1 ENS Live Breaking News

భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎంతంటే..

కరోనా వైరస్ బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య ఈ రోజుకి దేశంలో 27 లక్షలు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా ఇప్పటివరకూ కోవిడ్ నుంచి కోలుకున్నవారి  సంఖ్య 27,13,933 కు చేరిందన్న కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా వైద్య విధానాన్ని అమలు చేయటం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. సకాలంలో నిఘా పెట్టటం ద్వారా బాధితులను గుర్తించి మెరుగైన మౌలిక సదుపాయాలతో వెంటనే చికిత్స అందించటం తగిన ఫలితాలు వస్తున్నాయంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 64,935 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, దీంతో కోలుకున్నవారి శాతం 76.61% గా మెరుగుదల నమో దై పరిస్థితి అదే పనిగా మెరుగవుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయని చెప్పింది.గత కొద్ది నెలలుగా  కరోనా పాజిటివ్ లలో ఎక్కువమంది కోలుకుంటూ వస్తున్నారని ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారొతో పోల్చుకున్నప్పుడు కోలుకున్నవారి సంఖ్య 3.55 రెట్లు ఎక్కువగా ఉంది. భారత్ లో మొత్తం 19.5  లక్షలమంది (19,48,631)  ఇప్పటివరకు కోలుకున్నారని, ప్రస్తుతం ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 765302గా ఉందని చెప్పింది.  కోలుకున్నవారు మూడున్నర రెట్లు అధి కంగా నమోదు అవున్నారని, ఈ విధంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య మొత్తం పాజిటివ్ కేసుల్లో తగ్గుతూ 21.60% గా నమోదయ్యారని పేర్కొంది.  సకాలంలో బాధితు లకు చికిత్స అందిస్తూ, అవసరమనిపిస్తే  ప్రత్యేక వైద్యం అందిస్తూ, మరణాల శాతాన్ని అదుపులో ఉంచటంలో కూడా రాష్ట్రాలు బాగా కృషి చేస్తున్నాయని అందు వలన మరణాలు క్రమంగా తగ్గుతూ రావడంతో మరణాలు రేటు 1.79% నమోదు అవుతుందన్నారు.

New Delhi

2020-08-30 20:02:46

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...ఆ వయస్సుదాటితే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంస్థలకు ఇది నిజంగానే చేదు వార్త... 55 సంవత్సరాలకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలగించేందుకు బిజెపి ప్రభుత్వం చర్యలు ప్రా రంభించింది. 30ఏళ్ళ సర్వీసు లేదా 55 ఏళ్ళ వయస్సుపై బడిన వారందర్ని బలవంతంగా తొలగించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు బలవంతాన ఉద్యోగాల నుండి తొలగించబడతారు. 1972లో విడుదల చేయబడ్డ ఫండ్‌మెంటల్‌ ‌రూల్స్ 56(‌జె),(ఐ) రూల్‌ 48 ‌సిసిఎస్‌ (‌పెన్షన్‌) ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని 55ఏళ్ళ పైబడిన వారిని లేదా 30ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తొలగింపుకు కేంద్ర ప్రభుత్వం పూను కుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సర్వీసుల్లో ఉన్న వారిని తొలగించటమే ఈ ఉత్తర్వుల వెనుక ఉన్న కుట్ర వామ పక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబ డుతున్నాయి.. ఇప్పటికే అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని, బొగ్గు, రక్షణరంగం, ఎయిర్‌పోర్టులు, ఇన్సు రెన్స్, ‌బ్యాంకులు తదితర వాటిని ఆఘమేఘాల మీద అమ్మకానికి సిద్దమయ్యిందని ఆరోపించింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ ‌పార్టీలు ఈ ఉత్త ర్వుల పై స్పందించాలని డిమాండ్‌ ‌చేస్తున్నట్టు సిపిఎం విశాఖ నగర కార్యదర్శి డా.బి గంగారామ్ డిమాండ్ చేశారు. అలాగే కార్మికలు, ఉద్యోగులందరూ ఈ చీకటి ఉత్తర్వులను తీ వ్రంగా ప్రతిఘటించాలన్నారు. ఈ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తోంది...

