1 ENS Live Breaking News

వై 20 సభలపై థీమ్ లోగో, వైబ్ సైట్ ఆవిష్కరణ

భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న వై20 సమ్మిట్ ఇండియా శిఖరాగ్ర సమావేశాల కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆవిష్కరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం, మెరుగైన రేపటి కోసం ఆలోచనలు చర్చించడం, కార్యాచరణ కోసం ప్రణాళిక రూపొందించే అంశంపై ప్రధానంగా భారత్ దృష్టి సారించనుంది. అంతేకాకుండారాబోయే 8 నెలల పాటు  భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వివిధ అంశాలపై  చర్చలు, సెమినార్ల నిర్వహించనుంది.

New Delhi

2023-01-05 13:42:20

భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీఅయిన సత్యానాదేళ్ల

భారత ప్రధాని నరేంద్రమోదీ మైక్రోసాఫ్ట్  కార్పొరేశన్  చైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ళ తో గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగాభారత్ లో సాంకేతిక విజ్ఞానం నాయకత్వ వృద్ధిలో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు మైక్కోసాఫ్ట్ వంటి టెక్నాలజీ సంస్థల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. కాగా వీరిద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అదే సమయంలో సత్యానాదెళ్లతో భేటీ కావడం ఆనందంగా వుందంటూ ప్రధాని ఆయనకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ లో పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ పెట్టనుందనే నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశం అవుతోంది.

New Delhi

2023-01-05 13:15:30

జాతీయపార్టీ గుర్తింపు దిశగా వైఎస్సా్ర్సీపీ కీలక అడుగులు

వైఎస్సార్సీపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుమారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్ధులను నిలబెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కి ఆనుకొని ఉన్నరాష్ట్రాలే కావడం విశేషం. దానికోసం అధికారంలో వున్న పార్టీకి వచ్చే రాజ్యసభ సీట్లన్నీ అయా రాష్ట్రాల్లోని పలుకుబడి ఉన్న రాజకీయ నేతలకు కట్టబెట్టి, పార్టీ తరపున అభ్యర్ధులను బరిలో నిలబెట్టడం కోసి ఇప్పటికే ఆయారాష్ట్రాల్లోని ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఒక కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం(ఈ నిబంధనను కాలానుగుణంగా మారుస్తున్నారు)  చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. 

ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను 
గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం నాలుగు  రాష్ట్రాల్లో వైఎస్సార్సీపీ బలమైన అభ్యర్ధులను నిలబెట్టాల్సి వుంది..!



New Delhi

2023-01-05 07:26:06

ఇక ఆధార్ కార్డు నవీకరణ మరింత సులువు

ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం చేసింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు  భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆధార్ అడ్రస్ అప్ డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ తమపేరు మీద ధ్రువీకరణపత్రం సమర్పించేవారు. కాగా ఆధార్ లో అడ్రస్ మార్చుకునేందుకు కుటుంబ పెద్ద పేరుతో ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ అది సరైంది కాకుంటే ఉడాయ్ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద స్వీయ ధ్రువీకరణ సమర్పించాలి. ఆధార్ అప్డేటేషన్ లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నూతన మార్పులను చేపట్టింది.

Delhi

2023-01-04 04:22:48

బీఆర్ఎస్ కి జాతీయ హోదా కోసం విశ్వప్రయత్నాలు

భారతీయ రాష్ట్ర సమితి 2024 నాటికే జాతీయపార్టీ హోదా తెచ్చుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వే స్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో తమపార్టీని విస్త్రుతం చేసేందుకు రాష్ట్రాధ్యక్షుడిని నిలబెట్టడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా బరిలోకి దించే ప్రయత్నాలు ఇప్పటి నుంచే  ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరతగా బీఆర్ఎస్ కి జాతీయ పార్టీ హోదావస్తే బీజేపీని ఢీకొట్టాలన్నది బీఆర్ఎస్ ఎత్తుగడగా కనిపిస్తుంది. కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం(ఈ నిబంధనను కాలానుగుణంగా మారుస్తున్నారు)  

చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రాష్ట్రాల్లో భీఆర్ ఎస్ ను బలంగా నిలబెట్టాల్సి వుంది..!

Delhi

2023-01-03 03:53:14

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు 4% పెరిగిన డీఏ

తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం 34% ఉన్న డీఏను ప్రభుత్వం 38%కి పెంచుతున్నట్టు తెలియజేశారు. దీనితో ఉద్యోగ, పెన్షనర్లలో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ పెంపుతో ప్రభుత్వంపై దాదాపు 
రూ.2359 కోట్ల అదనపు భారం పడుతుందన్న సీఎం ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 16 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షను దారులు ఉండగా నిలవాలని కోరారు. 

Chennai

2023-01-03 02:13:04

భారత్ లో 48,624 ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియాలో భారీగా అకౌంట్లను సస్పెండ్ చేసింది. చాలా ఖాతాలు న్యూడిటీ(అస్లీలత), పిల్లల లైంగిక దోపిడీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయంటూ 48,624 ట్విట్టర్ ఖాతాలపై యాజమాన్యం వేటు వేసింది. ఈ అకౌంట్లు అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య కాలంలో ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించినట్లుగా వివరణ ఇచ్చింది. వినియోగదారుల నుంచి సదరు ఖాతాలతపై 755 ఫిర్యాదులు అందాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అంతేకాకుండా ప్రజామోదం లేని ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

New Delhi

2023-01-02 09:17:27

నోట్ల రద్దు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నరేంద్రమోడీ ప్రభుత్వం 2016లో నోట్లు రద్దు విషయంలో దాఖలైన 58 పిటీషన్లపై సుప్రీంకోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 26(2) ప్రకారం నోట్లను రద్దు చేసే అధికారం ఉందని, దానిని కోర్టు సమర్ధిస్తున్నదని పేర్కొంది. దీనితో నోట్ల రద్దు వ్యతిరేకం గా దాఖలైన  పిటీషన్లకు సుదీర్ఘ కాలం తరువాత ఉపయోగం లేకుండా పోయింది. గతంలో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరగడం తోపాటు, ప్రభుత్వంపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నేడు సుప్రీకోర్టు తీర్పుతో నోట్లు రద్దు మళ్లీ జరగవచ్చుననే చర్చకు ఊతమొచ్చింది.

New Delhi

2023-01-02 06:14:46

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్ల మెల్లగా పుంజుకుంటున్నాయి. ఆదివారం 2,748 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 7 పాజిటివ్ కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనించింది.. ఇవాళ 9 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 99.50 శాతంగా ఉంది. ఈరోజు మళ్లీ హైదరాబాద్ లో 6, మేడ్చల్ జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటిన్ ద్వారా తెలియజేయజేసింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.

Hyderabad

2023-01-01 16:43:05

తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు

జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాలను టిటిడి ప్రకటించింది.  జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, 2న తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కో టి. శ్రీవారి చక్రస్నానం, 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం, 7 నుండి 13వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం, 14న భోగిపండుగ, 15న తిరుమల శ్రీవారి సన్నిధి లో అధ్యయనోత్సవం సమాప్తి. మకర సంక్రాంతి,16న కనుమ పండుగ. తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేంచేపు. శ్రీ గోదాపరిణ యోత్స వం,26న భారత గణతంత్ర దినోత్సవం. వసంత పంచమి, జనవరి 28న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.

Tirumala

2022-12-31 11:53:22

తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం

తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు కెఆర్‌.నారాయణమూర్తి, సతీమణి కెఎన్‌.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్‌ఏసి)  అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందించారు. దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు. వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి.  కాగా, ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 
కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, ఆలయ డెప్యూటీ ఈవో  రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-12-29 10:58:31

తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న సుప్రీంకోర్టు సీజే

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ గురువారం ఉద‌యం తొలిసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి చైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్ఏసి)  అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు కలిసి  సంప్రదాయ బద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారి మహత్యాన్ని, ఆలయ చరిత్రను అర్చకులు వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇత‌ర ప్రముఖులకు తీర్థప్రసాదాలు,  డ్రైఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీవారి చిత్రపటం, 2023 టిటిడి క్యాలెండర్‌,  డైరీలను చైర్మన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు, విజివోలు బాలిరెడ్డి,  గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-12-29 10:36:01

టిటిడికి రూ.7O లక్షల ఆస్తి విరాళం

తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సోమవారం సుమారు రూ.70 లక్షల విలువైన ఆస్తిని టిటిడికి విరాళంగా అందించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలూకా, కొడివలస గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్సు ఎన్.కె.నెమావతి కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల భవనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటి విలువ రూ.70 లక్షలు. ఈ మేరకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని టిటిడి ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి  మల్లికార్జునకు ఇంటి పత్రాలు, తాళాలను అందజేశారు.

Tirumala

2022-12-26 11:22:29

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోనే ప్రప్రధమంగా ఏపీలోని 26 జిల్లాలో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకేసారి లక్షా 20వేల మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించింది. సచివాలయాల్లో ప్రజలకు అందే సేవలను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణా కేంద్రం) పాఠాల్లో వివరించారు. తద్వారా ఒకేసారి ఐఏఎస్ అధికారులకు శిక్షణలో విషయం తెలిసింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థను దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు వచ్చి అధ్యయనం చేశారు. సచివాలయాలతోపాటు రైతుభరోసా కేంద్రాలు, అగ్రిల్యాబ్ లు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును తెచ్చుకున్నాయి.

Mussoorie

2022-12-25 07:34:02

తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి ట్రస్టు కౌంటర్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో  ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  శ్రీవాణి ట్రస్టుకు  రూ.10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ.500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీచేసేవారని చెప్పారు. దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.

 ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 ఎయిర్పోర్ట్ ,తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో  వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు . తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

         టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డీజీఎం టెర్మినల్  చంద్రకాంత్,  కమర్షియల్ మేనేజర్  అవినాష్ టెర్మినల్ మేనేజర్  మణిదీప్, టీటీడీ ఐటి విభాగం జి ఎం  సందీప్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు మేనేజర్  శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Renigunta

2022-12-15 09:49:51