1 ENS Live Breaking News

రీసర్వేతో పేదల భూములకు రక్షణ కల్పించాలి

పేద‌ల జోలికి వెళ్లొద్ద‌ని, వారు సాగుచేసుకుంటున్న‌ భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ భూప‌రిపాల‌న చీఫ్ క‌మిష‌న‌ర్ జి.సాయిప్ర‌ సాద్   అధికారుల‌ను ఆదేశించారు. భూ క‌బ్జాల‌కు పాల్ప‌డే మోతుబ‌రుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. పేద‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కం క్రింద చేప‌ట్టిన స‌మ‌గ్ర భూ స‌ర్వేపై, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో, స‌ర్వే, భూరికార్డుల క‌మిష‌న‌ర్ సిద్దార్ధ‌జైన్ తో క‌లిసి, సిసిఎల్ఏ సాయిప్ర‌సాద్‌ మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా మూడు జిల్లాల్లో జ‌రుగుతున్న‌ రీస‌ర్వే ప్ర‌క్రియ వివ‌రాల‌ను క‌లెక్ట‌ర్ల‌ద్వారా తెలుసుకున్నారు. 

భూ సర్వే ప్ర‌క్రియ‌ను ఖ‌చ్చితంగా, మ‌రింత ప‌క‌డ్భందీగా  నిర్వ‌హించ‌డంతోపాటు, వివ‌రాల‌ను మ‌రింత స‌ర‌ళంగా న‌మోదు చేసే ప్ర‌క్రియ‌పై దృష్టిపెట్టారు. దీనికోసం వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. న‌మోదు చేసే స‌మ‌యంలో వారికి ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. డేటా ఎంట్రీ సుల‌భంగా  చేసేందుకు తీసుకోవాల్సిన‌ చ‌ర్య‌లు, అందుకు ప‌డుతున్న స‌మ‌యంపై వారితో చ‌ర్చించారు.    ఈ సంద‌ర్భంగా సిసిఎల్ఏ  మాట్లాడుతూ, గ్రౌండ్ ట్రూతింగ్ ఖ‌చ్చితంగా చేస్తే, మిగ‌తా ప్ర‌క్రియ కూడా స‌జావుగా జ‌రుగుతుంద‌ని అన్నారు. విఆర్ఓ లాగిన్‌లోని అంశాల‌ను 38 నుంచి 20కి త‌గ్గిస్తామ‌ని చెప్పారు. భూముల కేట‌గిరీకి సంబంధించి అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్ లేదా నాన్ అగ్రిక‌ల్చ‌ర్ విభాగాల‌ను మాత్ర‌మే ఉంచుతామ‌ని తెలిపారు. అలాగే నీటి వ‌న‌రుల‌కు సంబంధించి మేజ‌ర్‌, మీడియం, మైన‌ర్ ఇరిగేష‌న్ ఆప్ష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. 

రైతుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేసే ప్ర‌క్రియ‌ను కూడా మ‌రింత స‌ర‌ళంగా చేస్తామ‌న్నారు. అదేవిధంగా 9(2), 10(2) నోటీసుల‌ను జారీ చేసేందుకు ప్రింటెడ్ ఫారాల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఎక్క‌డ ప్ర‌భుత్వ భూమి ఉన్నా 22 ఏలో న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. అసైన్డ్ భూమి కొన్న‌వారికి  పిఓటి ప్ర‌కారం నోటీసు ఇచ్చి, దానిని ప్ర‌భుత్వ భూమిగా న‌మోదు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ భూముల‌ను సాగుచేసుంటున్న నిరుపేద‌ల జోలికి వెళ్లొద్ద‌ని సిసిఎల్ఏ స్ప‌ష్టం చేశారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, శ్రీ‌కాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌కేష్ బాలాజీ ల‌ఠ్క‌ర్, మ‌న్యం జిల్లా క‌లెక్టర్ నిశాంత్ కుమార్‌, జెసి ఓ.ఆనంద్‌, జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డిఓలు, మూడు జిల్లాల స‌ర్వేశాఖ ఎడిలు, తాశిల్దార్లు, డిటిలు, మండ‌ల స‌ర్వేయ‌ర్లు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-28 13:29:09

