1 ENS Live Breaking News

తరగతులు పూర్తిస్థాయిలో నిర్వహించాలి..

ఆంధ్ర విశ్వవిద్యాయలయంలో అన్ని విభాగాల్లో తరగతుల నిర్వహణ పటిష్టంగా, పూర్తిస్థాయిలో జరగాలని ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత అన్నారు. శనివారం ఉదయం ఏయూ ఆర్టస్ ‌కళాశాల పరిధిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది హాజరు పట్టికలు, తరగతుల నిర్వహణ జరగుతున్న విధానాలను పరిశీలించారు. విద్యార్థులను నిత్యం తరగతులకు హాజరు కావాలని సూచించారు. తరగతుల నిర్వహణ పటిష్టంగా జరపాలని తెలిపారు.  సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, తప్పనిసరిగా కోవిడ్‌ ‌నియమావళి అనుసరించాలని చెప్పారు. అదే సమయంలో విద్యార్ధులను ప్రశ్నించి తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయమై ఆరాతీశారు. ఎవరికి అసౌకర్యం కలిగినా తక్షణమే సంబంధిత విద్యార్ధులు ఫిర్యాదు చేయాలని సూచించారు. అదే సమయంలో విద్యార్ధులు కూడా క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని రెక్టార్ విద్యార్ధులకు సూచించారు.

Andhra University

2021-02-27 19:46:45

కె.వి రమణకు జీవన సాఫల్య పురస్కారం..

ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కె.వి రమణకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. నేషనల్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ‌ప్రొఫిషనల్‌ ‌సోషల్‌ ‌వర్కర్స్ ఇన్‌ ఇం‌డియా(ఎన్‌ఏపిఎస్‌బడబల్యూఐ) 2020 సంవత్సరానికి లైఫ్‌ ‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో ఆచార్య రమణను సత్కరించనుంది. సోషల్‌ ‌వర్క్ ‌రంగంలో అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందిస్తున్నారు. జ్ఞాన ఆధారితంలో సోషల్‌ ‌వర్క్ ‌రంగంలో చేస్తున్న విశిష్ట సేవలను గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆచార్య కె.వి రమణను వరించింది.ఈ నెల 28వ తేదీన ఉదయం జరిగే 8వ జాతీయ సోషల్‌ ‌వర్క్ ‌కాంగ్రేస్‌లో ఆచార్య రమణకు ఈ అవార్డును అందిస్తారు. 

Andhra University

2021-02-27 19:38:38

సైకోమెట్రిక్ ఎక్స్ పోకు విశేష స్పందన..

ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకోమెట్రిక్ ఎక్సపోకు విశేష స్పందన లభిస్తోంది. శనివారం అత్యధిక సంఖ్యలో నర్సింగ్, జీవీఎంసీ పాఠశాలలు ఇతర విభాగాలకు చెందిన విద్యార్థులు,కార్మికులకు ఉచితంగా ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఐఆర్ఎస్ అధికారి రవిచంద్ర,సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎంవిఆర్ రాజు పాల్గొని, సైకోమెట్రిక్ పరీక్షల విశేషాలను, ఉపయోగం లు  తెలియజేశారు. ఒత్తిడి, మానసిక సమస్యల బారి నుంచి ఈ పరీక్షల ద్వారా కాపాడుకోవచ్చని వారు వివరించారు. ప్రతీ రోజు, ఆరు రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు.  కరోనా  సమయంలో ప్రంట్ లైన్  వారియర్స్ గా వైద్యులు, నర్సులు, పోలీసులు, జర్నలిస్టులు అందించిన సేవలు విశేషమన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షుడు, విద్యార్థి గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించగా..అధ్యాపకులు డాక్టర్ సునీత సుభాషిణి, దామోదర్ నాయుడు, సీనియర్స్ జూనియర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2021-02-27 19:34:56

