1 ENS Live Breaking News

వ‌సంత మండ‌పంలో శ్రీ ధ‌న్వంత‌రి పూజ..

కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో చివ‌రి రోజైన ఆదివారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ ధ‌న్వంత‌రి పూజతో ముగిసింది.  ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ శ్రీ‌నివాసుడు, వారికి అభిముఖంగా శ్రీ ధ‌న్వంత‌రి స్వామివారిని వ‌సంత మండ‌పంలో వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ దేవ‌త‌లు, దాన‌వులు మంద‌ర‌గిరి ప‌ర్వ‌తాన్ని వాసుకి తాడుగా చేసి క్షీర‌సాగ‌రాన్ని మ‌ధించ‌గా అందులో మంద‌ర‌గిరి ప‌ర్వ‌తం మునిగిపోతుంద‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో దేవ‌త‌లు శ్రీ మ‌హా‌విష్ణువును ప్రార్థించ‌గా స్వామివారు మ‌హా కూర్మంగా అవ‌త‌రించి మంద‌ర‌గిరి ప‌ర్వ‌తాన్ని త‌న వీపుపై మోసి అమృతాన్ని ఉద్భ‌వింప చేసిన‌ట్లు తెలియ‌జేశారు. క్షీరసాగ‌ర మ‌థ‌నంలో మొద‌ట హా‌లాహ‌‌లం ఉద్భ‌వించింద‌ని, దీనిని ప‌ర‌మ శివుడు సేవించి కంఠంలో ఉంచుకొన్నార‌న్నారు.          త‌రువాత‌ ఐరావ‌తం, కామ‌ధేనువు, క‌ల్ప‌వృక్షం, పారిజాతం మొద‌లైన‌వి ఉద్భ‌వించాయ‌ని, వీటిని త్రిలోకాధిప‌తి అయిన ఇంద్రుడు గ్ర‌హించాడ‌న్నారు. అనంత‌రం ల‌క్ష్మీ దేవి ఉద్భ‌వించింద‌ని, అమ్మ‌వారిని శ్రీ‌మ‌హ విష్ణువు గైకొని త‌న హృద‌యంలో ప్ర‌తిష్ఠంచుకున్న‌ట్లు తెలిపారు.క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో చివ‌రిగా శంఖు చక్రా‌లు, అమృత క‌ళ‌శంతో ఉద్భ‌వించిన ధ‌న్వంత‌రి స్వామివారు ఆయుర్వేద విద్య‌కు ప్ర‌సిద్ధి అని, శ్రీ మ‌హావిష్ణువు అవ‌తార‌మ‌న్నారు. ధన్వంతరి జ‌యంతి సంద‌ర్భంగా ఆదివారం తిరుమ‌ల‌లో ధన్వంతరి పూజ వ‌ల‌న విశ్వంలోని ప్రాణి కోటికి హానిక‌లిగించేవి న‌శించి, సంపూర్ణ‌ ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాల‌ను ప్ర‌సాదించ‌నున్న‌ట్లు వివ‌రించారు.         ముందుగా ఘంటా నాదంతో స‌క‌ల దేవ‌త‌‌ల‌ను ఆహ్వా‌నించి, కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి, అష్ట‌దిక్పాల‌కులు, న‌వ‌గ్ర‌హా‌ల అనుగ్ర‌హంతో లోక క్షేమం కొర‌కు ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత శ్రీ ధ‌న్వంత‌రి పూజ‌, నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది. ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు వేణుగోపాల దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు,  అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-13 20:36:16

భక్తుని చెంతకు భగవంతుడు..

 శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం కార్తీక మాస కడపటి ఆదివారం ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి సన్నిధి వీధిగుండా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి నివేదన, ఆస్థానం నిర్వహించారు. తదుపరి స్వామి అమ్మవార్లను ఒక తిరుచ్చి మీద, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇంకొక తిరుచ్చి మీద వేంచేపు చేసి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆంజనేయ స్వామి వారు విమాన ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో మూలవర్లకు పూలంగి సేవ, అధిక సంఖ్యలో దీపాలను వెలిగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ రాజేంద్రుడు, ప్రధాన అర్చకులు  శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్  కృష్ణమూర్తి  తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2020-12-13 20:30:56

ఆర్జెయూకెటి 2020 ఫలితాలు విడుదల..

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2020 ప్రవేశ పరీక్షకు మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని నేపథ్యంలో ఆర్ జియుకెటి 2020 ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించామని, వీటికి విద్యార్దులు వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి  పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్.అండ్.బి భవన సముదాయంలో పత్రికా విలేకర్ల సమావేశంలో ఆర్.జియుకెటి 2020 సెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 30 వేల మందికి పైగా విద్యార్దులను 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత చేయడం జరిగిందన్నారు. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా ఆర్ జియుకెటి సెట్ ను నిర్వహించామన్నారు. ఈ పరీక్షలకు అక్టోబర్ 23 తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 28 నుండి నవంబర్ 16 వరకు అప్లికేషన్లు స్వీకరించామన్నారు.  మొత్తం 88,974 మంది దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 85 వేల 755 మంది హాజరైయ్యారన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 630 పరీక్షా కేంద్రాలోను, తెలంగాణ రాష్ట్రంలోని 8 కేంద్రాల్లో డిసెంబర్ 5వ తేదీన ఉదయం 11గం.ల నుండి మ.1.00 గంట వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు ఆర్ జియుకెటి ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి, హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డిల కృషి, మార్గదర్శకం ఎంతో అభినందనీయమన్నారు. జనవరి 4 నుండి విద్యార్దులకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తామన్నారు. జనవరి రెండవ వారం నుండి తరగతులు ప్రారంభించడానికి కార్యాచరణ సిద్దం చేశామన్నారు. అర్హత సాధించిన విద్యార్దులకు, పరీక్షకు హాజరైన విద్యార్దులకు ఆర్.జియుకెటి వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  విద్యార్దులకు కటాఫ్ మార్కులు కాల్ లెటర్లు పంపడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వెబ్‌సైట్ నుండి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చని, కేవలం హాల్‌టికెట్ నెంబరు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. గుంటూరుకు చెందిన గుర్రం వంశీకృష్ణ(దాచేపల్లి ఏపి మోడల్ హైస్కూలు)99 మార్కులతో ప్రథమస్దానంలో నిలిచారన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన పోతుంగంట జాకీర్ హుస్సేన్ రెండవ స్దానంలో నిలిచారన్నారు. డోలేపేట జడ్‌పి హెస్కూల్ రాజాంకు చెందిన ఐ.ఎస్ ఆర్యాయుగంధర్ మూడవస్దానంలో నిలిచారన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాలపై అభ్యంతాలు స్వీకరించడం జరిగిందని 1900 అభ్యంతరాలు రాగా ఫిజిక్స్, మ్యాథ్స్‌కు సంబంధించి రెండు తప్పులను పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు.  ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఎంపికైన విద్యార్దుకు 6 సంవత్సరాల సమీకృత బీటెక్ ప్రోగ్రామ్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్సిటీ గుంటూరు, శ్రీ వెంకటేశ్వర వెటర్నటీ యూనివర్శిటీ తిరుపతి మరియు డా.వైయస్ ఆర్ హార్టీకల్చర్ వెంకట్రామ గూడెం 2020-21 విద్యా సంవత్సరానికి డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా ఫలితాలను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా విడుదల చేయడం జరిగిందని, కరోనా పరిస్దితుల నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారాను, యూట్యూబ్ ద్వారా విద్యార్దులకు క్లాసులు నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు నిర్వహణకు ఎంత ప్రయత్నించినా సాధ్యంకానందున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను 2020 నిర్వహించి విద్యార్దుల విద్యాసంవత్సం కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాలు.. రాష్ట్రంలో 6 లక్షల 30 వేల మంది విద్యార్దులకు 10వ తరగతి నుండి ఉత్తీర్ణణ చెయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించని మార్గదర్శకాలకు అనుగుణంగా పై#్రవేట్ కాలేజ్‌లు విద్యార్దులను జాయిన్ చేసుకోవలసి ఉంటుందని, విద్య అనేది వ్యాపారం కాదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు లభించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పసరిగా పాటించాలని ఈ ఏడాది కొత్తగా 300 కాలేజ్‌లను ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు.                    

Vijayawada

2020-12-12 21:49:48

ఘనంగా శ్రీ తుల‌సీ విష్ణు స‌మారాధ‌నం‌..

 కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శ‌నివారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో  శ్రీ తుల‌సీ విష్ణు స‌మారాధ‌నం‌ ఘనంగా జరిగింది. ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ తుల‌సీ వృక్షాన్నివ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ తుల‌సీ అంటే శ్రీ మ‌హా‌ల‌క్ష్మీ రూప‌మ‌ని, తుల‌సీలో స‌మ‌స్త దేవ‌త‌లు ఉంటార‌న్నారు. ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం తుల‌సీకి భ‌క్తి పూర్వ‌కంగా దీపారాధ‌నతో ప్రార్థించ‌డం వ‌ల‌న జ‌న్మ జ‌న్మ‌ల జ‌న్మ జ‌న్మ‌ల పాపం న‌శిస్తుంద‌ని, ఆ ఇంట ల‌క్ష్మీదేవి స్థిర నివాస‌మై ఉంటుంద‌ని తెలిపారు. ఎక్క‌డ లక్ష్మీ ఉంటుందో అక్క‌డ శ్రీ మ‌హ‌విష్ణువు కొలువై ఉంటారు కావున ఆ ఇంటి వైపు ఎలాంటి దుష్ట శ‌క్తులు రావ‌ని తెలియ‌జేశారు. భూలోక క‌ల్ప‌వృక్ష‌మైన తుల‌సీని విష్ణువుతో క‌లిసి పూజ చేయ‌డం వ‌ల‌న స్త్రీకి పుత్ర‌పౌత్రాబివృద్ధి క‌లిగి, దీర్ఘ సుమంగ‌ళి యోగం, స‌మ‌స్త వ్యా‌ధులు న‌య‌మ‌వుతాయ‌ని తెలిపారు.  ప‌విత్ర కార్తీక మాసంలో తుల‌సీతో కూడిన శ్రీ మ‌హ‌విష్ణువును పూజించ‌డం వ‌ల‌న సంవ‌త్స‌రం అంతా పూజ చేసిన ఫ‌లం, స‌మ‌స్త న‌దుల‌లో స్నానం చేసిన ఫ‌లితం సిద్ధి‌స్తుంద‌ని వివ‌రించారు. ముందుగా ఘంటా నాదంతో స‌క‌ల దేవ‌త‌‌ల‌ను ఆహ్వా‌నించి, కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి, అష్ట‌దిక్పాల‌కులు, న‌వ‌గ్ర‌హా‌ల అనుగ్ర‌హంతో లోక క్షేమం కొర‌కు ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత తుల‌సీ విష్ణు  పూజ‌, నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.           ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌, శ్రీ‌వారి ఆల‌య పేష్కార్  జ‌గ‌న్మోహ‌నాచార్యులు‌, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-12 21:31:13

వేంకటేశ్వర ఆలయానికి స్థల పరిశీలన..

విశాఖలోని  ఋషికొండ వద్ద శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం  నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ను టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  మాట్లాడుతూ ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి కానుందని , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చే  ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మిగిలివున్న పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం  ప్రశాంతమైన సముద్రతీరంలో 10 ఎకరాల స్థలం లో నిర్మిస్తున్నామని  ప్రధాన ఆలయం  ఒకటిన్నర ఎకరా ల్లో వుంటుందన్నారు. మిగతా స్థలం పార్కింగ్ కేటాయించాం. ఆలయానికి వాడే రాయి మొత్తం కోటప్పకొండ రప్పించినట్లు చెప్పారు.   పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి రూ.28 కోట్లతో నిర్మించడం జరుగుతుందన్నారు. స్వామి వారి అనుగ్రహంతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఆధ్యాత్మికంగా , అంతర్జాతీయ నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ  ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు,విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రుషికొండ

2020-12-11 22:03:59

బాలాలయ సంప్రోక్షణలో చ‌తుర్థ‌శ క‌ల‌శ స్న‌ప‌నం

తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణలో భాగంగా నాలుగ‌వ‌ రోజైన బుధ‌‌‌వారం చ‌తుర్థ‌శ క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు.ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  కుంభారాధ‌న‌, విశేష హోమాలు నిర్వ‌హించారు. త‌రువాత యాగ‌శాల‌లో భ‌గ‌వ‌త్ వైఖాన‌స ఆగ‌మోక్తంగా వి‌విధ‌ దేవ‌త మూర్తుల సూక్త మంత్ర‌ముల‌తో మ‌హాశాంతి కుంబ‌‌ జ‌ప్యం నిర్వ‌హించారు.  కాగా, బుధ‌‌‌వారంనాడు సాయంత్రం  బాలా‌ల‌యంలో ఉండే స్వామివారి దారు బింబ‌ము శుద్ధి కొర‌కు చ‌తుర్థ‌శ క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు. ‌ఇందులో 7 ప్ర‌ధాన అభిషేక ద్ర‌వ్యాలైన పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో, 7 విశేష మంత్ర జ‌ల క‌ల‌శాల‌తో అభిషేకం జ‌రిగింది. అనంత‌రం ద్వార పాల‌కులు, ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారికి‌, విమాన గోపురం న‌మూనాకు అభిషేకం నిర్వ‌హించారు. దీని వ‌ల‌న బింబ‌ములోని దోషాలు తొల‌గి పోయి, జీవ‌శ‌క్తి బింబ‌ములోనికి ప్ర‌వేశిస్తుంద‌ని అర్చ‌కులు తెలిపారు.          త‌రువాత యాగ‌శాల‌లో శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీ వ‌రాహ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు పంచామృత అభిషేకం నిర్వ‌హించారు.  డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహా సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.            ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్  వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు  మోహ‌న రంగాచార్యులు,  ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు,  ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు గోవింద‌రాజ దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2020-12-09 22:16:12


2020-12-09 08:05:01


2020-12-08 20:25:10


2020-12-08 20:02:48


2020-12-08 19:48:38


2020-12-08 19:22:13

శాస్త్రోక్తంగా బాలాలయ మహాసంప్రోక్షణ ..

తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడ‌వ రోజైన మంగ‌ళ‌‌వారం  శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలలో నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత  స‌ర్వ‌దైవ‌శ్చ‌‌హోమం, ప‌ర‌మాత్మిక హోమం, శాంతి హోమాలు జ‌రిగాయి.  కాగా, మంగ‌ళ‌‌వారంనాడు ఉదయం బాల‌ల‌యంలో ఉండే స్వామివారి దారు బింబ‌మున‌కు,  ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారికి‌, విమాన గోపురం న‌మూనాకు పంచ‌గ‌వ్యాధివాసం, క్షీరాధివాసం, జ‌లాధివాసం, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు.

         ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్  వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు  మోహ‌న రంగాచార్యులు,  ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు,  ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు  గోవింద‌రాజ దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-08 19:21:14

50 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లక్ష్యం..

కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యత పెరిగిందని దీంతో రాష్ట్రంలో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు కూడా మరింత పెరిగాయని ఏ.పి. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టరు యం. మధుసూధనరెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని కరోనా నేపథ్యంలో వాటి ప్రాధాన్యత మరింత పెరిగిందని మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 70 శాతం పనులు ఇంటర్నెట్ ఆధారంగానే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని విద్యాభోధన కూడా ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అందించాలన్న ప్రతిపాదన తీసుకురావడం జరిగిందన్నారు. బేసిక్ ప్యాక్ రూ. 300 లు, ఎ సెన్షియల్ ప్యాక్ రూ. 449 లు, ప్రీమియం ప్యాక్ రూ. 599 లు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో భాగంగా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సదుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది చందాదారులకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాలు, 6300 గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సేవలు అందించడం ఏ.పి. ఫైబర్ నెట్ ప్రత్యేకత అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు, రైతుభరోసా కేంద్రాలకు, వైయస్ఆర్ ఆరోగ్య కేంద్రాలకు, పాలసేకరణ కేంద్రాలకు, నాడు-నేడు పాఠశాల కార్యక్రమాలకు ఏ.పి. ఫైబర్ నెట్ ఇంటర్నెట్ కనెక్టవిటీని అనుసంధానం చేసామన్నారు. వీటికి టెలిఫోన్ సౌకర్యాన్ని అందించడం గమనార్హమని మధుసూధనరెడ్డి తెలిపారు. ట్రంక్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాలు కలిగి 24 కిలోమీటర్ల నిడివిలో ఆర్కిటెక్చర్ కలిగి ఉన్న సాంకేతిక అనుసంధానంతో ఒక వలయంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 ప్రదేశాలలో పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌తో కూడిన సేవలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ సేవలను గ్రామపంచాయతీలతో ఫేజ్ - 2 ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేస్తున్నట్లు మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల గృహాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారని మధుసూధనరెడ్డి తెలిపారు. రాబోయే 2, 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అనుసంధానం చేస్తామన్నారు. పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా సిపిఇ బాక్స్‌లను కూడా సరఫరాను పెంచుతామని ఆయన తెలిపారు. స్ధానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్ల నిర్వాహకులతో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Vijayawada

2020-12-08 18:07:13

2020-12-08 12:44:23

2020-12-08 11:23:57