1 ENS Live Breaking News

61.13% మందికి ఆరోగ్య శ్రీ సేవలు..

రాష్ట్రంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.13 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 79.59 శాతం ఆరోగ్య శ్రీ పథకం వైద్య సేవలు అందుకున్నారన్నారు. నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక శాతం మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 86,223 శాంపిళ్లు పరీక్షించగా, 11,421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయిని, 81 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,674 ఐసీయూ బెడ్లు, 7,527 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 14,658 మంది చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆక్సిజన్ వినియోగం రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేశామన్నారు. ఆక్సిజన్ అవసరం లేకపోవడం వల్ల తక్కువగా తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 16వ తేదీన 104 కాల్ సెంటర్ అభివృద్ధి పరిచిన నాటి నుంచి చూసుకుంటే గడిచిన 24 గంటల్లో  కాల్ సెంటర్ కు గతంలో కంటే తక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 3,427 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసం 468 కాల్స్ వచ్చాయన్నారు.  హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 23,285 మందితో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్లో మాట్లాడి సలహాలు సూచనలు అందజేశారన్నారు. 

Tadepalle

2021-06-03 16:33:15

విజిలెన్స్ కేసుల్లో రూ.9.90 కోట్ల వసూలు..

ఆంధ్రప్రదేశ్ లోని 89 ఆసుపత్రులపై విజిలెన్స్ తనిఖీలు చేసి, 66 కేసుల్లో రూ.9.90 కోట్ల వరకూ వసూలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో 1,187 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. 11,605 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 93 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వారి పేరున ఫిక్సడ్ డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెలకు రూ.5 వేలు వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనాధలైన చిన్నారుల గుర్తింపు కొనసాగుతోందన్నారు.

Tadepalle

2021-06-03 16:28:56

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం..

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 24 వేల నుంచి 11 వేలకు తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, తగ్గడం లేదంటూ కొందరు అవస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అవాస్తవాల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదముందన్నారు. వారం రోజుల నుంచి చూస్తే అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పు గోదావరిలో 3,400ల నుంచి 2,050 కేసులకు తగ్గాయన్నారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివీ రేటు మే 5నాటికి 17 శాతం ఉండగా, జూన్ 2వ తేదీ నాటికి 13 శాతానికి తగ్గిందన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న మే 17న 2,11,554 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో జూన్ 2వ తేదీ నాటికి 1,43,795 కేసులకు తగ్గాయని, గురువారం(జూన్ 3వతేదీ) నాటికి మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 91 శాతానికి పెరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో 99.2 వరకూ పెరగనుందన్నారు. మే 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 380 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, జూన్ 2వ తేదీకి 1582 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మే 17 నాటికి 433 ఆక్సిజన్‌ బెడ్లు మాత్రమే ఖాళీగా ఉంటే జూన్ 2వ తేదీ నాటికి 7,270 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయడానికి ఈ అంకెలు నిదర్శనమన్నారు. 

Tadepalle

2021-06-03 16:22:23

నెలాఖరుకి 58,72,370 టీకాలు..

జూన్ నెలాఖరు నాటికి 58,72,370 టీకాలు రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి 87,08,730 డోసులు వచ్చాయన్నారు. జూన్ 2 వ తేదీ రాత్రికి కేంద్రమిచ్చిన డోసుల్లో 5,67,970, ఏపీ ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన దాంట్లో 44.170 డోసులు అందుబాటులో ఉన్నాయని, మొత్తంగా  6,12,170 డోసుల స్టాక్ ఉందని తెలిపారు. ఇప్పటికి వరకూ 1,01,94,389 డోసులను పంపిణీ చేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి 36,94,210 డోసులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా 20,74,730 డోసులను కొనుగోలు చేయనున్నామని, ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మొత్తంగా చూస్తే జూన్ 30 వరకూ 58,72,370 డోసులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇప్పటికే జరుగుతున్న వ్యాక్సినేషన్ తో కలిపి జూన్ నెలాఖరు వరకూ 1.60 కోట్ల టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందన్నారు. కేంద్రమిచ్చే వ్యాక్సిన్ కోటా చాలకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. మే 13 తేదీన వ్యాక్సిన్ల కొనుగోలు నిమిత్తం  నోటిఫై చేశామని, జూన్ 3 సాయంత్రంలోగా బిడ్ ఫైల్ చేయాలని కోరుతూ గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. మే 20తేదీన నిర్వహించిన ప్రీబిడ్ లో మూడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. గడువు ముగిసినా ఎవరూ బిడ్ దాఖలు చేయలేదన్నారు. బిడ్ దాఖలకు మరో రెండు వారాలు గడువు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. యూపీ, కర్నాటక, రాజస్తాన్, ఒడిశా.. ఇలా దేశ వ్యాప్తంగా 9 ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా, బిడ్ దాఖలకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. 

Tadepalle

2021-06-03 16:20:10

అక్కా చెల్లమ్మలకు సొంతిల్లు కల సాకారం..

రాష్ట్ర ప్రభుత్వం  నవరత్నాలు` పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా నిరుపేద మహిళల పేరున నివేశన స్దలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి కనివిని ఎరుగని విధంగా పేదవారి స్వంతింటి కలను సాకారం దిశగా ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వె.ఎస్. జగన్మోహనరెడ్డి తెలిపారు. గురువారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయంనుంచి వర్చువల్‌ విధానంలో తొలిదశలో  వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలలో 15.60 లక్షల గృహాలను నిర్మించడానికి భూమి పూజ శంకుస్దాపనలు చేసారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులతో శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే సంకల్పించి అక్కాచెల్లెమ్మల పేరిటి ప్దలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.  మొదటి దశ శంకుస్దాపన, గృహ నిర్మాణాల ప్రారంభోత్సవాలు ఈనెల 3వ తేదీనుంచి 10వ తేదీవరకు కొవిడ్‌ నిబంధనలు ప్రకారం పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.  31 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇల్లు నిర్మించి,అందించే  బృహత్తర కార్యక్రమన్నారు. మొదటి దశ గృహ నిర్మాణాలు  జూన్‌ 2022 నాటికి పూర్తి చేయాలని, రెండవ దశలో 12లక్షల 70 వేలు గృహాలను జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.పిఎంఎవై అనుసంధానంలో గృహ నిర్మాణాలు వేగవంతంచేసి యుద్ద ప్రాతిపదికను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది కుటుంబాలకు గృహాలు మంజూరు చేసామని ఇంటికి నలుగురు చోప్పున వెరసి మొత్తం కోటి 24 లక్షల మందికి గృహయోగం కలుగుతుందన్నారు.  17,005 లేఅవుట్లలో  32,900 కోట్ల వ్యయంతో నిర్మాణాలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

 వీటిలో సుమారు రూ 4,120 కోట్లతో త్రాగునీటి వసతులు, రూ 22,587 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌  సి.సి రోడ్లు, రూ 4,986 కోట్లతో అండర్‌ గ్రౌండు విద్యుత్‌ పౌకర్యం, రూ 627 కోట్ల వ్యయంతో అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ పౌకర్యం, ఇతరు మౌలిక సదుపాయాలైన ఆఆర్‌బికె, గ్రామ విలేజ్‌ క్లినిక్‌ వంటి సదుపాయాలు కల్సించడం జరుగుతుందన్నారు. రూ 567 కోట్ల పిజికల్‌ ఇన్‌ప్రాస్టక్చర్‌ వపతులు రానున్నాయన్నారు. సౌకర్యాలు మంచి నాణ్యతా ప్రమాణాలతో ఉండేలా మరో అడుగు ముందుకు వేసామన్నారు.  మంచి నాణ్యతా ప్రమాణాలు అన్నింటిలోను పాటించడం జరుగుతుందన్నారు. కాలనీలు పూర్తి అయిన పిదప ఒక్కొక్క ఇంటి విలువ రూ 5 లక్షలనుంచి సుమారు రూ15 లక్షలవరకు ఉంటుందన్నారు.  మూడు రకాల ఆప్షన్లులో లబ్దిదారులు తమకు ఇష్టమైన విధంగా 340 చదరపు అడుగుల విస్తిర్ణంలో నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవచ్చునన్నారు. ఇంటి నిర్మాణంలో ఒక పడక గది, ఒక హాలు కిచెన్‌, వరండా, వసతులు వస్తాయని అదేవిధంగా  రెండు ప్యాన్లు, రెండు ట్యూట్‌సైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్‌ ట్యాంకు కూడా  అందించడం  చేయడం జరుగుతుందన్నారు.  కరోనా కష్ట కాలంలో ఈ కాలనీ ఇళ్ల నిర్మాణాలవల్ల గ్రామీణ ఆర్దిక వ్యవస్ద బలోపేతం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 30 రకాలువారికి  చేతినిండా  ఇటుకలు, తయారీ, ఇంటి నిర్మాణ పనులు లబించి ఆర్దిక  వ్యవస్ద బలపడనుందన్నారు. సిమ్మెంటు బస్తా రూ. 225 లకే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల స్దాయి మెటిరియల్‌ను గోడౌన్లు భద్రపర్చి లబ్దిదారులు అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ 1,80,000 గ్రాంటుగా అందించడం జరుగుతుందన్నారు. 

ఇళ్ల స్దలాలు జాబితా తమపేరు లేదని ఎవ్వరు బాధపడాల్సిన అవసరంలేదని మరలా దరఖాస్తు చేసుకుంటే 90 రోజులలో ఇంటి స్దలాన్ని కొనుగోలు చేసి    అందించడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.  ఊహకందని రీతిలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పూర్తిస్దాయిలో పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు నాల్గవ జాయింట్‌ కలెక్టరు పోష్టును మంజూరు చేసామని త్వరలో వీరి నియమాకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరు లబ్దిదారులుకు అన్ని విధాలుగా  చేయూతను అందించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా పూర్తిస్దాయిలో చర్యలు చేపడతారన్నారు. ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాదాన్యతగా తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 74 వేలమంది లబ్దిదారులుకు  స్దలాలు  కోర్డు కేసులు మూలంగా ఇప్పటికీ మంజూరు కాలేదని, కోర్డులు తెరచిన పిదప  వారికి న్యాయం చేసి స్దలాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌నారాయణ గుప్తతో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి అధికారులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

Tadepalle

2021-06-03 13:33:03

విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్..

విదేశాలకు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు 45 ఏళ్లలోపు ఉన్నా వారికి వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారనివైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను మార్గదర్శకాలు జారీచేశామన్నారు. విదేశాలకు వెళ్లేవారు ఆధార కార్డుకు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిన్ అప్లికేషన్ లో పొందుపరుచుకోవాలని సూచించారు. విదేశాల్లో పాస్ పోర్టుకు జతజేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. దీనివల్ల ఆధార్ నెంబర్ తో వ్యాక్సిన్ తీసుకున్న వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతమున్న నిబంధనల దృష్ట్యా పాస్ పోర్టు నెంబర్ జతజేసి రివైజ్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఇదే విషయం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించామని, కొవిన్ వ్యాక్సిన్ అప్లికేషన్ లో పాస్ పోర్టు నెంబర్  ను జతచేసేలా మార్పులు చేయాలని కోరామని తెలిపారు. కేంద్రం అందుకు అంగీకరించిన వెంటనే పాస్ పోర్టు జతచేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకిచ్చే స్టయిఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమకిచ్చే స్టయిఫండ్ ను పెంచాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామని తెలిపారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్డర్లు గత ఏడాది సెప్టెంబర్ లో విధుల్లోకి చేరారన్నారు. 800 పీజీ విద్యార్థుల వినతులపై చర్చించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Tadepalle

2021-06-03 04:15:30

గ్రామ, వార్డు సచివాలయాలు కీలకం కావాలి..

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడంలో కీలకం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల అధిపతులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధృవీకరణ పత్రాలతో సహా అన్నిరకాల సర్టిఫికెట్లు వారికి సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్‌ ఫార్మాట్‌లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉంచాలన్నారు. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంచడంతోపాటు, ఒక డిజిటిల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తం  70 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని వెల్లడించిన సీఎం 2023నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలన్నారు. అంతేకాకుండా పట్టణాల్లో యూఎల్బీ సర్వేని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, రెవెన్యూ కమిషనర్‌ (సర్వే సెటిల్‌మెంట్స్‌) సిద్దార్ధ జైన్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ఐజీ ఎంవీవీ శేషగిరిబాబు,  ముఖ్యమంత్రి ప్రధానసలహాదారు అజేయ కల్లంతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-02 13:47:20

ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా జాన్తానయ్..

ఆంధ్రప్రదేశ్ లో జూన్‌ 10 వరకు కర్ఫ్యూని  పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ..ప్రజల సౌకర్యార్ధం కర్ఫ్యూని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకూ మధ్యాహ్నాం 12 గంటలవరకూ పనిగంటలు కుదించినా గ్రామ, వార్డు సచివాలయ శాఖ సిబ్బందికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డ్యూటీలు వేస్తుండటం విశేషం. ఈ విషయంలో రాష్ట్రంలో ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.. పైగా సచివాలయ సిబ్బందికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంట వరకూ ప్రత్యేక డ్యూటీలు కోవిడ్ టీకా కేంద్రాల వద్ద వేస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్లను కోవిడ్ డ్యూటీలకు వినియోగించ రాదని సిఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు వారిని కూడా వదిలిపెట్టకుండా డ్యూటీలు వేస్తున్నారు. దీనితో ప్రజలు వివిధ సర్టిఫికేట్ల కోసం సచివాలయాలకు వెళ్లినా అక్కడ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడంతో ప్రజలు వెనుతిరగాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఒక్క గ్రామసచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయకపోవడం ఏంటని.. వీరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కారా..లేదంటే అన్ని ప్రభుత్వ శాఖలకూ ఉన్న ప్రత్యేక పనిగంటల సమయం కేవలం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికే అమలు చేయకూదని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. వాస్తవి విషయాలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లపోవడం, ప్రభుత్వ ఉత్తర్వులు గ్రామసచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయకపోవడం, వాటిని వీరి వరకూ చేర్చకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది.

Tadepalle

2021-05-31 08:36:45

ఆనందయ్య మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కరోనా కాలంలో ప్రజల పిట్టల్లా రాలిపోతున్న వేళ ఆనందయ్య ఆయుర్వేదక కరోనా విరుగుడు మందుని వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.  దీనితో ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎవరి ఇష్టానుసారం వారు మందును వాడుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అనందయ్య మందు వాడితే కచ్చితంగా కరోనా తగ్గుతుంది అనేందుకు ఆధారమైన నివేదిక ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య ఇచ్చే మందుల వల్ల హానీ కూడా లేదని తేలింది.  ఇలాంటి విపత్కర సమయంలో ఆనందయ్య మందు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న వేళ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందింది..

Tadepalle

2021-05-31 08:35:21

14మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 14మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి..వాటిని వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభిస్తున్నారు. సుమారు 8వేల కోట్లతో ఈ మెడికల్ కాలేజీలతోపాటు, అనుబంధంగా నర్శింగ్ కాలేజీలను కూడా ప్రారంభిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ కాలేజీల నిర్మాణం పూర్తయితే  ఒకేసారి 1400 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్ధులకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా వీటిలో అధిక సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గర విషయం. తద్వారా గిరిజన విద్యార్ధులు కూడా అధిక సంఖ్యలో వైద్య విద్యను అభ్యసించడానికి వీలు కలగడంతోపాటు, వారు నివశించే ప్రాంతాల్లోని గిరిజనులకు వారే వైద్యసేవలు చేసే అవకాశం దక్కుతుంది. 

Tadepalle

2021-05-31 06:19:51

నేడు నెరవేరనున్న డా.వైఎస్సార్ కల..

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రియతమ నేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం నేడు నెరవేరబోతుంది. ఏరోజైతే ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, ఉపాది కల్పిస్తామో ఆ రోజే మనం ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు చేసినట్టు వుతుందనే మాటలను నిజం చేస్తూ రాజన్న తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8వేల కోట్ల  16 మెడికల్ కాలేజీల స్థాపనకు ఈరోజు శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతుంది. వీటితోపాటు, నర్శింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రులకు ఈ మెడికల్ కళాశాలలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నారు. ఇకపై ప్రభుత్వ వైద్య విద్యను మరింత మంది నిరుపేద, తెలివైన విద్యార్ధులు అభ్యసించడానికి వీలుపడుతుంది. 16 కాలేజీలంటే సుమారుగా 1600 మెడికల్ సీట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వస్తున్నాయంటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంత దూరద్రుష్టితో ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో అధిక సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గర విషయం. తద్వారా గిరిజన విద్యార్ధులు కూడా అధిక సంఖ్యలో వైద్య విద్యను అభ్యసించడానికి వీలు కలగడంతోపాటు, వారు నివశించే ప్రాంతాల్లోని గిరిజనులకు వారే వైద్యసేవలు చేసే అవకాశం దక్కుతుంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు తోపాటు, అత్యాధునిక ల్యాబరేటరీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం వలన వ్యాధినిర్ధారణ, వైద్యసేవలు మరింతగా నిరుపేద ప్రజలకు మెరుగుపడనున్నాయి.

Tadepalle

2021-05-31 05:05:44

ఆన్ లైన్ లో శ్రీ కనక దుర్గమ్మ సేవలు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేయున్న శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివర్ల దేవస్థానంలోని శ్రీ కనక దుర్గమ్మ తల్లి వారి సేవలను ఆన్ లైన్ ద్వారా భక్తులకు చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు ఆలయ ఈఓ డి.బ్రమరాంబ తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో  భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ పి.అర్జునరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుగూల్ మీట్ లింక్ ద్వారా  google meet link (https://meet.google.com/nuw-kwsy-xsc)అమ్మవారి ఆలయంలో జరిగే అన్ని పూజల్లో భక్తులు పాల్గొని తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరుతున్నారు.

Vijayawada

2021-05-30 04:04:51

Tadepalle

2021-05-25 14:50:48

Tadepalle

2021-05-25 14:49:03