1 ENS Live Breaking News

2020-12-23 17:09:10

2020-12-23 15:49:58

ఇళ్ల స్థలాల పంపిణీ సజావుగా సాగాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల స్థలాల పంపిణీ పధకం నగర పరిధిలో సజావుగా చేపట్టడానికి మున్సిపాలిటీ / కార్పోరేషన్ స్థాయిలో తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు తో కలసి ఆ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ జివిఎంసి కార్యాలయము నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పట్టణాల పరిధిలో డిశంబర్ – 25 తేది నుండి జనవరి 7వ తేది వరకు చేపట్టాలని అందరు మున్సిపల్ కమిషనర్లను కోరారు. పధకం సజావుగా నిర్వహించడానికి మంత్రివర్యులు పలు సూచనలు చేస్తూ టిడ్కో ద్వారా మంజూరు అయిన గృహాల లబ్ది దారులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన నియమావళి ప్రకారం మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. మున్సిపల్ మరియు కార్పోరేషన్ పరిధిలో న్యాయ పరమైన సమస్యలు ఉన్న చోట ప్రభుత్వం జారీ చేసిన అధీకృత లేఖను అర్హులైన లబ్దిదారులకు అందించాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ నెల 25 తేది న కాకినాడలోను, 28 వ తేదిన శ్రీకాళహస్తిలోను,  30వ తేదిన విజయనగరంలో జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమంనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనుచున్నారని, అక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని మిగతా ప్రాంతాలలో లబ్దిదారులు వీక్షించే విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి తదుపరి అక్కడ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో నిర్వహించాలని కోరారు.  ఇండ్ల స్థలాలకు గుర్తించిన జాబితాలను సంబందిత వార్డు సచివాలయాలవద్ద పారదర్శకతను సూచించే  విధంగా ప్రచురించాలని సూచించారు. మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ కమిషనర్లు ఈ పధకం చేపట్టడానికి తీసుకుంటున్న చర్యల గురుంచి అందర్నీ అడిగి తెలుసుకున్నారు.  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ కార్పోరేషన్ పరిధిలో టిడ్కో గృహాలు కేటాయింపు మరియు ఇండ్ల స్థలాల కేటాయింపు లేఖలను లబ్దిదారులకు అందించడానికి కావలిసిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియపర్చారు. సి.డి.ఎం.ఎ. విజయ కుమార్ మాట్లాడుతూ పధకం యొక్క ప్రగతిని ప్రతీ రోజూ కమిషనర్ వారి కార్యాలయమునకు పంపించేందుకు మూడు ప్రోఫార్మాలు పంపుచున్నామని వాటిలో ప్రగతిని నింపి ఎప్పటికప్పుడు తెలియపర్చాలన్నారు.     తదుపరి, మున్సిపల్ శాఖామాత్యులు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న 560 అర్బన్ హెల్త్ సెంటర్లకు కావలసిన మౌళిక సదుపాయాలూ ఏర్పాటునిమిత్తం  తగు చర్యలు త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇదివరకే బిల్డింగులు ఉన్న చోట ఫర్నిచరు గాని, అవసరమైన చోట రిపేర్లు చేపట్టాలని, బిల్డింగులు కట్టవలసిన ప్రాంతాలో స్థలాలు సమకూర్చికొని రాష్ట్ర స్థాయిలో ఒకే బిల్డింగు డిజైను ఏర్పాటు చేసి,      అన్ని మున్సిపల్ / కార్పోరేషన్లో అదే డిజైన్ తో భవనాలు నిర్మించడానికి తగుచర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఆదేశించారు.  ఈ సమావేశంలో ఎం.ఏ & యు.డి. కార్యదర్శి జె. శ్యామలరావు, సిడి.ఎం.ఎ. విజయ కుమార్, టిడ్కో మనేజింగు డైరెక్టరు శ్రీధర్,, ఇ.ఎన్.సి. చంద్రయ్య, రాష్ట్ర స్థాయిలో అందరు మున్సిపల్ కమిషనర్లు, విశాఖపట్నం నుండి వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ వి. కోటేశ్వరరావు, జివిఎం.సి. కమిషనర్ జి. సృజన, ఏ.డి.సి.లు రమణి, సన్యాసిరావు, డి.సి.ఆర్. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, ఎస్.ఇ.లు వినయ్ కుమార్, వేణుగోపాల రావు, సి.ఎం.ఓ.హెచ్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-12-22 21:18:01

ఏపీ సిఎస్ గా ఆదిత్యనాధ్ దాస్..

ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి గా ఆదిత్యనాధ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబరు 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది.

Amaravati

2020-12-22 20:28:33

"మా బాబు "’ 60 వసంతాలు..

ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ "మా బాబు "చిత్రాన్ని నిర్మాత డి.వి.ఎస్ . రాజు నిర్మించారు. నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ,సావిత్రి జంటగా ఈ చిత్రంలో నటించారు. టి . ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం: టి .చలపతిరావు, రచన : జూనియర్ సముద్రాల, కెమెరా : కమల్ ఘోష్, కళ: కళాధర్ . ఈ చిత్రం లో నాగేశ్వరరావు, సావిత్రి ,రేలంగి , గుమ్మడి, రమణారెడ్డి ,కుటుంబరావు, కన్నాంబ ,ఎం.ఎన్ .రాజ, ఎం. సరోజా , హనీ ఇరానీ ( వండర్ చైల్డ్) మొదలగు వారు నటించారు .ఈ చిత్రం తే 22-12-60దీ నాడు విడుదల అయ్యింది . యావరేజ్ గా ప్రదర్శింపబడింది .

ఈన్ఎస్ సినిమా

2020-12-22 18:19:38

ఊర్వశీ ఓటిటిలో రాంగోపాల్ వర్మ..

ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందును అందించి, ఉర్రూతలూగించేందుకు "ఊర్వశి ఓటిటి" సర్వ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నెలాఖరు వరకు 'ఇనాగురల్ ఆఫర్'గా ఉచిత వినోదం పంచనున్న "ఊర్వశి ఓటిటి".. ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా "రామ్ లోపాల్ వర్మ" చిత్రాన్ని ఉచితంగా చూపించనుంది. ప్రముఖ దర్శకుడు వీరు.కె రూపొందించిన ఈ చిత్రంలో షకలక శంకర్, ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర రూపకర్త వీరు.కె మాట్లాడుతూ... "ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న "ఊర్వశి ఓటిటి" ఇనాగురల్ ఆఫర్ గా.. "రామ్ లోపాల్ వర్మ" స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు.. అదే తెలుగు సినిమా స్థాయిని పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక... సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో... ఆవేదనతో...అతని లోపాలను ఎత్తి చూపుతూ... అతని పూర్వ వైభవాన్ని కోరుకుంటూ రూపొందించిన చిత్రం "రామ్ లోపాల్ వర్మ. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. విమర్శనాత్మకంగా, ఆలోచన రేకెత్తిస్తూ తెరకెక్కిన "రామ్ లోపాల్ వర్మ" అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది" అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కెమెరా: గోపి కాకాని, ఎడిటింగ్: అల్లియో, డాన్స్: రామారావు, ఫైట్స్: కృష్ణ, రచన-నిర్మాణం-దర్శకత్వం: వీరు.కె !!

సినిమా న్యూస్ డెస్క్

2020-12-22 18:18:01

ఆ ఎమ్మెల్యే సేవానిరతికి సెల్యూట్ చేయాల్సిందే..

