1 ENS Live Breaking News

రౌడీ షీటర్ "శ్రీనివాస్ యాదవ్" నుంచి ప్రాణ హానిఉంది..రక్షణ కల్పించండి-పడగల



రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భారత్ రామ్ అనుచరుడు రౌడీ షీటర్ "శ్రీనివాస్ యాదవ్" నుంచి తనకు,  వృద్దాశ్రమం కు రక్షణ కల్పించాలని అమ్మానాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకుడు పడగల ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని పోలీసులను అభ్యర్ధించారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరంలోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్దులకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో అమ్మా నాన్న ఓల్దేజ్ హోమ్  5 ఏళ్లుగా నడుపుతున్నామని..లాభపేక్ష స్వార్ధం లేకుండా వృద్దులకు ప్రశాంతత జీవనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి తమను రాజమండ్రి లో పేరు మోసిన కిరాయి రౌడీ షీటర్ , మాజీ ఎంపి భరత్ అనుచరుడు తురాల శ్రీనివాస్ యాదవ్ మా ఓల్దేజ్ హోమ్ నుండి రౌడీ మాములు ఇవ్వాలని.. లేకుంటే తమ పత్రిక ఈవేళ లో  మీ సంస్థ కోసం వార్తలు వ్రాసి మీ పరువు తీస్తా అంటు బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

 రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ ముద్దాయిగా ఉన్న ఎస్ టి, ఎస్ సి కేసు నెం : 199/2025, ఎస్ సి నెం : 111/2025 లో తాను సాక్షి ఉన్నందుకే తమపై బెదిరింపులకు దిగి బెదిరింపులకు దిగుతూ.. తన సొంత పేపర్ పై అవ్వాకులు, చెవ్వాకులు ముద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అనుకూలంగా కోర్టు లో శ్రీనివాస్ యాదవ్ కు వ్యతిరేకంగా పోలీసులు తన పేరు సాక్షిగా నమోదు చేశారన్నారు. నిజానికి ఆ కేసు కు నాకు ఏ సంబంధం లేదని తాను  వ్రాసుకొచ్చిన పిటిషన్ పై సంతకం చేయమని బెదిరిస్తున్నాడని వివరించారు. కోర్టులో తనకు అనుకూలంగా చెప్పకపోతే  పొతే చంపేస్తానంటు బెదిరిస్తున్నాడన్నారు. అతని వద్ద కరుడు కట్టిన కిరాయి నేరస్తులు వున్నారని బెదిరిస్తున్నాడని చెప్పారు.  రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ లక్షలాది రూపాయి లకు ఐ పి పెట్టి ప్రజలను మోసం చేశాడన్నారు. కిరాయిలకు రౌడీ యిజం చేస్తు ఇళ్ళు, షాపులు ఖాళీ చేయించటం ఇతగాడి నేర వృత్తిగా ఎంచుకున్నాడని చెప్పారు. 

దాడులు దౌర్జన్యాలు తో వ్యాపారస్తులను భయబ్రాంతులకు గురి చేయటం వంటి నేరాలను కిరాయికి చేయటం ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదించాడని ఆరోపించారు. . నకిలీ పత్రాలు సృష్టించి ఇతరుల ఆస్తులను తన రౌడీల ద్వారా కాజేస్తుంటాడు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ బెదిరింపులకు తలోగ్గ లేదని గతంలో మా సంస్థలో 2 నెలలు ఆశ్రయం పొందిన గద్దె వెంకట కృష్ణ అనే వృద్ధుడు కొంతమంది మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవరించినందుకు బయటకు వెళ్ళిపో మని చెప్పి కొంత సమయం ఇచ్చి పంపి వేసామన్నారు. అలాంటి వృద్ధుడును రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ దగ్గరకు చేర్చుకుని నా పైన, మా సంస్థ పైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడన్నారు. సదరు  వృద్ధుడు చేసిన ఆరోపణలు అన్ని నిరదారమైనవని..విచారణ జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని అన్నారు. 

