1 ENS Live Breaking News

విజెఎఫ్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ నేటి క్రీడలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సీఎంఆర్, విస్జా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో మంగళవారం తొలిరోజు ఆటల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మెన్ అథ్లెటిక్స్ తో పాటు మహిళా జర్నలిస్ట్ లకు పలు పోటీలు జరగనున్నాయి. పురుషుల 100మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ మహిళల 50మీట ర్లు, షార్ట్ పుట్ క్రీడలు జరగనున్నాయి. కాగా ఆశక్తి ఉన్న జర్నలిస్టులు స్పాట్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయించు కొని క్రీడల్లో పాలుపొచుకోవచ్చునని వీజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలియజేశారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Visakhapatnam

2023-01-03 03:03:13

2023 నూతన ఏడాదిలో శ్రీలంకతో తొలి పోరు నేడే

భారత్ తన తొలి క్రికెట్ మ్యాచ్‌ను కొత్త సంవత్సరంలో నేడు తొలిసారిగా ఆడనుంది. భారత్ – శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (మంగళవారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంమ య్యారు. ఆ స్థాయంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఆటలో గెలిచి 2023 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో జరిగే మ్యాచ్ చాలా అంచనాలున్నాయి.

Mumbai

2023-01-03 02:36:20

3 నుంచి జర్నలిస్టుల ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్, విస్జా ఇంటర్ మీడియా  స్పోర్ట్స్ మీట్ 3 నుంచి ఘనంగా నిర్వహించను న్నట్లు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లోకార్యదర్శి దాడి రవికుమార్,ఉపాధ్యక్షులు  ఆర్.నాగరాజ్ పట్నాయక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. విశాఖ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సౌజన్యంతో ఈమెగా పోటీలు నిర్వహిస్తున్నామని3 నుంచి ఇండోర్ స్పోర్ట్స్, ఐదు నుంచి 12 వరకు క్రికెట్ మెగా సంబరం పోర్ట్ మైదానాల్లో ఆయా పోటీలు జరుగుతాయన్నారు. క్రికెట్ లో 11 జట్లు తలపడతాయన్నారు.

Visakhapatnam

2023-01-02 09:01:05

జనవరి3 నుంచి జర్నలిస్టుల ఇంటర్ మీడియా స్పోర్ట్స్

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సీఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి జర్నలిస్టుల క్రీడా పోటీలు( ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్‌) ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో కార్యదర్శి దాడి రవికుమార్‌, ఉపాధ్యక్షుడు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్‌.నాగరాజు పట్నాయక్‌, కోశాధికారి పిఎన్‌ మూర్తి, కార్యవర్గ సభ్యులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకులు, జర్నలిస్టుల క్రీడా పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై వీరంతా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకులు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక జనవరి 3 నుంచి పోర్టు ఇండోర్‌ స్టేడియంలో ఇండోర్‌ గేమ్స్‌, నిర్వహించడం జరుగుతుందన్నారు.

 5 నుంచి పోర్టు క్రికెట్‌ మైదానంలో జర్నలిస్టుల క్రికెట్ పోటీలు జరుగుతాయన్నారు. అయితే ఆయా పోటీల్లో పాల్గొనే జర్నలిస్టులు ఈ నెల 25లోగా డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యాలయం పనివేళల్లో తమ జాబితాలను అందజేయాలని కోరారు. అయితే అక్రిడేషన్‌, సంస్థ గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి విధిగా కలిగి ఉండాలన్నారు. గడువు దాటిని దరఖాస్తులను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, గయాజ్‌, శేఖర్‌ మంత్రి, సనపల మాధవరావు, డేవిడ్‌,గిరిబాబు,వరలక్ష్మీ, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2022-12-16 09:11:29

