1 ENS Live Breaking News

ఆప్కో నుంచి చేనేత సొసైటీలకు బిల్లులు ఇప్పించండి

ఆంధ్రప్రదేశ్ లో చేనేత సొసైటీల ద్వారా ఆప్కోకి బట్టలు సరఫరా చేసి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నవారి సమస్యలు పరిష్కరించాలని ఆప్కో నూతన చైర్మన్ గంజి చిరంజీవి దృష్టికి పద్మశాలీ సంఘం నేత కొప్పుల రామ్ కుమార్ తీసుకు వెళ్లారు. విజయవాడలో ఈరోజు విజయవాడ చేనేత భవన్ లో ఆప్కో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీలు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వినతిపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు.  అంతకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీ సంఘం సభ్యులు నూతన చైర్మన్ కుశుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో మార్కండేయ చేనేత సహకార సంఘం నాయకులు కె.రవి, చుక్కల చిన్నారావు, బి.శ్రీనివాసరావు ఎం.సూరిబాబు, గోపు.భీష్మసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2023-02-03 10:53:00

శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 20.78 లక్షలు

తిరుమల  శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు మందిగా నమోదు అయ్యారని టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలియజేశారు. డయల్ యువర్ ఈఓ అనంతరం ఆయన స్వామివారి జనవరి నెల వివరాలను తెలియజేశారు. హుండీ ద్వారా వచ్చిన కానుకలు రూ.123.07 కోట్లు, లడ్డూలు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు,  అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.51 లక్షల మందిగా నమోదు అయ్యారని పేర్కొన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సర్వదర్శనాలు కొనసాగుతున్నాయని ఈఓ వివరించారు.

Tirumala

2023-02-03 06:06:08

డిసెంబరులోగా ఆటోమేటిక్ లడ్డూయంత్రాల

తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.  ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు.  తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి , ఆతరువాత మీడియాతో మాట్లాడారు. ఆటోమేటిక్ మిషన్ల ద్వారా రోజుకు 6 లక్షల దాకా లడ్డూల తయారీకి అవకాశం వుంటుందన్నారు. 

Tirumala

2023-02-03 05:59:46

ఉసూరుమంటున్న గ్రామ, వార్డు సచివాలయ వీఆర్వోలు

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏదోశాఖ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం కావాలని చేస్తున్నదో..లేదంటే కొంతమేరకైనా జీతాల భారం తగ్గించుకోవాలని చేస్తున్నదో తెలీదు కానీ.. అరకొర జీతాలతో వీఆర్ఏ నుంచి వీఆర్వోలుగా పదోన్నతులు పొంది జిల్లాకాని జిల్లా..ప్రాంతం కానీ ప్రాంతాలో బతుకు బండి ఈడ్చేలా చేస్తున్నది. రెండున్నరేళ్లు గడిచిపోతున్నా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 3572 మంది వీఆర్వోలు ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేల జీతంతోనే బ్రతుకుతున్నారు. గతంలో సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయమే ఇపుడు పదోన్నతి పొందిన వీఆర్ఏలను కూడా వెంటాడుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు రకాల టెస్టులు(కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్టు, సర్వే టెస్టు) పాసైతే తప్పా వీరి సర్వీసులు రెగ్యులర్ చేసేది లేదని మెలిక పెట్టింది. దీనితో వీఆర్వోలు అంతా కంప్యూటర్ ఎఫియన్సీ టెస్టులో పాసైయ్యారు. తీరా సర్వే టెస్టులో మాత్రం 1850 మంది పాసైతే 1722 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారికి ప్రభుత్వం మళ్లీ వెంటనే పరీక్ష పెట్టడం మానేసింది.

