1 ENS Live Breaking News

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 14 గదులు, హరిహర సదన్ ఏసీ 14,  హరి హర సదన్ నాన్ ఏసీ 19,  హరి హర సదన్ సింగిల్ 0, న్యూ సెంటినరీ 4, ఓల్డ్ సెంటినరీ 2, విఐపీ ఎస్జీహెచ్ 14, సీతారామ చౌల్ట్రీ 35, సత్య నికేతన్ లో29 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-28 03:31:09

తిరుమలలో రథసప్తమి పర్వదినానికి ఏర్పాట్లుపూర్తి

తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని  తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

మాడ వీధుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సివిఎస్వో, ఎస్పీ
రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను టిటిడి సివిఎస్వో నరసింహకిషోర్‌, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన మండపం, మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీ కోసం చేపట్టిన ప్రవేశమార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-27 12:14:29

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 21 గదులు, హరిహర సదన్ ఏసీ 18,  హరి హర సదన్ నాన్ ఏసీ 6,  హరి హర సదన్ సింగిల్ 0, న్యూ సెంటినరీ 6, ఓల్డ్ సెంటినరీ 14, విఐపీ ఎస్జీహెచ్ 11, సీతారామ చౌల్ట్రీ 26, సత్య నికేతన్ లో 30 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-27 02:56:57

టిడిపి అధినేత చంద్రబాబుని కలుస్తున్న IAS, IPS లు..!?

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనలో చీలికలు వస్తున్నాయా.. సివిల్ సర్వీస్ అధికారులు రెండు వర్గాలు చీలిపోతున్నారా.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులకు నచ్చుతున్నాయి.. మరెంత మందికి నచ్చడం లేదు.. ఈ కారణంతోనే కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులు టిటిపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలుస్తున్నారా..? ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్..! ఏపీలో మునుపెన్నడూ లేని ఆర్ధిక సంక్షోభం రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో అటెండర్ల జీతాల నుంచి ఐఏఎస్ ల సౌకర్యాల వరకూ ప్రతీదీ తడుముకునే పరిస్థితి వస్తోందని..ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ భారం ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులపైనా పడుతుందని సివిల్ సర్వీస్ అధికారులు భావిస్తున్నారట. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరిట నగదు బదిలీకి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం.. ఆ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం వారంత ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల అధికారులకు ఉద్యోగులు వచ్చి మొరపెట్టుకోవడం గత కొద్ది రోజులుగా జరుగుతూ వస్తోంది. అయితే ఈ విధానం నచ్చని కొందరు సివిల్ సర్వీస్ అధికారులు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు, వారిని అనుసరించే మరికొందరు చంద్రబాబుతో రహస్యంగ భేటి అయినట్టు చెబుతున్నారు.ప్రభుత్వంలోని ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నుంచి పెరుగుతున్న నిరసన..త్వరలో జరగబోయే ఉద్యోగ విరమణలు, వారందరికీ చెల్లించాల్సిన సదుపాయాల ఆర్ధిక భారం ప్రభుత్వంపై చాలా గట్టిగా పడుతుందని..ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుందనే విషయాన్ని చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారట. అయితే అధికార ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షపార్టీగా వున్న మాజీ ముఖ్యమంత్రి వద్దకు బ్యూరోక్రాట్లు ఎందుకు వెళుతున్నారనే విషయం, ప్రచారం ఇపుడు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సివిల్ సర్వీస్ అధికారులు చాలా మంది ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అయితే అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన వారంతా  మంచి శాఖల్లో ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లుగా ఉండగా ప్రాధాన్యత లేని, ప్రజలతో అంతగా సంబంధంలేని శాఖలకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన బ్యూరోక్రాట్లను బదిలీచేశారనే ఆవేదనను చంద్రబాబు ముందు 
ఉంచినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వారికి కాస్త సన్నిహితంగా వున్న మరికొందరు సివిల్ సర్వీస్ అధికారులు కూడా ప్రభుత్వంలోని తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వంలో ఆర్ధిక సంక్షోభం, ఉద్యోగులు, అధికారులను కాదని కేవలం ప్రజల సంక్షేమం పేరిట నగదు బదిలీల చేస్తున్న విధానాలను కొందరు బ్యూరోక్రాట్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం టిడిపి అధికారంలో లేదు..చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అయినా బ్యూరోక్రాట్లు ఎందుకు వెళ్లి కలుస్తున్నారనే విషయంలో విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా బయటకు వచ్చింది ఒకే సమాజిక వర్గానికి చెందిన వారు, బంధుగణంలో ఉన్న బ్యూరోక్రాట్లు కలిసినపుడు ఈ విషయం బయటకు వచ్చిందా..లేదంటే నిజంగానే ప్రభుత్వ పరిపాలన గాడితప్పుతున్నదనే విషయాన్ని నేరుగా వాస్తవ పరిస్థితిని తెలియజేయడానికి చంద్రబాబు వద్దకు వెళుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రాధాన్యత లేని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బ్యూరోక్రాట్లు కొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నామనే విషయాన్ని చెప్పడానికి కూడా వెళుతున్నట్టుగా సమాచారం అందుతున్నది. ఇప్పటికే కొందరు బ్యూరోక్రాట్లు కేంద్ర సర్వీసులకు దరఖాస్తులు చేసుకోగా మరికొందరు అదేబాటలో ఉన్నారనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వాన్ని మంచి సూచనలు, సలహాలతో నడిపించేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సివిల్ సర్వీసు అధికారులే. అయితే వారి అంచనాలకు సైతం అందకుండా ఆర్ధిక భారాన్ని అప్పుల రూపంలోనూ, సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం మీదకు తీసుకువచ్చే క్రమంలో వాటిని ముందుండి నడిపించాల్సిన బ్యూరోక్రాట్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నందుకు మరికొందరు ఐఏఎస్ లు కోర్టు మెట్లు ఎక్కి శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. దీనితో ఈ తరహా విషయాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా బ్యూరోక్రాట్లు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతున్నారనే సంకేతాలను ఇస్తున్నారా అనే అనుమానాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా పడిపోయి సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఆలస్యం కావడం, ప్రభుత్వ పథకాలకే అత్యధిక మొత్తం అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, వాటి విషయంలో పలు ప్రభుత్వశాఖలకు చెందిన ఐఏఎస్ లు మధ్యలో ఉండటం,ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోవడం, 2023లో పీఆర్సీ ఇస్తారో ఇవ్వని పరిస్థితి నెలకొనడం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, వాటి స్థానంలో జీపిఎస్ ప్రవేశపెట్టడం, తాజాగా ఉద్యోగుల విరమణ వయస్సు మరో ఏడాది అంటే 63ఏళ్లకు పెంచాలని యోచించడం, ఉద్యోగుల హెచ్ఆర్ఏ, డిఏ లు కుదించడం, ఎన్నికల హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవ డం, వాటిపై ప్రభుత్వశాఖలకు భారీస్థాయిలో వినతులు రావడం, సోషల్ మీడియాలో బ్యూరోక్రాట్లపై తేడాగా ప్రచారం జరగడం, ఆదాయం వచ్చే మార్గాలను వదిలిపెట్టి.. ఆ భారాన్ని ప్రజలపై అధిక పన్నుల రూపంలో వసూలు చేయడం..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడం, పదోన్నతులు కల్పించకపోవడం, బదిలీ లు చేపట్టకపోవడం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి నిత్యం బ్యూరోక్రాట్లకు వస్తున్న ఒత్తిడి, వారి మనసులో ఉద్యోగుల కోసం పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధి కారులుగా అమ్మనా బూతులు తిడుతున్న విషయాన్ని నేరుగా అధికాలు విని తీవ్రంగా మదన పడటం తదితర అంశాలను చంద్రబాబు ద్రష్టికి తీసుకెళితే రాజకీయంగా ఎదుర్కోవడానికి అవకాశం వుంటుందనే కోణంలో కూడా బ్యూరోక్రాట్లు కలుస్తున్నట్టు సమాచారం అందుతున్నది. నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న సివిల్ సర్వీస్ అధికారులు ఒక వర్గంగా విడిపోతున్నారా అనే  ప్రచారం మాత్రం రోజు రోజుకూ తీవ్రమైన చర్చకు దారితీస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ, నిఘా వర్గాల సమాచారం పక్కాగా అందుతున్న సమయంలో ఈ తరహా ప్రచారాలను ప్రజలు కూడా ఆశక్తిగానే స్వీకరిస్తున్నారనేది తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి...!

Tadepalli

2023-01-27 01:20:38

ఈసారైనా గ్రేడ్-5కార్యదర్శిలకు అధికారాలొచ్చేనా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాల్లో చేరిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు నేటివరకూ ఎలాంటి అధికారాలూ లేకుండానే పనిచేస్తున్నారు. మూడున్నరేళ్ల నుంచి తమకు కనీస అధికారాలు ఇవ్వాలని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదీ చుట్టూ కాళ్లు అరిగెలా తిరినా ఫలితం కనిపించలేదు. కనీసం ఈశాఖకు కొత్తగా వచ్చిన ముఖ్యకార్యదర్శి  బుడితి రాజశేఖర్ ద్వారా నైనా తమకు అధికార బదలాయింపు జరుగుతుందా అనే ఆశమళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల్లో చిగురించింది. అసాధ్యాలను సైతం తన తెలివితేటలతో సుసాధ్యం చేసే అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖరకు మంచిపేరు ఉంది. గతంలో ఈశాఖ ముఖ్య కార్యదర్శిగా వున్న ద్వివేదీకి సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అవి బుట్టదాఖలే అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈయనకు బదిలీ జరగడంతో మళ్లీ సచివాలయ ఉద్యోగులకు ఆశలు చిగురించాయి, కొత్తగా ఆసీటులోకి వచ్చిన ఐఏఎస్ అధికారిపై ఉన్ననమ్మకంతో మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు కట్టబెట్టే విషయమై విన్నవించడానికి సిద్ద పడుతున్నారు.

ప్రస్తుతం మేజర్ పంచాయతీలు ఉన్నచోట 1 సచివాలయం మినహా, 2, 3 సచివాలయాల గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా విధులు నిర్వహించాల్సి  వస్తున్నది. ఆఖరికి గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు సైతం పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-1)ను చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమకు కనీస అధికారాలు కల్పించాలని, తమకు జీఓనెంబరు 146 ద్వారా రావాల్సిన అధికారాలు బదలాయించాలని నెత్తీ నోరూ కొట్టుకున్నా వీరికి ప్రభుత్వం నుంచి అధికారాలు రాలేదు. అయితే ఇదే విషయమై సచివాలయ ఉద్యోగులు జిల్లా పంచాయతీ అధికారులకు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి సైతం ఉద్యోగ 
సంఘాలు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లా కలెక్టర్లకు గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వాలని, తద్వారా 
గ్రామాల్లో అభివృద్ధి, ప్రజలకు సహకారం పెరుగుతుందని భావించినా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో వాటిని 
అమలు చేయలేదు. తాజాగా ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిని బదిలీచేయడంతో మళ్లీ ఈశాఖలోని అధికారులకు, సిబ్బందికి ఊపిరి లేచొచ్చినట్టు అయ్యింది. 

కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగా పనులు చేయని పీఅండ్ ఆర్డీ ముఖ్యకార్యదర్శిని కలవడానికి కూడా ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. చాలాకాలం తరువాత ఈశాఖలో ముఖ్యకార్యదర్శి మార్పుతో అధికారులు, ఉద్యోగులతోపాటు, గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకనైనా పంచాయతీరాజ్ శాఖలో అన్ని పనులు చక చకా ముందుకిగి సాగుతాయనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ శాఖకు ముఖ్య కార్యదర్శిగా వచ్చిన బుడితి 
రాజశేఖర్ ద్వారా నైనా పనులు ముందుకు సాగుతాయా..లేదంటే మునుపటి ముఖ్యకార్యదర్శి మల్లే అన్ని దరఖాస్తులు చెత్త బుట్టలోనే కాపురం ఉంటాయా అనేది 
మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. అయితే ఉద్యోగులు, అధికారులు మాత్రం ఈయనపై గట్టినమ్మకంతోనే ఉన్నారు.

Tadepalli

2023-01-25 02:36:05

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా  విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 56 గదులు, హరిహర సదన్ ఏసీ 72,  హరి హర సదన్ నాన్ ఏసీ 42,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 15, ఓల్డ్ సెంటినరీ 34, విఐపీ ఎస్జీహెచ్ 26, సీతారామ చౌల్ట్రీ 68, సత్య నికేతన్ లో 34 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-25 02:24:52

ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు

దేశంలోనే  తొలిసారిగా ఏపీలో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు  నవరత్నాలు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రోడ్ల మరమ్మతులపై ఏపీ సీఎం ఎంఎస్ యాప్ ద్వారా ప్రజలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని..వచ్చిన ఫిర్యాదులను 60రోజుల్లో పరిష్కరించున్నట్టు ఆయన వివరించారు.

Tadepalli

2023-01-24 13:25:04

ఐదు ప్రభుత్వ శాఖలకు ఒకే ఒక్క ముఖ్యకార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐదు ప్రభుత్వశాఖలకు ఒకే ఒక్క ముఖ్యకార్యదర్శిగా చేసే అవకాశం సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలక్రిష్ణ ద్వివేదికి దక్కింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయనను వ్యవసాయశాఖకు బదిలీచేస్తూనే.. వాటితో పాటు సహకార, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్ మెంట్, మత్స్యశాఖ, మైనింగ్ శాఖలతోపాటు రైతు భరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్ గా కొనసాగుతారని ఉటంకిస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ శాఖకు బుడితి రాజశేఖర్ ను ప్రభుత్వం నియమించింది.

Tadepalli

2023-01-24 06:53:45

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 63 గదులు, హరిహర సదన్ ఏసీ 81,  హరి హర సదన్ నాన్ ఏసీ 33,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 11, ఓల్డ్ సెంటినరీ 12, విఐపీ ఎస్జీహెచ్ 22, సీతారామ చౌల్ట్రీ 68, సత్య నికేతన్ లో 31 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-24 03:31:53

ఆ..జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలమైనా అద్దిల్లులే శరణ్యం..!

భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కొత్తజిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓలు తొలిసారిగా అద్దెఇంట్లో ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగంలో జిల్లా కలెక్టర్ ఉద్యోగం, జిల్లా ఎస్పీ, డిఎఫ్ఓ ఉద్యోగాలు అత్యున్నతంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లు భావిస్తారు. సివిల్ సర్వీస్ కేడర్ ఉద్యోగం అంటే ఒక కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్, జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ వాటితో పాటు క్యాంపు ఆఫీసు, నివాస సముదాయం అన్ని ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం నూతనంగా ఏర్పడిన 13 జిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీశాఖ అధికారులకు మాత్రం అద్దె ఇల్లులే శరణ్యం అయ్యాయి. కొత్తగా జిల్లాల ఏర్పాటు చేయడంతో కొన్ని చోట్ల కలెక్టరేట్లు కూడా ప్రైవేటు సముదాయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లంతా బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించాల్సి వస్తున్నది. వీరికి హోదా గొప్ప..నివాస సముదాయం దిబ్బ అన్నట్టుగా తయారైంది.

అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ క్యాడర్ రాకపోయినా సీనియారిటీపై సివిల్ సర్వీస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇటీవల అమరవాతిలో కలిసిన వీరంతా తమ గోడును ఒకరికి ఒకరు చెప్పుకున్నారట. రాష్ట్రప్రభుత్వం నాడు-నేడు క్రింద ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇచ్చే ప్రాధాన్యత కనీసం సివిల్ సర్వీస్ అధికారుల మైన  నివాస సముదాయాలు, క్యాంపు కార్యాలయాలకు ఇవ్వడం లేదనే అసహనం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలకి సైతం నూతన భవనాలు నిర్మాణం జరుగుతోందని మనకి మాత్రం అద్దిల్లులే శరణ్యం అవుతున్నాయని కాస్త చిన్నబుచ్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ఇంటి గ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలిని భావించినా అవీ అతీ గతీలేకుండానే ఉన్నాయని, సాధారణ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగాప్రైవేటు అద్దె ఇళ్ల నుంచి కలెక్టరేట్లకు, జిల్లా పోలీస్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసులకు వెళ్లడం కాస్త చిన్నతనంగా ఉందని చెప్పుకున్నారట.

మరికొందరు ఒక్క అడుగు ముందుకి వేసి.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసిన విషయం బయటకు పొక్కిందని చెబుతున్నారు. ఈ విషయం కొత్తగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓ లే కాకుండా, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ లు కూడా ఈ విధంగానే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం తలచుకుంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు తక్షణమే నిర్మాణం చేపట్టలేకపోయినా.. కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు, డిఎఫ్ఓలకు నివాస సముదాయాలు, క్యాంపు ఆఫీసులు కట్టించగలదని..కానీ పోస్టింగులు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే పాత ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఫ్ఓ లకు నివాస సముదాయాలతోపాటు, క్యాంపు ఆఫీసులు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లోనే  కొన్ని చోట్ల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 

ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లు భార్యభర్తలుగా ఉన్నవారు మాత్రం పాత ఉమ్మడి జిల్లాల్లో ఉంటే మాత్రం ఏదో ఒక ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన వారంతా తమ మార్కు, నూతన జిల్లాలు తమతోనే ప్రారంభం అయ్యాయనే ఆనందంతో ఉన్నారట. అన్నీ ఉండీ అల్లుడినోట్లో శని అన్నట్టుగా పేరుకి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి హోదాలు ఉన్నా..తలదాచుకోవడానికి ప్రభుత్వ వసతి సముదాయమే లేదని విషయం ఇపుడుజిల్లాశాఖల అధికారుల్లోనూ గుప్పుమంటున్నది. కాగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళితే వచ్చే ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యతగా కొత్తజిల్లాల్లో అధికారుల నివాస సముదాయాలు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, క్యాంపు కార్యాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాట్లాడినట్టుగా తెలుస్తున్నది. చూడాలి..కొత్త జిల్లాల కలెక్టర్లు, జెసిలు ఎస్పీలు, డిఎఫ్ఓల మనోవేధన ఎప్పటికి నయం అవుతుందో..!

Tadepalli

2023-01-24 01:40:29

రేపటి నుంచి ఏపీలో జీఓనెంబరు-1 మళ్లీ అమలు

ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓనెంబరు-1 మళ్లీ మంగళవారం నుంచి మళ్లీ అమలులోకి రానుంది. ఈరోజు వరకూ జీఓను సస్పెండ్ చేసిన హైకోర్టు. ప్రభుత్వం 
జీఓని కొనసాగించడానికి అనుమతి నిచ్చింది. ఆ సస్పెన్షన్ ను కొనసాగించడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రేపట్నుంచి జీవో నంబర్ 1 అమల్లోకి రానుంది. 
టీడీపీ రోడ్లపై జరుగుతున్న సభలలో తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సమావేశాలు, సభలను నిషేధిస్తూ ఏపీ 
సర్కార్ జీవో-1 జారీ చేసింది. ఈనేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించినా ఈరోజు వరకే అది సస్పెండ్ లో ఉంది.

Tadepalli

2023-01-23 13:15:02

రాష్ట్రంలో రోడ్లను తక్షణమే బాగుచేయండి..సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని పాడైన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. పాడైన రోడ్లన్నింటినీ బాగుచేయాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రోడ్లపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయాలని, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బాగుచేయాలని ఆదేశించారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు. నగరాలు, పట్టణాల్లో పౌరుడు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోగా రోడ్లను మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిప ఏపీసీఎంఎంస్‌ యాప్‌ ను సీఎం జగన్ ప్రారంభించారు.

Tadepalli

2023-01-23 12:44:27

ఏపీ సీఐడీ చీఫ్ గా ఎన్.సంజయ్ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ కొత్త చీఫ్ గా ఎన్.సంజయ్ ను నియమించింది. 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నారు. ఆయన గతంలో ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గానూ పనిచేశారు. సీఐడీ చీఫ్ గా సంజయ్ మంగళవారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐపీఎస్ లు బదిలీలు జరుగుతాయని ముందుగానే సీఎంఓలో ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఐడీ చీఫ్ గా ఆయన నియామకం కూడా చర్చనీయాంశం అవుతోంది.

Tadepalli

2023-01-23 12:34:57

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 70 గదులు, హరిహర సదన్ ఏసీ 82,  హరి హర సదన్ నాన్ ఏసీ 45,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 37, ఓల్డ్ సెంటినరీ 39, విఐపీ ఎస్జీహెచ్ 25, సీతారామ చౌల్ట్రీ 68, సత్య నికేతన్ లో 40 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-23 11:50:28

శ్రీవాణి ట్రస్టు నిధులతో 2068 ఆలయాల నిర్మాణం

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో 
కలిపి మొత్తం 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య 
భవనంలో సోమవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర 
ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)ను 2019లో ఏర్పాటుచేసినట్టు చెప్పారు. లక్ష రూపాయల లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు 
వర్తింపచేయాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్‌ దర్శన టికెట్‌ జారీ చేస్తున్నామని వివరించారు. ఈ ట్రస్టు 
నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.

శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు దాతల నుండి రూ.650 కోట్ల విరాళాలు సమకూరాయని తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో 2019వ 
సంవత్సరానికి ముందు 502 ఆలయాలు నిర్మించినట్టు వెల్లడించారు. అనంతరం ఈ ఫౌండేషన్‌ సహకారంతో 320 ఆలయాల నిర్మాణానికి రూ.32 కోట్ల శ్రీవాణి 
నిధులు మంజూరుచేశామని, వీటిలో 110 ఆలయాలు ఒకనెలలో, 210 ఆలయాలు 6 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో 
వెనుకబడిన ప్రాంతాల్లో 932 ఆలయాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు కేటాయించామని, దశలవారీగా ఇప్పటివరకు రూ.25 కోట్లు మంజూరుచేశామని 
వివరించారు.అదేవిధంగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 150 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇందుకోసం రూ.130 కోట్లు కేటాయించగా
ఇప్పటివరకు రూ.71 కోట్లు విడుదల చేశామని తెలియజేశారు. ఈ విధంగా 1402 ఆలయాల నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. మరో 667 ఆలయాల 
ర్మాణానికి వినతులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వీటిని ఖరారు చేసి నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప 
నైవేద్యాల కోసం ప్రతినెలా ఆలయ కమిటీ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేస్తామని, ఇందుకోసం రూ.12.50 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 

వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకు గాను ప్రతినెలా రూ.2 వేలు ఆలయ కమిటీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్టు వివరించారు. ఆలయాల 
నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టిటిడి బృందం తరచూ తనిఖీ చేస్తుందని తెలిపారు.
కాగా, శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 50 శాతం నిధులను టిటిడి జనరల్‌ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నారని, ఆదాయం కోసమే శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తున్నారని, 
నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి 
చేశారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉందని, అందులోనే విరాళాలు జమ అవుతాయని చెప్పారు. టిటిడి నుండి సొమ్ము  ప్రభుత్వానికి  అందే 
ప్రసక్తే లేదన్నారు. మరింత ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శచేలకు ఇచ్చే బ్రేక్‌ దర్శన టికెట్లను 1000కి తగ్గించడం జరిగిందన్నారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్‌లో, 250 టికెట్లు ఆఫ్‌లైన్‌లో రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేస్తున్నట్టు చెప్పారు. మీడియా సమావేశంలో టిటిడి జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహకిషోర్‌, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tirumala

2023-01-23 11:02:53