1 ENS Live Breaking News

కరోనా ద్రుష్ట్యా యూనివర్శిటీ పరీక్షలు రద్దు చేయాలి..

దేశంలో,రాష్ట్రంలో కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పరీక్షలు పెట్టి  వారి ప్రాణాలతో ఆటలు అడుతోందని ఎస్ఎఫ్ఐ మండలఎం.గంగాసూరిబాబు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ అల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు స్థానిక శంఖవరం తహశీల్దార్ కార్యలయం విద్యార్ధులు  నిరసన తెలియజేయజేశారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షుడు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితి లో దేశ వ్యాప్తంగా జరుగుతున్న జెఈఈ పరిక్షలకి మన రాష్ట్ర లో 30శాతం మంది పైగా విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. పరిక్ష రాయడానికి కూడా సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారుని ఆరోపించారు.  దేశ వ్యాప్తంగా జరగబోయే నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షలను కూడా తక్షణమే నిలుపుద చేయాలన్నారు.   జిల్లా లో కరోనా కేసులు పెరుగుతున్న పట్టించుకోకుండా  పరిక్షలు నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వుంటుందన్నారు.  అనంతరం శంఖవరం మండలం తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శి బి.శివరాజు, సహయకార్యదర్శి పి.శివ మాదవ్, ఉపాద్యక్షులు పి.కుశరాజు, తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2020-09-02 16:54:37

వార్త ప్రసాద్ కుటుంబానికి రూ.2.12లక్షల ఆర్థిక సహాయం.

విశాఖజిల్లాలోని గాజువాకలో వార్త దినపత్రికలో పనిచేస్తూ మరణచించిన ప్రసాద్ కుటుంబానికి  గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇంచార్జ్ దేవన్ రూ.2.12లక్షలు ఆర్దిక సహాయం అందజేశారు. బుధవారం ఈ మేరకు ఆ మొత్తాన్ని ప్రసాద్ కుటుంబానికి వీరు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రసాద్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎంతో చక్కగా వ్యవహరిస్తూ,  ప్రజా సమస్యలపై మంచి వార్తా కధనాలు రాసేవారన్నారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మరణిచండం ఎంతగానో కలచివేసిందన్నారు. ఆర్ధిక సహాయంలో గాజువాక నియోజకవర్గ జర్నలిస్టులు రూ. 67500 ,అలాగే  ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పిలుపుతో వ్తెఎస్సార్సీపి కార్పొరేటు అభ్యుర్దులు, నాయకులు స్పందించి రూ. 1.15 లక్షలు, బిజేపి నాయకులు రూ.15వేలు, జనసేన ఐదువేలు,బయట వ్యక్తులు రూ.10 వేలు సహాయం అందించారు. అంతేకాకుండా  ఎమ్మెల్యే స్పందిస్తూ, జర్నలిస్ట్  ప్రసాదు పిల్లలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.  అలాగే తిప్పల దేవన్ రెడ్డి,వైసీపీ నాయకులు దర్మాల శ్రీను, గౌస్, జర్నలిస్టులు మూల. గిరిబాబు, సాక్షి శశి, శేషు, పరశురాము,గుప్తా,మూర్తి, సాయి, శిరీష, సందీప్.గోవింద్, కృష్ణ, కృష్ణశ్రీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2020-09-02 16:51:20

పేదల గుండెల్లో నిలిచిన మహా మనిషి డా. వైఎస్సార్...