వీఆర్ఏ నుంచి విఆర్వోగా పదోన్నతలు ఇచ్చిందని ఆనందపడాలో లేదంటే వచ్చిన ఉద్యోగం ప్రభుత్వం పెట్టే టెస్టుల్లో పాస్ కానందుకు వారి సర్వీసులు రెగ్యులైజేషన్ కి నోచుకోలేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరు కూడా సాధారణ వీఆర్వోలు మాదిరిగానే అన్నిపనులూ చేస్తున్నారు. విధుల్లోకి చేరిన తరువాత ఆరు నెలల్లో రెండు రకాల పరీక్షలు పెడతామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్ల వరకూ వీరికి పరీక్షలు పెట్టలేదు. దీనితో వీరంతా ఒక పరీక్షలో పాసై మరో పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మొత్తం పదోన్నతి పొందిన వీఆర్వోలందరికీ రెండు పరీక్షలు పాసైన తరువాతే సర్వీసులు రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దీనితో వీరంతా తీవ్రఆందోళన చెందతున్నారు. ప్రభుత్వం తక్షణమే మరోసారి సర్వే  పరీక్ష నిర్వహించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేల జీతంతో కుటుంబాలను పోషించుకోవడానికి, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉన్న కాస్తంత జీతంలోనే మండలకేంద్రాలకు తరచూ తిరగడం, శిక్షణలకు, ప్రత్యేక సమావేశాలకు  జిల్లా కేంద్రాలకు వెళ్లడంతోనే వచ్చిన జీతం మొత్తం ఆవిరైపోతుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమను విధుల్లోకి తీసుకున్నవెంటనే రెండేళ్లలోనే పరీక్షలు పెట్టివుంటే ఫెయిల్ అయినవారంతా మరోసారి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉండేదని వాపోతున్నారు.

ప్రభుత్వం తక్షణమే ఫెయిల్ అయినవారికి పరీక్ష పెట్టాలని లేనిపక్షంలో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేపేస్కేలు అయినా వర్తింపచేయాలని వీఆర్వోలంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా వీఆర్వోల జాబ్ చార్టు మార్చిన తరుణంలో విధినిర్వహణలోనే క్యాంపులకు ఎక్కువగా తిరగాల్సి వుంటుందని, ప్రభుత్వం ఇచ్చే జీతంతో కుటుంబాలనే పోషించుకుంటామా..లేదంటే ప్రభుత్వం అప్పగించిన పనులకు క్యాంపులకే తిరుగుతామా అని ప్రశ్నిస్తున్నారు.  
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3572 మంది వీఆర్వోలు ఇదే ఆర్ధిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. తమ గోడు వినే నాధుడే ప్రభుత్వంలో కరువయ్యాడని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు నెలాఖరున జీతబత్యాలు ఒకటవ తేదీ నాటికి ఇవ్వడం లేదు. ఉన్న వీరిందరికీ సర్వీసులు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై మరింత ఆర్ధిక భారం పడుతుందనే కారణంతోనే వీరికి పెట్టాల్సిన పరీక్షలు సకాలంలో నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పదోన్నతి పొందిన వీఆర్వోలకు డిపార్ట్ మెంట్ పరీక్ష నిర్వహించి వారి సర్వీసులు రెగ్యులర్ చేస్తే తప్పా ప్రభుత్వ ప్రాధాన్యత భూముల రీ-సర్వేలో వీరంతా పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం లేదు. చూడాలి ప్రభుత్వం ఈ వీఆర్వోల విషయంలో ఏం చేస్తుందనేది..!

Tadepalli

2023-02-03 02:55:59

వైఎస్సార్సీపీ టార్గెట్175లో అపుడే 2టిక్కెట్లు ఔట్

వైఎస్సార్సీపీలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి లక్ష్యంగా పెట్టుకుంటే అసమ్మతి అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇప్పటికే 2 టిక్కెట్లు చేజారిపోగా..అసెంబ్లీ ఎన్నికల నాటికి 175 స్థానాల్లో సీట్లు ప్రకటించినప్పటికి మరెన్నీ రాలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్నామని..కోట్లాది రూపాయాలు సంక్షేమ పథకాలపేరిట బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకే పంపిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా..నేటికీ కార్యకర్త నుంచి నాయకుడి వరకూ వారి స్థాయిల్లో ఏ పనులూ జరగడం లేదు. ఆ విషయం అధిష్టానం వరకూ వెళ్లడం లేదనే ప్రచారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవులు ఇంకా చాలాస్థాయిలో భర్తీ కాలేదనేది జగమెరిగిన సత్యం. ఈ తరుణంలో అసమ్మతి ఎమ్మెల్యేలు, సీటుచేజారిపోతుంద ని భావించే ఎమ్మెల్యేలు, సీటు కోసం ఆశించేవారు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు.

