1 ENS Live Breaking News

ఒకే విద్యార్ధి..ఒక ఉపాధ్యాయుడు..ఒక పాఠశాల

ఒక విద్యార్ధి..ఒక ఉపాధ్యాయుడు..ఒక పాఠశాల ఏంటి కేప్షన్ బాగుంది అనుకుంటున్నారా..అవునండి ఇది ముమ్మాటికీ నిజం..మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో ఓ 
ప్రభుత్వ పాఠశాల ఒక్క విద్యార్థి కోసమే అక్కడి ప్రభుత్వం నడుపుతోంది. 150 మంది వరకూ నివసిస్తున్న గణేశ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి 
వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌లో కార్తిక్‌ షెగ్‌కర్‌ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. అతని కోసం మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు 
కల్పిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కిశోర్‌ అనే టీచర్‌ రోజూ 12 కి.మీ దూరం ప్రయాణించి బాలుడికి పాఠాలు నేర్పిస్తున్నాడు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో 
రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను అనుసంధానిస్తున్న తరుణంలో ఒక విద్యార్ధికోసం ఏకంగా పాఠశాలను నడిపిస్తున్న అంశం ఇపుడు ఇపుడు దేశవ్యాప్తంగా 
చర్చనీయాంశం అవుతుంది. అంతే కాదు ఏపీలోనూ ఈ విషయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఒక్క విద్యార్ధికైనా 
చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడిని నియమించి పాఠాలు చెప్పిస్తుందనడానికి మహారాష్ట్రలోని గణేష్ పూర్ ప్రభుత్వపాఠశాల నిదర్శనం. 

Ganeshpuri

2023-01-23 04:40:03

ఏపీలో సీనియర్ ఐఏఎస్ లకు త్వరలోనే బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ లను బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవలే తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ ఏపీకి కేటాయింపు జరగడం, 
ఆయను ప్రభుత్వశాఖను కట్టబెట్టడంతోపాటు, సుదీర్ఘకాలంగా వివిధ శాఖల్లో ఉన్న ఐఏఎస్ లను కూడా స్థానచలనం కల్పించడం, మరికొందరికి పదోన్నతులు 
కల్పించాలని చూస్తున్నారట. ఉమ్మడి జిల్లాల్లోని కొందరు కలెక్టర్లకు కూడా స్థాన చలనం కలిగే అవకాశం వుందని చెబుతున్నారు. అదే సమయంలో వివిధ 
ప్రభుత్వశాఖల్లో కమిషనర్లుగా ఉన్న వారికి కూడా శాఖలను మార్పు చేయడం ద్వారా పరిపాలనను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం సమాలోచనలు 
చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వానికి విధేయులుగా వున్నవారికి ఈసారి బదిలీల్లో కూడా ముఖ్యమైన శాఖలు దక్కే అవకాశాలే అధికంగా ఉన్నట్టు తాజా 
పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Tadepalli

2023-01-22 16:29:05

టిటిడి ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళం

తెలంగాణకు చెందిన నితిన్ సాయి ఇండియా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళంగా అందించింది. సంస్థ అధినేత, మాజీ ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ తరపున ఆయన కుమారుడు నితిన్ సాయి తిరుమలలో డోనార్ సెల్ ఇన్ఛార్జి డెప్యూటీ ఈఓ  సెల్వంకు విరాళం డీడీలను అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, బర్డ్, సర్వశ్రేయ, పురాతన ఆలయాల పరిరక్షణ ట్రస్టు‌, కాటేజీ నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, ప్రచారం చేసేందుకు టీటీడీ చేస్తున్న కృషిని దాత కొనియాడారు.

