1 ENS Live Breaking News

స్పోర్ట్స్ స్కూల్స్ కి 11నుంచి ఎంపిక

డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్, క‌డ‌ప నందు 4వ‌ త‌రగ‌తిలో ప్ర‌వేశించేందుకు గాను ఈ నెల 11వ తేదీ నుంచి 26 వ‌ర‌కు మూడు ద‌శ‌ల్లో మండ‌ల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని డీఎస్‌డీవో పి. అప్ప‌ల‌నాయుడు తెలిపారు. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌తో కూడిన ప్ర‌క‌ట‌న మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి క్రీడా పాఠశాల‌లో 40 సీట్లు అందుబాటులో ఉండ‌గా వాటిలో 20 బాలుర‌కు, 20 బాలిక‌ల‌కు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. 01.08.2022 నాటికి ఎనిమిదేళ్లు నిండి తొమ్మిది సంవ‌త్స‌రాల వ‌య‌సు దాట‌ని వారు ద‌ర‌ఖాస్తు చేసుకొని ఎంపిక‌ల‌కు హాజ‌రుకావాల‌ని ఆయ‌న సూచించారు. ఎలాంటి వ‌య‌సు స‌డ‌లింపులు ఉండ‌వ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. మండ‌ల స్థాయిలో ఈ నెల 11 నుంచి 18వ తేదీ వ‌ర‌కు, జిల్లా స్థాయిలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వ‌ర‌కు ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. మండ‌ల స్థాయి  ప్ర‌క్రియ పూర్తి చేసుకున్న విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అభ్య‌ర్థుల‌కు ఈ నెల 20వ తేదీన రాజీవ్ స్టేడియంలో ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు తుది ప్ర‌క్రియ ఈ నెల 25, 26 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యంలో ఉంటుంద‌ని వివ‌రించారు. అన్ని మండ‌లాల ఎంపీడీవోలు, ఎంఈవోలు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి స్థానికంగా జ‌రిగే ఎంపిక ప్ర‌క్రియ‌ను పార‌ద‌ర్శ‌కంగా, స‌జావుగా నిర్వహించాల‌ని డీఎస్‌డీవో సూచించారు.

Vizianagaram

2022-07-05 11:47:15

క్రీడాస్ఫూర్తే విజయానికి సంకేతం

క్రీడాస్ఫూర్తే విజయానికి సంకేతమని మారుతీ వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కొంక్యాన మురళీధర్‌ అన్నారు. అంతరరాషష్ట్ర కరాటే పోటీ, జిల్లా స్తాయి కరాటే పోటీ విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. నగరంలోని విశాఖ-బి కాలనీలో గౌతమ్‌నగర్‌ మినీ పార్క్‌ వద్ద మారుతీవాకర్స్‌ క్లబ్‌, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో క్రీడాకారులకు మెడల్స్‌, సర్టిఫికట్లు మంగళవారం ఆయన అందజేశారు. మాస్టర్‌ సాయిబాబా మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చీఫ్‌ కోచ్‌ ఎన్‌.చంద్రరావు శిక్షణ ఇస్తున్న తీరు క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిపిందన్నారు. వాకర్స్‌ క్లబ్‌ డిప్యూటీ గవర్నర్‌ వి.భీమరాజు, ఏపిడబ్య్యుజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, శ్రైస్‌క్లబ్‌ అధ్యక్షుడు కొంక్యాన వేణుగోపాల్‌ సోషల్‌ వర్కర్‌ పైడి గోపాలరావు, మారుతీ వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధి రమేష్‌ ప్రసంగించారు. అంతరరాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో కటా విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన సి.హెైచ్‌.గౌతమి, జిల్లా స్థాయి పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన కె.హరనాధథ్‌, బ్రాంజ్‌మెడల్‌ సాధించిన కె.శ్రీకాంత్‌, గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఢిల్లేశ్వరి, చురుకుగా పాల్గొన్న బి.ప్రేమ్‌కుమార్‌, ఎస్‌.క.నిహాల్‌, షరీఫ్‌లకు కొంక్యాన మురళీధర్‌, వేణుగోపాల్‌, గోపాలరావు, భీమరాజు సర్టిఫికెట్లు అందజేశారు.

