1 ENS Live Breaking News

వేదపాఠశాలల్లో ప్రవేశాలకు గ‌డువు పొడిగింపు..

టిటిడి వేద పాఠశాలలో ప్రవేశాలకు  2021-22 విద్యాసంవత్సరానికి అర్హులైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే గ‌డువు సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు పొడిగించినట్టు నిర్వాహకులు తెలియజేశారు.  పాఠశాలలో వివిధ కోర్సుల వివరాలు, అర్హత, దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌లను సంప్రదించాలని సూచిస్తున్నారు. టిటిడి ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలు 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా  3. ఐ. భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా 4. విజయనగరం, 5. నల్గొండ,  6. కోటప్పకొండ, గుంటూరు జిల్లాల నందు వేద పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో వివిధ కోర్సులలో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి టిటిడి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయస్సు మరియు విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఇందుకు అర్హులు. 2021, సెప్టెంబ‌ర్‌ 15వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tirupati

2021-09-02 12:14:42

ఆదర్శనీయమైన వేదవిద్య అందించాలి..

మ‌న పూర్వీకులు వేదాలలో పొందుపరిచిన అపార‌మైన‌ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వేద పాఠశాలలను శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కిందకు తీసుకురావ‌ల‌న్న దృడ సంక‌ల్పంతో ఉన్న‌ట్లు టిటిడి అదనపు ఈవో ఎవి ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం  వేదపాఠశాలల కార్యకలాపాలపై అధికారుల‌తో అద‌న‌పు ఈవో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న వేదపాఠశాలలన్నీ దేశంలోని వేద పాఠ‌శాల‌ల‌కు ఆద‌ర్శంగా తీర్చిద్ధిదాల‌న్నది టిటిడి ఆశయమని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న వేద పాఠశాలలన్నింటినీ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కిందకు తీసుకువ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయ‌నికి అనుబంధంగా టిటిడి నిర్వ‌హిస్తున్న అన్ని వేద పాఠ‌శాలలను తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయనగరం, కోటప్పకొండ పాఠ‌శాలలు పూర్తయ్యాయ‌ని, మిగిలిన పాఠ‌శాల‌లు ఒక నెలలో తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ కమిటీ మరియు వేద విశ్వ‌విద్యాల‌యం వైస్-ఛాన్సలర్ ఆధ్వ‌ర్యంలో ఉమ్మడి సిలబస్, పరీక్షా నమూనా, సర్టిఫికెట్ల జారీ, త‌దిత‌ర అంశాల‌ను విశ్లేషించి స‌మ‌గ్ర‌మైన వేద విద్యా విధానాన్ని రూపొందించాల‌ని వేదపాఠశాలల ప్ర‌ధానాచార్యుల‌ను ఆయ‌న ఆదేశించారు. వేదపాఠశాలల అభివృద్ధి కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని  ప్ర‌ధానాచార్యుల‌ను ఆదేశించారు. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి విద్యార్థి - ఉపాధ్యాయ నిష్పత్తి, వివిధ వేద పాఠశాలలోని ఖాళీలను ఆసక్తి గల వేద పారాయణదార్లు, స్కీమ్ వేద పారాయణదారుల‌తో భర్తీ చేయాలన్నారు.

