1 ENS Live Breaking News

Tadepalle

2021-03-19 16:18:51

Hyderabad

2021-03-19 15:52:30

ఆర్.టి.సి బస్సులలో ఆక్యుపెన్సీ పెంచాలి..

ఆర్.టి.సి బస్సుల్లో  ఆక్యుపెన్సీ పెంచాలని ఆర్.టి.సి వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఆర్.పి.ఠాగూర్ అన్నారు. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఠాగూర్ శ్రీకాకుళం ఆర్.టి.సి డిపో, కాంప్లెక్సు ప్రాంతాలను తనిఖీ చేసారు. అనంతరం శ్రీకాకుళం ఒకటవ నంబరు డిపోలో ఆర్.టి.సి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసగించారు. ఆర్.టి.సి ఉద్యోగులది గురుతరమైన బాధ్యత అన్నారు. ఆక్యుపెన్సీ రేట్ పెంచాలని, మైలేజ్ పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి రోజు 8 లక్షల లీటర్ల డీజిల్ ను ఆర్.టి.సి వినియోగిస్తుందని ఆయన అన్నారు. మైలేజిని పెంచడం ద్వారా వినియోగం తగ్గించాలని తద్వారా ఆదాయం పెరిగే దిశగా అడుగులు వేయగలమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టుటకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రజల అవసరం మేరకు సేవలు మెరుగుపరచుటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల పనితీరు (పెర్ఫార్మెన్సు) మెరుగుపడాలని, ప్రజా రవాణా శాఖ స్వయం ప్రతిపత్తి దిశగా సాగలని తద్వారా  ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల పాత బకాయిలను చెల్లిస్తామని, పారితోషికాలను పునరుద్ధరిస్తామని ఎం.డి తెలిపారు. శ్రీకాకుళంలో డిపోలు, కాంప్లెక్సు విశాలంగా ఉన్నాయని చక్కని వాతావరణం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్ గా ప్రధమ స్ధానం సాధించిన ఎస్.వి.రమణకు రూ.5 వందల పారితోషికాన్ని అందించారు. ఇతర డిపోలలో పనిచేస్తు ఉత్తమ ఫలితాలు అందించిన వారికి పారితోషికాలను సంబంధిత డిపో మేనేజర్లకు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.సి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె.రవి కుమార్, రీజనల్ మేనేజర్ ఏ.అప్పల రాజు, డివిజనల్ మేనేజర్ జి.వరలక్ష్మి, డిపోమేనేజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Srikakulam

2021-03-19 15:12:17

అభ్యంతరాలు లేకపోతే ధృవపత్రాలు జారీ..

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్టు ఉత్తర్వుల పరిధికి లోబడి అభ్యంతరాలు లేని ఆక్రమణల ధృవపత్రాలు జారీకి వెంటనే చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ చెప్పారు. స్ధానిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో సిసియల్ఏ, రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, కృష్ణా జిల్లా కలెక్టరుతో గురువారం విజయవాడ పరిధిలోని ఆక్రమణలో ఉన్న స్ధలాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రభుత్వ, ఇరిగేషన్, తదితర ప్రభుత్వ శాఖల అధీనంలో ఉన్నస్ధలాల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వ నిబంధనలు మేరకు క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు. ఇప్పటికే అటువంటి భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. భూముల క్రమబద్దీకరణ విషయమై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోనికి తీసుకుని ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టరు ఏయండి. ఇంతియాజ్‌కు సూచించారు. విజయవాడ నగరంలోని కృష్ణలంక లెఫ్ట్ కెనాల్, విజయవాడ వెస్ట్, సెంట్రల్, నార్త్, ఈస్ట్ మండలాల పరిధిలోని ఆక్రమణల్లో ఉన్న స్ధలాల విషయాలను సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈసమావేశంలో సిసియల్ఏ స్పెషల్ సియస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూ సెక్రటరి వి.ఉషారాణి, ఇరిగేషన్ కార్యదర్శి జె. శ్యామలరావు, కృష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, కృష్ణాజిల్లా జలవనరుల శాఖాధికారులు పాల్గొన్నారు.