Srikakulam

2022-06-28 05:06:43

బ్యాట్ మెంటన్ క్రీడాకారుడికి కలెక్టర్ ప్రశంస

బ్యాంకాక్ లో ఇటీవల జరిగిన థామస్ కప్ ప్రపంచ బాట్మింటన్ పోటీలలో అపూర్వ విజయాన్ని సాధించి దేశానికి బంగారు పతకం అందించిన భారత బృందం సభ్యుడు జి. కృష్ణ ప్రసాద్ ను కలెక్టర్ డా.కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేటులో తనను కలిసిన  బ్యాంట్మింటన్ క్రీడాకారుడు కృష్ణప్రసాద్ కు జిల్లా కలెక్టర్ శుభకాంక్షలు తెలిపి, భారత బృందం సాధించిన ఈ చారిత్రక విజయం మైలురాయిగా నిలిచి మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిదాయకమై, దేశంలో బ్యాట్మింటన్ క్రీడా వికాసానికి దోహదం కాగలదని కాంక్షించారు.  ఈ ఉత్సాహంతో మరిన్ని పోటీల్లో పాల్గొని దేశం యొక్క కీర్తిని మరింతగా బ్యాట్ మెంటన్ లో ఇనుమడింపచేయాలని కలెక్టర్ క్రిష్ణప్రసాద్ కి సూచించారు.

Kakinada

2022-05-24 13:59:04

రేణుకకు జాతీయ స్థాయిలో 2కాంశ్యాలు

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఉజ్జయినిలో ఈ నెల 13 నుండి 16 వరకు జరిగిన 13వ జాతీయస్థాయి టైక్వాండో పోటీల్లో పాల్గొన్న కుమారి మొకర రేణుకా శ్రీకరిణి రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.  జాతీయ స్థాయిలో టైక్వాండో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండు కాంస్య పతకాలను సాధించిన క్రీడాకారిణి కుమారి మొకర రేణుకా శ్రీకరిణి ని శ్రీ ఎస్.వెంకటేష్, జిల్లా అటవీ శాఖాదికారి, శ్రీ కె.వి.ఎన్.రాజు గారు , సెక్షన్ అధికారి  శ్రీ బొత్స అప్పలరాజు, అటవీ పరిధి అధికారి శ్రీ కె.రామారావు గారు జిల్లా అటవీ కార్యాలయం,  అభినందించి, జాతీయ స్థాయిలో,  ఒలింపిక్స్ లో మన దేశానికీ ,  జిల్లాకు మంచి కీర్తిప్రతిష్టలు తేవాలని తెలిపినారు. హరిణి బాబా మెట్ట లోని ప్రభిత్వా బాలికల హై స్కూల్ నందు 9 వ తరగతి చదువుతోంది.

Vizianagaram

2022-05-19 10:16:37

క్రీడా నైపుణ్యంతో ముందుకు సాగండి..

జాతీయ స్థాయిలో  పేరుగాంచిన క్రీడాకారులందరూ గ్రామీణ ప్రాంతాల నుండి మాత్రమే వచ్చారని, తమ క్రీడా నైపుణ్యంతో వారు ఉన్నత స్థాయికి వెళ్ళారని  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు శనివారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ పాఠశాలలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీలకు తాము వెళ్ళినప్పుడు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు ఉండేవి కావని, నేడు అన్ని విధాల క్రీడాకారులని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తునారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని ఏదో ఒక క్రీడను ఎంచుకొని లక్ష్యాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఆరోగ్యపరమైన ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుందని, ప్రతిరోజు ఒక గ్లాసెడు పాలు తప్పనిసరిగా తీసుకోగలిగితే అలసట అనేది లేకుండా పోతోందని అన్నారు. వ్యసనాలు జోలికి పోకూడదని, సెల్ఫోన్ వినియోగం కూడా తగ్గించుకోవాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో డి ఎస్ డి ఓ శ్రీనివాస్, జెడ్ పి టి సి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, నరసన్నపేట పోలాకి ఎంపీపీలు మురళీధర్, బైరాగి నాయుడు, డి సి ఎం ఎస్ మాజీ అధ్యక్షులు గొండు కృష్ణ మూర్తి, ధర్మాన లక్ష్మణ్ దాస్, స్థానిక ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.


విజేతలుగా నిలవండి: డిప్యూటీ సీఎం:
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లానుంచి వెళ్తున్న విజేతలుగా తిరిగిరావాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. 
శ్రీకాకుళం జిల్లా వాలీ బాల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం మబగాం గ్రామంలో ఈ నెల 2వ తేది నుండి ప్రారంభమైన జిల్లా యూత్ టీం శిక్షణ శిబిరానికి ఆయన శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా తుది జట్టు ఎంపికను పర్యవేక్షించారు. ఎంపికయిన క్రీడాకారులను   కృష్ణదాస్ తో పాటుగా సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు ధర్మాన లక్ష్మణ దాస్, ఎంపీపీ అరంగి మురళీ, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి యాళ్ళ పోలి నాయుడు, సంయుక్త కార్యదర్శి ఎన్ వి రమణ, సభ్యులు మానెం నవీన్, శాప్ కోచ్ కే హరికృష్ణ , ఆర్గనైజింగ్ సెక్రటరీ కే రామచంద్రుడు అభినందించారు. 

Polaki

2022-03-05 15:15:02

కరాటే మనోజ్ కు గంట్ల ఆర్ధిక సహాయం..

మహా విశాఖ నగరానికి చెందిన సిహెచ్ మనోజ్ యాదవ్ కరాటేలో అత్యుత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నాడు. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అనేక మెడల్స్ దక్కించుకున్నాడు. తాజాగా దక్షిణాది రాష్ట్రాల జాతీయస్థాయి పోటీల్లో మనోజ్ యాదవ్ తన సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. కొటక్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న మనోజ్ యడవను గురువారం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ప్రత్యేకంగా అభినందించారు. అక్కయ్యపాలెంలో ఉన్న తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మనోజకు శ్రీనుబాబు ఆర్ధిక సహాయం అందజేశారు. భవిష్యత్ లో కూడా జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి విశాఖ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని శ్రీనుబాబు ఆకాంక్షించారు. అందుకు తమ పరిధి మేరకు సహాయం అందిస్తానని, దాతలు కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా శ్రీనుబాబు కోరారు.

Visakhapatnam

2022-02-03 05:32:54

వీపీఎల్ విజేత మాస్టర్ బ్లాస్టర్స్.. రన్నర్స్ ఎవెంజర్స్..

క్రీడలకు రాజధానిగా విశాఖ మారనుందని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. అందుకు అనేక అవకాశాలు, వనరులు కూడా విశాఖకే ఉన్నాయన్నారు. కెఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న విశాఖ ప్రీమియర్ లీగ్ సీజన్-2, ట్వంటీ 20 క్రికెట్ పోటీలు శుక్రవారం ముగిసాయి. రైల్వేస్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్స్ విజయకేతనం ఎగురవేసింది. రన్నరనాన్ని ఎవెంజర్స్ కైవసం చేసుకుంది. విజేతలకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, పశ్చిమ శాసనసభ్యులు గణబాబు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, జబర్దస్త్ ఫేమ్ నటుడు రాంప్రసాద్ తదితరులు అతిధులుగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎం.రాజాను ఘనంగా అభినందించి అతిధులు చేతులు మీదుగా సత్కరించారు. మేయర్ హరివెంకటకుమారి మాట్లాడుతూ కరోనాలో సైతం వీపీఎల్ నిర్వహించడం అభినందనీయమన్నారు. గణబాబు మాట్లాడుతూ కెఆర్ అసోసియేషన్ రెండు సీజన్లు విజయవంతంగా వీపీఎల్ నిర్వహించిందని భవిష్యత్తులో కూడా మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా ఈ అసోసియేషన్ కృషి చేయాలన్నారు. జబర్దస్త్ రాంప్రసాద్ క్రీడాకారులకు, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. రంగస్థల నటుడు, నందీ అవార్డు గ్రహీత వంకాయల మారుతీప్రసాద్, ప్రముఖ న్యాయవాద మేడిద బాజినాయుడు, డేటాప్రో అధినేత మేడిద రాజశేఖర్తో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్వాహకుడు కె.రాజ మాట్లాడుతూ కెఆర్ అసోసియేషన్ తరుపున విశాఖలో మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దాలని సంకల్పంతోనే వీపీఎలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Visakhapatnam

2022-01-29 05:57:19

బాక్సింగ్ లో రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచాలి..

బాక్సింగ్ లో రాష్ట్ర ఖ్యాతి ఇనుమడింపజేయాలని ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. హర్యానాలో ఈనెల 21 నుంచి 27 వరకూ జరిగే ఆల్ ఇండియా బాక్సింగ్ బాలికల సబ్ జూనియర్ చాంపియన్ షిప్ లో పాల్గొనే జట్టుకు మంత్రి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు అథ్లెట్లను మంత్రికి పరిచయం చేశారు. . మంత్రిని కలిసినవారిలో ఆంధ్రప్రదేశ్ స్ఞేట్ బాక్సింగ్ సంఘం ఉపాద్యక్షులు దల్లి రామకృష్ణరెడ్డి, సెక్రటరీ లక్షమణదేవ్, ద్రోణాచార్య అవార్దు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, జిల్లా బాక్సింగ్ సంఘం కార్యదర్శి అప్పన్నరెడ్డి, ఆర్.ఒ.సి చైర్మెన్ దండు నాగేశ్వరరావు, మారుతి బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపకులు మారుతి ప్రసాద్ ఉన్నారు.

Visakhapatnam

2021-10-17 11:31:26

21న విశాఖలో ఏపీ సీఎం కప్ టోర్నమెంట్..

విశాఖజిల్లాలో ఈ నెల 21న ఎ.పి.సి.ఎం కప్ టోర్నమెంట్  నిర్వహించనున్నట్లు  జిల్లా క్రీడల సంస్థ సి .ఇ.ఓ పి.వి.రమణ ఒక ప్రకటనలో తెలిపారు.  గ్రామీణ క్రీడా కారుల ప్రతిభను గుర్తించి వారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పేజ్-1 లో అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో పోటీలను  నిర్వహించనున్నట్లు  తెలిపారు.  నియోజక వర్గ స్థాయి పోటీలలో గెలిపొందిన క్రీడా కారుల జట్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ, ఆంధ్రయూనివర్సిటి గ్రౌండ్స్ (జిమ్నాజియం గ్రౌండ్స్ )విశాఖపట్నంలో 21వ తేది గురువారం క్రీడా పోటీలు ఉదయం 10గంటలకు ప్రారంబోత్సవం, సాయంత్రం 6గంటలకు ముగింపు కార్యక్రమం జరగనున్నదని తెలిపారు.  

Visakhapatnam

2021-10-16 12:45:08

స్వర్ణాలు సాధించిన మహిళా బాక్సర్లకు పురస్కారాలు..

సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ పోటీలలో నర్సీపట్నానికి చెందిన ఇద్దరు బాక్సర్లు బంగారు పతకం సాధించిన సందర్భంగా వారికి ఆదివారం మినీ స్టేడియంలోఓ నర్సీపట్నం బిజెపి నాయకులు  కాళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేశారు. మెడల్స్‌ సాధించిన పాపని, నాగమౌనిక, కోలుకుల కృష్ణవేణి పూలమాలలు శాలువాలతో సత్కరించి  అడిగర్ల సతీష్‌, బోలెం శివ, డిటిపి.ప్రభాకర్‌, కొప్పిశెట్టి మోహన్‌లు రూ.10వేల నగదు పురస్కారాలు అందించారు. నింజాస్‌ అకాడమీ ద్వారా నర్సీపట్నంలో పతకాలు సాధిస్తున్న క్రీడా కారులకు ఇకపై పారితోషకాలు సత్కారాలు నిర్వహిస్తామని బిజెపి టౌన్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ వెలగా జగన్నాధం(ఎన్‌ఆర్‌ఐ, యుఎస్‌ఎ) తెలిపారు. నింజాస్‌ అకాడమీ చైర్మన్‌ వెలగా నారాయణరావు మాట్లాడుతూ మన అకాడమీకి బిజెపి వారు క్రీడా పరికరాలు ఇది వరకు అందజేశారని, అలాగే గెలుపొందిన వారికీ నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ  సహకరించడంపై అకాడమీ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Narsipatnam

2021-10-10 11:47:50

మానసిక ఉత్సాహానికి క్రీడలు దోహదం..

ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు దోహదపడుతాయని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. స్థానిక పిటీసీ మైదానంలో శనివారం కార్పొరేటర్లు, అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగుల మధ్య క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. క్రికెట్ మ్యాచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేయర్ మహమ్మద్ వసీం,రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి డిప్యూటీ మేయర్ లు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల జట్టుకు నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి,కార్పొరేటర్ల జట్టుకు డిప్యూటీ మేయర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించారు.మున్సిపల్ కార్పొరేటర్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకొని 15 ఓవర్లు గాను 112 పరుగులు సాధించారు. కార్పొరేటర్ అనిల్ కుమార్ రెడ్డి 48  పరుగులు తీసి నాటౌట్ గా నిలచారు.తరువాత బ్యాటింగ్ చేసిన మున్సిపల్ సిబ్బంది 15 ఓవర్ల గాను 81 పరుగులు తీసి నాలుగు వికెట్లు నష్టపోయారు. కమిషనర్ మూర్తి మూడు వికెట్లు తీసి సత్తా ఛాటినప్పటికి  31 పరుగుల తేడాతో మున్సిపల్ కార్పొరేటర్ లో విజయం సాధించారు.ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కార్పొరేటర్లు, ఉద్యోగుల మధ్య క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప కార్యక్రమన్నారు.కార్పొరేటర్లు, ఉద్యోగులు నిత్య ఎంతో ఒత్తిడితో ఉంటారని ఒత్తిడిని తగ్గించడానికి ఇలాంటి మ్యాచ్ లు ఎంతో ఉపయోగపడటంతో  పాటు కార్పొరేటర్లు, ఉద్యోగుల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం కూడా  ఏర్పడుతుందన్నారు.రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్లు రాజకీయ నాయకులే కాదు క్రీడాకారులు కూడా అని నిరూపిస్తున్నారని కొనియాడారు.ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి గెలుపు ఓటములను కూడా  ఫ్రెండ్లీ గానే తీసుకోవాలని సూచించారు.ఉద్యోగుల జట్టును కమిషనర్ పివివిఎస్ మూర్తి,కార్పొరేటర్ల జట్టుకు డిప్యూటీ మేయర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Anantapur

2021-10-09 17:00:09

ఘనంగా జాతీయ కరాటే పోటీలు ప్రారంభం..

విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో శనివారం గంటా కనకారావు మెమోరియల్‌ జాతీయ కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 19 రాష్ట్రాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, విశ్రాంత ఎస్పీ రాజశిఖామణి, అప్పన్న దేవస్ధానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు, స్వర్ణభారతి ఇండోర్‌స్డేడియంతో పాటు, ఇతర క్రీడాప్రాంగణాలను ఆధునీకరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కనకరావు పేరిట జాతీయ స్ధాయిలో మెమోరియల్‌ కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన రాజశిఖామణి, గంట్ల శ్రీనుబాబులు మాట్లాడుతూ కనకరావు ఆధ్వర్యంలో ఎన్నో జాతీయ పోటీలు విశాఖ వేదికగా నిర్వహించడం జరిగిందన్నారు. అటువంటి వ్యక్తి పేరుమీద మరోసారి జాతీయ కరాటే పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తొలుత  పోటీలను ప్రారంభించే ముందు సీనియర్‌ కరాటే మాష్టార్‌  కనకరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లుర్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ వర్కర్‌ ఉప్పలపాటి రాణా,సతీష్ కుమార్‌, నాయుడు, ప్రవీణ్ తో పాటు గంటా కనకరావు శిష్యబృందం మొత్తం పాల్గోంది. ఈ పోటీలను ఛాంపియన్స్‌ కరాటే డోజో నిర్వహిస్తుంది. 

Visakhapatnam

2021-10-09 08:38:38

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వంలో పెద్దపీట.. ఎమ్యేల్యే అమర్నాధ్

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం. సిఎంఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్మీడియా స్పోర్ట్సు మీట్ క్రికెట్ ఫైనల్స్ పోటీలను ఆదివారం ఆయన ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా సేవలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.2005 విఏజే సంఘము తో పాటు అర్హులైన జర్నలిస్ట్స్ కి త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ముఖ్య మంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.. జిల్లాఅధికార యంత్రాంగం..ప్రజాప్రతినిధులు, మీడియా స్నేహపూర్వక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ అర్హత గల జర్నలిస్టులందరికి రెండవ దశ అక్రిడేషన్లు మంజూరు కార్యక్రమం జరుగుతుందన్నారు.. ఆక్రిడిటేషన్ లు.. ఆరోగ్య భీమా కు సంబందించి  కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. వి.జె.ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీను బాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా అంతర్మీడియా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహించిన  ఘనత వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ కే దక్కుతుందన్నారు .. పది రోజుల పాటు జరిగిన ఈ  స్పోర్ట్స్ మీట్ లో సుమారు 800 మంది జర్నలిస్టులు 13 కేటగిరీ ల్లో జరిగిన క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు..  కాయల వెంకట రెడ్డి మిత్రమండలి ప్రతినిధి కాయల సూరారెడ్డి మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహించే మీడియా ప్రతినిధులను ఇటువంటి కార్యక్రమాలు ద్వారా ప్రోత్సహించడం అవసరమన్నారు. మీడియా అవార్డు కమిటీ చైర్మన్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో వి.జే.ఎఫ్. విస్జా ప్రతినిదులు పి.ఎన్. మూర్తి, దాడి రవికుమార్ ఈ ఈశ్వరరావు, డేవిడ్ రాజ్, ఎం.ఎస్. ఆర్. ప్రసాద్, వరలక్ష్మి .. ఉమాశంకర్ బాబు, జి. సాంబశివరావు, పవర్ డిప్లమో  ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు వి. మహేశ్వరెడ్డి, డాక్టర్ రామ్ కుమార్, బ్రహ్మకుమారీల   ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రమక్క తదితరులు పాల్గోన్నారు. అనంతరం స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చిన్నారులు, క్యాలు జనార్ధన్ ఆధ్వర్యంలోనిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.అతిథులు చేతుల మీదుగా బహూమతుల ప్రధానం చేసారు. క్రికెట్ విన్నర్ గా ఆంధ్రజ్యోతి, రన్నర్ గా విజేఎఫ్, సంయుక్త విజేతలుగా సాక్షి.. ఆంధ్రప్రభ, వి జేఎఫ్ క్రికెట్ టోర్నీ లో 13 జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఇందులో విన్నర్ గా ఆంద్ర జ్యోతి.. రన్నర్ గా విజేఎఫ్ లు నిలిచారు. మూడో స్థానం కి సంబంధించి సాక్షి.. ఆంధ్ర ప్రభ జట్లు ను సంయుక్త విజేత లు గా ప్రకటించి బహుమతులు అంద చేసారు..

Visakhapatnam

2021-10-03 11:10:01

ప్రపంచ ఖ్యాతికి ప్రతిభ తొలి పెట్టుబడి..

ప్రతిభపాటవాలతోనే ప్రపంచ ఖ్యాతిని సాధించే అవకాశం కలుగుతుందని రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ వెల్పర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జాన్‌వెస్లీ అన్నారు.శుక్రవారం ఇక్కడి పోర్టు మైదానంలో   వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం,సిఎంఆర్‌,విస్జా సంయుక్త ఆధ్వర్వంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ మీడియా క్రికెట్‌ పోటీలకు జాన్‌వెస్లీ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభాపాటవాలతోనే క్రీడాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడాకారులు క్రీడా స్పూర్తిని పెంపొందించే విధంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ఏయూ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ ఆచార్య విజయమోహన్‌, కృష్ణ కాలేజీ అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ మధుసుధనరావు మాట్లాడుతూ జర్నలిస్టుల క్రీడలు అభినందనయమన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించిన వారికి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లు నిర్వహించిన ఘనత  విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.  విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు,నాగబొయిన నాగేశ్వరరావు,పైల భాస్కరరావు సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, ,పైలా దివాకర్‌, శేఖర్‌ మంత్రి,డేవిడ్‌రాజు,గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-10-01 08:37:17