శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యా కరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. కాగా, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు. వాహనసే వలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు డా.నిశ్చిత,శేఖర్ రెడ్డి, గోవిందహరి, శ్రీ డిపి అనంత, సిఇ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటి ఈఓ హరీంద్రనాథ్, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయమంలో సాదర వీడ్కోలు లభించింది. తిరుమల పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం ప్రత్యేక విమానంలో హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యారు. సీఎం వెంట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి వున్నారు. సీఎంకి విమానా శ్రయంలో వీడ్కోలు తెలిపిన డిప్యూటీ సి.ఎం.నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, శాసన సభ్యులు , తిరుపతి కరుణాకర్ రెడ్డి, పిలేరు చింతల రామ చంద్రా రెడ్డి, జెసి మార్కండేయులు, నగరపాలక కమిషనర్ గిరీషా, ఐజి శశిధర్ రెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, ఎస్.పి.లు రమేష్ రెడ్డి, సెంథిల్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ఇంచార్జి రాజశేఖర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి,టర్మీనల్ మేనేజర్ బాబి,అడిషనల్ ఎస్.పి. సుప్రజ, డి.ఎస్.పి.చంద్రశేఖర్, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్ , డిటి లు జీవన్,సంతోష్, అధికారులు వున్నారు.
ఆంద్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉదయం తిరుమల శ్రీవారిని దర్షించుకుని, లోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం నాదనీరాజనం వేదికలో పాల్గొని కర్నాటక స్టేట్ ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన అనంతరం గురువారం ఉదయం 11.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు సాదర వీడ్కోలు లభించింది. విమానాశ్రయంలో వీడ్కోలు తెలిపిన డిప్యూటీ సి.ఎం.నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, శాసన సభ్యులు , పిలేరు చింతల రామ చంద్రా రెడ్డి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధన రెడ్డి, జెసి మార్కండేయులు, నగరపాలక కమిషనర్ గిరీషా, అర్బన్ ఎస్.పి. రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్.పి. సెంథిల్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ఇంచార్జి రాజశేఖర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి,టర్మీనల్ మేనేజర్ బాబి,అడిషనల్ ఎస్.పి. సుప్రజ, డి.ఎస్.పి.చంద్రశేఖర్, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్ , డిటి లు జీవన్,సంతోష్, అధికారులు వున్నారు.
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, బి.ఎస్.యడ్యూరప్పలు కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, టిటిడి అధికారులు స్వాగతం పలికా రు. స్వామి వారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసిం హస్వామివా రిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఛైర్మన్, ఈవో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని, రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ ఆర్‌కె.రోజా, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మురళికృష్ణ, శివకుమార్, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ ఎ.రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపైనా, దేవుళ్లపైనా దాడులు ఆగడం లేదు. కావాలని చేసినట్టు ఒక్కోసారి ఒక్కోజిల్లాలో దుండగలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాలపై దాడుతు చేస్తున్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డు సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతోపాటు, గట్టుపై వున్న ఆలయాన్ని పూర్తిగా పెకిలించి వేయడం స్థానికంగా కలకలం రేపింది. అంతర్వేది మొదలుకొని, రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో నిత్యం ఏదోమూల హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని దాడులు రాత్రి సమయంలోనే జరగుతుండగా, ఇపుడు నేరుగా పగటిపూటే ఆలయాలను, అయ్యవార్ల విగ్రహాలను ధ్వంసం చేయడం చర్చనీయాంశమవుతుంది. కాగా నేటి వరకూ రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే దుండగులు రెచ్చిపోయి వరుసదాడులకు పాల్పడుతున్నారని హిందువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై బిజెపి నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఎక్కడా ఫలితం కనిపించకపోవడం విశేషం...
విజయవాడలోని ప్రెస్ అకాడమీ బాధ్యతలు స్వీకరించక అకాడమీ కార్యకలాపాలు కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనా ధ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్ట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. గ్రామీణ, డెస్క్ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం అకాడమీ బాధ్యతగా భావిస్తున్నామని.. వారికి కావాల్సిన సమాచారంను అకాడమీ ద్వారా అందించడానికి ఒక వెబ్‌సైట్ రూపొంది స్తున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారని అన్నారు. కోవిడ్ వల్ల మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జర్నలిస్టుల విషయంలో ముఖ్యమంత్రి ఒక సమగ్ర ప్రణాళికతో రావాలన్నారు. ఈ నెల 26 నుండి విశాఖ జిల్లాలో జర్నలిస్టులకు ఆన్‌లైన్ తరగతులు చెప్పిస్తామని తెలిపారు. సమాచార సేకరణ ఒకే చోట లభ్యం అయ్యేలా అకాడమీ వెబ్‌సైట్ రూపొందుతుందన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్ కలిసి స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ్యమంత్రివర్యులను రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం గరుడ సేవలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని, రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, గౌతంరెడ్డి, వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ ఆర్‌కె.రోజా, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, సివిఎస్వోగోపినాథ్‌జెట్టి, అర్బన్ ఎస్పీ ఎ.రమేష్‌రెడ్డి పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.