1 ENS Live Breaking News

సచివాలయాల్లో ఇక నిత్య స్పందన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇపుడు ఆ సేవలను మరింతగా పెంచాలని, గ్రామస్థాయిలో సమస్యలన్నీ సచివాలయాల్లోనే పరిష్కరించాలని యోచించి ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే సరికొత్త కార్యక్రమానికి తెరతీసింది. దీనితో ఇప్పటి వరకూ ఆడుతూపాడుతూ పనిచేసిన సచివాలయ సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి ఆయా శాఖలకు చెందిన వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించాలి. ఆతరువాత ప్రతీరోజూ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ సచివాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరించాలి. ఇలా ఏ సచివాయలం నుంచి ఎన్ని సమస్యలు పరిష్కరించారో కూడా ప్రభుత్వం దగ్గర డేష్ బోర్డులో నమోదు అవుతాయి. గతంలో మాదిరిగా తాము చాలా కష్టపడి పనిచేసేశామని సచివాలయ సిబ్బంది చెప్పడానికి వీలుండదు. వారు ఎంతలా పనిచేశారు..గ్రామంలో ఎన్ని సమస్యలు పరిష్కరించారనే దానిపై కంప్యూటర్ మొత్తం లెక్కలు తేలుస్తుంది. గతంలో సచివాలయాల్లో ప్రతీ సోమవారం మాత్రమే స్పందన నిర్వహించేవారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. దీనితో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలపై కలెక్టర్ కు అర్జీ పెట్టుకుంటే అదే దరఖాస్తు సచివాలయం వరకూ వచ్చేది. ఓ పనికి రెండు పనులు అయ్యేవి. దీనిపై కాస్త గట్టిగా ద్రుష్టి పెట్టిన ప్రభుత్వం గ్రామసచివాలయ పరిధిలోనే సమస్యలు పరిష్కరించేలా నిత్య స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాల్సి వుంటుంది. ఆ విషయాన్ని గ్రామవాలంటీర్లు వారికి కేటాయించిన 50 కుటుంబాల వారికి తెలియజేయాల్సి వుంటుంది. ఎవరికైనా సమస్యలపై దరఖాస్తు పెట్టడం రాకపోయినా వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తెలియజేయాలి. ఆవిధంగా  గ్రామంలోని సమస్యలను నేరుగా సచివాలయ సిబ్బంది పరిష్కరించాలి. వారి పరిధిలో పరిష్కారం కాని సమస్యలను మండల కేంద్రానికి పంపాలి. అలా అక్కడ కూడా పరిష్కారం కాకపోతే జిల్లా  కలెక్టర్ ద్రుష్టికి సమస్య వెళుతుంది. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. తద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి వినతులు తగ్గించి, వారిని పరిపాలన, అభివ్రుద్ధిపై ద్రుష్టి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామంలో సచివాలయాలు ఉన్నా నేటికీ జిల్లా కార్యాలయాలకు అత్యధిక స్థాయిలో స్పందన దరకాస్తులు రావడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఏ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమస్య పరిష్కారంలో చేయి తడిపే వ్యవహారాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల గ్రామసచివాలయాల జాయింట్ కలెక్టర్లకు ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. వాటి అపుడే జెసిలంతా జిల్లాలో స్పందన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో స్పందన కార్యక్రమం గ్రామసచివాలయాల్లో జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా, కొన్ని సచివాలయాల్లో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా విశేషం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా సచివాలయ సిబ్బంది ప్రతీరోజూ చేతినిండా పనిదొరకడంతోపాటు, గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారినికి మార్గం చూపించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిత్య స్పందన కార్యక్రమం ఏ స్థాయిలో విజయవంతం అవుతందనేది ఆరునెలల కాలలో తేలిపోతుంది.

Tadepalle

2021-03-05 09:09:46

Tadepalle

2021-03-05 08:09:55

ఆ పోస్టుకోసం ఆగమేఘాలపై రిలీవ్ అయిపోయారు..

తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అత్యధిక మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పనిష్మెంట్ పై రాజమండ్రి రూరల్ నుంచి వీర్ పురం  బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ సుభాషిణి ఆరు నెలలు విధుల్లో చేరకపోయినా విశాఖజిల్లాలో డిపీఓ(ఎఫ్ఏసి)గా చేరిపోవడానికి మాత్రం ఆగమేఘాలపై గురువారం రిలీవ్ అయిపోయారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఆమె శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిసి  డిపీఓగా ఆమె విధుల్లోకి చేరిపోవడానికి వచ్చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలు, మినిస్టీరియల్, విజిలెన్స్ విచారణలు ఎదుర్కొంటూ  రిపోర్టులు పెండింగ్ లోవున్న ఈ అధికారి నియామకాన్ని ఎలాగైనా ఆపాలని జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నప్పటికీ తన నెట్వర్క్ మొత్తం స్టేట్ లెవల్ లో వినియోగించి, జిల్లా మంత్రికి ఆమె పోస్టింగ్ విషయం తెలియజేయకుండానే  ఆమె విశాఖ వస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో జీవిఎంసీ ఎన్నికల విధినిర్వహణలో ఉన్న ప్రస్తుతం డిపీఓ క్రిష్ణకుమారిని కదిపే పరిస్థితిలేదు. కొత్తగా అధికారి వచ్చి చేరడానికి కూడా ఇక్కడ అధికారులు సముఖంగా లేరని సమాచారం. అయినప్పటికీ పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్య అధికారులు జారీ చేసి జీఓ ప్రకారం విశాఖలో ఎఫ్ఏసీ డిపిఓగా విధుల్లో చేరిపోవడానికి మాత్రం వచ్చేస్తున్నారు. ఈమె అవినీతి విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ఆధారాలతో సహా న్యూస్ కార్డ్స్ ప్రచురిస్తూ వస్తోంది. ఆపై తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇచ్చిన సమాచారంతో విశాఖజిల్లాలోని మీడియా కూడా ప్రత్యేక కధనాలు అందిస్తోంది కూడా. అవి విశాఖ పట్నం నుంచి రాజధాని అమరావతి వరకూ గత నాలుగు రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కపూటలో జీఓ రప్పించుకోవడమే కాకుండా అధికారులు ఉత్తర్వుల  ప్రకారం తన నియామకాన్ని ఏఒక్కరూ నిలుపుదల చేయలేరని భావించిన ఆ అధికారిణి శుక్రవారం విధుల్లో చేరడానికి సిద్దమయ్యారు. ఈ అధికారిణి పట్టుబట్టిన స్థానం కోసం విశాఖ జిల్లా అధికారులు సముఖంగా లేకపోయినా, పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్ర అధికారులు ఆదేశిస్తే ఆ అధికారిణి విశాఖజిల్లా డిపీఓగా చేరడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే ప్రస్తుతం వున్న డిపీఓ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక, ప్రభుత్వ నిబంధనలు, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ను ఇటు  విశాఖజిల్లా అధికారులు కూడా అమలు చేస్తే ఆ అధికారిణి విశాఖజిల్లాలో చేరడానికి మాత్రం ఆస్కారం వుండదు.  ఒక వేళ అప్పటికీ రాష్ట్ర అధికారులు ఒత్తిడితో విధుల్లోకి చేరినా, ఆపై న్యాయపరమైన ఇబ్బందులు సదరు అధికారిణి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణలు మధ్యలో వున్న సమయంలో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినందుకు రాష్ట్ర అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది. శుక్రవారం పదిగంటలు దాటితే ఏం జరుగుతుందనేది తేలిపోనుంది. ఉత్కంఠగా సాగుతున్న ఎ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈఎన్ఎస్ లైవ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం..!

Tadepalle

2021-03-04 21:04:53

Polavaram

2021-03-04 15:06:57

Visakhapatnam

2021-03-04 10:18:59

గ్రామసచివాలయ సేవలపై చైతన్యమేది..

గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై సుమారు 16 నెలలు కావొస్తున్నా..ఇంకా ఇక్కడ అందే సేవలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేదు.. కాదు కాదు సచివాలయ సిబ్బంది అవగాహన పెంచలేదు.  గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్లు ఉన్నా వాంతా పించన్లు ఇచ్చిన తరువాత కార్యాలయాల్లో పిచ్చాపాటి కబుర్లే పరిమితం అవుతున్నారు తప్పితే ప్రజలకు గ్రామసచివాలయాల్లో ఎన్ని ప్రభుత్వశాఖల సిబ్బంది ఉన్నారు, ఏ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి, ఏ సేవకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందించే సేవల వివరాలు ప్రజలకు తెలిసేలా చైతన్యం తీసుకు వస్తే..  జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి 50శాతనికి పైగా అర్జీలు తగ్గుతాయి. కానీ ఆదిశగా ప్రభుత్వం ముందడుగు వేయలేదు. రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామసచివాలయాల్లో తప్పితే మరెక్కడా సచివాలయ సేవలపై కనీసం ప్లెక్సీలుగానీ, బోర్డులు గానీ ఏర్పాటు చేయలేదు. చాలా సచివాలయాల్లో నేటికీ ఏ పనికి ఎంత మొత్తం చెల్లించాలో తెలియకపోవడంతో ప్రజలు ప్రభుత్వానికి, అక్కడ పనిచేసే సిబ్బందికి ఇద్దరికీ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు పెళ్లి ద్రువీకరణ పత్రానికి సచివాలయం ద్వారా ప్రభుత్వానికి చెల్లించే మొత్తం రూ.100 ఉంటే దానికి గ్రామసచివాలయాలు, దేవస్థానాల వద్ద ఉండే సచివాలయాల్లో తక్కువలో తక్కువ 3వేల నుంచి 5వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఆస్తి సర్వేకి రూ.700 ఛలానా వుంటే 2వేల నుంచి 5వేల వరకూ వసూలు చేస్తున్నారు. వీధిలైట్ల రిపేరుకి, కుళాయిల రిపేరికి అదే పరిస్థితి. చాలా పంచాయతీల్లో నేటికీ శానిటేషన్ సబ్బంది లేదక చెత్తను ఎత్తే నాధుడే లేడు. ఉన్న ఒక్క వ్యక్తి ఎంతో కొంత ఇస్తే తప్పా ఆ చెత్తను కూడా తీసుకెళ్లడం లేదు. అనుకున్న, అడిగిన మొత్తం ఇవ్వకపోవే ఆ పని పూర్తి కావడానికి, చేయడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డువచ్చి చివరాఖరి రోజు గానీ చేయడం లేదు.  ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రామసచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన 14శాఖల సిబ్బంది డ్యూటీ చార్టు ప్రకారం వారంతా ప్రజల్లోనే ఉండి, ప్రభుత్వ సేవల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన పరిస్థితి. కానీ చాలా చోట్ల సిబ్బంది మొత్తమంతా కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా సంరక్షణా కార్యదర్శిలు, ఆరోగ్య సహాయకులు మాత్రం వారికి కేటాయించిన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో సర్వేయర్లకు కూడా చేతినిండి పని దొరికింది. గ్రామ కార్యదర్శిలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. కానీ అధికారులు వచ్చినపుడు, ప్రజాప్రతినిధులు వచ్చినపుడు తప్పితే వీరు బయటకు వచ్చే పరిస్థితే కనిపించదు. మరికొందరు కార్యదర్శిలు వాలంటీర్లను సైతం వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే మీటింగుల పేరుతో ఉంచేస్తున్నారు. ఇంత జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రజలకు గ్రామసచివాలయాల ద్వారా అందించే సేవలు ఎలా తెలుస్తాయో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఇక వెల్పేర్ అసిస్టెంట్లు విషయానికొస్తే వారికి 1వ తేది నుంచి 15 వతేదీ వరకూ నిరంతరం పనిలో ఉంటారు. డిటిటల్ అసిస్టెంట్ కార్యాలయాలకే పరిమితం అవుతారు. వీఆర్వోలు ఉంటే సచివాలయంలో లేదంటే తహశీల్దార్ కార్యాలయంలోనూ ఉంటున్నారు. ఇలా ఎవరికి వారు ఎమునా తీరే అన్నట్టుగా ఉండటం, సమయం వచ్చినపుడు పనిచేసి మిగిలిన సమయాల్లో కార్యాలయాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు గ్రామసభలు ఏర్పాటు చేసిన సందర్భంలో నైనా ఏ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఎన్నిశాఖల సిబ్బంది ఉంటున్నారు, వారి ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయి, దానికి ప్రభుత్వానికి ఎంత ఛలానా కట్టాల్సివుంటుంది అనే కోణంపై నేటికీ ఒక్కసారికి కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చిన పాపన పోలేదు. సిబ్బంది ప్రొబిషన్ సమయంలోనే ఇలా వుంటే మరో ఆరు నెలల్లో వీరి ఉద్యోగాలన్నీ రెగ్యులర్ అయిన తరువాత మరింతగా వారికి నచ్చినట్టు విధులు నిర్వహించే అవకాశం వుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన విధులతోపాటు, సచివాలయం ద్వారా ఏ ఏ ప్రభుత్వ సేవలు అందిస్తున్నారో తెలియజేస్తే స్పందన కార్యక్రమానికి అర్జీలు పెరుగుతాయి. లేదంటే యదా రాజా తధా ప్రజా అన్నట్టుగా స్పందన అర్జీ పట్టుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లక తప్పదు. ఈ విషయంలో ప్రభుత్వంగానీ, సచివాలయాల శాఖ జెసిలుగానీ, జిల్లా పంచాయతీ అధికారులు గానీ, మండల స్థాయిలో ఎంపీడీఓలుగాని ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..! 

Tadepalle

2021-03-04 10:02:01

Tadepalle

2021-03-04 09:27:25

తాడేపల్లి

2021-03-04 09:04:46

Vijayawada

2021-03-03 18:36:51

రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు..

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా లబ్దిదారులు రేషన్ తీసుకొనే విధంగా పోర్టబిలిటీ ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు.  బుధవారం కొత్తగా ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థపైన, పంపిణీలో ఉన్న సమస్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 50 లక్షల మందికి ప్రతీ నెల క్రమం తప్పకుండా నిత్యవసర సరకులు అందించండం గొప్ప విషయమన్నారు.  సంచార వాహన యూనిట్లు ద్వారా నిత్యవసర సరకులు తీసుకొనే సౌకర్యం పొందడానికి వీలుగా వాలంటీర్లు ముందు రోజు కూపన్లు పంపిణీ చేసి సరకులు పంపిణీ విషయమై తెలియజేస్తారన్నారు. సరకులు సక్రమంగా సకాలంలో పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రజా పంపిణీ వ్యవస్థను సందర్శించిన సమయంలో కార్డు దారులు యొక్క సంతృప్తి స్థాయిని ఆయన పరిశీలించగా, సరియైన తూకంతో  నాణ్యమైన సరకులు అందుతున్నాయని కార్డుదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు.   ఎవరైనా ఎం.డి. ఆపరేటర్లు పని వదిలిపెట్టినట్లైతే వెంటనే ఆశక్తి గల వారితో భర్తీ చేసి నిరంతరాయంగా పంపిణీ జరిగేటట్లు చూడాలని ఆదేశించారు.  ఎం.డి.యు. లో ఉన్న తూనిక యంత్రాలను మరల ఒక సారి తనిఖీ చేసి ఒక వేళ మరమ్మత్తులు ఏమైనా ఉంటే తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని తూనికలు, కొలతలు శాఖ ఉప నియంత్రణాధికారిని ఆదేశించారు.  ప్రతీ రోజు రోజంతా పంపిణీ జరిపితే సచివాలయం వద్ద లేదా అందరికీ అనువైన ప్రదేశంలో సాయంత్రం 6 గంటలు నుండి 7 గంటలు వరకు వాహనం నిలిపి కార్డు దారులకు నిత్యవసర సరకులు పంపిణీ చేయాలన్నారు.    వాలంటీరు తన పరిధిలో గల కార్డుదారులు గుమిగూడకుండా పంపిణీ చేస్తే సమస్యలు ఉండవన్నారు.  ఏజన్సీలో కార్డు దారులకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే రేషన్ చేర్చడానికి ఐ.టి.డి.ఎ. పి.ఓ.తో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని పాడేరు ఆర్.డి.ఓ. లక్ష్మీ శివ జ్యోతిని ఆదేశించారు.  ప్రభుత్వం సరియైన తూకంతో నాణ్యమైన సరకులు అందిస్తున్నట్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  జిల్లాలోని సబ్ కలెక్టర్, ఆర్డిఓల అభిప్రాయాలను తీసుకున్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జిల్లాలో జరుగుచున్న ప్రజా పంపిణీ వ్యవస్థపై కమీషనర్ కు వివరించారు.   ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి,  నర్సీపట్నం డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు డివిజన్ల ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, డిఎస్ఓలు శివ ప్రసాద్, నిర్మాలాభాయ్, పౌర సరఫరాల డిఎం టి. వెంకటరమణ, తూనికలు కొతలతలు శాఖ ఉప నియంత్రణాధికారి సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-03 17:20:14

భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నా చిన్నచూపే..

