1 ENS Live Breaking News

వాహన మిత్ర ద్వారా రూ.261.51 కోట్లు జమ

భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా పథకాన్ని వారి అకౌంట్లకు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.

Visakhapatnam

2022-07-15 07:02:43

టీ ఇస్తే.. షోకాజు నోటీసు జారీ చేశారు..

ఎక్కడైనా టీ ఇస్తే తిరిగి తేంక్స్ చెబుతారు.. కానీ ఒక ఉద్యోగి టీ ఇచ్చినందుకు అధికారులు ఆయనకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని ఖజురహో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ పర్యటన జరుగుతోంది. ఆ పర్యటనలో చల్లని టీ ఇచ్చిన ఓ ఉద్యోగి ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాడు. పర్యటనలో సీఎంకు ఓ జూనియర్ సివిల్ సప్లైస్ అధికారి రాకేష్ కనౌహా 'టీ' అందించాడు. అది బాగోలేదని మంగళవారం అతడికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు అందజేశారు. సోమవారం ఛతర్‌పూర్ ఎయిర్‌పోర్టులో సీఎం ఆగిన సమయంలో ఇది జరిగింది. అయితే నోటీసులివ్వడంపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యమంత్రికి చల్లగా అయిపోయిన, రుచిలేని టీ ఇవ్వడం, ఆపై ఉద్యోగికి షోకాజ్ నోటీసులిచ్చిన ఘటన ఇపుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

Madhya pradesh

2022-07-12 09:59:41

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers, real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-07-06 07:32:58

Visakhapatnam

2022-07-01 13:29:49

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలో ఒకటైన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై క్లారిటీ తెలుగురాష్ట్రాలకు ఇచ్చింది. పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు వీలుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు పంపాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు న్యాయశాఖ సూచించింది. బిల్లు పాసైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయి. అదేవిధంగా తెలంగాణాలోని 119 అసెంబ్లీ స్థానాలు 153కి పెరుగుతాయి. వీటి పెరుగుదల ఆధారంగా పార్లమెంటు స్థానాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికే ఈ స్థానాలు పెంచి విభజన చట్టం హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో అసెంబ్లీకి వెళ్లాలనుకునే ఆశావాహ ఎమ్మెల్యే అభ్యర్ధులకు లైన్ క్లియర్ అవుతుంది. అటు రాజకీయపార్టీలకు కూడా బలం పెంచుకునేందుకు అవకాశం దొరుకుతుంది.

New Delhi

2022-06-28 13:53:24

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-01 02:21:52

డాక్టర్ కంపెనీ పేర్లతో మందులు రాయకూడదు

భారత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఎంబీబీస్,  పీజీ వైద్యులు తాము హెల్త్ ప్రాక్టీస్ చేసే సమయంలోగానీ, ఆసుపత్రి విధి నిర్వహణలోగానీ  రోగులకు మందుల కంపెనీల పేరుతో రాయకుడదని కేవలం మందులో ఉండే డ్రగ్ కాంబినేషన్, ఎంత డోస్ తీసుకోవాలో మాత్రమే మందుల చీటిలో రాయాలని, అదీ కూడా జనరిక్ మందులనే రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్ కు చెందిన ఎథిక్స్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు అధ్యక్షులు డా.అచల్ గులాటీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రోగి మందుల చీటిలో సంబంధిత రోగానికి చెందిన డ్రగ్ ను కూడా పెద్ద అక్షరాలతో అర్దమయ్యే విధంగా రాయాలని పేర్కొంది. పైగా రోగి యొక్క వ్యాధిని కుటుంబంలోని వారికి ఉన్నది ఉన్నట్టు తెలియజేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్యులు ఫార్మా కంపెనీలు ఎలాంటి బహుమతులు కూడా తీసుకోకూడదని కూడా హెచ్చరించింది. గతంలో ఒకసారి ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఏ ఒక్క ఎంబీబీఎస్ వైద్యుడిలోనూ మార్పురాలేదు. ఈ విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో కేంద్రం మరోసారి ఈ విషయంలో గట్టిగా స్పందించింది మళ్లీ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు తమ ప్రాక్టీసు సమయంలో ఏ విధంగా ప్రాక్టీసు చేయాలి, టెలీమెడిసిన్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశాలపై సుదీర్ఘంగా సుమా 70 పేజీల్లో సూచనలు చేసింది. అలా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో  హెచ్చరించింది.

New Delhi

2022-05-25 07:03:10

శ్రీవారి ఆలయానికి న‌వీముంబైలో స్థ‌లం

మహారాష్ట్రలోని నవీ ముంబ‌యిలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన 10 ఎక‌రాల స్థ‌లానికి సంబంధించిన అధికారిక పత్రాలను మంగ‌ళ‌వారం టిటిడి ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి  మ‌ల్లికార్జున అందుకున్నారు. సిటి ఇండస్ట్రియల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ మహారాష్ట్ర అధికారి  కైలాష్ షిండే ఈ ప‌త్రాల‌ను, స్థ‌లం ప్లాన్‌ను అంద‌జేశారు.  న‌వీ ముంబ‌యిలోని ఉల్వే ప్రాంతంలో ఉన్న ఈ 10 ఎక‌రాల స్థ‌లాన్ని టిటిడి ఎస్టేట్ విభాగం అధికారులు స‌ర్వే చేశారు. స‌ముద్ర తీరానికి, కొత్త‌గా రానున్న విమానాశ్ర‌యానికి స‌మీపంలో, అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న ఈ స్థ‌లం శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి అత్యంత అనువుగా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో ముంబయి శ్రీవారి ఆలయ సూప‌రింటెండెంట్  గిరి కిర‌ణ్‌, స‌ర్వేయ‌ర్  హ‌రినాథ్ పాల్గొన్నారు.

Mumbai

2022-05-24 12:22:05

శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ‌లాధివాసం

భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం జ‌లాధివాసం నిర్వహించారు.  ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.  అనంత‌రం శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి జ‌లాధివాసం నిర్వ‌హించారు. శ్రీ‌వారి విగ్ర‌హ‌నికి వేద మంత్రాల మ‌ధ్య మంత్రించిన జ‌లంతో విశేషంగా ప్రోక్ష‌ణ (జ‌లాధివాసం) చేయ‌డం వ‌ల‌న విగ్ర‌హంలో ఎలాంటి దోషాలు ఉన్న తొల‌గి, ప్ర‌తిష్ట‌కు యోగ్యం అవుతుంద‌ని అర్చ‌కులు తెలిపారు. త‌రువాత కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు చేపట్టారు.
 సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.  ఈ కార్య‌క్రమాల్లో స్థానిక సలహా కమిటీ అధ్యక్షులు  దుష్మంత్ కుమార్, డెప్యూటీ ఈవో  గుణభూషణ్‌రెడ్డి, టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి  విజయసారధి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  విష్ణుబ‌ట్టాచార్యులు, ఏఈవో దొరస్వామి నాయక్, సూపరింటెండెంట్ మల్లికార్జున, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

Bhubaneswar

2022-05-24 08:35:55

జూన్‌ నెలలో బ్యాంకులకు సెలవులివే..

జూన్‌లో బ్యాంకుల సెలవులను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, ఇతర వేడుకల ఆధారంగా బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందించింది. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలుపుకొని వచ్చేనెలలో మొత్తం 18 బ్యాంక్ సెలవులు రానున్నాయి. అన్ని జాతీయ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులకు ఈ సెలవుల జాబితా వర్తిస్తుంది. ఈ సెలవులను ఆధారంగా చేసుకుని ఖాతాదారులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. స్టేట్-స్పెసిఫిక్ హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సెలవులు వస్తుంటాయి. దీనికి ప్రత్యేకంగా తేదీ అనేది ఉండదు. ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మంజూరు అవుతాయి.

రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. జూన్ 2వ తేదీన తొలి హాలిడే వస్తుంది. ఆ రోజున మహారాణా ప్రతాప్ జయంతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆవిర్భావ దినోత్సవం అయినందున తెలంగాణలో బ్యాంకులకు హాలిడే ఉంటుంది. 3వ తేదీన గురు అర్జున్ దేవ్ వర్ధంతి కారణంగా పంజాబ్‌లో బ్యాంకులు పని చేయవు.  5వ తేదీన ఆదివారం, 11వ తేదీన రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం సెలవులు ఉంటాయి. 14వ తేదీన సంత్ గురు కబీర్ జయంతిని పురస్కరించుకుని ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లల్లో సెలవులు. 15వ తేదీన గురు హర్‌గోబింద్‌ జయంతి సందర్భంగా ఒడిశా, మిజోరం, జమ్మూకాశ్మీర్ బ్యాంకులు పని చేయవు. 19న ఆదివారం, 22న ఖార్చీ పూజ వల్ల త్రిపుర, 25న నాలుగో శనివారం, 26న ఆదివారం సెలవులు ఉంటాయి. 30న స్థానిక పండగ వల్ల మిజోరంలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

Mumbai

2022-05-24 05:08:18

తిరుమల శ్రీ‌వారికి మిని లారీ విరాళం

చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా ‌తయారుచేసిన రూ.18.38 లక్షల విలువగల మిని లారీని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  సంజీవ్ కుమార్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.  ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత ఆలయ డెప్యూటీ ఈఓ  రమేష్ బాబుకు అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, అశోక్ లైలాండ్ కంపెనీ నూతన లారీని స్వామివారికి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఐ  జానకిరామ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుమల

2022-05-08 13:29:33

New Delhi

2022-05-08 06:28:32

Visakhapatnam

2022-05-07 03:04:56