బాగా ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి

క్రీడాకారులు పోటీ త‌త్వంతో బాగా ఆడాల‌ని ఆయా జిల్లాల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ పేర్కొన్నారు. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జోన‌ల్ స్థాయితో పాటు, రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాల‌ని ఆకాంక్షించారు. సీఎం ప్రైజ్ మనీ కప్ టోర్నమెంట్ - 2022లో భాగంగా మంగ‌ళ‌వారం విజ్జి స్టేడియం వేదిక‌గా జోన‌ల్ క్రికెట్ పోటీల‌ను ఎమ్మెల్సీ సురేష్ బాబు, డిప్యూటీ మేయ‌ర్ శ్రావ‌ణిలో క‌లిసి జేసీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ క్రీడ‌ల్లో అంద‌రూ రాణించాల‌ని, పోటీ తత్వం అల‌వ‌ర్చుకోవాల‌ని సూచించారు. ఉత్త‌రాంధ్ర‌లోని ఆరు జిల్లాల ప‌రిధిలో జ‌రిగే ఈ పోటీల‌ను విజ‌యవంతం చేసేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క్రీడా వ‌స‌తుల క‌ల్ప‌నలో స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని ఈ సంద‌ర్భంగా జేసీ పేర్కొన్నారు. ఈ క్రమంలో జేసీ క్రికెట్ ఆడి అంద‌రినీ అల‌రించారు. రెండు రోజుల పాటు జ‌రిగే క్రీడా పోటీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పాడేరు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు.

కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, డిప్యూటీ మేయ‌ర్ రేవ‌తి, జిల్లా క‌బ‌డ్డీ అసోషియేష‌న్ ప్రెసిడెంట్ కౌశిక్‌, డీఎస్‌డీవో అప్ప‌ల‌నాయుడు, వివిధ క్రీడా సంఘాల ప్ర‌తినిధులు, స‌భ్యులు, అధిక సంఖ్య‌లో క్రీడాకారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-06 11:21:00

జిల్లా క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో నవంబర్ 11,12,13 తేదీల్లో నిర్వహించిన క్రీడల్లో రెండు బంగారు, మూడు సిల్వర్ , ఒక బ్రాంజ్ మెడల్ సంపాదించుకున్న గోపి, బాపిరాజు లను కలెక్టర్ డా కె. మాధవీలత, జేసీ శ్రీధర్ లు ప్రత్యేకంగా అభినందించారు.  గెలిచిన మెడల్స్ కలెక్టర్ కు అందచేశారు. ఈ సందర్భగా కలెక్టర్ మాధవీలత ఉద్యోగులు పని వత్తిడి ని అధిగమించేందుకు వారికి ఆసక్తి ఉన్న  క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలన్నరు.  గెలుపు ఓటములకు సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలోని ప్రతిభను చాటుకోవడం ముఖ్యం అన్నారు. జిల్లా తరపున పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా గెలుపు పొందిన వారిని తీసుకోవాలని అన్నారు.

వ్యక్తిగత విభాగాల్లో లాంగ్ జంప్ లో  గోల్డ్ . 200 మీటర్ల పరుగులో గోల్డ్ , 100 మీటర్ల పరుగులో కాంస్యం . 400 మీటర్ల పరుగులో  సిల్వర్ సాధించిన ఎన్. గోపీచంద్ (జేసీ సి సి) ను కలెక్టర్, జేసీ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా  గ్రూప్ విభాగాల్లో  రన్నింగ్ 4*100 రిలే లో సాధించిన  డిప్యూటీ తహశీల్దార్ జీ. బాపిరాజు లతో పాటు ఎన్. గోపీచంద్, చిన్నా, స్వామి రజత పతకం సాధించారు. టెన్నికాయిట్ డబుల్స్  విభాగంలో డిప్యూటీ తహశీల్దార్ జీ. బాపిరాజు, జేసీ సిసి ఎన్. గోపీచంద్ లు రజత పతకం సాధించడం జరిగింది.  ఈ సందర్భంగా పలువురు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది గోపి, ఇతర క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

Rajamahendravaram

2022-11-16 12:14:30

17నుంచి జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపికలు

జాతీయ 42వ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకు పార్వతీపురంలో జరుగుతుందని జిల్లా క్రీడల చీఫ్ కోచ్  ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణపై జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో క్రీడల చీఫ్ కోచ్ మాట్లాడారు. జిల్లాలో మొదటి సారిగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలురు, బాలికలు, ఇండియన్ రౌండ్, రికర్వ్ , కాంపౌండ్ పోటీలకు ఎంపికను పార్వతీపురంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.

