1 ENS Live Breaking News

ఏపీలో ఎన్నికల ముందు జర్నలిస్టులకు పప్పుబెల్లాలు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని 26జిల్లాల్లోని 38వేల జర్నలిస్టులకు పప్పుబెల్లాలు పంచే కార్యక్రమం అంటూ సోషల్ మీడియాల్లో పోస్టులు ఊదరగొట్టేస్తున్నారు. మూడున్నరేళ్లు గుర్తుకురాని జర్నలిస్టులు అకారణంగా ఎన్నికలకు ఏడాది ముందు అధికార పార్టీకి, ప్రభుత్వానికి గుర్తొచ్చాయా అంటూ ఎండగడుతూ.. ఫార్వాడింగ్ మెసేజులు క్రింద ట్యాగ్స్ యాడ్ చేస్తున్నారు. జర్నలిస్టుల ప్రధాన గుర్తింపు ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలోనూ జీఓ142తో వేలాది మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు రాకుండా చేసిందని, జీఎస్టీని నిబంధన పెట్టి చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ ప్రశ్నార్ధం చేసిందంటూ పోస్టింగులు పెడుతున్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు, డెస్కు జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, వెటరన్ జర్నలిస్టులు ఇలా వారి కుటుంబాలతో కలిపి సుమారు లక్షా 50వేలకు పైగా ఓట్లు ఉన్నట్టు తాజా లెక్కలు పేర్కొంటున్నాయి.

Tadepalli

2023-01-23 05:55:09

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సర్వీసురూల్స్ అడ్డు..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీలు చేయడానికి సర్వీసు రూల్స్ మోకాలడ్డుతున్నాయి. 1996 ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్సును 
అనుసరించి ఉద్యోగులను సర్వీసును రెగ్యులర్ చేస్తున్న ప్రభుత్వం అదే నిబంధనల ప్రకారం చాలా విభాగాల్లోని సిబ్బందికి ప్రమోషనల్ ఛానల్ కు సంబంధించిన 
సర్వీసు నిబంధనలను పొందు పరచలేదు. ఈ క్రమంలో ఉద్యోగులను బదిలీలు చేస్తే వారంతా వారి సర్వీసును కోల్పోవాల్సి వస్తుంది. సాధారణంగానే ఉద్యోగులు 
అంతర్ జిల్లాలకు బదిలీలు పెట్టుకుంటే వారి సర్వీసును కోల్పోతారు. ఇపుడు ఒకే జిల్లాలో బదిలీలు జరిగినా..సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను 
పొందు పరచకపోవడంతో ఇపుడు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీనితో సచివాలయశాఖలో 19ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఏఏ శాఖల వారికి సర్వీసు 
నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదో వారిని గుర్తిస్తున్నారు. 

వీరిని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా..లేదంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా అనే విషయమై శాఖాధిపతులు మల్ల గుల్లాలు పడుతున్నారు. 
మరోపక్క ఏప్రిల్ తరువాత వీరికి బదిలీలు చేపట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులకు ఏం చేయాలో తోచని పరిస్థితి 
నెలకొంది. అంతేకాకుండా ఇటీవల మిగిలిపోయిన మరికొందరు సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వారి సర్వీసులను రెగ్యులర్ చేయాలని అధికారులను 
ఆదేశించింది. బదిలీలకు సమయం దగ్గరపడటంతో, ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ పొందుపరిచే విషయాన్ని శాఖాధిపతులు సీరియస్ గా తీసుకున్నారనేది రాష్ట్ర 
సచివాలయ వర్గాల టాక్.ఫిబ్రవరిలో సచివాలయశాఖలో మిగులు ఉద్యోగాలకు నోటిఫికేషన జారీచేసే సమయానికి అన్ని శాఖల్లోని ఉద్యోగులకు సర్వీసు 
నిబంధనలు పూర్తిచేయాలని సీఎస్ శాఖాధిపతులను ఆదేశించినట్టు చెబుతున్నారు. 

