వైఎస్సార్సీపీ విశాఖ యువజన అధ్యక్షులు, అధికార ప్రతినిధి కొండారాజీవ్ గాంధీ తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయ మేనేజర్ రంగయ్యను స్వయంగా గుంటూరు వెళ్లి పరామర్శించారు. అంతేకాదు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్దిక సహాయం కూడా చేశారు. రంగయ్య ఇటీవల కాలంలో అస్వస్థతకు గురై గుంటూరులోని లలిత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయంతెలుసుకున్న రాజీవ్ వెంటనే గుంటూరు వెళ్లి రంగయ్యను పరామర్శించి వారికుటుంబానికి దైర్యం చెప్పి వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు సమాచారం అందించాలని కూడా భరోసా ఇచ్చారు. దేవుడి దయవల్ల రంగయ్య అనతికాలంలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నవ్వుతు తిరిగి విశాఖ పార్టీ కార్యాలయానికి తిరి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధిత్యనాధ్ దాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకం కలిశారు. ప్రస్తుతం సిఎస్ గా వున్న నీలం సాహ్ని ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అదేరోజు ఆధిత్యనాథ్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జీఓ కూడా జారీచేసింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిని ఆయన కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈయన మంచి అధికారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ప్రభుత్వం ఈయనను సిఎస్ గా నియమించిందని సమాచారం. సీఎస్ గా పలువు ఐఏఎస్ లు పేర్లు కేంద్రానికి పంపినా, ఆధిత్యనాధ్ దాస్ పేరును కేంద్రం ఖరారు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల స్థలాల పంపిణీ పధకం నగర పరిధిలో సజావుగా చేపట్టడానికి మున్సిపాలిటీ / కార్పోరేషన్ స్థాయిలో తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు తో కలసి ఆ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ జివిఎంసి కార్యాలయము నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పట్టణాల పరిధిలో డిశంబర్ – 25 తేది నుండి జనవరి 7వ తేది వరకు చేపట్టాలని అందరు మున్సిపల్ కమిషనర్లను కోరారు. పధకం సజావుగా నిర్వహించడానికి మంత్రివర్యులు పలు సూచనలు చేస్తూ టిడ్కో ద్వారా మంజూరు అయిన గృహాల లబ్ది దారులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన నియమావళి ప్రకారం మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. మున్సిపల్ మరియు కార్పోరేషన్ పరిధిలో న్యాయ పరమైన సమస్యలు ఉన్న చోట ప్రభుత్వం జారీ చేసిన అధీకృత లేఖను అర్హులైన లబ్దిదారులకు అందించాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ నెల 25 తేది న కాకినాడలోను, 28 వ తేదిన శ్రీకాళహస్తిలోను, 30వ తేదిన విజయనగరంలో జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమంనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనుచున్నారని, అక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని మిగతా ప్రాంతాలలో లబ్దిదారులు వీక్షించే విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి తదుపరి అక్కడ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో నిర్వహించాలని కోరారు.
ఇండ్ల స్థలాలకు గుర్తించిన జాబితాలను సంబందిత వార్డు సచివాలయాలవద్ద పారదర్శకతను సూచించే విధంగా ప్రచురించాలని సూచించారు. మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ కమిషనర్లు ఈ పధకం చేపట్టడానికి తీసుకుంటున్న చర్యల గురుంచి అందర్నీ అడిగి తెలుసుకున్నారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ కార్పోరేషన్ పరిధిలో టిడ్కో గృహాలు కేటాయింపు మరియు ఇండ్ల స్థలాల కేటాయింపు లేఖలను లబ్దిదారులకు అందించడానికి కావలిసిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియపర్చారు. సి.డి.ఎం.ఎ. విజయ కుమార్ మాట్లాడుతూ పధకం యొక్క ప్రగతిని ప్రతీ రోజూ కమిషనర్ వారి కార్యాలయమునకు పంపించేందుకు మూడు ప్రోఫార్మాలు పంపుచున్నామని వాటిలో ప్రగతిని నింపి ఎప్పటికప్పుడు తెలియపర్చాలన్నారు.
తదుపరి, మున్సిపల్ శాఖామాత్యులు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న 560 అర్బన్ హెల్త్ సెంటర్లకు కావలసిన మౌళిక సదుపాయాలూ ఏర్పాటునిమిత్తం తగు చర్యలు త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇదివరకే బిల్డింగులు ఉన్న చోట ఫర్నిచరు గాని, అవసరమైన చోట రిపేర్లు చేపట్టాలని, బిల్డింగులు కట్టవలసిన ప్రాంతాలో స్థలాలు సమకూర్చికొని రాష్ట్ర స్థాయిలో ఒకే బిల్డింగు డిజైను ఏర్పాటు చేసి, అన్ని మున్సిపల్ / కార్పోరేషన్లో అదే డిజైన్ తో భవనాలు నిర్మించడానికి తగుచర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎం.ఏ & యు.డి. కార్యదర్శి జె. శ్యామలరావు, సిడి.ఎం.ఎ. విజయ కుమార్, టిడ్కో మనేజింగు డైరెక్టరు శ్రీధర్,, ఇ.ఎన్.సి. చంద్రయ్య, రాష్ట్ర స్థాయిలో అందరు మున్సిపల్ కమిషనర్లు, విశాఖపట్నం నుండి వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ వి. కోటేశ్వరరావు, జివిఎం.సి. కమిషనర్ జి. సృజన, ఏ.డి.సి.లు రమణి, సన్యాసిరావు, డి.సి.ఆర్. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, ఎస్.ఇ.లు వినయ్ కుమార్, వేణుగోపాల రావు, సి.ఎం.ఓ.హెచ్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గా ఆదిత్యనాధ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబరు 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది.
ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ "మా బాబు "చిత్రాన్ని నిర్మాత డి.వి.ఎస్ . రాజు నిర్మించారు. నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ,సావిత్రి జంటగా ఈ చిత్రంలో నటించారు. టి . ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం: టి .చలపతిరావు, రచన : జూనియర్ సముద్రాల, కెమెరా : కమల్ ఘోష్, కళ: కళాధర్ .
ఈ చిత్రం లో నాగేశ్వరరావు, సావిత్రి ,రేలంగి , గుమ్మడి, రమణారెడ్డి ,కుటుంబరావు, కన్నాంబ ,ఎం.ఎన్ .రాజ, ఎం. సరోజా , హనీ ఇరానీ ( వండర్ చైల్డ్) మొదలగు వారు నటించారు .ఈ చిత్రం తే 22-12-60దీ నాడు విడుదల అయ్యింది . యావరేజ్ గా ప్రదర్శింపబడింది .
ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందును అందించి, ఉర్రూతలూగించేందుకు "ఊర్వశి ఓటిటి" సర్వ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెలాఖరు వరకు 'ఇనాగురల్ ఆఫర్'గా ఉచిత వినోదం పంచనున్న "ఊర్వశి ఓటిటి".. ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా "రామ్ లోపాల్ వర్మ" చిత్రాన్ని ఉచితంగా చూపించనుంది. ప్రముఖ దర్శకుడు వీరు.కె రూపొందించిన ఈ చిత్రంలో షకలక శంకర్, ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర రూపకర్త వీరు.కె మాట్లాడుతూ... "ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న "ఊర్వశి ఓటిటి" ఇనాగురల్ ఆఫర్ గా.. "రామ్ లోపాల్ వర్మ" స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు.. అదే తెలుగు సినిమా స్థాయిని పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక... సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో... ఆవేదనతో...అతని లోపాలను ఎత్తి చూపుతూ... అతని పూర్వ వైభవాన్ని కోరుకుంటూ రూపొందించిన చిత్రం "రామ్ లోపాల్ వర్మ. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. విమర్శనాత్మకంగా, ఆలోచన రేకెత్తిస్తూ తెరకెక్కిన "రామ్ లోపాల్ వర్మ" అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది" అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కెమెరా: గోపి కాకాని, ఎడిటింగ్: అల్లియో, డాన్స్: రామారావు, ఫైట్స్: కృష్ణ, రచన-నిర్మాణం-దర్శకత్వం: వీరు.కె !!
ఆయన ఎమ్మెల్యే కాకముందు వాయుసేనలో ఫైలట్..భారతదేశానికి ఎనలేని సేవలు అందించి రిటైర్ అయ్యారు..విధినిర్వహణ చేరినపుడే తన ప్రాణం దేశానికే అంకితం అని ఇచ్చిన మాటను మరువకుండా నాటి నుంచి నేటి వరకూ రక్తం దానం చేస్తూనే వస్తున్నారు..అంతేకాదు ఒక వ్యక్తియొక్క ప్రాణానికి ఈయన ఇచ్చే విలువ తెలిస్తే ఎవరైనా సెల్యూట్ చేస్తారు..ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. భారతదేశంలో అన్ని ముఖ్యమైన రోజుల్లోనూ ఆయన రక్తదానం చేస్తారు. ఎక్కడ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించడానికి వెళ్లినా ముందు తన రక్తాన్ని దానం చేస్తూ...ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతా ఇదేదో ఆయన ప్రచారం కోసం చేస్తారనుకుంటారు..అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఒక వ్యక్తి రక్తం దానం చేయడం ద్వారా ఆపదలో వున్న నలుగురు ప్రాణాలను కాపాడవచ్చునని అందుకే ప్రతీ మూడు నెలలకొకసారి తాను ఖచ్చితంగా రక్తం దానం చేస్తానని, దానికి రక్తదాన శిభిరాలనే ముందుగా ఎంచుకుంటానని తడుముకోకుండా చెబుతారు. వాయుసేనలో చేరినపుడే తన జీవితాన్ని భారతమాతకు అంకిత మిస్తానని ప్రామిస్ చేశానని...ఆ మాటను నిలబెట్టుకుంటూ క్రమం తప్పకుండా రక్తం దానం చేస్తూనే ఉంటానని చెబుతారు వాసుపల్లి. తన కోసం ఎవరు ఎలా అనుకున్నా డోంట్ కేర్..తను దానం చేసిన రక్తంతో ఒక్క ప్రాణం నిలబడినా నాకు అదే ఆత్మ సంత్రుప్తి అని అంటారు. ఈయన చేసే రక్తదానం స్పూర్తితో ఎందరో యువకులు ఈయనను అనుసరిస్తారు. రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని, అదే సమయంలో మనం మంచి ఆహారం కూడా తీసుకోవాలనే జాగ్రత్తలు కూడా రక్తాన్ని దానం చేసే వారికి హితబోద చేస్తారు వాసుపల్లి. విశాఖలో రక్తదానమంటే ఎమ్మెల్యే వాసుపల్లే అనేంతగా ఈయన సేవలు ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కూడా ఎమ్మెల్యే తన రక్తాన్ని దానం చేసి మరీ రక్తధాన శిబిరాన్ని ప్రారంభించడం విశేషం. ఈ రక్తదాన శిబిరంలో కూడా పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.