తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు నియామకం కావడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆవివరాలు ఒక్కసారి తెలుసుకుంటే టిటిడి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఈఓగా డా.జవహర్ రెడ్డి, టిటిడి అడిషనల్ ఈఓగా ధర్మారెడ్డి, టిటిడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎస్పీ పి.రమేష్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ గా భూమా వెంగమాంబ రెడ్డిలు ప్రస్తుతం ఉన్నారు. వీరంతా టిటిడిలోని కీలక విభాగాల్లో ఉన్నవారే కావడం విశేషం. దీంతో ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరూ పోస్టులు పెడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా...ప్రస్తుతం టిటిడిలో ఉన్న అధికారులంతా గట్టి వారేనన్న మంచి పేరు కూడా వుంది. వీరంతా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినపుడు వారి సత్తా చూపిన వారే కావడం కూడా విశేషం. దీంతో కొందరు కావాలని రాజకీయం చేసేవారికి వీరి పనితనం తెలిసిన వారు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం కూడా కొసమెరుపు...
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈఓగా సీనియర్ ఐఏయస్ అధికారి డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం భాద్యతలు చేపట్టారు. ఉదయం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకి చేరుకున్న ఆయన స్వామివారికి తలనీలాలు సమర్పించి.. అనంతరం వరహా నరసింహస్వామిని దర్శించుకని తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. 12 గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి పదవీబాధ్యతలు తీసుకున్నారు. జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టాకా మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు టిటిడి నూతన ఈఓకి ఆశీర్వాదాలు అందించి తీర్ధప్రసాదాలు ఇచ్చారు. టీటీడీ 27వ ఈఓగా జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుటుంబ సమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత టిటిడిలోని వివిధ విభాగాల అధికారులు ఈఓని మర్యాదపూర్వకంగా కలిశారు.
డా.కెఎస్.జవహర్ రెడ్డి..ప్రజాపయోగ నిర్ణయాలు తీసుకోవడంలో ఈయనకు ఈయనే సాటైన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసినా డేరింగ్ అండ్ డేషింగ్ అధికారిగా పేరుతెచ్చుకున్న ఆయన నేడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్నో సంస్కరణలను చేసిన జవహర్ రెడ్డి నేనుడు తిరుమల ఈఓగా బాధ్యతలు చేపడుతున్న వేళ ఆయనపై పరిపాలనపై చాలా అంచనాలే పెట్టుకున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో పుణ్యం చేసుకొని వుంటే తప్పా తిరుమలలో శ్రీవారి సేవలో ఈఓగా పనిచేసే అవకాశం రాదు. ఒక్కోసారి సీనియర్ ఐఏఎస్ అధికారుల పనితీరు కూడా స్వామివారి సేవకు ఆటోమేటిక్ గా వెళ్లేలా చేస్తాయి. ఆ రెండు అవకాశాలు జవహర్ రెడ్డికి వచ్చాయనేది నేటి తిరుమల టాక్. వాస్తవంగా మంచి పరిపాలన దక్షత వున్న ఈయన రాకతో తిరుమలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు పరిష్కారంతో పాటు, శ్రీవారిని భక్తులకు మరింత దగ్గర చేస్తారనే నమ్మకం కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది. తిరుమల ఈఓగా భాధ్యతలు తీసుకోవడానికి కాలినడకన శ్రీవారి పాదాలను దర్శించుకున్న ఆయన. ఈరోజే ఈరోజే ఈఓగా అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు..
కోవిడ్-19లో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు అందించిన సేవలు అత్యంత ప్రశంసనీయమని విశాఖ శారదాపీఠాదిపతులు స్వరూపనందేంద్ర సరస్వతి, సౌత్మనందేంద్ర సరస్వతిలు కొనియాడారు. శుక్రవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు శారదాపీఠాధిపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో గల రాజశ్యామల అమ్మవారి, ఇతర దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీలను కలిసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కోవిడ్-19లో జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమ విధులు నిర్వహించారన్నారు. ప్రజలను కోవిడ్ బారిన పడకుండా అపరమత్తం చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. అయితే ప్రభుత్వపరంగా జర్నలిస్టులకు సాయం అందించే విధంగా చూడాలని శ్రీనుబాబు స్వామీజీలు కోరారు. దీనితో వారు సానుకూలంగా స్పందించి జర్నలిస్టులకు తగు మేలు జరిగేవిధంగా కృషిచేస్తానని హామి ఇచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణకు విశాఖ శారదాపీఠం నిరంతరం కృషిచేస్తూనే వుంటుందని ఇందుకోసం ఎవరి స్థాయిలో వారు ముందుకు రావాలని స్వామీజీలు పిలుపునిచ్చారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..కోవిడ్ సమయంలో పెండింగ్ లో ఉంచిన రెండు నెలల జీతం, ఒక నెల పెన్షన్ ను ఐదు విడతలుగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా పెండింగ్ లోఉన్న ఐదు డిఏల మొత్తంలో కూడా ఒక నెల డిఏ చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉద్యోగ సంఘాల నాయకులకు తెలియజేశారు. ఈమేరకు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆర్ధికశాఖ త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేస్తుందని వివరించారు. పెండింగ్ లో ఉన్న జీతాల విషయమై ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరో వైరపు 11వ పీఆర్సీకి సంబంధించిన కమిటీ నివేదిక కూడా సమర్పించడంతో త్వరలోనే దాని మీద కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ సంఘాలు, ఉద్యోగులు అనుకున్నంత మేర పీఆర్సీ పెరుగుతుందా...కోవిడ్ నేపథ్యంలో ఆర్దికలోటు కారణంగా కాస్త తగ్గించి పీఆర్సీ అమలు జరుగుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు..
