1 ENS Live Breaking News

సమాజానికి జర్నలిస్టులు..సైనికులు రెండు కళ్లు-హీరో ఉపేంద్ర

సరిహద్దుల్లో సైనికులు లేకపోతే దేశానికి రక్షణ లేదని.. రైతు వ్యవసాయం చేయకపోతే మనకి తిండి దొరకదని.. జర్నలిస్టులు లేకపోతే సమా జంలో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియదని.. దేశానికి సైనికులు, సమాజానికి జర్నలిస్టులు రెండు కళ్లు వంటి వారని, మూడో నేత్రం రైతేనని సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలోని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో దసరా సంబు రాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  హీరో ఉపేంద్ర జర్నలిస్టులు మిఠాయిు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు బాగుంటేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాకి ఏ కష్టమొచ్చినా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ తన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. జర్నిస్టుల సంక్షేమం కోసం ట్రస్ట్ చైర్మన్, నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. జర్నలిస్టులు ఇలాంటి పండుగల సమయంలో ఒకో చోట కలిసి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. 

జర్నలిస్టులు నిత్యవం సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తారని అలాంటి జర్నలిస్టులు నిర్వహించుకునే కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీయడంలో కీలకం గా వ్యవహ రించాలన్నారు. అదేవిధంగా విశాఖ టూరిజంను బాగా ప్రమోట్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సినిమాలు ఎక్కువగా తీయడానికి కూడా అవ కాశం వుంటుందని చెప్పారు. ఏం చేయాలన్నా అది కేవలం మీడియా చేతుల్లోనే వుంటుందని.. మీడియా తలచకుంటే సినీ పరిశ్రమ మొత్తం విశాఖ తరలివస్తుందన్నారు. అనంతరం టిజెఎఫ్ నిర్వాహకులు ఘనంగా హీరో ఉపేంద్రబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, నిర్వాహకులు పి.ఈశ్వర్, యూనియన్ ప్రతి నిధులు జార్జిఫెర్నాండేస్, ఎం.శ్రీనివాసరావు,  నందా, తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-10-12 09:51:55

కేబినెట్ దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య-పల్లా

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను కేబినేట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివా సరావు హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గం గురువారం  ఆయన్ని కలిసి జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల అంశాన్ని వివరించింది. విశాఖలో ఇళ్ల స్థలాలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాల వివరాలు ఆయ నకు అందజేశారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తాన న్నారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తా నని చెప్పారు. తప్పకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పారు. సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ మాట్లా డుతూ సుమారు 800 మందికి  పైబడి జర్నలిస్టులు ఇంటి స్థలం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా రన్నారు. వారందరికీ  ఈ ప్రభుత్వ హ యాంలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ సలహాదారులు ధవలేశ్వరపు రవికుమార్, కోశాధికారి ఆలపాటి శరత్ కుమార్, సహాయ కార్యదర్శులు పి. శ్రీనివాసరావు,బందరు శివప్రసాద్,యూ భాస్కరరావు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పీఏ రావు,ప్రత్యేక ఆహ్వాని తులు యర్రా నాగేశ్వరరావు, పవన్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్.గురునాథ్  పాల్గొన్నారు.

visakhapatnam

2024-10-03 16:16:49

ఆసుపత్రిలో మంచాలు దారుణం.. లోచల రామక్రిష్ణ ఔదార్యం..!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి  చాలా దారుణంగా ఉంది.. ఇటు ప్రభుత్వం గానీ.. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటిడిఏలు కానీ వీటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. గిరిపుత్రులకు వైద్య సేవలు చేయడానికి కనీసం ప్రభు త్వాలకి అవకాశం లేదో.. ఇక్కడ ఎందుకులే వసతులు అనుకున్నారో తెలీదు గానీ.. జెర్రిల ప్రాధామిక ఆరోగ్య కేంద్రంలోని మౌళిక వసతులను గాలికి వదిలేశారు. లక్షల రూపాయాలు జీతాలు ఇచ్చి ఉద్యోగులను, వైద్యుల పెట్టిన ప్రభుత్వం వేల రూపాయాలు ఖర్చు చేసి ఇక్కడ రోగుల సౌకర్యార్ధం కనీసం మంచాలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది.. కాదు కాదు.. ఉన్నవి పాడైపోయినా పూర్తిగా పట్టనట్టు వదిలేసింది. ఏజెన్సీలోని నేతలు కూడా ఈ దీన పరిస్థితిపై కన్నెత్తి చూడలేదు. ఆ దారుణమైన పరిస్థితి కాస్తా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోచల రామక్రిష్ణ వరకూ వెళ్లింది. దీనితో స్పందించిన ఆయన మంచి మనసుతో ముందుకొచ్చారు. జీకే వీధి మండలం జర్రెల  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచాలు పూర్తిగా పాడై పోవడంతో తనవంతు సహా యంగా ఆరు మంచాల ఏర్పాటు చేయడానికి రూ.20వేలు సహాయం చేశారు. 

ఆ మొత్తాన్ని ఆసుపత్రి సిబ్బంది.. గ్రామ పెద్దల సమక్షంలో వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లోచల రామక్రిష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజనులకు ప్రాధమిక వైద్యం అందించాలని.. ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం వసతులు లేని పీహెచ్సీల్లో సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం గిరిజనులకు వైద్యసేవలు చేయడానికి రావాలనీ.. కనీసం ఆసుపత్రిలో రోగుల కోసం మంచాలు కూడా లేకపోతే గిరిజనులు వైద్యానికి వచ్చినా ఎక్కడు ఉండాలని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చే రోగులకు కనీసం వైద్య సేవలు అందే సమయంలో సేద తీరడానికి కూడా అవకాశం లేకపోవడం శోచనీయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, ఐటిడిఏ అధికారులు స్పందించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మౌళిక సదుపాయాలతోపాటు ఖాళీగా ఉన్న సిబ్బందిని కూడా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గిరిపుత్రులు ఆసుపత్రికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడకూడదనే మంచి ఆలోచనతో మంచాల ఏర్పాటు కోసం లోచల రామక్రిష్ణ ముం దుకి రావడం పట్ల గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులు, సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

G.K.Veedhi

2024-10-01 14:34:59

మహా విశాఖలో ‘అపర రక్త దాన’ కిరణుడు..!

ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే దేవుడంటారు.. ఈ లెక్కన ఆ జర్నలిస్టు ఎన్నిసార్లు దేవుడవ్వాలి..మరెన్నిసార్లు మంచోడవ్వాలి.. అంటే ఇప్పటి వరకూ ఆ జర్నలిస్టు 74 సార్లు దేవుడు.. 7 సార్లు ఆపద్భాంధవుడు అయ్యాడు.. ఇంతకీ అన్ని సార్లు దేవుడవడానికి కారణం మాత్రం ఒక్కటే.. అదే రక్తదానం.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 సార్లు రక్తం దానం చేసిన అపర రక్తదాన కర్ణుడు..అతనే జర్నలిస్టు కాళ్ల సూర్యప్రకాష్(కిరణ్). విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తూ.. సామాజిక బాధ్యతగా ఏడాదికి నాలుగు సార్లు రక్తం దానం చేస్తూ ఎందరికో ఆపద సమయంలో అండగా నిలిచాడు.. నిలుస్తున్నాడు కూడా. ఒక్క రక్తం దానమే కాదు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే నేనున్నాంటూ ముందుకెళ్లిపోతాడు. తనకు తోచిన రీతిలో అభాగ్యులకు అన్నదానం కూడా చేస్తుంటాడు. జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా.. తన పని ఉందని తెలిసినా.. ఎవరైనా తనను గుర్తించి పని పురమాయించినా నిండు మనసుతో ఆ పనులు చక్కబెట్టి అందరివాడిగా మారిపోయాడు.

ఐదు రూపాయలు సహాయం చేసి రూ.500 పైగా పబ్లిసిటీ చేయించుకుంటున్న ఈ రోజుల్లో జర్నలిస్ట్ కిరణ్ చేసే రక్తదానం ఆయనకి..దానం తీసుకున్న వారికి తప్పా మరెవరికీ తెలియదు.. ఇపుడు మాత్రం ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా బాహ్య ప్రపంచానికి కూడా తెలియజేసే అవసరం వచ్చింది. చెడ్డవారికోసం లోకానికి తెలియడం ఎంత అవసరమో.. అదేవిధగా మంచి వారి కోసం కూడా అంతకంటే ఎక్కువగా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం చాలా అవసరం. అలా చేయడం వలన జర్నలిస్ట్ కిరణ్ లాంటి వారిని స్పూర్తిగా తీసుకొని మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకి వచ్చే అవకావం వుంటుంది. మీడియా అంటే సమాజంలో జరిగే అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వుంటుంది. ఒకరకంగా అదికూడా ప్రజాసేవే. ఎందరికో ఆపద సమయంలో రక్తం చేసే కిరణ్ కోసం కొందరికే ఈ విషయం తెలిస్తే.. ఈయన దగ్గర రక్తం దానం తీసుకున్నవారు.. ఈయనకోసం తెలుసుకున్నవారు.. తెలియనివారి కోసం తెలియజేసిన వారమవుతామని ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా మీ ముందుకి తీసుకువస్తున్నాం. 

డబ్బు దానం చేస్తే అది ఖర్చు అయిపోతే మరిచిపోతారు.. అన్నం దానం చేస్తే అది అరిగిపోతే ఆకలి తీరుతుంది.. కానీ రక్తం దానం చేస్తే మాత్రం ఒక నిండు ప్రాణం నిలబడుతుంది. అందుకోసమే తాను ఈ సేవను ఎంచుకున్నానని చెబుతాడు కిరణ్. ఒక్కోసారి చాలా మంది రక్తం దానం చేసినందుకు డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తారని.. కానీ అలా చేయడం తనకి ఇష్టం లేకనే చేసిన దానాన్ని కూడా తెలియకుండా ఉంచుతానని చెబుతాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మాత్రం రక్తం దానం చేసినపుడుల్లా ఫోటోలు పెడుతున్నానని.. అదీకూడా పబ్లిసిటీ కోసం కాదని.. ఎపుడైనా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే.. వెంటనే తనను సంప్రదిస్తారనే సామాజిక కారణంతోనే పెడుతున్నానని చెబున్నాడ జర్నలిస్టు కిరణ్. ఎన్నోసార్లు ఎన్నో వార్తలు రాసిన తాను. రక్తం కోసం.. అత్యవసర సమయంలో దాని విలువ తెలిసిన వాడిని కనుకే అర్ధరాత్రి లేపి రక్తం కావాలని వచ్చినా నిశ్శంకోచంగా దానం చేస్తానని ఈఎన్ఎస్-ఈరోజుకి  చెప్పుకొచ్చాడు.  

-రక్తం దానం చేయండి ప్రాణదాతలు కండి
అత్యవసర సమయంలో మీరు చిందించిన రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని బ్రతికిస్తుంది.. ఈరోజుల్లో అవసరానికి రక్తం దొరక్క ఎందరో మృత్యువాత పడుతున్నారు. అలాంటివారిని ఆదుకోవాలంటే మంచి మనసునున్నవారంతా రక్తం దానం చేయడానికి ముందుకి రావాలి. రక్తం దానం చేయడం వలన ఆరోగ్యం పెరుగుతుంది. అయితే శరీరంలోని 12 గ్రాములకు మించి రక్తం ఉన్న వారు ఏడాదికి నాలుగు సార్లు రక్తం దానం చేయవచ్చు. అలా రక్తం దానం చేయడం ద్వారా దానిని విభజించి ప్లేట్ లెట్స్ గా కూడా రోగులకు ఎక్కిస్తున్నారు. రక్తం దానం చేసి ప్రాణ దాతలు కండి. రక్తం దానం చేసిన తరువాత మళ్లీ శరీరంలో రక్తం పెరగడానికి క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తోపాటు, బలవర్ధక ఆహారం తీసుకుంటే అతి తక్కువ సమయంలోనే దానం చేసిన రక్తం మళ్లీ శరీరంలోకి చేరుతుంది. ఇప్పటికీ ఒక్కవిశాఖలో రోజుకి 50 యూనిట్లు రక్తం ఆసుపత్రులకి అవసరమే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

visakhapatnam

2024-09-28 13:39:29

చినగదిలో డా.కంచర్ల మహా అన్నదానం..పెల్లుభికిన జనాభిమానం

ప్రజలకు చేసే నిశ్వార్ధ సేవైనా.. దేవుడు మెచ్చేలా చేసే నిండుగా ఉండే పూజలైనా.. భక్తుల మనుసుకి నచ్చే అన్నదానమైనా.. ఉపకార్ ఛారి టబుల్ ట్రస్టు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ప్రముఖ సేవకులు, విద్యాదాత డా.కంచర్ల అచ్యు తరావు మార్కు ఉండాల్సిందే.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 రకాలతో భారీ ఎత్తున చేపట్టిన మహా అన్నదానం విశాఖలో రికార్డు సృష్టిం చింది. మహావిశాఖ పరిధిలోని ఆరిలోవ చినగదిలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేషుడి మండపంలో 24 అడుగుల ఎత్తులో  స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు 24 రోజుల పాటు దూపదీప నైవేద్యాలతో సాక్షాత్తూ ఆ గణపయ్యే మెచ్చేవిధంగా పూజలు చేశారు.. 24 రోజుల పాటు 24 రకాల ప్రసాదాలు పంచిపెట్టారు..24వ తేదీనే స్వామిని అనుపుచేశారు.. అదే 24 రకాలతోనే 5వేల మందికి పైగా మహా అన్న దానం చేపట్టారు. మహా భోజ ఏర్పాటు చేసిన మహా అన్నదానం ప్రసాదంగా స్వీకరించిన వారంతా ఇపుడు నిండైన మనసుతో నిర్వాహకులను ఆశీర్వదిస్తున్నారు. ఏన్నో ఏళ్ల నుంచి ఆరిలోవ చినగదిలి ప్రాంతంలో వినాయక మండపాలను ఏర్పాడు చేస్తున్న ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ఈ ఏడాది కూడా ఘనంగానే మండపాలు ఏర్పాటు చేసింది. అన్నింటా పెద్ద ఎత్తు కార్యక్రమాలను నిర్వహించింది. 

ఆఖరుగా 24 అడుగుల మహా గణపతి అనుపు మహోత్సవం రోజున చేసిన కూడా 24 సంఖ్య విశాఖలోని ఆరిలోవ వాసులకు గుర్తిండిపోయేలా భారీ అన్నసంతర్పణ కూడా చేపట్టింది. స్వయంగా డా.కంచర్ల అచ్యుతరావు ఈ మహా అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ మహాగణపతి ఆశీస్సులతో విశాఖ ప్రజలు శుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతీఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున గణేష్ మండపాలు ఏర్పాటుచేసి ఆ గణపతికి పూజలు చేసుకునే భాగ్యం దక్కిందన్నారు. ఈ ప్రాంత వాసులు తనపై చూపిస్తున్న అభిమానం.. ఆ దేవ దేవుడు ఇచ్చిన శక్తిమేరకు రానున్న రోజుల్లో కూడా మరింతగా కార్యక్రమాలు ట్రస్టు ద్వారా చేపడతామని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన కార్యక్రమాల్లో ఈ ప్రాంతవాసులు భారీగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు స్వామివారి అనుపు సందర్భంగా కంచర్ల ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు సుధీర్, నాగు, తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-09-26 14:49:12

కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల రెగ్యులైజేషన్ అంశం కేబినెట్ లో చర్చించాలి

రాష్ట్రం లోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు రెగ్యులర్ చేసే విషయాన్ని ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సస్ స్ట్రగల్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. సదరు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలు మంగళవారంతో 12వ రోజుకి చేరుకున్నాయి.  ఈ సందర్భంగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సు లు మాట్లాడుతూ, జీఓనెంబరు 115 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర  అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు జీఓను రద్దుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11500 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వంలో ప్రధాన అంశాల పై నిర్ణయాలు తీసుకునే ఏపీ కేబీనెట్ లో ఈ అంశాన్ని చేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎ.ఎన్.ఎం లకు జీఓఎంఎస్ నెం-5, జీఓఎంఎస్ నెం- 57 ల ద్వారా  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ ఇచ్చి జిఓఎంఎస్ నెం-115 తో ఏఎన్ఎం లకు  స్టాఫ్ నర్సులు(జిఎన్ఎం) గా పదోన్నతి ఇస్తుందన్నారు.  

ఇలా ఇచ్చే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11500 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను కనీసం పరిగనణలోనికి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల్లో జీఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్శింగ్ చదివి ఇప్పటికే 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఇందులో చాలా మంది మంది ఐదేళ్లు దాటిన వారు, మరికొందరు మూడేళ్లు దాటిన వాళ్లు ఉన్నారని. అయితే వాళ్లని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుంగా కేవలం ఏఎన్ఎంలను మాత్రమే ప్రమోషన్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. 13 ఏళ్లుగా ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ రాలేదని..కనీసం వేల సంఖ్యలో ఉద్యోగ విరమణలు చేస్తున్న స్టాఫ్ నర్సుల ఖాళీల్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

visakhapatnam

2024-09-17 14:39:55

సత్యదేవుని నిత్యన్నాధాన ట్రస్ట్ కి రూ.1,00,000/-విరాళం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోని శ్రీ సత్య దేవ నిత్య అన్నదాన ట్రస్ట్ కి  జగ్గంపేటకి చెందిన బొండా సు బ్బరాజు, సరస్వతి దంపతులు ,రూ 1,00,000/-విరాళంగా అందజేశారు.  ఆదివారం దేవస్థానం కార్యాలయ సిబ్బందికి ఆ మొత్తాన్ని చెక్కుగా అందజేశారు. ప్రతి సంవత్సరం, ఆగస్టు 23న అన్నదానం చేయాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశా రు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేయగా, వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు.

annavaram

2024-09-15 15:59:42

సత్యదేవుని నిత్యన్నాధాన ట్రస్ట్ కి రూ.1,00,001/-విరాళం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోని శ్రీ సత్య దేవ నిత్య  అన్నదాన ట్రస్ట్ కి కందుకూరుకి చెందిన ఎం శ్రీ కాం త్  దంపతులు ,రూ 1,00,001/-విరాళంగా అందజేశారు.  ఆదివారం దేవస్థానంలోని కార్యాలయ సిబ్బందికి ఆ మొత్తాన్ని చెక్కుగా అందజే శా రు. ప్రతి సంవత్సరం, ఏదో ఒక రోజున అన్నదానం చేయాలని దాతలు కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశా రు. దాతలకు సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేయగా, వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు.

annavaram

2024-09-15 15:46:52

డా. బీవీఏ స్వామికి ఏపీఎంఈడీపీఏ అవార్డు

 ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ బూర్లె వెంకయ్యప్పలస్వామికి ఏపీ ఎంఈడీపీఏ అవార్డు లభించింది.  ఆంధ్ర ప్రదేశ్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోస్పెక్ట్ అసోసియేషన్ (ఏపీ ఎంఈడీ పీఏ)వారు ప్రతీ ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఈ ఏడాదికి గాను డాక్టర్ బీవీఏ స్వామిని ఎంపిక చేసి అందజేశారు.   ఈ అవార్డును ఏపీ  గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి  అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వి ఏ స్వామికి  హైదరాబాద్ లో అందించారు. ఈ సందర్బంగా అవార్డు గ్రహీత స్వామి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన  అవార్డు తనకు లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.  గుర్ల మండలం గూడెం గ్రామానికి తాను అసిస్టెంట్ ప్రొఫెసరుగా  అందించిన సేవలు, అనుభవం, వివిధ పరిశోధనలతో పాటు పలుఅభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు గాను  తనకి అవార్డు లభించందన్నారు. కాగా తమ యూనివర్సిటీకి చెందిన, అవార్డు అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసరు డాక్టర్ బి వి ఏ స్వామిని  ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.అశోక్ తోపాటు అధ్యాపక సిబ్బంది, సహచరులు హర్షం వ్యక్తం చేశారు.

gurla

2024-09-15 15:10:17

ఎస్ఐ దివ్యకు వైఎస్సార్సీపీ నేతల శుభాకాంక్షలు

కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన టి.దివ్యను నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు, వైఎస్సా ర్సీపీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ స్టేషన్ కు మహిళా ఎస్ఐ రావడం ఇదే తొలిసారని. ఇప్పటి వరకూ చాలా మంది ఎస్ఐలు మారినా ఎన్నడూ మహిళా ఎస్ఐలు రాలేదన్నారు. మొట్టమొ దటిసారిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళా ఎస్ఐలు స్టేషన్ అధికారులుగా రావడం వలన మహిళల సమస్యలు సత్వరం పరిష్కారం కావడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యర్రా శ్రీనివాసరావు, యర్రా నాగేశ్వ రరావు, యలమంచిలి ఎస్వీ రామణారావు, అప్పన కృష్ణ, లంక లోవనారాయణ, వాసం లోవ, లంక శివ, యర్రా బాబులు, అప్పన చిన్ని, గొంతి న సూరిబాబు, చేపూరి కృష్ణ, తురంగల చిన్న, గాజుల లోవ, కూనిశెట్టి యేసు, అప్పన చిన రమణ, కూనిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

krishnadevipeta

2024-09-15 07:02:40

జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటాను- డా. కంచర్ల

సమాజాన్ని తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని  ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు అన్నారు. మంగళవారం విశాఖ పౌరగ్రంధాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ , ఉపకార్ చార్టిబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో  విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులను , వీడియో జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ  ప్రజలకు నిర్భయంగా నిజాలు తెలియ చేసే మీడియా అంటే ఎంతగానో అభిమానిస్తానన్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కంచర్ల సినిమా విడుదల రోజున జర్నలిస్టుల సంక్షేమానికి పదిలక్షల రూపాయలు అందచేస్తానని జర్నలిస్టుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.

 జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎయిర్పోర్ట్ సలహాసంఘం సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా నిలిచే కంచర్ల చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మీడియా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మీడియాలో సేవలందిస్తున్న తాను జర్నలిస్టులకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పీ నారాయణ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని త్వరలో సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి ని కలిసి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరనున్నట్లు తెలిపారు. 

అనంతరం విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న  రామకృష్ణ రావు, అక్కెన నరేష్,  జార్జ్ ఫెర్నాండేస్, అప్పల రాజు, గజం   విజయ్,  ఎమ్మెస్సార్ ప్రసాద్ , కిలాపర్తి పీటర్ ప్రదీప్ , భాస్కర్ శంకర రావు, సురేష్, కేవీ అప్పారావు, సారిక అప్పల స్వామి,   సిరికి నూకనాయుడులను ముఖ్య అతిధి కంచర్ల అచ్యుత రావు, గంట్ల శ్రీనుబాబు, నారాయణ పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అతిధులను బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్  అధ్యక్షుడు  ఈరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్ లు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు,  బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీబీజేఏ ప్రతినిధులు నాయుడు, నర్సిం గరావు, సురేష్, శేషు మళ్ళ దేవత్రినాధ్, దిలీప్, డి రవి కుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


visakhapatnam

2024-09-10 19:13:34

కలెక్టర్ సారూ ఇది మా ఊరు కొనపురం రోడ్డే..!

మా ఊరి రోడ్డు పరిస్థితి ఇలా ఉంది కలెక్టర్ సారూ..  మా ఊరి పేరు కొనపురం.. మండలం అనంతగిరి.. మన అల్లూరి సీతారాజు జిల్లాయే.. మా గ్రామంలోకి మీరు ఒక్కసారి వచ్చారంటే ఇక్కడి రోడ్డు పరిస్థితి ఏంటో మీకు అర్ధమైపోతుంది. మేము దరఖాస్తులు పెట్టినంత కాలం ఏదో మామూలు రోడ్డు సమస్య అనుకుంటున్నారు జిల్లా అధికారులంతా. అందుకనే మా గిరిజన తండా రోడ్డు కోసం మేము చెప్పేకంటే మీరొచ్చి ఒక్కసారి చూసినా.. కనీసం ఈ గూండా ప్రయాణం చేసినా మొత్తం సమస్య మీకు అర్ధమైపోతుంది. ఇంకో మాటసారూ.. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు బాగా మారు మూల గ్రామాలకు వాడేశామని చెబుతున్నారు అధికారులు.. వాళ్లకి.. సబ్ ప్లాన్ నిధుల ప్రచారానికి ఈ రోడ్డుని ఫోటోలు పెట్టి చూపిస్తే రోడ్లు ఎంతబాగా వేశారో మీకు, ప్రజలకి అటు ప్రభుత్వానికి కూడా చాల చక్కగా తెలుస్తుందండయ్యా.. ఇలా అన్నామనీ మాపై కోపం పెంచుకోకండి. మా గ్రామానికున్న ఒకే ఒక్క రహదారి పూర్తిగా పాడైపోయి రాళ్లు తేలితే మేము పడుతున్న బాధలు మీకు చెప్పాలని మాత్రమే ఈ పద ప్రయోగం తప్పా మరేమీ లేదండయ్యా..!

