స్మార్ట్ ఫోన్ అమ్మకాలు, టెక్నాలజీలో విప్లవం మొదలైంది... రెడ్‌మీకి పోటీగా అమ్మకాల్లో దూసుకెళ్తున్న మరో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ బలమైన పోటీ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది..ఇప్పటికే అమ్మకాల్లో భారత్‌లో ఇది మూడో స్థానంలో ఉంది. తాజాగా ఈ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపె ట్టింది. ఫాస్ట్ ఛార్జింగ్, ఉన్నతమైన ఫొటోగ్రఫీ అనుభూతిని అందిచడమే లక్ష్యంగా రియల్‌మీ 7, 7ప్రో పేరుతో ఈ ఫోన్లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు ఇలా ప్రత్యర్ధి స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో సూపర్ డార్ట్ ఫాస్ట్ టెక్నాలజీతో 65 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడంతో పాటు అర గంటలో 100% ఛార్జింగ్ అవడం దీనిలో ప్రత్యేకత.
ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుండగా, స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే తోపాటు ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనకవైపున నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. తొలిసారిగా రియల్‌మీలో ఏఐ కలర్ పొట్రేయిట్ ఫీచర్‌ను 7ప్రోలో ఉపయోగించింది. దీంతో ఫొటో/వీడియోలలో మనకు కావాల్సిన ప్రదేశాన్ని మాత్రం కలర్‌లో, విగిలిన భాగాన్ని గ్రే కలర్‌లోకి మార్చుకోవచ్చు. వెనకవైపున సెకండ్ జనరేషన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో పాటు 8ఎంపీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు 32 మెగాపిక్సెల్ హై రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా హైలెట్ గా వుంది. ఇందులో ప్రోట్రెయిట్ బోఖే, హెచ్‌డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, నైట్‌స్కేప్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి మనకి ఎలా కావాలంటే అలా సెల్ఫీ తీసుకోవచ్చు. రియల్‌మీ 7 ప్రో 6జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి ధర రూ. 19,999గాను, 8జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 21,999గా సంస్థ నిర్ణయించింది. మిర్రర్ బ్లూ, మిర్రర్ వైట్ రంగుల్లో ఇది లభించనుంది. సెప్టెంబరు 14 నుంచి రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.
ఇక రియల్‌మీ 7 విషయానికొస్తే..ఇది కూడా అర గంటలో 100% ఛార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ తో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనకవైపున 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఇస్తున్నారు. సెల్ఫీల కోసం ముందు 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ధరలు చూస్తే.. రియల్‌మీ 7 మోడల్ 6జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్ ధర రూ.14,999, 8జీబీ ర్యామ్/128జీబీ ధర రూ. 16,999. సెప్టెంబరు 10 నుంచి రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. మిస్ట్ బ్లూ, మిస్ట్ వైట్ రంగుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తెలంగాణలోని ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో దశల వారిగా మెట్రోను నడపా లని హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. ఈ క్రమంలో సర్వీసులను మూడు ఫేజ్‌లుగా విభజించారు. 7న మొదటి ఫేజ్‌లో భాగంగా మియపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ఓపెన్‌లో ఉండగా, ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. ఇక 8వ తేదీన సెకండ్ ఫేజ్‌లో భాగంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. 9వ తేదీన థర్డ్ ఫేజ్ అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు నడవనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది. ఆ లిస్ట్‌లో గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్ గూడలో మెట్రో సర్వీసులు బంద్ కానున్నాయి. మెట్రో రైళ్లు తిరిగే ప్రాంతాలను నాలుగు రోజులు ముందే ప్రభుత్వం ప్రకటించడంతో ప్రయాణీకులు క్లారిటీ వచ్చింది.
కోర్టుకేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదరయ్యే సంఘటన పరం పర కొనసాగుతూనే వుంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కె దురైంది. ఆంగ్లమాధ్యం అంశంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాగా ఆంగ్ల మాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశా లపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25 వాయిదా వేసింది. కేవియట్ పిటిషన్ వేసినవారు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కారు సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఒక రకంగా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో కూడా కార్పోరేట్ స్థాయి ఆంగ్లభోధన ప్రవేశపెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ అంశం గిట్టని వారు కోర్టులకు వెళ్లడంతో ప్రతీసారి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది...