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్య గల భక్తులతో మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలను జరపడానికి నిర్ణయించారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి నిర్వహించే వాహనసేవల ఊరేగింపును కూడా ఆవిధంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రపంచంలోని అందరు భక్తులకోసం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 8రోజులు పాటు జరిగే వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
15.10.2020 - గురువారం - అంకురార్పణ - రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
16.10.2020 - శుక్రవారం - బంగారు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 9 నుండి 11 గంటల వరకు.
పెద్దశేష వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
17.10.2020 - శనివారం - చిన్నశేష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
హంస వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
18.10.2020 - ఆదివారం - సింహ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
ముత్యపుపందిరి వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
19.10.2020 - సోమవారం - కల్పవృక్ష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
20.10.2020 - మంగళవారం - మోహినీ అవతారం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.గరుడసేవ - రాత్రి 7 నుండి 12 గంటల వరకు.
21.10.2020 - బుధవారం - హనుమంత వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
పుష్పకవిమానం- సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.10.2020 - గురువారం - సూర్యప్రభ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
చంద్రప్రభ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
23.10.2020 - శుక్రవారం - స్వర్ణ రథోత్సవం- ఉదయం 8 గంటలకు.
అశ్వ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
24.10.2020 - శనివారం - పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 3 నుండి 5 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం - ఉదయం 6 నుండి 9 గంటల వరకు.
బంగారు తిరుచ్చి ఉత్సవం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
తిరుమలలో శ్రీవారికి ప్రతినెలా జరిగే పున్నమి గరుడసేవ గురువారం సాయంత్రం జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలో కార్యక్రమాన్ని ఏకాం తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెలలో స్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా గురువారం, అక్టోబరు 31న, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడసేవ నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా ఆలయ సిబ్బంది, అర్చకులతో మాత్రమే స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తారు. ప్రతినిత్యం తిరుమలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ఈ చర్యలు తీసుకున్నట్టు టిటిడి అధికారులు ప్రకటించారు. స్వామివారికి జరిగే ఈ సేవను ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యేక్ష ప్రసారం చేస్తారు. ఆలయంలోని స్వామివారి మండంలోనే కార్యక్రమం జరగనుంది..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాల్లో బయోమెట్రిక్ కష్టాలు సిబ్బందిని వెంటాడుతున్నాయి. బయోమెట్రిక్ మిషన్లు ఉదయం పదిగంటలు దాటితే మళ్లీ మధ్యాహ్నాం 12 వరకూ పనిచేయకపోవడం సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ విధానం కొన్నిజిల్లాల్లో సిబ్బందికి అవకాశంగా మారగా..మరికొన్నిజిల్లాల్లో సిబ్బందికి జీతాలు నిలిపివేస్తున్నారు. ఈ సమస్య అధికంగా తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా వుంది. ఇతర జిల్లాల్లో మాత్రం ఒక్కోసారి 11 గంటల సమయంలో బయోమెట్రిక్ పనిచేస్తుంది. దీంతో బయోమెట్రిక్ పనిచేయని చోట గ్రామసచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ మిషన్లు ఏ సమయం నుంచి ఏ సమయం వరకూ పనిచేయడంలేదో ఒక ప్రత్యేక రిజిస్టర్ పెట్టి మరీ నమోదు చేస్తున్నారు. కొన్నిజిల్లాల్లో అయితే చాలా మంచి సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ వేయడంలేదు. కొన్నిచోట్ల బయోమెట్రిక్ వేయని చోట అటెండెన్సు రిజిస్టర్ లో మాత్రం రోజులో ఏదో సమయంలో సంతకాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామసచివాలయాలకు తనిఖీ కోసం వెళ్లే అధికారులు కూడా గుర్తించకపోవడం విశేషం. ఒక్కో జిల్లా కలెక్టర్ గ్రామసచివాలయాల సందర్శన సమయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు తప్పితే...ఏ శాఖల సిబ్బంది ఏఏ సేవలు అందిస్తున్నారనే విషయాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కోలా అధికారుల పర్యటనలు సాగుతుండటం కూడా విధులకు డుమ్మాకొట్టే సచివాలయ సిబ్బందికి బాగా కలిసొస్తుంది. కొన్ని చోట్ల పక్కాగా మూవెమెంట్ రిజస్టర్లు మెయింటే చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ మిషన్లు మెరాస్తుండటంతో సచివాలయ సిబ్బంది తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏమీ అనలేని దుస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే తప్పా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ కష్టాలు తీరే దారి కనిపించడం లేదు...
తిరుమలలోని శ్రీవారి ప్రత్యేక దర్శనాల కోసం టిటిడి అక్టోబరు నెల కోటా రేపు(08.10.2020) విడుదల చేయనుంది. తొమ్మిరోజులకు సరిపడ టిక్కెట్లను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం అక్టోబరు 15 నుండి 24వ తేదీ వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 8న గురువారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. భక్తుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ప్రతీనెలా ఒకతేదిలో స్వామివారి దర్శనం కోసం ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయాలని కూడా టిటిడి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సేవలను ఆన్ లైన్ ద్వారా వీక్షించేందుకు కూడా సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచిన టిటిడి కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో స్వామివారి దర్శనాలను భక్తులకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది.
అయ్యన్న ఖబడ్దార్ అంటూ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు..ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా బీసీ మంత్రి అయిన నాపైన అభాండరాలు వేయటం క్షమించరాని నేరం. గతంలో బెంజ్ మినిస్టర్ అన్నారు. కనీసం బెంజ్ కారులో ఒక చక్రం కూడా నాదని టీడీపీ నేతలు నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. య్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్ని మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రంగా ఖండించారు. మీడియా ముందుకు వచ్చి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తే పరువునష్టం కేసు వేస్తానని హెచ్చరించారు. తాను కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారో పూర్తిగా తెల్సుకొని టీడీపీ నేతలు మాట్లాడాలన్నారు. ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నాయుడు జైల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రుడు తదితరులు నాపైన విమర్శలు చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడటకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి జయరాం హెచ్చరించారు..
విజయవాడక కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అక్టోబరు 17 నుంచి ప్రారంభిస్తున్నట్టు దుర్గగుడి అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అమ్మవారు 9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17న తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా, 19న శ్రీ గాయత్రీ దేవిగా, 20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా , 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా, 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవిగా, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతోపాటు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడానికి అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. రోజుకి ఎంతమందిని అమ్మవారి దర్శనానికి పంపాలనే విషయమై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ప్రకటించే అవకాశముంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై టిటిడి చేపట్టిన పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం 180 రోజులు(6 నెలలు) పూర్తి చేసుకుంది. మంగళవారం జరిగిన సుందరకాండ పారాయణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలోని శ్రీ కాశీవిశ్వనాథస్వామివారి ఆలయ ప్రధానార్చకులు ఆచార్య శ్రీకాంత్ మిశ్రా పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోని భక్తులు పెద్దసంఖ్యలో అనుసరించి తమ ఇళ్లలో పారాయణం చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మొదటగా "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వరకు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుందరకాండ పారాయణం ప్రారంభమై మంగళవారం నాటికి 118 రోజులు పూర్తి చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలు చేయడానికి సిద్ధమవుతున్నవేళ ఉద్యోగుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.. మరో వైపు గ్రామసచి వాలయ వ్యవస్థ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా తమకు కూడా ఈ పీఆర్సీలోనైనా జీతాల పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న లక్షా పదివేల మంది ఉద్యోగులకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతం అందుతుంది. ఇది తమకు ఏమూలకూ సరిపోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలో ఉద్యోగం చేస్తున్న 60శాతం మందికి కూడా కేవలం రూ.15వేలు మాత్రమే జీతం వస్తుందని వీరంతా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని భావిస్తే..కొన్నిశాఖల్లో మాత్రమే జీతాలు పెంచారని, కార్పోరేషన్లలో పనిచేస్తున్నవారికి జీతాలు ఒక్క పైసా కూడా పెరగలేదని చెబుతున్నారు. ధరలు ఆశాన్ని అంటుతున్న వేళ ప్రభుత్వం ఇచ్చే రూ.15 జీతం ఎలా సరిపోతుందని వీరంతా ప్రశ్నిస్తున్నారు. కనీసీ ఈ పీఆర్సీలోనైనా తమకు న్యాయంచేసి జీతాలు పెంచాలని వీరంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు..