కలియుగ ప్రత్యక్ష్య దైవం ఆ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి. ప్రక్రుతిలో ప్రతీచోటా ఆయన ఉంటారనడానికి నిదర్శనమే తిరుమల ఘాట్ రోడ్డులో ఒక కొండపై ఆయన ముఖ భింబపు రాయి పోలి వుంటుంది. ఆ స్వామివారి రూపానికి నిత్యం అక్కడ పూజారులు పూజలు చేస్తుంటారు. అదేదో మామూలు కొండ అయితే పర్లేదు...తిరుమల సప్తగిరులాయే. దీంతో నడుముకి తాడు కట్టుకొని, కవాల్సిన సామాన్లన్నీ కవరులో పెట్టుకొని, మరొకరి సహాయంలో శ్రీవారి రూపానికి దండలు వేయడంతోపాటు, కుంకుమ, పసుపు పెట్టి పూజలు చేస్తారు. అలాంటి అరుదైన ద్రుశ్యకావ్యం ఈఎన్ఎస్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించాలని సంకల్పించాం. సప్తగిరులలో ఒ శిలపై వెలసిన ఆ దేవ దేవునికి అక్కడి పురోహితులు ఏ స్థాయిలో సాహసం చేసి పూజలు చేస్తున్నారో మీరూ ఒక్కసారి చూడండి...గోవింద నామస్మరణతో స్వామివారికి పూజలు చేసే తీరు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పాటుకి గురిచేస్తుంది. కానీ ఆ స్వామివారి లీలలు ఎవరికీ అంతుపట్టవు కదా, స్వామి భక్తులతో ఎప్పుడు ఎక్కడ, ఏ విధంగా పూజలు చేయించుకుంటారో జీవికోటికి తెలియదు అనడానికి గరుడ పర్వతంపై ఉన్న ఆయన రూపానికి పూజలు చేయడం, అదీ భారీ ఎత్తులో ఉన్న కొండపై పురోహితులు సాహసం చేసి మరీ పూజలు చేయడం స్వామివారి మహిమగానే చెప్పవచ్చుననడానికి ఇదో నిదర్శనం...
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.' అంటూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహనరెడ్డి, కేసిఆర్ లు కూడా గిడుగుకి ఘనంగా నివాళులు అర్పించారు. అన్ని జిల్లాల్లోనూ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు మంత్రులు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివ్రుద్ధికి పాటుపడతామంటూ ప్రతిన బూనడంతో సహా అధికార భాషా సంఘం(తెలుగు) ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటిస్తామని కూడా స్పష్టం చేశారు....
వన్ దన్ వికాస్ కేంద్రం ద్వారా గిరిజన మహిళలకు ఉపాది పూర్తిస్థాయిలో కలుగుతుందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిలు అన్నారు. శుక్రవారం జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ వనభరంగి పాడు గ్రామంలో వన్ దన్ వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉపాది పొందుతున్నవారితోపాటు వీరు కూడా కుట్టు మిషన్లపై విస్తరాకులు కుట్టి అక్కడి మహిళలను చైతన్య పరిచారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మహిళలలు, విస్తరాకులర, ప్లేట్స్ తయారీ ద్వారా ఆర్ధికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూ, ఈ కేంద్రం ద్వారా ఉపాది పొందాలన్నారు. ఇలాంటి కేంద్రాలు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో విస్తరించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి జెడ్పిటిసి రెడ్డి అభ్యర్థి మత్స్య వెంకట్ లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గాయత్రీ దేవి, రాష్ట్ర కార్యదర్శి విశ్వేశ్వర రాజురు, సోలభం సర్పంచ్ హనుమత్ రావు ,జి మాడుగుల మండల అధ్యక్షుడు సత్యనారాయణ, డీపీఎం సత్యం నాయుడు,వెలుగు ఏపిడివో నాగేశ్వరరావు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
గిరిజనులకు లబ్ధిచేకూర్చడమే అటవీ హక్కుల చట్టం లక్ష్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి 11 మండలాల రెవెన్యూ అధికారులతో ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రి కార్యాలయం, గిరిజన సంక్షేమశాఖ శాఖ కార్యదర్శి (నిన్న27వ తేదీన) గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు పక్కాగా అమలుచేయాలన్నారు. నేటికి 12వేల ఎకరాలు మాత్రమే సర్వే పూర్తి చేసారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమోదించిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో సరిహద్దు రాయిని ఏర్పాటు చేసి, లభ్డిదారుని నిలబెట్టి ఫోటో తీసి గిరిభూమి వెబ్సైటులో నమోదు చేయాలని సూచించారు. డి ఎల్సీలో ఆమోదించిన జాబితాను గిరిభూమిలో నమోదు చేయాలని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి రెండు ఎకరాలకు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న ఆయన అర్హులు, అనర్హులను గుర్తింపు ఎలా చేయాలో వివరించారు.