 అక్టోబర్ 17 నుండి 19 వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా అర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా అర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ సంయుక్తంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని అన్నారు. ఇందులో ఎంపిక అయిన వారు నవంబర్ 3 నుండి 12 వరకు గోవాలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఎఎఐ నిబంధనల మేరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల నుండి ప్రతి ఈవెంట్ లో 6గురు బాలురు, 6గురు బాలికలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 

17న ఇండియన్ రౌండ్, 18న రికర్వ్,19న కాంపౌండ్ పోటీలకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ఎంపిక పోటీలను 17వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన సభ్యులు అలజంగి జోగారావు ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం కార్యదర్శి చెరుకురు సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు డి.టి.గాంధీ, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.రామకృష్ణ, ఎం. మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

2022-10-15 11:11:36

ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు ఎంపిక పోటీలు

పార్వతీపురం మన్యం జిల్లాలో 42వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా క్రీడల చీఫ్ కోచ్  ఎస్.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలురు, బాలికలు, ఇండియన్ రౌండ్, రికర్వ్ , కాంపౌండ్ పోటీలకు ఎంపికను పార్వతీపురంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. అక్టోబర్ 17 నుండి 19 వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా అర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  విజయనగరం జిల్లా అర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ సంయుక్తంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని అన్నారు. ఇందులో ఎంపిక అయిన వారు నవంబర్ 3 నుండి 12 వరకు గోవాలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఎఎఐ నిబంధనల మేరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. 

పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు వెంటనే ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, అర్చరీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తో జిల్లా క్రీడల అథారిటీలో నమోదు చేసుకోవాలని అన్నారు. అర్చరీ  ఛాంపియన్ షిప్ లో పాల్గొనే క్రీడాకారులు రూ.1500 ఎంట్రీ ఫీజు చెల్లించాలని తెలిపారు. క్రీడాకారులు జనవరి 2002 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు.  అర్చరీ లో పాల్గొనే అభ్యర్థులు తప్పని సరిగా జిల్లా అర్చరీ అసోసియేషన్ లో నమోదు చేసుకొని ఉండాలని ఆయన వివరించారు. నమోదు పొందని క్రీడాకారులు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాల నుండి ప్రతి ఈవెంట్ లో 6గురు బాలురు, 6గురు బాలికలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 17న ఇండియన్ రౌండ్, 18 న రికర్వ్,19న కాంపౌండ్ పోటీలకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిక జరుగుతుందని ఆ ప్రకటనలో  వివరించారు.

2022-10-13 15:10:55

జోనల్ సాప్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం

జోన్ లో గల జిల్లాలకు చెందిన  క్రీడా కారులు అక్టోబర్ 22, 23 తేదీల్లో జోనల్ స్థాయి శాప్ టెన్నిస్ లీగ్ టోర్నమెంట్ లో జిల్లా తరపున పాల్గొనుటకు ఆసక్తి కలిగిన బాలికలు & బాలుర మరియు పురుషుల & మహిళల విభాగములలో దరఖాస్తుల ను స్వికరిస్తున్నట్లు  జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం..శేషగిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ పోటీల్లో  తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా & కాకినాడ జిల్లా లకు సంబందించిన జోన్ లో గల క్రీడా కారులు అక్టోబర్ 22 (శనివారం) అక్టోబర్ 23 (ఆదివారం) తేదీలలో మున్సిపల్ టెన్నిస్ కోర్ట్స్, మోరంపూడి జంక్షన్, రాజమహేంద్రవరం నందు  అండర్ -8, 10, 12, 14, 16, 18, బాలికలు & బాలుర మరియు పురుషుల & మహిళల విభాగములలో జరుగు జోనల్ స్థాయి శాప్ టెన్నిస్ లీగ్ టోర్నమెంట్ లో జిల్లా తరపున పాల్గొనుట నిమిత్తము ఆశక్తి గల క్రీడా కారులు రూ.400/-లు (రూ.100/-లు శాప్ పే & ప్లే ఖాతాకు క్యూ ఆర్ స్కాన్ ద్వారా & రూ.300/-లు నగదు రూపములో క్రీడా ప్రాంగణం  వద్ద చెల్లించాల్సి వుంటుందన్నారు.