ప్రభుత్వ పాఠశాలల్లో సీబిఎస్సీ సిలబస్..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలు తమ రూపురేఖలు బయటే కాకుండా విద్యావిధానంలోనూ మార్పు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, కార్పోరేట్ పాఠశాలల్లో మాత్రమే అమలు చేసే సిబిఎస్సీ సిలబస్ ను వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి 7వ తరగతి వరకూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ఆదేశాలు జారీ చేసింది. విద్యావ్యవస్థను పునాది స్థాయి నుంచే పటిష్టంగా అమలు చేయాలనే ఆలోచనతో ఒకటవ తరగతి నుంచే ప్రభుత్వం ఈ తరహా సిలబస్ ను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్ధులు, ఇంగ్లీషు, హిందీ తోపాటు ఇతర సబ్జెక్టులను కూడా ఇంగ్లీషు మాద్యమంలోనూ, హిందీ మాద్యమంలోనూ చదువుకోవడానికి వీలుపడుతుంది. వీరంతా 10వ తరగతికి వచ్చే నాటి చాలా వరకూ ఇంగ్లీషు, హిందీ బాషలు అనర్గళంగా మాట్లాడేందుకు, చదివేందుకు ఎంతో ఉపకరిస్తుంది. దానికోసం  ప్రభుత్వం ప్రస్తుతం వున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వాలని యోచిస్తుంది. పైగా రానున్న ఐదేళ్లలలో భారీగా ఉపాధ్యాయుల రిటైర్ మెంట్లు ఉండటంతో ప్రత్యేక డిఎస్సీ ద్వారా లాంగ్వేజ్ పండిట్ లను, ఇంగ్లీషు మీడియంలో చదివిన ఉపాధ్యాయులను నియమించి ఈ సెంట్రల్ సిలబస్ ను క్రమేమీ ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మంది ఉపాద్యాయులు బిఈడీలోనూ ఇంగ్లీషు మెతడాలజీ సబ్జెక్టుగా చదువుకున్నవారు ఉన్నారు. అలాంటి యువతను ముందుగా ఈ ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేసి వారి ద్వారా ఈ సెంట్రల్ సిలబస్ ను విద్యార్ధులకు బోధించాలనేది ప్రభుత్వ ఆలోచన. తెలుగు మీడియం చదివే పిల్లలకు వయస్సు మళ్లిన ఉపాధ్యాయులను, రిటైర్మెంట్ దగ్గర పడ్డ ఉపాధ్యాయులను నియమించి వారికి విద్యాబోధన చేయనున్నారు. కేజీ నుంచి పీజి వరకూ విద్యార్ధులు ఎక్కడా ఆటంకంలేకుండా చదువుకోవాలంటే దానికి సెంట్రల్ సిలబస్ మాత్రమే ఉత్తమమని భావించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావాలని చూస్తుంది. అయితే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా విద్యావ్యవస్థకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాల్లో లాంగ్వేజ్ పండిట్ నియామకాల్లో మొండి చేయి చూపిస్తూనే వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాధమిక పాఠశాల విద్యార్ధులకు కూడా హిందీ బోధించాల్సి వుంటుంది. అలాంటి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక పాఠశాలల్లో హిందీ పండిట్ లను నియమించడం ద్వారా విద్యార్ధులంతా తరగతులు పెరిగే కొద్దీ వారికి హిందీ బాషపై పట్టువస్తుంది. లేదంటే ఒకేసారి సెంట్రల్ సిలబస్ ఏర్పాటు చేసినా ప్రస్తుతం వున్న ఉపాధ్యాయులు దానిని బోధించడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటన్నింటినీ పరిగణలోని తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కంప్యూటర్ విద్యపై సామర్ధ్యం బాగా ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాధమిక పాఠశాలల్లో సెంట్రల్ సిలబస్ ను ఏర్పాటు చేసి కార్పోరేట్ పాఠశాలలకు ధీటు తీర్చిదిద్దాలని నిర్ణయానికి అమలు దిశగా అడుగులు వేసింది. ఈ శుభపరిణామం విద్యావ్యవస్థలో మార్పులు ఏ విధంగా తీసుకువస్తుంది, ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురౌతుంది తదితర అంశాలు త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు రానున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూడాలి మరి..! 

Tadepalle

2021-02-25 08:59:24

సత్యశోధన దిశగా ముందు కిసాగాలి..