మహానేత స్వర్గీయ డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలు మరువలేని మహా మనిషి అని  గాజువాక నియోజకవర్గం  ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. డా.వై ఎస్సార్  11 వ వర్ధంతి కార్యక్రమాన్ని  87 వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి కార్పోరేటర్ అభ్యర్థి బొడ్డ గోవింద్ ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  దేవన్ రెడ్డి మాట్లాడుతూ, మరణం లేని మహనీయుడు మన ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ మాత్రమేనన్నారు.  అనంతరం వృద్ధులకు, నిరుపేదలకు పండ్లు,  రొట్టెలు, దుస్తులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ, వడ్లపూడి ఈశ్వరరావు, బొడ్డ వెంకటసూరి, దుగ్గపు సూరిబాబు, గెద్దాడ చిన్న అప్పన్న, దరిగి రవి, దుగ్గపు సత్యనారాయణ, దొడ్డి వెంకటసత్యనారాయ, నరసింహ మూర్తి,  పిన్నింటి సంతోష్, చిత్రాడ రాజు, హరీష్ వర్మ, కాండ్రేగుల కనక లక్ష్మి,  గాలి నూకరాజు, ఇర్ని వెంకట్రావు, అప్పారావు, బద్దెమ్ ప్రసాద్, డి ఎన్ మూర్తి, కణితి శ్రీను, రాజు, గురుగుబెల్లి అప్పలస్వామి, బొడ్డ దామోదర్, గేదల ఆరుద్ర,  ఎన్ శంకర్, పి ఆనందరావు, పి మురళి, రాజకుమార్, శ్రీనివాస్, రమణ, ఎన్ వి రమణ, ప్రసాద్, లక్ష్మణ రావు, సూరిబాబు, అజయ్, శ్రీను, ఝాసువా, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.

Kurmannapalem

2020-09-02 16:07:06

మోడ్రన్ టెక్నాలజీపై సర్వేయర్లకు శిక్షణ..ఆర్డీఓ

సర్వేయర్లు నూతన సాంకేతిక విధానాల ద్వారా సర్వే చేయడం నేర్చుకుంటే రాబోయే  భూసర్వేకి ఎంతో ఉపయుక్తంగా వుంటుందని పాడేరు ఆర్డీఓ కె.లక్ష్మి శివజ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం మోడరన్ టెక్నాలజీ మీద గ్రామ సర్వేయర్ లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదటి దశ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వేయర్లకు నూతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చిన అన్ని అంశాల్లో వీరిని సమర్ధవంతంగా తయారు చేయాలని భావించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశ లో భాగంగా తేదీ 02-09-2020 నుండి 01-10-2020 వరకు పి.ఎమ్.ఆర్. సి. లో జరుగుతుందని ఆమె చెప్పారు. ఈశిక్షణలో సర్వేయర్లు పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకొని ప్రభుత్వ సర్వేకి అనుగుణంగా తయారు కావాలన్నారు. కొత్తగా టెక్నాలజీపై ఇచ్చే శిక్షణ పూర్తిస్థాయిలో పొందడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ కార్యక్రమం లో బి.య న్. ప్రసాద్ ( డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వేయర్) మరియు పి.శ్యామ్ ప్రసాద్ ( ఏ.ఓ.) తదితరులు పాల్గొన్నారు.    

Paderu

2020-09-02 15:10:51

దేశంలోనే తిరుగులేని నేత దివంగత వైఎస్సార్...పర్వత

దేశంలోనే తిరుగులేని నేతగా దివంగ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరెడ్డి ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండి పోతారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని శంఖవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన మార్గదర్శకంలో జీవితాంతం కొనసాగుతామని చెప్పిన ఆయన అదే స్పూర్తిని నేడు ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహనరెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పారు. 108, ఉచిత విద్య, పేదవాడికి గూడు లాంటి పథకాలు కల్పించిన దేవుడు వైఎస్సార్ అని, అందుకే తెలుగు ప్రజలు ఆయనను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని అన్నారు. ఆ మహానేత మనలో లేకపోయినా ఆయన ప్రవేశ పెట్టిన పథకాల్లో ఎల్లప్పుడూ బతికే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శంఖవరం

2020-09-02 11:19:53

మడమతిప్పని..మాట తప్పని నాయకుడు వైఎస్సార్

దివంగత నేత వైఎస్సార్ గారి 11వ వర్ధంతిని బుధవారం గొలుగొండ మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు ఆధ్వర్యంలో ఏఎల్ పురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ అమర్ రహే,వైఎస్సార్ లాంగ్ లివ్, జోహార్ రాజన్న అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాస్కరనాయుడు మాట్లాడుతూ, మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు ఒకే ఒక్కడు వైఎస్సార్ అని కొనియడారు. ఆయన దయతో ఎంతో మందివిద్యార్ధులు ఉచితంగా చదువుకోవడానికి వీలుపడిందన్నారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడే ఆపద్భాందవి 108 అంబులెన్సుని  ప్రవేశ పెట్టిన మహనీయుడని, ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో  వైసీపీ నాయకులు రుత్తల రామకృష్ణ మహిళలు నాయకులు ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