ఏపీ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో 57,927 మందికి అర్హత

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈనెల 19 నిర్వహించిన ఎస్ఐ ప్రలిమినరీ పరీక్షలో 57, 927 మంది అర్హత సాధించారు. మొత్తం 1,51,288 మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లను మార్చి 4వ తేదీ వరకూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పరీక్ష లకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీని విడుదల చేసింది. ఆ సమయంలోనే అభ్యర్ధులు తమ ప్రిలిమినరీ పరీక్ష ఏవిధంగా రాశారో పరీక్షించు కున్నారు. అదే కీతో నేడు ఫలితాలు విడుదల అయ్యాయి. https://slprb.ap.gov.in/ అనే వెబ్ సైట్ లో రిజల్ట్స్ ను పొందు పరిచారు. అభ్యర్ధు లు నేరుగా వారి రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ క్రింద కాలమ్ లోనే అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లు కూడా డౌన్ లోచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్హత సాధించిన వారంతా ఫిజికల్ టెస్టుకు అర్హత సాధిస్తారు. అందుతో కూడా అర్హత సాధిస్తే ఎస్ఐ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ఏ ఒక్క పరీక్ష తప్పినా వారు ఈ ఎంపిక ప్రక్రియ నుంచి తప్పుకోవాల్సిందే.

Tadepalli

2023-02-28 06:38:07

1000 కోట్లతో మరో పరిశ్రమ 2వేల మందికి ఉపాధి

తూర్పుగోదావరి జిల్లాలో రూ.1000 కోట్ల పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి వరుణ్‌ గుప్తా తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను కలిసిన త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. దానికి అనుగుణంగా పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నాయని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ సోలార్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటైతే ఎంతోమందికి పరోక్షంగా ఉపాది లభిస్తుందని పరిశ్రమ నిర్వాహకులు తెలియజేశారు.

Tadepalli

2023-02-27 16:37:55

టీటీడీ యాప్ లో పంచగవ్య ఉత్పత్తుల సమాచారం

టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల గురించి టీటీడీ వెబ్సైట్ లోనే కాకుండా ఇటీవల రూపొందించిన యా ప్ లో కూడా సమాచారం పొందుపరచాలని ఈవో  ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదా రులకు సులువుగా చేరువ కావచ్చునని ఆయన తెలిపారు.  తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష జరిపా రు. 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల్లో 10 ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు ఈవో దృష్టికి  తెచ్చారు. వీటిని  మరిం త ఎక్కువగా  వినియోగదారులకు చేరవేయడానికి ,ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో  చెప్పారు.టీటీడీ ఆలయాల్లో వినియో గించిన పుష్పాలతో తయారు చేస్తున్న ఫొటో ఫ్రేమ్ లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వివిధ సైజులు, ఫ్రేమ్ లతో తయారు చేసిన వాటి వెనుక వైపు ఈ ఉత్పత్తి గురించిన పవిత్రత,ప్రాముఖ్యతను అర్థమయ్యేలా ముద్రించాలన్నారు. వీటిపై గణాంక శాఖ అధికారులు సమీక్ష చేయాలని ఈవో సూచించారు.

       అంతకు ముందు తిరుమల , తిరుపతిలో పరకామణి అంశంపై ఈవో సమీక్ష జరిపారు. నాణాలు వివిధ బ్యాంకులకు క్రమ పద్దతిలో పంపే ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు ఏ రోజు నాణాలు ఆరోజు తీసుకుని వెళ్ళేలా ఉన్న వ్యవస్థను మరింత ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నాణాలు నిల్వ ఉండకుండా ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.  జేఈవో సదా భార్గవి, ఎఫ్ ఎ సీఏవో  బాలాజి, పరకామణి ఎఈవో  రాజేంద్రతో పాటు పలువురు అధికారులు  పాల్గొన్నారు.

Tirumala

2023-02-27 14:18:03

తెలంగాణ-ఒడిసా మధ్య ఆర్టీసీ సర్వీసులు షురూ

ఇకపై తెలంగాణ-ఒడిసా మధ్య తెలంగాణ ఆర్టీసులు నడవనున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల మధ్య పరస్పరం బస్ సర్వీసు లు నడిపేందుకు ఆయా రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.  టీఎస్ఆర్టీసీ 10 సర్వీసులు నడిపితే ఓఎస్ఆర్టీసీ 13 సర్వీసులు తెలంగాణకు నడపనుంది. హైదరాబాద్-జైపూర్ 2, ఖమ్మం-రాయగఢ్ 2, భవానీపట్నం-విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. చాలా కాలం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడపాలని భావిస్తున్నప్పటికీ వీలు పడలేదు. దానికితోడూ ఒడిసా నుంచి చాలా మంది తెలంగాణకు వివిధ పనులపై నిత్యం వెళుతుంటారు. అలాంటివారికి ఇప్పటి వరకూ రైళ్లు, కొన్ని ప్రైవేటు బస్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా ఒడిసా, తెలంగాణ ఆర్టీసీల మద్య ఒప్పందం కుదరడం లో రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమం అయ్యింది.

Telangana

2023-02-27 09:14:07

ఇక సెలవు.. మీ ప్రీతి

మెడికో ప్రీతి అంత్యక్రియలు జనగాం జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో సోమవారం మధ్యాహ్నాం ముగిశాయి. డాక్టర్ ప్రీతిని చివ రి సారిగా చూసేందుకు జనం తండోప తండాలుగా గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాలు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు చేపట్టారు. ప్రీతిని చూడటానికి వచ్చిన వారంతా ర్యాగింగ్ భూతానికి ఇంకా ఎంత మంది బలైతే ప్రభుత్వం కఠిన చర్య లు తీసుకుంటుందోనంటూ ఆక్షేపించారు.  అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విగతజీవిగా మారిన ప్రతీ పార్దీవశరీరాన్ని చూస్తూ రోధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాధ వర్ణణాతీతం అయ్యింది. వాళ్లని ఊరుకోపించడం ఎవరితరం కాలేకపోయింది. ఈ సంఘటన మొత్తం చూపరులను సైతం కంటతడిపెట్టేలా చేసింది. ర్యాగింగ్ కు పాల్పడిన సైఫ్ తల్లిండ్రుల పెంపకం వలన డాక్టర్ అయిన ప్రజలకు ప్రాణాలు పోయాల్సిన మహిళ తనువు చాలిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Warangal

2023-02-27 08:45:00

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం వైయస్‌. జగన్,  వైయస్‌.భారతి దంపతులు. అనంతరం గవర్నర్ ను ఘనంగా సీఎం ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తెలియజేశారు.  ప్రభుత్వం సహకారంలో రాష్ట్రంలో అభివ్రుద్ధి పదంలో నడవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Vijayawada

2023-02-23 11:12:11

టీవి9లోగో విషయమా.. నిజంగా అకౌంట్స్ చూడటానికేనా..?

టీవి9 భాగస్వామిల్లో ఒకరిగా సంస్థల్లో అకౌంట్స్ చూడటానికి కార్యాలయానికి వచ్చానని మాజీ సీఈఓ రవిప్రకాష్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని టివి9 కార్యాలయానికి వచ్చిన ఆయన బయట మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థలో నలుగురు భాగస్వాములు ఉన్నారని అన్నారు. టివి9తో, పాటు ఏబిసిఎల్ సంస్థలు నడుస్తున్నాయన్నారు. వాటి అకౌంట్స్ ను చూడటానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. కాగా ఛానల్ లోగోకి సంబంధించిన చర్చలు లోన జరిగాయని ప్రశ్నించిన జర్నలిస్టులకి అంతా మనకి అనుకూలంగానే జరుగుతోందని సమాధానం ఇచ్చారు. చాలా రోజుల తరువాత మళ్లీ టివి9 కార్యాలయంలో రవిప్రకాష్ కనిపించడంలో పాత టివి9 లోగో విషయంలోనే మళ్లీ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం గట్టిగా సాగింది. మరోపక్క రవిప్రకాష్ ఆర్ టివి అనే న్యూస్ ఛానల్ ను ఎస్టాబ్లిస్ చేశారు. ఇప్పటికే అన్నిజిల్లాల్లో నియామకాలు కూడా పూర్తయ్యాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకున్నాకే లోనికెళ్లారు.  ప్రస్తుతం ఈవిషయం చర్చనీయాంశం అవుతోంది.

Hyderabad

2023-02-21 08:32:09

మార్చి 1నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టిటిడి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి మరియు గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనికోసం టిటిడి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. నెలాఖరు నాటికి గుర్తించి ప్రాంతాల్లో ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్ యూనిట్లను ఏర్పాటు టెక్నాలజీని వినియోగించనున్నారు. ప్రయోగం పూర్తయితే టిటిడిలో అన్నిచోట్ల దీనినే ఏర్పాటు చేయాలని టిటిడి భావిస్తోంది.

Tirumala

2023-02-20 09:23:09

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలను ఫిక్స్ అయ్యాయి. ఈ నెల 27, 28 రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అలాగే రెండో రోజు సంతాప తీర్మానాలు, తర్వాత సభ వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, మొత్తం 13 పని దినాల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించి నిరధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం భావించింది. ఈఎన్నికల ప్రచార సమయం పూర్తికాగానే మళ్లీ తిరిగి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులు నిలబడ్డ స్థానాల్లో గట్టి పోటీనే ఉంది.

Tadepalli

2023-02-18 12:46:47

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని సోమవారం అధికా రులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200) 39 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400) 06, న్యూసెంటి నరీ( రూ.500)21, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)01, సత్యనికేతన్(రూ.200) 31, శ్రీసత్యదేవ(రూ.400)38, ప్రకాష్ సదన్(రూ.650) 46, ప్రకాశ్ సదన్ డబుల్  రూమ్(రూ.1600)32, హరిహరసదన్ నాన్ ఏసి (రూ.600) 37, హరిహర సదన్ సింగిల్(రూ.400) 04, హరిహర సదన్ ఏసి(రూ.950) 77 గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-17 01:21:00

సీఎంను కలిసిన ధార్మిక సలహాదారు చాగంటి


సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయం లో కలిసి చాగంటిని సీఎం కూడా సత్కరించారు. అనంతరం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను అందజేశారు. ఆయనతో పాటు శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం చాగంటి సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

Tadepalli

2023-02-16 16:44:54

ఎక్స్ అఫిషియో సభ్యులుగా డా.ఎం.హరిజవహర్‌లాల్

టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా రెవెన్యూ ఎండోమెంట్స్  ప్రిన్సిపల్ సెక్రటరీ(ఎఫ్‌ఎసి) డా. ఎం.హరి జవహర్‌లాల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో  టిటిడి జేఈవో  వీరబ్రహ్మం వారితో ప్రమాణం చేయించారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ బోర్డు సెల్  కస్తూరి బాయి, విజిఓ  బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-02-16 15:17:18

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈనాడుకు గట్టి ఎదురు దెబ్బ

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో-12ను అమలను నిలిపివెయ్యాలంటూ ఈనాడు వేసిన అనుబంధ పిటిషన్ ను ఏపీ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. అంతేకాకుండా జీవో నెంబర్ 12 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.  గ్రామ, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు ఏదైనా న్యూస్ పేపర్ కొనుగోలు చేయడానికి ఎలవెన్సీ ఇస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ వేసింది. అయితే  సత్యమేవ జయతే సాక్షి దినపత్రిక సర్కులేషన్ ను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC)ని పరిగణలోకి తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఈనాడు దాఖలు చేసిన మరొక అనుబంధ పిటిషన్నుకూడా హైకోర్టు కొట్టేసింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC)ఆధారంగానే ప్రభుత్వ ప్రకటనలు, పత్రికల కొనుగోలుకు అనుమతినిస్తాయి. ఒకేసారి సాక్షి సర్క్యూలేషన్ 6 లక్షలకి పెరిగిపోవడంతో ఈనాడు కోర్టుకెక్కినా ఫలితం దక్కలేదు.

2023-02-14 10:03:49

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని శుక్రవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200)21 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400)17, న్యూసెంటినరీ(రూ.500)12, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)1, సత్యనికేతన్(రూ.200)14, శ్రీసత్యదేవ(రూ.400)60, ప్రకాష్ సదన్(రూ.650) 9, ప్రకాశసదన్ ఏసి(రూ.1050)12, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)35, హరిహరసదర్(రూ.600)24, హరిహర సదన్ సింగిల్(రూ.400) 0, హరిహర సదన్ ఏసి(రూ.950) 0 గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-10 02:35:18