మానవ జీవితం యాంత్రికంగా మారిపోయిందని, దీని నుంచి బయట పడుతూ సత్యాన్ని గుర్తించే దిశగా జీవనం సాగాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. బుధవారం ఏయూ సెనేట్‌ ‌మందిరంలో  డాక్టర్‌ ‌పుత్సల రామకృష్ణ రచించిన ‘ జీవించే కళ’ శ్రీ జిడ్డు కృష్ణమూర్తి బోధనల అవగాహనా స్ఫూర్తితో రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ అనేక సమస్యలకు మనలోని ‘నేను’ అనే భావనేనన్నారు. దీని నుంచి బయటపడే ప్రయత్నం జరగాలని సూచించారు. జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాలలోని అంశాలను సరళం చేస్తూ తీర్చిదిద్దిన పుస్తకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. దీనిని జన బాహుళ్యంలోనికి విరివిగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వాన్ని ఆనందమయంగా నిలపడానికి ఇటువంటి పుస్తకాలు ఉపకరిస్తాయని తాను భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయితను వర్సిటీ తరపున సత్కరించారు. పుస్తక రచయిత డాక్టర్‌ ‌పుత్సల రామకృష్ణ మాట్లాడుతూ నిరాడంబరత, నిస్వార్థతకు ప్రతిరూపంగా, జ్ఞాన మూర్తిగా, ప్రేమమూర్తిగా జిడ్డు కృష్ణమూర్తి నిలుస్తారన్నారు. సామరస్యం, సానుకూల జీవనం అలవరచుకోవడానికి జిడ్డు కృష్ణమూర్తి ప్రవచనాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. స్వీయ అవగాహనతో మనలో మార్పుకు నాంది పలకాలని సూచించారు. క్రోధాన్ని విడనాడి, ప్రేమ, ఏకత్వం సాధించే దిశగా మన ప్రయాణం సాగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2021-02-24 19:16:37

ఏయూతో ఐజెఎం ఎంఓయూ..

ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్‌ ‌జస్టిస్‌ ‌మిషన్‌(ఐజెఎం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. బుధవారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఐజెఎం సీనియర్‌ అసోసియేట్‌ ‌శాంసన్‌ ‌డేనియల్‌లు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సమన్వయకర్త ఆచార్య ఎస్‌.‌హరనాథ్‌, ‌దుర్గాబాయి దేశముఖ్‌ ‌మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు డాక్టర్‌ ‌పి.ఉష , పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్‌ ‌తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కులు అమలు, నిర్భంద కార్మికులు, మానవ అక్రమ రవాణా  అరికట్టడం వంటి అంశాలపై పనిచేస్తారు.

Andhra University

2021-02-24 18:51:52

ఆచార్య ఎం.వి.ఆర్‌ ‌రాజుకు అభినందన..

ఆంధ్రవిశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం సీనియర్‌ ఆచార్యులు ఎం.వి.ఆర్‌ ‌రాజు ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ‌సైకాలజీ(ఐఏఏపి) జాతీయ అద్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఏయూ సైన్స్ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు, విభాగాల ఆచార్యులు అభినందించారు. బుధవారం ఉదయం సైన్స్ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ‌కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆచార్య ఎం.వి.ఆర్‌ ‌రాజును సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పదవిని ఏయూ ఆచార్యులు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Andhra University

2021-02-24 18:50:59

ఏపిసెట్‌లో 7.88 శాతం అర్హత..

రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్‌ 2020 ‌పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏపిసెట్‌ ‌మెంబర్‌ ‌సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం ఫలితాలు విడుదల చేసి వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఏపిసెట్‌ 2020 ‌పరీక్షకు 26,527 మంది హాజరవగా వీరిలో 2090 మంది అర్హత సాధించారన్నారు. అర్హతా శాతం 7.88గా నమోదయిందన్నారు. డిసెంబర్‌ 20‌వ తేదీన 30 సబ్జెక్టుల్లో ఏపిసెట్‌ ‌ప్రవేశ పరీక్షను నిర్వహించామన్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం ఏపిసెట్‌ ‌వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతిల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుతామన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన తేదీలను ఆయా జిల్లాలకు అనుగుణంగా ప్రకటించున్నట్టు ఆయన వివరించారు.

Andhra University

2021-02-22 19:29:43

హాస్టల్‌ ‌నిర్మాణానికి ఎస్‌ఏఎల్‌పిజి సహకారం..

ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని మహిళా ఇంజనీరింగ్‌ ‌కళాశాల విద్యార్థినులకు నూతన హాస్టల్‌ ‌నిర్మాణానికి సౌత్‌ ఏషియా ఎల్‌పిజి కంపెనీ ముందుకు వచ్చింది. రూ 2.5 కోట్ల వ్యయంతో నూతన హాస్టల్‌ను నిర్మించి ఏయూకు అందించనుంది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సోమవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఎస్‌ఏఎల్‌పిజి సంస్థ సిఈఓ ఏ.ఎస్‌ ‌క్రిష్ణన్‌లు సంతకాలు చేశారు. మూడు అంతస్థుల్లో  రూ 2.5 కోట్ల వ్యయంతో ఈ హాస్టల్‌ను నిర్మిస్తారు. 36 గదులతో 108 మంది విద్యార్థులకు వసతి కల్పన జరిపే దిశగా దీనిని నిర్మిస్తున్నారు. హాస్టల్‌లో టీవీ రూమ్‌, ‌లైబ్రరీ, వాష్‌ ఏరియా, లాబీ వంటివి కల్పిస్తారు. విశ్వవిద్యాలయానికి సామాజిక బాధ్యతగా సహకారం అందించడానికి ముందకు వచ్చిన సౌత్‌ ఏషియా ఎల్‌పిజి కంపెనీ సంస్థ ప్రతినిధులను వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మహిళా ఇంజనీరింగ్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.‌కె భట్టి, ఎస్‌ఏఎల్‌పిజి ప్రతినిధులు జి.ఎస్‌ ‌గిరిధరన్‌, ఏ.ఎస్‌.‌వి కొండల రావు తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2021-02-22 19:20:50

ఆ పరీక్షలకు ఆన్లైన్ లో దరాఖాస్తు చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో మార్చి 2021 న జరగబోయే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు డ్రాయింగ్, హాండ్ లూమ్ వివింగ్, టైలరింగ్ ఎంబ్రాయీడరీ లోవర్ గ్రేడ్ , హైయర్ గ్రేడ్ పరీక్షలు వ్రాయడానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి  ఒక ప్రకటనలో తెలియజేశారు. దానికోసం www.bseap.gov.inలో దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ ఫామ్, చాలనను జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయంలో అందజేయాలని పేర్కొన్నారు. లోయర్ పరీక్ష పాసైవారు హయర్ పరీక్ష వ్రాయటకు అర్హులని తెలియజేశారు. ఇతర రాష్ట్రాల బోర్డు ద్వారా పాస్ అయిన అబ్యర్ధులు ఈ పరీక్ష వ్రాయటకు సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యలయం ఆంధ్రప్రదేశ్ , విజయవాడ వారి నుంచి ముందుగా అనుమతి పొందాలని తెలియజేశారు. ఈ పరీక్షలకు ఫీజులు ఈ విధంగా ఉన్నాయి.. (1)డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ – రూ. 100/- (2)డ్రాయింగ్ హైయర్ గ్రేడ్ –రూ. 150/- (3)హాండ్ లూమ్ వివింగ్  లోయర్ – రూ.150/- (4) హాండ్ లూమ్ వివింగ్  హైయర్ రూ 200/- (5) టైలరింగ్ & ఎంబ్రాయీడరీ లోయర్  రూ.150/- (6) టైలరింగ్ & ఎంబ్రాయీడరీ హైయర్ రూ . 200/- అపరాధ రుసుము లేకుండా 30.01.21 వరకు,  50/- అపరాధ రుసుము 06.02.21,  75/- అపరాధ రుసుము 13.02.21తో దరఖాస్తు చేసుకొనవచ్చునని పేర్కొన్నారు.. అబ్యర్ధులు దరఖాస్తులను 16.02.21 న జిల్లా విద్యాశాఖాధికారి  కార్యాయలంలో అందజేయాలని పేర్కొన్నారు.

Srikakulam

2021-01-19 19:10:51

సాంకేతికతపై పట్టు సాధిస్తే ఉత్తమ ఫలితాలు..

నేటి తరం విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించి సమాజానికి మేలు చేకూరే విన్నూత ప్రాజెక్ట్‌లను చేపట్టి పలు సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని  ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ‌ప్రొ.కె.హేమచంద్రారెడ్డి  అన్నారు. సోమవారం జవహర్‌లాల్‌ ‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ప్రాంగణంలో యుసిఇకె కంప్యూటర్‌ ‌సైన్స్ & ఇం‌జనీరింగ్‌ (‌సిఎస్‌ఈ) ‌విభాగం ఆధ్వర్యంలో అలూమ్ని ఆడిటోరియం లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘‘కంప్యూటర్‌ ‌విజన్‌, ‌హై పెర్ఫార్మెన్స్ ‌కంప్యూటింగ్‌, ‌స్మార్ట్ ‌డివైజస్‌ అం‌డ్‌ ‌నెట్‌వర్కస్ (‌సిహెచ్‌ఎస్‌ఎన్‌-2020)’’ అను అంశంపై అంతర్జాతీయ సదస్సు  ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా వర్చువల్ విధానంలో జరిగే కార్యక్రమంలో వక్తల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం వుంటుందన్నారు.  ఆచార్య కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ ‌నేపథ్యంలో బోధనా విధానంలో సాంకేతికపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలోను మరియు రాష్ట్రంలోను 100శాతం తరగతులు ఆన్‌లైన్‌ ‌పద్ధతిలోనే జరుగుతున్నాయన్నారు.  సాంకేతిక విద్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి క్వాలిటీ గ్రాడ్యుయేట్స్‌ను సమాజానికి అందించాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. విద్యార్థులకు ముఖ్యంగా స్కిల్‌ ఓరియంటెడ్‌ ‌కోర్సులను అందించాలని, పరిశోధనకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.  ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు మాట్లాడుతూ అధ్యాపకులు, పరిశోధక మరియు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు ఇటువంటి సదస్సులలో పాల్గొనడం వలన సబ్జెక్ట్‌పరంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సదస్సులో నెట్‌వర్క్ ‌భద్రతా సంబంధిత అంశాలు, సమాచార డేటా విశ్లేషణ, సమాచార మార్పిడి వంటి తదితర అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయన్నారు. మాజీ ఉపకులపతి ప్రొ.అల్లం అప్పారావు మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్న ఇటువంటి సమయంలో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సాంకేతిక విద్య మరియు సాంకేతిక సేవలలో ఆంధప్రదేశ్‌ ‌ముందంజలో ఉందన్నారు. అమెరికా వంటి దేశాలలోని మల్టీనేషనల్‌ ‌కంపెనీలను భారతీయులు తమ సాంకేతిక బలంతో ముందుండి నడిపిస్తున్నారన్నారు. కరోనా వలన విద్యా విధానంలో వచ్చిన సమూల మార్పులు మరియు ఆన్‌లైన్‌ ‌పద్ధతిలో బోధన చేయడాన్ని ఒక అవకాశంగా భావించాలన్నారు. రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొ.ఏ.ఆనందరావు మాట్లాడుతూ ఇటువంటి సదస్సులలో మంచి జర్నల్స్, ‌పేపర్‌ ‌ప్రజంటేషన్‌లు ఇచ్చిన అధ్యాపకులు పరిశోధనలో ముందుకు వెళతారన్నారు. కేవలం ఒక విభాగానికి చెందిన అధ్యాపకులే కాకుండా ఇతర విభాగాల అధ్యాపకులు కూడా ఇటువంటి సదస్సులో పాల్గొని సబ్జెక్ట్‌పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రిజిస్ట్రార్‌ ‌మరియు సదస్సు జనరల్‌ ‌ఛైర్‌ ‌ప్రొ.సిహెచ్‌.‌సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ  నలుమూలల నుండి 200మందికి పైగా ప్రతినిధులు వర్చువల్‌ ‌విధానంలో ఈ సదస్సులో పాల్గొన్నారన్నారు. అనంతరం పరిశోధననలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధ్యాపకులకు యంగ్‌ ‌రీసెర్చ్ అవార్డు మరియు బెస్ట్ ‌రీసెర్చ్ ఇన్‌ ‌సైన్స్ & ‌టెక్నాలజీ అవార్డులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ ‌ప్రొ.సిహెచ్‌.‌సత్యనారాయణ జనరల్‌ ‌ఛైర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయగా విశిష్ట అతిథులుగా జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు , రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొ.ఏ.ఆనందరావు , జెఎన్‌టియుకె మాజీ ఉపకులపతి ప్రొ.అల్లం అప్పారావు , గౌరవ అతిథులుగా రెక్టార్‌ ‌ప్రొ.జివిఆర్‌.‌ప్రసాదరాజు, యుసిఇకె ప్రిన్సిపాల్‌ ‌ప్రొ.బి.బాలకృష్ణ  వేదికనలంకరించారు. సిఎస్‌ఈ ‌విభాగాధిపతి డా.డి.హరిత సదస్సుకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. జెఎన్‌టియుహెచ్‌ ‌నుంచి ప్రొ.ఎల్‌.‌ప్రతాప్‌రెడ్డి, సింగపూర్‌లోని నాన్యాంగ్‌ ‌టెక్నలాజికల్‌ ‌యూనివర్శిటీ నుండి డా.మాడ్‌ ‌మా, మలేషియాలోని మల్టీమీడియా  యూనివర్శిటీ నుండి డా.ఎన్జి కోక్‌ ‌వై, బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి యూనివర్శిటీ నుంచి డా.ఫిరోజ్‌ అహ్మద్‌లు కీ-నోట్‌ ‌స్పీకర్స్‌గా వర్చువల్‌ (ఆన్‌లైన్‌) ‌విధానంలో పాల్గొన్నారు.  

Kakinada

2020-12-28 21:42:13

ఏయూ సైకాలజీలో గంట్ల శ్రీనుబాబు టాపర్..

ఆంధ్రాయూనివర్శిటీ సైకాలజీ విభాగంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబు ఫైనల్ సెమిస్టర్ లో టాపర్ (8.50)గా నిలిచారు. ఓవరాల్ ఏయూ ఫస్ట్ గా రాపాక సుష్మ(8.10) నిలిచారు. ఓవరాల్ గా ఏయూ సెకెండ్ టాపర్ గా శ్రీనుబాబు(7.83) నిలవగా, మహిళల విభాగంలో ఎ.నాగశ్రీ(7.83) సెకెండ్ టాపర్ గా నిలిచారు. ఈ మేరకు ఆంధ్రాయూనివర్శిటీ 2018-20 బ్యాచ్ సైకాలజీ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో టాపర్ గా నివడంతో సహచర జర్నలిస్టులు గంట్ల శ్రీనుబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇదే సైకాలజీలో పీహెచ్డీ పూర్తిచేసి నిరుపేదలకు మానసిక సమస్యలపై సేవలు అందించాలనేది తన చిరకాల లక్ష్యమని చెప్పారు.ప్రభుత్వం కూడా ఇప్పుడిపుడే సైకాలజి చదివిన వారికి మంచి ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందున రానున్న రోజుల్లో ఏయూ సైకాలజీకి మంచి గుర్తింపు ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సైకాలజీ విభాగం అధిపతి  ఆచార్య ఎంవిఆర్ రాజు, ఇతర అద్యపక బ్రుందం సైకాలజీలో మంచి ప్రతిభ చూపిన విద్యార్ధులను అభినందించారు. 

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-02 21:54:18

గణితశాస్త్ర విభాగాధిపతిగా నానాజిరావు

ఆంధ్రవిశ్వవిద్యాలయం గణితశాస్త్ర విభాగాధిపతిగా ఆచార్య జి.నానాజి రావు నియమితులయ్యారు. బుధవారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి నియామక ఉత్తర్వులను నానాజి రావు స్వీకరించారు. గురువారం ఉదయం ఆచార్య నానాజిరావు విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభాగం , విద్యార్ధుల నైపుణ్యాభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని అన్నారు. అనంతరం ఆయన వీసిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Andhra University

2020-08-19 20:47:08

ఏయూ రెక్టార్‌గా ఆచార్య కె.సమత బాధ్యతల స్వీకరణ

ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్‌గా  భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు కె.సమత ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. శనివారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.తనకు రెక్టార్‌గా ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. అనంతరం ఆచార్య కె.సమత వర్సిటీలోని సి.ఆర్‌ ‌రెడ్డి, డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌, ‌వై.ఎస్‌ ‌రాజశేఖరరెడ్డి, మహాత్మ జ్యోతిరావుఫూలే,బాబూజగ్జీవన్‌రామ్‌ ‌విగ్రహాలకు పూలమాలవేసి నివాళిఅర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్‌, ఆటా అద్యక్షులు ఆచార్య జాలాదిరవి, ఏయూఇయూ అద్యక్షుడు జి.రవికుమార్‌, అకడమిక్‌ ‌డీన్‌ ఆచార్య కె.వెంకట రావు, ఆచార్య పి.అర్జున్‌, ఆచార్య టి.షారోన్‌ ‌రాజు, ఆచార్య వి.సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

2020-07-25 21:15:37