ఆయన ఎమ్మెల్యే కాకముందు వాయుసేనలో ఫైలట్..భారతదేశానికి ఎనలేని సేవలు అందించి రిటైర్ అయ్యారు..విధినిర్వహణ చేరినపుడే తన ప్రాణం దేశానికే అంకితం అని ఇచ్చిన మాటను మరువకుండా నాటి నుంచి నేటి వరకూ రక్తం దానం చేస్తూనే వస్తున్నారు..అంతేకాదు ఒక వ్యక్తియొక్క ప్రాణానికి ఈయన ఇచ్చే విలువ తెలిస్తే ఎవరైనా సెల్యూట్ చేస్తారు..ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. భారతదేశంలో అన్ని ముఖ్యమైన రోజుల్లోనూ ఆయన రక్తదానం చేస్తారు. ఎక్కడ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించడానికి వెళ్లినా ముందు తన రక్తాన్ని దానం చేస్తూ...ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతా ఇదేదో ఆయన ప్రచారం కోసం చేస్తారనుకుంటారు..అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఒక వ్యక్తి రక్తం దానం చేయడం ద్వారా ఆపదలో వున్న నలుగురు ప్రాణాలను కాపాడవచ్చునని అందుకే ప్రతీ మూడు నెలలకొకసారి తాను ఖచ్చితంగా రక్తం దానం చేస్తానని, దానికి రక్తదాన శిభిరాలనే ముందుగా ఎంచుకుంటానని తడుముకోకుండా చెబుతారు. వాయుసేనలో చేరినపుడే తన జీవితాన్ని భారతమాతకు అంకిత మిస్తానని ప్రామిస్ చేశానని...ఆ మాటను నిలబెట్టుకుంటూ క్రమం తప్పకుండా రక్తం దానం చేస్తూనే ఉంటానని చెబుతారు వాసుపల్లి. తన కోసం ఎవరు ఎలా అనుకున్నా డోంట్ కేర్..తను దానం చేసిన రక్తంతో ఒక్క ప్రాణం నిలబడినా నాకు అదే ఆత్మ సంత్రుప్తి అని అంటారు. ఈయన చేసే రక్తదానం స్పూర్తితో ఎందరో యువకులు ఈయనను అనుసరిస్తారు. రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని, అదే సమయంలో మనం మంచి ఆహారం కూడా తీసుకోవాలనే జాగ్రత్తలు కూడా రక్తాన్ని దానం చేసే వారికి హితబోద చేస్తారు వాసుపల్లి. విశాఖలో రక్తదానమంటే ఎమ్మెల్యే వాసుపల్లే అనేంతగా ఈయన సేవలు ఉంటాయనడంలో  అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కూడా ఎమ్మెల్యే తన రక్తాన్ని దానం చేసి మరీ రక్తధాన శిబిరాన్ని ప్రారంభించడం విశేషం. ఈ రక్తదాన శిబిరంలో కూడా పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-22 14:21:03

ఏపీలో అక్రిడిటేషన్ జారీలో నవశకం..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజం విలువల పరిరక్షణకు నడుం కట్టినట్టు కనిపిస్తుంది. గతంలో వ్యాపారంగా సాగుతూ వచ్చిన  అక్రిడేషన్లు ఇకముందు నిస్పాక్షికంగా జారీచేసేందుకు వివిధ సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర, జిల్లా కమిటీలను అధికారులతో నియమించడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారు. అదే సమయంలో దేశ రాజధాని పీఐబి తరహా అక్రిడిటేషన్ నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అలా చేయకపోవడం ద్వారా నకిలీ జర్నలిస్టులు(జర్నలిజం లేని వారు, వ్యాపారాలు చేసే వారు, టూరిజం గైడ్లు తదిరులు) అక్రిడిటేషన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ఇలాంటి వారే చాలా మంది అక్రిడిటేషన్ కమిటీ నేతలతో మిలాఖత్ అవడం ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం వాటిల్లి, కమిటీ సభ్యులు, కులపెత్తనం చేసే కాస్త తేడా జర్నలిస్టుల పంతాలు నెగ్గించుకొని వారికి అనుకూలంగా వున్నవారికోసం సమాచారశాఖ అధికారులను అడ్డం పెట్టుకొని అక్రిడిటేషన్లు పొందుతున్నారు. దానికి మూలాలూ కూడా లేకపోలేదు..జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో అధికారులు మాటలు, కొన్ని యూనియన్ నాయకుల హడావిడి తప్పితే కమిటీలో కూర్చున్న ఏ ఒక్కరూ జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన చైర్మన్ కు వాస్తవాలు వివరించలేని పరిస్థితి. దానికి కారణం ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం, అసలు అక్రిడిటేషన్ మంజూరుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం, కొందరు సమాచారశాఖ అధికారుల వక్రబుద్ది చూపించడం ఇలా చాలానే వస్తున్నాయి. ఫలితంగా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది.  దానికితోడు అక్రిడేషన్ల వ్యామోహం తోనే అనేకమంది ఈ రంగంలోకి వచ్చి జీతభత్యాలు లేక, జీవన స్థితి గతులు అంతంతమాత్రంగా మారిన స్థితిలో వివిధ అపసవ్య మార్గాన్ని ఎంచుకున్న కొందరి వలన ఈ రంగం కలుషితం అవుతున్నట్లు నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రిడేషన్లు జారీలో నిబంధనలు ప్రకారం ఖచ్చితంగా జరీచేసినా లేక, జీతభత్యాలు రావని ఈరంగాన్ని  పలువురు భవిష్యత్లో ఎంచుకునే మార్గం వీడే అవకాశం తో  పత్రికా రంగంలో కేవలం అంకితభావం, అర్హులు మాత్రమే ఉన్నవారి వలన తప్పక ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్ట పెరుగుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ విషయంలో చొరవ తీసుకున్న సమాచార శాఖా మంత్రి పేర్న నాని, కమిషనర్ టి.విజయ్ కుమార్ ల నిర్ణయం చాలా గొప్పదినే భావన వర్కింగ్ జర్నలిస్టుల్లో వ్యక్తం అవుతోంది. దానికి ఇక ఇటీవల తరచుగా లో  మీడియా కి చెందిన వారిపై జూదం,వ్యభిచారం,బ్లాక్మైలింగ్, దారిదోపిడీ,ఫోర్జరీ  తదితర నేరాలకు పాల్పడిన వారి  వార్తలు రావడం కూడా ఫోర్త్ ఎస్టేట్ రంగం కలుషితం అవుతోంది. కనుక ప్రభుత్వం అక్రిడేషన్లు జారీ చేసే ముందు అసలు అక్రిడిటేషన్ కి దరఖాస్తు చేసిన వారు నిజంగా జర్నలిజంలో పనిచేస్తున్నారా...లేదంటే డెస్కులో పనిచేస్తున్నారా.. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారా.. అనే విషయాలపై  పోలీస్, సమాచారశాఖ అధికారులతో విచారణ జరిపిస్తే.. అక్రిడిటేషన్ కోసం వేల రూపాయలు ఖర్చుచేసి మరీ అక్రిడిటేషన్లు కొనుగోలు చేసేవారు తగ్గుతారని వర్కింగ్ జర్నలిస్టుల వాదన. అలా ఎంక్వయిరీ జరిపించి మరీ అక్రిడేషన్లు జారీచేయాలని పాత్రికేయులు కోరుతున్నారు. అదే సమయంలో చిన్న, మధ్య తరహా పత్రికలు నడిపేవారి సమస్యలను కూడా ప్రభుత్వం గుర్తించాలని కూడా నిజమైన జర్నలిస్టుల కోసం నడిచే పాత్రికేయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎల్ఐసీ ఏజెంట్లు, పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు, ప్రింటింగ్ ప్రెస్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, బిల్డింగ్ కలెక్షన్ కార్డు జర్నలిస్టులు, యూనియన్ నేతల ముసుగులో దందాలు చేసే జర్నలిస్టులు ఈ విధానాల వలన పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు, వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లో జర్నలిజం కూడా మంచి మార్గంలో వెళ్లేందుకు,కోల్పోతున్న పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని యూనియన్లు ఆందోళనలు చేసినా అలాంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. అయితే ఇదే సమయంలో సమచారశాఖ వక్రబుద్ధి లాభీయింగ్ లపై కూడా ప్రభుత్వం ద్రుష్టి సారించడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు వచ్చే అవకాశం వుంది. లేదంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా..గతంలో మాదిరిగానే అడ్డదారిలో వచ్చేవారికే అక్రిడిటేషన్లు వస్తాయనడంలో సందేహం లేదు..!

Velagapudi

2020-12-19 22:24:16

వైఎస్ఆర్ చేయూత‌లో విజయనగరం నెం.1

జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ చేయూత‌, వైఎస్ఆర్ బీమా ప‌థ‌కాల అమ‌లును వేగ‌వంతం చేసేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ రూపొందించిన ప్ర‌త్యేక వ్యూహం ఫ‌లిత‌మిచ్చింది. ఈ ప‌థ‌కం అమ‌ల్లో జిల్లా గ‌ణ‌నీయ‌మైన పురోభివృద్దిని సాధించింది. వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కంలో ఏకంగా రాష్ట్రంలోనే మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోగా, వైఎస్ఆర్ బీమా ప‌థ‌కంలో ద్వితీయ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌ల్లో ఈ నాలుగు రోజుల్లోనే మంచి పురోభివృద్ది చోటుచేసుకుంది.   ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఈ మూడు ప‌థ‌కాల అమ‌లుపై జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక వ్యూహాన్ని రూపొందించి అమ‌లు చేశారు. జిల్లా అధికారుల‌ను ప‌రుగులు పెట్టించ‌డ‌మే కాకుండా, తాను సైతం స్వ‌యంగా ప‌లు బ్యాంకుల‌కు వెళ్లి త‌నిఖీ చేశారు. జాయింట్ క‌లెక్ట‌ర్లు కూడా వివిధ బ్యాంకుల‌ను త‌నిఖీ చేశారు.  ప‌థ‌కాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు డిఆర్‌డిఏ కార్యాల‌యంలో 24 గంట‌లు ప‌నిచేసేలా ఒక కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు.   క్షేత్ర‌స్థాయిలో మండ‌లాల‌కు ఐటిడిఏ పివో, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా), స‌బ్ క‌లెక్ట‌ర్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్‌, ఆర్‌డిఓ, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారుల‌ను  ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణాధికారుల‌ను నియ‌మించారు.  వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారుల‌తో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేశారు.  అలాగే క్షేత్ర‌స్థాయిలో  స‌మ‌స్య‌లు ఎదురైతే, వాటిని విశ్లేషించి,  ప‌ర్య‌వేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉద‌యం 9 నుంచి రాత్రి 9 గంట‌లు వ‌ర‌కూ సిద్దంగా ఉండి ప‌నిచేసింది. వివిధ‌ శాఖ‌ల ప‌రంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, సాంకేతిక స‌హ‌కారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వ‌ర్యంలో, ఆయా శాఖ‌ల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో  24 గంట‌లూ అందుబాటులో ఉండి ప‌నిచేస్తున్నారు. మొత్తం కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌ ప‌ర్య‌వేక్షించారు.                 ఈ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ కార‌ణంగా ఈ ప‌థ‌కాల అమ‌లు వేగ‌వంతం అయ్యింది. వైఎస్ఆర్  చేయూత ప‌థ‌కం అమ‌ల్లో శ‌త‌శాతం ల‌క్ష్యాల‌ను సాధించ‌డం ద్వారా, రాష్ట్రంలోనే మ‌న జిల్లా అగ్ర‌స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ బీమా ప‌థ‌కం అమ‌ల్లో రాష్ట్రంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ద్వితీయ స్థానం ద‌క్కింది. జిల్లాలో సుమారుగా 6,97,161 బియ్యం కార్డులు ఉండ‌గా, 5,92,827 కార్డుల‌కు స‌ర్వే పూర్తి అయ్యింది. వీటిలో 5.25.215 కుటుంబాల వివ‌రాల‌ను బ్యాంకుల‌కు అంద‌జేయ‌డం జ‌రిగింది. బీమా ప‌థ‌కంలో మొద‌టి స్థానంలో విశాఖ జిల్లా నిల‌వ‌గా, మ‌న త‌రువాత స్థానంలో చిత్తూరు, అనంత‌పురం, నెల్లూరు జిల్లాలు నిలిచాయి. జ‌గ‌నన్న తోడు ప‌థ‌కం క్రింద ఇప్ప‌టివ‌ర‌కు 25,635 ద‌ర‌ఖాస్తుల‌ను బ్యాంకులు ఆమోదించాయి.  వీరిలో ఇప్ప‌టికే 9,475 మందికి రూ.9,47,50,000 మొత్తాన్ని అంద‌జేయ‌డం జ‌రిగింది. మిగిలిన వారికి కూడా రెండు మూడు రోజుల్లో రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.

Vizianagaram

2020-12-19 21:58:40

2020-12-19 21:48:12

2020-12-19 21:41:13

2020-12-19 21:29:43

2020-12-19 20:22:39