వేద విశ్వ‌విద్యాల‌యం వైస్-ఛాన్సలర్,  అన్ని వేద పాఠ‌శాల‌ల ప్ర‌ధానాచార్యులు సమన్వయంతో వేద‌ల్లోని ప్రతి మంత్రం యొక్క అర్థం, వివరణ, దాని ప్రాముఖ్యతను తెలియ‌జేస్తూ పుస్త‌కాల‌ను ముద్రించి స‌మాజానికి అందివ్వాల‌న్నారు. " ఇందులోని సారాంశాన్ని వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, ఒక సాధారణ వ్యక్తి కూడా దాని సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా " రూపొందించాల‌ని చెప్పారు. వేదపారాయణం, పురాణ ప‌ఠ‌ణం, ప్రవచనం మొదలైన నైపుణ్యాలను మెరుగు పరచాలని, వేద విద్యార్ధులను తిరుమల, తిరుచానూరు ఆలయ‌ ఉత్సవాల్లో పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  కుమార అధ్యాపక పథకం, కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రిస్తూ వేద పాఠశాలల ఎప్పుడు పునః ప్రారంభించాలి, వివిధ వేద పాఠశాలల్లో జ‌రుగుతున్న ఇంజినీరింగ్ పనులపై అద‌న‌పు ఈవో సమీక్షించారు. ఈ స‌మావేశంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉప కుల‌ప‌తి  సన్నిధానం సుదర్శన శర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ కె. తారక రామ కుమార శర్మ, ప్రిన్సిపాల్ ధర్మ వేద విజ్ఞాన పీఠం  కెఎస్‌ఎస్ అవధాని, డెప్యూటీ ఈవో  విజయసారధి, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర వేద పాఠ‌శాలల ప్ర‌ధానాచార్యులు పాల్గొన్నారు.

Tirupati

2021-08-21 16:27:47

సెప్టెంబ‌ర్ 1న పాలిసెట్. కి ఏర్పాట్లు పూర్తి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సెప్టెంబ‌ర్ 1వ తారీఖున పాలిటెక్నిక్ ఎంట్రాన్స్ టెస్ట్ జ‌రుగు తుంద‌ని,  దీనికి సంబంధించిన‌ ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని డీఆర్వో ఎం. గ‌ణ‌పతిరావు వెల్ల‌డించారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై అధికారుల‌తో త‌న ఛాంబ‌ర్లో శ‌నివారం స‌మావేశ‌మ‌య్యారు. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించారు. జిల్లాలోని 19 కేంద్రాల్లో జ‌ర‌గ‌బోయే ప‌రీక్ష‌కు సుమారు ఆరువేల మంది హాజ‌రుకానున్నార‌ని పేర్కొన్నారు. ప‌రీక్ష ఉద‌యం 11.00 నుంచి మ‌ధ్యాహ్నం 1.00 గంట వ‌ర‌కు జ‌రుగుతుంద‌న్నారు. కేంద్రాల‌కు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా డీఆర్వో సూచించారు. అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం కేంద్రాల‌కు ప‌రీక్ష రోజు ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌ని, తాగునీరు వ‌స‌తి క‌ల్పించాల‌ని, థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. అన్ని శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ప‌రీక్ష‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాల‌ని చెప్పారు. స‌మావేశంలో పోలీసు శాఖ‌, విద్యాశాఖ అధికారులు, వివిధ క‌ళాశాల‌ల ప్రిన్సిపాల్స్‌, లైజెనింగ్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-21 15:34:37

ఎంఎస్ఎంఇ లో డిప్లమా కోర్సులు..

విశాఖపట్నం ఎంఎస్ఎంఇ టెక్నాలజీ కేంద్రంలో అడ్వాన్స్ డు డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నామని టెక్నాలజీ కేంద్రం డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేస్తూ అచ్చుతాపురం ఎస్ సి జెడ్ లో 20 ఎకరాల స్థలంలో ఎం.ఎస్.ఎం.ఇ టెక్నాలజీ కేంద్రం నెలకొల్పడం జరిగిందని, ఉన్నత  అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యను అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఏఐసిటిఇ అనుమతించిన అడ్వాన్స్ డు డిప్లొమా ఇన్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ (ఏడిఎంఎం),  అడ్వాన్స్ డు డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ (ఏడిఎంఐఎ) కోర్సులను 2021 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కోర్సులను అందిస్తున్నామని ఆయన చెప్పారు. రెండు కోర్సులలో ఏడిఎంఎం కోర్స్ నాలుగు సంవత్సరాల వ్యవధి, ఏడిఎంఐఎ కోర్సు మూడు సంవత్సరాల వ్యవధి కలిగి ఉందని ఆయన తెలిపారు. ఈ కోర్సులకు పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉండటం కాకుండా నూటికి నూరు శాతం ప్లేస్మెంట్స్ సహాయం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోర్సుల వివరాలకు ఎం.కాలేబు 9949319237,  కే.రాజేష్ 9515397553 ఫోన్ నెంబర్లకు సంప్రదించి తెలుసుకోవచ్చుని ఆయన వివరించారు.

