1 ENS Live Breaking News

సచివాలయ ఆదాయానికి గండి పెట్టేవారిపై మూడోకన్ను

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల ఆదాయానికి గండి కొట్టే పంచాయతీ, రెవిన్యూ సిబ్బందిపై ప్రభు త్వం మూడోకన్ను వేసి పర్యవేక్షణ చేపడుతున్నట్టు సమాచారం. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం గా 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఏడాది నుంచి రెవిన్యూ, ఇతర దృవీకరణ పత్రాలు సచివాలయాల్లోనే ఇవ్వడం ప్రారంభించింది. అయితే నాటి నుంచి నేటి వరకూ సచివాల యాలున్న వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మీ-సేవ సర్వీలకు ఎక్కడా డిమాండ్ తగ్గకపోగా పెరుగుతంది. దీనితో ఇదంతా ఇంటి దొంగల పనేనని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ సచివాలయ సేవలు, మీ-సేవల ద్వారా పొందిన సేవలను లెక్కగట్టింది. దీనితో చాలా చోట్ల సచివాలయాల కంటే మీ-సేవాల్లోనే రెవిన్యూశాఖ, పంచాయతీలకు పలు రకాల దృవీకరణలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కాకుండా మీ-సేవల్లో ఎక్కడ, ఏ మండలం, డివిజన్ నుంచి అర్జీలు అధికంగా వెళుతున్నాయనే సమాచారాన్ని బయటకు తీసేపనికి తెరలేపింది ప్రభుత్వం. ఒక పక్క ప్రభుత్వా నికి ఆదాయంలేక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతుంటే..మరోపక్క సిబ్బందే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించే వైనంపై సీరియస్ గా వుంది.

అదనపు ఆదాయం కోసమే మీ-సేవాలకు ఫైళ్ల బదిలీ
గ్రామ, వార్డు సచివాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా 572 రకాల దృవీకరణలు తక్కువ ధరలకే ప్రభుత్వం అందిస్తోంది. అందునా..మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిర్ణీత సమయానికే వీటిని అందజేస్తుంది. ఈనేపథ్యంలో వివిధ శాఖల సిబ్బందికి అడ్డడారిలో వచ్చే ఆదాయం పడిపోతున్నది. దీనితో సచివాలయాలకు కాకుండా మీ-సేవ కేంద్రాలకు పలు రకాల దృవీకరణ పత్రాలను దారిమళ్లిస్తున్నారు. కొంత మంది మీ-సేవ ప్రతినిధులతో కుమ్మక్కై రేటు మాట్లాడుకుంటూ..అడిగిన మొత్తం రాగానే సదరు దృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు. అలా ఆదాయాలు పెంచుకోవడానికి తేడా సిబ్బందికి మీ-సేవాలు కేరాఫ్ అడ్రస్ గా మారాయని ప్రభుత్వం గుర్తించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న మీ-సేవా కేంద్రాల జాబితాతో పాటు. ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలోని మీ-సేవా కేంద్రాల్లో ప్రభుత్వ దృవీకరణ పత్రాలు అధికంగా చేస్తున్నారనే సంఖ్యను ప్రభుత్వం లెక్కలు వేస్తున్నది. అక్రమార్జన కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిని గుర్తించే పనిని వేగవంతం చేసింది. ప్రభుత్వ రికార్డుల్లోనూ సచివాలయ సేవల కంటే..రాష్ట్రవ్యాప్తంగా మీసేవ రికార్డులే అధికంగా ఉండటం ప్రభుత్వ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

జిల్లాలో కలెక్టర్లు, మండలాల్లో తహశీల్దార్ లు అప్రమత్తం
ప్రభత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే వారిని గుర్తించే పనిని ప్రభుత్వం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో తహశీల్దార్లకు అప్పగించినట్టు సమాచారం అందుతుంది. ఎక్కువగా ఏఏ మీ-సేవా కేంద్రాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల కంటే అత్యధికంగా రెవిన్యూ, ఇతర ప్రభుత్వశాఖల ఆధారిత దృవీకరణలు చేపడుతున్నారో లెక్కగట్టే కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. తద్వారా ఏఏ ప్రాంతాల్లో ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో కాకుండా మీ-సేవ కేంద్రాల ద్వారా దృవీకరణలు చేయిస్తున్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం వుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలాల డేష్ బోర్డుల నుంచి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు సేకరించినట్టు చెబుతున్నారు. పక్కాగా ఆధారాలు లభించిన వెంటనే సదరు సిబ్బందిపై వేటు వేసి తద్వారా ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్టు పక్కగా సమాచారం అందింది.