New Delhi

2020-08-30 15:20:41

ఉన్నత సమాజ నిర్మాణం కోసం భాష చాలా అవసరం

ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష – మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ప్రారంభించిన ఆయన, శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవటం ముదాహమని తెలిపారు. మాతృభాష దినోత్సవమంటే నిజమైన స్వాభిమాన దినోత్సవమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, విదేశాల్లో ఉంటూ మాతృభాష కోసం తపిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు, అదే విధంగా ఈ కార్యక్రమ ఏర్పాటుకు చొరవ తీసుకున్న, పాల్గొన వారందరికీ అభినందనలు తెలియజేశారు.

New Delhi

2020-08-29 20:59:26

భారత్ లో లాక్ డౌన్ 4.0 నిభందనలివే...

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఒక్కసారి పరిశీలిస్తే...  సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి.. సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ బంద్‌.. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌.. 100 మందికి మించకుండా స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి.. సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి.. అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగించిన కేంద్రం.. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు.. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం.. అత్యవసరమైతేనే బయటకు రావాలన్న కేంద్రం.. సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు..

New Delhi

2020-08-29 20:44:31

పద్మ అవార్డుల దరఖాస్తుల గడువు సెప్టెంబరు 15..కేంద్రం

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచింది. ఈమేరకు దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పెంచుతూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఎందరో దాతలు, సేవకులు ప్రజ లకు విశేషంగా సేవలు అందించారు. అలాంటి వారు ఎవరైనా మిగిలివుంటారనే కోణంలో ఆలోచించిన ప్రభుత్వం దరఖాస్తుల గడువను పెంచినట్టు తెలుస్తోంది. మ రోవైపు పద్మ అవార్డులు చేసిన సేవలను గుర్తించి ఇవ్వాలని తప్పితే అవార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేయడం ఏంటనే విమర్శలు అధికంగా వినిపి స్తున్నాయి. నిశ్వార్ధంగా సేవలు అందించిన వారిని ప్రత్యేకంగా గుర్తించి ఈ అవార్డులు ఇవ్వాలని వక్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు

New Delhi

2020-08-28 19:57:43

కరోనాలో బిసిపిఎల్ అభివ్రుద్ధి ఆనంద దాయకం..సదానంద

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ (బి సి పి ఎల్)  ప్రభుత్వ రంగ సంస్థ.కోవిడ్ -19 మహమ్మారి ప్రబలిన తరువాత  ప్రజల నుంచి ఫినాల్ కు డిమాండ్ అనేక రెట్లు పెరిగింది.  దానిని తీర్చడానికి తమ సంస్థ ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచింది.  ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 51,960 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.  పశ్చిమ బెంగాల్ నార్త్ 24 - పరగణాల జిల్లాలోని బి సి పి ఎల్ పాణిహతి యూనిట్ ఈ ఘనత సాధించింది. మున్నెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు బి సి పి ఎల్ సంస్థ యాజమాన్యాన్ని, ఉద్యోగులను కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ అభినందించారు.  ఇంతటి ఉత్పత్తిని సాధించడం సంస్థ 120 సంవత్సరాల చరిత్రలో రికార్డు అని బి సి పి ఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్)  పి. ఎం. చంద్రయ్య తెలిపారు.  జూలై నెలలో ఒక్కరోజులో 38,000 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేశామని వివరించారు. ఆగస్టు 23వ తేదీన ఒక్క రోజులో 51,960 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేశామన్నారు. 

New Delhi

2020-08-25 20:36:39

పర్యాటక హోటళ్లు నిబంధనలు పాటించాల్సిందే..పటేల్

పర్యాటక రంగంలో భాగస్వాములైన హోటళ్ళు, రెస్టారెంట్లను తిరిగి ప్రారంభించడం శుభ పరిణామమని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని భారత పర్యాటక  అభివృద్ధి సంస్థ(ఐటిడిసి) నిర్వహిస్తున్న హోటల్ అశోక్ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నదా లేదా అనే విషయాన్ని నేరుగా  కేంద్ర సందర్శించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  డిడిఎంఏ తీసుకున్న ఈ నిర్ణయం వలన రాజధానిలోని పర్యాటక రంగం పునరుజ్జీవింపబడుతుంద అన్నారు. జూన్ 8 నుంచి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆదరణ సేవలకు సంబంధించినవి దశలవారీగా పున:ప్రారంభించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చిందన్న ఆయన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నియమ నిబంధనలు(ఎస్ఓపిలు/ప్రొటోకాల్స్)ను పాటించాలన్నారు.  

