1 ENS Live Breaking News

సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతికి బంపరాఫర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోనే అందుబాటులోకి వచ్చిన ఫేషియల్ బయోమెట్రిక్ హాజరు గ్రామసచివాలయాలకు వర్తింపచేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెప్పారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్సు నడుస్తుండగా సంక్రాంతి దాటిన తరువాత నెలాఖరులోపుగా దానిని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాలు చెప్పి బయటకి వెళ్లిపోయే జంపింగ్ లకు కళ్లెం పడనుంది. అంతేకాకుండా ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Tadepalli

2023-01-05 03:26:17

గ్రామ సచివాలయాలను మరింత ఆధునీకరించాలి

గ్రామ, వార్డు సచివాలయాలను మరింతగా ఆధునీకరించి ప్రజలకు సేవలు అందించడంతో అగ్రగామిగా నిలవా లని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సచివాలయ వ్యవ స్థపై సమీక్ష నిర్వహించిన ఆయన సిబ్బంది విధులపై ఆయాప్రభుత్వశాఖలు ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీ జర్) ఏర్పాటుచేయాలన్నారు. అన్ని సచివాలయాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నారు. సచివాల యాల్లోని ప్రభుత్వ శాఖాధిపతులు నెలలో రెండుసార్లు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నారు.

Tadepalli

2023-01-05 03:12:55

శ్రీవారి దర్శనానికి 190 గ్రామాల గిరిజన భక్తులు..

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనేది ప్రతి హిందువు కోరిక. మన రాష్ట్రంలోనే ఉన్నా వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితి వారిది. అలాంటి వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 గ్రామాల నుండి సుమారు 9300 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్‌ కార్యదర్శి త్రినాథ్‌ తెలిపారు.

Tirumala

2023-01-04 15:11:18

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ సరికొత్త రికార్డు

తెలంగాణ నల్ల బంగారం ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్ సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ నెలలో అత్యధిక నెలవారీ ఉత్పత్తిని సాధించినట్లు సంస్థ ప్రకటించింది. గత నెల 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని అది 2021 డిసెంబర్ కంటే 19 శాతం ఎక్కువని వెల్లడించింది. అంతే కాకుండా గత నెలలో రోజుకు 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్లు ప్రకటించింది. ఇదే ఉత్సాహాన్ని మరో 3నెలల పాటు కొనసాగించి ఉత్పత్తి, రవాణా పెంచాలని సంస్థ సీఎండీ శ్రీధర్ కార్మికులకు పిలుపునిచ్చారు.

Singareni

2023-01-04 05:41:33

ఉదయం 6 గంటల నుంచే వైకుంఠద్వార సర్వదర్శనం

సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం ప్రారంభమైన అనంతరం శ్రీవారి ఆలయం ముందు, ఆ తరువాత అన్నమయ్య భవన్లో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో  వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే శ్రీవాణి టికెట్లు కూడా ఆఫ్ లైన్లో రద్దు చేసినట్లు ఆయన వివరించారు. 

Tirumala

2023-01-02 13:34:02

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. నాంపల్లి నుమాయిష్ కు వచ్చే సందర్శకుల కోసం మెట్రో సేవలను మరో గంటపాటు పొడిగించింది. దీనితో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల నుండి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయల్దేరనుంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం రూట్లలో మాత్రమే మెట్రో వేళలను పొడిగించారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో ప్రయాణించాలకునేవారికి మెట్రో చాలా ఉపయుక్తం కానున్నది.

Hyderabad

2023-01-02 04:46:33

గుంటూరు మృతులకు రూ.30 లక్షల పరిహారం

గూంటూరు టిడిపి సభ, తొక్కిసలాటలో మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చంద్రబాబుపై ఫైర్ అవుతున్న సమయంలో ఊహించని నష్టపరిహారం ప్రకటనలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షలు ఇస్తామని ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. ఇటు టిడిపి తరపున ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించగా, టిడిపీనేత కె.రవీంధ్ర రూ.2లక్షలు, డేగల ప్రభాకర్ రూ.లక్షచొప్పున ప్రకటించారు. కాగా రాష్ట్రప్రభుత్వం రూ.2 లక్షలు ప్రకటించింది. ఈ ఘటన సగటు పాఠకుడిగా మీ అనాలసిస్ కామెండ్ చేయండి.

