజెన్సీలు నిర్వహించే నియామకాలను ఇకపై ఎన్ఆర్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని అన్నారు. ఒకసారి అర్హత పరీక్షరాస్తే దాని ఫలితాలు మూడేళ్ల వరకూ అమలులో వుంటాయన్నారు. తద్వారా ప్రభుత్వ శాఖలకు కావాల్సిన సిబ్బందిని అర్హతల ఆధారంగా నియామకాలు చేసుకునే అవకాశముంటుందన్నారు. నిరుద్యోగుల సౌలభ్యం కోసం మోడీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొక్కటని అన్నారు. ఇకపై నిరుద్యోగులు, వారి ఉద్యోగ అవకాశాలను ఎన్ఆర్ఏ ద్వారా పరీక్షించుకోవచ్చునని, పరీక్షకు అనుగుణంగా శిక్షణ తీసుకోవడం ద్వారా మంచి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం వుంటుందన్నారు.

Visakhapatnam

2020-08-22 18:46:20

వినాయక ప్రతిమల మట్టితో మొక్కలను నాటండి..సానారాధ

విశాఖజిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా వున్నందున ప్రతీ ఒక్కరూ తమ ఇంటిలో పండుగచేసిన మట్టి వినాయకులను ఇంట్లోనే పాలతో నిమజ్జణం చేయాలని ప్రముఖ సంఘసేవకులు సానా రాదా పిలుపు నిచ్చారు. విశాఖలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మట్టిగణపతి ప్రతిమలను ఒక ప్రత్యేక కుండీలో నిమజ్జనం చేసి అందులో ఒక మంచి మొక్కను పెంచాలని, తద్వారా వినాయక ప్రతిమల నిమజ్జనానికి ఒక మంచిరూపం వస్తుందని అన్నారు. అందరూ ఒకే సారి బయట ప్రాంతాలకు వెళ్లి నిమజ్జనం చేయడం ద్వారా కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ ఈ విధంగా చేయడం ద్వారా విశాఖలోని కాలుష్యాన్ని మొక్కలు నాటడం ద్వారా తగ్గించవచ్చునని అన్నారు. వినాయక ప్రతిమ నిమజ్జన మట్టికావడంతో దానికి పవిత్రత వుంటుందని, తద్వారా మొక్కలు కూడా ఎదుగుతాయని అన్నారు. ప్రతీఒక్కరూ ఒక మొక్కనాటడానికి ఇది మంచితరుణమని సానారాధ అన్నారు.

Visakhapatnam

2020-08-22 18:38:12

నూతన జిల్లాల అధ్యయానికి 4 ప్రత్యేక సబ్ కమిటీలు...

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4 సబ్ కమిటీలు ఈ విషయంలో పనిచేయనున్నాయి. జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ-1, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ-2, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ-3, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీ- 4 ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లాస్థాయి కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటవుతుంది... ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని సూచించింది. ప్రాథమికంగా 6 నెలల పాటు సచివాలయం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

Amaravati

2020-08-22 18:28:13

గ్రామసచివాలయాల్లోనే అన్ని రకాల ధ్రువపత్రాలు జారీ...

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సువర్ణ అవకాశం..మీసేవలో అందే సేవలన్నీ గ్రామసచివాలయాల్లో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము తప్పా ఏ ఒక్క పైసా అధికంగా చెల్లించే పనుండదు, పైగా మండల కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం అసలే వుండదు. కాకపోతే 4పేజీల ద్రువపత్రాలు దాటితే ఒక్కో పేజీకి రూ.5రూపాయలు అధనంగా చెల్లించాల్సి వుంటుంది. ఇకపై మరణ, జనన ద్రువపత్రాలతోపాటు, ఇతర ద్రువపత్రాలన్నీ గ్రామసచివాలయాల్లోనే అందించనుంది ప్రభుత్వం. వీటి నిర్వహణకోసం ప్రత్యేకంగా నియమించిన డిజిటల్ అసిస్టెంట్లు ప్రజలకు సేవలందిస్తారు. అంతేకాదు సులభంగా పోన్ ఫే, గుగూల్ పే వంటి యాప్స్ తో కూడా నగదు చెల్లించే సౌలభ్యం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజలకు గ్రామస్థాయిలోనే పూర్తిస్థాయి సేవలను పారదర్శకంగా అందిజేస్తుంది ప్రభుత్వం..

Amaravati

2020-08-22 18:20:51

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఇంట్లోనే వినాయక చవితి...

తెలుగు రాష్ట్రాల్లో లంభోదరుడి పూజ భక్తులంతా ఇళ్లల్లోనే శనివారం వైభవంగా జరుపుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశశాల మేరకు అంతా శాంతంగా స్వామివారిని తమ ఇంట్లోనే కొలువుదీర్చి ప్రత్యేకంగా ఉండ్రాళ్లతో అలంకరించి భక్తశ్రద్ధలతో వినాయక వ్రత కల్పాన్ని ఆచరించారు. బయట ప్రాంతాల్లో వినాయక మండపాలకు ఎక్కడా అనుమతులు లేకపోతేవడంతో వినాయక ఆలయాల్లోనే వ్రతాన్ని తక్కువ మంది భక్తులతోనే జరపాల్సి వచ్చింది. ప్రతీ ఇంటిలోనూ బొజ్జగణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూ, అటుకులు బెల్లం, పాలు, అన్నిరకాల పళ్లతో పాలవెళ్లి, 21 రకాల పత్రిలతో స్వామివారికి నచ్చినట్టుు భక్తులు, చిన్నపిల్లలతో చూడముచ్చటగా పూజలు చేసుకున్నారు. అంతా ఆండ్రాయిడ్ మొబైల్స్ లోనే తమ ఇళ్లల్లో చేసిన స్వామివారి పూజను స్నేహితులకు శుభాకాంక్షలుగా పంపుకొని ఆనంద పడ్డారు. కుటుంబ సభ్యులంతా ఒకేచోట కూర్చొని నిండుగా పూజలు విశేషంగా జరుపుకున్నారు.

