విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం పట్ల జాతీయ జర్నలి స్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీ నుబా బు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధిని చేపట్టడం కోసం ప్రవేశపెట్టిన మూడు రాజధానులు బిల్లు గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేయడం శుభపరిణామమన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని గా మారడం పట్ల జర్నలిస్టుల భాద్యత కూడా మరింత పెరిగింద న్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిని శరవేగంగా జరగడా నికి మూడు రాజధానులు బిల్లు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యలపై మంచి మంచి కధనాలు అందించి రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టులు కూడా భాగస్వాములు కావాలని గంట్ల శ్రీనుబాబు కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరిం చాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జర్నలిస్టుల న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రా జధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమో ద ముద్ర వేశారు. దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆ మో దించారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటుకానుంది. శాశన రాజధానిగా అమరావతి, జ్యూడీ షియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి. జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో, మూడు వారాల కింద ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ వరలక్ష్మి పూజా వ్రత కల్పం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచే అమ్మవారికి కావలసిన పూజ సామాగ్రి తో ఇళ్లల్లో ఆ వరలక్ష్మి దేవి పూజ విధానాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మరోవైపు టిటిడి కూడా ఈ పూజా విధానాన్ని ఏవిధంగా చేయాలో ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని అందించింది. భక్తులు పూజా విధానాన్ని చూస్తూ పెద్దఎత్తున పూజ జరుపుకున్నారు కుటుంబ సభ్యులు. పిల్లలు సతి సమేతంగా శ్రావణ వరలక్ష్మి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారికి తీర్ధ ప్రసాదాలు సమర్పించారు. అనంతరం ముత్తయిదవులను పిలిచి సామాజిక దూరం పాటిస్తూ వాయినాలు సమర్పించారు.. అటు తెల్లవారుజామున 5 గంటల నుంచే గ్రామాల్లో ఆలయాలన్ని భక్తులతో సందడిగా కనిపించాయి.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు ప్రభుత్వం శుబవార్త చెప్పింది. ఇంటర్ షార్ట్ మార్కుల మెమోలను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో పొందుపర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు మండలి సెక్రటరీ వి.రామకృష్ణ మీడియాకి వివరాలను వెల్లడించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రథమ సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మార్కుల మెమోలు bie.ap.gov.in లో అప్ లోడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు.
రాష్ట్రంలోని న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు, గుమ స్తాలకు కరోనా పరీక్షలు, చికిత్స అందించే విషయంలో విధివిధా నాలను అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు సమర్పిం చారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని విధివిధానాల్లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృ త్వం లోని ధర్మాసనం వివరాలను పరిశీలించేందుకు విచార ణను సోమవా రానికి వాయిదా వేసింది. రాష్ట్రంలోని న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు, గుమస్తాలకు కరోనా పరీక్షలు, చికిత్స అందించే విషయంలో విధివిధానాలను అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని విధివి ధానాల్లో పేర్కొన్నారు. జిల్లాలోని న్యాయవాదుల సంఘాలతో నోడల్ అధికారి.. న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, గుమస్తా లకు కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో సమన్వ యం చేసుకుంటారన్నారు. ప్రతి జిల్లాలోని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు... నోడల్ అధికారితో సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమిస్తారని, వారి ఫోన్ నంబర్లు జిల్లాలోని బార్ అసోసియేషన్లలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కరోనా వైద్య సహాయార్ధం వారు న్యాయవాదులకు బాద్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
కరోనా లక్షణాలున్న వారి విషయంలో నోడల్ అధికారి పరీక్షలు, చికిత్స అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవాదుల సంఘానికి దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసి, ఫలితాలు త్వరాగా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని జిల్లా వైద్యాధికారి సలహా మేరకు కరోనా ఆసుపత్రి, క్వారంటైన్ కేంద్రంలో చేర్చేందుకు నోడల్ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. హోంక్వారంటైన్లో ఉన్నవారికి ఉత్తమమైన వైద్య సాయం అందేలా చూడాలని తెలిపారు. ఈ నిబంధనలు హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులకు వర్తిస్తాయన్నారు. అవసరం మేరకు హైకోర్టులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కరోనా పరీక్ష కేంద్రంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులకు కరోనా పరీక్షల కోసం ప్రత్యేక ఆసుపత్రులు కేటాయించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ప్రసాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏజీ వీటికి సంబంధించి విధివిధానలను కోర్టు ముందు ఉంచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం వివరాలను పరిశీలించేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రకటన చేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనావైరస్ సమయంలో ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు విధినిర్వహిణ చేస్తున్న తరుణంలో ప్రాణాలు వదలాల్సి వస్తుందన్నారు. ఆరోగ్యభద్రతపై ప్రభుత్వాలు నిర్ధిష్ట ప్రకటన చేయకపోవడం వలన జర్నలిస్టుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డులో తిరిగే జర్నలిస్టులతోపాటు, డెస్కు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ భారిన పడి మ్రుత్యువాత చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. తక్షణమే జర్నలిస్టులకు తక్షణమే రూ.50లక్షల ఆరోగ్య భీమా కల్పించి, జర్నలిస్టుల ఆరోగ్యశ్రీకార్డులు రెవిన్యువల్ ఉచితంగానే చేయాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల వైద్యసేవలకు ప్రత్యేక ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో జర్నలిస్టుల ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య పెరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని గంట్ల అన్నారు.
కోవిడ్– 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కేసిపి లిమిటెడ్ తరపున కోటి రూపాయలు విరాళం అందించింది. ఆ విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కెసిసి నిర్వహాహకులు మాట్లాడుతూ, కరోనా లాంటి విపత్కర సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా వైరస్ నియంత్రణ జరుగుతోందన్నారు. తమవంతుగా ఇచ్చిన సహాయాన్ని కూడా కోవిడ్ నియంత్రణకు వినియోగించాలని ఈ సందర్భంగా కేసిపి లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) వి.మధుసూదనరావు కోరారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , కొడాలి నాని, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్-19 పాజిటివ్ ఉన్న వారు ఆసుపత్రులకు వెలితే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో మంగళవారం కోవిడ్-19 నివారణకు తీసుకుంటున్న చర్యలు, సీజనల్ వ్యాదులు, పారిశుద్ద్యం, ఇళ్ళస్థల పట్టాలు పంపిణీ, ఇసుక, ఉపాధిహామీ పథకం, వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు కార్యక్రమం, తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రోజుకు 50 వేలు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అధిక పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. విశాఖ జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు-1,2 ఎం. వేణు గోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, అదనపు ఎస్.పి., డిఎఫ్ఓ లక్షణ్ రావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, ఎస్.ఎస్.ఎ. పి.ఓ మళ్లిఖార్జనరెడ్డి, డిపిఓ, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుని కేంద్ర అధిష్టానం నియమించడం హర్షనీయమని విశాఖ బీజేపీ సీనియర్ నాయకులు కొప్పలరామ్ కుమార్ అన్నారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర నాయకులు జె పి.నడ్డా , పార్టీ అధి నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగ రాష్ట్రంలో పార్టీ సోమువీర్రాజుతో ముందుకు దూసుకెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. సోము బీజేపికి ఫైర్ బ్రాండ్ లాంటివారన్నారు. రాబోయేరోజుల్లో అధ్యక్షుని సూచనలు, సలహాలతో రాష్ట్రంలో పార్టీని మరింతగా అభివ్రుద్ధి చేసి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, సహాయాంపై ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. అన్నివర్గాలు మెచ్చే ఎమ్మెల్సీ సోమువీర్రాజు నియామకంపట్ల యువజన విభాగం కూడా హర్షం తెలియజేస్తుందని రామ్ కుమార్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని కేంద్ర అధిష్టానం నియమించడం హర్షనీయమని విశాఖ బీజేపీ సీనియర్ నాయకులు కాటూరి రవీంధ్ర అన్నారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర నాయకులు జె పి.నడ్డా , పార్టీ అధి నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగ రాష్ట్రంలో పార్టీ సోమువీర్రాజుతో ముందుకు దూసుకెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. సోము బీజేపికి ఫైర్ బ్రాండ్ లాంటివారన్నారు. రాబోయేరోజుల్లో జనసేన పార్టీతో కలిసి బీజేపీ బలాన్ని మరింతగా పెంచుకుంటామన్నారు. రాష్ట్రంలో పార్టీని మరింతగా అభివ్రుద్ధి చేసి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, సహాయాంపై ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఏపీలో రాష్ట్రాధికారం దిశగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకి సాగుతామని కాటూరి వివరించారు.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తూ, బిజేపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బీజేపి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోమువీర్రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించడం కూడా కొసమెరుపు. దీంతో ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా వున్న కన్నా లక్ష్మీనారాయణను పార్టీ పక్కన పెట్టినట్టు అయ్యింది. గత కొద్ది రోజులుగా పార్టీలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ, కన్నా హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈ కారణంగానే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుందనే వాదనకు బలం చేకూరే విధంగా ఏపీ అధ్యక్షుడి మార్పు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. కన్నా నిర్ణయం ఎలా ఉండబోతుందోనని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాయలసీమ ముద్దు బిడ్డ మా జగనన్న అంటూ మంగ్లీపాటిన పాట ఇపుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ పాట అన్ని మాద్యమాల్లో వేలల్లో వీక్షిస్తున్నారు పాఠకులు. అంతేకాదు ప్రతీ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకొని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రాయలసీమ యాసలో పాడిన ఈ పాట అన్ని వర్గాలను ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటుంది.
చెన్నైకి చెందిన యాక్సిస్ హెల్త్ కెర్ ఛైర్మన్ అనురాగ్ వర్థమాన్ జైన్ దంపతులు రూ.2.1 కోట్లు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ విరాళం చెక్కులను దాతలు టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారి సేవలను భక్తులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అందించేం శ్రీవెంకటేశ్వర భక్తిఛానల్ ను అభివ్రుద్ధి చేయడానికి ఈ నిధులు వినియోగించాలని అదనపు ఈఓని కోరారు. స్వామివారికి సంస్థలకు ఈ రకాంగా సేవచేసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా వుందని దాతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
విశాఖ మహానరంలోకి పరిపాలనా రాజధాని రాకుండా అలజడి స్రుష్టించడానికే తెరవెనుక రాజకీయాలు జరుగుతున్నాయని ఈఎన్ఎస్ వెలువరించిన కధనం నిజమవుతూ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీపాలిమర్స్ ఘటన రోజు ఈఎన్ఎస్ ఈప్రమాదాల వెనుక ఎవరోవ్యక్తి కావాలనే భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విషయాన్ని పరిశోధనాత్మకంగా వెలువరించింది. తరువాత జరిగిన, జరుగుతున్న ప్రమాదాలపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలనే ఇదంతా చేస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. వీటి వెనుక చంద్రబాబు హస్తం వుందని కూడా మొన్న అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి బల్లగుద్ది చెప్పారు. దానికి కారణం కూడా లేకపోలేదు. విశాఖలో అగ్రభాగం పరిశ్రమలు ఒక సామాజిక వర్గానికి చెందిన వారివే కావడం విశేషం. దానికారణంగానే కొందరు కావాలనే విశాఖ ప్రజలను భయపెట్టడానికి ఇలాంటి ప్రమాధాల హైడ్రామా ఆడి విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా చేయాలని అడ్డుకుంటున్నారనే వాదన రోజురోజుకూ బలపడుతోంది.