1 ENS Live Breaking News

Tadepalle

2021-05-09 05:31:34

సచివాలయాల్లోనూ ఆన్ లైన్ పేమెంట్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ పన్నులు చెల్లించేందుకు ఆన్ లైన్, యూపిఐ పేమెంట్లు విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కొందరు కార్యదర్శిలు వసూలైన మొత్తాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, కొన్ని చోట్ల ఇదే విషయమై సస్పెండ్లు కావడం, బదిలీల సమయంలో రికార్డులు పూర్తిస్థాయిలో కొత్తగా వచ్చేవారికి అప్పగించకపోవడం వంటి కారణాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. మూడు నెలల వ్యవస్ధిలో సుమారు పదిమందికి పైగా పంచాయతీ కార్యదర్శిలు అవినీతి వ్యవహారాల్లో స్పెండ్ అవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. చాలా చోట్ల ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా ఉన్న చోట ఇప్పటికే అవినీతికి పాల్పడినందుకు సదరు మొత్తాలను వారే బాధ్యత వహించాలని నోటీసులు కూడా జారీచేశారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా కెఆర్ పురం ఎంపీడీఓకి సుమారు రూ.3లక్షల విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా కరనో సమయంలో ప్రజలు ఏ పనులు కావాలన్నా, పన్నులు కట్టాలన్నా సచివాలయాలకు వస్తున్నారు. దీనితో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయాలను పరిశీలించిన ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలోనూ, విద్యుత్ శాఖ ఏపీఈపీడీసిఎల్ లోనూ అమలు చేసిన ఆన్ లైన్ బిల్  పేమెంట్లు, ఆన్ లైన్ టేక్స్ విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోకూడా అమలు చేయడం ద్వారా సిబ్బందికి కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా కట్టిన మొత్తం నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా యోచన చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని లావాదేవీలకు ఆన్ లైన్ పేమెంట్లకు అనుసంధానించడంతో, గ్రామ, వార్డు సచివాలయాల్లో పొందే సేవలకు కూడా ఆన్ లైన్ పేమెంట్ విధానం అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు సచివాలయ వెబ్ సైట్, యూపీఐ ఐడిలకు సంబంధించి సాఫ్ట్ వేర్ రూపకల్పన జరుగుతున్నట్టుగా సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. నిజంగా యూపీఐ, ఆన్ లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వస్తే చాలా మందికి ఇంటిపన్నులు, కుళాయి పన్నులు సచివాలయాలు, పంచాయతీల చుట్టూ తిరిగి కట్టే పనుండదు. అంతేకాకుండా ఈ సందర్భంతో కొందరు పంచాయతీ సిబ్బంది పాల్పడే చేతివాటాలకు కూడా అడ్డుకట్ట పడటానికి కూడా ఆస్కారం వుంటుంది. కరోనా నియంత్రణ చర్యల్లో కాస్త బిజీగా వున్న ప్రభుత్వం మరో మూడు నాలుగు నెలల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తుందని చెబుతున్నారు. అన్ని పనులూ ఆన్ లైన్ ద్వారా టెక్నాలజీతో జరిపించే ప్రభుత్వం గ్రామసచివాలయం విషయంలో అదే టెక్నాలజీని వినియోగించుకోనుంది..

Tadepalle

2021-05-09 02:11:09

Tadepalle

2021-05-08 13:57:49

Tadepalle

2021-05-08 12:42:57

Tadepalle

2021-05-08 11:52:22

2021-05-08 09:49:52

తాడేపల్లి

2021-05-08 07:43:02

Visakhapatnam

2021-05-08 07:16:26

అల్లూరి ఏదీ భరత భూమిలో నీకు స్థానం..

