1 ENS Live Breaking News

జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు నెల్లిమర్ల విద్యార్థిని

ఉత్తర ప్రదేశ్ లోని వారణాశి లో ఈ నెల 22 నుంచి వరకు జరగనున్న జాతీయ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు నెల్లిమర్ల డా.అంబేడ్కర్ గురుకులంలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని ఏ. హారిక ఎంపికయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున ఈ హ్యాండ్ బాల్ పోటీల్లో హారిక ఆడనుంది. జాతీయ స్థాయిలో పోటీలకు హారిక ఎంపిక కావడం పట్ల గురుకులాల జిల్లా సమన్వయ అధికారి బి.చంద్రావతి, కళాశాల ప్రిన్సిపాల్ కే. ఉషారాణి, పి.డి.వీరమని, పి.ఇ.టి. అప్పల నరసమ్మ హర్షం వ్యక్తం చేశారు. బాగా ఆడి రాష్ట్రానికి, గురుకులానికి మంచి పేరుతీసుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు చక్కటి గుర్తింపు తీసుకువ స్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Nellimarla

2023-03-20 08:01:56

విశాఖలో మూడు రోజులు కళాకారుల క్రికెట్ టోర్నీ..

 విశాఖపట్నం కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ ను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె చాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ  మార్చి నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు విశాఖ కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ జ్ఞానాపురం గోల్డెన్ జూబ్లీ స్కూల్ నందు నిర్వహించేందుకు నేడు బ్రోచర్లను ఆవిష్కరించడం జరిగిందని, ఇందులో విశాఖ నగరం నుండి వివిధ రంగాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఫ్లోర్ లీడర్ బాణాలు శ్రీనివాసరావు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కళాకారుల సంఘం అధ్యక్షుడు జనార్ధన్, విష్ణు పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ యాదవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-17 11:02:38

కరాటే విజేతలను అభినందించిన కలెక్టర్

కరాటే విజేతలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. విశాఖపట్నంలో జరిగిన ఆరవ అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్ లో విజేతలుగా నిలిచిన - ఆరు సంవత్సరాల విభాగంలో బి. తమన్ రాజ్ (రజతం), 9 సంవత్సరాల లోపు విభాగంలో ఎం.కార్తికేయ (రజతం), 7 సంవత్సరాల లోపు విభాగంలో కె. ఆకాశ్ (కాంస్యం), 8 సంవత్సరాల లోపు విభాగంలో ఎం.యువరాజ్ (కాంస్యం) - సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

Parvathipuram

2023-02-13 13:21:04

రాష్ట్రస్థాయి హాకీ జట్టు విజేత అనకాపల్లి

హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలమంచిలి కేంద్రంగా 3రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీపోటీలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఫైనల్ పోరులో అనకాపల్లి- కాకినాడ బాలికల జట్లు తలపడ్డాయి. చివరకు అత్యుత్తమ ప్రతిభ కనబరచి అనకాపల్లి జట్టు విజేతగా నిలిచింది. కాకినాడ జట్టు రన్నర్ గా నిలిచింది. విజేతలకు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు బహుమతులు అందజేశారు. ఇందులో నిర్వాహకులు, హాక అసోసియేషన్ ప్రతినిధులు, రెండు జిల్లాల హాకీ క్రీడాకారులు, స్థానిక ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి

2023-01-30 09:53:09

ఆడాలి వ్యూపాయింట్ సత్వరమే పూర్తిచేయాలి

ఆడాలి వ్యూ పాయింట్ వద్ద రిసార్ట్స్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సీతంపేట ప్రాంతంలో శని వారం పర్యటించిన జిల్లా కలెక్టర్ వివిధ అభివృద్ధి పనులు పరిశీలించారు. సీతంపేటలో నిర్మిస్తున్న మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని, తదుపరి ఆడలి వ్యూ పాయింట్ ను సందర్శించారు. అడాలిలో రూ.2.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రిసార్ట్స్ ప్లాన్స్,  డ్రాయింగ్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి చెందారు. త్వరగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. జిల్లాలో మంచి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణకు నిలయంగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వన్ ధన్ వికాస్ కేంద్రాలు ద్వారా నిర్వహిస్తున్న జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి ఇలాంటి పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని ఆయన స్పష్టం చేశారు.

 గిరిజన ఉత్పత్తులకు విలువ ఆధారిత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్పెషాలటీ ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. త్వరగా ఆసుపత్రి సేవలు గిరిజనులకు చేరువ కావాలని ఆయన పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఉత్తమ వైద్యానికి కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన అన్నారు. 
అనంతరం ఐటిడిఎ కార్యాలయంలో వివిధ శాఖలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పనుల ప్రగతి వేగవంతం కావాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు ఉగాది నాటికి గరిష్ఠంగా పూర్తి చేయాలని, లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి. నవ్య, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ పార్వతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ జి.మురళి, ఐటిడిఎ డిపిఓ సతీష్ కుమార్, టిపిఎంయు ఏపిఓ, మండల అధికారులు పాల్గొన్నారు.

Seethampeta

2023-01-28 11:45:58

క్రీడలతో విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్తు

క్రీడలతోనే విద్యార్ధులకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర కళింగ వైశ్య కార్పోరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు అన్నారు. ప్రతి ఒక్కరు  క్రీడలలో రాణించేందుకు ముందుకురావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో నగరంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ ,క్యాడెట్ ,జూనియర్స్ ,సీనియర్స్ విభాగాలలో నిర్వహించిన తైక్వాండో పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్శన్ ఎం.వి.పద్మావతి ,చీఫ్ కోచ్ మాధురీలత ,వైకాపా నేత శిమ్మ రాజశేఖర్ ,సీనియర్ న్యాయవాది నౌపడ విజయ్ కుమార్ , ఒలంపిక్ అసోసియేన్ కార్యదర్శి సుందరరావు, కోణార్క్ శ్రీను ,మెంటాడ స్వరూప్ ,అంధవరపు ప్రసాద్ ,సూర శ్రీనివాసరావు,బోయిన పృద్ధ్వీ తదితరులు అంతా కలిసి పోటీలను ప్రారంభించారు.

Srikakulam

2023-01-22 15:28:40

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..మంత్రి గుడివాడ

రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తమ ప్రభుత్వం కృత నిష్చయము తో  ఉంద ని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం.. సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా సోమవారం పోర్టు మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. విశాఖలో పెండింగ్ లో ఉన్న 2005 జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఇటీవలే తాను స్వయముగా అధికారులతో మాట్లాడి వారి సూచన మేరకు న్యాయ సలహా కోసం సంబంధిత ఫైలును పంపించానని చెప్పారు. అక్కడి నుంచి ఫైల్ క్లియర్ కాగానే  తదుపరి చర్యలు  తీసుకుంటారన్నారు. తనకు పదవులతో పనిలేదని తనను నిరంతరం తనను ప్రోత్సహించేది జర్నలిస్టులేనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి తనకు తగిన ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ, మీడియా వల్ల  తాను ఈస్థాయీకి చేరుకోగలిగానన్నారు.

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం సుదీర్ఘకాలంగా పాత్రికేయులు సంక్షేమానికి పాటుపడుతుందని తాను అన్నిటిలో బాగస్వామి అవుతున్నానన్నారు. ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా జర్నలిస్టుల క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నా మన్నారు. విద్యా, వైద్యంతో పాటు జర్నలిస్టుల క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.  ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికి  మాట్లడుతూ తక్షణమే 2005 జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాల సమస్య  పరిష్కరించాలని మంత్రిని కోరారు. అందుకు మంత్రి గుడివాడ సానుకూలం గా స్పందించారు..

కార్యదర్శి దాడి రవికుమార్ మాట్లాడుతూ, విజేతలు ఎవరైనప్పటికీ  క్రీడా స్ఫూర్తితో  అందరు ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు. 22 క్యాటగిరీల్లో జర్నలిస్టులకు క్రీడలు నిర్వహించడం ఎంతో కష్టమైనప్పటికీ అందరి సహకారంతో పూర్తి చేయగలిగామన్నారు. అనంతరం మంత్రిని  వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు జ్ఞాపికను శ్రీనుబాబు బహూ కరించారు. కార్యక్రమంలో తొలుత ఇరు జట్ల క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకుని కాసేపు బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. విశాఖ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఉమా శంకర్ బాబు,చైర్మన్  జి. నరసింహారావు, కోశాధికారి పి.భాస్కర్కార్యవర్గ సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, గిరిబాబు వరలక్ష్మి దివాకర్, ఈశ్వర్ రావు మాధవరావు శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-09 10:19:54

చదువుతోపాటూ క్రీడల్లోనూ యువత రాణించాలి

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహకాలను అందించడంలో ముందు వరుసలో ఉందని ఎమ్మెల్సీ సిహెచ్.వంశీక్రిష్ణశ్రీనివాస్ అన్నారు. విశాఖజిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారం తో నిర్వహించిన  జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్ -2023 పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.ఈ  కార్యక్రమంలో సూర్య కుమార్, కళ్యాణి, జైన్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-09 08:06:41

జర్నలిస్టులు నిరంతర విజేతలు..జెడ్పీచైర్మన్

సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడే జర్నలిస్టులకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని వారు ఎప్పుడూ నిరంతర విజేతలే నని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా శుక్రవారం నాటి క్రికెట్ పోటీలకు జడ్పీ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ విజేతలు ఎవరైనప్పటికీ ఒకే విధంగా భావించాలన్నారు. గెలిచిన జట్టు ఎక్కువ, ఓడిన వారు తక్కువేమీ కాదన్నారు.. ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ నిర్వహించే కార్యక్రమాల్లో తనను తప్పకుండా భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అతిథులు కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులు ను ఉత్సాహపరిచారు. వీరిని విజేఎఫ్,
విస్జా కార్య వర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు.

Visakhapatnam

2023-01-06 09:28:21

విశాఖపోర్టు స్టేడియం వేదికగా క్రికెట్ లో 4జట్ల మధ్య క్రికెట్ పోరు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్, విస్జా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో 
శుక్రవారం ఉదయం 9గ. నుంచి షెడ్యుల్ ప్రకారం క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా v/s స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ టీమ్  మధ్యాహ్నాం  ఆంధ్రప్రభ v/s కెమెరా మెన్  బి టీమ్ జట్లు తలపడను న్నాయి. కాగా నిర్ణీయత సమయానికి జట్ల సభ్యులంతా స్టేడియంకి చేరుకోవాలని నిర్వాహకులు తెలియజే శారు. విశాఖలో జరుగుతున్న జర్నలిస్టుల స్పోర్ట్స్ మీట్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. విజెఎఫ్ ప్రతీ ఏటా జర్నలిస్టులకోసం ఈ క్రీడలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం విశేషం.

Visakhapatnam

2023-01-06 03:17:46

ప్రజాశక్తి జట్టుపై..లోకల్ ఛానల్స్ జట్టు విజయం

విజెఎఫ్, సీఎంఆర్, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జర్నలిస్టుల క్రీడల పోటీల్లో 3వ రోజు క్రికెట్ పోటీ హోరా హోరీగా జరిగింది. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో ప్రజాశక్తి టీమ్ పై లోకల్ ఛానల్స్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముందు జనసేన సీనియర్ నాయకులు బి.సత్యన్నారాయణ జర్నలిస్టుల క్రీడల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు నిత్యం వార్తల కోసమే కాకుండా ఇలాంటి క్రీడా సంబరాల్లో పాల్గొనడం ద్వారా శారీరక వ్యాయామం కలుగుతుందన్నారు.

