ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వే పరిష్కారాల కోసం ప్రత్యేక ట్రిబ్యున్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర రెవిన్యూ అధికారులు, ముఖ్య కార్యదర్శిలతో భూ సర్వే పైలెట్ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించిన సీఎం జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టి 2023, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సర్వేయర్లను నియమించిన నందున సిబ్బందికి ఎలాంటి డోకా ఉండబోదన్నారు. అయితే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు, ప్రతీ గ్రామంలోని భూసర్వేని పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ సర్వే అనంతరం ఎలాంటి భూ రికార్డులైనా గ్రామసచివాలయంలో అందుబాటులో ఉండే విధంగా సర్వే వివరాలను ప్రత్యేకంగా ఆన్ లైన్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తిరుమలలో అన్న ప్రసాదం కాంప్లెక్స్ ఎదుట నిర్మించనున్న పరకామణి నూతన భవనాలు, అందులోని యంత్రాలు, సదుపాయాలు, భద్రత, మౌలిక వసతులతో కలిపి స్టేట్ఆఫ్ఆర్ట్ డిజైన్ తో ఉండాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. దాత నిర్మిస్తున్న ఈ భవనం డిజైన్, కల్పించాల్సిన వసతులపై అదనపు ఈఓ ధర్మారెడ్డి తో కలసి సోమవారం తిరుపతి పరిపాలన భవనం లోని తన చాంబర్లో ఈఓ సమీక్ష జరిపారు. సిఈ రమేష్ రెడ్డి డిజైన్ లేఔట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 22,622 చదరపు అడుగుల విస్తీర్ణం లో ఈ భవనం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 9 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ భవనం సెల్లార్ లో బ్యాంకుల కోసం స్ట్రాంగ్ రూములు, గ్రౌండ్ ఫ్లోర్ లో నాణేల పరకామణి హాల్, హుండీలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం లు డిజైన్ చేసినట్లు చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ లో నోట్లు, బంగారు, ఇతర కానుకల లెక్కింపు హాల్ ఉంటాయన్నారు. నాణేల పరకామణిలో యంత్రాల శబ్దం రాకుండా సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు కూడా పరకామణి లెక్కింపు చూడవచ్చని ఆయన చెప్పారు.
ఈఓ సింఘాల్ మాట్లాడుతూ నాణేలు వాటి విలువను బట్టి వేరు చేసే యంత్రాల ఏర్పాటు, లెక్కింపు, భద్రత, విద్యుత్, అగ్నిమాపక పరికరాలు, సిసి టివి ల ఏర్పాటు, డోనార్ హాల్, సిబ్బంది సదుపాయాల విషయాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితమైన ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యంత్రాల సహాయంతో తక్కువ మంది సిబ్బందితో పారదర్శకంగా, వేగంగా లెక్క పెట్టే వ్యవస్థ ఏర్పాటు, తనిఖీలు, పరకామణి భవనం కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ గదుల నిర్మాణం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏఓ బాలాజి, ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న జనరంజక పాలన చూసి చంద్రబాబు చాలా విచిత్రంగా తయారయ్యారని ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపిం చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి కదలడు, జూమ్ నుంచి బైటకు రాడు, లోకేష్ ట్విట్టర్ వదలడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. టిడిపి పార్టీ ఇంకా ఉందని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి వీరిద్దరూ ఇద్దరు ఆంద్రప్రదేశ్ కు నివాసులుగా కాకుండా ప్రవా సులుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎల్లో మీడియా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉనట్లు రాతలు తమకిష్టమొచ్చిన రాతలు రాస్తోందని, వారి ప్రతికల్లో మాత్రమే ప్రతిపక్షం ఉందన్న అంబటి ప్రజల్లో మాత్ర లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎల్లో మీడియాలో రాయడానికి చేతులు రావడం లేదన్నారు. దేశంలో ఏ సీఎం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్న అంబటి 60 వేల కోట్లు రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నాలుగున్నర కోట్ల మందికి నేరుగా చేర్చారని అన్నారు.
దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంతోపాటు దళితులపై దాడులు చేసిన వారి తాట తిస్తామని సీఎం జగన్ హెచ్చరించారని కూడా గుర్తు చేశారు. నేను అక్రమ మైనింగ్ చేస్తున్ననని పిల్ వేశారు..ఈ విషయమై తాను ఎలాంటి విచారణకు అయిన సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీబీఐ విచారణ జరిపిన, రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిన మీ ఇష్టమేనన్నారు.నాపై వేసిన పిల్ వేసిన వారు మైనింగ్ దొంగలు..అంటూ అంబటి మండి పడ్డారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించిన ఆయన తన నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు..
విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబరు 4న ప్రారంభించనున్న ఈ ఫ్లైఓవర్ కి పూర్తిస్థాయిలో విద్యుదీకరణ చేశారు. అదివారం రాత్రి సమయంలో ఎలా వుంటుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం, ప్లైఓవర్ మీద విద్యుత్ వెలిగిన తరువాత దానిని గగణ తలంపై నుంచి ప్రత్యేకంగా చిత్రీకరించింది. ఎక్కడో విదేశాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ చూడటానికి ఎంతో చక్కగా రాత్రి సమయంలో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫ్లైఓవర్ దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి నిర్వహించనుంది.అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అ నంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు సా మాజిక దూరం పాటిస్తూ, శ్రీవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. అయి తే స్వామివారికి నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలను మాత్రం ఎస్వీబీసీ ద్వారా భక్తులకు లైవ్ లో అందించే ఏర్పాటు చేస్తుంది. స్వామివారి కార్యక్రమాలు నేరుగా చూడలేకపోయినా, ఎస్వీబీసీ ద్వారా చాలా వరకూ పూజలు నేరుగా చూసే భాగ్యం మాత్రం భక్తులకు దక్కుతోంది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆల య అర్చకులు పాల్గొంటారు.
తూర్పుగోదావరిజిల్లాలో లంపకలోవ డిసిసిబి మాజీ చైర్మన్, టిడిపినేత వరుపుల రాజా సహకార బ్యాంకులో అవినీతితో అడ్డంగా మేసింది రూ.15కోట్ల 50 లక్షల భారీ స్కాముగా ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సహకారం సంఘంలో రాజాకి సహకరించిన అధికారులపైనా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లోకేసులు నమోదు అయ్యాయి. రైతుల పేరిట స్వల్పకాలిక రుణాలు పాసుపుస్తకం దారులకు ఇవ్వకుండా నేరుగా వీరి జేబులోనే వేసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అధికారా న్ని అడ్డంపెట్టుకొని దర్జాగా స్కామ్ చేసి మేసేసిన వైనం పై రాజా చెట్టూ ఉచ్చుగట్టిగానే బిగుస్తోంది. పత్తిపాడు మండలం లంపకలోవ సహకార పరపతి సంఘం అధ్య క్షుడిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి చేసినట్టు విచారణ అధికారి రామక్రిష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక మొత్తం కదిలింది. సొసైటీలో చనిపోయిన రైతుల పేరిట స్వల్పకాలిక పంటరుణాలతో ఈ స్కాముకి రాజా తెరతీశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 450 పాసుపుస్తకాలు స్రుష్టించి మరీ 15కోట్ల 50 లక్షల రూ పాయలు నొక్కేశారు. దీనికి సొసైటీ సెక్రటరీ చాగంటి వెంకట్రావు, కింతాడ అప్పారావులతోపాటు మరో ఇద్దరు అధికారులు కూడా సహకరించారు. పోలీస్ కేసు, విచా రణ తదితర అంశాలను, ప్రస్తుత చైర్మన్ సురేష్ కూడా మీడియాకి తెలియజేశారు. దీంతో మొత్తానికి తూర్పుగోదావరి జిల్లాలో కూడా టిడిపి నేతలు చేసిన అవినీ తి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూడటం తెలుగు తమ్ముళ్లను కలవర పెడుతోంది...
చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా తయారుచేసిన రూ.9 లక్షల రూపాయలు విలువగల బడదోస్త్ మిని లారీని ఆ సంస్థ సిఈవో నిథిన్ సేథ్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, స్వామివారికి చేసే సేవలలో, సామాగ్రిని తరలించడానికి ఈ వాహనాన్ని వినియోగించాల్సింది కోరారు. స్వామివారికి సంస్థ తరపున వాహనం కానుకగా అందించడం చాలా ఆనందంగా వున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యులు గోవింద హరి, డిఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని చూడటానికి ఎంత మంది భక్తులు వెళతారో...సెప్టెంబరు 4 తరువాత ఇక్క ప్రారంభమైన ఫ్లై ఓవర్ ను చూడటానికి కూడా అంతేమంది వెళ్లేటట్టుగా ప్రభుత్వం పూర్తయిన ఫ్లై ఓవర్ ని ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో చూడచక్కగా షూట్ చేయించింది. ఈ ఫ్లై ఓవర్ ని మచిలీపట్నం -పూణే జాతీయ రహదారి నెం.65 పై కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఇదే అత్యంత పొడవైన ఫ్లై ఓవర్ గా గుర్తింపు పొందడం విశేషం.