రవి అస్థమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడ గడలాడించన యోధుడు..విశాఖ మన్యంలో మహోదయాన్ని స్రుష్టించిన ధీరుడు.. విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు  భరతమాత దాస్యశ్రుంఖలాలను తెంచడానికి అతి పిన్న వయస్సులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణత్యాగం త్యాగం చేసిన మహానుభావుడు. ఆయన భరతజాతికోసం చేసిన ఉద్యమం ప్రపంచం మొత్తం నేటికీ గర్విస్తుంది. కానీ ఆ మహోన్న వ్యక్తి పుట్టిన దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నేటికీ పాలకులు ఆయనకు ఒక సముచిత స్థానాన్ని కల్పించలేదు. 07-05-1897 ఆయన ఈ పుణ్యభూమిపై తుది శ్వాస వదిలిన రోజు. నేటికి 97 సంవత్సరాలు పూర్తవుతుంది. స్వాతంత్ర్య భారత దేశంలో నేటికీ అల్లూరిని పూర్తిస్థాయిలో పట్టించుకున్న ప్రభుత్వాలు లేవంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు..ప్రతీ భారతీయుడూ తలదించుకునే సందర్భం..సిగ్గు పడుతూనే ఆయన వీరోచిత పోరాటాన్ని మననం చేసుకుంటూ ఈ పధాలను వల్లెవేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటానికి గుర్తుగా నేటికీ పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన పేరుతో కనీసం ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయలేదు. ఏ  రాజకీయపార్టీ అయినా తమ ఎన్నికల ప్రచారంలో అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామనే ప్రచారంతోనే గద్దెనెక్కుతున్నాయి ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెడుతున్నాయి. నేటికీ అల్లూరి సీతారామరాజు చరిత్రపైనా, బ్రిటీషు కాలం నాటి గెజిట్ల పైనా నేటికీ తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేయలేదంటే అల్లూరి సీతరామరాజుకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో గౌరవాన్ని, స్థానాన్ని ఇస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయనాయకులకు ఊరూరా విగ్రహాలు, పాదయాత్రలకు పైలాన్లు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకొని రాజకీయం చేసే రాజకీయపార్టీలు అల్లూరి సీతారామరాజు వర్ధంతి, జయంతిలను అధికారికంగా ఏర్పాటు చేసి(వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం గత ఏడాది అధికారికంగా చేశారు) ఆయన చరిత్రను పాఠ్యాంశంగా అందించే యోచన చేయడం లేదు. బ్రిటీషు సేనలపై అల్లూరి చేసిన పోరాటం అత్యధికంగా విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట వేదికగానే సాగింది. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా, విశాఖ ఏజెన్సీలోని మన్య ప్రాంతంలోనూ సాగింది. కనీసం ఈ ప్రాంతాల్లోనైనా అల్లూరి విగ్రహాలను ఏర్పాటు చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏజెన్సీలక్ష్మీపురం గ్రామంలో మాత్రం అల్లూరి స్మారక మందిరాన్ని అభివ్రుద్ధి చేసి చేతులు దులుపుకున్నారు. అల్లూరి పుట్టిన ప్రదేశంలోగానీ, పోరాటం చేసిన ప్రాంతాల్లో గానీ ఆయన పేరుతో కనీసం గ్రంథాలయాలను సైతం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో వున్న వైఎస్సార్సీపీ సర్కారు కూడా అల్లూరిపేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి అపుడే రెండేళ్లుపూర్తవుతుంది. నేటికీ అతీ గతీ లేదు. అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి సమాంతర వ్యవస్థను క్రిష్ణదేవిపేటలో రచ్చబండ పంచాయతీల పేరుతో ఏర్పాటు చేసి మన్యం పితూరి ఉద్యమం ద్వారా తెల్లవాడిపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన పోరాటానికి గుర్తుగా క్రిష్ణదేవిపేట ప్రాంతాన్ని లేదా..దీనికి అనుబంధంగా వున్న ప్రస్తుతం రెవిన్యూ డివిజన్ కేంద్రంగా వున్న నర్సీపట్నం ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లగా ఉన్న డిమాండ్ కి అతీగతీ లేదు. ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చి అందులో ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చెప్పినా అదీనేటికీ జరగలేదు. భారతీయుల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరునికి ఏ ప్రభుత్వమూ సముచిత స్థానం కల్పించలేదనే విషయం 97 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నా పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు..అల్లూరి మన్నించు..నీకోసం ఇన్నేళ్లైనా ఏమీ చేయని మమ్మల్ని క్షమించు..ఇంకా ఇంకా నీ పేరుతో రాజకీయ హామీలు ఇస్తూ అధికారం వెలగబెడుతున్న మా హామీలు నీ విషయంలో 100ఏళ్లైయినా పూర్తయ్యేటట్టు లేవు. అల్లూరి సీతారామరాజుకి సముచిత స్థానం దక్కేవరకూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక మొబైల్ న్యూస్ యాప్ తరపున పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటిస్తున్నాం..జై అల్లూరి జై జై అల్లూరి..జోహార్ అల్లూరి..!

క్రిష్ణదేవిపేట

2021-05-07 02:52:30

గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు అధికార బదలాయింపు లేనట్టేనా..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికార బదలాయింపులకు పురిటి కష్టాలు వీడలేదు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నేటికీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే అన్ని అధికారాలు, నిధులు, రికార్డులు ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గ్రామసచివాలయాలను ఏర్పాటు చేసి అందులో గ్రేడ్-5 కార్యదర్శిలను ఏర్పాటు చేసినా వారంతా ఉత్సవ విగ్రహాల్లా కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన పనులు చేస్తూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన తరువాత కూడా సచివాలయాల వారీగా ప్రాంతాలు, రికార్డులు, నిధులు, పారిశుధ్య సిబ్బంది, వాహనాల విభజన నేటికీ అధికారులు చేపట్టలేదు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా గ్రేడ్-5 ఎంపీడీఓలు, డీపీఓలు, ఆఖరికి పంచాయతీరాజ్ కమిషనర్ కి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. పంచాయతీల్లో వీఆర్వోలను డిడిఓలుగా చేయడానికి జీఓని ఆఘమేఘాలపై తీసుకొచ్చిన ప్రభుత్వం..నేటికీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉండిపోయిన అధికార బదలాయింపు విషయంలో మాత్రం చర్యలు తీసుకోలేదు. దీనితో పేరుకే వీరు గ్రామ కార్యదర్శిలుగా ఉన్నారు తప్పితే వీరికి ఎలాంటి అధికారాలు లేవు. చాలా చోట్ల ప్రధాన పంచాయతీ కార్యాలయంలోనే నేటికీ సిబ్బంది మొత్తం బయోమెట్రిక్ వేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆఖరికి కాలువలు తీయాలన్నా, బ్లీచింగ్ చల్లాలన్నా, మంచినీటి పైపులు బాగుచేయించాలన్నా, శానిటేషన్ సిబ్బందితో పారిశుధ్య పనులు నిర్వహించాలన్నా కూడా గ్రేడ్-1 కార్యదర్శి చుట్టూ గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. తాజాగా వీఆర్వోలను పంచాయతీలకు డిడిఓలుగా చేస్తూ ఎపుడైతే ప్రభుత్వం జీఓనెంబరు 2 జారీచేసిందో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలంతా మరోసారి తమ హక్కులు, విధులు, అధికార బదలాయింపులపై మళ్లీ సమరం మొదలు పెట్టారు. ఎంపీడీఓలకు, డిపీఓలకు అర్జీలు చేస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ కూడా చేపట్టాలి. కానీ అలా చేయకుండా వదిలేయడంతో నేటికీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉంచేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటు ఎంపీడీఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆఖరికి జిల్లా కలెక్టర్లు కూడా వీరికి న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల్లో ప్రభుత్వ విధానంపై తీవ్ర అసహనం రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది. ఆది నుంచి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు, గ్రామసచివాలయాల్లోని తాజా పరిణాలమాలపై ప్రత్యేక కధనాలు ప్రచురిస్తూ వస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా అటు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతోంది. ఈ విషయంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు స్పందించే తరుణంలో కరోనా మహమ్మారి రావడంతో మళ్లీ సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు చేసే పనిలో పడ్డారు. అయినప్పటికీ కొత్తగా సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం నిర్ధిష్ట అధికారాలు, విధులు, అధికార విభజన లేని ఉద్యోగాలు చేస్తున్నామనే నిరాశతో ఉన్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ద్వివేది, ఈశాఖ కమిషనర్ గిరిజా శంకర్ లు చొరవ తీసుకుంటే తప్పా ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కనిపించడం లేదు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!


తాడేపల్లి

2021-05-07 01:47:54

కోవిడ్ కేర్ సెంటర్లో మెరుగైన వైద్యసేవలు..

 కోవిడ్ కేర్ సెంటర్ లో చేరే కరోనా బాధితులకు మెరుగైన వైద్య, ఆహార సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సిసిసి వైద్యులను ఆదేశించారు. గురువారం అల్లవరం మండలం బోడశకుర్రు కోవిడ్ కేర్ సెంటర్ ను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలను, భోజన, మౌలిక సదుపాయాల నిర్వహణ గురించి వైద్యులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్ లో చేరే రోగులను ట్రాయజింగ్ చేసి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్య సేవలు అందించాలని అన్నారు. సిసిసి లో చేరే రోగులకు గదులను క్రమ పద్ధతిలో కేటాయించి, అడ్మిట్ చేసుకోవాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ సమర్థవంతంగా పనిచేయాలని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రాంగణంలో వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా రోగులు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోగుల కొరకు వచ్చే వారిని లోపలికి రానివ్వకుండా చూడాలని, అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పేషంట్ల యొక్క వాహనాల పార్కింగ్ ను నిర్వహించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటకం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, అదేవిధంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, అవసరమైన వైద్య సహాయాన్ని త్వరితగతిన అందేలా చూడాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా సిసిసి లో చేరిన పాజిటివ్ రోగులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆహార సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితిని గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా మీ ఇంట్లో ఇంకెవరికైనా ఈ వ్యాధి సోకిందా, వారు ఇంట్లోనే వుంటున్నారా అని కలెక్టర్ రోగులను ఆరా తీశారు. ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉందని, త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని, అవసరమైన మేరకు మాత్రమే బయటకు రావాలని, తప్పనిసరిగా మాస్కును ధరించి, శుభ్రత, భౌతిక దూరం పాటించాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పమని కలెక్టర్ కోరారు. సిసిసిలో అందుతున్న వైద్య సేవలు, ఆహార సదుపాయాల పట్ల సంతృప్తి కరంగా వున్నట్లు ఈ సందర్భంగా రోగులు కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా  పేషంట్ ను అడ్మిట్ చేసుకునే విభాగాన్ని, ఇప్పటి వరకు చేరిన బాధితుల వివరాలు, హెల్ప్ డెస్క్, ట్రయేజ్ సెంటర్ ను, ఆక్సిజన్ సదుపాయాన్ని, మందుల నిల్వలు, పార్కింగ్, శానిటేషన్, విద్యుత్ నిర్వహణ, పార్కింగ్, తదితర అంశాలను సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.
                   ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, అల్లవరం తహశీల్దార్ ఎస్. అప్పారావు, మున్సిపల్ డిఇఇ అప్పలరాజు, వైద్యులు నితీష్ కుమార్, ఇంద్రావతి, తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం

2021-05-06 14:16:47

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు హర్షనీయం..

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్ గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అల్లూరి చరిత్ర పరిశోధకులు, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ మ్రుత్యువాత పడిన జర్నలిస్టులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాస్త భరోసా దక్కుతుందన్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా  ప్రకటించండం కూడా అభినందనీయమన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఈఎన్ఎస్ బాలు డిమాండ్ చేశారు. కరోనా అప్డేట్స్ ను ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ అందించేది ఒక్క మీడియానేనని అన్నారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు వందకు పైగా జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాంరు. ప్రభుత్వాలు బాధిత జర్నలిస్టుల కుటుంబాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాలను సత్వరమే అందించి మ్రుత్యువాత భారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

విశాఖపట్నం

2021-05-06 04:44:19

కరోనాలోనూ సచివాలయాల్లో బయోమెట్రిక్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో  గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు  అమలు చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా మార్చిన విధానం ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే అందరు ఉద్యోగులు ఖచ్చితంగా బయో మెట్రిక్ అటెండెన్సు(ఇన్, ఔట్) వేస్తే తప్పా వారికి జీతాలు పెట్టేది లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ వేస్తున్నారు. ఈ సమయంలో గర్భిణి/బాలింత మహిళా ఉద్యోగులు భయం భయంగా బయో మెట్రిక్ వేయాల్సి వస్తుంది. ఇదే క్రమంలో చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన కూడా పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే 15వేల జీతంలోనే ప్రత్యేకంగా శానిటైజర్లు, గ్లౌజ్ లు, మాస్కులు, ఫేస్ షీల్డులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఏ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియని తరుణంలో అందరు ఉద్యోగులు ఒకే బయో మెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం పట్ల ఎవరికైనా వైరస్ సోకితే సచివాలయంలోని అందరు ఉద్యోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని హడలి చస్తున్నారు. కాకపోతే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రతీరోజూ అందరూ బయో మెట్రిక్ వేస్తున్నప్పటికీ ఏ సచివాలయంలోనూ ప్రభుత్వం గానీ, జిల్లా అధికారులు గానీ కనీసం శానిటైజర్లును ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు హేండ్ గ్లౌజులు, ప్రజలు తీసుకొచ్చే కాగితాలు వేయడానికి ప్రత్యేక ప్లాస్టిక్ ట్రేలు ఏర్పాటు చేస్తున్నారని..కానీ గ్రామ సచివాలయాల్లో ఎక్కడా వీటిని ఏర్పాటు చేయక పోవడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తుంది. అందులోనూ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంతా కలిసి ఒకే బయో మెట్రిక్ మిషన్ ను వినియోగించడమే ఇక్కడ భయాందోళనకు గురిచేస్తుంది. వాలంటీర్లకి ఇచ్చిన 50 ఇళ్లకి  వెళూతూ, సచివాలయానికి వచ్చేటపుడు వీరంతా బయో మెట్రిక్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు బయట తిరిగే సమయంలో వీరి ద్వారా అయినా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. వాలంటీర్లు కూడా తప్పని సరిగా బయో మెట్రిక్ వేస్తే తప్పా వారికిచ్చే గౌరవ వేతనాలు రావని చెబుతుండటంతో వారు కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో చాలా ప్రభుత్వ శాఖల్లో బయో మెట్రిక్ అటెండెన్సు తీసేసినప్పటకీ గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రం అమలు చేయడం పట్ల ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కరోనా వైరస్ పూర్తిగా సమసి పోయేంతవరకూ అయినా అందరూ ఒకే చోట బయోమెట్రిక అటెండెన్సు వేసే విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అందరూ కింది స్థాయి సిబ్బందే కావడంతో ఎవరూ ఈ ఇబ్బందులను ఇటు జిల్లా కలెక్టర్, జెసి గ్రామ సచివాలయాలు ద్రుష్టికి తీసుకు వెళ్ల లేకపోతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్పా గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా సమయంలో సామూహికంగా ఒకే చోట బయో మెట్రిక్ అటెండెన్సు నుంచి ఈ కరోనా సమయంలో మినహాయింపు వచ్చేటట్టు కనిపించడం లేదు. 

తాడేపల్లి

2021-05-06 01:43:55

డయల్ యువర్ ఈఓ రద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించే డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ డా.జవహర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పరమైన కార్యక్రమాలను ద్రుష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో పనిచేసే అర్చకులు, సిబ్బందికి, అధికారులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2021-05-05 14:01:12

ఈ-ఫైలింగ్ కి దూరంగా సచివాలయాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ-ఫైలింగ్(ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సిస్టమ్) లేమి తీవ్రంగా వెంటాడుతోంది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సుమారు ఏడాదిన్నర కావొస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ-ఫైలింగ్ విధానం మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టడం లేదు. దీనితో అవినీతి అధికారులకు మండల, జిల్లాలో స్థాయిలో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రత్యక్షంగా ఇపుడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణ సెలవు నుంచి ప్రసూతి సెలవులు, వాటియొక్క సాలరీ బిల్లుల శాఖా పరమైన అనుమతుల కోసం జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.15వేల రూపాయల జీతంతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు సెలవులు, వాటి మంజూరు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇక సాధారణ ప్రజల అనుమతులైతే చెప్పాల్సిన పనేలేదు. వారికి సంబంధిత ద్రువీకరణ పత్రాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా శాఖల అనుమతులకు దరఖాస్తులు చేసుకునే వారంతా మండల కార్యాలయాల(ప్రభుత్వ శాఖలు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈఫైలింగ్ విధానం అమలు చేస్తే..గ్రామసచివాలయం నుంచి అప్ లోడ్ అయిన దరఖాస్తు మధ్యలో మండల శాఖ కార్యాలయం అనుమతి పొంది, ఆపై సంబంధిత జాల్లా శాఖ అధికారి అనుమతికి వెళుతుంది. అక్కడ కూడా అధికారుల క్రిందిస్థాయిలో జతచేసిన అనుబంధపత్రాల ఆధారంగా అనుమతులు నిర్ణీత సమయంలోనే అనుమతులు మంజూరు చేయడానికి ఆస్కారం వుంటుంది. అలాకాకుండా పాత కాగితపు దరఖాస్తు విధానమే నేటికీ అమలు జరుగుతుంటంతో దరఖాస్తు దారులు, ఉద్యోగుల దరఖాస్తులు ఎక్కడ పడేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అదే ఈఫైలింగ్ విధానంలో అయితే ఏ కార్యాలయంలో దరఖాస్తుదారుడు తొలుత అనుబంధ పత్రాలతో ఒక అనుమతికోసం దరఖాస్తుచేస్తాడో అవి మండల కార్యాలయం, జిల్లా కార్యాలయ అధికారుల అనుమతితో ఆన్ లైన్ లోనే తేదిలు, సమయాలతో సహా భద్రంగా ఉంటాయి. ప్రభుత్వం శాఖల అధికారులు కూడా నిర్ణీత సమయంలోనే అనుమతులు మంజూరు చేయడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే  గ్రామ సచివాలయం నుంచి దాఖలైన దరఖాస్తు మండల కేంద్రంలో ఆగిపోయినా, లేదంటే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి చేరకపోయినా అనుమతులు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మళ్లీ దరఖాస్తు దారులు గ్రామ సచివాలయాలకు వచ్చి ఇక్కడ దాఖలు చేసిన దరఖాస్తు నకలను, మండల కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తు నకలను, తీసుకొని జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. అక్కడ కూడా అధికారులు, సిబ్బందికి  ఖాళీ ఉంటే తప్పా అనుమలుతు వచ్చే పరిస్థితి ఉండదు.  అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులైతే ప్రత్యేక సెలవులు, ప్రసూతి సెలువుల అనుమతుల కోసం మరోసారి జిల్లా కార్యాలయాలకు వెళ్లడానికి సెలవులు పెట్టాల్సి వస్తుంది. ఆ ఫైళ్లకు మోక్షం కలగడానికి వీరికొచ్చే అతి తక్కువ జీతం నుంచి అధికారులకు, సిబ్బందికి మామూళ్లు సమర్పించాల్సి వస్తుంది. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ గిరిజా శంఖర్ చొరవ తీసుకుంటే తప్పా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఈఫైలింగ్ విధానం అందుబాటులోకి రాదు. ప్రజలకు సత్వరమే సేవలు కూడా అందే పరిస్థితి లేదు. ఈ శాఖలో పనిచేసే సుమారు లక్ష మంది ఉద్యోగులకు, అందులో పనిచేసే మహిళల ప్రసూతి సెలవులు, ప్రత్యేక సెలవులకు సంబంధించిన అనుమతులు కూడా సకాలంలో అందే పరిస్థితి కనిపంచడం లేదు. ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసు కుంటుందో వేచి చూడాలి..!

తాడేపల్లి

2021-05-05 06:48:12