1 ENS Live Breaking News

క్రికెట్ లో ఆక‌ట్టుకున్న క‌లెక్ట‌ర్‌, జెసి..

రెవెన్యూ అధికారుల‌మ‌ధ్య క్రికెట్ పోటీ హోరాహోరీగా జ‌రిగింది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం జ‌రిగిన రెండు పోటీల్లో మొత్తం మూడు జ‌ట్లు పాల్గొన‌గా, తుది స‌మ‌రం ఆదివారం జ‌ర‌గ‌నుంది. క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఐటిడిఏ పిఓ, ఆర్‌డిఓ త‌దిత‌ర ఉన్న‌తాధికారులు ప్రొఫెష‌న‌ల్ క్రీడాకారుల మాదిరిగా క్రికెట్ ఆడి ఆక‌ట్టుకున్నారు. తీవ్ర‌మైన ప‌నివ‌త్తిడితో స‌త‌మ‌తం అవుతున్న రెవెన్యూ ఉద్యోగులు, ఆట‌విడుపు కోసం మొత్తం మూడు జ‌ట్లుగా ఏర్ప‌డి,  క్రికెట్‌లో త‌ల‌ప‌డ్డారు. తొలుత ఉద‌యం క‌లెక్ట‌రేట్ జ‌ట్టు, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ జ‌ట్లు పోటీ ప‌డ్డాయి.  ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి టాస్ వేయ‌గా, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్ టాస్ గెలుచుకున్నారు. క‌లెక్ట‌రేట్ జ‌ట్టు కెప్టెన్, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ త‌న జ‌ట్టుతో బ్యాటింగ్ ప్రారంభించారు. ఈ జ‌ట్టు త‌ర‌పున బ్యాటింగ్ కు దిగిన క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, రెవెన్యూ అసోసియేష‌న్ అధ్య‌క్షులు టి.గోవింద‌, శ్రీ‌నివాస్‌, సుభాష్ ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో, మొత్తం స్కోరు 15 ఓవ‌ర్ల‌లో 74కు చేరుకుంది. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ జ‌ట్టు త‌ర‌పున జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, ఆర్‌డిఓ భ‌వానీశంక‌ర్‌, ఇత‌ర క్రీడాకారులు ధీటుగా బ్యాటింగ్ చేయ‌డంతో, క‌లెక్ట‌రేట్ జ‌ట్టుపై విజ‌యం సాధించింది.  

                 మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్ జ‌ట్టుకు, పార్వ‌తీపురం డివిజ‌న్ జ‌ట్టుకు మ‌ధ్య పోటీ జ‌రిగింది. పార్వ‌తీపురం జ‌ట్టుకు ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్ నాయ‌క‌త్వం వ‌హించారు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన క‌లెక్ట‌రేట్ జ‌ట్టు, నిర్ణీత 15 ఓవ‌ర్ల‌లో 117 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన పార్వ‌తీపురం జ‌ట్టు 97 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డంతో, ఓట‌మి చెందింది. తుది స‌మ‌రం ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఈ క్రికెట్ పోటీల‌కు హాజ‌రైన జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జిల్లా క్రీడాధికారి వెంక‌టేశ్వ‌ర్రావు, క్రికెట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి ఎం.ఎల్‌.ఎన్ రాజు, రెవెన్యూ అసోసియేష‌న్ నాయ‌కులు గొట్టాపు శ్రీ‌రామ్మూర్తి, ర‌మ‌ణ‌రాజు త‌దిత‌రులు గ్యాల‌రీనుంచి క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించారు.

Vizianagaram

2021-07-24 13:47:14

ఒలింపిక్స్ క్రీడాకారులకు క‌లెక్ట‌ర్ శుభాకాంక్ష‌లు..