Anakapalle

2020-08-22 12:47:35

జగనన్న ఆశీర్వాదం జీవితాంతం గుర్తిండిపోతుంది...రోజా

జీవితంలో ఏదైనా మనసు నిండిన ఆనందం ఏదైనా వుందంటే అది నా పెళ్లిరోజు అన్న ఆశీర్వాదం తీసుకోవడమేనని ఎమ్మెల్యే ఆర్కే రోజ అన్నారు. శుక్రవారం వివాహ వార్షికోత్సవం సందర్భంగా జంటగా వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, నాడు వైఎస్సార్ దగ్గర ఆత్మీయ ఆశీర్వాదం తీసుకున్నానని, తరువాత అన్న జగన్ దగ్గర అంతకంటే గొప్పదైన ఆశీర్వాదం తన పెళ్లిరోజున పొందానని నా జీవితంలో ఇది గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలంతా శుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న జన రంజక పథకాలు ప్రజల గుండెలను తాకుతున్నాయని అన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించి మహిళలను ఆర్దికంగా అభివ్రుద్ధి చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. కుటుంబంలో మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా వుంటుందన్నారు. అలాంటి మహిళల ఆర్దికావ్రుద్ధికి వైఎస్సార్ చేయూత పథకం ఎంతగానో దోహద పడుతుందని కొనియాడారు.

Amaravati

2020-08-21 20:05:09

తిరుమలలో ఏకాంతంగా శ్రీ వరాహ జయంతి...

 తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో  శుక్రవారం వరాహ జయంతి కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు.  ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం వేదపండితుల ఆధ్వర్యంలో చేశారు.   త‌రువాత పసుపు,హరిద్రోదకం కలిపిన నీళ్లతో  వేదోక్తంగా మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని  అదనపు ఈ ఓ  ఏవి ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి దంపతులు, ఆలయ డిప్యూటి ఈ ఓ  హరీంద్రనాథ్, పేష్కార్  జగన్మోహనా చార్య, అర్చక స్వాములు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.. కోవిడ్ 19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా శ్రీ వరాహ జయంతిని ప్రభుత్వ కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ నిర్వహించారు.

Tirumala

2020-08-21 19:44:17

అధికారులకు పట్టలేదు..గ్రామవాలంటీరు సాహసించాడు

గ్రామస్థుల ఆరోగ్యం కోసం ఆ గ్రామ వాలంటీరు సాహసం చేశాడు.. మెట్లుకూడా లేని వాటర్ ట్యాంకుపైకి దైర్యంగా ఎక్కి బ్లీచింగ్ తో క్లీనింగ్ చేశాడు. ఈ సంఘటన కడపజిల్లాలోని చిన్న సింగనపల్లిలో జరిగింది. రెండేళ్లుగా ఆ వాటర్ ట్యాంకును పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం లేదు. గ్రామస్తులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. గ్రామస్తుల ఇబ్బందులు తెలుసుకున్న వాలంటీర్ మల్లేశ్వరరెడ్డి స్వయంగా ట్యాంకులోకి దిగి ట్యాంకును బ్లీచింగ్ తో శుభ్రపరిచి గ్రామస్తుల మన్ననలు పొందాడు. అధికారులు స్పందించని సమయంలో కేవలం సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న వ్యక్తి మానవతా ద్రుక్పదంతో గ్రామస్తుల కోసం చేసిన ఈ సేవను విషయం తెలుసుకున్నవారంతా ప్రశంసిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ గ్రామంలోని వాటరు ట్యాంకుకి మెట్లు కట్టించడంతోపాటు, మంచినీటి వ్యవస్థను మరమ్మత్తులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు...

Singanapalle

2020-08-20 20:21:09

టూరిజంలో పెట్టుబడులకు అనుకూలంగా నూతన పాలసీ

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా నూతన పాలసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశివంచారు. ఏపీ టూరిజం నూతన పాలసీలో ప్రతిపాదించిన అంశాలను సీఎంకు వివరించిన అధికారులు, పాలసీ రూపకల్పనపై పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ టూరిజం ఆన్‌లైన్‌ట్రేడ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సంద్భంగా సీఎం మాట్లాడుతూ,  ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి తగిన స్థానం కల్పించాలన్నారు. రాజస్థాన్‌తో దీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సీఎం పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మార్చాలని అధికారులను సూచించారు. ఆతిథ్యరంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలని, అరుకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు సీఎం అధికారులను ఆదేశించారు. హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మంచి కాలేజీ పెట్టాలన్న సీఎం ఈ కాలేజీ నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండేలా రూపొందించి నిర్వహణ చేపట్టాలన్నారు. ఏపిటీడీసీ ప్రాపర్టీస్,లోన్స్‌ విషయంలో ప్రభుత్వ డబ్బు ఎక్కడా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సగం పూర్తయిన ప్రాజెక్ట్‌లు ముందు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో  రజత్‌ భార్గవ, (స్పెషల్‌ సీఎస్, టూరిజం, కల్చర్‌), ప్రవీణ్‌ కుమార్, (ఎండీ, ఏపీటీడీసీ), ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Amaravathi

2020-08-20 19:30:29