విజెఎఫ్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన ఎస్.దుర్గారావు, శ్రీదేవి ఛానెల్ అధినేత  రామకృష్ణరాజు, బీజేపి అధ్యక్షుడిగా సేవలందించిన పీవీ చలపతిరావు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు, మృతి పట్ల జర్నలిస్టులంతా ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మైత్రీ మీడియా అధినేత అవనాపువిక్రమ్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్ బాబు, భాస్కర్, రామ్, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, నాగరాజు పట్నాయర్,డి గిరిబాబు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్, శేఖర మంత్రి, ప్రజాపిత బ్రహ్మకుమారి  బికే.రామేశ్వరి తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-05 08:13:35

రేపటి నుంచి వైజాగ్ లో ఇంటర్ మీడియా క్రికెట్ ఫీవర్

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్, విస్జా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా గురువారం ఉదయం మెగా క్రికెట్ సంబురం ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి షెడ్యుల్ ప్రకారం మ్యాచ్ జరగనున్నాయి. విశాఖ పోర్టు స్టేడియం వేదికగా జరిగే జర్నలిస్టుల క్రికెట్ వేడుకగా జరగనుం ది. దీనికి ఇప్పటికే ఏఏ మ్యాచ్ లు ఎవరెవరి మధ్య జరగనున్నాయనే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించి, టీమ్ లకు తెలియజేశారు.  నిర్ణీత సమయానికి ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తాజా అప్డేడ్స్ ను ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి..!

Visakhapatnam

2023-01-04 17:07:11

రెండో రోజు ఆటలు షెటిల్, బ్యాడ్మింటెన్, టెన్నీస్

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సీఎంఆర్, విస్జా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా బుధవారం రెండో రోజు క్రీడా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, చెస్,క్యారమ్స్, టెన్ని కాయట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలియజేశారు. ఆయా పోటీల్లో పాల్గొనే జర్నలిస్టులు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొనే  సదుపాయం కూడా కల్పించినట్టు ఆయన వివరించారు.  ఆయా పోటీల్లో పాల్గొని  జయప్రదం చేయాలని ఇంటర్ మీడియా స్పోర్ట్స్ విభాగం కోరింది. కాగా జట్లలో విజేతలుగా నిలిచిన వారిని అదే రోజు ప్రకటిస్తున్నారు.

Visakhapatnam

2023-01-04 05:02:00

జర్నలిస్టుల క్రీడలు అభినందనీయం..జీవిఎంసీ కమిషనర్

నిరంతరం సమాజానికి సేవలందించే జర్నలిస్టులకు క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమని జివిఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు కొనియాడారు. ఈ క్రీడలు దేశంలో ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. మంగళవారం విశాఖ పోర్టు అవుట్‌ డోర్‌ మైదానంలో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్‌కు ఆయన ముఖ్య అతిధిగాహాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ తాను అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో జర్నలిస్టుల క్రీడలను నిర్వహిస్తుండటం విశాఖలోనే చూసానన్నారు. విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నామన్నారు. కార్యదర్శి దాడి.రవికుమార్‌, ఉపాధ్యక్షుడు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్.నాగరాజు పట్నాయక్‌, విస్జా అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-03 10:39:42

ఉల్లాసంగా..ఉత్సాహంగా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్‌ తొలి రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభమైంది. టగ్‌ ఆఫ్‌ వార్‌ హోరాహోరీగా సాగింది. నాలుగు జట్లుగా 44 మంది జర్నలిస్టులు ఇందులో పాల్గొన్నారు. పురష, మహిళలకు వంద, రెండు వందల మీటర్ల పరుగుపందం, హైజంప్‌, లాంగ్‌ జంప్‌తో పాటు వివిధ పోటీలు నిర్వహించారు. ఫోరం సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పి. దివాకర్‌, డేవిడ్‌, పి. వరలక్ష్మీ, మాధవరావు, గయాజ్‌, శేఖర్‌ మంత్రి,విస్జా ప్రతినిధులు ప్రకాశ్‌తో పాటు, వివిధ అసోసియేషన్లుకు చెందిన 45 మంది ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించారు.

Visakhapatnam

2023-01-03 10:36:56