ప్రధాన ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం
భారదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అత్యధిక మొత్తంలో సంక్షేమ పథకాల పేరిట నగదు బదిలీ నేరుగా లబ్దిదారులకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజనాలో కాసులు ఐసుముక్క కరిగిపోయినట్టుగా ఆవిరైపోతున్నా యి. దీనితో ప్రభుత్వం నిత్యం ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలు, ఆదాయ మార్గాలను అన్వేషించడంతోపాటు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలకు ఎక్కడ గండి పడుతుందనే కోనంలో ప్రభుత్వంలోని 75 శాఖల్లోనూ నిఘా పెట్టింది. ప్రతీరోజూ సాయంత్రానికల్లా ప్రభుత్వ ఖజానాలోకి నిర్ణీత మొత్తం వస్తే తప్పా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పించన్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వ శాఖల్లోని అత్యంత వేగంగా ఆదాయం వచ్చే ప్రభుత్వ శాఖలను గుర్తించడంతోపాటు, ఆయా శాఖల్లో డిజిటల్ లావాదేవీలను ప్రవేశపెట్టాలని ఆయా ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శిలను కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్నులు, ఇతర ఆదాయం ఎప్పటకప్పుడు ఖజానా డేష్ బోర్డు ద్వారా తెలుసుకునే వీలుంటుందని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. చూడాలి ఇంటి దొంగలను పట్టుకుంటుందా.. పోన్లే మన వాళ్లే కాస్త కాసులకు కక్కుర్తి పడుతున్నారని వదిలేస్తారో..!

Tadepalli

2023-01-07 04:01:59

అమ్మకానికి/విలీనానికి శ్రీ విజయ విశాఖ డెయిరీ?

ఆంధ్రప్రదేశ్ విశాఖ(గాజువాక)లో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ విజయ విశాఖ పాల డెయిరీ కంపెనీ లిమిటెడ్ అమ్మకానికి/విలీనానికి రంగం సిద్ధమైనట్టు స్పష్ట మైన సంకేతాలు కనిపిస్తున్నాయి. డెయిరీకి చెందిన డైరెక్టర్లతో ఇటీవలే ఒకప్రైవేటు కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ప్రధాన షేర్ హోల్డర్లు, కంపెనీ ఉద్యోగులతోనూ మంతనాలు చేసినట్టు తెలిసింది. ప్రతిపాదించిన ప్రైవేటు కంపెనీలో విశాఖ డెయిరీలో విలీనం చేసినా, అమ్మకం చేసినా భారీ నజరానా ఇస్తామని కూడా ఆశచూపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ అంశం వైరల్ అవుతుంది.  విశాఖ డెయిరీ పాలు సేకరించే అన్ని ప్రాంతాల నుంచి ఒక ప్రైవేటు డెయిరీకి చెందిన ప్రతినిధులు గ్రామస్థాయిలోనూ, పాల సేకరణ కేంద్రాల సమాచారంతోపాటు మొత్తం విశాఖ డెయిరీకి వున్న పాల నెట్వర్క్ రైతులు, బల్క్ కూలింగ్ సెంటర్లు, గ్రామస్థాయిలో సచివాలయ పశుసంవర్ధకశాఖ సిబ్బంది, అధికారుల వివరాలు సేకరిస్తుండటం విశేషం..!

Tadepalli

2023-01-06 04:55:28

గీతం ఆక్రమణలు బంధోబస్తు మధ్య మరోసారి కూల్చివేత

గీతం యూనివర్శిటీలోని మెడికల్ కాలేజీ ప్రాంతం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని, వాటిని కూల్చేం దుకు విశాఖపట్నం రెవిన్యూ యంత్రాంగం మరోసారి సిద్ధమైంది. తెల్లవారు జామునుండి కూల్చివేత మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రహరీ గోడలు తొలగిస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి మరీ ప్రభుత్వం ఈకూల్చివేతకు పూనుకుంది. కాగా కనీసం సమాచారం లేకుండా, కక్షపూరీతంగా కూల్చుతున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తుంది. యూనివర్సిటీ ఆక్రమణలు 45 ఎకరాలు మేర ఉన్నాయని.. ప్రభుత్వ భూములు ఆక్రమణ భారీగా జరిగిందంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలో తొలగింపు జరుగుతోంది.

Visakhapatnam

2023-01-06 02:56:00

గ్రామ సచివాలయాల్లో బదిలీలు ఎవరికి చేస్తారంటే..?