తాను ఒకటి తలిస్తే పార్టీ ఒకటి తలచినట్టుగా పార్టీ అధికారంలో లేనపుడు జెండాలు మోసిన కార్యకర్తలు, వారిని దగ్గరుండి నడిపించిన నాయకులకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం జరగలేదనేది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ విషయం తెలిసినా..చెప్పించే చేయాలని కొంత మంది నాయగణం కార్యకర్తలను కార్యకర్తలుగా మాదిరిగా ఉంచేస్తున్నారనే ఆవేదన కూడా ఎక్కువగా వుంది. అధికారంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు ఆశ, ఆలోచన ఉండటం సహజమేనని.. కానీ సొంత గ్రామంలో కనీసం చిన్న చిన్న పనులు కూడా ప్రజలకు, కార్యకర్తలకు చేయించలేని నాయకులు వచ్చేఎన్నికల్లో పార్టీకోసం పనిచేస్తారా అంటే కష్టమేననే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బెదిరించి పనిచేయించాలని..డబ్బుతో ఓటును కొనాలనుకునే రోజులు పోయాయనే విషయం 2019 ఎన్నికల్లోనే తేటతెల్లం అయ్యిందిని..ఇపుడు ప్రభుత్వం ప్రజలకు మంచిచేస్తే తప్పా వచ్చే ఎన్నికల్లో ఓటు పడే పరిస్థితి లేదనేది ప్రస్తుత వాస్తం. అయినా కొంత మంది ఎంపీలుగా వున్నవారు ఎమ్మెల్యేలుగా..ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంపీలుగా వెళ్లడానికి, నియోజకవర్గాలు మర్పుకి పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో దిగువస్థాయి కేడర్, సీటు ఆశించిన వారంతా అలకపూనారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు జారిపోవడం కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది.

అటు ప్రతిపక్షపార్టీలు, వామపక్షపార్టీలు కూడా ఎక్కడా తగ్గడంలేదు వారి వారి బలాన్ని పెంచుకుంటూనే ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అన్నివర్గాలను చైతన్యం తీసుకు వస్తున్నారు. ఈసారి ఏదిఏమైనా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేసేదిశగా వ్యూహాత్మకంగా పావులు కదువుపుతున్నారని విశ్లేషకులు ఒక 
అంచనాకు వచ్చారు. ప్రభుత్వం 175కి 175గా లక్ష్యం పెట్టుకుందని అయితే 75 మాత్రమే అధికారపార్టీకి ఇచ్చి మిగిలిన 100 తాము సంపాదించే దిశగా ప్రజల్లోకి వెళుతున్నారనేది ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు..ప్రజలతో నమ్మకంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రతిపక్షాలను, వామపక్షాలను నమ్మే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ప్రభుత్వం నగదు బదిలీ పథకాల రూపంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నా.. ఇచ్చిన దానికంటే ఎంతరెట్టింపు ప్రజలపై పన్నులు, విద్యుత్, గ్యాస్, ఇతరత్రా భారాలను మోపుతుందనేది ప్రజలకు తెలియజేయడంలో ముందుంటున్నారు. అదే సమయంలో అధికారపార్టీలో అసమ్మతి సెగను కూడా చక్కగా వినియోగించుకుంటున్నారే ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలో ప్రభుత్వ లక్ష్యం 175కి ఎన్నిసీట్లు వస్తాయనే విషయమై ఆశక్తకర రాజకీయ చర్చ ఆంధ్రప్రదేశ్ జరుగుతుండటం విశేషం..చూడాలి ఏం జరుగుతుంది..ఏవిధంగా జరగబోతుంది..ఫలితాలు ఎలా వస్తాయనేది..!