కరోనా సమయంలో ప్రజలకు నిరంతరం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని ప్రముఖ వ్యాపార వేత్త వెలగానారాయణ రావు అన్నారు. గురువారం నర్సీపట్నం ఏఎస్పీ తుహిసిన్హాకి ఈ మేరకు సుమారు రూ.25వేలు విలువ చేసే రోగ నిరోదకశక్తి మందులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సేవలను గుర్తించి వ్యాపారవేత్తలు సహాయం చేయడం అభినందనీయమన్నారు. నర్సీపట్నంలోని పోలీసులందరికీ వీటిని పంపిణీ చేయిస్తామని అన్నారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీటిని అందజేస్తున్నట్టు చెప్పిన నారాయణరావు రానున్న కాలంలోనూ తమ తరపున పోలీసు అధికారులకు సహకరిస్తామని అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలు ఈవిధంగానే కొనసాగించాలని ఆకాంక్షించారు.
విశాఖ ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామాలను విస్తరించి, బయో మండలాలుగా ప్రకటించే విధంగా కోవేల్ ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు. గురువారం డి.గొందూరు క్లస్టర్ లో ప్రకటించిన కరకపుట్టు, గుర్రంపనుకు గ్రామాల్లోని రైతులు సాగుచేసిన ఐదంచెల విధానంలోని పంటలు, శ్రీ వరి, కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న రసాయన విధానం ద్వారా రైతులు పంటలను సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తులు కలుషితం అవడమే కాకుండా భూమి సారవంతం కోల్పోయి, ఆపై అవి తినే మానవాళిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కోవెల్ ఫౌండేషన్ సీఈఓ కృష్ణారావు, ఎమ్మెల్యేతో కలిసి, ఫౌండేషన్ లు సమకూర్చిన 77 వీడర్లు, 450 మంది రైతులకు ఎల్లో ప్లేట్స్, దీపపు ఎర్రలు, సుమారు 700 మంది రైతులకు రెండు కిలోల బెల్లం, రెండు కిలోల సెనగపిండి చొప్పున ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పంపిణీ చేశారు.
ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నవరం ఎస్ఐ శంకర్, ఎంపీడీఓ జె.రాంబాబులు హెచ్చరించారు. గురువారం టి.అగ్రహారం గ్రామంలో సర్వే నెంబరు 205లో 2.8 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని వైఎస్సార్ హౌసింగ్ కాలనీ కోసం చదును చేస్తున్నట్టు వివరించారు. అనంతరం సచివాలయ అధికారులను ఆదేశిస్తూ, వారం రోజుల్లో ఈ భూమిని పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చేసి ప్లాట్లు చేయాలని తహశీల్దార్ కె.సుబ్రమణ్యం రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మళ్లీ ఎవరైనా ఈ భూమిలో ఆక్రమణలకు పాల్పడితే తక్షణమే వివరాలు తెలియజేయాలని కూడా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నెల్లిపూడి గ్రామసచివాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆక్రమణలను తొలగించిన చెత్తను ప్రొక్లైన్, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ( ఐ.టి.పి.ఒ.) న్యూఢిల్లీ అండర్ సి.యస్.ఆర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ క్రింద 18 బేబీ వార్మర్స్, ఒక ఫొటో థెరపీ యూనిట్, నెబులైజర్స్-24 ఇతర వైద్య పరికరాలు అందజేశారని పాడేరు ఐటిడిఏ పిఓ డా.