Tirumala

2023-01-12 16:48:48

వందే భారత్ రైలు.. అసలు మామూలుగా లేదుగా

భారత రైల్వే కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అనేక ప్రత్యేకతలను కలిగివున్నాయి. సాధారణ రైలుప్రయాణం చేసిన వారికి ఈ రైలు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుంది. ఈ రైలు భోగీలను, కోచ్ లను దేశంలోని చెన్నై కోచ్ ఫ్యాక్టీరీలోనే తయారు చేస్తున్నారు. ఈ రైలుకి మొత్తం 16 బోగీలు ఉండగా, అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉంది. 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఈ రైలులో వుంది. అవసరాన్ని బట్టి కోచ్ లు పెంచే సౌలభ్యాన్ని భారత రైల్వే పరిశీలస్తున్నది.  కోచ్‌ పొడవు 23 మీటర్లు. ప్రత్యేకంగా స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. పుష్ బ్యాక్ సీట్ల వలన అదే సీటులో పడుకునే సౌకర్యం కూడా వుంది. జీపీఎస్‌ ఆధారిత ప్రయాణికుల సమాచారం, బయోవాక్యూమ్‌ మరుగుదొడ్లు ఉన్నాయి. మొత్తానికి ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణం ఖరీదు కాస్త ఎక్కువే అయినా నిత్యం విమానాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణీకులు ఈ తరహా రైళ్లను అధికంగా ఇష్టపడటానికి అవకాశం వుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా 52 మంది కూర్చునే ఫస్ట్ క్లాస్ కోచ్‌లు మొత్తం రైలులో రెండింటిని ఏర్పాటు చేశారు. సాధారణ ఫస్ట్ క్లాస్ రైలుతో పోల్చుకుంటే వందేభారత్ రైలు అత్యాధునిక వసతులతో వీటిని తయారు చేయడంతో వీటిలో ప్రయాణానికి డిమాండ్ అధికంగా వుంటుందని కూడా రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

New Delhi

2023-01-12 12:12:32

జనవరి 13న టిటిడి డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

టిటిడి డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జనవరి 13వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకు భక్తులు  0877-2263261 సంప్రదించవలసి వుంటుంది. ఈ కార్యక్రమాన్ని టిటిడి ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది. డయల్ యువర్ కార్యక్రమం ద్వారా దేవస్థాన అభివృద్ధికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిం దిగా ఈఓ కోరుతున్నారు.

Tirumala

2023-01-11 11:49:01

నేటికీ పీఐబీ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కి స్థానంలేదు

భారత ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా నిర్వహణ చేపట్టే పిఐబి(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెబ్ సైట్ లో నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చోటు లభించలేదు. కాదు కాదు అవకాశం ఉన్నా దానిని రాష్ట్రాన్ని చేర్చుకోలేకపో తున్నది. విజయవాడలో పీఐబీ కార్యాలయం ప్రారంభించినా..అధికారికంగా పీఐబీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం చేర్చలేదు. ఏపీని విభజన చేసినతరువాత, కేంద్ర ప్రభుత్వశాఖలకు చెందిన కార్యాలయాలను ఏపీలో కూడా పెట్టాల్సి వుంది. అయితే ఈ విషయంలో ఇటు రాష్ట్రప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో నేటికీ పీఐబీ వెబ్ సైట్ లో ఏపీకి చోటుదక్కలేదు. అంతేకాదు ఇటురాష్ట్రంలోనూ సమాచారశాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్(అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం మీడియాకు తెలియజేసే విధంగా..అంటే పీఐబీ తరహాలో)ను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. అన్ని ప్రభుత్వ శాఖలపైనా దృష్టిసారించే రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రచారాలకోసం మాత్రం పూర్తిస్థాయి వెబ్ సైట్ నేటికీ నిర్మాణం చేపకట్టక పోవడం విశేషం..!

New Delhi

2023-01-10 12:10:59

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

జనవరి 28వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహ నం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహన సేవ నిర్వహిస్తారు.

 కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, సామవేద పుష్పాంజలి, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.జనవరి 24న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 24వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

Tiruchanur

2023-01-10 11:28:21

10న వర్చువల్ సేవా టికెట్ల ద‌ర్శ‌న కోటావిడుద‌ల‌

తిరుమలలో జనవరి 12 నుంచి జరగనున్న కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్  వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు,సంబంధిత ద‌ర్శ‌న  కోటాను జనవరి 10వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నందని టిటిడి సోమవారం మీడియా ద్వారా తెలియజేసింది. కాగా శ్రీవారి ఆలయంలో బాలాలయం  దృష్ట్యా ఫిబ్రవరి 22 -28 వరకు ఆన్ లైన్ వర్చువల్ సేవ, అనుబంధ దర్శన టికెట్ల కోట అందుబాటులో ఉండదు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌న టికెట్లను బుక్ చేసుకోవాల‌ని కోర‌డమైన‌ది.

Tirumala

2023-01-09 13:00:09

టిటిడికి రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ విరాళం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ ను శనివారం టిటిడికి విరాళంగా అందజేసిం ది.  ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్  దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టిటిడి ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ ఆసు పత్రిలో ఈ అంబులెన్స్ ను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో  నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, డిఐ జానకిరామిరెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-07 11:28:42

జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. ఈ మేరకు మీడియాకి టిటిడి ప్రకటన విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్ధం స్వామివారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. సంబంధిత గుర్తింపు పత్రాలు, వివరాలు జోడించి ప్రత్యేక దర్శన టిక్కట్లును కొనుగోలుచేసుకోవచ్చునని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని మీడియాకివిడుదల చేసిన ప్రకటనలో కోరింది.

Tirumala

2023-01-06 16:28:29

యాగానికి హర్యానా సీఎంకు శారదాపీఠం ఆహ్వానం

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి శుక్రవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసారు. ఢిల్లీ శివారు గుర్గావ్ లో పీడబ్ల్యూడీ బంగ్లాకు వెళ్ళి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగంనిర్వహిస్తు న్నామని తెలిపారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు ఆవాహనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని అన్నారు. అలాగే హర్యానాలో కురుక్షేత్ర వద్ద గుంతిధామ్ లో ఫిబ్రవరి 11 నుండి 16 రోజులపాటు లక్ష చండీ యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో సాగే యాగంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, యాగ నిర్వహణకు సహకరించాలని హర్యానా సీఎం ఖట్టర్ ను కోరారు.

Haryana

2023-01-06 09:22:19

ఏపీకి అప్పుఇస్తే ఇకఅంతే సంగతులు తిరిగి రావు

ఆంధ్రప్రదేశ్ కి అప్పు ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీలో అప్పులు భారీగా పెరిగిపోయాయని. రాష్ట్రం చెల్లించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. నాబార్డ్, విదేశీ రుణాలు, ఎస్పీవీ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు రూ.9.03 లక్షల కోట్లకు చేరిందని, ఇది జీడీపీలో 75శాతమని అన్నారు. పరిమితిమి మించి అప్పులు చేసినందున, వాటిని సర్దుబాటు చేసేవరకు కొత్త అప్పులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వం చేసిన మొత్తం అంతా అభివృద్ధికి కాకుండా నగదు బదిలీలకే వినియోగిస్తుందన్నారు.భారీగా అప్పులున్న రాష్ట్రాలకు అప్పులు ఇవ్వకూడదని పేర్కొన్నారు.

New Delhi

2023-01-06 02:38:51

వారణాసి రైల్వే స్టేషన్ FSSAI5-స్టార్ రేటింగ్

వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ FSSAI ద్వారా 5-స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్‌తో పాటు ‘ఈట్ రైట్ స్టేషన్’ గుర్తింపు పొందింది. ప్రయాణీకులకు సురక్షితమైన ,ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో బెంచ్‌మార్క్‌లను సెట్ చేసే రైల్వే స్టేషన్‌లకు 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ అందించారు. కాగా ఇప్పటి వరకూ స్టార్ సర్టిఫికేషన్ ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ (ఢిల్లీ), ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై), ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, (ముంబై), వడోదర రైల్వే స్టేషన్, చండీగఢ్ రైల్వే స్టేషన్, భోపాల్ రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఇపుడు వాటి సరసన వారణాసి రైల్వే స్టేషన్ కూడా చేరింది.

Varanasi

2023-01-05 14:58:11

దేశవ్యాప్తంగా 188 కోవిడ్-19 కేసులు నమోదు

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాను ఇప్పటివరకూ మొత్తం 220.12 కోట్ల డోసులు ( 95.13 కోట్ల రెండో డోసులు + 22.42 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) పంపిణీ చేశారు. గత 24 గంటల్లో 61,828 డోసులు అందించగా.., దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,554 నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01% మాత్రమే. ప్రస్తుత రికవరీ రేటు 98.80%గా ఉంది. గత 24 గంటల్లో 201 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,46,055 కు పెరిగింది. 188 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.10%నా మోదు అవుతోంది. గత 24 గంటల్లో చేసిన 1,93,051 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.15 కోట్ల పరీక్షలు చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులిటిన్ ద్వారా ప్రకటించింది.   

Delhi

2023-01-05 13:55:57