ఏఎల్ పురం

2020-09-02 11:01:25

నేటి నాయకులకు వైఎస్సార్ ఒక దిక్సూచి...గిరిబాబు

దివంగత నేత వైఎస్సార్ గారి 11వ వర్ధంతి కార్యక్రమం చీడిగుమ్మలలో వైఎస్సార్సీపీ నేత గిరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, దివంగత నేత స్ఫూర్తి తోనే వైఎస్సార్సీపీ పాలన శుభిక్షంగా సాగుతోందని అన్నారు. ఎన్నాళ్ళు బ్రతికాం అనేది కాదు.. ప్రజల గుండెల్లో నిలిచేలా కొన్నాళ్ళు బ్రతికినా చాలు అనే మాటతో రాజకీయాలలో విలువలు నింపిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని ప్రజాపాలనలో ముందుకు సాగుతామని చెప్పారు.  నేటి తరాల నాయకులకు వైఎస్సార్ ఒక మార్గ దర్శి అన్న గిరిబాబు ఆయన పేరుతో ప్రారంభ పార్టీలో, ప్రజలు సేవచేయడం ఆనందంగా వుందన్నారు. వైఎస్సార్ స్పూర్తితో నేడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజలకు 90శాతం అందించగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమం లో కసిరెడ్డి సత్యనారాయణ, మర్రి అప్పలనాయుడు, గండి శ్రీను, ఇటంశెట్టి రామక్రిష్ణ, లెక్కల అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చీడిగుమ్మల

2020-09-02 10:24:57

కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి

కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు అన్నారు. మంగళవారం ఏజెన్సీలక్ష్మీపురం సచివాలంయలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు జతల ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామసచివాలయాల్లో పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఆవిషయాన్ని గుర్తించే ఈ సేవాకార్యక్రమం చేపట్టినట్టు ఆయన వివరించారు. కరోనా వైరస్ కేసులు విస్తరిస్తున్న సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి గ్రామాలను చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో విశేషంగా కష్టపడుతున్నారని అన్నారు. అంతేకాకండా పారిశుధ్య పనులు నిర్వహించే సమయంలో చేతి గ్లౌజులు, కాలికి రబ్బురు బూట్లు లేకుండా చెత్త ఎత్తకూడదని సూచించారు. అదే సమయంలో మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం ఎక్కడా తేడా రాకుండా చేయాలన్న ఆయన చెత్తలేకపోతే, ప్రజల ఆరోగ్యం శుభిక్షంగా వుంటుందని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు.

ఏజెన్సీ లక్ష్మీపురం

2020-09-01 20:48:00

ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

రాష్ట్రంలో ఎరువులు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు​ తీసుకుంటామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు.  మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని చోట్ల వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. 80 శాతం మేర నాట్లు పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అవసరానికి మించిన ఫెర్టిలైజర్స్‌ అందుబాటులో ఉన్నాయమని మంత్రి స్పష్టం చేశారు. అధికారులుగానీ, సిబ్బంది గానీ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. సెప్టెంబర్‌ 15 తర్వాత వ్యవసాయ యంత్రాలతో ఎగ్జిబిషన్ల ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి.. సీడ్‌ విలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైతులకు రుణాలు ప్రభుత్వం ద్వారా అందిజేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) సొంత భవనాల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఆర్బీకే స్థాయిలో పాల సేకరణ చేపట్టేందుకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. వ్యవసాయ శాఖకు చెందిన సహాయకులకు వేరే పనులు అప్పగించవద్దని జేసీలను మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఆ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాల్లోని కార్యదర్శిలకు చేర్చాలన్నారు.

Amaravati

2020-09-01 20:44:20

శ్రీ పద్మావతి అమ్మవారికి పవిత్ర సమర్పణ

తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్య అర్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యా హ్నం 12.30 గంట వ‌ర‌కు పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో  అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకా రానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.  కాగా సాయంత్ర 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్   ఆలయ డెప్యూటీ ఈవో  ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, కంకణభట్టార్  మణికంఠస్వామి, సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి పాల్గొన్నారు.