భారత దేశం ప్రపంచంలో ఒక సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగమార్గాన్ని నిర్మించింది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి-లే హైవేపై 8.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. దీనికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. అంతేకాదు ఇటీవల వాహనాల ట్రైల్ రన్ కూడా చేపట్టారు. ఈ అతిపెద్ద సొరంగ మార్గం నిర్మించడానికి దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టింది. సెప్టెంబరు నెలాఖరున దీనిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనేక పోరాటాలు చేసిన తరువాత సొరంగం ఇప్పుడు పూర్తయిందని నివేదికలు సూచిస్తు న్నాయి. అంతేకాదు ఈ సొరంగ మార్గం గూండా సైనిక దళాలను తక్కువ సమయంలో పంపడానికీ, తీసుకు రావడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం ప్రభుత్వం దీనిని నిర్మించిందని సమాచారం. ఈ సొరంగ మార్గం ద్వారా 474 కిలోమీటర్లు ప్రయాణం కాస్తా 46 కిలోమీటర్లలో చేయడానికి వీలుపడుతుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 3200 కోట్ల రూపాయాలను కేంద్రం ఖర్చు చేసింది. బీజీపీ ప్రభుత్వంలో అత్యున్నత, అతి పొడవైన సొరంగ రోడ్డు మార్గంగా అటల్ మార్గ్ చరిత్ర స్రుష్టించింది.
పబ్జీ గేమ్‌పై కేంద్రం నిషేధం విధించింది. దీనితోపాటు మరికొన్ని చైనా యాప్స్‌పై కూడా కేంద్రం నిషేధం విధించింది. మొత్తం 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం పేర్కొన్న కేంద్రం కుటుంబాలను ఆర్ధికంగా చిన్నాబిన్నం చేస్తున్న మొబైల్ గేమ్స్ పై నిషేధం విధించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఈ మొబైల్స్ పై సైబర్ క్రైమ్ కేసులు భారీగా నమోదు కావడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల దంపతులు విడిపోవడం, కొన్నిచోట్ల, యువకులు ఈ మొబైల్ గేమ్స్ బానిలవడం తదితర కారణాలపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరసనను ద్రుష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పబ్జీ గేమ్ నిషేధంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కేంద్రప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీకి తన హర్షధ్వానాలతో తమ అభిమానాన్ని చెబుతున్నారు. పబ్జీ గేమ్ తోపాటు మరో 118 మొబైల్ యాప్స్, చైనా యాప్స్ ను నిషేధించి చైనాకి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది...
ఢిల్లీలోని లోక్‌సభ అనువాద విభాగంలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో లోక్‌సభ సచివాలయం ముందస్తు పదవీ విరమణ చేయిం చింది. వీరిద్దరూ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడంవల్లే ఈ చర్య తీసుకున్నట్లుగా భావించి ఈ నిర్ణయిం తీసుకుంది. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులను ఫండమెంటల్ రూల్ 56 కింద ముందస్తు పదవీ విరమణ చేయించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ గత 28న ఆఫీస్ మెమోరాండం జారీచేసిన రెండురోజులకే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ అనువాద విభాగంలో జాయింట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ప్రణవ్‌కుమార్, కావేరి జైస్వాల్ల్‌తో ఆగస్టు 31న ముందస్తు పదవీ విరమణ చేయించినట్లు లోక్‌సభ సచివాలయం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరికి నోటీసుకు బదులు మూడునెలల జీతభత్యాలు ఇచ్చి పంపించేశారు. ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా వీరు బయట ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలు నడుపుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిట్‌ల నిర్వహణ, తోటి సిబ్బంది నుంచి డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం లాంటి ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అనంతరమే ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌సభ వర్గాలు పేర్కొనడం గమనార్హం...
మిషన్ మోడ్‌లో, సరుకు రవాణాను ముందుకు తీసుకుపోవడంలో భారతీయ రైల్వే ముఖ్యమైన మైలురాయిని అధిగమించిందని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది ఆగస్టునెల సరుకు రవాణా లోడింగ్ కంటే కూడా.. ఈ ఏడాది (2020) ఆగస్టు మాసంలో రైల్వే శాఖ అధిక సరుకు రవాణా లోడింగ్‌ను చేపట్టిందని పేర్కొంది. 2020 ఆగస్టు నెలలో భారత రైల్వే సరుకు రవాణా లోడింగ్ 94.33 మిలియన్ టన్నులు కాగా, గత ఏడాది ఇదే నెలలో సరుకు రవాణా లోడింగ్ 91.02 మిలియన్ టన్నులు చేపట్టిందని తెలియజేసిన రైల్వే ఈ ఏడాది ఆగస్టులో 3.31 మిలియన్ టన్నులు అధికంగా భారతీయ రైల్వే సరుకు రవాణా లోడింగ్‌ను చేపట్టిందని పేర్కొంది. 2020 ఆగస్టు నెలలో భారత రైల్వే సరుకు రవాణా లోడింగ్ 94.33 మిలియన్ టన్నులు కాగా .. ఇందులో బొగ్గు రవాణా 40.49 మిలియన్ టన్నులుగాను.. ఇనుప ఖనిజం లోడింగ్ 12.46 మిలియన్ టన్నులుగాను.. ఆహార ధాన్యాలు 6.24 మిలియన్ టన్నులుగాను.. ఎరువులు 5.32 మిలియన్ టన్నులుగాను, సిమెంట్ (క్లింకర్ కాకుండా) 4.63 మిలియన్ టన్నులు గాను.. మినరల్ ఆయిల్స్ 3.2 మిలియన్ టన్నులుగాను నిలిచాయని తెలియజేసింది. ఇదంతా ప్రభుత్వం కోవిడ్19 సూచనలు పాటిస్తూనే చేపట్టిందని పేర్కొంది...
కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న కోవిడ్ నియంత్రణ కార్యక్రమాలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నందువల్ల కోవిడ్ బాధితులను తొలి దశలోనే గుర్తించి వారికి సత్వరం చికిత్స అందించడానికి వీలు కలుగుతోంది. దీనితో దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం పరీక్షలు ఈరోజుకు 4.3 కోట్ల దాటాయి. (4,33,24,834) ఇందులో 1,22,66,514 పరీక్షలు గత రెండు వారాలలోనే నిర్వహించినవే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరీక్షల సామర్ద్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. గరిష్ఠస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తూ మొత్తం పరీక్షల సంఖ్య పెరిగేందుకుతోడ్పడుతున్న రాష్ట్రాలలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల పరీక్షలు, మొత్తం పరీక్షలలో 34 శాతం వరకు ఉ న్నాయి.
దేశంలో రోజుకు నిర్వహించే పరీక్షల సామర్ధ్యం 10 లక్షలు దాటింది. గత 24 గంటలలో 10,16,920 పరీక్షలు నిర్వహించారు. వారపు పరీక్షల సగటు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారపు సగటుపరీక్షలు జనవరి 2020 మొదటి వారం నుంచి ఇప్పటి వరకు నాలుగు రెట్లు పెరిగాయి. పరీక్షల నిర్ధారణ ప్రయోగశాలల నెట్‌వర్కును విస్తరించడం, దేశవ్యాప్తంగా సులభతర పరీక్షలకు ఏర్పాట్లు చేయడం వల్ల పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి పది లక్షలకు పరీక్షల సంఖ్య (టిపిఎం) గణనీయంగా పెరిగి 31,394 కుచేరింది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే మెరుగైన టిపిఎం కలిగి ఉన్నాయి. గోవా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లు రోజువారీ పరీక్షలను గరిష్ఠస్థాయిలో నిర్వహిస్తున్నాయి.
భారత ఎన్నికల సంఘం కొత్త కమిషనర్‌గా రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన పని చేస్తారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ తన 36 ఏళ్ల ఉద్యోగ జీవితంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సామాజిక, పర్యావరణం, అడవులు, మానవ వనరులు, ఆర్థికం, బ్యాంకింగ్ రంగాల్లో విస్తృత అను భవం ఉంది. సాంకేతికత వినియోగంలో, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకతకు, సేవలను నేరుగా ప్రజలకు చేర్చడంలో నిబద్ధతతో పని చేశారు. ఆర్థిక శాఖ కార్య దర్శి గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులై ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు సేవ లు అందించారు. రాజీవ్ కుమార్‌కు పర్వతారోహణంపై మక్కువ ఎక్కువ కాగా, భారతీయ శాస్త్రీయ, భక్తి సంగీతం అంటే బాగా ఇష్టం...
బ్యాంకు రుణాలపై మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయ స్థానం ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభు త్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని కోర్టుకి వివరించారు. మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగి స్తామని చెప్పారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. చెల్లించని ఈఎంఐలపై కూడా ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేస్తూ ఈ కేసు ను బుధవారానికి వాయిదా వేసింది. అయితే కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా.. సాధారణ , మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగుల జీవితాలు తలకిందు లయ్యాయి. వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో ఎవరూ లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయిం తీసుకుంది. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో బడుగు వర్గాలకు ఉపశమనం కలిగినట్టు అయ్యింది...
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలకు 15వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదు గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు సాగుతున్నాయన్న సీపి మస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడని, మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు.కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఈ రోజు అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంటుం దన్నారు. భక్తులు అధిక సంఖ్యలో బయటకు రాకుండా, ఉత్సవ సమితి నాయకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనాలు జరుపుకోవాలని సిపి సూచించారు.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ.. భారత ప్రభుత్వపు రక్షణ రంగంలో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడి) సముపార్జన విభాగం కీలక ఒప్పందాలను కుదుర్చుకుందని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చెప్పారు. భారత సైన్యం యొక్క ఫిరంగి దళ రెజిమెంట్లకు 'సిక్స్ పినాకా రెజిమెంట్ల' సరఫరా నిమిత్తం ఎంఓడీ దాదాపుగా రూ.2580 కోట్ల ఒప్పందాల్ని కుదుర్చుకుంది. ఈ 'సిక్స్ పినాకా రెజిమెంట్ల'లో 114 ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ & పొజిషనింగ్ సిస్టమ్ (ఏజీఏపీఎస్) కలిగిన లాంచర్లు మరియు 45 కమాండ్ పోస్టులను మెస్సర్స్ టీపీసీఎల్, మెస్సర్స్ ఎల్ అండ్ టీ నుంచి దాదాపు 330 వాహనాలను మెస్సర్స్ బీఈఎంఎల్ నుంచి సమీకరించనున్నారు. ఈ 'సిక్స్ పినాకా రెజిమెంట్లు'మన దేశపు ఉత్తర మరియు తూర్పు సరిహద్దుల్లో పని చేయనున్నాయన్న మంత్రి మన సాయుధ దళాల యొక్క ఆపరేషన్ సంసిద్ధతను మరింత పెంచనున్నాయని అన్నారు. 'సిక్స్ పినాకా రెజిమెంట్ల' స్థాపనను 2024 నాటికి పూర్తి చేయాలని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు 70% స్వదేశీ కంటెంట్‌తో కొనుగోలు (భారతీయ) వర్గీకరణ కింద.. ఈ ప్రాజెక్టును రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఆమోదం తెలిపారు. పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌ను (ఎంఎల్‌ఆర్‌ఎస్) మన దేశీయంగా డీఆర్‌డీఓ రూపొందించి అభివృద్ధి చేసింది. ఇది భారత ప్రభుత్వం (డీఆర్‌డీఓ & ఎంఓడీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రదర్శించే ఒక ప్రధానమైన రక్షణ ప్రాజెక్ట్. క్షేత్రస్థాయిలో కీలకమైన అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో “అత్మ నిర్భర్”కు తోడ్పాటును అందిస్తుందని మంత్రి చెప్పారు.