ఈ పోటీల్లో పాల్గొన తలచిన క్రీడాకారులు ఎంట్రీ ఫీజు ది.16.10.2022 లోపు చెల్లించాలన్నారు. సంబందించిన క్రీడా ప్రాంగణం వద్ద రూ.100/- క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అక్టోబర్ 16 లోగా చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు.   వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ ఆదేశాల ప్రకారం ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. జోనల్ స్థాయి లో పాల్గొని ఎంపిక కాబడిన వారు తదుపరి రాష్ట్ర స్థాయి శాప్ టెన్నిస్ (8వ ఓపెన్) లీగ్ టోర్నమెంటు  అక్టోబర్ 29 , 30  తేదీలలో విజయవాడ , ఇందిర గాంధీ మున్సిపాల్ స్టేడియం నందు జరుగు పోటీలకు హాజరు కావాలన్నారు.

 ఆ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు  రూ.500/-లు (రూ.150/-లు శాప్ పే & ప్లే ఖాతాకు క్యూ ఆర్ స్కాన్ ద్వారా & రూ.350/-లు నగదు రూపములో) ఎంట్రీ ఫీజు .24.10.2022 లోపు చెల్లించ వలసి ఉండునని పేర్కొన్నారు. మరిన్ని ఇతర వివరములకు  ఎస్.దుర్గా కుమార్, కన్వీనర్, శాప్ టెన్నిస్ లీగ్ టోర్నమెంట్స్  9177997766 ను లేదా  గజేంద్ర : 9966420514  లో ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు.

2022-10-12 13:12:22

రాష్ట్రక్రీడా పాఠశాలకు మన్యం విద్యార్ధులు

పార్వతీపురం మన్యం జిల్లా నుండి కడపలో గల డా. వై. ఎస్. ఆర్. రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపికైన నలుగురు   విద్యార్దినులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  అబినందించారు.  క్రీడలలో  మంచి ప్రతిభ కనపరచి పతకాలు సాదించాలని,  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొనేలా కష్టపడాలన్నారు.  పతకాలు సాదించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవాలన్నారు.  జిల్లా నుండి తోమ్మిది మంది క్రీడాకారులు గుంటూరులో జరిగిన ఎంపిక కార్యక్రమానికి వెళ్ళగా  నలుగురు ఎంపికయ్యారని  జిల్లా చీఫ్ కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు.  పాలకొండకు చెందిన చింత కావ్యశ్రీ, పాండ్రంగి అక్షయ , మక్కువ మండలం బంగారువలస గ్రామానికి చెందిన షేక్ రషిత, మత్స జాస్మిని ఎంపికైనట్లు తెలిపారు.

Parvathipuram

2022-09-22 08:04:30

శ్రీకాకుళం ఖ్యాతిని ఇనుమడింపజేయాలి

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర క్రీడా వేదికలపై జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే విధంగా క్రీడాకారులు ముందుకుసాగాలని మాజీ ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు మరియు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సెట్ శ్రీ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీ కార్యక్రమం స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కోడి రామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ధ్యాన్ చంద్ చిత్రపటానికి పులమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ హాకీలో దేశానికి వరుసగా మూడుసార్లు బంగారు పతకాలు సాధించిన ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

ఇటువంటి లెజెండరీలను స్మరించుకుంటూ నేటి తరానికి గుర్తుచేయడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అయినప్పటికీ  క్రీడాకారులకు కొదవలేదని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ జిల్లాలోనే ఉన్నారని, ఇండియన్ హెర్క్యూలెస్ గా పేరుగాంచిన కోడి రామమూర్తిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్ధికస్తోమత లేని కారణంగా మరెందరో క్రీడాకారుల నైపుణ్యాలు వెలుగులోకి రావడం లేదన్నారు. అటువంటి వారికోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామంది క్రీడ ప్రోత్సహాకులు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారని, వారందరిని ఈ సందర్భంగా అభినందించారు. తాను కూడా క్రీడాకారుడునని, క్రీడాకారుల కష్టాలు తనకు తెలుసునని, క్రీడాకారుల సహాయార్ధం తన వంతుగా 50వేల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తూ నగదును వేదికపై అందించారు. క్రీడాకారులకు సరైన శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని తెలిపారు. 

పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే,  ఔత్సాహిక క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని ఫలితంగా గేమ్స్,స్పోర్ట్స్ లలో అంతర్జాతీయ క్రీడా వేదికలపై మన వాళ్లు గొప్పగా రాణించగలుగుతున్నారని అన్నారు. క్రీడాకారులకు గోల్స్, టార్గెట్స్ ఉండాలని అపుడే వాళ్ళు అనుకున్నది సాదించగలుగుతారని చెప్పారు. అన్నిరంగాల్లో కాకుండా ప్రావీణ్యం గల రంగాన్ని ఎంచుకొని ముందుకువెళ్లడం ద్వారా తప్పక విజయం సాదించవచ్చని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, క్రీడలతో శారీరక దారుడ్యం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. క్రీడాకారులకు, పాదచారులకు నిలయమైన కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరుచేసిందని, త్వరలోనే ఆ పనులు పూర్తిచేసి క్రీడాకారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ నేషనల్ జ్యూడో ఛాంపియన్ షిప్ నందు బంగారు పతకం సాధించిన కడపల సౌమ్య రాణి, హ్యాండ్ బాల్ బంగారు పతక విజేత తామడ దినేష్, బాక్సింగ్ నందు తామ్ర పతక విజేతలైన గంధం ఢిల్లీశ్వర్, పెద్ద అప్పలరాజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కబాడ్డి, బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీ విజేతలకు దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హారిక ప్రసాద్, వాకర్స్ క్లబ్ గవర్నర్ గుప్తా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.మాధురీలత, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.వి.ప్రసాదరావు, నెహ్రు యువ కేంద్ర జిల్లా సమన్వయకర్త కె.వి.ఉజ్వల్, జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు, జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు డి.వి.రమణ, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబమూర్తి, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-08-29 07:28:34

ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు

శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని శాసనసభ్యులు అలజంగి జోగారావు తెలిపారు. ప్రముఖ హాకీ క్రీడాకారులు, మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని  సోమవారం  ఆర్.సి.ఎం. స్కూలులో నిర్వహించిన   జాతీయ క్రీడాదినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా  ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుండి ఆర్.సి.ఎం . స్కూలు వరకు జరిగిన ర్యాలీకి  జాయింటు కలెక్టరు  ఒ. ఆనంద్ జెండా ఊపి పారంభించారు.  క్రీడా దినోత్సవ కార్యక్రమం ధ్యాన్ చంద్ చిత్రపటానికి శాసనసభ్యులు అలజంగి జోగారావు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ  కార్యక్రమంలో శాసనసభ్యులు అలజంగి జోగారావు  మాట్లాడుతూ నిరంతర సాధనతోనే లక్ష్యాలను చేరుకోచ్చని, అబివృద్ది సాధనతోనే సాధ్యమని తెలిపారు.

  విద్యార్థులకు చదువుతో పాటు, ఆటలు కూడా ముఖ్యమని తెలిపారు. జిల్లాలో మారుమూల ప్రాంతానికి  చెందిన అర్జున అవార్డు గ్రహీత  బాక్సింగు క్రీడాకారులు సీరా జయరాం, పారా ఒలింపియన్ రాముద్రి సోమేష్, జాతీయ స్వర్ణపతక విజేత బాడీ బిల్డర్ పడాల సంతోష్  ఎంతో కృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి  స్పూర్తిగా నిలిచారని, వారి విజయాలు విద్యార్థులలో క్రీడా స్పూర్తిని నింపాలన్నారు.  వారిని ఆదర్శంగా  తీసుకొని విద్యార్థులు క్రీడలలో రాణించి  జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో  పేరు తీసుకురావాలన్నారు. ఆశయ సాధనకు ఎంతకష్టమైనా ఎదుర్కోవాలనే శ్రీ శ్రీ గారి మాటలకు స్పూర్తిగా తీసుకొని విజయాలు సాధించాలని తెలిపారు. 

ఈ  సంధర్బంగా అర్జు అవార్డు గ్రహీత బాక్సింగు క్రీడాకారుడు సీరా జయరాం, బాడీబిల్డింగులో జాతీయ స్వర్ణపతక విజేత పడాల సంతోష్, పారా ఒలింపియన్ రాముద్రి సోమేష్,  కబాడీ జాతీయ క్రీడాకారులు కోట సంతోష్, కలయల రమేష్ లను సన్మానించారు.  అదేవిధంగా  కీడలలో రాణిస్తున్న పాఠశాలలు జిల్లాపరిషత్ బాలికల హైస్కూలు జి.ఎల్.పురం, వీరఘట్టం, నర్సిపురం, ఐ.టి.డి.ఎ. జి.జె.డబ్యు.ఎ.హైస్కూలు సీతంపేట, కొట్టగుడ పాఠశాలలకు పురస్కారాలందించారు.   క్రీడాభివృద్దికి విశేషకృషి చేస్తున్న  ఫిజికల్ డైరెక్టర్లు  మూపాల శ్రీను, ఎవాల గణేష్, ఎం .చిన్నారావు,  కోదండమణి, వి.పుప్షానందం, ఎస్. ఉమామహేశ్వరరావు, పి.సూరుపునాయుడు, పి. చంద్రమోహన్, ఎస్. దాలయ్య,            ఎం .వెంకటేశ్వరావులను సన్మానించారు.   

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, , గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఓ.ప్రభాకర రావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం    ప్రెసిడెంటు రామకృష్ణ, సెక్రటరీ ఎం.మురళీకృష్ణ, గాంధీ, కె.తిరుపతిరావు, ప్రభుత్వ హైస్కూలు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు  హాజరయ్యారు.

Parvathipuram

2022-08-29 07:23:02

పారా అథ్లెట్ల గుర్తింపునకు ప్రత్యేక క్రుషి..

విభిన్న ప్ర‌తిభావంతులైన క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. శ‌నివారం కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానంలో ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌, జాతీయ క్రీడా దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఆశ్ర‌య జిల్లా విక‌లాంగుల స‌మాఖ్య‌, ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏపీ స్టేట్ పారా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల‌ను క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారులు, షాట్‌పుట్‌, లాంగ్ జంప్‌, హై జంప్ వంటి ప‌ది క్రీడాంశాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ విభిన్న ప్ర‌తిభావంతులైన క్రీడాకారులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు, ప్రోత్స‌హించేందుకు జిల్లా అధికార యంత్రాంగం త‌ర‌ఫున అన్ని విధాల స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక‌పై జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) మైదానంలో పారా అథ్లెట్ల‌కు ఉచితంగా స‌భ్య‌త్వం, ప్రాక్టీస్‌కు వీలుక‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విభిన్న ప్ర‌తిభావంతుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఇంత మంచి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంద‌ని.. పోటీల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించిన రోట‌రీ క్ల‌బ్‌, ల‌య‌న్స్ క్ల‌బ్‌, ఓఎన్‌జీసీ, కేఎస్‌పీఎల్ త‌దిత‌ర సంస్థ‌లకు ధన్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