New Delhi

2020-08-25 20:16:36

కరోనాలో నౌకాయాన సేవలు ఎనలేనివి..మాండవీయ

చార్టెడ్ విమానాల ద్వారా లక్షకు పైగా భారతీయ పోర్టుల్లో నావికా సిబ్బందిని మార్చిందని  భారత నౌకా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విధంగా  భారీగా నావికా సిబ్బందిని మార్చడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ మార్పుల్లో ఒక ఓడలోని సిబ్బందిని మరొక ఓడకు మార్చడం నావికా కార్యనిర్వహణలో భాగమేనని పేర్కొంది.  కొరొనా మూలంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో నావికా రంగం దెబ్బతిన్నప్పటికీ... క్లిష్ట పరిస్థితుల్లో  భారతీయ, విదేశీ సముద్ర యాత్రికులు చిక్కుకున్నచోట  అత్యవసర వస్తువుల సరఫరా  రంగాల్లో తమ సేవలను కొనసాగించి మూల స్థంభంగా నిలవడం అభినందనీయ మని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి మున్సిఖ్ మాండవీయ అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల వారు విధించిన లాక్డౌన్ కారణంగా సముద్రయాత్రికులు ఏంతో కష్టపడవలసి వచ్చింన్న ఆయన  సముద్ర యాత్రికుల సాధకబాధకాలను తీర్చడానికి మరింత దృఢమైన విధానాన్ని రూపొందించాలని డిజిని మంత్రి కోరారు. 

New Delhi

2020-08-25 19:44:58

24 గంటల్లో 66550 మంది కరోనా రోగుల డిశ్చార్జి..కేంద్రం

భారతదేశం ఒకే రోజులో అత్యధిక కరోనా కేసుల రికవరీలను నమోదు చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.  గత 24 గంటల్లో,  66,550 కోవిడ్ -19 రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, సమగ్రంగా గుర్తించడం,  సమర్ధవంతంగా వ్యవహరించడం అనే ప్రభుత్వ విధానానికి సాక్ష్యంగా, మొత్తం రికవరీల సంఖ్య 24 లక్షలు దాటి 24,04,585 గా నమోదయ్యిందని తెలియజేసింది. దీనితో, భారతదేశంలోని  కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు 76 శాతం (75.92 శాతం) కు చేరుకుంది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య (7,04,348) కంటే కోలుకున్న రోగుల సంఖ్య 17 లక్షలకు పైగా అధిగమించింది. ఈ రోజున, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కంటే కోలుకున్న రోగుల సంఖ్య 3.41 రెట్లు అధికంగా ఉంది. 

New Delhi

2020-08-25 19:38:30

భారత్ లో 3.7 కోట్ల కరోనా పరీక్షలు..కేంద్రం

టెస్ట్, ట్రాక్, ట్రీట్ .. అనే వ్యూహంపై దృష్టి కేంద్రీకరిస్తూ చేస్తున్న కృషి వల్ల మొత్తం భారత్ ఇప్పటి వరకు సుమారు 3.7 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గట్టి సంకల్ప బలంతో చేపట్టిన ఈ యజ్ఞంలో తాజా లెక్కల ప్రకారం 3,68,27,520 పరీక్షలు జరిపారని వివరించింది. గడచిన 24 గంటల్లో 9,25,383 పరీక్షలు జరిగాయి. దీనితో ప్రతి మిలియన్ మందిలో పరీక్షలు జరిగిన వారి సంఖ్యా 26,685 కి పెరిగింది. సకాలంలో గుర్తింపు, కచ్చితమైన ఐసోలేషన్, సమర్థవంతమైన చికిత్స వైపుగా మొదటి దశలో చేపట్టిన చర్యలు, అధిక పరీక్షలు, సంక్రమణ వ్యాప్తిని పరిమితం చేస్తోంది. పూణేలోని ఒకే ల్యాబ్ నుండి ప్రారంభించి, భారతదేశం టెస్టింగ్ ల్యాబ్ నెట్‌వర్క్ ఈ రోజు మొత్తం 1524 ల్యాబ్‌లతో గణనీయంగా విస్తరించింది. ప్రభుత్వ రంగంలోని 986 ప్రయోగశాలలు, 538 ప్రైవేట్ ప్రయోగశాలలు కోవిడ్ నియంత్రలో భాగస్వామ్యం అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది..