సింగరేణి నుంచి ఏటా వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న కేంద్రం.. సంస్థను మాత్రం చిన్నచూపుచూస్తున్నది. అంత చిన్న సంస్థలతో తమకేం లాభమనేలాగా వ్యవహరిస్తున్నది. బొగ్గు తవ్వకాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభాలను గడిస్తూ.. ఇటు కార్మికుల సంక్షేమం, అటు దేశ ప్రతిష్ఠను చాటడంతో సింగరేణి బొగ్గు కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇటు రాష్ట్రంతోపాటు కేంద్రానికీ భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నది. వాస్తవానికి సింగరేణిలో రాష్ట్రవాటా 51శాతం కాగా, కేంద్రంవాటా 49. లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రవాటా అధికంగా కనిపిస్తున్నప్పటికీ ఆదాయం మాత్రం కేంద్రానికే అధికంగా వెళ్తున్నది. పన్నులు, ఇతరత్రా రూపంలో కేంద్రానికే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నది. వ్యాట్‌, సీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, డీఎంఎఫ్‌టీ, వర్క్స్‌ కాంట్రాక్ట్‌ట్యాక్స్‌, ఎంట్రీ ట్యాక్స్‌, రాయల్టీ, డివిడెండ్‌ను సింగరేణి రాష్ర్టానికి చెల్లిస్తుంది. కేంద్రానికి వచ్చేసరికి.. అడ్వాన్స్‌ట్యాక్స్‌, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌, ఫ్రింజ్‌ బెనిఫిట్‌ ట్యాక్స్‌ (ఎఫ్‌బీటీ), డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌, డివిడెండ్‌, స్టోవింగ్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఈడీ), కస్టమ్స్‌ డ్యూటీ, సెర్వీస్‌ టాక్స్‌ ఆన్‌ జీటీఏ, రెంట్స్‌ అండ్‌ అదర్స్‌, స్వచ్చ్‌భారత్‌ సెస్‌, క్రిషి కల్యాణ్‌ సెస్‌, ఐజీఎస్‌టీ, సీజీఎస్టీ, జీఎస్టీ కాంపన్సేషన్‌ సెస్‌, ఇంట్రెస్ట్‌ ఆన్‌ జీఎస్‌, క్లీన్‌ ఎనర్జీ సెస్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, ఎన్‌ఎంఈటీ, సంపద పన్ను (వెల్త్‌ టాక్స్‌) వంటివాటి కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సింగరేణి లాభాలను భారీగా పెంచుకుంటూ పోతున్నది. బాగా పనిచేసేవారి నుంచి బాదుకోవాలనే సూత్రంతో.. కేంద్రం అనేక పన్నుల రూపంలో సింగరేణి నుం చి 2014 తర్వాత ఇప్పటివరకు రూ.17,700 కోట్లు పొందింది. ఇదే సమయంలో రాష్ర్టానికి సింగరేణి చెల్లించిన మొత్తం రూ.15,012 కోట్లు మాత్రమే. కేంద్రం పొందిన ఆదాయంలో దాదా పు రూ.500 కోట్ల వరకు డివిడెండ్‌ కూడా ఉన్న ది. మొదట్లో రాష్ర్టానికి చెల్లించే మొత్తమే ఎక్కువగా ఉన్నప్పటికీ.. జీఎస్టీ ప్రారంభమయ్యాక కేంద్రానికి చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. సింగరేణి సంస్థ లాభాలను గణనీయంగా పెంచుకోవడం వల్లనే కేంద్రానికి ఆదాయం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో.. సీఎండీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో సింగరేణి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బొగ్గు ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నది. అదేస్థాయిలో కేంద్రానికి, రాష్ర్టానికికూడా పన్నులను చెల్లిస్తూ వస్తున్నది. కేంద్ర, రాష్ర్టాలకు కలిపి  ఆరేండ్లలో సింగరేణి సంస్థ చెల్లించిన మొత్తం రూ.32,704.39 కోట్లు.

Singareni

2021-03-03 16:50:51

Tadepalle

2021-03-03 13:53:30

Cyberabad Police

2021-03-01 13:18:02

సర్పంచ్ లు రెడీ సచివాలయాలు అన్ రెడీ..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్ల తరువాత పరిపాలన అందించేందుకు  గ్రామ పంచాయతీ సర్పంచ్ లు రెడీ అయిపోయారు.. కానీ వారు పరిపాలన అందించేందుకు గ్రామసచివాలయాలే ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యేనాటికి గ్రామసచివాలయాల్లోని భవనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఎంత యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించినప్పటికీ చాలా చోట్ల కొత్త భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. దీనితో పాత భవనాల్లోనే నూతన సర్పంచ్ లు ప్రమాణ స్వీకారాలు చేశారు. కొన్ని చోట్ల మాత్రం నూతన సచివాలయాలు పూర్తయ్యాయి. పూర్తయిన చోట సర్పంచ్ లు తమ కార్యదర్శిలతో నూతన భవనాల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభించగా, మిగిలిన నేటికీ అద్దెకు తీసుకున్న భవానాల్లోనూ, పాత భవనాల్లోనే తమ పాలనకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికల ముందు వరకూ గ్రామసచివాలయాల్లో సర్పంచ్ కు గదులనే సిద్ధం చేయలేదు. ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత గ్రామ సర్పంచ్ కి ప్రత్యేక గదులను తయారు చేశారు. అప్పటి వరకూ ఆ గదలను చాలా చోట్ల స్టోర్ రూమ్ లుగా నినియోగించాల్సి వచ్చింది. పదేళ్లుగా గ్రామపంచాయతీలకు సర్పంచ్ లు లేరేమో కార్యదర్శిల రాజ్యమే చెల్లింది. చాలా చోట్ల ప్రభుత్వ రికార్డులకు లెక్కా పత్రం లేదు. ప్రభుత్వం షడెన్ గా పంచాయతీలకు ఎన్నికలు పెట్టేసి సర్పంచ్ లను నియమించేయడంతో తేడా కార్యదర్శిల గొంతులో పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఈసారి చాలా వరకూ గ్రామపంచాయతీలకు చదువుతున్న యువత సర్పంచ్ లు గా ఎన్నిక కావడంతో అపుడే వారి ద్రుష్టి తేడాగా వ్యవహరించే  పంచాయతీ కార్యదర్శి నిర్వహించే రికార్డులుపై పడింది.  చాలా చోట్ల పంచాయతీల్లో అపుడే తేడా కార్యదర్శిల్లో ఆందోళన మొదలైంది. పదేళ్ల తరువాత మళ్లీ సర్పంచ్  ల పాలన రాష్ట్రంలో అమలులోకి రావడంతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు కొత్త సర్పంచ్ లు. ఈసారి సర్పంచ్ లకు ప్రభుత్వ శాఖల వారీగా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కూడా తోడయ్యారేమో వారి లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గ్రామ సచివాలయ భవనాలు పూర్తయితే ప్రజలకు కొత్త భవనాల నుంచే సచివాలయ సేవలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సచివాలయ భవన నిర్మాణ పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నిలకలు, ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు కూడా పూర్తయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి సచివాలయ పాలన అందుబాటులోకి వస్తుంది. గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు, వెటర్నరీ కేంద్రాలు, మల్టీపర్పస్ కేంద్రాల నిర్మాణాలు కూడా ప్రారంభమైపోతే సర్పంచ్ లకు, సిబ్బందికి చేతి నిండా పనిదొరుకుంది. ఈలోగా సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు కూడా రెగ్యులర్ అవుతాయేమో గ్రామ స్వరాజ్య పాలను అంతా ఒకేసారి సిద్ధమవుతారు.

Tadepalle

2021-03-01 10:46:02

ఏపీలో బీటెక్ నిరుద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల విలువైన భూములు తీసుకుంటూ స్థానికులకు ఉద్యోగాలిచ్చే విషయంలో  టెక్నాలజీ సాకు చూపి తప్పించుకునే సాఫ్ట్ వేర్ కంపెనీల ఆగడాలకు కాలం చెల్లింది. ఏపీలో సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టేవారు 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం ఇకపై పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంకల్పించింది. దీనికోసం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్రుష్టికి ఒక ప్రత్యేక ప్రతిపాదన తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ ప్రతిపాదన ప్రకారం సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వినియోగించే టెక్నాలజీలు ప్రభుత్వానికి ముందుగానే కంపెనీ స్థాపనకు ముందుగానే తెలియజేస్తాయి. లేదంటే ప్రభుత్వంలోని ఐటీశాఖ రాష్ట్రంలోని అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి టెక్నాలజీ వినియోగంపై డాటాను సేకరింస్తుంది. తద్వారా నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రాలు,  వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల ద్వారా విద్యార్ధులకు చదువుకునే సమయంలోనే ప్రత్యేకంగా సదరు సాఫ్ట్ వేర్ టెక్నాలజీలపైనా, ఇంగ్లీష్ నైపుణ్యం పెంపు పై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. విద్యార్ధుల డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువతున్న సమయంలోనే రాష్ట్రంలో కంపెనీలకు స్థలాలు తీసుకున్న యాజమాన్యాలు ఆయా వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల్లో కేంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. తద్వారా విద్యార్ధులకు డిగ్రీ పూర్తయ్యేనాటికే సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలోని ఐటీ పరిశ్రమను అభివ్రుద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.  అన్ని ఐటీ కంపెనీలకు ఈ నిబంధన వర్తింపజేసి రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతకు కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. కొత్తగా పెట్టబోయే కంపెనీలు స్థానికులకు ఉద్యోగ అశకాశాలు కల్పించకపోతే వారికి నిబంధనల ప్రకారం ఏపీఐఐసి ద్వారా స్థలాల కేటాయింపు జరగదని తెలుస్తుంది. ఇంత వరకూ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటుకి స్థలాలు తీసుకున్న కంపెనీలన్నీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వారు మా కంపెనీలు వినియోగించే టెక్నాలజీలు నేర్చుకోలేదని, వారు నేర్చుకుంటే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తామ చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించినా అవి రెండు లేదా మూడేళ్లు మాత్రమే  ఉంచి తీసేస్తున్నాయి. ఇకపై అలా ఉద్యోగాలిచ్చి తీసేయడానికి వీలుపడదు. కంపెనీలో చేరిన ఉద్యోగి ఆ ఉద్యోగానికి పనికారడని సాంకేతికంగా రుజువు అయినపుడు మాత్రమే ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలి. అలాకాకుండా ఎడాపెడా తీసుకున్న ఉద్యోగులను తీసేస్తామన్నా ఆ పనిజరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను అమలుచేయబోతుందట. అలాకాకుండా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కావాల్సిన టెక్నాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజి డెవలెప్ మెంట్ అన్నీ ప్రభుత్వం నిర్మించే నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రాలు,  వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులను భారీ జీతాలతోనే నియమించనుంది. వీరికి టార్గెట్లు కూడా పెట్టి ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఐటి ఉద్యోగాలిప్పించే స్థాయికి శిక్షణ ఇచ్చారనే కోణంలో వారిని పరిశీలిస్తుందని సమాచారం.  ఇదే జరిగితే సాఫ్ట్ వేర్ కంపెనీల ఆగడాలకు కాలం చెల్లడంతోపాటు, బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి సైతం సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరికే చాన్సు వుంది. సాఫ్ట్ వేర్ పార్కులు ఏర్పాటు చేసే జిల్లాల వారీగా ఈ నైపుణ్యశిక్షణ కేంద్రాలు, వ్రుత్తి నైపుణ్య విద్యాలయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది. ఐటీలో శిక్షణ తీసుకోవాలంటే ఇంజనీరింగ్ చదివిన వారికి ఆరునెలల సమయం పడుతుంది. అలాకాకుండా ప్రభుత్వం శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో అయితే చదువుతోపాటు శిక్షణ తీసుకుంటారు కనుక ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చే పనుండదు. ఇటీవల ఐటీశాఖ మంత్రి సాఫ్ట్ వేర్ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి దానిపై నివేదికను ముఖ్యమంత్రికి అందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేంతగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో భారీ ఉద్యోగాలతోపాటు, మంచి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువవుతాయి..!

Tadepalle

2021-03-01 09:15:35