వెంకటేశ్వర్ సలిజామల తెలియజేశారు. బుధవారం వీటిని ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణం చల్లగా వుండటం వల్ల మరియు బరువు తక్కవతో జన్మించిన పిల్లల కు శరీర ఉష్ణోగ్రత తక్కువ వుంటుందని, వాళ్లకి హైపోథెర్మియా నుంచి రక్షించడానికి, టెంపరేచర్ రెగ్యులరైజ్ చెయ్యడానికి ఇది ఉపయోగపడుతుందని, పచ్చకామెర్లతో యున్న పిల్లలకు ఫొటో థెర్మియా ట్రీట్మెంట్ కి ఈ పరికరాలను వినియోగిస్తారని తెలిపారు. అలాగే నెబులైజర్స్ ఆస్త్మా రోగులకు, ఆయాసం అధికంగా వున్న రోగులకు ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఊపిరి తిత్తుల సమస్యలో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుందని ఈవిషయాలన్ని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వరప్రసాద్ ఈ సమావేశంలో తెలిపారు. కార్యక్రమం లో డాక్టర్ ప్రవీణ్ వర్మ , ఏజెన్సీ లోని పి.హెచ్. సి. డాక్టర్ లు మిగతావైద్య సిబ్బంది మరియు ఐటీడీఏ. ఏ.పి.ఓ.(జనరల్)ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాలకు వైద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నట్టు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. పసిపిల్లలకు వైద్య నిమిత్తం పరికరాలు పంపిణీ చేశారు. ఈసందర్గౌభంగా ఆమె మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో మందల కొనుగోలు అయ్యే ఖర్చు మంజూరు చేయటం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా రోగులు చోడవరం, విశాఖపట్నం వెళ్లకుండా ఇక్కడే వారికి వైద్య సేవలు అందేటట్లు చూడాలని తెలిపారు. ప్రస్తుతపరిస్థితుల్లో కరోనా ఎక్కువగా ఉన్నందున దానిని అధిగమించడానికి ఆసుపత్రులలో మందులు ఎక్కువగా వున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేనందున రోగులు డోలీలద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలకు వస్తున్నారని కాని ఇప్పుడు రోడ్లు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కరోనా సమయం లో వైద్యులు విరామం లేకుండా శ్రమిస్తున్నారని ఆమె వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ సలిజాముల వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైద్య పరికరాలు కొనుగోలు చేయుటకు సి.యస్.ఆర్. నిధులు మంజూరు చేస్తున్నామని ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ నిధులు 10లక్షలు మంజూరు అయ్యాయని 7 లక్షలు ఈ పరికరాలు కొనుగోలు చేయుటకు అయ్యాయని మరియు 3 లక్షలు ఆసుపత్రుల అభివృద్ధి కొరకు మంజూరు చేశామని అన్నారు. రోగులను తీసుకెళ్ళడానికి 14 అంబులెన్స్ లను కొత్త గా కొని వాడుతున్నామని అన్నారు.
శంఖవరం మండలకేంద్రంలో ఈ ఒక్కరోజే అత్యధికంగా39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 100 మందికి స్వాబ్ ర్యాపిడ్ టెస్టులు చేయగా అందులో 39 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరంలో విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
విశాఖమన్యం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మైదాన ప్రాంతాలతో పోటి పడుతుంది. ఐదువేల కేసులకు చేరువలో ఏజెన్సీలోని 11 మండలాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలోఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆదివారం నాటికి 4688 పాజిటివ్ కేసులు నమోదు కాగా,య ఇందులో 328 మాత్రమే కోలుకున్నారు. కోవిడ్ కేంద్రంలో 685 మంది చికిత్సలు పొందుతున్నారు. నిత్యం ఏదో చోట కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా, కరోనా మాత్రం గిరిపుత్రులను వెంటాడుతూనే వుంది. మరోవైపు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఈ కరోనా వైరస్ ప్రభావంపై అవగాహన కల్పించాల్సిన అవరముందని వక్తలు అభిప్రాయ పడుతున్నారు. వారిలో అవగాహన తీసుకువస్తే తప్పా, ఏజెన్సీ గ్రామాల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేటట్టు కనిపించడంలేదు...
విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలంలో సెల్ సిగ్నల్ లేక కొండలు, గుట్ట లపైకి వెళ్లాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య విశాఖపట్నం జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధక్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బొంగరం, లిగేంటి, గోమంగి, గుల్లేలు, పోయి పల్లి, పంచాయతీలలో సెల్ టవర్ , సెల్ సిగ్నల్ లేక, పది పదిహేను కిలోమీటర్లు దూరం ఈ కేవైసీ చేసుకోవడానికి డ్వాక్రా మహిళలు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. వారి సమస్యలపై తక్షణమే అధికారులు స్పందించి సెల్ సిగ్నల్ మెరుగు పరచడం కానీ, ఏపీ ఫైబర్ నెట్ సెంటర్లు ఏర్పాటుగానీ చేయాలన్నారు. డ్వాక్రా మహిళలు కొద్దిమందికి, లిస్టులో పేర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఆదివాసుల కష్టాల పై అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారహక్కుచట్టం కార్యకర్త చొరవతో ప్రభుత్వం ద్వారా 84 పేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు దక్కాయి.. ప్రభుత్వం పార్టీ నాయకులు తన్నీరు రాజారావుకి చుట్టమేమీ కాదని ఈవిషయంలో మరోసారి రుజువైంది. యస్.రాయవరం గ్రామంలో గుండ్రుబిల్లీ దగ్గర 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని అధికారం అడ్డుపెట్టుకొని బొలిశెట్టి గోవిందరావు అండదంటలతో తమ సొంత స్థలం లాగా గేట్లు వేసి మరీ సాగు చేసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, అవతలి వ్యక్తులను బెదిరించి మరీ సాగుచేసుకునేవారు. ఆ విషయాన్ని సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ప్రభుత్వం ద్రుష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లడంతో వాస్తవాలు తెలుసుకున్న రెవిన్యూ అధికారులు అనధికారికంగా వేసిన గేట్లను తొలగించి, ఆ భూమిని 84 కుటుంబాల పేదలకు ప్లాట్లు వేసి రిజిస్టర్ చేసింది. గ్రామంలో ఒక వ్యక్తిద్వారా జరిగిన మంచిపని ద్వారా అధికారపార్టీ నేతల భూ ఆక్రమణ వ్యవహారం బయటకు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోలుగుంట మండలం పనసలపాడు గిరిజనులు తమ గ్రామానికి రహదారి నిర్మిం చాలంటూ రోడ్డుపై మొక్కలు నాటుతూ వినూత్న నిరసన చేపట్టారు. శనివారం 15 కుటుంబాలకు చెందిన గిరిజ నులు తమ గోడు వెల్లబోసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పనసలపాడు నుండి రత్నం పేట పంచాయతీ కేంద్రానికి వెళ్లాలం టే బురదతో కూడిన ఇరుకు రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. కనీసం 108 వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. అనారోగ్యం వస్తే డోలు తో రోగులను రోడ్డు ప్రాంతానికి మోసుకొస్తున్నామని ఆవేదన వ్య క్తం చేశారు గ్రామస్తులు. రోడ్డు వేయడానికి ఉపాది పనుల క్రింద రూ. లక్ష విడుదల చేసినా ఆ రోడ్డు మాజీ సర్పంచ్ తన జిరాయితీ భూమిలో ఉందని పనులను అడ్డుకున్నారని చెబుతున్నారు. ఈ విషయమై ఆర్డీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్న గ్రామస్తులు గత్యంతరం లేక వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని కెవిపిఎస్ జిల్లాకార్యదర్శి చిరంజీవి చెబుతు న్నారు. తమ గ్రామానికి రోడ్డు వేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన తప్పదని చెబుతున్నారు. కార్యక్రమంలో సిపిఎం జి కార్యవర్గ సభ్యుడు ఆదివాసీ నాయకులు చంద్ర రావు గ్రామ మహిళలు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తెలియజేసేందకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాండవ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఆయన గురువారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల నేపథ్యంలో ఇన్ఫ్లో కొనసాగుతోందన్నారు. దీని గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 379.1 అడుగులకు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు.