1 ENS Live Breaking News

ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్మీడియట్  బోర్డు ఆగస్టులో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విడుదల చేశారు. తాడేపల్లి ఇంటర్మీడియట్  విద్యామండలి  కార్యాలయంలో మంగళవారం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సంబందించిన దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీ వరకూ స్వీకరిస్తామని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శేషగిరి బాబు మాట్లాడుతూ.. ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.  ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ లో జనరల్ లో 33 శాతం, ఒకేషనల్ లో 46 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 

అడ్వాన్సడ్ సప్లిమెంటరీ-2022 పరీక్షలను ఆగస్టు 3వ తేది నుండి 12వ తేది వరకూ నిర్వహించగా, 13వ తేదీ నుండి 26 తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ జరిపామన్నారు. ఈ పరీక్షలకు జనరల్ లో 3,28,831 మంది, ఒకేషనల్ లో 37,712 మంది మొత్తం 3,66,543 మంది హాజరయ్యారని తెలిపారు. జనరల్ మొదటి సంవత్సర విద్యార్థులు 1,76,942 మంది హాజరుకాగా 61,410 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరానికి 1,51,889 మంది పరీక్షలకు హాజరుకాగా 50,691 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.  అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సర విద్యార్థులు 18,399 మంది హాజరుకాగా 7,680 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరంలో 19,313 మంది హాజరుకాగా 8,924 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సర ఇంప్రూవ్ మెంట్ కోసం 1,47,164 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 1,28,573 మంది మెరుగైన ఫలితాలను సాధించారని శేషగిరి బాబు తెలిపారు.

          ఇంటర్ మీడియట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం www.bie.ap.gov.in, http://examresults.ap.nic.in వెబ్ సైట్లనందు పొందవచ్చునని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు అధికారులు ప్రభాకర రెడ్డి, గౌడ్, సుశీల, తదితరులు పాల్గొన్నారు. 

Tadepalli

2022-08-30 08:58:26

స్కాలర్ షిప్స్ కి పోర్టల్ లో నమోదుకావాలి

జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఎంపికైన విద్యార్దులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో ఆగస్టు 30వ తేదీ లోగా నమోదు కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. జాతీయ ఉపకార వేతనాలకు ఎంపిక అయిన ప్రతీ విద్యార్థి  www.scholarships.gov.in పోర్టల్ లో జరిగిన దిగా నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎంపిక అయిన విద్యార్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా చరవాణికి వచ్చిన యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ను అప్లోడ్ చేయవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్ లో  ఆధార్ వివరములు, తల్లి లేదా తండ్రితో జాయింట్ అకౌంట్ ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. బ్యాంక్ ఖాతాకు విద్యార్థి  ఆధార్  మాత్రమే అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి వివరాలు మెరిట్ లిస్ట్ లో ఉన్న విధంగా మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలలో ఉందాలని ఆయన సూచించారు. ఉపకార వేతనాలకు ఎంపిక అయిన ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.12 వేలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు.  విద్యార్థి వివరాలలో దిద్దుబాట్లు ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని, విద్యార్ధి కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, అంగవైకల్యం ఉన్నవారు అంగవైకల్య ధృవీకరణ పత్రం మొదలగు పత్రాలు సమర్పించాలని ఆయన అన్నారు. 

పోర్టల్ లో నమోదు చేయని విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాదని, ఒకరికి ఒకే ఉపకార వేతనం అనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర ఉపకార వేతనాలు  పొందుచున్న విద్యార్ధులు ఆయా ఉపకార వేతనాల నుండి ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన వివరించారు.  నవంబరు 2018, 2019, ఫిబ్రవరి 2020 సంవత్సరాలలో ఈ పరీక్ష వ్రాసి ఎంపికై పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు అప్లోడ్ చేసిన ఫ్రెష్, రెన్యువల్ అప్లికేషన్ ను సంబంధిత పాఠశాల, కళాశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా వెరిఫై వెరిఫై చేయించి, తదుపరి  జిల్లా విద్యాశాఖాధికారి లాగిన్ ద్వారా  వెరిఫై చేయించుకోవాలని ఆయన వివరించారు. విద్యార్థులు తమ పోర్టల్ అప్లికేషన్ ప్రింట్ కు దృవపత్రాలను జతపరచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యార్ధి లాగిన్ ద్వారా అప్లికేషన్ స్థితి తనిఖీ చేసుకావాలని, దీనిని ఎన్.ఎస్.పి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా గాని ఉమాంగ్ ( UMANG) యాప్ ద్వారా గాని మొబైల్ ఫోన్లో తనిఖీ చేసుకొనవచ్చన్నారు.   సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపికైన ప్రతి విద్యార్ధి 30వ తేదీ లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకొనుటకు సహకరించాలని ఆయన ఆదేశించారు.

Parvathipuram

2022-08-26 16:44:35

పదవ తరగతి పరీక్షల్లో సమూల మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్ష విధానంలో సమూల మార్పులు చేసింది. రానున్న రోజుల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ప్రత్యేక జీఓ జారీచేశారు. తద్వారా విద్యావిధానంలో సరికొత్త మార్పులు తీసుకు వచ్చి విద్యార్ధుల కోసం అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండేవి. ఆ తరువాత కరోనా సమయంలో దానిని కాస్తా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఆ తరువాత మళ్లీ  సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్‌ సైన్స్‌, బయోలజికల్‌ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం  తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుండడంతో 11 పరీక్షలు విద్యార్ధులకు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో తెలియజేసింది. సెకండరీ విద్యావిధానంలో మార్పులు తెస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని ఆచరణలో పెట్టేందుకు అపుడే తొలి అడుగు ముందుకి వేసింది.

Guntur

2022-08-22 14:23:56

ఆర్ట్స్ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు రావాలి

శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ పాలిటెక్నిక్ కళాశాలల‌కు ఎన్‌బిఏ గుర్తింపున‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని టీటీడీ జెఈవో స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్ క‌ళాశాల‌, ఎస్‌పిడ‌బ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను జెఈవో గురువారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జెఈవో మాట్లాడుతూ, క‌మిటీలు సెప్టెంబ‌ర్‌లో క‌ళాశాల‌లను సంద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో ఆగ‌స్టు 31వ తేదీకి  అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. క‌ళాశాల‌లో మౌళిక వ‌స‌తుల‌ను మ‌రింత‌గా మెరుగుప‌ర‌చాల‌న్నారు. ఐటి త‌ర‌గ‌తి గ‌దులు, ల్యాబ్‌ల ఆధునీక‌ర‌ణ‌, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డం త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

       క‌ళాశాల‌లోని వసతులు, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలలో అమలు చేస్తున్న పాల‌న‌, బోధ‌న అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ సిద్ధం చేయాల‌న్నారు.  అంత‌కుముందు జె ఈవో సదా భార్గవి ఎస్‌జిఎస్ క‌ళాశాల ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించి కాంక్రీట్ వ్య‌ర్థాలు తొల‌గించాల‌ని అధికారులను ఆదేశించారు . ఎస్‌పిడ‌బ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో రికార్డుల‌నుప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. డిఈవో  గోవింద‌రాజ‌న్‌, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్)  స‌ర‌స్వ‌తి, ఇఇ మ‌నోహ‌ర్‌, ఎస్‌జిఎస్ క‌ళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్  అసుంత, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-08-18 14:08:45

ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాలు

తిరుమల తిరుపతి దేవస్థానికి చెందిన శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్ ), డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల‌ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల‌ ప్రీ డిగ్రీలో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 18 ఏళ్ల‌ లోపు వయసు కలిగి ఎస్ఎస్‌సి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు.  మూడేళ్ల‌  సంస్కృతం, తెలుగు, హిందీ డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రీ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. కె.టి. రోడ్డులోని కళాశాల కార్యాలయంలో రూ.25/- చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 25వ తేదీలోపు సమర్పించాలి. ప్రవేశం లభించిన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా ఉచితంగా భోజనం ,హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. ఇతర వివరాలకు 0877-2264604, 0877-2263974 నంబర్లను సంప్రదించ‌గ‌ల‌రు.

Tirupati

2022-07-15 09:28:36

అంగన్వాడీ సిబ్బందికి 6నెలల సర్టిఫికెట్ కోర్సు

శ్రీకాకుళం జిల్లాలోని డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ సిబ్బందికి ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్  ప్రొఫెసర్ సీ హెచ్. ఎ.రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (పూర్వ ప్రాథమిక విద్య) కోర్సును వర్సిటీలోని విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న అంగన్వాడీ  సిబ్బంది వర్సిటీ వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో ఈ నెల 23వ తేదీలోగా అందజేయాలని చెప్పారు. కోర్సులో చేరేందుకు అర్హతలు, సిలబస్, దరఖాస్తు చేసుకొనే విధానం వంటి పూర్తి వివరాలు వర్సిటీ వెబ్ సైట్ లో ఈ నెల 8వ తేదీ నుంచి అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రార్ , బీఆర్ఎయూ పేరిట రూ.250 డీడీ రూపంలో ఫీజు చెల్లించి దరఖాస్తుతో పాటు అందజేయాలని ఆయన వివరించారు. ఈ కోర్సు చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు పూర్వ విద్యపై అవగాహన కలిగి చక్కని బోధనకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అంగన్వాడీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రోత్సహించాలని ఆయన కోరారు.

Srikakulam

2022-07-14 08:30:15

MJMC కోర్సుకి దరఖాస్తులు ఆహ్వానం

డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ(శ్రీకాకుళం) నిర్వహిస్తున్న రెండేళ్ల పీజీ - జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ( MJMC)కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ ఈ నెల 20. ఫీజు మరియు దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే సమర్పించాలి. యోగి వేమన విశ్వ విద్యాలయం(కడప) www.yuv.edu.in వెబ్ సైట్ లోకి వెళ్ళి MJMCకు ధరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్లు : ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ, కులధృవీకరణ సర్టిఫికెట్లుతో పాటు ఆధార్, Scan చేసిన ఫొటో మరియు digital సంతకం ఉండాలి. MJMC కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం గాని ధరఖాస్తు చేసినపుడు ఏవైనా సందేహాలు  ఉంటే నివృత్తి కొరకు డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ జర్నలిజం విభాగం అధ్యాపకులు 8790 341 580,  9440 440 966, 830 951 9615 మొబైల్ నెంబర్లకు సంప్రదించవచ్చు. MJMC కోర్సు పూర్తయిన తర్వాత లభించే ఉపాధి అవకాశాలు:  ప్రముఖ పత్రికలు, టీవీ చానల్స్, రేడియో స్టేషన్లలో రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు, ఫీచర్ స్పెషలిస్టులు, రేడియో జాకీలు, న్యూస్ ప్రెజెంటర్స్ లుగా రాణించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పి.ఆర్.ఓ.లుగా, సమాచార అధికారులుగా, మీడియా కన్సల్టెంట్ లుగా,  మీడియా అడ్వయిజర్ లు గా కార్పొరేట్ కమ్యూనికేషన్ అధికారులుగా ఉద్యోగాలు పొందవచ్చు. బోధన, పరిశోధన రంగాల్లో ఆసక్తి గల వారు ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం కళాశాలలు, పరిశోధనా సంస్థలు, సర్వే సంస్థలు, సామాజిక అధ్యయన కేంద్రాలలో అధ్యాపకులుగా, అధ్యయనకారులుగా కెరీర్ ను ఎంపిక చేసుకోవచ్చు. యూజీసీ నెట్, ఏపీ సెట్ పరీక్షలు రాసేందుకు కూడా ఈ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులేనని యూనివర్శిటీ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.

Srikakulam

2022-07-14 06:15:40

నాడు వాయిదా పడిన పరీక్ష రేపు నిర్వహణ

విశాఖపట్నం జిల్లాలో ఆశని తుఫాన్ కారణంగా తేదీ 11-5-2022 న జరగాల్సిన ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష రేపు ఉదయం అనగా 25 - 5 - 2022 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు  రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి  ఎమ్. వినోద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తేదీ 11- 5 - 22న  వాయిదా పడిన మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి సమయం, పరీక్ష సెంటర్ గతంలో తెలిపినవే ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు , రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి ( Cell number : 9392911802) తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్ధులు గుర్తుపెట్టుకొని నిలిచిపోయిన పరీక్షను రాసుకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Visakhapatnam

2022-05-24 07:23:08

కేవీలో ఫస్ట్ క్లాస్ లో ఎస్టీ విద్యార్థులకు 3ఖాళీలు

విజయనగరం నగరంలోని కేంద్రీయ విద్యాలయం లో ప్రస్తుత (2022-23) విద్యా సంవత్సరంలో ఎస్.టి. కేటగిరీ కి చెందిన విద్యార్ధులు ఒకటో తరగతిలో ప్రవేశం కోసం మూడు సీట్లు అందుబాటులో వున్నట్టు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మీడియా ద్వారా నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. విద్యా సంస్థలో ప్రవేశం కోసం ఆసక్తి గల సంబంధిత కేటగిరీ కి చెందిన తల్లిదండ్రులు ఈ నెల 25వ తేదీలోగా తమను సంప్రదించాలని కోరారు. ప్రవేశం కోరే విద్యార్థి మార్చి 31, 2014 నుంచి మార్చి 31, 2016 మధ్య జన్మించి వుండాలని పేర్కొన్నారు. ఈ అవకాసాన్ని ఎస్టీ సామాజిక వర్గం విద్యార్ధుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Vizianagaram

2022-05-19 10:59:32

చుక్కల గణేష్ కు ది బెస్ట్ ర్యాంకర్ అవార్డు..

విశాఖజిల్లా, మాకవరపాలెం నకు చెందిన చుక్కల గణేష్ ను హోటల్ మేనేజ్ మెంట్ డిగ్రీలో ది బెస్ట్ ర్యాంకర్ అవార్డు వరించింది. గురువారం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్ లో నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గణేష్ కు ఈ అవార్డును నిర్వాహకులు ప్రధానం చేశారు. ప్రతీఏటా ఈ ఫౌండేషన్ డిగ్రీ, పీజీ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు అవార్డులు ప్రధానం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని సన్ ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ లో బిహెచ్ఎం డిగ్రీ చేసిన చుక్కలు గణేష్ ను ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్ గా ఎంపిక చేశారు.  వివిధ కోర్సుల్లో చదివి, ఉత్తమ ర్యాంకులు సాధించిన , విద్యార్థులకు ఈ బెస్ట్ అవార్డులను ప్రధానం చేశారు. గణేష్ ఇటీవలే బెంగుళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఇంటర్నషిప్ కూడా విజయవంతం పూర్తిచేసి, అక్కడకూడా తన ప్రతిభను చాటాడు. ఈయన తండ్రి సిహెచ్ బిఎల్ స్వామి ఏపీయూడబ్ల్యూజె విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శిగా జర్నలిస్టులకు సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రసాద్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త లజపతిరాయ్ పౌండేషన్ కు చెందిన విద్యావేత్తలు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-11-11 12:19:02

రీజినల్‌ స్కిల్‌ కాంపిటీషన్‌ కు6 రాష్ట్రాల యువత..

యువతను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న రీజినల్‌ స్కిల్‌ కాంపిటీషన్‌కు విశాఖ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. ఏపి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక,తమిళనాడు,కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన యువత ఈ పోటీలలో భాగమవుతున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణపై ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, హెచ్‌పిసిఎల్‌ జిఎం(హెచ్‌ఆర్‌) కె.నగేష్‌ బుధవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమై చర్చించారు. కార్యక్రమాలను ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా జరపాలని నిర్ణయించారు. నవంబరు 30  నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు పోటీలు ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌, ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంతో పాటు పలు ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించాలని నిర్ణయించారు.  నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఏపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంఎస్‌ఎంఇ, ఎస్‌డిఐ, ఏయూ  సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు అధికంగా  ఉపయుక్తంగా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. ఈ కార్యమ్రాన్ని సుమారు 50 వేల మంది వరకు సందర్శించే అవకాశం ఉందని, విభిన్నరాష్ట్రాలనుంచి నిపుణులు, ఉన్నతాధికారులు వస్తారని, వీటికి అనుగుణంగా ఏర్పాట్లు జరగాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని, తక్షణం ఏయూలో కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఏపిఎస్‌ఎస్‌డిసి ఇడి డి.వి రామకోటి రెడ్డి, ఎస్‌డిఐ, ఏపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీసీ ప్రసాద రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి నగేష్‌ సత్కరించారు.

Visakhapatnam

2021-10-13 15:30:56

22 నుంచి జూనియర్ కళాశాల అడ్మిషన్లు..

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం కోసం సెప్టెంబరు 22వ తేదీ   నుంచి ఆన్లైన్లో  దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా సెప్టెంబరు 22 నుండి అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ ప్రకటించింది. దరఖాస్తు ప్రతులను కళాశాల వద్ద  సమర్పించవలసిన అవసరం లేదని టీటీడీ తెలియజేస్తున్నది.

Tirupati

2021-09-21 10:04:40

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 21న ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష..

రాష్ట్ర వ్యాప్తంగా బిఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌ 2021 ప్రవేశ పరీక్షను ఈనెల 21వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విశ్వేస్వర రావు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 పరీక్ష కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తామన్నారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. సోషల్‌ సైన్సెస్‌కు 5149, మేథమేటిక్స్‌కు 4857, బయలాజికల్‌ సైన్సెస్‌కు 3371, ఇంగ్లీషుకు 600, ఫిజికల్‌ సైన్సెస్‌కు 1661 మంది దరఖాస్తు చేసారన్నారు. పరీక్షకు 5346 బాలురు, 10,292 మంది బాలికలు దరఖాస్తు చేసారు.ఉర్దూ మీడియంలో పరీక్షకు 88 మంది దరఖాస్తు చేసారని, వీరికి కర్నూలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసామన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, పరీక్ష సమయం వివరాలలతో సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్‌)ను పంపామన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరు కావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేదిలేదని, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

Visakhapatnam

2021-09-20 11:03:27

సిటియూలో విద్యార్ధులకు ప్రాక్టికల్ పరీక్షలు..

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో  వివిధ సైన్సు సబ్జెక్ట్స్ లో ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. ఇటీవల కోవిద్ కారణంగా ప్రాక్టీకల్స్ నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైన దృష్ట్యా వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారని యూనివర్సిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి తెలియజేసారు.యూనివర్సిటీ లో కొత్తగా ఏర్పాటుచేసిన కెమిస్ట్రీ ల్యాబు లో విద్యార్థులకు ప్రాక్టీకల్స్  నిర్వహించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.  

Vizianagaram

2021-09-03 11:12:02