రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర స్ధాయి సైకిల్ యాత్రను ప్రారంభిస్తుందని రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన రావు అన్నారు. రాష్ట్ర స్దాయి సైకిల్ యాత్ర ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో ప్రారంభం అవుతుందని వివరించారు. రాష్ట్ర స్ధాయి సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్ధ ఛైర్మన్ డా.ఏ.శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఏ.కె.ఫరీడా, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి బి.సి.బెహరాతో సహా జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.ఎన్.వెంకట రావు, జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుండి ఒక బృందం, నెల్లూరు నుండి మరో బృందం బయలుదేరుతుందని ఆయన చెప్పారు. ఈ బృందాలు అమరావతి చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 1920వ సంవత్సరంలో ప్రారంభమైన ఇండియన్ రెడ్ క్రాస్ ఈ ఏడాదికి శత జయంతి పూర్తి చేసుకుందన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్ధ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్ధ చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన చేపట్టుటలో భాగంగా ఈ నెల 16వ తేదీ పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొంటూ యాత్రలో భాగంగా వివిధ ప్రదేశాలలో యాత్ర సభ్యులు సభలు నిర్వహించి స్వచ్ఛంద రక్తదానం, మొక్కలు నాటడం, పరిశుభ్ర వాతావరణం, మోటారు వాహనాల వినియోగం తగ్గింపు, కరోనా నివారణ – మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. సైకిల్ యాత్ర శ్రీకాకుళం నుండి బయలు దేరి మధ్యలో మరి కొంత మందిని చేర్చుకుంటూ విజయనగరం చేరుకుంటుందని తెలిపారు. విజయనగరం రెడ్ క్రాస్ కు అందిస్తుందని, అచ్చట నుండి సభ్యులు బయలుదేరి విశాఖపట్నంకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చివరిగా అమరావతి అంచెలంచెలుగా చేరుతుందని వివరించారు. ఈ నెల 25వ తేదీన చివరగా అమరావతి చేరుకుంటుందని తెలిపారు. శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో సైకిల్ యాత్రలో పాల్గొనుటకు ఆసక్తి కలిగి, శారీరక ధారుఢ్యం గల వాలంటీర్లు సైతం చివరి వరకు సైకిల్ యాత్రలో పాల్గొనవచ్చని చెప్పారు. సైకిల్ యాత్రలో పాల్గొన్నవారికి జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త సైకిల్ యాత్రలో పాల్గొన్న వారికి ఈ నెల 25వ తేదీన అమరావతిలో జరిగే రాష్ట్ర స్ధాయి ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొంటారని, అచ్చట గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం బహుకరించడం జరుగుతుందని ఆయన వివరించారు.
క్రీడల ద్వారా బాలబాలకలకు మానసిక,శారీరక దృఢత్వంతోపాటు పోటీతత్వం అలవడతాయని జిల్లా కలెక్టరు డి. మురళీధర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్దానిక పుష్కర్ ఘాట్ వద్ద 32వ ఆంధప్రదేశ్ రాష్ట్ర ఇంటర్, జిల్లా రోలరు స్కేటింట్ చాంపియన్ షిఫి రాష్ట్ర స్దాయి స్కేటింగ్ పోటీల ర్యాలీ ఆయన ప్రారంబించి క్రీడాపోటీలకు నాంది పలికారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 32వ ఆంధప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ జిల్లా రోలరు స్కేటింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో జిల్లా రోలరు స్కేటింగ్ అసోసియెషన్ వారు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ పాఠశాల సహకారంతో రాష్ట్ర స్దాయిలో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. మన జిల్లాలో రాష్ట్ర స్దాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా బాలబాలికలు గత సంవత్సర కాలములో కోవిడ్-19 లాక్‌డౌన్ మూలంగా క్రీడలకు దూరంగా వున్నారని (ఎకడమిక్) విద్యా సంవత్సర నష్టపోకుండా విద్యాభోదనను ఆన్‌లైన్ ద్వారా సాకారం చేసుకున్నారన్నారు. క్రీడల పోటీలకు ప్రశాంత వాతావరణంలో మరలా కోవిడ్-19 నిబందనలు పాటిస్తూ సిద్దం కావడం మంచి పరిణామమన్నారు. బాలబాలికలు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని పోందడంతోపాటుగా పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ప్రస్తుత పోటీలలో గెలుపొంది ఇంటర్నేషనల్ స్దాయిలో కూడా గెలుపొంది రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో 13 జిల్లాలనుంచి సుమారు 400 మంది ఈ క్రీడలలో పాల్గొంటున్నారన్నారు. క్రీడా పోటీలు నిర్వహణను చేపట్టిన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ పాఠశాల పౌండరు చైర్మన్ టి కె విశ్వేశ్వరరెడ్డిని ఆయనఈ సందర్బంగా ఆయన అభినందించి క్రీడాపోటీలకు హాజరు కాబడిన బాలబాలికలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టరు అనుపమ అంజలి మాట్లాడుతూ క్రీడాకారులు పోటీలలో ఉత్సాహంతో పాల్గోని విజయ పరంపర జాతీయ స్దాయివరకు కొనసాగించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం మాట్లాడుతూ ఇంత పెద్ద ఈవెంట్స్ నిర్వహించడం చాలా కష్టతరమైనది చాలా జాగ్రత్తలు వహించి సేఫ్‌గా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. విద్యా రత్న అవార్డు గ్రహిత రాజమహేంద్రి విద్యాసంస్దల చైర్మన్ పౌండరు టి.