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంగీకరించిన నేపథ్యంలో ఉద్యోగులకు ఏ విధంగా బదిలీలు నిర్వహించాలనే విషయమై సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు, ఇతర ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్లు తర్జన బర్జనలు పడుతున్నారు. తొలుత రెండేళ్ళు సర్వీసు పూర్తిచేసుకొని, రెగ్యులర్ అయిన వారికి బదిలీలు జరిపి, తరువాత మిగిలిన వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల విషయంలో ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా నిబంధనలు పాటించాలా.. లేదంటే సచివాలయశాఖకు ప్రత్యేకంగా కొత్త నిబంధనలు ఏర్పాటు చేసి జీఓ ఇవ్వాలా అనేవిషయంపై కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

Tadepalli

2023-01-06 02:31:42

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

తిరుమల శ్రీవారిని గురువారం రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.  ద‌ర్శ‌నానంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో   గ‌వ‌ర్న‌ర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి  ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అందించారు.  ఈ కార్యక్రమంలోసివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్‌, డెప్యూటీ ఈవోలు ర‌మేష్‌బాబు, హరేంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-05 14:29:58

హుక్కా ప్రియులకు శుభవార్త..కేఫ్ లు తెరుకుంటాయ్

హైదరాబాదులోని హుక్కా ప్రియులకు శుభవార్త. హుక్కా పార్లర్‌ను నడపడానికి తెలంగాణ హైకోర్టు షరతుల తో కూడిన అనుమతిని మంజూరు చేసింది. హుక్కా పార్లర్ యజమానులను వేధించవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో హుక్కా పార్లర్‌ను తనిఖీ చేసేందుకు లోపలికి రావద్దని సమర్థ అధికారు లను ఆదేశించలేమని కోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక లాంజ్ హుక్కా & కేఫ్ చాంద్రాయణగుట్ట యజమాని దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు పట్ల హుక్కా ప్రియులు, హుక్కాపార్లర్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana

2023-01-05 14:05:12

ENS న్యూస్ ఏజెన్సీకి జిల్లా రిపోర్టర్లు కావలెను

భారతదేశపు తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens LIve, న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలో పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి రిపోర్టర్లు, కెమెరా మేన్ లు, జిల్లా యాడ్ మేనేజర్లు కావలెను. స్థానికంగా ఉంటూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంచి నెట్వర్క్ కలిగి, కనీసం డిగ్రీ చదువుకొని, మొబైల్ లో తెలుగు చక్కగా న్యూస్ ఫార్మాట్ రూపంలో వార్తలు కంపోజింగ్, కదలకుండా వీడియోలు తీయడం వచ్చి ఉండాలి. గతంలో ఏదైనా మీడియా సంస్థల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును, ఆకర్షణీయమైన జీతం, ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించబడును. వివరాలకు  చీఫ్ రిపోర్టర్ ఈఎన్ఎస్ బాలు,  ఫోన్ నెంబర్లు 9490280270, 9390280270.

Visakhapatnam

2023-01-05 07:15:22

Ens Live చెప్పినట్టే.. సచివాలయాలే ఆదాయమార్గాలు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు కాబోతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్ కింద ప్రభుత్వం 572 సేవలను సచివాలయాలు అందిస్తున్నాయి. తొలుత పైలట్ ప్రాజె క్టుగా కొన్ని సచివాలయాలకే ఇచ్చారు. ఇపుడు రాష్ట్రంలోని 14వేల5 సచివాలయాల్లో వీటిని అమలు చేయ నున్నారు. అంతేకాకుండా ప్రతీశాఖ ఉద్యోగికి కంప్యూటర్ ఇచ్చి, సదరు ఉద్యోగి ప్రభుత్వశాఖల కు చెందిన సేవలను, దృవీకరణ పత్రాలను వారితోనే చేయిస్తారు. ఇలాచేస్తే ప్రభుత్వ ఖజానాకు నిత్యం కాసులేనని Ens Live ఏడాది క్రితమే తెలియజేసింది. సీఎం సమీక్షలో ఈవిషయాన్ని అధికారులు(SOP)గా చెప్పారు.

Tadepalli

2023-01-05 05:38:05

యలమంచిలి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్..

ఏపీ  సీఎం వైఎస్‌ జగన్‌ అనకాపల్లి జిల్లా యలమంచిలి పర్యటన నిమిత్తం కొద్ది నిమిషాల క్రింత విజయవాడ విమానాశ్రయం నుంచి విశాఖ బయలు దేరారు. నిన్న మృతిచెందిన విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 12.00 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళర్పిస్తారు.  అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

2023-01-05 04:50:02

సిమ్ కార్డులు ఇవ్వకముందే మూలకి చేసిన మొబైల్స్

ఏపీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వింతపరిస్థితి చోటుచేసుకుంది. ఇక్కడ పనిచేసే సచివాలయ మహిళా పోలీసులుకు ప్రభుత్వం సెల్ ఫోన్లు ఇచ్చింది గానీ, అందులో వినియోగించడానికి సిమ్ కార్డు(ప్రభుత్వ నెట్వర్క్ కలిగిన)లు ఇవ్వలేదు. ఈఫోన్లు ఇచ్చి ఏడాది గడిచింది. అపుడే ఆఫోన్లు మూలకు చేరిపోతున్నాయి. కొన్ని ఫోన్లు బ్యాటరీలు పాడైపోయి చార్జింగ్ నిలబడటం లేదు. ప్రభుత్వం సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులే తమ సొంతఖర్చుతో ప్రైవేటు నెంబర్లు వేసుకొని ఆఫోన్లను వాడాల్సి వస్తుంది. ఈవిషయాన్ని పోలీసుశాఖ వద్ద ప్రస్తావిస్తే..త్వరలోనే సిమ్ కార్డులు ఇస్తాం అనిచెబుతూనే వస్తున్నారు ఏడాది నుంచి..!

తాడేపల్లి

2023-01-05 03:49:31

సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతికి బంపరాఫర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోనే అందుబాటులోకి వచ్చిన ఫేషియల్ బయోమెట్రిక్ హాజరు గ్రామసచివాలయాలకు వర్తింపచేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెప్పారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్సు నడుస్తుండగా సంక్రాంతి దాటిన తరువాత నెలాఖరులోపుగా దానిని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాలు చెప్పి బయటకి వెళ్లిపోయే జంపింగ్ లకు కళ్లెం పడనుంది. అంతేకాకుండా ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Tadepalli

2023-01-05 03:26:17

గ్రామ సచివాలయాలను మరింత ఆధునీకరించాలి

గ్రామ, వార్డు సచివాలయాలను మరింతగా ఆధునీకరించి ప్రజలకు సేవలు అందించడంతో అగ్రగామిగా నిలవా లని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సచివాలయ వ్యవ స్థపై సమీక్ష నిర్వహించిన ఆయన సిబ్బంది విధులపై ఆయాప్రభుత్వశాఖలు ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీ జర్) ఏర్పాటుచేయాలన్నారు. అన్ని సచివాలయాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నారు. సచివాల యాల్లోని ప్రభుత్వ శాఖాధిపతులు నెలలో రెండుసార్లు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నారు.

Tadepalli

2023-01-05 03:12:55

శ్రీవారి దర్శనానికి 190 గ్రామాల గిరిజన భక్తులు..

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనేది ప్రతి హిందువు కోరిక. మన రాష్ట్రంలోనే ఉన్నా వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితి వారిది. అలాంటి వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 గ్రామాల నుండి సుమారు 9300 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్‌ కార్యదర్శి త్రినాథ్‌ తెలిపారు.

Tirumala

2023-01-04 15:11:18

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ సరికొత్త రికార్డు

తెలంగాణ నల్ల బంగారం ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్ సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ నెలలో అత్యధిక నెలవారీ ఉత్పత్తిని సాధించినట్లు సంస్థ ప్రకటించింది. గత నెల 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని అది 2021 డిసెంబర్ కంటే 19 శాతం ఎక్కువని వెల్లడించింది. అంతే కాకుండా గత నెలలో రోజుకు 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్లు ప్రకటించింది. ఇదే ఉత్సాహాన్ని మరో 3నెలల పాటు కొనసాగించి ఉత్పత్తి, రవాణా పెంచాలని సంస్థ సీఎండీ శ్రీధర్ కార్మికులకు పిలుపునిచ్చారు.

Singareni

2023-01-04 05:41:33

ఉదయం 6 గంటల నుంచే వైకుంఠద్వార సర్వదర్శనం

సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం ప్రారంభమైన అనంతరం శ్రీవారి ఆలయం ముందు, ఆ తరువాత అన్నమయ్య భవన్లో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో  వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే శ్రీవాణి టికెట్లు కూడా ఆఫ్ లైన్లో రద్దు చేసినట్లు ఆయన వివరించారు. 

Tirumala

2023-01-02 13:34:02