వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని, ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి దేశం గర్వించదగ్గ బృహత్తర కార్యక్రమం 'ఫ్యామిలీ ఫిజీషియన్' కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖా, జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సోమవారం విశాఖ విఎమ్ఆర్డీఎ ఎరీనా లో రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి.కష్ణబాబు తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ ఆరు జిల్లాల (విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, విజయనగరం, శ్రీకాకుళం,మన్యం ) అధికారులతో ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఫ్యామిలీ
ఫిజీషియన్ కాన్సెప్ట్ , విలేజ్ హెల్త్ క్లినిక్స్ , అర్బన్ హెల్త్ క్లినిక్స్, వెక్టర్ కంట్రోల్ హైజీన్ మెజర్స్, ఎపిడమిక్ డిసిజ్ సర్వేలన్స్, ఎన్సీడి సర్వే, ముఖ హాజరు విధానం, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ట్రాన్స్ పోర్టెషన్, డ్ర్రగ్స్, సర్జీకల్ బడ్జెట్ కేటాయింపు, ఎన్ యు హెచ్ ఎం, ఆర్ సి హెచ్ నమెదు, ప్రసవాలు , జేఎస్వై చెల్లింపులు, రక్త
హీనత తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష చేసారు.
ఈ సమీక్ష లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే వైద్య పరీక్షలు, మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో 'ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్' ఉద్దేశ్యమని చెప్పారు. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ లోఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు అమలు లో సమస్యలు తెలుసుకునేందుకు ఈ ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య శాఖలో వంద శాతం వైద్య సిబ్బందిని నియామకాలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని
అన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో నలబై ఏడు వేల మంది సిబ్బందిని భర్తీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా మందుల కొరత లేదని, పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల ద్వారా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు విస్తతంగా, సంతప్త స్థాయిలో అందుతున్నాయన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ప్రక్రియను ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యాధికారులు, సంబంధిత సిబ్బంది ప్రణాళికాబద్ధంగా, భాధ్యతాయుతంగా చేపట్టి ప్రజారోగ్య ప్రతిష్టతకు పాటుపడాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో మౌలిక సదుపాయాల పెంచినందున గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు అక్కడే జరిగేందుకు వైద్యుల కృషి చేయాలని కోరారు.
కేజీహెచ్ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లా కలెక్టర్ కు మంత్రి అభినందనలు తెలిపారు. వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ఏ ఒక్క నిరుపేద ప్రాణానికి వైద్యం కొరత రాకూడదన్న సహృద్బావంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య , ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు ప్రతి వైద్యుడు కృషి చేయాలని కోరారు. విద్య, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలపడం ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ ఆధారిత హాజరు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఎం ఎల్ హెచ్ పి ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంపుకు శిక్షణ చేసినట్లు తెలిపారు.
గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేయాలని అన్నారు .డయాబెటిస్ , బీపి , థైరోయిడ్ వంటి రోగాలను గుర్తించి వారు మందులు విలేజ్ క్లినిక్ ద్వారా గాని లేదా ప్రైవేట్ గా గాని వాడేటట్లు చేసి ప్రతి నెల రికార్డు చేయాలన్నారు . క్యాన్సర్ వ్యాధులకు కారకాలైన పొగాకు , గుట్కా ,ఆల్కహాల్ వంటి వ్యసనాల పట్ల అవగాహన కల్పించాలన్నారు . విశాఖ కేజీహెచ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విశాఖ జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున ను అభినందించారు. జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున మాట్లాడుతూ కేజీహెచ్ మరియు ఇతర ఆసుపత్రు లలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి గాను పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు . 3.3 కోట్ల సిఎస్ఆర్ నిధులను వెచ్చించి వివిధ పనులను నిర్వహించామన్నారు.
ఘోషా ఆసుపత్రిలో 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 20 బెడ్ల వార్డు ఏర్పాటు చేశామని, పేషంట్ల బంధువులకు కూడా రూములను ఏర్పాటు చేశామన్నారు. కేజీహెచ్ లో వివిధ విభాగాల హెచ్వోడీలకు వివిధ ఖర్చుల నిమిత్తము ఒక లక్ష రూపాయలను చొప్పున 26 లక్షలు కేటాయింపు చేయడం జరిగిందని , 2వ రౌండ్ కేటాయింపు త్వరలో చేస్తామన్నారు . ఆయా విభాగాలలో వైద్య సేవలతో పాటు పలు ఇతర అంశాలైన అటెండెన్స్ , ఆహార నాణ్యత , శానిటేషన్ తదితర అంశాలకు హెచ్వోడీలను బాధ్యులను చేసామన్నారు . కే జి హెచ్ లో పలు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు . హెచ్వోడీలు చేసిన పలు సూచనలు అమలు గావించామన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందిని భర్తీ చేయాలన్నారు . రూ. 40 లక్షల సిఎస్ఆర్ నిధులతో పాడేరు ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు . తద్వారా ఏజెన్సీలో గతంలో ఎన్నడు లేని విధంగా 600 సర్జరీలు పూర్తి చేసినట్లు తెలిపారు.
కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ జె. నివాస్ మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని అన్నారు. డిఎం&హెచ్ఒ, డిసిహెచ్ఎస్ ఇద్దరు సంయుక్తంగా కలిసి పనిచేయాలని తెలిపారు. గర్భిణీ లను మొదటి త్రైమాసికంలో తప్పక ఆశా వర్కర్స్ రిజిస్టర్ చేయాలని , దానివలన హై రిస్క్ కేసులను సులభంగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. పట్టణాలలో డ్రై డే ఫ్రైడే తప్పక అమలు చేయాలని కోరారు . మురళీధర్ రెడ్డి ఎండి, ఏపీఎంఐడిసి మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మందులు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డి ఎం & హెచ్ ఒ లు ఇండెంట్ తో బాటు అదనంగా మందులు నిల్వ ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన మందులను ఎప్పటకప్పుడు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎస్ నవీన్ కుమార్ , సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ , ఆరోగ్య శ్రీ ముఖ్య నిర్వహణ అధికారి హరీంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ , ఏపీ వివిపి & డి ఎమ్ ఈ , ఆరు జిల్లాల నుండి వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , డి సి హెచ్ ఎస్ లు , అర్ & బి , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.