అంతేకాకుండా ఉద్యోగుల భర్తీ జరగేనాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేసి..మిగులు ఖాళీలనను రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన చోట భర్తీచేయాలని ప్రభుత్వం ఆలోచన 
చేస్తున్నది. అయితే పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై బదిలీలకు సంబంధించిన ఒత్తిడి తీసుకురావడంతో కార్యాచరణ యుద్ద ప్రాతిపదికన 
జరుగుతున్నది. బదిలీలు..జిల్లాల వారీగా జరుపుతారా..అంతర్ జిల్లాల వారీగా జరుపుతారా..అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. చాలా ప్రభుత్వశాఖల 
ఉద్యోగులకు పదోన్నతులు, సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేయకపోవడం వలన బదిలీల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందనే వాదనను సచివాలయ ఉద్యోగులు 
తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్డుగా వున్న సర్వీసు నిబంధనల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ 
నెలకొంది. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఎలాంటి సర్వీసు నిబంధనలు అనుసరిస్తుందనేది..!

Tadepalli

2023-01-23 02:38:21

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు 45268 మంది గైర్హాజరు

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమినరీ ప్రవేశపరీక్షరు 4లక్షల 58వేల 219 మంది హాజరైనట్టు అమరావతిలోని డిజిపీ 
కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. మొత్తం5,03,487 మందికి హాల్ టిక్కెట్లు జారీచేయగా..4,58,219 మంది పరీక్షకు హాజరయ్యారని..45,268 
మంది పరీక్షకు అబ్సెంట్ కాగా 91శాతం హాజరు నమోదైనట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా 
జరిగినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకనటలో తెలిజేశారు. 

Tadepalli

2023-01-22 15:10:21

డీఓపీటి ఎఫెక్ట్.. ఏపీకి రిపోర్ట్ చేసిన సోమేష్ కుమర్

తెలంగాణ మాజీ సీఎస్‌, సోమేశ్‌కుమార్‌ ఏపీ ప్రభుత్వ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి రిపోర్ట్ చేసి.. జాయినింగ్‌ ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం సీఎం జగన్‌తో  సోమేశ్‌కుమార్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. విభజన సమయంలో ఆయన్ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగా.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తెలంగాణకు మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టేసి సోమేశ్‌కుమార్‌ ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. 

Tadepalli

2023-01-12 11:52:05

ఏపీ ప్రభుత్వానికి నూతన ఏడాదిలో హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో నూతన సంవత్సరంలో మొదటి షాక్ తగిలింది. జీఓ నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల23 వరకూ సస్పెన్షన్ అమలులో వుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే రోడ్లపై నిర్వహించే బహిరంగ సభల్లో జనం మృత్యువాత పడుతుందని ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా జీఓనెంబరు-1ని తీసుకొచ్చింది. దీనిపై హైకోర్టుని ఆశ్రయించగా కోర్టు దానిని కొట్టేసింది. విపక్షాలన్నీ జీఓనెంబరు-1ని పెద్ద ఎత్తున తిరస్కరించాయి.

Guntur

2023-01-12 11:37:01

ఏపీఎస్ఆర్టీసీలో శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త

శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీశైలానికి బస్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శనం టికెట్లనూ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సిహెచ్డీ. తిరుమలరావు ప్రకటించారు. రాష్ట్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులకు వసతి కల్పించి, టూరిస్ట్ గైడ్ లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. స్వామివారి దర్శన టిక్కెట్లు ఆర్టీసీ రిజర్వేషన్ చేసుకునే సమయంలో పొంది నేరుగా స్వామిని దర్శించుకోవచ్చునని వివరించారు.

Srisailam

2023-01-12 08:39:19

పదోన్నతులతో ప్రభుత్వ ఉద్యోగులను దారిలోకి తెస్తారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్న వారిని ఒకేసారి దారిలోకి తెచ్చేందుకు పదోన్నతుల అస్త్రం ప్రయోగించనుందని సమాచారం అందుతోంది. దానికోసం ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా వారిని మళ్లీ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవాలన్నది ప్రభుత్వ భావనగా కనిపిస్తున్నది. అయితే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా కేడర్ సాలరీ స్కేల్ కి రీచ్ అయిన వారికి తొలుత పదోన్నతులు కల్పించడం ద్వారా వారికి హోదా పెంచినట్టు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నుంచి ఇదే విషయమై ప్రభుత్వానికి వినతులు కూడా వెళ్లాయి. తాము ఇప్పటికే కేడర్ స్కేలుకి రీచ్ అయినందున తమకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడదని ప్రభుత్వం ముందు ఉంచాయట ఉద్యోగ సంఘాలు. అయితే దానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు చెబుతున్నారు.



