తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరులో విశేష ఉత్సవాలను నిర్వహించడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ ను ద్రుష్టిలో పెట్టుకొని స్వామివారికి నిర్వహించే అన్ని కార్యక్రమాలను ప్రత్యక్ష్యంగా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా అందించనుంది. అక్టోబరు నెలలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు ఈ విధంగా ఉంటాయి... అక్టోబరు 1, 31వ తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ,15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ,16న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 20న గరుడసేవ, 21న పుష్పక విమానం, 24న చక్రస్నానం, 25న పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. స్వామివారికి నిర్వహించే ఉత్సవాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమాలే ఆలయ అర్చకులు అధికారులు పాల్గొంటారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ, కేసుల ఉద్రుతి అలాగే ఉన్నందున భక్తులను స్వామివారి ఉత్సవాల్లోకి అనుమతించడం లేదని పేర్కొంది..
ప్రధాని మోదీ కాళ్లను సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరూ పట్టుకుంటున్నారని సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కూడా ఆయన కాళ్లను పట్టుకుంటున్నారని అన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నాడని చెప్పారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మామని అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్... చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. వీరివల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమని విమర్శించారు. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్ లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతే అని అన్నారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదనితేల్చి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ముగుస్తున్నందున కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.ipr.ap.gov.in ను అందుబాటులో ఉంచామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడి ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించే డాక్యుమెంట్స్ సర్టిఫికెట్‌లో అప్‌లోడ్ చేయవలసినదిగా కోరడమైనది. గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు పిడిఎఫ్ ఫార్మెట్లో అప్ లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో కనబడలేదు కావున, అభ్యర్థులు విధిగా వారు సమర్పించాల్సిన పత్రాలు 'పిడిఎఫ్ ఫార్మెట్'లో మాత్రమే అప్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత యాజమాన్యం వారి సంస్థలలో పనిచేయుచున్న పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి రికమండేషన్ లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి సవరించిన లేఖలను అప్ లోడ్ చేయాలన్నారు అలాగే తాజాగా రికమెండేషన్ లేఖలను రాష్ట్రస్థాయిలో కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మరియు జిల్లాస్థాయిలో సంబంధిత సమాచార పొర సంబంధాల శాఖ కార్యాలయాలలో సమర్పించాలన్నారు. కావున, ఇదివరలో అక్రిడిటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు వారి డేటాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు వెబ్ సైట్ ను 04-10-2020 వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకుని, పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా అప్ లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్ లోడ్ చేసి నకలు కాపీలను సంబంధిత కార్యాలయములలో అందజేయాల్సిందిగా కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి కోరారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం ''భాగ్‌సవారి'' ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ''భాగ్‌సవారి'' ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బందీస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బందీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ''భాగ్‌సవారి'' ఉత్సవంలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్ - 19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతుల కష్టాలను పాదయాత్రచూసి ఇచ్చిన హామీ మేరకు రైతన్నలకు నీటిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ వైఎస్సార్ జల కళ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. సోమవారం ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలన్నీ వ్యవసాయాన్ని దండగటా మార్చేశాయని, రైతన్న బాగుంటే దేశం బాగుపడుతుందనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు ఉచితంగా ఈ బోర్లు వేసే పథకానికి రూపకల్పన చేశామన్నారు. తద్వారా ఎలాంటి కాలంలో నైనా రైతులు పంటలు పండించుకోవడానికి ఈ జలకళ బోర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తిస్థాయిలో అదిగమించాలని ఈ సందర్భంగా సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి కలెక్టర్లతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో గ్రామసచివాలయాలకు నూతనంగా గ్రేడ్-5 కార్యదర్శిలు నియమితులైనా..వారంతా ఉత్తుత్తి కార్యదర్శిలుగానే పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149కి అనుగుణంగా పనిచేసే వీలులేకుండా పోయింది...కాదు కాదు కావాలనే కొందరు అధికారులు, మరికొందరు సీనియర్లు ప్రభుత్వ ఉత్వర్వులను అమలు చేయడం లేదు.. రాష్ట్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించేందుకు ప్రారంభించిన గ్రామసచివాలయ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓను అమలు కాలేదనే విషయాన్ని గుర్తించి.. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధుల ద్రుష్టికి తీసుకెళ్లేందుకు ఈఎన్ఎస్ నెట్వర్క్ రాష్ట్రవ్యప్తంగా గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ ను అందిస్తోంంది. ఏపీలో గ్రామసచివాలయ వ్యవస్త ఏర్పాటై సుమారు 11 నెలలు గడుస్తున్న కొత్తగా చేరిన కార్యదర్శిలంతా గత పంచాయతీల వ్యవస్థలో పనిచేసిన సీనియర్ కార్యదర్శిలకు సహాయకులుగానే పనిచేస్తున్నారు. ఇంటి పన్నుల దగ్గర నుంచి కోవిడ్ సేవల వరకూ వీరు చేసిన సేవలు అనంతం. వీరంతా చేసిన సర్వీసు మొత్తం సీనియర్ల ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రతీ 2500 దాటిన జనాభా కోసం ఒక గ్రామసచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడ విధుల్లోకి చేరిన కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగానే పనిచేస్తున్నారు వీరికి సచివాలయ కార్యదర్శిలుగా ఎలాంటి అధికారాలు, విధులు లేవు. ఇంకో విషయం ఏంటంటే వీరికి పూర్తిస్థాయి రికార్డులు కూడా లేవంటే అతిశయోక్తికాదు. దానికి కారణం వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన విధులు, అధికారాలు బదాలాయింపు జరగకపోవడమే. దీంతో సీనియర్ల దగ్గర వీరంతా వారు చెప్పినట్టు పనిచేయాల్సి వస్తుంది. ఇదేమంటే అదంతే అంటున్నారు ఇటు అధికారులు కూడా.. ప్రభుత్వం ఒక జిఓ విడుదల చేస్తే తక్షణమే అది అమల్లోకి వస్తుంది. అదేంటో గ్రామసచివాలయ వ్యవస్థలో మాత్రం జిఓ నెంబరు 149కి మాత్రం బాలరిష్టాలు తీరలేదు. ఆజీఓని అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకి, ఈఓపీఆర్డీలకి, సీనియర్ కార్యదర్శిలు, ప్రస్తుత కార్యదర్శిలు...ఇదే నకలును అటు జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా కలెక్టర్ కు తెలియజేసినా అవేమీ ఉపయోగంలోకి రావకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే జీఓను అమలు చేసే ఉద్దేశ్యం అధికారులకు లేదనే విషయం తేటతెల్లమైపోయింది. ఎలాంటి అధికారాలు లేని సచివాలయ కార్యదర్శిలుగా ప్రస్తుత గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్సవ విగ్రహాల్లా చేసినపంతా సీనియర్లుకు ఆపాదించాల్సి వస్తుంది. మరోవైపు కొన్ని మండల కేంద్రాల్లో సీయర్ కార్యదర్శిల చేసిన చేతివాటానికి, ఖర్చులకు ఒకే సచివాలయ కార్యాలయంలో పనిచేస్తున్న సచివాలయం2, 3 కార్యదర్శిలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల విశాఖజిల్లా ఎస్.రాయవరం గ్రామసచివాలయంలో ఈఓపీఆర్డీ ఏవీఎస్ఎస్ ప్రసాద్ పంచాయతీ నిధులు రూ.47 తన కుమారుడికి ఖాతాకి దారిమళ్లించాడు. ఈ విషయం డిఎల్పీఓ విచారణలో తేటతెల్లమైంది. దానికి ఆయన చెప్పిన సమాధానం గ్రామసచివాలయం-1తోపాటు 2 సచివాలయంలో ఖర్చుచేసిన వాటికే బిల్లులు పెట్టామని అధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అధికారులు ఒక సాంకేతిక అంశాలన్ని గుర్తించాల్సివుంది. సచివాలయాల పరిధి, విధులు, రికార్డులు గ్రామసచివాలయ కార్యదర్శిలకు బదలాయింపు జరగకపోవడంతో, సీనియర్లు పాల్పపడే అవినీతికి సహచర గ్రేడ్5 కార్యదర్శిలు మూల్యం చెల్లించాలన్నమాట. ఇలా పంచాయతీ నిధుల్లో చేతివాటం ప్రదర్శించడానికి వీలుపడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నాటి పంచాయతీ కార్యదర్శిలు, ప్రస్తుత గ్రామసచివాలయ గ్రేడ్5 కార్యదర్శిలకు విధులు, డిడిఓ అధికారాలు బదలాయింపులు చేయడం లేదని క్లియర్ గా అర్దమైపోయినట్టు ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఈ విషయంలో చాలా చోట్ల మండల అధికారులు, కొన్ని చోట్ల జిల్లా అధికారులు కూడా జీఓ నెంబరు 149 జీఓ అమలు చేయకపోవడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాదూ కూడదు అంటే మరెందుకు ఆజీఓ ప్రకారం విధుల బదలాయింపు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే...కొత్తగా చేరిన గ్రామకార్యదర్శిలకు కొందరు అధికారుల నుంచి బెదరింపులు కూడా ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతుంది. తమ అధికారాలు తమకు బదలాయిస్తే తప్పా తాము ఎలా తమ పరిధిలోని సచివాలయ ప్రజలకు ఎలా సేవలు చేయగలమని గ్రేడ్5 కార్యదర్శిలు ప్రశ్నిస్తున్నారు. ఈజీఓని అమలు చేస్తే ఏం జరుగుతుందుంతనే విషయాలను...రేపటి సచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-3లో చూడవచ్చు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంనకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోటళ్లు, టూర్స్ అండ్ ట్రావెలర్స్, తదితర టూరిజానికి సంబందించిన వాటికి రిజిస్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరుగిందన్నారు. ప్రపంచంలో 30 శాతం దేశాలు టూరిజం మీదనే ఆదారపడ్డాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 12 పర్యాటక ప్రాంతాలను గుర్తించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అభివృద్థి చేయడం జరిగుతుందని, డిపిఆర్ కూడా తయారుచేయడం జరిగిందని, త్వరలోనే టెండర్లు పిలువడం జరుగుతుందన్నారు. నూతన టూరిజం పాలసీని త్వరలోనే ప్రకటించబడుతుదని వెల్లడించారు. అనుమతులు కోసం ఏ ఒక్కరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని, పారదర్శకంగా ఉంటుందని, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టం ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు సందర్శించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పర్యాటకం ఒక బాధ్యతాయుతమైన రంగంగాను, ఆదాయం తీసుకువచ్చే శాఖగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పర్యాటకం అభివృద్థి చెందితే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. విశాఖపట్నం ఎంతో సుందరమైన నగరమని, అంతర్జాతీయ పర్యాటక పటంలో విశాఖపట్నంను నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్థి చెందితే ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఈ యేడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీం “పర్యాటకం అండ్ గ్రామీణాభివృద్థి” అని, రూరల్ టూరిజంలో విశాఖపట్నం జిల్లాలో ఏటికొప్పాక ప్రాంతం అభివృద్థికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ జిల్లాలో పర్యాటక ప్రాంతంను గుర్తించి, స్థానిక సంస్కృతి, హెరిటేజ్ లపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్లను ప్రమోట్ చేయడానికి టూరిజం పాలసీని ప్రభుత్వం త్వరలోనే తీసుకువస్తుందని వెల్లడించారు. రూరల్ టూరిజం, డోమెస్టిక్ టూరిజం అభివృద్థి చేయడం జరుగుందని వివరించారు. పర్యాటక రంగంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చినట్లు వివరించారు. రాష్ట్ర, ప్రపంచ, జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలోని ఏజన్సీలో పర్యాటక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో పర్యాటక ప్రాంతాలు, విశాఖపట్నంలో తొట్లకొండ, హెరిటేజ్, సహజ సిద్థంగా వచ్చిన అరకు, తదితర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ యేడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీం “టూరిజం అండ్ రూరల్ డెవలప్ మెంట్” అని, ఏటికొప్పాక ప్రపంచ, జాతీయ స్థాయిలో ప్రసిద్థి గాంచినదని చెప్పారు. లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదౌతుందని, ఆ ప్రాంతానికి గుర్తింపు తీసుకువస్తే అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్థి పరచాలన్నారు. కోవిడ్-19 నేపధ్యంలో పర్యాటక శాఖ మంచి సేవలు అందించిందని ఆయన అభినందించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ పర్యాటకంతోపాటు టెంపుల్ టూరిజం ఉత్తరాంధ్రాలో మరింత అభివృద్థి చేయవచ్చన్నారు. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. శాసన మండలి సభ్యులు పి.వి.వి. సూర్యనారాయణ, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్ లు పర్యాటక ప్రాంతాల గూర్చి వివరించారు. సన్ రే రిసార్ట్స్ అధినేత రాజబాబు, తదితరులు కోవిడ్-19 ను సందర్భంగా ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం హోటల్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ లకు రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత యజమానులకు మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మళ్ల విజయ్ ప్రసాద్, రెహమాన్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, టూరిజం రీజనల్ డైరక్టర్ రాంప్రసాద్, హోటల్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులు, పర్యాటక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 14వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి సెప్టెంబరు 28వ తేదీ రాత్రి 7.00 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్ఫణ నిర్వహించనున్నారు. లోక కల్యాణార్థం, కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆశాంతి, ఆనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపూర్ణ ఆరోగ్య సౌభాగ్యాలు, ఆర్థిక పరిపుష్ఠి నెలకొల్పడానికి 16 రోజుల పాటు టిటిడి నిష్ణాతులైన వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన సుందరకాండ పారాయణంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ '' రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః '' మహామంత్రంలో 16 అక్షరాలు ఉన్నాయని, వాటి బీజాక్షరాలు 68 అవుతుందన్నారు. కావున టిటిడి ప్రచురించిన సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయని, ఇందులో 2821 శ్లోకాలను 16 రోజుల పాటు పారాయణం చేయనున్నట్లు తెలిపారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో ప్రపంచంలోని మానవులు ధర్మాని ఆచరిస్తూ, సకల శుభాలను పొందాలని ఆకాంక్షిస్తూ షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కొరకు ఎస్వీబీసీ ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని అయిన మహల్ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. అనంతరం అయిన మహల్ ముఖ మండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు.
అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు. అనంతరం రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
ఈ కార్యక్రమాల్లో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్‌రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, డి.పి.అనంత, అర్బన్ ఎస్‌పి రమేష్‌రెడ్డి, సిఇ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యన్నారాయణస్వామివారి దేవస్థానం నిధుల కొరతతో కొట్టిమిట్టాడుతోంది. స్వామివారికి వచ్చిన ఆదాయం ఉద్యో గుల జీతాలకు కూడా సరిపోవడంలేదు. దీంతో గత మూడు నెలలుగా ఉద్యోగులకు, పొరుగు సేవల సిబ్బందికి సగం సగం జీతాలే ఇస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలతోపాటు అన్నవరం సత్యదేవుని ఆలయంపైనా అధికంగానే పడింది. ఇప్పటికే సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతున్న దేవస్థానం.. ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు స్వామివారికి ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల నుంచి నగదు తీసుకోవడానికి ప్రభుత్వానికి లేఖలు రాసినా అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులతోపాటు, భక్తులు కూడా స్వామివారి కరుణకోసమే వేచి చూస్తున్నారు. లాక్ డౌన్ 4.0 నిబంధనల ప్రకారం భక్తులను అనుమతించినా, ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుంది. దానికితోడు కరోనా పాజిటివ్ కేసులు కూడా అధికంగా పెరుగుతుండటంతో భక్తులు కూడా ఆలయాలకు రావడానికి భయపడుతున్నారు. వచ్చిన భక్తులకు కూడా నిత్యన్నాధ పథకం నిర్వహణ కూడా ఇబ్బంది కర పరిస్థితుల్లోనే ఉందని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు చేసుకున్నవారంతా ఖచ్చితంగా స్వామివారి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ వస్తుండటంతో ఆ జంటలు మాత్రం వ్రతాలు చేయించుకోవడానికి వస్తున్నారు. స్వామివారి కళ్యాణం అయితే నేరుగా జరగకుండా కేవలం ఆన్ లైన్ లో మాత్రమే నిర్వహిస్తున్నారు. వైరస్ తీవ్రత తగ్గి, భక్తులు పెరిగి ఆదాయం వస్తే తప్పా దేవస్థాన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు...
పర్యాటక ప్రమేమికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని టూరిజం ప్యాకేజిగా అభివ్రుద్ధి చేయను న్నట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కొత్త పర్యాటక ప్రాంతాలు అన్ని జిల్లాల్లోనూ ఆదరణకి నోచుకోకుండా ఉన్నాయని వాటన్నింటిని గుర్తించి జిల్లాల వారీగా టూరిజం ప్రాజెక్టులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. తద్వారా విశాఖపట్నం లాంటి అంతర్జాతీయ ఖ్యాతి వున్న ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించడానికి వీలుపడుతుందని చెప్పారు. అదే విధంగా కొత్తగా టూరిజంహోటళ్లు కూడా రాబోతున్నాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ టూరిజం ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ లో అభివృద్ధి చేసేందుకు పథకాలను, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖ నగరం, జిల్లాలో పర్యాటక ప్రాంతాల సందర్శన రంగంలో అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల సందర్శన, యాత్రా స్థలాల సందర్శన, విహారస్థలాలు చారిత్రక ప్రదేశాలు హస్తకళల విభాగాలను కలిపి ఒక ప్యాకేజీ గా చేస్తామని వివరించారు. దీంతో విశాఖజిల్లాలో ఇప్పటి వరకూ ఉన్న పర్యాటక ప్రాంతాలతోపాటు, కొత్తగా మరికొన్ని పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు అయ్యే అవకాశం వుంది. తద్వారా మరికొందరికి ఉపాదికూడా పెరుగుతుందని మంత్రి మీడియాకి వివరించారు...
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో ఉత్తుత్తి కార్యదర్శిలు పనిచేస్తున్నారు..ఏంటి కాస్త తేడాగా ఉందనుకుంటున్నారా...మీరు చదువుతున్నది నిజమే. ప్రస్తుతం రాష్ట్రంలోని గత పంచాయతీలు మినహా కొత్తగా చేరిన కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓఎంఎస్ నెంబను 149 అమలు చేయకపోవడమే. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విధుల్లోకి చేరిన కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పని ఉండాలి. కానీ.. కార్యదర్శి అనే పదానికి అర్ధంలేకుండా పాత, సీనియర్ కార్యదర్శిలకు సహాయకులగానే నేటికీ నూతన గ్రేడ్5 కార్యదర్శిలు పనిచేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కొత్తగా చేరిన కార్యదర్శిలకు తమకు పనులు లేకుండా పోయాయని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న విషయం నేడు హాట్ టాపిక్ గా మారింది. నూతన కార్యదర్శిలు పెట్టుకున్న జీఓ ప్రకారం వివిధ ప్రాంతాల్లో వున్న గ్రామసచివాలయాల పరిధిని విభజన చేయాలి. వారి విధులు వారిని నిర్వర్తించుకునేలా చేయాలి. కానీ రాష్ట్రప్రభుత్వం గ్రామసచివాలయ వ్యస్థ అని నామకరణం చేసి, దానికి ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖను కేటాయించినా ఇంకా రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థే నడుస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మా విధులు, మా ఉద్యోగాలు మమ్మల్ని ప్రభుత్వ జిఓ ప్రకారం చేసుకోనీయండి మహా ప్రభో అని గ్రేడ్ 5 నూతన కార్యదర్శిలు నెత్తీనోరూ మెరపెట్టుకుంటున్నా...ఫలితం లేకుండా పోతుంది. విశేషం ఏంటంటే గ్రామసచివాలయ కార్యదర్శిలు తాము చేస్తున్న ఉద్యోగం ఏమిటో తమకే తెలియడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సీనియర్ కార్యదర్శిల నుంచి కొన్నిచోట్ల వేధింపులు కూడా ఎదుర్కొంటున్నారు. అదీ ఎలా ఉంటే మేము చెప్పినట్టు ఉద్యోగం చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్ అనే బెదిరింపుతో కొందరు కార్యదర్శిలు, సీనియర్ల దగ్గర అటెండర్లుగా పనిచేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలపైనా, రాష్ట్రవ్యాప్తంగా కార్యదర్శిలంతా జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న విధుల బదలాయింపు విషయమై ఈఎన్ఎస్ నెట్వర్క్ గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ ప్రారంభించింది. ప్రభుత్వ ఆశయానికి కొందరు సీనియర్ ఉద్యోగులు, మరికొందరు మోనోపోలీ కార్యదర్శిలు, వారికి సహకరిస్తున్న మండల స్థాయి అధికారులు ఏవిధంగా గాలితీసే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. వాటిని గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు అనే దారావాహిక న్యూస్ కార్డ్ అర్టికల్స్ గా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. మరిన్ని వివరాలు గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-2 లో చూడవచ్చు..!