తాము కూడా విచారణ కోరుతున్నామన్నారు. రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ కారణంగా నా ప్రాణానికి ముప్పు వుందని.. అదే విధంగా అతని అన్ని చర్ల నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ పై దుష్ప్రచారం చేస్తూ తన హక్కులకు బంగం కలిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.  రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ కు తన సాక్షిగా వున్నటు వంటి కేసులో బెయిల్ రద్దు చేసి నాకు తగు రక్షణ కల్పించాలని... రౌడీ షీటర్  కు అండగా నిలిచిన  అనుచరులపై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను అభ్యర్ధించారు. ఈ సమావేశంలో మిస్క జోగి నాయుడు, గొంతెన అప్పన బాబు, సత్తి సూర్య భాస్కర్ రావు, కాండ్రేగుల కొండలరావు, సంగిడి పుష్పమ్మ, జి కోటేశ్వరరావు, ఎంకే చౌదరి, శివ సర్వీస్ వాలంటీర్స్ కృప, భావన, తనుజ, అమ్మానాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్దులు తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2025-06-19 14:37:45

అట్లుంటది మనతోని..! యోగా కాదు.. మహిళా అధికారిణిల ముష్టియుద్దం ..?

విశాఖలో యోగాంధ్రను విజయవంతం చేయాలని, గిన్నిస్ రికార్డు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ అహర్నిశలు శ్రమిస్తూ... యోగా కాకుండా ముష్టి యుద్దాలు చేసుకొని మహిళా అధికారులు జిల్లా పరువుని రచ్చకీడ్చేందుకు చూస్తున్నారు. ఇదే ఇపుడు విశాఖలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే ఆయుష్ ఇన్చార్జి ఆర్డీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ యోగాంధ్ర కార్యక్రమ అధికారిణిపై చేయిచేసుకోవడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. ఇటీవలే ఆయుష్ లోని దళిత ఉద్యోగిణిలపై చేయి చేసుకోవడంతో ఎస్సీ ఎస్టీ కేసు కూడా పీఎం పాలెం పోలీసు స్టేషన్ లో నమోదు అయ్యింది. అయినా ఈమెలో మార్పురాలేదన్న విషయం ఆంధ్రాయూనివర్శిటీ  కన్వెన్సన్ సెంటర్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా క్రీడాభివృద్ధి శాఖధికారిణిపై చేయి చేసుకోవడంతో మళ్లీ ఆ విషయం మీడియా వరకూ వచ్చింది. యోగా అనే సరికి ఆయుష్ లోని ఆయుర్వేద విభాగమే గుర్తొస్తుంది. సంబంధిత శాఖ అధికారి ఉండటంతో పనులు అప్పగించిన జిల్లా కలెక్టర్ కు ఇన్చార్జీ ఆర్డీడీ విషయంలో తలనొప్పులు మాత్రం తప్పడంలేదు.

 క్రిందిస్థాయి సిబ్బందిపై నోరు పారేసుకున్నట్టు సహచర జిల్లా అధికారులపై నోరు చేయి పారేసుకుంటే మామూలుగా ఉండదనే విషయం ఇపుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులందరికీ అర్ధమైంది. చేయిచేసుకోవడంతోపాటు దుర్భాషలాడుకోవడం, తిట్ల పురణాం కూడా అక్కడ వారిని అవాక్కైయ్యేలా చేసింది. అయితే ఈ విషయం కాస్తా మీడియా తెలియడంతో ఏమీ జరగననట్టే ఇద్దరు అధికారిణిలు వివరణ ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడీకి చేయి దురుసు ఎక్కువనే సంగతి రాజధానికి కమిషనర్ కార్యాలయం వరకూ అందరికీ తెలుసు. కానీ సీనియర్ ఐఏఎస్  అధికారులను లాబియింగ్ చేయడానికి ఒక ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడు ప్రతీ సారి మధ్య దూరి నానా యాగి చేసి విషయాన్ని తప్పుదోవ పట్టిస్తారట.  జూన్ 21న యోగా దినోత్సవానికి భారత ప్రధాని నరేంధ్రమోడీ వస్తున్నారు. దానితో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సైత విశాఖలో జరిగే అతి పెద్త ఈవెంట్ ను గిన్నీస్ రికార్డులో నమోదు అయ్యే విధంగా రాత్రనకా పగలనకా శ్రమించి పనిచేస్తున్నారు. రెండువేల మంది యోగా ట్రైనర్స్ ని పెట్టి మరీ ప్రతీ నిత్య శిక్షణలు ఇస్తున్నారు. 

ఈ క్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారిణి, జూన్ గాలియట్, ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ కి మద్య ఏవో లిస్టులవిషయంలో మాటా మాటా పెరిగి అది కాస్త కొట్టుకునే వరకూ వెళ్లిందని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈవెంట్ మొత్తం తననే చూడమన్నారని.. మధ్యలో వచ్చి మీరేం చేస్తారన్నట్టుగా మాట్లాడటంతో అటువైపున అధికారి కూడా తనను కూడా జిల్లా కలెక్టరే ఈ యోగాంధ్ర పనులు అప్పగించారని చెప్పడంతో మాటలు పెరిగి అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి కొట్టుకునేంతవరకూ వెళ్లిందట. ముందుగా ఆయుష్ ఆర్డీడీ చేతిలో ఫైలు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారిణి లాక్కోవడంతో ఆయుష్ ఆర్డీడీ చేసి చేసుకున్నారని చెబుతున్నారు. ఈ తంతు జరుగుతున్నప్పుడు అక్కడ జిల్లా అధికారులు, క్రిందిస్థాయి సిబ్బంది ఉన్నా పట్టించుకోకుండా ముష్టియుద్దాలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యంలోకి దింపిందట. అయితే జిల్లా అధికారుల మధ్యకు వెళ్లడం శ్రేయస్కరం కాదని మిగిలిన సిబ్బంది అలా చూస్తూ ఉండిపోయినట్టు సమాచారం అందుతుంది. 

అయితే క్రీడాభివృద్ధి అధికారిణిపై చేయిచేసుకున్న సమాచారం తెలియడంతో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధి స్వయంగా జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారిణి జూన్ గాలియట్ తోనూ, ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడీ డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ తో చరవాణిలో మాట్లాడగా తొలుత ఇద్దరు అధికారిణిలు అసలు ఏమీ జరగలేదని.. ఆ అధికారిణి ఎవరో తెలియదని ఈమె.. ఆ అదికారిణి తెలియదని ఆమె చెబుతూ వచ్చారు. ఆంధ్రాయూనివర్శిటీ కన్వెన్షన్ లో జరిగిన తంతు మొత్తం వివరించడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అధికారులు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తాము తిట్టుకున్నాం తప్పితే కొట్టుకోలేదన్నారు. అసలు గొడవ ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా చేతిలోని రెండువేల మంది యోగా ట్రనర్స్ లిస్టు లిస్టు దురుసుగా లాక్కున్నారని. ఆ సమయంలో చేతిలో లిస్టులు విధిల్చుకున్నాం తప్పితే కొట్టుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఇద్దరు అధికారిణిలు చాలా దారుణంగా తిట్టుకొని, కొట్టుకున్నారని, ఇదంతా అక్కడి అధికారుల సమక్షంలోనే జరిగిందని చూసిన వాళ్లు మీడియాకి చెప్పడం విశేషం. 

కాగా ఈ విషయం కలెక్టరేట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు అధికారిణిల్లో ఒకరిని యోగాంధ్రా విధుల నుంచి తప్పించారని కూడా సమాచారం అందుతున్నది. అంతేకాదు అధికారులు వార్నింగ్ తో కొట్టుకోవడం కాదు.. తిట్టుకున్నామన్నట్టుగానే బయటకు చెప్పాలని సంకేతాలు అందినట్టు తెలిసింది.కాగా ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడీ విషయంలో తప్పంతా ఆమెదే ఉంటుందని ఇదే శాఖ సిబ్బంది సిబ్బంది కూడా ఒంటి కాలపై లేస్తున్నారు. అంతేకాదు ఏయూ కన్వెన్షన్ హాలు జరిగిన తంతును కూడా వీడియో రికార్డింగ్ కూడా చేశారనే చెబుతున్నారు. ఆయుష్ లోని క్రిందిస్థాయి సిబ్బందిపైనే చేయి చేసుకున్న అధికారిణి అక్కడ విధులు నిర్వహించే వారిపైనా, తన మాటలకు అడ్డొచ్చే వారిపైనా చేయిచేసుకుందంటే వాస్తవం లేకపోలేదని బాహాటంగానే చెబుతున్నారు. 

ఇప్పటికే ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడీ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న కలెక్టరేట్ అధికారులు ఈ వ్యవహారంతో ఏ విధంగా వ్యహరిస్తారో తెలియాల్సి ఉంది. ఇన్చార్జి ఆర్డీడీ చేతిలో చేతిలో దెబ్బలు తిన్న అధికారిని నేరుగా జిల్లా కలెక్టర్ కి వాట్సప్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కానీ అయితే సహచర అధికారులు, క్రింది స్థాయి సిబ్బందితో ప్రవర్తన బాగాలేని కారణంగా ఆమెను యోగాంధ్ర విధుల నుంచి తప్పించినట్టు కూడా సమాచారం అందుతున్నది. మహిళా అధికారిణిల ముష్టియుద్దంపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.. ముష్టి యుద్దం విషయమై ఇద్దరుు అధికారిణిలను వివరణ కోరగా తిట్టుకున్నాం తప్పితే కొట్టుకోలేదని.. కావాలంటే విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని.. అలాగని ఏమీ లేకుండా మీరేమీ చిలవలు పలవలు అల్లి రాసేయవద్దని చెప్పడం మాత్రం గమనార్షం.!!

visakhapatnam

2025-06-12 19:19:52

మళ్ల సురేంద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. భూకబ్జాలు.. రికార్డులు ట్యాంపరింగ్ ను భయట పెట్టిస్తాం

జిల్లాలో భూ కబ్జాలను, రికార్డుల ట్యాంపరింగ్ లను సహించేంది లేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గత 12ఏళ్లుగా తన భూమి సమస్యపై అధికారుల చుట్టూ తిరిగినా, సిట్ కి ఫిర్యాదు చేసినా, ఆఖరి సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శికి విశాఖ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా తన భూమి రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జా సమస్య తీరలేదని వల్లభదాసు కనక మహేష్ సురేంద్రకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా తన సమస్య పరిష్కారం కాలేదని..తన భూమి కబ్జాకి గురైందని.. రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఫిర్యాదు చేస్తే.. భూమిగి కబ్జా చేసిన వారిని వదిలేసి తనను భూమి రికార్డులు తీసుకు రమ్మంటున్నారని.. అలాగని తన వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డులు తీసుకెళ్లి చూపించినా.. సమస్య ఉందని.. భూమి రికార్డులు ట్యాంపరింగ్ జరిగాయని చెబుతున్నారు తప్పితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇప్పటి వరకూ స్పందనలో ఎన్నేళ్లుగా దరఖాస్తులు పెట్టింది, తహశీల్దార్, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎన్నిసార్లు తిరిగింది పూర్తిగా ఆయనకు వివరించారు. పక్కగా భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్టుగా రికార్డుల్లోనే కనిపించినా ఈ సమస్యను అధికారులు పరిష్కరించకపోవడం వెనుక గల కారణాలను తెలుసుకుంటానని తప్పని సరిగా న్యాయం జరిగే చూస్తామని హామీ ఇచ్చారు. తాను హృద్రోగస్తుడనని.. తన ఆర్ధిక ఇబ్బందులు, సమస్యలు, భూమి కబ్జాకి గురైందని, రికార్డులు తారు మారు చేశారని ఎంత చెప్పినా.. రికార్డులు తారుమారు చేసిన వారిపై విచారణ చేయడం లేదని.. ఈ సమస్య పరిష్కారం కాకపోతే తనకు ఆత్మహత్య తప్పా మరే ఇతర మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  భూమి అమ్మింది కొంతైతే.. కబ్జాచేసింది.. రికార్డులు తారు మారు చేసిందే ఎక్కువగా ఉందనే విషయాన్ని సురేంద్రకు బాధితుడు మహేష్ పూర్తిగా వివరించారు.  బాధితుడి పిర్యాదు, దానికి అనుబంధ రికార్డుల నకళ్లు పరిశీలించిన ఆయన రికార్డుల్లోనే ట్యాంపరింగ్ జరిగినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 

కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు సహించేది లేదని. ఈ విషయంలో రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రశక్తి లేదని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఈ సందర్భంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే బాధితుడు కోల్పోయిన భూములను పరిశీలిస్తామని, రికార్డులు ఎక్కడ ట్యాంపరింగ్ జరిగాయో తెలుసుకొని సంబంధి అధికారులపై కూడా విచారణ చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో   82 వ టీడీపీ ఇంచార్జ్ పోలవరపు త్రినాథ్,తలారి కాసినాయుడు,పైలా గోపి,మేడిశెట్టి నూకరాజు,కోన శ్రీను,కాండ్రేగుల చిన్న,తదితరులు పాల్గొన్నారు.