పీఆర్, పోలీస్ శాఖలో ప్రారంభమైన పదోన్నతులు
రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ప్రారంభం అయ్యాయి. ఎంపీడీఓలు గా వున్నవారిని డీఎల్డీఓలు గా పదోన్నది కల్పించి.. ఆస్థానంలోకి సీనియర్ మండలపరిషత్ ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్న తులు కల్పించడం ద్వారా అధికారులకు ప్రభుత్వం న్యాయం చేసింది. దీనితో ఎన్నో ఏళ్లనుంచి పదోన్నతులు లేకుండా ఉన్నవారికి పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. మరో వైపు పోలీస్ శాఖలో కూడా హెడ్ కానిస్టేబుళ్లుగా ఉన్నవారికి ఏఎస్ఐలు, సిఐలుగా ఉన్నావారికి డిఎస్పీలు, ఎస్ఐలుగా ఉన్నారికి సిఐలు, డిఎస్పీలుగా ఉన్నవారికి ఏఎస్సీలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తున్నది. దీనితో చాలా మంది ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక్కడ ప్రభుత్వం కూడా లాజిక్ ప్రయోగించింది. ఇక్కడ కేవలం పదోన్నతులు మాత్రమే కల్పించింది. వారికి  ఎలాంటి ఆర్ధికప్రయోజనాలూ చేకూరడం లేదు. కేడర్ సాలరీ స్కేల్ రీచ్ కావడంతో వారికి పదోన్నతులు దక్కాయి. ఇలా మిగిలిన వారికి కూడా కల్పిస్తే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వంగా గుర్తింపుతోపాటు ఉద్యోగుల్లో వ్యతిరేకతను కూడా తగ్గించుకోవాలనే ప్రయత్నంపైనా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఇంకా ప్రమోషన్లకు వెయిటింగ్ లో చాలా ప్రభుత్వ శాఖలు
కేవలం కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకే ప్రమోషన్లకు లైన్ క్లియర్ కాగా చాలా ప్రభుత్వ శాఖలు క్యూలో ఉన్నాయి. ముఖ్యంగా మత్స్యశాఖ, వ్యవసాయశాఖ, పశుసంవర్ధకశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, రెవిన్యూ, నీటిపారుదలశాఖ, వైద్యఆరోగ్యశాఖ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దగానే ఉన్నది. అయితే ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖలకూ పదోన్నతులు కల్పిస్తే..కిందిస్థాయిలో కేడర్ లో ఖాళీలు ఏర్పడతాయి. వెను వెంటనే పదోన్నతులు కల్పించేస్తే..క్రింది క్యాడర్ ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీచేయాల్సి వస్తుందిని..ఖచ్చితంగా ఖాళీలను ప్రకటించాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం 
ఆలోచిస్తున్నది. దానికోసం కేవలం కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖలను ముట్టుకోవడం లేదు ప్రభుత్వం. దీనితో అన్ని ప్రభుత్వశాఖల్లోని యూనియన్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళులుతన్నారు. ప్రభుత్వం పై గుర్రుగా వున్న ప్రధాన శాఖలకు ముందు పదోన్నతులు కల్పిస్తే తరువాత మిగిలిన వారి సంగతి చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా చెబుతున్నారు.

ఇన్ సర్వీసులకు కూడా లైన్ క్లియర్..?
రాష్ట్రప్రభుత్వంలో ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ కు అవకాశం వున్న ప్రభుత్వ శాఖలకు వెనువెంటనే లైన్ క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రారంభించింది. త్వరలోనే అవకాశం వున్న 
ఇతర శాఖల్లో కూడా ఇన్ సర్వీస్ శిక్షణ ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా  వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధకం, పట్టుపురుగుల పెంపకం, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్యం, ఇంకా ప్రాధాన్యత ఉన్న ప్రభుత్వ శాఖల్లో కూడా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అమలు చేసి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి కొత్తగా ఉద్యోగాలు తీసే బాధ తప్పుతుందని కూడా ఆలోచిస్తున్నదట. ఇప్పటికే కొన్ని ప్రభుత్వశాఖల్లో ఇన్ సర్వీస్ శిక్షణ అమలు జరుగుతుండగా.. ఇంకా ఏఏ ప్రభుత్వశాఖల్లో దీనిని అమలు చేయవచ్చో పరిశీలించాలని ఇటీవలే ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శిలకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు.