శ్రీకాకుళం

2021-08-09 13:43:12

సిటియులో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం..

గిరిజనుల వేషభాషలు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం, కళలు, చేతి వృత్తులు క్రీడలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య. టి.వి. కట్టిమణి అభిప్రాయ పడ్డారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ అదిమవాసి దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  “జాతీయ అంతర్జాల సదస్సు” లో సబాధ్యక్షుని ఆయన మాట్లాడారు.. గిరిజన భాషలను పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా వుందని.. అలాగే జనజాతీయులు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపడవలసి వుందనన్నారు. దానికోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు  సమిష్టిగా కృషి చేయాలన్నారు.  అనంతరం మధుర G.L.A యూనివర్సిటీ, అంతరించిపోతున్న భాషల విభాగాధిపతి ప్రొఫెసర్. పంచావన్ మహంతి మాట్లాడుతూ, గిరిజన భాషలు, గిరిజన సంస్కృతి చాలా గొప్పవన్నారు.  గిరిజనులకు మాతృభాష ప్రాధమిక స్థాయి నుండే విద్యా బోధన చేయాలని, ఉపయోగించాలని తద్వారా వారి భాషబివ్రుద్దికి జీవనశైలి మెరుగుదలకు ఉపయోగపడాలని ఆశాభావం వ్యక్తం చేసారు.  విశ్వవిద్యాలయం పరిపాలనాధికారి  డాక్టర్. ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ  ఆధ్వర్యం లో జరిగిన ఈ అంతర్జాలం వెబినార్ లో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మహాముద్ మియాన్,  ప్రొ దిరేష్ కులక్షేత్ర, ప్రొఫెసర్ హెచ్. లజపతిరాయ్, ఎస్. ప్రభాకర్ రావు, డాక్టర్ ఎం. శశిభుషణ్ , బి. జానకిరావు లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-09 13:38:01

కేజీబీవీల్లో ప్రవేశానికి సర్టిఫికేట్లు పరిశీలన..

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 7, 8 తేదీలలో సర్టిఫికేట్లు పరిశీలన చేయించుకొన వలసినదిగా సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయ కర్త డా. ఎన్. తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  32 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కే.జీ.బి.వి.)ల్లో 2021-22 విద్యా సంవత్సరంనకు 6, 11 తరగతుల్లో ప్రవేశం కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల చేసుకున్న వారు సర్టిఫికేట్లు తీసుకొని ధరఖాస్తు చేసుకున్న కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయములకు ఆగష్టు 7 మరియు 8 తేదీలలో వెళ్లి సర్టిఫికేట్ పరిశీలన చేయించుకొనవలసినదిగా ఆ ప్రకనలో కోరారు.

Srikakulam

2021-08-06 16:46:23

తూ.గో.జి.లో నవోదయకు ఏర్పాట్లు పూర్తి..

తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 11న నిర్వహించబోయే జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జవహర్ నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్ష సక్రమ నిర్వహణ నిమిత్తం వైద్య ఆరోగ్య,పోలీస్, పంచాయితీ, ఆర్టీసీ ,విద్య, విద్యుత్ , తదితర శాఖలతో డీఆర్వో సీ.హెచ్.సత్తిబాబు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 11న జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిమిత్తం పెద్దాపురం జవహర్ నవోదయ స్కూల్ పరిధిలో 39 పరీక్ష కేంద్రాలు ,ఎటపాక పరిధిలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బందులకు గురికుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని డీఆర్వో అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జవహర్ నవోదయ ప్రిన్సిపల్ పరశురామయ్య, ఆర్టీసీ .డీఎం, విద్యాశాఖ పరీక్షల ఎగ్జామినర్ వి. రాజశేఖర్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-06 14:03:35

11న నవోదయ ప్రవేశ పరీక్ష..

శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ పరీక్షను ఆగష్ట్ 11న నిర్వహిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.గోవిందరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు.  ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు సంబంధిత పోర్టల్ నందు ఉంచడం జరిగిందని, ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేసారు.  

Srikakulam

2021-07-31 15:12:24

లాటరీ ద్వారా విద్యార్ధుల ఎంపిక..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల కోసం డ్రా ద్వారా విద్యార్ధుల ఎంపిక కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ సోమ‌వారం న‌గ‌రంలోని కంటోన్మెంట్‌లో వున్న‌ సెయింట్ ఆంథోని పాఠ‌శాల‌లో ప్రారంభించారు. ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్ధుల నుంచి డ్రా ద్వారా ఈ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి ఎంపిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని జె.సి. పేర్కొన్నారు. జిల్లాలోని 16 ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు డ్రా లు నిర్వ‌హించి ఆయా పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి ఒక్కో రోజు కొన్ని పాఠ‌శాల‌ల‌కు డ్రా లు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. సోమ‌వారం నాడు గ‌ర్భాం, భోగాపురం, ఎల్‌.కోట పాఠ‌శాలల్లో ప్ర‌వేశాల‌కు డ్రా నిర్వ‌హించామ‌న్నారు. ఒక్కో పాఠ‌శాల‌లో 80 సీట్ల భ‌ర్తీకి విద్యార్ధుల ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి.నాగ‌మ‌ణి, స‌హాయ సంచాల‌కులు పి.బ్ర‌హ్మాజీ, క‌న్వీన‌ర్ కె.అప్పాజీరావు, ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌దానోపాధ్యాయులు, విద్యార్ధులు, త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-19 13:21:54

మహిళలకు డిజిటల్ లిటరసీ శిక్షణ..

విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ- గవర్నెన్స్ పై  అవగాహన కల్పించడానికి   భారత ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ  మంత్రిత్వ శాఖ ద్వారా   ప్రధాన మంత్రి డిజిటల్ సక్షరత అభియాన్ పధకం క్రింద  డిజిటల్  లిటరసీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  దేశ వ్యాప్తంగా 2017  నుండి అమలు చేస్తున్న ఈ కార్యక్రమం లో 58,129 మంది  శిక్షణ పొందారన్నారు.  విజయనగరం జిల్లాలో  ఈ అక్టోబర్ నాటికీ 2 లక్షల 76 వేల 300 మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు  తెలిపారు.   గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో  సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ   ఈ శిక్షణ కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులను  కామన్ సర్వీస్ కేంద్రాల్లో నమోదు చేయించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతిలలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభించాలన్నారు.  కంప్యూటర్ పరిజ్ఞానం లేని  డ్వాక్రా సంఘాల  సభ్యులకు ఈ శిక్షణా కార్యక్రమం బ్యాంకింగ్ సేవలలో ఎంతగానో  ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ సమావేశం లో డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్, మెప్మా పి.డి. సుధాకర రావు, సి.పి.ఓ విజయలక్ష్మి , సి.ఎస్.సి జిల్లా మేనేజర్ అర్చన, రాష్ట్ర ప్రతినిధి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-15 14:29:09

గురుకులాల హాల్ టిక్కెట్లు ఆన్లైన్ లో..

శ్రీకాకుళం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి,  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 19 నుండి తమ హాల్ టికెట్లను సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోధలక్ష్మీ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకున్న 5వ తరగతి విద్యార్ధులు https://apgpcet.apcfss.in  వెబ్ సైట్ నుండి,  ఇంటర్ ప్రథమ సం.రం విద్యార్ధులు https://apgpcet.apcfss.in/inter/ వెబ్ సైట్ ద్వారా ఈ నెల 19 నుండి తమ హాల్ టికెట్లను పొందవచ్చని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 2021–22 విద్యా సం.నకు గాను 5వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఐఐటి –నీట్ కళాశాలలో మొదటి సంవత్సరం నందు ప్రవేశ పరీక్ష కొరకు బాలబాలికలు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుటకు ప్రవేశ గడువు ఈనెల 15తో ముగిసిందని అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష జూలై 29న ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఆగష్ట్ 1వ తేది ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. 

Srikakulam

2021-07-15 14:14:51

ఏకలవ్య ప్రవేశాలకు గడువు పెంపు..

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ.టి.డి. ఎ పార్వతీపురం పరిధిలో గల ఏకలవ్య మోడల్ రేసిడేన్షియల్ విద్యాలయాలలో 2020-21,  2021 - 22 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశానికి, 7, 8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకుగాను  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు  కొవిడ్ పరిస్థితులు, లాక్ డౌన్ దృష్ట్యా జూన్ 16, 2021 నుండి జూన్ 26, 2021 వరకు పొడిగించారు. ఈమేరకు ఆర్హులైన అభ్యర్థులు జూన్, 26 లాగా ఆన్లైన్ వెబ్ సైట్ www.aptwgurukulam.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఐ.టి.డి. ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. అలాగే ఇతర వివరాల కొరకు  సమీపంలో ఉన్న  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయం లేదా గురుకుల విద్యాలయాలలో సంప్రదించ గలరు, కన్వీనర్ ప్రిన్సిపల్ వారి సెల్ నెంబర్ 91990957213, గురుకులం సెల్ ఇంఛార్జి సెల్ నెంబర్ 9491064511 సంప్రదించాలన్నారు.

Parvathipuram

2021-06-17 10:06:47

D.EL.Ed పరీక్షలు వాయిదా..

శ్రీకాకుళంజిల్లాలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు ( D.EL.Ed)2వ సెమిస్టర్ పరీక్షలు ( 2019 –21బ్యాచ్ ) వచ్చే నెల 5వ తేదీనకు వాయిదా వేసినట్లు  ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మీడియాకి  ఒక ప్రకటన జారీచేసారు.  జూన్ 21 నుంచి 24 వరకు జరగవలసిన డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలు జూలై 5 నుండి 8వ తేదీవరకు వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. కావున కళాశాల యాజమాన్యాలు,  విద్యార్ధులు ఈ మార్పును గమనించాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే మీడియా ద్వారా తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Srikakulam

2021-06-17 08:08:48

2021-06-04 10:51:01

ఏకలవ్యలో మిగులు సీట్ల బర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాటశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు   పార్వతీపురం ఐ.టి.డి.ఎ పీఓ ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 6వ తరగతి ప్రవేశానికి, 7,8 తరగతులలో మిగిలి ఉన్న  సీట్లకుగాను అన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. 4ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాటశాలల్లో 6వ తరగతి బాలికలకు 30, బాలురకు 30 ప్రవేశం కల్పించనున్నట్లు, 7 తరగతిలో బాలురు 6, బాలికలు 22 ఖాళీలు, 8 వ తరగతిలో బాలురు 44, బాలికలు 37 భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలన్నారు.  జూన్,18 ఉదయ 11 గంటలకు ఐ.టి.డి. ఎ కార్యాలయ ఆవరణలో గల గిరిమిత్ర సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. 6వ తరగతి ప్రవేశానికి అంతకు ముందు తరగతులు 2020-21 విద్యా సంవత్సరం ఉత్తీర్ణత పొందిన తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.  ఎస్.టి, ఎస్.సి, బి.సి కులాలకు చెందిన విద్యార్థులు విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి ఉత్తర్ణులై, తల్లిదండ్రులు, సంరక్షకులు వార్షిక ఆదాయ లక్ష రూపాయలు మించి ఉండరాదు. ఇతర వివరములు, దరఖాస్తు నిమిత్తం   www.aptwgurukulam.ap.gov.in వెబ్ సైట్ పరిశీలించి,  సమాచార పత్రంలో ఇవ్వబడిన  ఆర్హతలు పరిశీలించుకుని వెబ్ సైట్లో దరఖాస్తు సమర్పించాలి, దరఖాస్తు చేసుకొనుటకు   జూన్ 16 ఆఖరి తేదీ, ఇతర వివరముల కొరకు మీకు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సంప్రదించాలని ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు.

Parvathipuram

2021-05-31 10:50:12