రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదనీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తం శెట్టిి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం కేంద్ర యువజన సర్వీసుల, క్రీడలు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వర్చువల్ కాన్ఫరెన్స్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కోస్తా తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నదని వాటర్ స్పోర్ట్స్ శిక్షణా తరగతులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు .ఈ ప్రాంతం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ పొందిన క్రీడాకారులు ఉన్నారన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి వీలుగా ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అవసరమైన బడ్జెట్ ని కేటాయించాల్సిందిగా కోరారు. ఖేలో ఇండియా స్కీం 2019-20 సంవత్సరానికి సంబంధించి కాకినాడలో ఆస్ట్రో తర్ఫ్ హాకీ ఫీల్డ్ ప్రాజెక్టు 5.50 కోట్ల వ్యయం తో పనులు జరుగు తున్నాయనీ,95 శాతం పూర్తయింది అన్నారు. రూ6 కోట్లతో విజయ నగరం జిల్లాలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి అన్నారు. రూ 8 కోట్లతో నెల్లూరు జిల్లాలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 98 శాతం పనులు పూర్తయ్యాయి అన్నారు. రూ 4.50 కోట్ల తో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీం కొత్త ప్రతిపాదనలో భాగంగా కడప , నెల్లూరు జిల్లాల్లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కర్నూల్ లో సింథటిక్ టర్ఫ్ ఫుట్ బాల్ గ్రౌండ్, విశాఖ జిల్లాలో కొమ్మాది వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు ప్రతి పాదనలను పంపడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నూతన గైడ్ లైన్లు ప్రకారం పదమూడు జిల్లా స్థాయి ఖే లో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు SAAP ప్రతిపాదనలను సమర్పించడం జరిగిందన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా 2021-22 సం నికి రాష్ట్రంలో స్పోర్ట్స్ క్యాలెండరు లో 38 రకాల టోర్నమెంట్లు స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్17, అండర్19 పెట్టడం జరిగిందన్నారు. వై ఎస్ ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు కింద జాతీయ , అంతర్జాతీయ స్థాయి మెడల్స్ పొందిన క్రీడా కారులకు నగదు ప్రోత్సాహకాలను అందించడం జరుగుతున్నదన్నారు. కోవిడ్ నేపథ్యం లో ఈ సం. ఆగస్ట్ నుండి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధన ల ప్రకారం క్రీడా కార్యక్రమాలను తిరిగి పునః ప్రారంభించడం జరిగిందనీ , పీ ఈ టీ లు, కోచ్ ద్వారా ఆన్లైన్ శిక్షణ ఇవ్వడం జరుగతున్నదన్నారు. విశాఖ జిల్లా లో గ్రామీణ క్రీడా పోటీలను ఖెలో ఇండియా శాప్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. కబడ్డీ, ఖో ఖో, వాలి బాల్, అథ్లెటిక్స్ ఇంటర్ స్టేట్ పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, జడ్ పీ , ట్రైబల్, మోడల్ స్పోర్ట్స్ ,ఏపీస్పోర్ట్స్ స్కూల్స్ లో వివిధ క్రీడలు లో ఆసక్తి ఉన్న 6సం లోపు, 9సంల లోపు,12 సం లోపు ఉన్న పిల్లలకు లాంగ్ టర్మ్ అథ్లెటిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో యోగా క్లాసు లను నిర్వహిస్తున్నారన్నారు .అదేవిధంగా టా క్వ్ండో, త్రో బాల్,రింగ్, టెన్ని కాయిట్, తగ్- ఆఫ్ -వార్ తది తర క్రీడలను ప్రారంభించడం జరిగిందన్నారు.
విశాఖ జిల్లాలో కొమ్మాదిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, యలమంచిలి లో మల్టి పర్పస్ ఇండోర్ హాల్, పర్వాడలో మినీ స్టేడియం, పాండు రంగా పురం లో ఇండోర్ హాల్, రుషి కొండ లో శాప్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ల ఏర్పాటుకు అను కూలంగా ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా క్రీడా అభివృద్ది శాఖాధికారి సూర్యారావు పాల్గొన్నారు.