ఇలా పదోన్నతులు, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇన్ సర్వీస్ అమలు చేయాలన్నా కూడా ప్రభుత్వంపై భారం పడుతుంది. దీనితో కేడర్ స్కేలు చేరుకున్నవారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారానే పని సులువు అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. అన్నీ అనుకూలిస్తే మార్చి తరువాత పదోన్నతుల ఫైళ్లు కదిలే అవకాశం వుంది..!

Tadepalli

2023-01-12 03:47:35

జగనన్న తోడు వడ్డీలేని రుణం రూ.10వేలు

వైయస్‌ జగన్‌ అధ్యక్షతన చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం -6వ విడత జగనన్న తోడు, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395  కోట్లు కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కార్యక్రమం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది.  కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్, ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి అదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ఇతరశాఖల ముఖ్య కార్యదర్శిలు కూడా  పాల్గొన్నారు.

Tadepalli

2023-01-11 11:14:03

పోరుబాటకై ఐక్యవేదికగా ఉద్యోగుల సమర శంఖారావం

ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల మరో పోరుబాటకు సిద్దమవుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్లూ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధనకు మరోసారి కదం తొక్కనున్నారు. నెలంతా కష్టం.. అయినా ఒటకవ తేదీకి రాని జీతం, పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, జీపిఎఫ్ బిల్లులు, ఎస్ఎల్ఎస్ బిల్లులు, ఇలా అనేక సమస్యలపై ఉద్యోగులంతా ఐక్య వేదికగా ముందుకు సాగడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర్య భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ చవిచూడని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కిందిస్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ విరమణ చేసిన తరువాత రావాల్సిన ఉపయోగాలు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో సమరం ఒక్కటేనని ఉద్యోగులంతా భావిస్తున్నారు. దానికోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, కాంట్రాక్టు, పెన్షనర్ సంఘాలన్నీ ఏకమై ఐక్యవేదికగా పోరాటచేయాలని భావిస్తున్నాయి. దానికోసం రాష్ట్ర, జిల్లా, మండలాలు వారీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులు సిద్దపడుతున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంగా ఏర్పాటైన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని తీరా దానికి వ్యతిరేకంగా జీపీఎస్ ను తీసురావాలని చూస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగుల నిరసన తెలియజేయాలంటే అన్ని ఉద్యోగ సంఘాలు ఏకం కావాల్సిన సమయం ఆశన్న మైందని భావిస్తున్నారు. దానికోసం సుమారు 100 సంఘాలను ఒక వేదికపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తేతప్పా ఈఏడాది 7వ నెలలో అమలు కావాల్సిన పీఆర్సీ కూడా వచ్చే పరిస్థితి ఉండదని కూడా 75 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో కూడా చైతన్యం తీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులను సైతం ఆలోచింప జేసే విధంగా.. పీఆర్సీలో జరిగిన అన్యాయం కోల్పోయిన ఐఆర్, ఆలస్యంగా ఉద్యోగాలు రెగ్యులర్ చేయడం వలన కల్పోయిన రెండు డీఏలు, తగ్గిపోయిన హెచ్ఆర్ఏ, డీఏ ఇలా ప్రతీ సచివాలయ ఉద్యోగి తన సర్వీసులో ఏం కోల్పోయారో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు అన్నీ కలిపి ఏకతాటిపైకి రాకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగమే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం వుంటుందనే విషయాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో సామాజిక మాద్యమాల ద్వారా తీసుకెళుతున్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం అదనపు భారం, 2వ శని, ఆది వారాల్లో అదనపు విధులు, ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం తదితర అంశాలను కూడా ప్రతీ ఉద్యోగి పరిగణలోనికి తీసుకోకపోతే భవిష్యత్తు మరింత దారుణంగా తయారవుతుందని పలు ఉద్యోగ సంఘాల నేతలు సహచర ఉద్యోగులకు తెలిసేలా చెబుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఔటు సోర్సింగ్ ఉద్యోగులతో పనులు చేయించే ప్రభుత్వం అదనంగా చేసిన పనికోసం ఏమీ మాట్లాడకపోవడం, సర్వీసులను రెగ్యులర్ చేయకపోవడం వంటి విషయాలను కూడా ఈ ప్రత్యేక ఆందోళన వేదికపైకి తీసుకు వస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ లను ఒప్పుకోకపోతే మాస్ లీవ్(మూకుమ్మడి సెలవులు) పెట్టే యోచనలో కూడా ఉన్నట్టు సమాచారం అందుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ప్రభుత్వ ఉద్యోగుల తలపెట్టిన ఈ సమర శంఖారావంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఉద్యోగులకు నెలయ్యేసరికి జీతాలు అందని ప్రశ్నలా తయారైంది..చూడాలి ఏం జరగబోతుందనేది..!