Vijayawada

2021-03-18 18:17:51

ఆ ఘనత ఎప్పటికీ డా.వైఎస్సార్ దే..కెసిఆర్

నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని  తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు పునరుద్ఘాటించారు. అలాంటి మంచి పనినిన మేమే అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని తమకు లేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్‌నిర్మిస్తామన్న కెసిఆర్ 9.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సభకు వివరించారు.  ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్‌ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో మా పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని వివరించారు. పెట్రోల్‌ ధరలను అదుపు చేయడం మా చేతుల్లో లేదన్న కేసీఆర్ ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్నివసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్

2021-03-17 15:36:26

Tadepalle

2021-03-16 20:44:43

Tadepalle

2021-03-16 20:30:16

Tadepalle

2021-03-16 20:19:10

వైఎస్సార్సీపీ లో రెబల్ రాజకీయాలు తొక్కిపడేస్తారా..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా  11 కార్పొరేషన్లలో (621 వార్డులు), 75 మున్సిపాలిటీల్లో భారీ విజయం సాధించిన  అధికార పార్టీ వైఎస్సార్సీపీ సొంతింటిలోనే రెబల్ బెడద వెంటాడుతోంది.. ఆవిషయం నగిరి ఎమ్మెల్యే ఆర్కెరోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న వైఎస్సార్సీపీ రెబల్ కేడర్ లో భారీ చర్చకు దారితీసింది. పార్టీని ఓడించడానికి సొంతగూటికి చెందిన  రెబల్స్ తెరవెనుక రాజకీయాలు చేయడం  సరైన పద్దతి కాదని, అలాంటి వారిని తొక్కిపడేస్తామని మీడియా ముఖంగా బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన రోజా వ్యాఖ్యలు ఇపుడు పార్టీలోనూ, వ్యతిరేక వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే రెబల్ అభ్యర్ధుల గొడవ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కనిపించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ పేరుతో బరిలోకి దింపిన అభ్యర్ధులు కాకాకుండా రెబల్ అభ్యర్ధులు కాస్త అధికంగా నెగ్గి ఆపై పార్టీ కండువాలు కప్పుకున్నారు. దీనితో పార్టీ పేరుతో బరిలోకి దిగి ఓడిపోయిన అభ్యర్ధులంతా ఇపుడు పీకల దాకా బాధను మింగుతూనే, బయటకు మాత్రం మామూలుగా కొనసాగుతూనే తెర వెనుక రాజకీయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా రెబల్ కేండిడేట్ లపై వార్నింగ్ లు ఇవ్వలేదు. కానీ ఫైర్ బ్రాండ్ రోజా నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన నేతలు, సమన్వయ కర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రెబల్ అభ్యర్ధులను ప్రోత్సహించకుండా పార్టీలో ఉన్న పలుకుబడి మొత్తం గాలి తీసేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతుంది. పార్టీ కోసం నిశ్వార్ధంగా పనిచేసిన వారికే పట్టం కట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు సూచించారనే విషయం రోజా వార్నింగ్ తరువాత బట్టబయలు అయ్యింది. అయితే పార్టీ గెలుపొందిన సీట్ల సంఖ్యను భారీగా చూపాలనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో ఇప్పటి వరకూ ఎవరూ రెబల్ కేండిడేట్ లకోసం మాట్లాడలేదు..వార్నింగులు కూడా ఇవ్వలేదు.. కానీ రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రతీ ఒక్కరినీ ఆలోచింప జేస్తున్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానమే రెబల్ కేండిడేట్ ల గాలి పక్కన పెట్టడానికి ఈ విధమైన వార్నింగ్ ను ఫైర్ బ్రాండ్ రోజాతో ఇప్పించి తద్వారా రెబల్ రాజకీయాలకు తెరదించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే ఇప్పటి వరకూ రెబల్ రాజకీయాలు చేసి, పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపునకు అడ్డు పడిన వారిని దూరం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికితోడు...నిన్నటి మున్సిపల్ ఫలితాలు రోజునే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన తొక్కిపడేస్తాం అనే డైలాగ్ ఇపుడు రాష్ట్రంలోని రెబల్ కేండిడేట్స్ లో భయం గంట మోగిస్తుంది. తమకు ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో బయటకు చెప్పుకోలేక మదన పడుతూ ఇప్పటివరకూ ఎన్నికల బరిలో ఓడిపోయి ఉన్నవారికి ఆర్కేరోజా వ్యాఖ్యలు కాస్త ఊరట నిచ్చాయి. చాలా మంది ఈ వార్నింగ్ ను లైట్ తీసుకున్నా.. ఈ వార్నింగ్ వెనుక పార్టీలో చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వార్నింగ్ ఫలితాలు, రెబల్ కేండిడేట్ లను, నాయకులను అధికారపార్టీ  ప్రభుత్వం వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు ఏవిధంగా పరిగణిగనిస్తారో వేచి చూడాలి. అదే సమయంలో ఎంతో ఖర్చుపెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన నిజమైన పార్టీ అభ్యర్ధులను ఏరకంగా ఆదుకుంటుందో కూడా వేచి చూడాలి..!

Tadepalle

2021-03-15 09:11:55

కర్పోరేషన్లలో 3 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం..

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వేగంతో అపుడే రాష్ట్రంలో మూడు మున్సిపల్ కార్పోరేషన్ల(కడప, చిత్తూరు) ను వైఎస్సార్సీపీ  సొంతం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా తన స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తుంది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు తమ స్థాలనా పరిస్థితి ఏంటనే విషయంపైనే లెక్కలు వేసుకుంటున్నారు.  వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 37 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ మున్సిపాలిటీల్లో టిడిపి ఒవార్డు, జనసేన  5 వార్డులు తన ఖాతాలో వేసుకోగా, బీజేపీ ఒక్క దగ్గర కూడా తన బోణి కొట్టలేదు. ప్రస్తుత మున్సిపల్ ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ పరిపాలనకు రిఫరెండంగానే వస్తున్నాయనే విషయాన్ని విశ్లేషకులు సైతం ప్రకటిస్తున్నారు.  విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం ఓట్ల తోపాటు  సేవ్ స్టీల్ ప్లాంట్,  అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. ఈ ఎన్సికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు చాలా స్పష్టంగా తమ ఆలోచన ఎలా వుందో తెలియజేశారు. ప్రస్తుతం ఇదే విషయం అన్ని మీడియా సంస్థల్లోనూ డిబేట్లలో కొనసాగుతుండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది..

Tadepalle

2021-03-14 10:57:24

ఏపీలో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి జోరు..

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుపెంచింది. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు ఎగిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 30 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ టిడిపి ఒ వార్డు, జనసేన కూడా తన స్థానాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది ఇప్పటి వరకూ 4 స్థానాలను జనసేన తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఎక్కడా ఇప్పటి వరకూ బోణీ కొట్టలేదు.  విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం సేవ్ స్టీల్ ప్లాంట్,  అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది.

Tadepalle

2021-03-14 10:44:32

మున్సిపోల్స్ లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ హవా..

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు ఎగిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 22 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ టిడిపి ఒ వార్డు, జనసేన కూడా తమ ఖాతాలు తెరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం సేవ్ స్టీల్ ప్లాంట్ అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది.

Tadepalle

2021-03-14 10:20:21

ఏపీలో మొదలైన మున్సిపల్ కౌంటింగ్..

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నకల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల క్రమంలోనే పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం  కౌంటింగ్‌ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఈ క్రమంలోనే తొలి ఫలితాల సంఖ్య ఉదయం పదిగంటలకు వచ్చే అవకాశం వుంది.

Tadepalle

2021-03-14 09:36:25

Tadepalle

2021-03-13 21:59:45