జ‌పాన్‌లోని టోక్యోలో నేటి నుంచి ప్రారంభ‌మ‌వుతున్న ఒలింపిక్స్ క్రీడ‌ల్లో భార‌త్ త‌ర‌పున వివిధ ఈవెంట్ల‌లో పాల్గొంటున్న క్రీడాకారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ శుభాకాంక్ష‌లు తెలిపారు. క్రీడాకారులంతా తాము పాల్గొంటున్న క్రీడ‌లు, అథ్లెటిక్స్ త‌దిత‌ర అంశాల్లో విజ‌యం సాధించి దేశానికి ప‌త‌కాలు తీసుకురావాల‌ని ఆకాంక్షించారు. నేటి నుంచి ఒలింపిక్ క్రీడ‌లు ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో భార‌త ఒలింపిక్ సంఘం జిల్లా క‌లెక్ట‌ర్‌కు బ‌హూక‌రించిన జెర్సీని ధ‌రించి త‌న క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం చీర్ అప్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. దేశానికి పెద్ద ఎత్తున ప‌త‌కాలు సాధించ‌డం ద్వార 135 కోట్ల భార‌త ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాల‌ని కోరారు. 18 క్రీడాంశాల్లో 127 మంది ఈ ఒలింపిక్స్‌లో భార‌త్ త‌ర‌పున వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటున్నార‌ని, ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో భార‌త్ త‌ర‌పున ఇదే పెద్ద బృంద‌మ‌ని చెప్పారు. ఒలింపిక్ సంఘం త‌ర‌పున సెట్విజ్ సి.ఇ.ఓ. విజ‌య‌కుమార్‌, జిల్లా క్రీడ‌ల అధికారి వెంక‌టేశ్వ‌ర‌రావు భార‌త క్రీడాకారుల జెర్సీని జిల్లా క‌లెక్ట‌ర్‌కు బ‌హూక‌రించారు.

ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని విజ్జీ స్టేడియంలో శ‌ని, ఆదివారాల్లో జ‌ర‌గ‌నున్న రెవిన్యూ అధికారుల క్రికెట్ మ్యాచ్‌ల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, ఆర్డీఓ భ‌వానీశంక‌ర్ త‌దిత‌రులతో చ‌ర్చించారు. పార్వ‌తీపురం, విజ‌య‌న‌గ‌రం, క‌లెక్ట‌రేట్ ల నుంచి మూడు జ‌ట్లుగా ఏర్పడి రెండు రోజుల‌పాటు స్నేహ‌పూర్వ‌క క్రికెట్ మ్యాచ్‌లు ఆడ‌నున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌లు, రెవిన్యూ డివిజ‌న‌ల్ అధికారులు ఈ మ్యాచ్‌ల‌లో ఆయా జ‌ట్ల త‌ర‌పున పాల్గొంటున్నారు.

Vizianagaram

2021-07-23 15:27:17

అబ్దుల్లాకి ఆర్దిక సహాయం అందజేత..

 భూటాన్లో ఆగస్టు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే సౌత్ ఏషియన్  గేమ్స్కు షేక్ అబ్దుల్లా ఎంపికై ఆర్ధిక ఇబ్బందులు వలన పోటీలలో పాల్గొన లేకపోతున్నానని దాతలు ఆర్ధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. దీనిపై జిల్లా  రెడ్ క్రాస్ సోసైటీ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  స్పందించి షేక్ అబ్ధుల్లా సౌత్ ఏషియన్  గేమ్స్లో పాల్గొనేందుకు ఆర్ధిక సహాయంగా  రూ.50,000 అందించారు. శుక్రవారం సాయంత్రం నంబూరులోని రెయిన్ ట్రీ పార్కు విల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో  సౌత్ ఏషియన్  గేమ్స్కు ఎంపికయిన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన అథ్లెట్ షేక్ అబ్దుల్లాకు ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా శాఖ ప్రకటించిన ఆర్ధిక సహాయం రూ. 50,000 చెక్కును  సోసైటీ జిల్లా చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్   రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అథ్లెట్ షేక్ అబ్ధుల్లా మరియు వారి తల్లిదండ్రులకు అందించారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో విజయం సాధించి రాష్ట్ర మరియు దేశం పేరును ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ సోసైటీ ద్వారా పర్సనల్ హైజిన్ కిట్ను అందించారు. అలాగే రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సోసైటీ వైస్ చైర్మన్ రామచంద్ర రాజు, ట్రెజరర్ వి రవి శ్రీనివాస్ పాల్గోన్నారు.