anakapalli

2025-06-06 20:54:56

గాజువాకవాసికి అంతర్జాతీయ పురస్కారం..బెంగళూరులో ప్రధానం

గాజువాకకు చెందిన నమ్మి బాబూరావుకు అంతర్జాతీయ పురస్కారం వరించింది. ఆర్యభట్ట కల్చరల్‌ సంస్థ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా 16 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందినవారిని గుర్తించి సత్కరించింది. ఇందులో భాగంగా గాజువాక పెదగంట్యాడ మండలం, సీతానగరం గ్రామానికి చెందిన నమ్మి బాబూరావును మల్టీ టాలెంటెడ్‌ విభాగంలో గుర్తించి అవార్డును ప్రధానం చేశారు. బాబూరావు బాడీ బిల్డింగ్‌, కుంగ్‌పూ, కరాటే,  యోగాలో 1996 నుంచి  నిర్విరామంగా శ్రమిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చేస్తున్న కృషికి గాను ఆర్యభట్ట సంస్థ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. బెంగళూరులో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక లా కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అశోక్‌ బి.హించిగేరి, కర్ణాటక సాహిత్య పరిషత్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మహేష్‌ జోషి, ఆర్యభట్ట కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హెచ్‌.ఎల్‌.ఎన్‌.రావు, తెలుగు హీరో రాంకీ, కన్నడ డైరెక్టర్‌ క్రాంతిప్రసాద్‌, సాయిమారుతి కనస్ట్రక్షన్స్‌ ప్రసాద్‌, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

gajuwaka

2025-05-26 12:54:26

నాడు సంప్రోక్షణ లేదుగానీ.. నేడు అప్పన్నను శాంతి పరుస్తారా..?!

భారత దేశ వ్యాప్తంగా చిన్నపాటి ఆలయం నుంచి పెద్ద పెద్ద  దేవస్థానాల వరకూ.. ప్రధాన ఆలయం ప్రాంగణంలోకి కుక్క దూరినా.. ఉత్స వమూర్తి సంచరించే మాఢవీధుల్లో ఎవరైనా కాలం చేసినా ఆలయం మొత్తం  పసుపు నీటితో శుద్ధి చేస్తారు.. సంస్రోక్షణ చేస్తారు.. అలాంటిది ఏకంగా ఏడురు ప్రాణాలు ఆ దేవ దేవుడు లక్ష్మీనారసింహుడు నడయాడే మాఢవీధుల్లో ఏడుగురు భక్తులు హరీమంటే ఆలయంలో సంప్రో క్షణ చేయలేదు. పైగా ఇపుడు శాంతి పూజలా..? పీనుగలు లేచిన రోజున లేని శాంతి పూజ ఆలోచన ఇపుడు నిర్వాహకులకు ఎలా వచ్చిం ది..? 

స్వయంభూ లక్ష్మీనారసింహుడిని నిజంగా శాంతి పరచాలంటే.. గోడ కూలిన రోజునే ఒక్క గంట స్వామివారి దర్శనాలు నిలుపుదల చేసి ఆఘమేఘాలపై ఆలయం మొత్తం సంప్రోక్షణ చేసి ఉండాలి.. అలా కాని పక్షంలో నిజంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక.. కనీసం ట్యాంక్ డ్రోన్ తోనైనా పసుపునీటిని జనం మధ్యలోనే అప్పన్న భక్తులు దుర్మరణం చెందినందుకు పసుపు నీళ్లు చల్లించాలి. అవేమీ చేయకుండా వేల సంఖ్యలో జనాలను మైలుతోనే ఆలయంలోనికి పంపిన దేవస్థాన వైదిక సిబ్బందిని ఏమనాలి.. అసలు వీరికి వైధిక ధర్మాలు, ఆచార, నియమాలు తెలుసునా లేదా..? అప్పుడు గుర్తుకి రాని పూజలు.. ఇప్పుడు గుర్తొచ్చాయా.. కనీసం పీనుగలు లేచిన చోట మూడవ రోజైనా పూజలు చేసి, సంప్రోక్షణ చేయాలి కదా అంటే.. అబ్బే అవసరం లేదంటున్నారు ఇక్కడి వారు..  నిజంగా సింహగిరిపై వైధిక ధర్మం మంట గలిసిపోలేదా అంటే మాత్రం.. అదేం కాదులే.. అవసరం లేదులే... చందనోత్సవం రోజు గోడ పడిపోయిన ప్రదేశం ఆలయం పరిధిలోనికి రాదు.. కనుక ఆలయానికి మైలు అంటదు.. అంటున్నాయి సింహాచల దేవస్థాన వర్గాలు.

