ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ శాఖలు, ఐటిడిఏలు, మున్సిపల్ కార్పోరేషన్లు, ఇతరత్రా కార్పోరేషన్ లో థర్డ్ పార్టీ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పరిధిలోకి తీసేకు వస్తున్నారు. ఇటీవలే విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఐటిడిఏలో 260 మంది ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ లోకి మళ్లించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఇంకా పనిచేస్తుండగా, కొన్ని చోట్ల మహిళా సంఘాలు కార్పోరేషన్లలలో కాంట్రాక్టుల, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను మెయింటేన్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం వారందరనీ ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ద్వారా ఒకేగూటికి తీసుకువస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అందరు కాంట్రాక్టు ఉద్యోగులను, థర్డ్ పార్టీ ఉద్యోగులను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇలా అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులను ఒకే గూటికి తీసుకు వచ్చి తద్వారా ఏ ప్రభుత్వ శాఖలో ఎంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో గుర్తించి వారందరికీ ఒకే పద్దు ద్వారా జీతాలు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ ఇపుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తరహా ఉద్యోగులందరినీ ఒకే గూటికి తీసుకు వచ్చి వారిని కూడా రెగ్యులర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే అన్ని శాఖల ఉద్యోగులను ఒకేచోటకి తీసుకు రావడం ద్వారా ఎన్నిశాఖల్లో ఎన్ని విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయనే సంఖ్య తేలితే ఆ దిశగా వచ్చే మూడేళ్లల్లో ప్రభుత్వం ఉద్యోగాలు తీయాలని భావిస్తోంది. అన్ని ప్రభుత్వశాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగలను ఒకే పద్దు కిందకు తీసుకు రావడం ద్వారా వారికి కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు వేయాలని కూడా ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది అన్నీ అనుకూలిస్తే డిసెంబరు నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది..
భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లె గ్రామానికి చెందిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా జవాను చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాసులు పూతలపట్టు శాసనసభ్యులు ఎం ఎస్ బాబు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఆర్డిఓ రేణుక తో ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు వదిలిన జవాన్ ల త్యాగాలు మరువలేనివన్నారు. వారి కుటంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా వీర జవాన్ ప్రవీణ్ అమర్ రహే అమర్ రహే...జై జవాన్ జై జవాన్ అనే నినాదాలు మారు మ్రోగాయి..
ఆంధ్రప్రదేశ్ లో నెలాఖరునాటికి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు లక్షా 26వేల మందికి పైగా సిబ్బంది సచివాలయాల్లోకి చేరనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో రెండవ దరఫా నోటిఫికేషన్ కి సంబంధించిన కొత్త ఉద్యోగాల్లో 260 మందికి పైగా అభ్యర్ధులకు ఉత్తర్వులు అందించగా మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో మిగిలిన వారికి కూడా నియమకపత్రాలు అందించడానికి సిద్దంగా వుంది. మిగిలిన జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తికాగా, ఇంకా ఎక్కడా నియామకాలు చేపట్టలేదు. దీపావళి శెలవులు పూర్తి అయిన వెంటనే మిగిలిన జిల్లాల్లో కూడా ప్రక్రియ పూర్తిచేసి నెలాఖరు నాటికి 13 జిల్లాల్లో సుమారు 20వేలకు పైచీలకు ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేయనుంది. తద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సేవలు నిరాటంకంగా అందించాలనేది లక్ష్యం. దీనికి అనుగుణంగా ముందు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గాడిలోకి తీసుకొస్తే తరువాత, విద్య, వైద్యం, ఆరోగ్య ఆసుపత్రుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది..
క్రిష్ణాజిల్లాలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్ రన్‌కు సిద్దమైంది. రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వేను నిర్మాణం ఇటీవలే పూర్తి చేశారు. దీనిని కొద్ది రోజుల క్రిష్ణా జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించారు. అప్పటి నుంచి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది. దీనిపై ట్రయల్ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ల ట్రయల్ రన్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రన్ వేలు పెరిగేకొద్దీ కొత్తవిమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ రన్ వే ప్రారంభించి కొత్త సర్వీసులను ప్రారంభించడంతోపాటు, రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలకు కనెక్టవిటీ పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది..
ప్రపంచంలో భారత్ అత్యంత శక్తి మంతమైన దేశంగా తయారయ్యే శక్తి ప్రసాదించాలని, చైనా, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందించారు. అనంతరం కిషన్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అత్యంత బలవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా లకు ఆరోగ్యం, శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. దీపావళి రోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయతో త్వరలోనే కరోనా నశిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారు ప్రజలందరికీ ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని కిషన్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్సీపీలోకి ఒక సామాజిక వర్గం ద్వారా ఎంట్రీ ఇద్దామనుకున్న మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి మరోసారి చుక్కెదురైందని ప్రత్యూషకి చెందిన అక్రమాస్తుల వ్యవహారం రుజువుచేసినట్టైంది. విజయరామపుర అగ్రహారాల్లో సుమారు రూ.200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో స్వాధీనంచేసుకుంది. అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న భూములన్నీ మాజీ మంత్రి గంటా అనుచరులవేనని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారిపై ఉక్కుపాధం మోపుతామని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ప్రకనట కూడా పార్టీలో చాల మంది నేతలకు వార్నింగా వుంది. గతంలో ఓ భూమి వ్యవహారంలో కొయ్యప్రసాదరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇపుడు మళ్లీ పార్టీలోకి ఒక సామాజిక వర్గం ద్వారా వద్దామనుకొంటున్న గంటాకి ఈ ప్రత్యూష కంపెనీకి చెందిన భూ ఆక్రమిత మచ్చ వేసి పార్టీలోకి రానీయకుండా అడ్డుకట్ట వేశారనే ప్రచారం కూడా గుప్పుమంటుంది. ఈ కంపెనీకి చెందిన భూములను స్వాధీనంచేసుకోవడంతో అక్రమార్కులకు పార్టీలో చోటులేదని గట్టివార్నింగ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆక్రమణల్లో వున్న భూములను స్వాధీనం చేసుకొని, పేదలకు పంచి ఇవ్వడంతోపాటు, వారికే ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. సమగ్ర భూ సర్వే చేపట్టకుండానే వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే...ఇక సమగ్ర భూ సర్వే చేపడితే చాలా మంది అక్రమార్కులు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, విద్యుత్ ఉద్యోగులు, సంఘనాయకులు, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధాని నరేంద్రమోదీలకు విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షలు పోలాకి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలో ఆయన మీడియాలో మాట్లాడుతూ, ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని పోలాకి ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం అని పోలాకి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రధాని నరేంద్రమోదీల, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ , రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సహచర మంత్రులు, రాష్ట్ర వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలో ఆయన మీడియాలో మాట్లాడుతూ, ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని మంత్రి అవంతి ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం అని అవంతి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డి ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి సాంప్రదాయ పద్దతిలో గవర్నర్ ను కలిశారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. ముఖ్యమంత్రులు రాష్ట్ర గవర్నర్ లకు జాతీయ పండుగలకు శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగం సీఎంతోపాటు ఆయన సతీమణి వెళ్లి గవర్నర్ ను కలిశారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రజలకు ఏ స్థాయిలో సేవలు అందుతున్నాయో సీఎం గవర్నర్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతున్న వేళ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ ను కలిసి వాటి యొక్క ఫలితాలు వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది...
ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాల్లోని అర్భన్ ప్రాంతాల్లో కార్పోరేట్ వైద్యం పేరుతో చేస్తున్న నిలువుదోపిడికీ వైఎస్సార్సీపీ చరమగీతం పాడనుంది. రాష్ట్రంలో 562 కోట్ల రూపాయలతో 560 డా.వైఎస్సార్ అర్భన్ హెల్త్ క్లినిక్ లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 331 క్లినిక్ లు ఉండగా వాటిని అభివ్రుద్ధి చేయడంతోపాటు, కొత్తగా 229 అర్భన్ క్లినిక్ లను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రజల ముంగిటే ప్రాధమిక వైద్యం అందనుంది. ఒకప్పుడు కడుపునొప్పి వచ్చినా, కాలునొప్పి వచ్చినా, జ్వరమొచ్చినా, తుమ్మొచ్చినా కార్పోరేట్ ఆసుపత్రులు రక్తపరీక్షలు చేసి మందులు ఇవ్వడానికి కనీసం రూ.5వేలు వసూలు చేసేవి. ఇపుడు అలాంటి నిలువుదోపీడికి అడ్డుకట్ట పడనుంది. అర్భన్ వార్డు సచివాలయాల పరిధిలోని వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించనున్నారు. తద్వారా చాలా ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయానికి గండి పడనుంది. ప్రస్తుతం పదివేల 30 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుండగా, కొత్తగా అర్భన్ ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు గన్న ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కానుందని సర్వాత్ర ఆనందం వ్యక్తమవుతుంది..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానని చేస్తున్న తరుణంలో ఉయ్ సపోర్ట్ విశాఖ పేరిట శుక్రవారం విశాఖలో నిర్వహించిన వాక్ థాన్ కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్ థాన్ ను రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతోపాటు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు విశాఖ వ్యాపారానికి పనిచేస్తే ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధాని కాబోతుందని దానికి ప్రజల మద్దతు కూడా అదే స్థాయిలో వుందని అన్నారు. మూడు రాజధానులపై కొందరు అసత్యప్రచారం చేస్తున్నారు. అభివ్రుద్ధి వికేంద్రీకరణ ద్వారా మాత్రమే రాష్ట్రం అభివ్రుద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ముందుచూపుతో ఆలోచించారన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం ద్వారా ఉత్తరాంధ్రాతోపాటు, కోస్తాంధ్రా కూడా ఎంతో అభివ్రుద్ధి చెందుతుందన్నారు. విశాఖ నగరాధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖరాజధానిని చేయాలని ప్రజలు ఎంతలా కోరుకుంటున్నారో ఈ వాక్ ధాన్ నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే అమర్నాధ్ మాట్లాడుతూ, విశాఖ పరిపాలనా రాజధాని అయితే విశ్వనగరంగా విశాఖఅభివ్రుద్ధి చెందుతుందని, ఎన్నో పెట్టుబడులు ఇక్కడికి తరలి వస్తాయన్నారు. ఇంకా కార్యక్రమంలో నాలుగు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు నవంబరు 13వ తేదీ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్ లైన్ (వర్చువల్) కోటాను విడుదల చేయనుంది. అంతేకాకుండా నవంబరు 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. కాగా, కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులు శ్రీవారి దర్శనం కొరకు వారికి ప్రత్యేకంగా కేటాయించిన దర్శనం స్లాట్లల్లో దర్శన టికెట్లు పొందవలసి ఉంటుంది. కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులు వారికి కేటాయించిన ప్రత్యేక స్లాట్లల్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవలసి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్నతేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని గృహస్తులకు టిటిడి కల్పించింది.