Guntur

2021-07-23 15:21:51

టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలి..

టోక్యో-2020 ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మన దేశ, రాష్ట్ర , జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయ పతకాలతో, ఆరోగ్యంగా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులును ఉత్సాహపరిచే విధంగా  జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
"సెల్ఫీ" స్టాండ్ ను జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి(అభివృద్ధి),జి.రాజకుమారి (ఆసరా&సంక్షేమం) లతో కలిసి కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో జరగబోయే ఒలింపిక్స్ గత సంవత్సరం జరగాల్సి ఉన్న  కరోనా వైరస్ కారణంగా వాటిని వాయిదా వేసి ప్రస్తుతం 2021సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. భారతదేశం నుంచి ఈ ఒలింపిక్స్ లో సుమారుగా 18 క్రీడాంశాల్లో  మనదేశ నుంచి 100 మంది క్రీడాకారులు విజయం సాధించే లక్ష్యంతో పూర్తి సన్నద్ధతో టోక్యోకు ప్రయాణమయ్యారన్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు పి.వి.సింధు, ఆర్.సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్) ఆర్.రజిని (హాకీ) క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ మొదటిసారిగా ఒలింపిక్స్ లో  బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొనడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. మన దేశం, రాష్ట్రం, ముఖ్యంగా మన జిల్లా నుండి పాల్గొన్న క్రీడాకారులు అందరూ కరోనా బారిన పడకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పోటీలలో పాల్గొని,విజేతలుగా పతకాలు సాధించి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.  టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న వారందరికీ ఉత్సాహం,ఉత్తేజ పరచుటకుగాను స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడామైదానంలోను ,తుని, అమలాపురం, సామర్లకోట క్రీడా ప్రాంగణములలో  సెల్ఫీ స్టాండ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని సెట్రాజ్ సీఈవో ఎం.భానుప్రకాష్ తెలిపారు. స్థానిక క్రీడాకారులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెల్ఫీ దిగి, షేర్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించవలసిందిగా ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 14:05:21

టోక్కోలో భారత్ పతకాల పంట పండాలి..

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అభినందనలు తెలిపారు. సోమవారం 10వ వార్డు, తోటగరువులోగల జిల్లా పరిషత్ హైస్కూలులో  క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రామంలో మేయర్  మాట్లాడుతూ జరుగుచున్న టోక్యో ఒలింపిక్స్ లో విశాఖ నగరం నుండి క్రీడాకారులు పాల్గొంటున్నందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ వారిని ప్రోత్సహించుటకు సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ హై స్కూలు ఉపాధ్యాయులను మేయర్ అభినందించారు. క్రీడలు ప్రతీ  మనిషికీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిస్తూ, ఆరోగ్య రక్షణకు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన నగర క్రీడా కారుడు అన్మిష్ వర్మను మేయర్ సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కార్పొరేటర్ ఎం. రామలక్ష్మి, వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాస్, ఉప విద్యా శాఖాధికారి జి. ప్రేమ కుమార్, జిల్లా పరిషత్ హై స్కూలు ప్రధానోపాధ్యాయిని జి.కె.డి. భవాని, ఉపాధ్యాయులు ఎం. వర్ధిని, డి. సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-19 15:03:21

ఛీర్స్ ఫ‌ర్‌ ఇండియా..

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ లో భార‌త క్రీడాకారులు ఘ‌న‌విజ‌యాల‌ను సాధించాల‌ని మంత్రులు, జిల్లాకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఆకాంక్షించారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఛీర్స్ ఫ‌ర్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భార‌త క్రీడాకారుల‌కు సెల్పీ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్,  ఎంఎల్ఏలు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావు, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు క్రీడాకారుల‌కు సెల్పీ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సెట్విజ్ సిఇఓ విజ‌య‌కుమార్‌, జిల్లా క్రీడాధికారి వెంక‌టేశ్వ‌ర్రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-07-06 14:44:30

Visakhapatnam

2021-06-28 07:03:50

సింధూ, సాత్విక్ లకు ఆర్ధిక ప్రోత్సాహం..