Tadepalli

2023-01-11 01:48:09

ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని కలెక్టర్లు విధినిర్వహణలో ఉండి మృతిచెందిన వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాల ఇచ్చే కార్యక్రమం వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా వారి విద్యార్హతలను బట్టి గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేసి న తరువాత మిగులు ఖాళీలను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీచేసేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేపడుతోంది. ఇందులో భాగంగా జనవరి నెలాఖరులోగా కారుణ్య నియామకాలను పూర్తిస్థాయిలో భర్తీచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనితో అన్ని జిల్లాల్లో కారుణ్యనియామకాలన్నీ చాలా వరకూ సచివాలయశాఖలోనే భర్తీచేస్తున్నారు.

సంక్రాంతి నాటికి కొత్త నోటిఫికేషన్ల క్లారిటీ..?
కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేసిన తరువాత మిగులు ఉద్యోగాలకు సంబంధించిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ పై ప్రభుత్వం ప్రకటన చేయాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కు చెప్పారు. ఇప్పటికే చాలా వరకూ ఉద్యోగాలను గ్రామ, వార్డు సచివాల యశాఖలోనే ప్రభుత్వం భర్తీ చేస్తుందని, మిగిలిన ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్ తోపాటు, సదరు ఉద్యోగాలకు గతంలో విద్యార్హతలు లేకపోవడం వలన మిగిలిపోయిన ఉద్యోగాలను అర్హతల విషయంలోనూ సడలింపులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి వుందన్నారు. 2023 ఏప్రిల్ నాటికి సచివాలయశాఖలో పోస్టులన్నీ భర్తీచేసి పూర్తిస్థాయి ప్రభుత్వశాఖగా నిలపాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మిగులు ఉద్యోగాలు, సచివాలయాల వారీగా ఖాళీలు వివరాలు సేకరించామన్నారు.

ఏప్రిల్ నెలలోనే బదిలీలపై ప్రకటన వచ్చే అవకాశం
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగాలన్నీ భర్తీచేసిన తరువాతన ప్రభుత్వం ఈ శాఖలో బదిలీలు చేసే ప్రక్రియ ప్రారంభించనుందట. ముందుగా ఖాళీలు భర్తీచేయడం ద్వారా మిగులు ఉద్యోగాలు నియామకాలు పూర్తిచేసి, అపుడు బదిలీలకు పచ్చజెండా ఊపను న్నారని చెబుతున్నారు. ఇప్పటికే విధుల్లోకి చేరి, రెండేళ్లు పూర్తి చేసుకున్నవారి జాబితాను ప్రభుత్వం సిద్దం చేసింది. తరువాత బ్యాచ్ లో సర్వీసు రెగ్యులైజేషన్ కు రెడిగా వున్నవారిని, కొత్తగా నియమాకాలుచేప ట్టే  ఖాళీలలను బేరీజు వేసుకొని, ఆపై బదిలీల ప్రక్రియ చేపట్టడం ద్వారా ఎక్కడా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈవిషయమై గ్రామ,వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని ప్రభుత్వ శాఖ  కార్యదర్శిలకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. అన్నీ అనుకూలిస్తే  ఉద్యోగ నోటిఫికేషన్ తోపాటుగానే సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంపై ఒక క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది.


Tadepalli

2023-01-10 05:02:23

భారతదేశం గర్వించేలా ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ

వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని, ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి దేశం గర్వించదగ్గ బృహత్తర  కార్యక్రమం 'ఫ్యామిలీ ఫిజీషియన్' కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖా, జిల్లా ఇంచార్జి మంత్రి  విడదల రజని పేర్కొన్నారు. సోమవారం  విశాఖ విఎమ్ఆర్డీఎ ఎరీనా లో రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి.కష్ణబాబు తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ ఆరు జిల్లాల (విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, విజయనగరం, శ్రీకాకుళం,మన్యం ) అధికారులతో ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఫ్యామిలీ 
ఫిజీషియన్ కాన్సెప్ట్ , విలేజ్ హెల్త్ క్లినిక్స్ , అర్బన్ హెల్త్ క్లినిక్స్, వెక్టర్ కంట్రోల్ హైజీన్ మెజర్స్, ఎపిడమిక్ డిసిజ్ సర్వేలన్స్, ఎన్సీడి సర్వే, ముఖ హాజరు విధానం, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ట్రాన్స్ పోర్టెషన్, డ్ర్రగ్స్, సర్జీకల్ బడ్జెట్ కేటాయింపు, ఎన్ యు హెచ్ ఎం,  ఆర్ సి హెచ్ నమెదు, ప్రసవాలు , జేఎస్వై చెల్లింపులు, రక్త 
హీనత  తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష చేసారు.

 ఈ సమీక్ష లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే వైద్య పరీక్షలు, మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో 'ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్' ఉద్దేశ్యమని చెప్పారు. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ లోఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం 
చేపట్టిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు అమలు లో సమస్యలు తెలుసుకునేందుకు ఈ ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో వైద్య శాఖలో వంద శాతం వైద్య సిబ్బందిని నియామకాలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని 
అన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో నలబై ఏడు వేల మంది సిబ్బందిని భర్తీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా మందుల కొరత లేదని, పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల ద్వారా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు విస్తతంగా, సంతప్త స్థాయిలో అందుతున్నాయన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ప్రక్రియను ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యాధికారులు, సంబంధిత సిబ్బంది ప్రణాళికాబద్ధంగా, భాధ్యతాయుతంగా చేపట్టి ప్రజారోగ్య ప్రతిష్టతకు పాటుపడాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో మౌలిక సదుపాయాల పెంచినందున గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు అక్కడే  జరిగేందుకు వైద్యుల కృషి చేయాలని కోరారు.

కేజీహెచ్ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లా కలెక్టర్ కు  మంత్రి అభినందనలు తెలిపారు. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి.కృష్ణబాబు  మాట్లాడుతూ ఏ ఒక్క నిరుపేద ప్రాణానికి వైద్యం కొరత రాకూడదన్న సహృద్బావంతో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య , ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు ప్రతి వైద్యుడు కృషి చేయాలని కోరారు. విద్య, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలపడం ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ ఆధారిత హాజరు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఎం ఎల్ హెచ్ పి ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంపుకు శిక్షణ చేసినట్లు తెలిపారు.

గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేయాలని అన్నారు .డయాబెటిస్ , బీపి , థైరోయిడ్ వంటి రోగాలను గుర్తించి వారు మందులు విలేజ్ క్లినిక్ ద్వారా గాని లేదా ప్రైవేట్ గా గాని వాడేటట్లు చేసి ప్రతి నెల రికార్డు చేయాలన్నారు . క్యాన్సర్ వ్యాధులకు కారకాలైన పొగాకు , గుట్కా ,ఆల్కహాల్ వంటి వ్యసనాల పట్ల అవగాహన కల్పించాలన్నారు . విశాఖ కేజీహెచ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున ను అభినందించారు. జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున మాట్లాడుతూ  కేజీహెచ్ మరియు ఇతర ఆసుపత్రు లలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి గాను పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు . 3.3 కోట్ల సిఎస్ఆర్ నిధులను వెచ్చించి వివిధ పనులను నిర్వహించామన్నారు.

ఘోషా  ఆసుపత్రిలో 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 20 బెడ్ల  వార్డు ఏర్పాటు చేశామని, పేషంట్ల బంధువులకు కూడా రూములను ఏర్పాటు చేశామన్నారు. కేజీహెచ్ లో వివిధ విభాగాల హెచ్వోడీలకు వివిధ ఖర్చుల నిమిత్తము ఒక లక్ష రూపాయలను చొప్పున 26 లక్షలు కేటాయింపు చేయడం జరిగిందని , 2వ రౌండ్ కేటాయింపు త్వరలో చేస్తామన్నారు . ఆయా విభాగాలలో వైద్య సేవలతో పాటు పలు ఇతర అంశాలైన అటెండెన్స్ , ఆహార నాణ్యత , శానిటేషన్ తదితర అంశాలకు హెచ్వోడీలను  బాధ్యులను చేసామన్నారు . కే జి హెచ్ లో పలు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు . హెచ్వోడీలు చేసిన పలు సూచనలు అమలు గావించామన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందిని భర్తీ చేయాలన్నారు . రూ. 40 లక్షల సిఎస్ఆర్ నిధులతో పాడేరు ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు . తద్వారా ఏజెన్సీలో గతంలో ఎన్నడు లేని విధంగా 600 సర్జరీలు పూర్తి చేసినట్లు  తెలిపారు.   

కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ జె. నివాస్ మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని అన్నారు.  డిఎం&హెచ్ఒ, డిసిహెచ్ఎస్ ఇద్దరు సంయుక్తంగా కలిసి పనిచేయాలని తెలిపారు. గర్భిణీ లను మొదటి త్రైమాసికంలో తప్పక ఆశా వర్కర్స్ రిజిస్టర్ చేయాలని , దానివలన హై రిస్క్ కేసులను సులభంగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. పట్టణాలలో డ్రై డే ఫ్రైడే తప్పక అమలు చేయాలని కోరారు . మురళీధర్ రెడ్డి ఎండి, ఏపీఎంఐడిసి మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మందులు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డి ఎం & హెచ్ ఒ లు ఇండెంట్ తో బాటు అదనంగా మందులు నిల్వ ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను ఎప్పటకప్పుడు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిఎస్ నవీన్ కుమార్ , సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ , ఆరోగ్య శ్రీ ముఖ్య నిర్వహణ అధికారి హరీంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ , ఏపీ వివిపి & డి ఎమ్ ఈ , ఆరు జిల్లాల నుండి వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , డి సి హెచ్ ఎస్ లు , అర్ & బి , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
    

విశాఖపట్నం

2023-01-09 15:38:57

APPSC గ్రూప్-1 పరీక్షా విధానంలో భారీమార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘ కాలం తరువాత నిర్వహించిన Appsc Group-1 పరీక్ష విధానంలో సమూల మార్పులకి శ్రీకారం చుట్టింది.. ఎప్పుడూ లేనివిధంగా 2019 నుంచి ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల విధానంలో భారీ మార్పులు తీసుకు వచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగాలకు గ్రూప్-2 స్థాయి, గ్రూప్-2 ఉద్యోగాలకు గ్రూప్-1 స్థాయి..ఇపుడు గ్రూప్-1 ఉద్యోగాలకు సివిల్ సర్వీస్ స్థాయిలో పోటీ పరిక్షల ప్రశ్నా పత్రాలను ఇవ్వడం ప్రారంభించింది. అందులోనూ అత్యధికంగా జతచేయడం అనే విధానంలో ప్రశ్నలు ఇవ్వడంతో అభ్యర్ధులు చాలా దారుణంగా తడబడ్డారు. ఇకపై ప్రశ్నలు ఈ విధంగానే ఉంటాయనే విధంగా ఏపీపీఏస్సీ తీసుకొచ్చిన మార్పులు అభ్యర్ధులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒకరకంగా చెప్పాలంటే గ్రూప్-1 పరీక్షా విధానం చూసిన తరువాత అభ్యర్ధులు ఏవిధంగా పోటీపరీక్షలకు సిద్దం కావాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈసారి గ్రూప్-1 ప్రలిమ్స్ అత్యల్పంగా మాత్రమే క్వాలిఫై అవుతారని చెప్పకతప్పదు.

Tadepalli

2023-01-09 03:20:56

వసతులకు అనుగుణంగానే గదుల అద్దెనిర్ణయం

తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి విశ్రాంతి గృహాలను భక్తుల కోరిక మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించినట్టు టిటిడి పేర్కొంది. అయితే, కొన్ని పత్రికల్లో పేర్కొన్న ట్టు గదుల అద్దె భారీగా పెంచేశారనడం వాస్తవం దూరం. ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను నిర్ణయించి అదే అద్దెను వసూలు చేస్తున్నారు. అయితే, పలువురు భక్తులు  ఏసీతోపాటు అధునాతన  సౌకర్యాలు కల్పించాలని సలహాలు, సూచనలు అందించిన మేరకు టిటిడి ఈ విశ్రాంతి గృహాల్లోని గదులను ఆధునీకరించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించింది.  అయితే, సదరు మీడియాలో పేర్కొన్నట్లు గదుల అద్దెను భారీగా టిటిడి పెంచిందనడం వాస్తవం కాదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.

Tirumala

2023-01-07 11:25:48

అలాంటి తేడా సిబ్బందికి, అధికారులకు ఇక రంగుపడుద్ది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేడా ఉద్యోగులు, సిబ్బంది విషయంలో దూకుడు పెంచింది. ఉదయం బయె మెట్రిక్ వేసే సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి, ఏదో తెగ కష్టపడిపోతున్నట్టుగా అధికారిక వాట్సప్ గ్రూపుల్లో ఫోటోలు పెట్టేసి.. కార్యాలయంలోని సిబ్బంది పనిమొత్తం తానొక్కడినే చేసేస్తున్నట్టు తెగ ఫీలై పోయి.. ఆపై సొంతపనులపై వెళ్లి మళ్లీ సాయంత్రం సమయానికి అటెండెన్సులు వేసే తేడా సిబ్బంది ఆట కట్టించడానికి ప్రత్యేక సంచార ఆకస్మిక తనిఖీ బృందాలను(ఫ్లైయింగ్ చెకింగ్ స్క్వాడ్) ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు వారు పలువురు అధికారులతో స్క్వాడ్ బృందాలను కూడా నియమించింది. వీరంతా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. తనిఖీ వచ్చిన సమయానికి కార్యాలయాల్లో సిబ్బందిలేకపోయి నా..మూమెంట్ లో సరైన కారణం లేకపోయిని జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్చార్జి పోస్టులు, డిప్యూటేషన్లు చేసేవారని ఈ బృందాలు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ ప్రత్యేక బృందాలను తేడా సిబ్బందిని ఎంత మేరక పట్టుకుంటాయో..కార్యాలయంలోనే ఉంచి పనులు చేయిస్తాయో..!

Tadepalli

2023-01-07 10:56:18

ఏపీ కొత్తజిల్లాల్లో సర్ధుబాటుకోసమే గ్రూప్-1, 2పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో భర్తీచేయబోయే గ్రూప్-2 ఉద్యోగాలన్నీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 13 కొత్తజిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వశాఖల కార్యాలయాల్లోని సర్ధుబాటుకోసమేనని తెలుస్తుంది. ఇటీవల గ్రూప్-1 లో ఇచ్చిన పోస్టులు కూడా అత్యధికంగా కొత్త జిల్లాల్లో తక్కువగా డిఎస్పీలను 
భర్తీచేయడానికి, ఇతర ప్రభుత్వ శాఖలకు సర్ధుబాటు చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇపుడు గ్రూప్-2 పోస్టులు కూడా ఆ విధంగా క్రిందిస్థాయి కేడర్ పోస్టులను భర్తీచేయడానికే ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. త్వరలోనే గ్రూప్-1 ప్రక్రియ మొత్తం పూర్తిచేయడానికి అన్ని ఏర్పాట్లు 
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఎన్ని పోస్టులకు అనుమతిస్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 1500 గ్రూప్-2 పోస్టులు అవసరం అవుతాయని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. 

అందులోనూ 2024 తరువాత అత్యధికంగా ఉద్యోగ విరమణలు ఉండటం కూడా ప్రస్తుత నోటిఫికేషన్ కు ఊతం వచ్చింది. అయితే ప్రభుత్వం సుమారు 500 నుంచి 700 వరకూ పోస్టులకు అనుమతి ఇస్తుందని అధికారులు కూడా భావిస్తున్నారు. అంత మొత్తంలో పోస్టులు భర్తీచేయకపోతే పరిపాలన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కొన్నిప్రభుత్వశాఖల్లో పదోన్నతల ద్వారా కూడా గ్రూప్-2, గ్రూప్-1 పోస్టుల్లోకి చేరికలు ఉంటాయని తెలిసింది. అలా మొత్తం ఏర్పాట్లు పూర్తయిన తరువాతనే కొత్తగా తీస్తున్న పోస్టుల భర్తీ, ప్రభుత్వ శాఖల కేటాయింపు జరుగుతుందని సమాచారం. చూడాలి ప్రభుత్వం ఏ తరహా విధానం అవలంభిస్తుందనేది..!

Amaravati

2023-01-07 05:19:54