ఖద్దరు, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) నుంచి పదిన్నర లక్షల ఫేస్ మాస్కుల కోసం మరోమారు ఆర్డర్ పొందింది. కేవీఐసీకి ఇప్పటివరకు ఇదే పెద్ద ఆర్డర్. వేరే సంస్థకు 1.8 లక్షల ఆర్డర్ అందించిన నెలరోజుల్లోనే రెడ్ క్రాస్ నుంచి ఈ ఆర్డర్ వచ్చింది. రెడ్ క్రాస్‌కు ఇప్పటికే 1.6 లక్షల మాస్కులను కేవీఐసీ అందించింది. కొత్త ఆర్డర్ విలువ 3.3 కోట్ల రూపాయలు. ఈ వారంలోనే రెండో ఆర్డర్ పంపిణీ ప్రారంభమవుతుంది. మొదటి ఆర్డర్‌ను రెండు రోజుల్లో కేవీఐసీ పూర్తి చేస్తుంది. మొదటి ఆర్డర్‌లో ఇచ్చిన తరహాలోనే రెండో ఆర్డర్ ఫేస్ మాస్కులు ఉంటాయి. మొదటి ఆర్డర్‌ను ఉత్తమ నాణ్యతతో గడువులోగా అందిస్తుండడం వల్లే రెండో ఆర్డర్ వచ్చింది. కేవీఐసీకి ఇప్పటివరకు ఇదే అతి పెద్ద ఆర్డర్. ఇంతకుముందు, జమ్ము&కశ్మీర్ ఏడు లక్షల మాస్కులు కొనుగోలు చేసింది. రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సాధారణ ప్రజల నుంచి ఈ పోర్టల్ ద్వారా కేవీఐసీ పునరావృత ఆర్డర్లు పొందుతూనే ఉంది. మాస్కుల తయారీ ద్వారా దేశంలో స్థిర ఉపాధి సృష్టించినందుకు, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేవీఐసీని అభినందించారు. కరోనాను అడ్డుకోవడంలో సమర్థవంత సాధనంగా మాస్కులు మారడం వల్ల, వాటి తయారీ భారీ స్థాయి ఉపాధిని సృష్టించిందని అన్నారు. రెడ్ క్రాస్ నుంచి వచ్చిన కొత్త ఆర్డర్‌ను కేవీఐసీ ఛైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా స్వాగతించారు. "ఆర్థిక స్వాతంత్ర్యానికి రాట్నం ఒక సాధనం. ఇలాంటి కష్ట సమయంలో వచ్చిన ఆర్డర్, స్పిన్నింగ్, నేత పనిని ముందుకు తీసుకెళ్తుంది. ఖద్దరు పనివారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది" అని చెప్పారు.
ఫేస్ మాస్కుల తయారీ, ఖద్దరు పనివారికి దాదాపు 50 వేల అదనపు పని దినాలను కల్పించింది. ప్రస్తుత ఆర్డర్ కోసం దాదాపు లక్ష మీటర్ల చేనేత ఖద్దరు వస్త్రం అవసరం. దీనిని వివిధ రాష్ట్రాల్లోని ఖద్దరు సంస్థలు సరఫరా చేస్తాయి. స్పిన్నింగ్, నేత కార్యక్రమాలకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది. నేతన్నలకు ఉపాధి దొరుకుతుంది. రెడ్ క్రాస్‌కు అందించే మాస్కులు వంద శాతం పత్తితో, రెండు పొరలతో, గోధుమ రంగులో, ఎరుపు రంగు పట్టీలతో ఉంటాయి. రెడ్ క్రాస్ అందించిన నమూనాల ఆధారంగా వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మాస్కుల ఎడమ వైపున రెడ్ క్రాస్ ముద్ర, కుడి వైపున ఖాదీ ఇండియా టాగ్ ఉంటాయి. ఇతర ఖద్దరు మాస్కుల్లాగానే, ఐఆర్‌సీఎస్‌కు అందించే మాస్కులను ఉతికి మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఇవి శరీరానికి హాని కలిగించవు. మట్టిలో కలిసిపోతాయి.
2020 డిసెంబర్ 31 నాటికి 1.5 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్- వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్పతో కలిసి బళ్లారిలోని విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్ (ఎస్.ఎస్.టి.సి)ను డిజిటల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖసహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే, ఎక్స్‌ప్రెస్ ఫీడర్ లైన్, ఐసియు వార్డులు, వైద్య అవసరాలకు వాడే 13 కె.ఎల్. ద్రవరూప ఆక్సిజన్ ట్యాంక్ సదుపాయాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ అత్యధునాతన సిటిస్కాన్‌ను ప్రారంభించారు. ఇది 128 క్రాస్ సెక్షన్ స్లయిస్‌లను తీయగల సామర్ధ్యం కలిగినది.
ఈ ఎస్.ఎస్.టి.సిని, 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రధానమంత్రి స్వాస్త్య సురక్షా యోజన(పిఎంఎస్ఎస్‌వై) కింద నిర్మించారు. ఇందులో అత్యవసర, ట్రామా, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్సు విభాగాలు ఉంటాయి. ఆరు మాడ్యులార్ థియేటర్లు, 200 సూపర్ స్పెషాలిటీ బెడ్లు, 72 ఐసియు బెడ్లు, 20 వెంటిలేటర్లు, పైన పేర్కొన్నట్టుగా అధునాతన సిటిస్కాన్ యంత్రం,డిజిటల్ ఎక్స్‌రే యంత్రం ఉన్నాయి. ఇందులో 27 మంది పిజి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే సదుపాయం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయంగా నిర్దేశించిన 2025 గడువుకు ఐదు సంవత్సరాల ముందే పోలియో, మశూచీని అంతమొందించినట్టే టిబిని నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.