 మరి జనంలో ఉన్న భక్తులు ప్రమాదంలో చనిపోతే.. వారిని ముట్టుకున్న జనం గర్భగుడిలోనికి వెళితే.. దానిని ఏమంటారు..? అది మైలు కాదా..? చందనోత్సవం రోజున క్యూలైన్ లో ఉన్న భక్తులే కాదు.. ఘటనా ప్రదేశంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సహాయక చర్యల్లో ఉన్నవారు అందరూ మైలు పడ్డారు. కారణం ప్రమాదంలో మృతిచెందిన వారిని సిమ్మెంటు ఇటుకలు మధ్య నుంచి తొలగించే సమయంలోనూ, మృతదేహాలను వ్యానుల్లోకి ఎక్కించే సమయంలోనూ.. ఒకరినొకరు ముట్టుకున్న వేళ అందరూ మైలు పడినట్టే లెక్క. కనీసం సంప్రోక్షణ చేయని ఆలయ సిబ్బంది కనీసం ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో సైతం పసుపు నీళ్లు భయట నుంచి.. ప్రమాద స్థలాన్ని దాటుకొని వచ్చిన వారిపైనా చల్లించే ఏర్పాటూ చేయలేదు. ఇపుడు తగుదనమ్మా అంటూ శాంతిపూజలు ఎవరికోసం చేస్తున్నట్టో దేవస్థాన ఆధికారులు, అర్చ కులు, వైదిక ధర్మం తెలిసిన వారే చెప్పాల్సి వుంది. 

అలా అంటే మాత్రం మాకు నియమాలు తెలుసునని.. అవసరం వచ్చినపుడు ఆదేశాలొచ్చినపుడు అప్పడప్పుడు చేస్తాం లేండి అంటున్నారు.. నిజమే దేవుడితో పరచాకాలు.. అవసరం వచ్చినపుడే ఆచారాలు గుర్తుకు వస్తే ఈ విధంగానే వుంటుందంటూ భక్తులు ఒంటి కాలపై లేస్తున్నారు. సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా కాలం చేస్తేనే వారు ఏడ నుంచి `11 రోజులు బయటకు రారు. అదే ఇంట్లో చనిపోతే ఆరు నెలలు ఆ గదులు మూసేస్తారు.. మంచి గడియల్లో జరిగితే హోమాలు చేసి, శుధ్ధి చేసి, ధానాలు, ధర్మాలు ఆచరించి గానీ ఆ ఇంట్లో కార్యకలాపాలు చేయరు. అలాంటిది అప్పన్న ఆలయంలో ఏడుగురు భక్తులు మృతిచెందిన వేళ.. కనీసం స్వామి ఆలయాన్ని శుద్ధి చేయకపోవడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వైధికం తెలిసిన వారు కూడా ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడితే తమను అంటారనుకొని ఆచార వ్యవహారాలు తెలిసిన పండితులు కూడా సింహాచలం ఘటనపై నోరు మెడంప లేదు. కారణం విషయం మొత్తం రాజకీయం అవుతోందిని..

నీతి, ధర్మం, న్యాయం, వైదికం, శాస్త్రం తెలిసిన నేతలనూ తప్పుబట్టించారు..
సింహాచలంలో అప్పన్న చందన యాత్ర రోజున చందన యాత్రకు బదులు.. శవయాత్ర జరిగినపుడే కూటమి నాయకులు, ఆలయాన్ని శుద్ధిచేయాలని సూచిస్తే.. అవసరం లేదు.. ఘటన ఆలయం బయట జరిగింది కదా ఆలయానికి మైలు అంటదని కొందరు ఆలయ సిబ్బంది, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానీయలేదట. అంతేకాదు.. ఈ విషయంలో జిల్లా అధికారులు గానీ, దేవస్థాన అధికారులు గానీ ఎవరూ ఏమీ మాట్లాడకుండా పై నుంచి వచ్చిన ఆదేశాలు.. అధికారులు, చెప్పినట్టుగానే అంతా నడుచుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి చందనయాత్ర రోజున అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్మణాల ఘటన తరువాత ఆలయాలన్ని సంప్రోక్షణ కాదు కదా.. కనీసం శుద్ధి కూడా చేయలేదనే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ వెలుగులోనికి తీసుకొచ్చింది. 

అయితే ఇపుడు ఆ విషయం రాజకీయం అవుతున్నవేళ.. మళ్లీ దేవస్థాన అధికారులు, అక్కడి వైదిక సిబ్బంది సింహాద్రి అప్పన్నను శాంతి పరచడానికి శాంతిపూజలు, హోమాలు చేస్తే సింహాద్రి అప్పన్న శాంతిస్తాడని చెపుబుతున్నా. అలా అయితే అప్పన్న భక్తులు మృతిచెందిన మరుసటి రోజైనా చేయాలి కదా అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఇపుడు అధికారులు, నేతలు తీసుకున్న నిర్ణయాలుపై భక్తుల నుంచి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న వారికి సనాతన ధర్మాలు, సంప్రోక్షణలు, శాంతి పూజలు, హోమాలుపై ఎంత వరకూ అవగాహన ఉందో తెలియదు గానీ.. నాడు చేయని శుద్ధి..నేడు విషయం రాజకీయం అవుతున్నవేళ చేస్తే ఆ పాపం దేవ దేవుడి రూపంలో ఆలయానికి అరిష్టంగా మారదా అనేవారికి.. ప్రశ్నిస్తున్నవారికి ఎవరు ఏ విధంగా సమాధానం చెబుతారు. అదేసమయంలో ఆరోజు సంప్రోక్షణను దాటవేసినందుకు నేడు జరుగుతున్న రాజకీయం కారణంగా నిజంగానే సంప్రోక్షణ చేయడానికి వీలు లేకుండా పోయింది. 

వాస్తవానికి పీనుగలు లేచిన చోట కనీసం పసుపునీళ్లతో అయినా శుధ్ది చేయాలి.  ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేయాలి.. అలా చేయకుండా ఆరోజు వేలాది మంది భక్తులు రావడం, ప్రమాదం జరిగిందని తప్పించుకున్న సింహాచలం దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం మూడవ రోజైనా ఆ పనిచేసి ఉంటే బాగుండేదనే ఆచార వ్యవహారాలు తెలిసిన వారు సూచిస్తున్నారు. కానీ ఈ విషయం రాజకీయం అయిన తరువాత చేస్తే.. తమ మాట పోతుందని.. నిజంగానే వైధిక ధర్మాలు తెలియవని ప్రక్కపార్టీల దగ్గర పరువు పోతుందనే నెపంతో నిజంగా ఆలయానికి సంప్రోక్షణ చేయకుండా అడ్డు పడినట్టు అయ్యింది నేడు. 

 నిజంగా దేవుడి ముందు వైధిక ధర్మాలు, ఆలయ నియమాలు, నిబంధనలు, ఆచారాలు కంటే ఒక్కోసారి రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడానికి అప్పన్న చందనోత్సవ వేళ ఏడుగురు భక్తులు మృతిచెందిన తరువాత చేయని ఆలయ సంప్రోక్షణ నిజంగానే ఈ విషయంలో చేయకుండా పోవడానికి కారణం అవుతుందని నిజమైన వైదికులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులే మరే ఇతర దేవస్థానంలోని దేవుళ్లకు రాకూడదని వేల వేల దండాలు పెడుతున్నారు.. చందన దారి నీ గుడిలో జరిగిన ఈ తప్పుని మంచి మనసుతో మన్నించమని వేడుకుంటున్నారు. కనీసం తరువాత రోజుల్లో అయినా వైధిక ధర్మాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఆలయ శుద్ధి సంప్రోక్షణలు, హోమాల విషయంలో అనాలోచితంగా ఆలోచించేవారికి తెలియజేసేలా చేయమని వేడుకుంటున్నారు.. ?!

visakhapatnam

2025-05-02 20:22:31

గుర్తుపెట్టుకొని మరీ.. వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన ఎమ్మెల్యే వంశీక్రిష్ణ..?!

రాజకీయంలో శాస్వత శత్రువులు.. శాస్వత మిత్రులు ