1 ENS Live Breaking News

వైభవంగా భ‌గ‌వ‌ద్గీత అఖండ ‌పారాయ‌ణం..

వైకుంఠ ఏకాద‌శితోపాటు విశేష‌మైన గీతాజ‌యంతిని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం  తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం జ‌రిగింది. ఉద‌యం 6 గంట‌ల నుంచి దాదాపు 4 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 అధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాల‌ను వేద‌పండితులు పారాయ‌ణం చేశారు. భ‌క్తులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.అంత‌కుముందు టిటిడి ఆస్థాన విద్వాంసులు  గరిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను వీనుల‌విందుగా ఆల‌పించారు.  కృష్ణార్జున వ్యాఖ్యానం చేశారు. కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ భ‌జ‌నతో ఈ కార్య‌క్ర‌మం ముగిసింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, ధ‌ర్మగిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో బాలాజి, వేద పండితులు, భ‌క్తులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-25 19:45:14

వైకుంఠ ఏకాదశి, క్రిస్ మస్ ఒకే రోజు రావడం శుభపరిణామం..

‘క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ఒకే రోజు రావడం చాలా అరుదైన సందర్భం. ఇంత మంచి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనలు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాను కానీ, పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాననే చిన్న బాధ మనసులో ఉందన్నారు. నిన్ననే ఓ వ్యక్తి హై కోర్టుకు వెళ్లి పులివెందులలో పేదలకు ఇచ్చే 8,300 ఇళ్ల పట్టాలు ఏపీఐఐసీ భూముల్లో ఇవ్వకూడదని స్టే తీసుకురావడం మనసుకు బాధ అనిపిస్తుందన్నారు. ‘ఏపీఐఐసీ అయినా ప్రభుత్వమే.. భూములు ఇచ్చేది ప్రభుత్వమే. ఏపీఐఐసీలో భూములు చాలా ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు వస్తే.. పరిశ్రమల్లో పనిచేయడానికి  చాలా ఇళ్లు ఉంటేనే వర్క్‌ఫోర్స్‌ అందుబాటులో ఉంటుందని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. జరిగే ప్రతి మంచిని అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అందులో 3.70 లక్షలు 10 శాతం ఇళ్ల పట్టాలు రకరకాల కుట్రల వల్ల ఆలస్యం అవుతున్నాయి. కానీ, పైనుంచి దేవుడు చూస్తున్నాడు. త్వరలో సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయినా సరే స్టేలు ఎత్తేయించి.. పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయిన ప్రాంతాల్లో అందరికీ ఇళ్ల పట్టాలు అందజేసి ఇళ్లు కూడా కట్టిస్తాం. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.

పులివెందు

2020-12-25 17:48:33

వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి..

తిరుమలలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు శుక్రవారం ఉదయం 7- 30 గంటల నుంచే దర్శనం ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనం లో గురువారం సాయంత్రం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, దేశవ్యాప్తంగా అనేకమంది మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు తీసుకుని వైష్ణవ సంప్రదాయం ప్రకారం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరిస్తూ జూన్ 8వ తేదీ 5 వేల మందితో దర్శనం పునరుద్దరించామన్నారు. కోవిడ్  నిబంధనలు గట్టిగా అమలు చేస్తూనే  ప్రస్తుతం రోజుకు  35 వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.  వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కూడా ఇదే సంఖ్యలో దర్శనాలు పరిమితం చేయాలని నిర్ణయించామని చైర్మన్ తెలిపారు. ఇందుకోసం రోజుకు 20 వేల రూ 300 టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేశామన్నారు. రోజుకు 10 వేల చొప్పున తిరుపతి స్థానికులకు 10 రోజులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్, ప్రోటోకాల్ వీఐపీలకు దర్శనం ఇస్తున్నట్లు చైర్మన్ చెప్పారు.         వైకుంఠ ఏకాదశి శుక్రవారం వస్తున్నందున అభిషేకం అనంతరం ఉదయం 4 గంటలకు ప్రోటోకాల్ వీఐపీలకు, తరువాత,శ్రీవాణి టికెట్ల వారికి దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 7.30 గంటల నుంచే సామాన్య భక్తులకు దర్శనం ప్రారంభిస్తామని అన్నారు.

Tirumala

2020-12-24 20:35:14

2020-12-24 19:22:43

2020-12-24 18:18:12

తిరుమలలో లాఠీచార్జి జరగలేదు..

తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులపై ఎక్కడా లాఠీచార్జి జరగలేదని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తులపై లాఠీచార్జి జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు  చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు చైర్మన్ ఈ సమాధానం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.  తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. కావాలని తప్పుడు ప్రచారం చేసే వారిని ఆ దేవుడే శిక్షిస్తాడని చెప్పారు.

Tirumala

2020-12-24 16:45:11

కొత్త సంవత్సరంలో కళ్యాణమస్తు..

ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో  కొత్త సంవత్సరం లో కళ్యాణమస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులకు సేవ చేస్తున్న శ్రీవారి సేవకులు టీటీడీ నిర్వహించే అన్ని ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల ఆస్థాన మండపం లో గురువారం నిర్వహించిన శ్రీవారి సేవకుల సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తి స్పూర్తి గా 2000 నవంబరు లో కంచి పీఠాధిపతి స్వర్గీయ శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి  శ్రీవారి సేవ ప్రారంభించారన్నారు. 200 మందితో ప్రారంభమైన శ్రీ వారి సేవలో 20 ఏళ్లలో సేవ అందించిన 12 లక్షల మంది సేవకులకు ఆయన అభినందనలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కూడా సేవ కోసం వచ్చిన సేవకులు తిరుమల సహా అన్ని స్థానిక ఆలయాల్లో కూడా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ భక్తులు కూడా వీటిని పాటించేలా చేయాలని కోరారు.  సి ఎం  జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో టీటీడీ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా గోవులను పోషించుకోగలిగే  ఆలయాలకు గోవులను ఇవ్వనున్నట్లు చెప్పారు. పేద ప్రజలు పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పుల పాలు కాకుండా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెళ్ళిళ్ళు చేయించడానికి కొత్త సంవత్సరం లో కళ్యాణ మస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటకు బట్టలు, మంగళ సూత్రం ఇవ్వడంతో పాటు ఇరు వైపుల వారికి భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.       బ్రహ్మోత్సవాల తరహాలో ఈ సారి నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కూడా 10 రోజులు నిర్వహిస్తున్నామని చైర్మన్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవ చేయడం మహాభాగ్యమని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వారు శ్రీ వారి సేవకులకు శిక్షణ ఇస్తుండటం ప్రశంస నీయమన్నారు.         టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, భక్తుల కోరిక, పీఠాధి, మఠాధిపతుల సలహా మేరకు 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అమలు చేస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీ వారి సేవకులు కోవిడ్ 19 నిబంధనలు జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. మాస్కు లు ధరించని వారికి వివరించి చెప్పాలని, క్యూ లైన్లు,ఆలయం తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, చేతులు శుభ్రం చేసుకునేలా చేయాలని కోరారు.        ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి  విభీషణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ రవి తో పాటు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-24 16:33:23

2020-12-24 12:37:00

దాత్రుత్వం చాటుకున్న కొండా రాజీవ్..

వైఎస్సార్సీపీ విశాఖ యువజన అధ్యక్షులు, అధికార ప్రతినిధి కొండారాజీవ్ గాంధీ తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయ మేనేజర్ రంగయ్యను స్వయంగా గుంటూరు వెళ్లి పరామర్శించారు. అంతేకాదు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్దిక సహాయం కూడా చేశారు. రంగయ్య ఇటీవల కాలంలో అస్వస్థతకు గురై గుంటూరులోని లలిత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయంతెలుసుకున్న రాజీవ్ వెంటనే గుంటూరు వెళ్లి రంగయ్యను పరామర్శించి వారికుటుంబానికి దైర్యం చెప్పి వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు సమాచారం అందించాలని కూడా భరోసా ఇచ్చారు. దేవుడి దయవల్ల  రంగయ్య అనతికాలంలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ  నవ్వుతు తిరిగి  విశాఖ పార్టీ కార్యాలయానికి తిరి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Guntur

2020-12-24 12:33:39

2020-12-23 18:54:59

2020-12-23 18:15:32

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఆధిత్యనాధ్ దాస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధిత్యనాధ్ దాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకం కలిశారు. ప్రస్తుతం సిఎస్ గా వున్న నీలం సాహ్ని ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అదేరోజు ఆధిత్యనాథ్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జీఓ కూడా జారీచేసింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిని ఆయన కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈయన మంచి అధికారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ప్రభుత్వం ఈయనను సిఎస్ గా నియమించిందని సమాచారం. సీఎస్ గా పలువు ఐఏఎస్ లు పేర్లు కేంద్రానికి పంపినా, ఆధిత్యనాధ్ దాస్ పేరును కేంద్రం ఖరారు చేసింది.

Velagapudi

2020-12-23 17:49:57