టోక్యో ఒలింపిక్స్ లో రాష్ట్రం నుంచి పాల్గొనే బ్యాడ్మింటెన్ క్రీడాకారులు పీవీ సింధుకు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో క్రీడల కోసం మౌలిక సదుపాయల కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అంతర్జాతీయ స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించామని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతితో వాటి పనులు చేపడతామని తెలిపారు. విశాఖలో చినగదిలి మండలంలో బ్యాడ్మింటెన్ అకాడమీ ఏర్పాటుకు పీవీ సింధుకు రెండు ఎకరాలు ఉచితంగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అదే మండలంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు నిమిత్తం డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ కు చెందిన సాహి హియరింగ్ కేర్ కు ఒక ఎకరా కేటాయించామన్నారు. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా గతంలో 13 జిల్లాల్లో 13 రకాల క్రీడలను గుర్తించి, సీఎం కప్ నిర్వహించామన్నారు. వైఎస్సార్ క్రీడా పురస్కారాల పేరుతో  జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, రజతం సాధించిన రూ.3 లక్షలు, కాంస్యం సాధించిన రూ.2 లక్షల చొప్పున అందజేశామన్నారు. ఇలా ఎంతమంది ఉన్నా అందరికీ ఆర్థిక ప్రోత్సాహాకాలు అందజేస్తామన్నారు. కుల, మతాలు, రాజకీయాలకతీతంగా క్రీడాకారులను తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో శాప్ ఎం.డి. బి.రామారావు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-23 13:35:04

యోగాతో చక్కని ఆరోగ్యం సొంతం..

యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని నోడల్ అధికారి మిరియాల నాగభూషణం తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం గ్రామీణం జూన్ 21 బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రంలో కోవిడ్ రోగులతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాపై అవగాహన చేపట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు 450 మంది కోవిడ్ పేషెంట్లు, 150 మందికి యోగా శిక్షకులు బి నాగరాజు గారితో అర్ధ చక్రాసన. పాదహస్తాసన, శ్వాస సామర్ధ్యాన్ని పెంచే ఆసనాలు రోగనిరోధక శక్తిని పెంచే ప్రాణాయామం.మానసిక ప్రశాంతతకు సహకరించే ఆసనాలపై అవగాహన కల్పించారు. మానవాళికి సంక్రమించే సమస్త వ్యాధులబారిన పడకుండా దూరం చేసే ఏకైక దివ్య ఔషధం "యోగ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రోటోకాల్ ప్రకారం సోమవారం  ఓంకారం, ప్రాణాయామం, ధ్యానం, యోగ ఆసనాలు వేశారన్నారు   వినయం, విధేయత, యోగ్యత రావాలంటే యోగసాధన బాల్యము నుండీ అలవార్చుకోవాలని మనిషి తనువును, మనస్సును, ఆత్మను ఏకంచేసే ఏకైక సాధనం "యోగ" మాత్రమేనని, అంతే కాకుండా ప్రపంచదేశాల ప్రజలు ఈ రోజు యోగాసాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారంటే అది కేవలం భారతదేశం గొప్పతనమని అన్నారు. జె ఎన్ టి యు కోవిడ్ కేర్ కేంద్రం తరువాత బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రంలో ఈ యోగా కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో  మండల తాసిల్దార్ రియాజ్ హుస్సేన్ అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోమలి ఆర్ ఎం ఓ వి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Rajahmundry

2021-06-21 13:37:07

మహాలక్ష్మి కి రాష్ట్ర యోగ అవార్డుకి ..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వర్చువల్ యోగా కాంపిటీషన్ లో రాజాం మండలం ఏ వి పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జె. మహాలక్ష్మి రాష్ట్రస్థాయి కన్సోలేషన్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును గెలుచుకున్నందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో మహాలక్ష్మి, ఆయుష్ వైద్యులు డాక్టర్ మాధవ రావు చౌదరి జిల్లా కలెక్టర్ కు కలిసి వివరాలను తెలియజేశారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జిల్లా మరిన్ని అవార్డులు సాధించాలని కోరారు. విద్యార్థులు యోగాలో భాగస్వామ్యం కావాలని తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.

Srikakulam

2021-06-21 13:07:00

క్రీడాకారిణి చేయూత కింద ఒక నెల జీతం ఇచ్చారు..

అంతర్జాతీయ స్ధాయిలో వెయిట్ లిఫ్టర్, ఆమదాలవలసకు చెందిన బుడుమూరు రాజేశ్వరికి సమాచార పౌరసంబంధాల శాఖలో అవుట్ సోర్సింగ్ లో ఏపీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆర్.రామ మూర్తి డిపీఆర్వో కార్యాలయంలో శుక్ర వారం 25 వేల రూపాయల చెక్కును అందజేసారు. అంతర్జాతీయ స్ధాయికి చేరుకున్న రాజేశ్వరి ఆర్ధిక పరిస్ధితి రీత్యా వివిధ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని వదులుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఆర్.ఆర్. మూర్తి తన ఒక నెల వేతనం రూ.25 వేలును ఆర్ధిక సహాయంగా అందజేసి ఉదారతను చాటారు. అంతర్జాతీయ పోటీల్లో రాజేశ్వరి పాల్గొనాలని, విశ్వ విజేతగా నిలిచి శ్రీకాకుళం జిల్లాకు ఖ్యాతి తేవాలనే ఆకాంక్షతో సహాయం అందించినట్లు ఆర్ఆర్. మూర్తి తెలిపారు. క్రీడలు అంటే అమితమైన ఆసక్తి అని స్వయంగా పాల్గొనలేక పోయినప్పటికి జిల్లా నుండి క్రీడా దిగ్గజాలు పాల్గొంటున్నారనే ఆనందం కలుగుతుందని ఆయన అన్నారు. ఆర్థిక పరిస్ధితులు క్రీడా కారుల భవితకు అడ్డుకారాదని ఆయన పేర్కొంటూ ఎంతో మంది ఉదారత కలిగిన వ్యక్తులు జిల్లాలో ఉన్నారని వారు ముందుకు వచ్చి రాజేశ్వరి వంటి వారిని ప్రోత్సహించాలని కోరారు. వెయిట్ లిఫ్టింగు క్రీడాకారిణిగా రాజేశ్వరి అంతర్జాతీయ స్ధాయిలో 2 బంగారు పతకాలు సాధించారు. తాష్కెంటులో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగు, జర్మనీలో జరిగిన సీనియర్ ఉమెన్ గ్రాండ్ ఫిక్స్ టోర్నిలో బంగారు పతకాలు సాధించగా, జాతీయ స్ధాయిలో 10 బంగారు పతకాలు, రాష్ట్ర స్ధాయిలో 15 బంగారు పతకాలు, జిల్లా స్ధాయిలో 30 వరకు బంగారు పతకాలు సాధించారు. తండ్రి చనిపోగా తల్లి కూలీ పనులను చేస్తూ ఇంటిని పోషిస్తుంది. రాజేశ్వరితో పాటు ప్రతిభాసామర్ధ్యాలు కలిగిన క్రీడాకారులు, విద్యార్ధులను ప్రోత్సహించుటకు కొంత మంది ముందుకు రావాలని కోరుకుందాం.

Srikakulam

2021-03-19 16:59:12

ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాలి..

 క్రీడా పాఠ‌శాల‌లో అందించిన శిక్ష‌ణ‌ను స‌ద్వినియోగం చేసుకొని, ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు కోరారు. స్థానిక విజ్జీ స్టేడియంలోని ఆద‌ర్శ క్రీడా పాఠ‌శాల పునః ప్రారంభ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. చ‌దువుతోపాటు క్రీడ‌ల్లో కూడా రాణించాల‌ని అన్నారు. 2019 పాఠ‌శాల ప్రారంభ‌మైన ఈ క్రీడా పాఠ‌శాల‌, కోవిడ్ కార‌ణంగా మూసివేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇప్పుడు పునః ప్రారంభం అవుతోంద‌ని, 82 మంది విద్యార్థులు ప్ర‌స్తుతం ఉన్నార‌ని తెలిపారు. పిల్ల‌ల‌కు ఆంగ్ల మాధ్య‌మ విద్యాబోధ‌న‌తోపాటుగా, మంచి భోజ‌న వ‌స‌తిని క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ముర‌ళి, క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు రాజు, క‌బ‌డ్డీ అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఈశ్వ‌ర్ కౌషిక్‌, సెట్విజ్ సిఇఓ నాగేశ్వ‌ర్రావు, తాశీల్దార్ ప్ర‌భాక‌ర్రావు, జిల్లా ఛీఫ్ కోచ్ వెంక‌టేశ్వ‌ర్రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-18 18:44:40

జాతీయ ఫెన్సింగ్ పోటీలకి ప్రణయ్..

ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగననున్న జాతీయస్థాయి పెన్సింగ్ పోటీలకు నరసన్నపేటలోని శర్వాణీ విద్యార్ధి దిబ్బ ప్రణయ్ ఎంపిక కావడం అభినందనీయమని రాష్ట్ర కళింగ వైశ్య  కార్పొరేషన్ చైర్మన్  అంధవరపు సూరిబాబు అన్నారు.. గురువారం విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  గత నెల 27 నుంచి ఈ నెల 1 వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డిఎస్ఎ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తృతీయ స్థానం దక్కించి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి చేరుకున్నాడన్నారు.  ఈ సందర్భంగా అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ, ప్రణయ్ జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. విద్యార్ధిని ప్రోత్సహిస్తూ రూ2వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త అంధవరపు సూరిబాబు, శర్వాణీ విద్యాలయం ఉపాధ్యాయులు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Narasannapeta

2021-03-18 17:03:59

రెడ్‌క్రాస్ సైకిల్ ర్యాలీకి సంఘీభావం తెలపాలి..

రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 24వ తేది నిర్వహిస్తున్న శతవార్షికోత్సవ సైకిల్ ర్యాలీలో పాఠశాలలు, కళాశాల విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ర్యాలీ నిర్వాహణపై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, కలెక్టరు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ డా. జి. సమరం, జాయింట్ కలెక్టరు, రెడ్ క్రాస్ నోడల్ అధికారి కె. మోహన్‌కుమార్ , సెక్రటరీ డా. ఇళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ 1920వ సంవత్సరంలో ఏర్పడిందన్నారు. కరోనా విపత్కర కాలం రావడంతో 2020వ సంవత్సరంలో నిర్వహించాల్సి సెంటీనియల్ వేడుకలను ఇప్పుడు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈర్యాలీ మార్చి 16 నాడు శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ప్రారంభ##మైందన్నారు. ఈర్యాలీ పలు జిల్లాల మీదుగా కృష్ణాజిల్లాలోకి 24వ తేది ఉదయం హనుమాన్‌జంక్షన్ వద్ద ప్రవేశిస్తుందన్నారు. ర్యాలీలో 70 మంది రెడ్ క్రాస్ కార్యకర్తలతోపాటు, వారికి సంఘీభావంగా బాపులపాడు లోని కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్ధులు ర్యాలీలో పాల్గొంటారన్నారు. అలాగే ర్యాలీలో పాల్గొన్నవారికి రోడ్డుకిరుప్రక్కలా విద్యార్ధులు నిలబడి అభివాదం తెలుపుతారన్నారు. విద్యార్ధులకు రెడ్ క్రాస్ సంస్ధ టీషర్ట్‌లు, టోపీలు, మాస్క్‌లు ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అక్కడి నుండి 25వ తేది ఉదయం విజయవాడ నగరంలోనికి ప్రవేశిస్తుందన్నారు. నెల్లూరు నుంచి వచ్చే మరో సైకిల్ ర్యాలీ 25వ తేది ఉదయం గుంటూరు నుండి జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. స్ధానిక యస్‌యస్ కన్వెషన్ హాలులో రెడ్ క్రాస్ సెంటీనియల్ సైకిల్ ర్యాలీ వేఢుకలు జరుగుతాయని ఆయన చెప్పారు. బ్లడ్ డొనేషన్, మొక్కలపెంపకం, పారిశుద్ధ్యం మూలసూత్రాలుగా ఈవేఢుకలు నిర్వహించాలన్నారు. ఈవేఢుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ గౌ. బిశ్వభూషణ్ హరిచందన్ హాజరై పాల్గొంటారన్నారు. ఈవేఢుకల నిర్వాహణలో ఎ లాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టరు రెడ్ క్రాస్ అధికారులను ఆదేశించారు.

Vijayawada

2021-03-17 20:04:34

రెడ్ క్రాస్ రాష్ట్రస్థాయి సైకిల్ యాత్ర..

రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర స్ధాయి సైకిల్ యాత్రను ప్రారంభిస్తుందని రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన రావు అన్నారు. రాష్ట్ర స్దాయి సైకిల్ యాత్ర ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో ప్రారంభం అవుతుందని వివరించారు. రాష్ట్ర స్ధాయి సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్ధ ఛైర్మన్ డా.ఏ.శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఏ.కె.ఫరీడా, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి బి.సి.బెహరాతో సహా జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.ఎన్.వెంకట రావు, జాయింట్ కలెక్టర్లు  తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుండి ఒక బృందం, నెల్లూరు నుండి మరో బృందం బయలుదేరుతుందని ఆయన చెప్పారు. ఈ బృందాలు అమరావతి చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 1920వ సంవత్సరంలో ప్రారంభమైన ఇండియన్ రెడ్ క్రాస్ ఈ ఏడాదికి శత జయంతి పూర్తి చేసుకుందన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్ధ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్ధ చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన చేపట్టుటలో భాగంగా ఈ నెల 16వ తేదీ పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొంటూ యాత్రలో భాగంగా వివిధ ప్రదేశాలలో యాత్ర సభ్యులు సభలు నిర్వహించి స్వచ్ఛంద రక్తదానం, మొక్కలు నాటడం, పరిశుభ్ర వాతావరణం, మోటారు వాహనాల వినియోగం తగ్గింపు, కరోనా నివారణ – మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. సైకిల్ యాత్ర శ్రీకాకుళం నుండి బయలు దేరి మధ్యలో మరి కొంత మందిని చేర్చుకుంటూ విజయనగరం చేరుకుంటుందని తెలిపారు. విజయనగరం రెడ్ క్రాస్ కు అందిస్తుందని, అచ్చట నుండి సభ్యులు బయలుదేరి విశాఖపట్నంకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చివరిగా అమరావతి అంచెలంచెలుగా చేరుతుందని వివరించారు. ఈ నెల 25వ తేదీన చివరగా అమరావతి చేరుకుంటుందని తెలిపారు. శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో సైకిల్ యాత్రలో పాల్గొనుటకు ఆసక్తి కలిగి, శారీరక ధారుఢ్యం గల వాలంటీర్లు సైతం చివరి వరకు సైకిల్ యాత్రలో పాల్గొనవచ్చని చెప్పారు. సైకిల్ యాత్రలో పాల్గొన్నవారికి జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త సైకిల్ యాత్రలో పాల్గొన్న వారికి ఈ నెల 25వ తేదీన అమరావతిలో జరిగే రాష్ట్ర స్ధాయి ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొంటారని, అచ్చట గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం బహుకరించడం జరుగుతుందని ఆయన వివరించారు.

Srikakulam

2021-03-12 19:50:58