New Delhi

2020-08-25 19:29:16

కరోనా విషయంలో ప్రజలే జాగ్రత్తలు పడాలిసుమీ..తప్పదు

కరోనా నియంత్రణ విషయంలో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు చేసి, చేసి విసిగిపోయాయి...ఇక కరోనా వైరస్ తో సహజీవనం తప్పదంటూ చేతులెత్తేశాయి. ఎవరి ఆరోగ్యభాద్యత వారిదే నంటూ చెప్పకనే చెబుతున్నాయి. కోవిడ్ 19 నిబంధనల అమలుతో ఆర్ధిక లోటు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రజలే స్వచ్చందంగా జాగ్రత్తలు పాటించాలంటూ చెప్పకనే చెబుతున్నాయి ప్రభుత్వాలు. వీటికి అనుగుణంగా సెప్టెంబరు 1 నుంచి పూర్తిగా లాక్ డౌన్ నిబంధనలన్నీ ఎత్తేసి ప్రజలే జాగ్రత్తలు పాటించాలని, లేదంటే ప్రమాదం పొంచివుందని మాత్రం చెబుతున్న ప్రభుత్వాలు, కరోనా పాజిటివ్ వస్తే మాత్రం వైద్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించాయి. దీంతో ప్రజలే స్వీయ నియంత్రణ చేసుకోవాల్సివుంది. అలా అయితేనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందని, చెప్పి, హెచ్చరికలు చేసినంత కారలం ఈ సమస్య దారికొచ్చే పరిస్థితిలేదని భావించిన ప్రభుత్వాలు వైరస్ విజ్రుంభణ తారా స్థాయికి చేరుకుంటున్నవేళ ప్రజల్లో ఖచ్చితంగా మార్పు తెచ్చేలా మాత్రం చర్యలు తీసుకుంటుంది. సాధారణ వ్యాధిమాదిరిగానే కరోనాని చేర్చాలని చెప్పడంతో ఇపుడు ప్రజలంతా అంతర్మధనంలో పడ్డారు...

New Delhi

2020-08-23 14:39:53

ఆరోగ్యసేతు యాప్ లో కొత్త ఫీచర్ మీకోసమే..

కరోనా మహమ్మారి  సోకకుండా జాగ్రత్త పడేందుకు సాయం చేసే కోవిడ్‌ ట్రేసింగ్‌ యాప్‌ ‘ఆరోగ్య సేతు’లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా ‘‘ఓపెన్‌ ఏపీఐ సర్వీస్‌’’ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్‌ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది. ఆరోగ్యసేతు యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఎందరో ఆరోగ్య సూత్రాలు తెలుసుకుంటూ ప్రభుత్వం కల్పించే జాగ్రత్తలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

New Delhi

2020-08-22 21:08:43

ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఖదంగా

ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సిపిఆర్ఓ) గా కౌశలేంద్ర కిషోర్ ఖదంగా భువనేశ్వర్ లోని మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సిపిఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఖదంగా మంచేశ్వర్ వర్క్‌షాప్‌లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈయన ఎంటెక్‌ ను జపాన్‌లోని టోక్యోలోని వాసెడా విశ్వవిద్యాలయంలో పూర్తిచేసి అనంతరం  2010 బ్యాచ్ ఆఫ్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ (IRSME) కేడర్‌కు ఎంపికయ్యారు. అనంతరం డీజిల్ లోకోషెడ్ లో  ADME, DME లోని వివిధ ముఖ్యమైన పోస్టులలో కూడా పనిచేశారు... జైకాలోని మెక్సిట్ స్కాలర్‌షిప్ కింద జపాన్‌లోని టోక్యోలో హై స్పీడ్ రైల్‌లో 2 సంవత్సరాల మాస్టర్స్ కోసం  ఖదంగాను భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. జపాన్ నుండి తిరిగి వచ్చిన తరువాత, ఖుర్దా డివిజన్, పూరి కోచింగ్ డిపో, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

Bhubaneswar

2020-08-18 20:27:34