Tiruchanur

2020-09-01 19:12:40

ఐటిడిఏ కార్యాలయ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు

పాడేరు  ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్  సలిజామల  వ్యక్తిగత సిబ్బంది , క్యాంప్ కార్యాలయం సిబ్బందికి మంగళవారం క్యాంపుకార్యాలయంలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం పీఓ కూడా కుటుంబ సమేతంగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించినట్టు పిఓ వెల్లడించారు. టెస్టులు అనంతరం ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా నిత్యం మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. సాధ్యమైనం త వరకూ ఎవరికీ షేక్ హేండ్ ఇవ్వకూడదన్నారు. అంతేకాకుండా కార్యాలయానికి వచ్చినపుడు, ఇంటికి వెళ్లిన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మాస్కులు కూడా వాడిన మాస్కునే ప్రతీరోజూ వాడకూడదన్నారు. ఉతుక్కోవడానికి వీలుగా ఉన్న మాస్కులు వాడుతూ, వాటిని మళ్లీ పరిశుభ్రం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో  డా. ప్రవీణ్ వర్మ, డా.ప్రవీణ్ ,హెల్త్ సహాయకులు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-01 12:52:57

గ్యాసిఫికేషన్ కోసం రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు

భూగర్భంలోని బొగ్గును మండించి విద్యుత్ ను ఉత్పత్తి చేసే గ్యాసిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి 2030 నాటికి 10కోట్ల టన్నుల బొగ్గు వినియోగ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫ్యాక్షన్ ప్రక్రియలపై న్యూఢిల్లీలో నిర్వహించిన వెబినార్ సదస్సునుద్దేశించి ప్రహ్లాద్ జోషి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గ్యాసిఫికేషన్ కోసం 4లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడతామని  బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫాక్షన్ అనేది ఆశ, అత్యాశ కాదని, ప్రస్తత అవసరమని అన్నారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు గ్యాసిఫికేషన్ కోసం వినియోగించే బొగ్గు రెవెన్యూ వాటాపై 20శాతం రాయితీని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. యూరియా, తదితర రసాయనాల తయారీ కోసం సింథటిక్ సహజవాయు ఇంధనం, శక్తి ఇంధనం వంటివి ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అధ్యక్షతన ఒక సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించిన మంత్రి బొగ్గు మంత్రిత్వ శాఖకుచెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు.  గ్యాసిఫికేషన్ కు సంబంధించి మూడు ప్లాంట్లు నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.) సంస్థ ఏర్పాటు చేయనుందన్నారు. దంకుని ప్లాంట్ కు అదనంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ (బి.ఓ.ఓ.) ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్త టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సింధటిక్ సహజవాయువు మార్కెటింగ్ కోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)తో అవగాహనా ఒప్పందాన్ని కూడా సి.ఐ.ఎల్. కుదుర్చుకుందని వివరించారు..

New Delhi

2020-09-01 10:54:01

ఐసిడిఎస్ లో ఉద్యోగాలకి ధరఖాస్తులు ఆహ్వానం..

రావికమతం ఐసీడీఎస్‌ ‌పరిధిలోని రావికమతం మండలంలోని ఖాళీగా వున్న రెండు అంగన్‌వాడీ కార్యకర్తలు, అయిదు హెల్పర్‌ ‌పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు పదిలోగా మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో వి.మంగతాయారు తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కార్యకర్త పోస్టులు పెదపాచిల(ఓసీ), పోతులూరు (ఓసీ), హెల్ప్‌ర్‌ (ఆయా) పోస్టులు తట్టబంద (ఎస్టీ), పీ.పొన్నవోలు (బీసీ-బీ), దొండపూడి-3(ఓసీ), చీమలపాడు (ఓసీ), చినపాచిల-2 (ఓసీ), మర్రివలస-గొల్లలపాలెం (ఎస్సీ), లకు రిజర్వు చేయబడ్డాయని ఆయా పోస్టులకు ఆర్హులైన అభ్యర్థులు ఈ నెల 1 నుంచి 9వ తేదీ లోపుమీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు రావికమతంలోని సీడీపీవో ఆఫీస్‌ను సంప్రదించాలని సీడీపవో మంగతాయారు చెప్పారు. ఆశక్తివుండి విద్యార్హతలున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

రావికమతం

2020-09-01 09:35:00

ఆ గిరిజన గ్రామంలో సుస్తీ చేస్తే డోలీ తప్పదు..

ఆ.. గిరిజన గ్రామంలో ఎవరికి జ్వరమొచ్చినా రోగిని డోలీలో మోసుకు రావాల్సిందే...ఆ గ్రామానికి పారామెడికల్ సిబ్బంది సక్రమంగా వెళ్లరు...వెళ్లినా వారానికో, 15రోజు ల కొకసారో వెళతారు..దీంతో ఈ ప్రాంతంలోని గిరిపుత్రులు వైద్య సహాయానికి నోచుకోవడం లేదు..ఏదో వారికి తోచిన ఆకుపసరలు మింగి ఆరోగ్యాన్ని అనారోగ్యంతోనే నెట్టుకొస్తున్నారు. మరీ రోగం వికటిస్తే డోలీ కట్టుకొని కొత్తకోట పీహెచ్సీకి తీసుకు వస్తారు. ఈ దారుణమైన పరిస్థి విశాఖజిల్లా, రావికమతం మండలం శివారు గిరిజన గ్రామాలైన చలిసింగం, చీమలపాడు పంచాతీ గిరిజనుల దుస్తితి. మలేరియా జ్వరంతో గత వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న గిరిజనుడిని వైద్యం కోసం కొత్తకోట ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు డోలీ కట్టి తీసుకువచ్చారు. ఆ గ్రామ గిరిజనులు. ఏళ్ల తరబడి రావికమతం మండలంలో పలు గిరిజన గ్రామాల గిరిజనులు ఇదే కష్టాన్ని ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ గిరిజనులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించక లేకపోతున్నారు. దీంతో గిరిజనులకు అత్యవసర సమయంలో ఈ డోలీమోత తప్పకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు తమ ఆవేదన మీడియా ముందు వెళ్లగక్కారు. వారి గ్రామాలకు వెళ్లడానికి  సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతాలకు 108 వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. వెరసీ ఎలాంటి అనారోగ్యానికి గురైనా గిరిజులు రోగిని ఆసుపత్రులకు తీసుకువెళ్లాలంటే డోలీమోత తో తీసుకువెళ్లాల్సిందే. ఇలా తీసుకు వస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే గిరిజనులు మ్రుత్యువా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు గ్రామాలను సందర్శించినప్పటికీ ఈ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  3 నెలల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రామలక్ష్మీని కొండపై నుంచి డోలీపై మోసుకువచ్చి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మరో మహిళకు పురిటినొప్పులు వచ్చి, తీవ్ర అస్వస్తతకు గురికావడంతో డోలీపై తీసుకువచ్చి కొత్తకోటలో వైద్య చికిత్స చేయించారు. ఇలా డోలీ మోతతో ఎన్నాళ్లు కష్టాలు అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తే తప్పా తమ గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, రోడ్డు సౌకర్యం వచ్చేటట్టు లేదని గిరిజనులు చెబుతున్నారు...

కొత్తకోట

2020-09-01 09:18:40

తాండవ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలి...

తాండవ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ ‌కార్యాలయం ఎదుట గొలుగొండ మండలం గాదంపాలెం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, తాండవ నిర్వాసితులకు మా గ్రామంలో మిగులు భూమి ఇవ్వడం జరిగిందని విప్పలపాలెం గ్రామానికి చెందిన దొరలు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే పాకలపాడు గ్రామంలో దళితులకు చెందిన స్మశాన వాటిక స్థలంలో ప్రభుత్వ కట్టడాలను నిర్మిస్తూ గ్రామ దళితులుకి అన్యాం చేస్తుందని అన్నారు.   ప్రభుత్వం తక్షణమే ఆక్రమణ దారుల నుంచి భూములను విడిపించి నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అనంతరం సబ్‌కలెక్టర్‌ ‌మౌర్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల సీపీఐ నాయకులు బాలేపల్లి వెంకటరమణ, మాకిరెడ్డి రామునాయుడు,మేక సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం

2020-08-31 21:07:47