అనంతగిరి మండలం కొనపురం గ్రామానికి వెళ్లాలంటే ఈరోడ్డుపై ఒక్కసారి అధికారులుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ ప్రయాణం చేస్తే ఇక్కడి ప్రజలు నిత్యం పడుతున్న బాధలేంటో తెలుస్తాయని వాపోతున్నారు గ్రామస్తులు. గత ప్రభుత్వంలో ఐటిడిఏకి కొనపురం గ్రామం రోడ్డు సమస్యను విన్నవిస్తే రోడ్డుు సాంక్షన్ అయ్యిందిగానీ.. నిధులు లేవని చేతులెత్తేశారట. ఇపుడేమో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఫిర్యాదు చేస్తే సాంక్షన్ అయిన పాత రోడ్డు పోయింది.. మళ్లీ కొత్తగా కంప్లైయింట్ పెట్టమంటున్నారని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభలో తీర్మానించి మరీ సమస్యను ఐటిడిఏ అధికారుల దృష్టికి తీసుకెళితే చూద్దాం.. చేద్దాంలే అని ఊరకుండిపోతున్నారని వాపోతున్నారు. అసలు రోడ్డు వేసే సమయంలోనే నాణ్యతగా వేస్తే మాకు ఈరోజు ఈ పాట్లు వచ్చేవి కాదు కదాని ప్రశ్నిస్తున్నారు కొనపురం గ్రామస్తులు. 

ఈ గ్రామం నుంచి పిల్లలకు పక్క గ్రామానికి బడికిపోవాలన్నా.. సంతలకు వెళ్లాన్నా.. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే మండల కేంద్రానికి వెళ్లాలన్నా ఈ గుంతలు పడిన రాళ్లు తేలిపోయిన రోడ్డుపై నుంచే ప్రయాణం చేయాల్సి వస్తున్నది. గర్భిణీ స్త్రీలను ఈరోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యలోనే కాన్పులు అయిపోతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.  ఈ రోడ్డు బొర్రా గుహలకు, లోతేరు జంక్షన్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా.. ఆదాయం ఆర్జించే ప్రభుత్వం.. రోడ్డు మార్గాన్ని బాగుచేసే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. కనీసం గుంతలు కప్పినా రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటుందని.. కనీసం ఆ సమస్యనైనా తీర్చాలని కొనపురం గ్రాస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

ananthagiri

2024-09-07 09:10:41

రక్త దాతలే నిజమైన ఆపద్భాంధవులు-జనసైనికులు

రక్త దాత ఒకసారి రక్తం దానం చేస్సతే ఐదుగురు వ్యక్తులకు అత్యవసర సమయంలో అది ఉపయోపడుతుందని జనసేన నాయకులు, క్రిష్ణదే విపేట ఉపసర్పంచ్ దుంపలపూడి సహదేవుడు పేర్కొన్నారు. జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్వ చ్చంద రక్తదానం చేసిన రక్తదాతలకు ఆయన  మంగళవారం సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్చం దంగా సహాయం చేసే అలవాటుని యువత అలవాటు చేసుకోవాలని అన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వీలుగా రక్తాన్ని దానం చేసిన దాతలందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో  టీం జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి,  సహాయ కార్యదర్శి సురేష్, ప్రధాన కార్యదర్శి హరినాథ్ ,  పాత జనసేన కార్యకర్తలు ఈర్ని చిన్ని, పాతాళ శివ గుడివాడ శివ,  దుంపలపూడి శివ,  స్కూల్ చైర్మన్ అని శెట్టి గోపి,  జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

krishnadevipeta

2024-09-03 12:50:28

కళా, రాజకీయ రంగాల నిశ్వార్ధ సేవకుడు పవన్ కళ్యాణ్-డా. కంచర్ల

కళారంగానికి.. రాజకీయాల్లోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అందించిన సేవలను వెలకట్టలేనివని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత  సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. సోమవారం పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా  పవన్ కళ్యాణ్ కళాపీఠంను లోగోను ఆయన పౌరగ్రంథాలయంలో జనసేన నాయకులు కందుల నాగరాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, సినీ రంగంలోనే ఆయన నటులకు, కళాకారులకు ఒక మాస్టర్ అని.. రాజకీయ రంగంలో నిశ్వార్ధ సేవకుడని కొనియాడారు. సేవే లక్ష్యంగా.. ప్రజా పరిపాలనే ధ్యేయంగా ఆయన ప్రభుత్వంలో తీసుకువస్తున్న సంస్కరణలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఆయన ఎన్నో ఏళ్లుగా  అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రజా సమస్యల పరిష్కారంపై తక్షణమే  స్పందించి చర్యలు తీసుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరానని ప్రశంసించారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వంలో ఆయన అత్యంత  కీలకపాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. 

రాజకీయాల్లో ఛాలెంజ్ చేసి మరీ రాణించిన వ్యక్తి  ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు.  గౌరవ అతిధులుగా హాజరైన కందుల నాగరాజు, గంట్ల శ్రీనుబాబులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కళాపరిషత్ ఏర్పాటు కావడం, ఆ సంస్థ పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళాపీఠం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నననలు పొందాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకంగా చెరగని ముద్ర వేసుకున్నారని  కొనియాడారు. ఈ సంస్థ గౌరవ అధ్యక్షులు గెంబలి జగదీష్, అధ్యక్షులు మెరుపు వరప్రసాద్, కార్యదర్శి పీలా హరిప్రసాద్, గంటి మురళీధర్, సినీనటుడు రవితేజ, కొరియోగ్రాఫర్ ఆర్.నాగరాజుపట్నాయక్, కన్వీనర్ కె.ఇందిరా ప్రియదర్శిని తదితరులు పవన్ కళ్యాణ్ కళాపీఠం ఆవిర్భావంలో తమ వాణిని వినిపించారు. అనంతరం అతిధులను గెంబలి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అంతకు ముందు నిర్వహించిన మెగా సంగీత విభావరి అలరించింది. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాన్ అభిమానులు, జనసేన నాయకులు, ఉపకార్ ట్రస్టు సభ్యులు, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-09-02 16:15:28

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు అతి త్వరలో పరిష్కారం-మంత్రి నారా లోకేష్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు  విశాఖ టిడిపి పార్టీ ఆఫీసులో ఆయన్ని కలిసి ఇప్పటివరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటా యింపు ప్రక్రియ లో జరిగిన పరిణామాలు వివరించారు. సొసైటీ అధ్యక్షులు బి.రవి కాంత్ మాట్లాడుతూ విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కల నెరవేరడం లేదని, దీనిపై త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని మంత్రికి వివరించారు. మంత్రి లోకేష్ సావధానంగా సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ఈ సమస్యపై చర్చించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. జర్నలిస్టులకు అండదండలు అందిస్తామన్నారు. ప్రధానంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యపై అధికారులతో మాట్లాడి ఒక కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. అర్హులందరికీ  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ గౌరవాధ్యక్షులు జనార్దన్,  కోశాధికారి శరత్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొప్పన రమేష్, ప్రత్యేక ఆహ్వాని తులు యర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా.. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వార్షికోత్సవం సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నట్లు  అధ్యక్షులు బి రవికాంత్, కార్యదర్శి యర్రా శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తు కార్యచరణ రూపొందించ డంతోపా టు ప్రజాప్రతినిథులు అందరినీ ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.

visakhapatnam

2024-09-01 06:06:06