1 ENS Live Breaking News

విధినిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయి..

ప్రభుత్వ ఉద్యోగులు అందించిన సేవలే పదవికి గుర్తింపునిస్తాయని డిపిఆర్వో యల్.రమేష్ కొనియాడారు. పాలకొండ ఏపిఆర్వో గుర్రాల అప్పారావు పదవీ విరమణ కార్యక్రమం స్థానిక డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డిపిఆర్వో మాట్లాడుతూ, అప్పారావుకు ఏపని అప్పగించిన చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి పూర్తి చేసేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి సహనం, ఓర్పు అనేది ఉండాలని, అది ఆయన వద్ద చూసానని చెప్పారు. టైపిస్టుగా, సీనియర్ అసిస్టెంటుగా, సహాయ పౌర సంబంధాల అధికారిగా పనిచేసి పాలకొండ అదనపు పౌర సంబంధాల అధికారిగా పనిచేయడం ఆనందదాయకమన్నారు. ప్రతీ పనిని నేర్చుకోవలన్నా దృక్పథం ఆయన సొంతం అని, అలాగే అన్ని కళలు ఆయనకు వచ్చని శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలని, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

Srikakulam

2020-06-30 20:55:35

కరోనా నుంచి ప్రజలను కాపాడు స్వామి...గంట్ల

జగన్నాధస్వామి ఉత్సవాల్లో భాగంగా బలభద్ర, సుభద్ర సమేత శ్రీజగన్నాథ స్వామి శనివారం నరసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఈఏడాది రథోత్సవాన్ని నిర్వహించకుండా ఆలయంలోనే స్వామి దర్శనం కల్పిస్తున్నారు.. సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భక్తులకు జగన్నాథుడు స్వామి దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శిరీష తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు, పలువురు భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

Kotta Road

2020-06-27 13:33:45

తారకరామ కాలనీలో మంచినీటి కష్టాలు

అన్నవరం తారకరామా కాలనీ వాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తారకరామా కాలనీ కొండ దిగువున ఉన్న భారీ మంచినీ పథకం మరమ్మత్తులకు గురికావడంతో ఈ కష్టాలు ఏర్పాడ్డాయని మహిళలు చెబుతున్నారు. నీటి పంపింగ్ కోసం మోటారు వేస్తుంటే పైపుల ద్వారా నీరు బయటకు వచ్చేస్తుందని, దీంతో సిబ్బంది మోటారు వేయడం లేదన్నారు. గత రెండు రోజులుగా నీటికష్టాలు తమను వెంటాడుతున్నాయని, ఈప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ అధికారులు తక్షణమే స్పందించి నీటిపధకం పైపులీకేజీ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఎండాకాలం కావడంతో మంచినీ మహిళలమంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Annavaram Temple

2020-06-23 11:19:51

సతీష్ బాబు ప్రాణత్యాగం వృధాకాదు..కుమార్ రాజా

భారత్-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం వ్రుధాగా పోనివ్వమని డిసిసిబి డైరెక్టర్ సిహెచ్ కుమార్ రాజా అన్నారు. అన్నవరం శ్రీ సత్యగణపతి తోపుడు బండ్లు మరియు కాశీ తాళ్ల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి పాదాల చెంత యుద్ధంలో వీరమణం పొందిన సంతోష్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతి గర్వించదగ్గ అని కొనియాడారు. దేశంలో ప్రతీ పౌరుడూ చైనా దురంహకారాన్ని తిప్పికొట్టాలన్నారు. చైనా వస్తువులను, మొబైల్ యాప్ లను నిషేధించాలని అన్నారు. తోపుడు బండ్ల వర్తకులకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ బొమ్మిడి సత్యన్నారాయణ, సంఘం అధ్యక్షులు తాటిపాక శ్రీను, సభ్యులు ప్రసాద్, నాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

2020-06-21 14:48:08

సకల శుభాలకు గణపతి మంత్రమే మూలాధారం

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే... అనే శ్లోకం ప్రతీరోజూ ఏ పూజ చేసినా.. ఏ కార్యక్రమం చేసినా దీనిని చదుకొని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలుు లేకుండా కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు. అంతే కాకుండా ప్రతి నిత్యం గణపతి మూల మంత్రం చదువుకోవడం ద్వారా కూడా  సల శుభాలు సిద్ధిస్తాయనేది ప్రతీతి. దానికోసం ప్రతీ ఒక్కరూ ఆ ఉండ్రాళ్ల రాయుడిని ప్రతినిత్యం ఆయన మూల మంత్రంతో స్తుతించడం చాలా మంచిదని కూడా  గమనించాలి.. దానికోసం .. ఓ గం గణపతియే నమహా.. ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది. 


2020-06-19 12:42:34