తిరుమల శ్రీవారి గిరులపై ఏర్పడుతున్న వేలకొలదీ టన్నుల చెత్తనుంచి సంపద స్రుష్టించుకోవాలని టిటిడి భావిస్తోంది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కొరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌ను కొత్త టెక్నాలజితో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శుక్రవారం తిరుమలలో జ రిగిన పాలకమండలి సమావేశంలో ఈమేరకు పలు అంశాలను చర్చించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కోసం టిటిడి పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణ మూర్తి కోటి రూపాయలు విరాళం ప్రకటించడం శుభ పరిణామమన్నారు. బయో డిగ్రేడబుల్ తడి చెత్త నుండి వచ్చే సేంద్రియ ఎరువును విక్రయించడానికి లైసెన్స్ తీసుకుంటమని వివరించారు. లాభాలు లేకుండానే రైతులకు ఈ ఎరువు అందిస్తామన్న ఆయన చెత్త నుంచి సంపదను అభివ్రుద్ధి చేసి టిటిడి చేపట్టే కార్యక్రమా ల ను మరింత ముందుకి తీసుకు వెళతామన్నారు. అంతేకాకుండా ఈ ఎరువు ద్వారా తిరుల ప్రాంతంలో భూములన్నీ సారవంతంగా మారి అటు రైతులకు కూడా మే లు జరుగుతుందన్నారు...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను కోవిడ్ కారణంగా సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఛై ర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్‌లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామన్నారు. శుక్ర వా రం జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవా రి ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో స్థానిక భక్తులను భాగస్వాములను చేస్తూ, దాతల నుండి విరాళాలు సేకరించాలని నిర్ణయించా మన్నా రు. టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకమీదట నగదు, బంగారు డిపాజిట్లలో ప్రతి నెల కొంత మొత్తానికి గడువు తీరేలా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు తక్కువ వడ్డీ ఇస్తున్నందు వలన టిటిడి డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ వచ్చేలా ఆర్‌బిఐ, ఇతర బ్యాంకులతో చర్చించనున్నామన్నారు.
విశాఖజిల్లాలో టిడిపీ పార్టీలోని ముఖ్యనేతలంతా వైఎస్సార్సీపీ గూటికి చేరుతున్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లు పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణపై టీడీపీ వైఖరితో విసిగిపోయిన పంచకర్ల మే నెలలోనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై తాను పార్టీలో చేరినట్టు పంచకర్ల వివరించారు. పార్టీ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానన్న ఈయన టిడిపి తప్పుడు ప్రచారాన్ని పూర్తిస్తాయిలో తిప్పికొడతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు దుష్టశక్తిగా దాపురించాడని వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్ రాష్ట్రానికి ఒక శాపంగా పరిణమించిందని విమర్శించారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహనరెడ్డి చేస్తున్న పరిపాలనపై.. నిత్యం ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగించాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తనతో అంటకాగే ఆ రెండు పత్రికలు, మూడు చానెళ్ళ మద్దతుతో తన అబద్దాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవర్గం మీడియా మాఫియాగా తయారై, చేస్తోన్న అక్రమాలు, అకృత్యాలపై ఇటీవల అహ్మదాబాద్ ఐఐఎం ఇచ్చిన నివేదిక ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. చిత్తశుద్ది వుంటే ఈ రెండు పత్రికలు, మూడు చానెళ్ళు తమ పార్టీవేనని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దుష్టచేష్టలు రాష్ట్ర అభివృద్ధికి గ్రహణంలా తయారయ్యాయని విశాఖ నగర వైసీపీ అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంటే చూసి ఓర్వలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడన్నారు..తన మంది,మార్బలం తో భూములు కొనిపించి దానికి అమరావతి అనిపేరుపెట్టి రాజధానిగా ప్రకటించి ఆ పెట్టుబడిదారులు కాపాడడానికి పెట్టుబడిదారుల ఉద్యమం నడిపిస్తూ.. తానొక డిక్టేటర్ లా భావించుకొని తాను చెప్పిందే జరగాలన్నట్లు కొన్ని శక్తులను ఉపయోగించుకొని వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర మూడుజిల్లాల అభివ్రుద్ధికి చేసే కార్యక్రమంలో ఈ ప్రాంత టిడిపి ఎమ్మెల్యేలు అర్ధం చేసుకొని కాలిసి రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. 92 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. మొత్తం 61,300 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 94,209గా ఉంది. ఇప్పటివరకు 2,95,248మంది కరోనా నుంచి కోలుకోగా.. 3,633 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి రిపోర్టులను వ్యక్తుల యొక్క చరవాణిలకి పంపిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీఒక్కరూ భాగస్వామ్యం కావాలని పేర్కొంది. సామాజిక దూరం పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించింది. చేతులను పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ కి దూరంగా వుండొచ్చని తెలియజేస్తోంది...
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌గా అఖిలేష్ కుమార్ త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2011 ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టిఎస్) అధికారి. రైల్వేలో ఏరియా మేనేజర్ / వైజాగ్ స్టీల్ ప్లాంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. వాల్తేరు డివిజన్‌లో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వివిధ విభాగాలతోపాటు ట్రాఫిక్ కమర్షియల్, ఆపరేషన్స్ లో పనిచేశారు. డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా మరియు ఖుర్దా రోడ్ డివిజన్‌లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌గా ట్రాఫిక్ కార్యకలాపాలను మెరుగుపరచడంలో విశేష క్రుషి చేశారు. గతంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు ఈయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.