Tadepalli

2023-02-02 06:43:41

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త

తెలంగాణలోని ఆర్టీసీ  ప్రయాణికులకు అక్కడి యాజమాన్యం గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్లపై రాయితీలు ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ పై 5% రాయితీ, 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులకు ఈ రాయితీ వర్తించనుంది. ఈ మేరకు ఓపీఆర్ఎస్ సాఫ్ట్ వేర్ ను టీఎస్ ఆర్టీసీ అప్ డేట్ చేసింది. ఈ అవకాశాన్ని దూర ప్రయాణాలు చేసుకునేవారు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని టిఎస్ ఆర్టీసీ కోరుతోంది..!

Hyderabad

2023-02-02 06:19:49

సచివాలయ ఉద్యోగుల నుంచే రూ.20.80 కోట్ల పన్నలు

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ శ్లాబుల విధానంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏడాదిరి వారు తీసుకునే జీతంపై రూ.1500 నుంచి 1600 వరకూ ఆదాయపు పన్ను చెల్లించాల్సి వుంటుంది. తద్వారా సుమారు రూ.20.80 కోట్ల వరకూ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రానుంది. కేంద్రం ఆదాయపు పన్ను శ్లాబు వలన రూ.3లక్షలు నుంచి రూ.6లక్షల వరకూ 5% పన్ను, రూ.6లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10%, రూ.9 నుంచి రూ.12లక్షల వరకూ 15%, రూ.12నుంచి 15లక్షల వరకూ 20%, రూ. 15 లక్షల నుంచి ఆపైన ఆదాయం ఉన్నవారు రూ.30% ఆదాయపు పన్ను చెల్లించాల్సి వుంటుంది. మరోవైపు ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవధిని 20-24 రోజుల నుంచి 15 రోజులకే తగ్గించేశారు. దీనితో ఒకే సారి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, అటు దేశ వ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే సర్వర్ పై తీవ్ర ప్రభావం చూసే అవకాశాలున్నాయి.

Tadepalli

2023-02-01 08:53:15

ఏపీలో వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్ చార్ట్

ఆంధ్రప్రదేశ్ లో భూములు రీసర్వే జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు  రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ 
చార్ట్ అమలు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు, సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్ జాబ్ చార్ట్, గ్రేడ్-1, 2, 3 గ్రామ 
సర్వేయర్లకు జాబ్ చార్టపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు వేర్వేర్లు ఉత్తర్వులు జారీచేశారు. వీఆర్వోల జాబ్ చార్ట్..తుపాన్లు, వరదలు, 
ప్రమాదాలు లాంటి విపత్తు నిర్వ హణ విధులు, ఓటర్ల జాబితా అప్డేషన్, ప్రభుత్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ పనులు, భూముల 
సర్వే కార్యకలా పాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధిం
చిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్నచర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం  లాంటి పనుల్ని నిర్దేశించారు.

పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ,రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా  కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీల్దార్కు నివేదించడం
తోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఎ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని జాబ్ చార్ట్లో పేర్కొన్నారు.  ఒకే సమయంలో
ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధా న్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామ సర్వేయర్ల జాబ్ చార్ట్ వ్యక్తులు, ప్రభుత్వ  సంస్థలతోపాటు అనుమతిం చిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్లైన్ పిటిషన్లు (సరిహద్దు వివాదాలు, హద్దులు-విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు)స్వీకరించి పరిష్కరించాలి.

 సర్వే సబ్ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే.గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్/టౌన్ సర్వే, కొత్త సబ్ డివిజన్, పాత సబ్ డివిజన్లను కలపడంపై 
అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి. సచివాలయాల పరిధిలో అదే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు
ఫర్ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు మార్క్లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం 
ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. 
కాంపిటెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డుల్లో తప్పులను సరిచేయాలి. పై అధికారులకు సమాచారమిచ్చి అన్నితనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు 
కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్ చేచేయించి నిర్వహణ చేపట్టాలి. నెలవారీ టూర్ డైరీలు, ప్రోగ్రెస్ స్టేట్మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే 
సెటిల్మెంట్ కమిషనరు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్,డీజీపీఎస్, కార్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్వోలకు
సహకరించాలి. ఈ జాబ్ చార్ట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్తగా జాబ్ చార్టు వీఆర్వోలకు అమల్లోకి వచ్చింది..!

Tadepalli

2023-02-01 03:14:43

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని బుధవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 21 గదులు, హరిహర సదన్ ఏసీ 6,  హరి హర సదన్ నాన్ ఏసీ 6,  హరి హర సదన్ సింగిల్ 0, న్యూ సెంటినరీ 8, ఓల్డ్ సెంటినరీ 5, విఐపీ ఎస్జీహెచ్ 8, సీతారామ చౌల్ట్రీ 23, సత్య నికేతన్ లో25 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-02-01 02:49:18

యూనిఫాం వేసుకురాని ఉద్యోగులను ఇంటికి పంపండి..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫారం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు విధులకు యూనిఫారం ధరించి రాకపోతే అలాంటి వారిని ఇంటికి పంపనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను మొదటిసారిగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అమలుచేస్తున్నారు. మత్స్యశాఖలోని గ్రామీణ మత్స్య సహాయకులు విధులకు యూనిఫారం ధరించి రాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం ఉద్యోగుల గుర్తింపుకోసం ఖచ్చితంగా ధరించేలా ఇచ్చిన యూనిఫారం వేసుకోని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు అందుకుకున్నవారు సహేతుకమైన కారణాలు చెప్పాలని అందులో పొందుపరిచారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీచేసినా సచివాలయ సిబ్బందిలో మార్పు రాలేదని..ఇకపై ప్రభుత్వం స్వయంగా పంపిణీచేసిన యూనిఫారం సక్రమంగా ధరించాలని, లేనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.

జిల్లాకలెక్టర్ ఏర్పాటుచేసిన సమీక్షాసమావేశానికి ప్రభుత్వం ఇచ్చినఫారంలో షర్టు ఒకటి, ఫ్యాంటు మరొకటి, మరికొందరు ఏకంగా యూనిఫారం లేకుండా వచ్చారు. దీనిపై కన్నెర్ర చేసిన కలెక్టర్ సమావేశంలోనే గట్టిగాహెచ్చరించారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం ధరించడానికి ఎందుకు చిన్నతనంగా ఫీలవుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రజలు, అర్జీదారులు ఉద్యోగులను గుర్తుపట్టాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన యూనిఫారం ధరించకుండా ప్రభుత్వాన్నే అవహేళన చేస్తున్నారని ఇది పద్దతి కాదని, ఇకపై అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించాలని జిల్లా మత్స్యశాఖ ఉపసంచాలకులను ఆదేశించారు. గుర్తించిన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.

ఒక్క విజయనగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అసలు సచివాలయ గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 కార్యదర్శిల వరకూ ఎవరూ యూనిఫారం వేసుకొని రాకపోవడంతో, దానిని అలుసుగా తీసుకుంటున్న సిబ్బంది కూడా సివిల్ డ్రెస్సుల్లో వస్తున్నారు. ఈ విషయం ఎంపీడీఓలు గుర్తించినా వారు కూడా లైట్ తీసుకుం టున్నారు. ఒక్కోసారి డిఎల్పీఓ, డీపీఓ, ఇతర జిల్లాశాఖల ఉన్నతాధికారులు సచివాలయానికి వచ్చిన సమయంలోకూడా సిబ్బంది ధరించని యూనిఫారంపై ప్రశ్నించడం లేదు. షర్టు ఒకటి, ఫ్యాంటు మరొకటి వేసుకొనివచ్చినా ఎక్కడా ప్రశ్నించడం లేదు. ఆ మాటకొస్తే..ప్రభుత్వం ఎంతో నమ్మకం పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులే ప్రభుత్వ ఆశయాన్ని, లక్ష్యానికి గాలితీసేస్తున్నారనే విషయం వీరుధరించే యూనిఫారమే తేటతెల్లం చేస్తున్నది. మరికొందరు ఒక అడుగు ముందుకేసి యూనిఫాం బ్యాండుమేళం బ్యాచ్చిలా ఉందని..అందుకనే వేసుకో బుద్ది కావడం లేదని..ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకలెక్టర్లు కూడా ఈవిషయాన్ని పట్టించుకోకపోవడంతో వీరి యూనిఫారం ధారణ విషయంలో ప్రశ్నించే వారే కరువవుతున్నారు.

ప్రభుత్వ ఆదేశం ప్రకారం సచివాలయ ఉద్యోగులు సరైన, సక్రమమైన(ఫ్యాంటు ఓ రంగు, షర్టు ఓ రంగు కాదు) యూనిఫారం ధరించి మాత్రమే ధరించి విధులకు హాజరుకావాలి. అలా హాజరుకాని ఉద్యోగులకు జిల్లాశాఖల అధికారులు షోకాజు నోటీసులు ఇవ్వాలి. లేదంటే సదరు జిల్లాఅధికారులకు కలెక్టర్లు షోకాజ్ 
నోటీసులు జారీచేస్తారు..జిల్లా కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే వారిపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ 
లతోపాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిల నుంచి షోకాజ్ నోటీసులొస్తాయి. ఈవిధంగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసింది. దానితో రాష్ట్రంలోని  26జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫాం విషయంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విజయనగరం జిల్లా కలెక్టర్ ముందు వరసులో నిలబడి ప్రభుత్వ లక్ష్యాన్ని అమలుచేస్తున్నారు. ఇదే ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చూడాలి విజయనగరం జిల్లాకలెక్టర్ ను ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాల కలెక్టర్లు, 20శాఖల జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో యూనిఫారం వేసుకొచ్చేలా చేయగలగుతారా..లేదంటే లైట్ తీసుకుంటారో..అనేది..!

Tadepalli

2023-01-31 03:04:36

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని మంగళవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 45 గదులు, హరిహర సదన్ ఏసీ 77,  హరి హర సదన్ నాన్ ఏసీ 42,  హరి హర సదన్ సింగిల్ 27, న్యూ సెంటినరీ 6, ఓల్డ్ సెంటినరీ 6, విఐపీ ఎస్జీహెచ్ 22, సీతారామ చౌల్ట్రీ 39, సత్య నికేతన్ లో39 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-31 02:51:17

చైను పోగొట్టుకున్నవారు తక్షణమే సంప్రదించాలి

అన్నవరం శ్రీ వీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, శ్రీ స్వామి వారి సన్నిధిలో సోమవారం భక్తుడు బంగారు చైన్ జారవిడుచుకున్నారని ఆలయ వర్గాలు మీడియా ద్వారా ప్రకటించాయి.  సదరు ప్రదేశము నందు డ్యూటీలో వున్న సెక్యూరిటీ గార్డు తీసుకొని వచ్చి శ్రీస్వామి వారి కళావేదిక వద్ద  ప్రకటన చేసినా  సదరు వ్యక్తులు రాలేదని, మూడు రోజుల్లోగా సదరు చైను పోగొట్టుకున్నవ్యక్తి ఆధారాలతో వస్తువును తీసుకొని వెళ్లాలని ఆలయ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల తరువాత సెక్యూరిటీ సమక్షంలో ఆ వస్తువును స్వామివారి హుండీలో వేస్తామని ప్రకటించాయి. మరిన్ని వివరాలకు ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నాయి.    

Annavaram

2023-01-30 12:11:08

ఏజెన్సీలో భయం చీకటిని ఛేదించిన ఘటన @ 30ఏళ్లు

పసుపులేటి బాలరాజు ఈపేరు వింటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన తండాల్లోని ఒక యువ గిరిజన స్పూర్తి.. దైర్యం..తెగువ..నాయకత్వం.. గిరిజన రాజకీయాల్లో ఆరితేరిన యోధుడిగా అతి చిన్న వయసులోనే కీర్తి.. అంతేకాదు 25 ఏళ్ళకే శాసన సభకు ఎన్నికైన నాటి కాంగ్రెస్ గిరిజననాయకుడు. ఇదంతా సరిగ్గా 30 ఏళ్ళ కిందటి విశాఖమన్యం సంగతి. చింతపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన 3వ సంవత్సరంలోనే పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌ బాలరాజును కొయ్యూరు మండలంలో కిడ్నాప్ చేసిన రోజులవి..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నక్సల్స్ చెరలోనే 23 రోజులు.. ఓ పక్క మన్యం మొత్తం రెడ్ అలెర్ట్..కటుంబ సభ్యుల్లోనూ, ప్రభుత్వంలోనూ ఒకటే టెన్షన్.. రోజు గడిస్తే ఏం జరుగుతుందో..ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని..అలాంటి నక్సల్స్ చీకటి భయాన్ని చేధించుకొని చెక్కుచెదర కుండాతిరిగి మన్యంలోకి అడుగుపెట్టిన దైర్యం, తెగింపు పసుపులేటి బాలరాజుది. ఆ చీకటి భయం సంఘటన 1993 జనవరి 30న జరిగి నేటికి సరిగ్గా30ఏళ్లు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net అందిస్తున్న ప్రత్యేక కథనం..!

విశాఖ మన్యం ప్రాంతాలంటే అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఒకటే భయం అక్కడ పీపుల్స్ వార్ నక్సల్స్ ఉంటారని. అందులోనూ అప్పటికే చింత పల్లి, కొ య్యూరు మండలాలు పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ఉన్న పసుపులేటి బాలరాజు రూ.30 లక్షల వ్యయంతో గిరిజన గ్రామాల్లో నిర్మించే చెక్‌డామ్‌ల పరిశీలన కోసం 1993 జనవరి 30వ తేదీన కొయ్యూరు మండలం బూదరాళ్ళ శివారు గుడ్లపల్లి గ్రామానికి వెళ్లారు. ఆయన వెంట దాదాపు 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దాసరి శ్రీనివాసులు కూడా బాలరాజు వెంటే ఉన్నారు. వీరి రాకను ముందుగానే తెలుసుకున్న పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌ మాటువేసి మొత్తం 40 మందిని బందీలుగా చేసి అత్యధిక సంఖ్యలో ఉన్న నక్సలైట్లు ఒకేసారి అటవీ ప్రాంతంలో  కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఈవార్త బిబిసి లాంటి అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ, ఆలిండియా రేడియో, దూరదర్శన్ టివీ ఛానళ్లలో ప్రసారం కూడా అయ్యింది. ఒక్కసారిగా ప్రభుత్వం మన్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొయ్యూరు మండలంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో కిడ్నాప్ అయిన ఎమ్మల్యే బాలరాజు, ఇతర అధికారుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు వెతికే వేట ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న నక్సక్సల్స్ ఎమ్మెల్యే బాలరాజు, ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులుతో సహా 13 మందిని తమ దగ్గరే బందీలుగా వుంచుకొని మిగిలిన వారిని విడిచి పెట్టారు. 

ఇక అపుడే అసలు భయం మొదలైంది. అంతా ఆ 13 మందిని నక్సల్స్ చంపేసి ఉంటారనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ సంఘటన పెను సవాలుగా మారింది. అయిలే బాలరాజు నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారో..ఆయనతోపాటు కిడ్నాప్ చేసిన కొంత మందిని ఎందుకు వదిలిపెట్టారో ప్రభుత్వంలోగానీ, పోలీసులకు గానీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒక దశలో ఎమ్మెల్యే బాలరాజుని నక్సల్స్ చంపేసి ఉంటారనే వార్త  దావాలనంగా దేశమంతా వ్యాపించింది. ఆసమయంలో నక్సల్స్ ప్రభుత్వానికి ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చారు.  అప్పటికే వరంగల్‌ జైలులో వున్న పీపుల్స్‌వార్‌ నాయకుడు క్రాంతి రణదేవ్‌ను విడిచి పెడతేనే బాలరాజును విడుదల చేస్తామనేది దాని సారాంశం. అయితే దీనికి ప్రభుత్వం సూచన ప్రాయంగా అంగీకరించింది. 

నక్సల్స్ తో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తూనే..ఎమ్మెల్యే బాలరాజును ఎలాగైనా ప్రాణాలతో రక్షించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టింది. బాలరాజుకు అండగా ద్రోణంరాజు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ మొదలైన నాయకులు నర్సీపట్నంలోనే మకాం వేసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే బాలరాజు భార్య కూడా తన భర్తను విడిపించాలంటూ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నతరు ణంలో ప్రభుత్వం క్రాంతి రణదేవ్ ను విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో గిరిజన ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న బాలరాజును చంపితే నక్సల్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని నక్సల్స్ కూడా ముందుచూపుతో ఆలోచించి సానుకూలంగానే వ్యవహరించారు.  మరొపక్క అప్పటి సీఎం కోట్లవిజయభా స్కరరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి బాలరాజు విడుదలకు మార్గం సుగమం చేశారు. క్రాంతి రణదేవ్‌ను నక్సల్స్ కి అప్పగించడానికి వరంగల్‌ నుంచి విశాఖ జైలుకు ఆఘ మేఘాల మీద తరలించారు. 

విషయం తెలుసుకున్న నక్సల్స్ ఈలోగానే ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసుల్ని విడుదల చేశారు. ఇపుడు ఇంకా ఉత్కంఠ అసలు బాలరాజు ప్రాణాలతో బతికేఉన్నారా లేదంటే క్రాంతి రణదేవ్ ని విడుదల చేసిన తరువాత చంపేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తూనే ఏం జరిగినా బాలరాజుని బయటకు క్షేమంగా తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. 23రోజులు గడిచిన తరువాత బాలరాజుని ఏమీ చేయకుండా నక్సల్స్ విడిచిపెట్టారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. భయం చీకటిని చీల్చుకొని చెక్కు చెదరకుండా వచ్చిన సూరీడు మా బాలరాజు అంటూ చింతపల్లిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, హారతులు పట్టి కార్యకర్తులు, కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు. పసుపులేటి బాలరాజు రాజకీయ ప్రయాణంలో ఒదొక కీలకఘట్టం.  ఈ ఘటన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో  కూడా ఒక చరిత్రలో కూడా నిలిచిపోయింది. 

ఆ తరువాత నక్సల్స్ చెర నుంచి బయటకు వచ్చిన బాలరాజు ఆ 23 రోజులు తనను నక్సల్స్ బాగానే చూసుకున్నారని మీడియాకి తెలియజేశారు. నక్సల్స్ బాలరాజుని కిడ్నాప్ చేసింది మొదలు..మళ్లీ విడుదల చేసేవరకూ పత్రికలూ, జాతీయ మీడియా అంతా ఫోకస్ చింతపల్లి, కొయ్యూ మండలాలపైనే పెట్టింది.  అయితే కుటుంబానికి, ప్రజలకు దూరంగా ఉండిపోయానని..ఒక దశలో తాను కూడా చనిపోతాననే భయం వెంటాడినా.. వారితో అన్నిరోజులు అడవిలో గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు బాలరాజు. నాటి నుంచి నేటి వరకూ బాలరాజు తిరుగులేని గిరిజన రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. చాలా మంది నేటి యువతకు తెలియని ఈ 30ఏళ్ల సంఘటన మరోసారి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి క మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ప్రజలు, పాఠకుల ముందుకి తీసుకు వచ్చింది..!

Koyyuru

2023-01-30 01:57:30

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని సోమవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 67 గదులు, హరిహర సదన్ ఏసీ 82,  హరి హర సదన్ నాన్ ఏసీ 48,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 22, ఓల్డ్ సెంటినరీ 7, విఐపీ ఎస్జీహెచ్ 29, సీతారామ చౌల్ట్రీ 55, సత్య నికేతన్ లో35 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-30 01:47:36

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. దానిని పార్టీ ఎంపీలంతా భహిష్కరించాలని 
తీర్మానించారు. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన తరువాత కేసిఆర్ దూకుడు అంతా జాతీయ స్థాయిలోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Hyderabad

2023-01-29 13:44:07