 ఇప్ప‌టికే జిల్లా నుంచి కొంద‌రు పారా అథ్లెట్లు జాతీయ‌స్థాయి పోటీల్లో పాల్గొని, బంగారు ప‌త‌కాలు సైతం సాధించార‌ని.. మ‌రింత మందిని గుర్తించి, వారు జాతీయ‌, అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా తొలుత నిర్వ‌హించిన షాట్ పుట్ పోటీల్లో విజేత‌ల‌కు క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ప‌త‌కాలు అంద‌జేశారు. ఈ పోటీల్లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన వారు జాతీయ స్థాయి పోటీల‌కు వెళ్ల‌నున్నారు. విజేత‌లు కార్య‌క్ర‌మంలో సెట్రాజ్ సీఈవో డీఎస్ సునీత‌, ఆశ్ర‌య జిల్లా వికలాంగుల స‌మాఖ్య అధ్య‌క్షులు పి.సురేశ్ కుమార్‌, ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ జి.కోటేశ్వ‌ర‌రావు, సెక్ర‌ట‌రీ రామ‌స్వామి; జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాలు, వ‌యో వృద్ధుల సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు వాడ్రేవు కామ‌రాజు, డీఎస్ఏ చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్ కుమార్‌, రోట‌రీ క్ల‌బ్‌, ల‌య‌న్స్ క్ల‌బ్‌, ఓఎన్‌జీసీ, కేఎస్‌పీఎల్ త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-27 07:33:06

స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు

కడపలో గల వై.ఎస్.ఆర్ స్పోర్ట్స్ స్కూల్ లో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం పార్వతీపురం మండలం నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరావు నేతృత్వంలో ఎంపికలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) అదేశాలు,  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అనుమతులు మేరకు 2022-23 సంవత్సరానికి  స్పోర్ట్స్ స్కూల్ లో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందని వేంకటేశ్వర రావు వివరించారు. నర్సిపురంలో 40 మంది బాలలు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయిలో కడపలో పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారికి స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు వెంకట రమణ, కార్యదర్శి ఎం.మురళీ, కార్యక్రమ సమన్యయకర్త వాసుదేవరావు నాయుడు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.మురళీ, గాంధీ, కె.తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు.                             

Vizianagaram

2022-07-19 08:23:09

ఒలింపియాడ్ ర్యాలీ విజయవంతం కావాలి

విశాఖలో ఈ నెల 17న నిర్వహించబోవు చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు  కె.ఎస్.విశ్వనాధన్  అన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఒలింపియాడ్ టార్చ్ ఇండియా లోని ఎంపిక చేసిన 75 నగరాలలో, 36 రాష్ట్రాలను కవర్ చేసి చివరగా చెన్నైకి చేరుకుంటుందని తెలిపారు.   అందులో భాగంగా 17 వ తేదీన సాయంత్రం 5.15 గంటలకు విశాఖపట్నం పోర్ట్ స్టేడియం వేదికగా జిల్లాలో ఒలింపియాడ్ టార్చ్ రిలేని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎఫ్ ఐ డి ఈ  ఆధ్వర్యంలో బెనియా 44 వ చెస్ టోర్నమెంట్ కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుందని, చెన్నై వేదికగా జూన్ 20 నుంచి జులై 27 వరకు టోర్నమెంట్  జరుగుతాయన్నారు. 
విశాఖలోని పోర్టు స్టేడియం నుంచి స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వరకు జరగనున్న ర్యాలీలో 10 కార్స్  30 ద్విచక్ర వాహనాలు జాతీయ జెండాలతో స్థానిక విద్యా సంస్థల పీఈటీలు తమ విద్యార్థులతో సహా పాల్గొని స్వాగతం పలకాలని సంబంధిత అధికారులను  జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ర్యాలీ నిర్వహించే సమయంలో  ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.  అదే విదంగా  శానిటేషన్, మంచినీరు తదితర అంశాలపై  జి.వి.ఎం .సి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో  డి.ఎం .అండ్.హెచ్.ఓ శ్రీమతి కె.విజయలక్మీ, సెట్విస్ సి.ఇ.ఓ., పి.నాగేశ్వరరావు, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎన్.సూర్యారావు,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-07-13 11:49:01