కె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలలోనే ఎన్నడూ నిర్వహించని విధంగా మొట్టమొదటిసారిగా స్కేటింగ్ పోటీలు రాష్ట్ర స్దాయిలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇంతవరకు జరగని విధంగా ఈపోటీలను నిర్వహించడానికి అన్నిచర్యలు తీసుకొవడం జరిగిందన్నారు. కేవలం టి.వి.లు డిస్కవరీ చానల్‌లో మాత్రమే ఈ తరహా పోటీలు ప్రజలు చూచి ఉంటారన్నారు. మార్చి 3వ తేదీనుంచి మార్చి 8 వ తేదీవరకు ఉదయం 6 గంటలనుంచి 11 గంటలవరకు మధ్యాహ్నాం 3 గంటలనుంచి రాత్రి 9 గంటలకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ పోటీలను సంపత్‌నగరంలోని రాజమహేంద్రి ఇంటర్నేషన్ పాఠశాలనందు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలను ఉచితంగానే తిలకించే అవకాశముందన్నారు. 3వ తేదీన ప్రీసైల్, పెయిర్ స్కేటింగ్, 4న పిగన్ స్కేటింగ్, 5న సోల్డ్ డాన్సు షో గ్రూప్, 6, 7 తేదీలలో రోలరు ఇన్ లైన్ హాకీ 8న బ•హుమతులు ప్రదాన కార్యక్రమాలుంటాయన్నారు. 3వ తేదీ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పోటీలను ఆరంబించడం జరుగుతుందని, చివరి రోజు 8న రాష్ట్ర బి.సి సంక్షేమ మంత్రి సిహెచ్ శ్రీనివాస వేణుగోనాలకృష్ట చేతులు మీదుగా బహుమతులు కార్యక్రమాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ పాఠశాల ప్రతినిదులు స్వరూపరెడ్డి, చంద్రశేఖర్ సత్యసౌందర్య తదితరులు పొల్గొన్నారు.
ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర,జాతీయ స్థాయిలో కూడా రాణించి శ్రీకాకుళం పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14,జూనియర్ ,సీనియర్ విభాగాల్లోని ఫెన్సింగ్ పోటీలు, రాష్ట్ర స్థాయి ఎంపికలను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటముల సహజమని అన్నారు. క్రీడా స్పూర్తితో క్రీడాకారులు రాణించాలన్నారు. శిక్షకులు ఇచ్చే సూచనలు,సలహాలను పరిగణలోకి తీసుకుని పోటీల్లో ప్రతిభాపాఠవాలను ప్రదర్శించారు.ఫెన్సింగ్ క్రీడలో కూడా జిల్లా పేరుప్రతిష్టలను ఇనుమడింపజేసేలా క్రీడాకారులు తమ ప్రతిభ పాఠవాలను ప్రదర్శించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తైక్వాండో,ఫెన్సింగ్ వంటి క్రీడా పోటీలను విరివిగా నిర్వహిస్తూ వాటిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న శ్రీను అభినందనీయుడన్నారు. భవిష్యత్ లో కూడా పోటీల నిర్వహణకు తమ వంతు సహాయసహకారాలను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో క్రీడాకారులకి కొదవలేదున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన టీంకి రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు గాను రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లుగా తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లాస్థాయి ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు, ఈనెల 27,28,మార్చి 1,2వ తేదిల్లో కాకినాడలో జరుగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఈ ఎంపికలకు న్యాయనిర్ణేతగా ఎన్ ఐ ఎస్ కోచ్ జోగిపాటి వంశీ ,జ్యూరీగా డి.భవానీ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనుతో పాటు సంఘ సభ్యులు నానాజీ సిల్స్క రాజా,గిడుతూరి వెంకటేశ్వరరావు,బెవర జ్యోతిప్రసాద్ ,నాయుడు ,సహార కృష్ణ,సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 31న ఆదివారం నిర్వహిస్తున్న 21వ జిల్లా స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీలు-2021 పోటీలు విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షించారు. గురువారం ఈ మేరకు ఈ పోటీలకు సంబందించిన పోస్టర్లను సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని జిల్లాకి పేరు తేవాలన్నారు. జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా పోటీలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలోజిల్లా పంచాయితీ అధికారి వి.రవి జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీను, ఏపిడబ్య్లుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ ,జర్నలిస్టుల ఐక్యవేధిక కన్వీనర్ శాసపు జోగి నాయుడు, పోటీల నిర్వాహకులు సుధీర్ వర్మ,వైశ్యరాజు మోహన్ , గౌతమ్ , నవీన్ ,పెయ్యల చంటి,మురళీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 31న నిర్వహిస్తున్న 21వ జిల్లా స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీలు-2021కి సంబందించిన పోస్టర్లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ బుదవారం సాయంత్రం ఆవిష్కరించారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ ,కిల్లి కృపారాణిలు ఆకాంక్షించారు.క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా పోటీలు నిర్వహించాలని వారు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి ,డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ,రాష్ట్ర కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు,వైకాపా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్ ,రాష్ట్ర కళింగకోమటి సంఘం అధ్యక్షుడు కోణార్క్ శ్రీను తదితరులంతా కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా అలివేలుమంగ,మాజీ కౌన్సిలర్ ఎం.ఎ.రఫి,సురంగి మోహన్ రావు,వైకాపా యువజన నేత సిరాజుద్దీన్ ,మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మహాలక్ష్మి,టి.కామేశ్వరి,సుగుణారెడ్డి,గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.అదేవిదంగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను,ఏపిడబ్య్లుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ ,పోటీల నిర్వాహకులు సుధీర్ వర్మ,వైశ్యరాజు మోహన్ ,తైక్వాండో గౌతమ్ ,తైక్వాండో నవీన్ ,పెయ్యల చంటి,మురళీ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో యువతకు మానసిక ఉత్తేజం పెరుగుతుందని వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డా.మళ్లవిజయప్రసాద్ అన్నారు. గురువారం బుల్లయ్య కాళాశాల మైదానంలో జరుగుతున్న వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలను ఆయన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశ్యంలో ఈ క్రికెట్ పోటీలను వైఎస్సార్సీపీ నిర్వహిస్తుందన్నారు. ఈ క్రికెట్ పోటీల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. అనంతరం 92, 57 వార్డులకు చెందిన జిహెచ్ఎస్ గోపాలపట్నం, పవర్ బాయ్స్ మధ్య జరిగిన పోటీని తిలకించారు. ఈ పోటీల్లో గెలుపొందిన జిహెచ్ఎస్ గోపాలపట్నం జట్టు అభినందించి షీల్డును అందజేశారు. ఇదే ఉత్సాహంతో ట్రోఫీ కొట్టే లక్ష్యంతో మరింత ఉత్సాహంగా ఆడాలని విన్నర్ టీమ్ ను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో పాల్గొనడం వలన యువతకు మంచి వ్యాయామం చేకూరుతుందని, పాయకరావు పేట ఎమ్మెల్వే గొల్ల బాబురావు పేర్కొన్నారు . జగనన్న, వైఎస్ఆర్ క్రికెట్ పోటీలు నగరంలో 14 క్రీడామైధానాల్లో కొనసాగడం శుభపరిణామన్నారు. బుధవారం ఏయూ ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న తూర్పు నియోజక వర్గం వార్డుల క్రికెట్ స్వాతిధాన్ జట్టును, కె.ఆర్.ఎం లెవెన్ జట్టు క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పుట్టిన రోజు పురస్కరించుకుని పోర్టు క్రీడా మైదానంలో ఈనెల 21 నుంచి జనవరి 9 వరకూ ఈక్రికెట్ పోటీలు నిర్వహించడానికి ప్రగతి భారత్ పౌండేషన్, ఎంపి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వించదగ్గ విషమన్నారు. ఈ పోటీలకు సాంకేతిక సహకారం అందిస్తున్న ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్యవి.వి.జి.డి . ప్రసాదరెడ్డి క్రీడావిభాగం డైరెక్టర్ ఆచార్య ఎన్ విజయమోహన్ ను అభినందించారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నారని ఉత్సాహపరిచారు. క్వాలిఫైడ్ తో ఎంపైర్లతో ఐపిఎల్ తరహాలో ఈ పోటీల్లో 98 వార్డులకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారని , ఈ కరోనా నేపద్యంలో యువత ఇంటికే పరిమితం అయిన నేపధ్యంలో ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఊరటనిస్తున్నాయని అన్నారు. ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి పోటీలను ఎమ్మెల్యే కు వివరించారు. క్రీడామైదానాలు పిచ్ రెండు వారాలు పాటు క్రీడలు నిమిత్తం సమాయత్తం చేసి అందుబాటులో ఉంచామని , ఈ నెల 21 న 42 జట్లు గెలిచాయని , మరో 12 జట్లు ఓడినప్పటికి క్రీడాకారులకు ప్రశంసా పత్రాలుతో పాటు మెడల్స్ అందించినట్లు తెలిపారు. మరో 42 మ్యాచ్ లు వివిధ క్రీడా ప్రాంగణాల్లో జరిగాయని తెలిపారు. ఏయూ క్రీడా విభాగం డైరెక్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, విభాగం హెడ్ డాక్టర్ ఎ. పల్లవి , వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కరమాని వెంకటరావు, 19 వ వార్డు కె. ధనలక్ష్మి ఆర్ట్స్ కళాశాల క్రీడాప్రాంగణం ఇన్ చార్జ్ డాక్టర్ జి.ఎస్.వర్మ , బిపిసి ఎంపైర్స్ , పిడిలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ – జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ (జిల్లా స్పోర్ట్సు అథారిటి) మధ్య బుధ వారం మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగు (ఎం.ఓ.యు) జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎం.ఓ.యుపై జిల్లా క్రీడాప్రాధికార సంస్ధ తరపున అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జె నివాస్ సంతకం చేయగా, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏ.సి.ఏ) తరపున జిల్లా బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జె.వి.భాస్కర రావు సంతకం చేసి ఎం.ఓ.యు పత్రాలను అందజేసుకున్నారు. ఈ మేరకు ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రులపేట వద్దగల 7.66 ఎకరాల విస్తీర్ణం గల ఎన్.టి.ఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో అన్ని వసతులతో క్రికెట్ స్టేడియంను నిర్మించేందుకు ఏ.సి.ఏకు అందజేశారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా క్రీడా చరిత్రలో శుభ దినం అన్నారు. ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రులపేట వద్ద అన్ని సౌకర్యాలతో గల స్టేడియంను క్రికెట్, ఇతర క్రీడలకు అనుగుణంగా నిర్మిస్తారని ఆయన పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగ్గు శాస్త్రులపేట స్టేడియంను ఏ.సి.ఏకు అప్పగించుటకు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. ఉత్తమ స్టేడియం రావాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.
జిల్లా బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రోజునే హోదా కాదు బాధ్యతతో పనిచేస్తానని తెలియజేసానన్నారు. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చుటకు కృషిలో భాగంగా, జిల్లా క్రికెట్ బృందం క్రీడాకారునిగా క్రికెట్ స్టేడియం నెలకొల్పుటకు సంకల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రులపేట వద్దగల 7.66 ఎకరాల విస్తీర్ణం గల ఎన్.టి.ఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఏ.సి.ఏకు మంజూరు చేయడం జరిగిందని పేర్కొంటూ క్రీడాభిమానిగా ఉన్న రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వలన ఇది సాధ్యం అయిందన్నారు. క్రీడలకు మంచి ప్రోత్సాహాన్ని సి.యం అందిస్తున్నారని చెప్పారు. ఏ.సి.ఏకు స్టేడియం మంజూరుకు కెబినెట్ లో సహకరించిన రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజులతో సహా రాష్ట్ర శాసన సభాపతికి కృతజ్ఞతలు తెలిపారు.
30 సంవత్సరాలపాటు లీజుకు స్టేడియంను కేటాయించారని, దానిని ఎనిమిది నెలల్లో నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభించి, స్టేడియం ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రిని ఆహ్వానిస్తామని చెప్పారు. స్టేడియంలో క్రికెట్ తోపాటు వాలీ బాల్ ఇతర క్రీడలకు సౌకర్యాలు కల్పిస్తామని చిరంజీవి నాగ్ తెలిపారు. శ్రీకాకుళం నుండి స్టేడియం తరలిపోతుందనేది వాస్తవం కాదని తేల్చి చెప్పిన చిరంజీవి నాగ్ శ్రీకాకుళం అందరిది అని, శ్రీకాకుళంలో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలని, అందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టెక్కలిలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని, స్ధలాన్ని పరిశీలించామని ఆయన చెప్పారు. జిల్లాలో మూడు క్రికెట్ స్టేడియంలు ఉన్నప్పుడు మాత్రమే జిల్లాలో రాష్ట్ర స్ధాయి క్రికెట్ పోటీలు నిర్వహించుటకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. స్టేడియంను క్రికెట్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ అధికారి మరియు సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు, క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్ కుమార్, ఏ.సి.ఏ కార్యనిర్వాహక సభ్యులు బి.వి.రవిశంకర్, నారా ఈశ్వర రావు, కార్యాలయ మేనేజర్ కె.మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.