Guntur

2023-01-01 17:23:28

ఆ మృతుల బాధ్యత చంద్రబాబుదే..విడదల రజనీ

చంద్రబాబుకి అర్జెంటుగా అధికారం తెచ్చేసుకోవాలనే యావతో పెట్టే సభలు, సమావేశాలు ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మండి పడ్డారు. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయిన ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి విడదల రజిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జరిగిన రెండు సభలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నా చంద్రబాబుకి ఏమీ పట్టడం లేదన్నారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్‌ ప్రచారం చేశారని, వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ దారుణం జరిగిందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Tadepalli

2023-01-01 16:50:01

గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమం తప్పకుండా సమయానికి ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్ మూడు సార్లు వేయాల్సి వుంటుం ది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లో స్పంద న గ్రీవియన్స్ ప్రతీరోజూ మధ్యాహ్నాం 3 నుంచి 5గంటల వరకూ చేపట్టాలి. అలా చేపట్టకపోయి నా, అన్నిశాఖ సిబ్బందితోపాటు కార్యదర్శిలు సచివాలయాల్లో అందుబాటులో  లేకపోయినా చర్యలు తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఒక పూట కట్ చేస్తారు. 3 ఆలస్యా లకు ఒకరోజు జీతం కట్ చేస్తారు.

Tadepalli

2023-01-01 14:48:03

APPSC గ్రూప్-1 దరఖాస్తుల ద్వారా రూ.4.67 కోట్లు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ లో ప్రకటించిన 92 పోస్టులకు ఏకంగా ఒక లక్షా 26వేల 449 మంది దరఖాస్తు చేస్తున్నారు. అంటే కేవలం దరఖాస్తుల ద్వారానే 4 కోట్ల 67 లక్షల 86వేల 130 రూపాయాల ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజు రూ.250 కాగా ప్రాసెసింగ్ ఫీజ్ రూ.120 అభ్యర్ధిలు  చెల్లించారు. దీనితో ఏపీపీఎస్సీకి భారీగానే ఆదాయం సమకూరింది. కాగా సర్వీస్ కమిషన్ ఈనెల 8వ తేదీన గ్రూప్ -1 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎంత మంది పోటీపడుతున్నారనే విషయం ఆరోజు సాయంత్రానికి గాని తెలీదు.

Tadepalli

2023-01-01 06:49:05

తూచ్.. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో మళ్లీ ఇంటర్వ్యూలు

ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే గ్రూప్-1, 2 పోటీపరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి మడమ తప్పింది. ప్రస్తుతం తీయబోయే గ్రూప్-1 పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన తరువాత ఇంటర్వ్యూలు పెట్టి పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తీస్తున్న 92 గ్రూప్-1 పోస్టులకు గతంలో భర్తీకాని 18 గ్రూప్-1 పోస్టులు కలిపే అవకాశం కూడా ఉందన్నారు. దానికి పాలనా పరమైన అనుమతులు రావాల్సి వుంటుందన్నారు. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తయితే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్-1, 2, పోస్టులకు ఇంటర్వ్యూలు తీసేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ ఇంటర్వ్యూలు పెట్టడం విశేషం.

Tadepalli

2023-01-01 04:20:57

రత్నగిరిపై అందుబాటులోకి హరిహర సదన్ సత్రం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సత్యగిరి కొండపైనఉన్న హరిహర సదన్ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచే భక్తుల సౌకర్యార్ధం గదులు భక్తులకు కేటాయించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్టు దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు సత్రము వద్దనే రూమ్స్ భక్తులకు కేటాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భక్తుల ఈవిషయాన్ని గమనించి హరిహర సదన్ సత్రము గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

annavaram

2022-12-31 12:04:41

ప్రెస్ అక్రిడిటేషన్లకు 3నెలలు కాలపరిమితి పొడిగింపు

ఏపీ సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసిన ప్రెస్ అక్రిడిటేషన్ల గడువు ఈఏడాది 31తో యుగియడంతో మరో మూడు నెలలు అంటే 31‌-03-2023 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మీడియా సంస్థలు, దినపత్రికల యాజమాన్యాలు సదరు అక్రిడిటేషన్ జర్నలిస్టుల జాబితాను తెలియజేస్తూ ఉమ్మడి 13 జిల్లాల డీపీఆర్వో కార్యాలయాలకు స్వయంగా లేఖలు పంపాల్సి వుంటుంది. ఈనేపథ్యంలో విధుల నుంచి తప్పుకున్నవారు, మానేసిన వారి జాబితాలను కూడా తెలియజేయాల్సి వుంటుంది తప్పితే.. కొత్తగా పేర్లు నమోదు చేయడానికి అవకాశం లేదు. లేఖలు ఈనెల 31నాటికి అన్నిజిల్లా డీపీఆర్వో కార్యాలయాలకు అందజేయాల్సి వుంటుంది. (BEST COACHING FOR SI & CONSTABLE : KEERTI COMPETITIVE INSTITUTE : KAKINADA ‌-9032228708)

Tadepalli

2022-12-28 07:42:35

సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వింతలే జరుగుతుంటాయి.. ఏపీలో13 జిల్లాలను విభజించి 26 జిల్లా లను చేస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ పబ్లికేషన్ చేసినా నేటికీ కేంద్రంలోనూ, రాష్ట్రపతి వద్ద ఇంకా కొత్త జిల్లాల ఆమోద ముద్రపడలేదు. ఇది చాలదన్నట్టు కొత్త జిల్లాల ఏర్పాటైనా కొత్తజిల్లాల్లో పరిపాలన పూర్తిస్థాయిలో జరగలేదు. కనీసం మీడియా ద్వారానైనా గుర్తింపు వచ్చి చస్తుందా అంటే అదీ లేకుండా పోయింది. ఇపుడు కొత్తగా జర్నలిస్టు సంఘాల నేతలందరూ తమకు ప్రభుత్వం ఇచ్చే ఆ కొన్ని ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి జిల్లాల నుంచే ఇవ్వాలని కోరుతున్నారట. మరీ వెటకారం కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటై..అన్నిజిల్లాలకు ప్రభుత్వం కలెక్టర్లను కూడా నియమిచింది. కొత్త జిల్లాల్లో కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు కలెక్టర్లు మాత్రమే జారీచేయాలి. కారణం అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టరే కనుక. అలా కాకుండా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల గొంతమ్మకోర్కెలు విని ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తే..కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ఎలాంటి అధికారాలు, చైర్మన్ హోదాలు లేనట్టుగానే గుర్తించాల్సి వుంటుంది. అదే జరిగితే కేవలం సమాచారశాఖ ద్వారానే కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల స్థాయి తగ్గించిన శాఖగా గుర్తింపు కూడా పొందుతుంది.

కొత్త జిల్లాలకు మీడియా ద్వారానే అసలైన గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన 13 కొత్తజిల్లాలు, పరిపాలన ప్రజలకు తెలియాలన్నా, పరిపాలన గాడిలోపడి కేంద్రప్రభుత్వ గుర్తింపు రావాలన్నా మీడియా ద్వారానే జరగాల్సి వుంటుంది. కానీ ఇపుడు అదే మీడియా ద్వారా కొత్తజిల్లాలకు, అక్కడి కొత్త కలెక్టర్లకు గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. కొత్త జిల్లాలు ఏర్పాటై ఇంతకాలం అవుతున్నా నేటికీ కొత్తజిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర 75 ప్రభుత్వశాఖల అధికారులకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. సగం సమాచారశాఖ గుర్తింపు రానీయకుండా చేస్తే..మరో సగం మిగిలివున్న మీడియా బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నది. అసలు సమాచారశాఖలోనే ఉమ్మడి జిల్లాల సమాచారశాఖ అధికారులు అటు రాష్ట్ర కమిషనర్ ను, సమాచారశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు మీడియా ద్వారా దేశవ్యాప్తం కావాలి. కానీ కొత్త జిల్లాల పేర్లు పలకడానికి సమాచారశాఖ ద్వారా విస్త్రుత మీడియా ప్రచారం చేయడానికి సమాచారశాఖలోని అధికారులు ముందుకి రావడం లేదు.

పాతజిల్లాల నుంచే అక్రిడిటేషన్లు కావాలంటే కొత్తజిల్లాలెందుకు
ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రెస్ అక్రిడిటేషన్ల జారీ భారీ మొత్తంలో పడిపోయింది. వచ్చే ఆ కొద్దపాటి ప్రెస్ అక్రిడిటేషన్లు పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఇవ్వాలంటూ కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఏపీ సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదారి పట్టిస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికోసం ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి కొత్త పరిపాలనా విధానాలను అమలు చేసిన తరుణంలో కొందరు జర్నలిస్టులు, మరికొందరు జర్నలిస్టు సంఘాల నేతలు ప్రెస్ అక్రిడిటేషన్ విషయంలో సమాచారశాఖను తప్పుదారి పట్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమాచారశాఖ కారణంగానే కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలు, డీడీలు ప్రభుత్వ సమాచారం ఇవ్వకుండా సోకాల్డ్ మీడియా జర్నలిస్టులతోనే ప్రెస్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అభివృద్ధిని, సమాచారాన్ని ప్రజలకు తెలియనీయకుండా సాయశక్తులా కృషిచేస్తున్నారు. ఇపుడు మళ్లీ ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో కూడాకొత్తజిల్లాల్లో కాకుండా.. ఉమ్మడి జిల్లాల్లో ఇస్తే రాష్ట్రంలో కొత్తజిల్లాల కలెక్టర్లు అధికారం లేనట్టుగా తేటతెల్లం అయిపోతుంది. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కొత్త అక్రిడిటేషన్ల విషయంలో నూతన జిల్లాల నుంచి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా కొత్తజిల్లాలకు గుర్తింపు రావడంతోపాటు, మీడియా ద్వారా కొత్త జిల్లాకలెక్టర్లు కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. లేదంటే కేంద్రం, రాష్ట్రపతి దృష్టిలో మాదిరిగానే ఇంకా ఏపీలో 13 జిల్లాలనే భావనతోనే అధికారికంగా ఉండాల్సి వస్తుంది..!

Tadepalli

2022-12-27 10:51:39

పెద్ద కబుర్లాడే అధికారుల పాలిట పాసుపతాస్త్రం..!

పేరుకే వారంతా సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 అధికారులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పెద్దగా పట్టించుకోరు..పైగా ప్రభుత్వం యొక్క బాధ్యతను వారే తమ బుజాలపై తెగ మోసేస్తున్నట్టు ఇచ్చే ఫీలింగ్, కలరింగ్, బిల్డప్ మామూలుగా ఉండదు. కిందిస్థాయి ఉద్యోగులు చేసే పనిని, పడిన కష్టాన్ని వీరి ఖాతాలోకి మళ్లించుకొని ప్రభుత్వం దగ్గర చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఆఫీసుకి గంట ఆలస్యంగా వచ్చి రెండు గంటలు ముందు ఇంటికి వెళ్లిపోయే అధికారులను గాడిలో పెట్టడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ బయో మెట్రి అటెండెన్స్ ఉత్తర్వులపై(ఏస్థాయి అధికారైనా బయోమెట్రిక్ వేయాల్సిందే) క్రిందిస్థాయి సిబ్బంది, నిబద్దతలో పనిచే అధికారుల నుంచి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఖచ్చితంగా బయో మెట్రిక్ వేయాల్సిందేననే నిబంధనను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి బయట ప్రైవేటు పనులు చేసుకునేవారికి సింహ స్వప్నం లాంటి నిబంధన ఇన్నేళ్ల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై ఉద్యోగి అంటే కార్యాలయంలో ఉండి తీరాలనే నిబంధన అమలు కావడంతోపాటు, ప్రజల సమస్యలు కూడా సత్వరమే పరిష్కారం అవుతాయనే భావన ప్రతీ ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది.

75ఏళ్ళ చరిత్రలో ఒకే ఒక్క..ప్రభుత్వం
75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ బయో మెట్రిక్ వేసి విధులు నిర్వహించేలా చేసిన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ జగన్ ప్రభుత్వం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులంటే నచ్చిన సమాయానికి వస్తాం..చిరాకొస్తే ఇంటికి వెళ్లిపోతామనే దోరణిలోనే ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల వ్యవహారం నడిచింది. కానీ చరిత్రలో మొట్టమొదటి సారిగా..అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ, కార్యాలయ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ బయో మెట్రిక్ అటెండెన్సు(ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్) వేయాలనే నిబంధన తీసుకురావడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ విధానం ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఇబ్బందిగా ఉన్నా సరైన ప్రభుత్వసేవలు సకాలం అందాలంటే ప్రతీ ఉద్యోగీ, అధికారి ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాల్సి అవసరం వుంది. దానికోసం ఏర్పాటు అన్నిశాఖల, అన్ని స్థాయి అధికారులు అటెండెన్సు వేయాలనే నిబంధన ఇపుడు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు పొందుతోంది..

కల్లబొల్లి మాటలకు, డుమ్మావిధులకు ఇక చెల్లుచీటి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ విధానం వలన ప్రతీసారి కల్లబొల్లి మాటలు చెబుతూ విధులకు డుమ్మాకొట్టేవారు, కాకమ్మ కబుర్లు చెప్పి ప్రభుత్వ విధినిర్వహణలో బయటకు వెళ్లిపోయి సొంత పనులు చూసుకునేవారు,నేనొక్కడినే తెగ కష్టపడిపోతున్నాను.. మిగిలిన వారంతా కూర్చొని జీతం తీసేసుకుంటున్నారని తెగఫీలైపోయే ప్రభుత్వ కొలువు వెలగబెడుతున్నమహానుభావులందరూ ఇక చచ్చినట్టు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందే. అంతేకాకుండా ఎంతసేపు ఆలస్యంగా వస్తే అంతసేపు కార్యాలయంలో విధులు నిర్వహించాలి..లేదంటే జీతంలో కోత వంటి చర్యలు కూడా అమలు చేస్తామంటున్న ప్రభుత్వ చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయనే ఆశాభావాన్ని విధినర్వహణే దైవంగా బావించే ఉద్యోగులు, అధికారులు చక్కగా స్వాగతిస్తున్నారు. గతంలో ఆడుతూ, పాడుతూ, విధులకి వచ్చే వారందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇపుడు గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు తయారైంది.

అమలు చేస్తేనే అసలైన ప్రగతి..లేదంటే తిరోగమనమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు బయో మెట్రిక్ వేయాలనే నిబంధన ద్వారా జవాబుదారీ తనాన్ని పెంచనుంది. అదే సమయంలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగినీ సమయానికి కార్యాలయానికి తీసుకొచ్చి పనిచేయించిన ఘనత కూడా ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి దక్కుతుంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ నిబంధనల్లో సడలింపులు చేస్తే ప్రగతి మాట అలా ఉంచితే..ఉన్న కాస్త ప్రగతి కూడా తిరోగమనంలో పయనించే పరిస్థితి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడిలు ఎక్కడ నుంచి వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ ను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చుననే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే ఎలా పనిచేసినా, వెళ్లినా, వెళ్లకపోయినా నెల అయ్యేసరికి జీతాలు వచ్చేస్తాయన్న ధీమా నుంచి నెల పూర్తయినా జీతాలు వస్తాయో రావో అనే పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులకు రుచి చూపించిన ప్రభుత్వం, ఇపుడు అన్నిస్థాయిల అధికారుల చేత పనిచేయించాలని తీసుకున్న ఈ 

నిర్ణయం మాత్రం ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాలంటే వెయ్యిరెట్లు మెరుగ్గా వుందని సాధారణ ప్రజల నుంచి పనిచేసే అధికారులందరూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. చూడాలి పెద్దకబుర్లాడే అధికారులతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ అటెండెన్సు ఏ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచి పనిచేయిస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందనేది..!

Tadepalle

2022-12-27 09:46:33