1 ENS Live Breaking News

రక్షణ ఉత్పత్తుల దేశీయతయారీ నిర్ణయం హర్షదాయకం..

'ఆత్మనిర్భర్  భారత్' లో భాగంగా రక్షణ శాఖ ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకోవాలని నిర్ణయం భారత దేశ గౌరవాన్ని మరింతగా పెంచుతుందని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం 2020-2024  మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  101 ఉత్పత్తులను ఎంపిక చేసి ట్విట్టర్‌ వేదికగా వెల్లడించడం శుభపరిణామమని కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల బడ్జెట్‌ను దేశీయ కొనుగోళ్లు, విదేశీ కొనుగోళ్లుగా విభజిస్తున్నట్లు కూడా రాజ్ నాధ్ స్పష్టం చేసిన విషయాన్ని రామ్ కుమార్ ప్రస్తావించారు.

Visakhapatnam

2020-08-10 12:30:13

పెన్మత్స మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం..

రాజకీయ కురువృద్ధులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుడ్ని ప్రార్థించారు.  ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెన్మత్స సాంబశివరాజు గారు అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు.  పెన్మత్స  మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెన్మత్స కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేవుడు ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని జగన్ ఆకాంక్షించారు.

Amaravathi, Andhra Pradesh, India

2020-08-10 11:49:20

బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షసూచన

ఒడిసా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని కారణంగా సోమవారం ఉత్తరాంధ్ర, యానాంలలో భారీవర్షాలు కురుస్తాయని, రాయలసీమలోనూ అక్కడక్కడ భారీవర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  అల్పపీడనం అది రాత్రికి ఉత్తర ఛత్తీస్ గఢ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. అంతేకాకుండా అనుబంధంగా 5.8కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్త నం కొనసాగుతోంది. రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని పడదాయన్న వాతవరణ కేంద్రం మధ్య తమిళనాడు పరిసరాల్లో 7.6కి.మీ. ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడిందని కూడా పేర్కొంది. వీటి ప్రభావంతో  రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వివరించింది. ప్రస్తుతం ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో భారీవర్షా లు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. 

Amaravathi

2020-08-10 08:45:45

త్వరలో ఎస్వీబీసీ హిందీ, కన్నడ ప్రసారాలు..టిటిడి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్ ను యాడ్ ఫ్రీ ఛానల్ గా మార్పుచేస్తామని టిటిడి ఈఓఅనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు.  ఎస్వీబీసీ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోందని వివరించారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందయాని చెప్పారు.  ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి టిటిడిపై అద‌న‌పు భారం ప‌డ‌కుండా ఎస్వీబీసీ హెచ్‌డి ఛాన‌ల్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తామని వివరించారు.

Tirumala

2020-08-09 22:53:25

శ్రీవారి ఇ-హుండీ ఆదాయం-రూ.3.97 కోట్లు

తిరుమలలో శ్రీవారి ఇ-హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చిందని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. స్వామివారికి భక్తులు నేరుగా ఈహుండీ ద్వారా కానుకలు సమర్పించారని చెప్పారు. కోవిడ్ కారణంగా భక్తుల రాక తగ్గినప్పటికీ కానుకలు మాత్రం ఈహుండీ ద్వారా వస్తూనే ఉన్నాయన్నారు. కోవిడ్ 19 కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు అనుసరించి మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనాలు కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. ఇందులో ఎలాంటి అపోహలకి తావులేదన్నారు. అటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ ఆదాయం - రూ.8.16 ల‌క్ష‌లు వచ్చిందని ఈఓ వివరించారు. 

Tirumala

2020-08-09 22:46:07

ఆదాయం కోసం శ్రీవారి ద‌ర్శ‌నాలు అంటే ఎలా..

టిటిడి ఆదాయం కోసం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నాలు చేయిస్తోంద‌ని, మీడియా, సోష‌ల్ మీడియాల్లో చేస్తున్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌ని, తాము ఆదాయం కోసం ద‌ర్శ‌నాలు చేయించ‌డం లేద‌ని టిటిడి ఈఓ  అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌లకు లోబ‌డి అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రోజుకు 12 వేల మందికి ద‌ర్శనం క‌ల్పించే ఏర్పాటు చేశామ‌న్నారు. తిరుప‌తిలో పాక్షిక లాక్‌డౌన్ కార‌ణంగా, తిరుప‌తిలో రోజుకు  కేటాయిస్తున్న 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్ల‌ను కొంత‌కాలంగా నిలిపివేసిన‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా కేసుల వ‌ల్ల కొన్ని రోజులు తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు చేసుకున్న‌వారి సంఖ్య త‌గ్గింద‌న్నారు. రెండు, మూడు రోజులుగా ద‌ర్శ‌నాలు చేసుకుంటున్న‌వారి సంఖ్య బాగా పెరిగింద‌ని తెలిపారు. తిరుప‌తిలో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి తిరుమ‌ల ద‌ర్శ‌నాలే కార‌ణ‌మ‌ని కొంత‌మంది చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో కూడా భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందిస్తున్న ఉద్యోగుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. క‌రోనా బారిన‌ప‌డిన చాలామంది ఉద్యోగులు కోలుకుని విధుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని, మ‌రికొంత మంది చికిత్స‌లో ఉన్నార‌ని చెప్పారు. 

Tirumala

2020-08-09 22:28:55

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు సీఎం

విజయవాడలోని ప్రైవేట్‌ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం వైఎస్.జగన్ మోహనరెడ్డి సంతాపం తెలిపారు. వారి కు టుంబాలకు అండగా ఉంటామన్న సీఎం మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలిచ్చారు. విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్‌ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎవరూ అధైర్య పడవద్దని బాదితులకు అండగా వుంటామని చెప్పారు. ఇప్పటికే ఈ సంఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం ప్రమాదం జరిగిన తీరును స్వయంగా డిజిపి గౌతం సవాంగ్ ద్వారా తెలుసుకున్నారు.

Amravati

2020-08-09 20:36:28

జర్నలిస్టులను కరోనా నుంచి కాపాడు అప్పన్న స్వామి..

కరోనా వైరస్ నుంచి జర్నలిస్టులను రక్షించాలంటూ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శు, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబు సింహాద్రి అప్పన్నకు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి కలం సైనికులుగా పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనాబారిన పడటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులకు రూ.50 లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజావసర వార్తలకు తప్పా జర్నలిస్టులు బయటకు వెళ్లవద్దని శ్రీనుబాబు ఈ సందర్భంగా జర్నలిస్టులను కోరారు. జర్నలిస్టులపై ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రజలను ఎల్లవేళలా కాపాడే సింహాద్రి అప్పన్న జర్నలిస్టులను కూడా రక్షించాలని స్వామిని వేడుకున్నట్టు శ్రీనుబాబు వివరించారు.

2020-08-08 23:03:58

వంగపండు కుటుంభానికి ప్రభుత్వ గౌవరం భేష్..పోలాకి

వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివంగత వంగపండు ప్రసారదరావు కుటుంబాన్ని గర్తించి ఆయన కూతురు ఉష కు ఏపీ సాంస్క్రుతిక కల్పన కమిషన్ చైర్ పర్శన్ పదవిని ఇవ్వడం చారిత్రక అంశమని ఏపి విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రముఖ జానపద వాగ్గేయకారుడిని ఏ ప్రభుత్వమూ గుర్తించని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించడం ఉత్తరాంధ్రాకే గర్వకారణమన్నారు. వంగపండు జానపద కళారంగానికి ఎంతో సేవచేశారన్నారన్నారు. అలాంటి కుటుంబం జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం ఏపి సాంస్క్రుతిక కల్పన కమిషన్ చైర్మన్ గా నియమించడం వలన కళాకారులందరినీ గుర్తించినట్టు అయ్యిందన్నారు. ఈ పదవి ద్వారా వంగపండు ఆత్మకూడా శాంతిస్తుందని పోలాకి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన కళలను తెలుగు జానపద కళాకారులు జీవితాంతం గుర్తించుకుంటారని అన్నారు.

2020-08-08 22:04:09

ఏపిసిఎస్ నీలం సాహ్ని పదవీకాలం 3నెలలు పొడిగింపు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ లో సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆమె పదవీ కాలాన్ని జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకూ మూడు నెలలకు పెంచుతూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30 వ తేదీ ( సెప్టెంబర్ నెలాఖరు)న సీఎస్ పదవీ కాలం ముగియనుండడంతో మరో మూడు నెలల కాలం పాటు సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ సీఎస్ పదవీ కాలం పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు.

Amravati

2020-08-08 09:51:56

కరోనాతో జర్నలిస్టు పట్నాయక్ మృతిబాధాకరం.. గంట్ల

కరోనా వైరస్ విషయంలో జర్నలిస్టులు చాలా అప్రమత్తంగా ఉం డాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్య క్షులు గంట్లశ్రీనుబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా విషయంలో ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా సాక్షిలో పనిచేస్తున్న మురళీ క్రిష్ణ పట్నాయక్ కరోనా వైరస్ కు విశాఖ మధువరాడలో బలికావడం బాధాకరమన్నారు. జర్నలిస్టులను కూడా కోవిడ్ వారియర్స్ గా గుర్తిమచి తక్షణమే రూ.50లక్షల జీవిత భీమా కల్పించాలన్నారు. వర్కింగ్ జర్నలి స్టులు పనిచేయకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి తెలియదన్నారు. కానీ ప్రాణాలకి తెగించి విధి నిర్వహణకు వెళుతున్న సమయంలో కొన్నిసార్లు జర్నలిస్టులు మృత్యువాత పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల విషయంలో నిర్ధిష్ట ప్రకటన చేయాలని శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.

Visakhapatnam

2020-08-07 22:08:16

చేనేత సామాజిక వర్గం అభివృద్ధికి ప్రత్యేక కృషి..

చేనేత సామాజిక వర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామ ని సీనియర్ బీజేపీ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన విశా ఖలో మీడియాతో మాట్లాడారు. చేనేత సామాజిక వర్గం సమస్య లు కేంద్ర జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఆప్కోల అభివృద్ధి సొసైటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవా ల్సింది గా మంత్రిని కోరతామన్నారు. ఇప్పటికే విశాఖజిల్లాతో పాటు రాష్ట్రంలోని చేనేత కార్మికులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా చేనేతసామాజిక వర్గాన్ని ఏకం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర కమిటీలోనూ చర్చించనున్నట్టు రామ్ కుమార్ వివరించారు.

2020-08-07 21:53:45

దుర్గ గుడి ఈవోకి కరోనా పాజిటివ్ నిర్ధారణ...

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి ఈవోకి కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. ఈఓతోపాటు ఆలయంలో మరో 18 మందికి పాజిటివ్‌గా వచ్చింది. మరోపైపు రామకృష్ణ ఘనాపాటి వేద పండితులు కరోనా వైరస్ కారణంగానే మృతి చెందారు. అమ్మవారి దేవస్థానంలో అత్యధిక మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు విపరీతంగా పెరుగుతు న్నప్పటికీ భక్తులు ఎక్కడా భయపడకుండా ఆలయాలకి తరలి వస్తున్నారు. ఇటు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మ ఆలయం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉంటుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. బక్తులను సామాజిక దూరం, శానిటైజర్ చేలిన తరువాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

2020-08-07 17:11:29

జర్నలిస్టులకి గీతంలో 20పడకల ప్రత్యేక వార్డు..గంట్ల

జర్నలిస్టులకు గీతం హాస్పిటల్ లో 20 పడకల ప్రత్యేక వార్డు ను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చెప్పారు. శుక్రవారం విజెఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లశ్రీనుబాబు ఆధ్వర్యంలో కార్యవర్గం జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించగా కలెక్టర్ తక్షణమే స్పందించి గీతంలో 20పడకలను అందుబాటులో ఉంచుతామని చెప్పారని శ్రీనుబాబు చెప్పారు. ఈ సందర్బంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, విజెఎఫ్ జర్నలిస్టుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అహర్నిసలు కృషిచేస్తుం దన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా జర్నలి స్టులు చేసే సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఆరోగ్యబీమా, హెల్త్ కార్డ్ రెవిన్యువల్ విషయం లోనూ ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ ని కోరామన్నారు. జర్నలిస్టుల సమస్యలను విన్న కలెక్టర్ విజెఎఫ్ వినతినికి ప్రభుత్వానికి పంపి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్, దాడిరవికుమార్, కార్యవర్గ సభ్యులు ఈశ్వర్రావు, లక్ష్మి, నానాజీ, గిరి తదితరులు పాల్గొన్నారు.

2020-08-07 13:45:40

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...డిసెంబరు వరకూ వారితోనే

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేయడానికి స‌్థానిక సం స్థ‌ల్లో ప్రత్యేకా ధికారుల పాలనను పొడిగిస్తూ ప్ర‌భుత్వం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 108 కార్పొ రేష న్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకా ధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైర‌స్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపా లకశాఖ ఉత్వ‌ర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్‌లో, జూన్ 30న మున్సిపాలిటీల‌లో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తుంది కానీ..స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టంతో శ్రీకాకుళంలో అక్టోబర్ 10 వరకు మాత్ర‌మే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించ‌గా మిగ‌తా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలోనూ డిసెంబర్‌ 31 వరకు ఈ పాలనను పొడిగించింది. మరోవైపు విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వ‌చ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్న‌ట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్టు ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టైంది.

2020-08-06 21:27:23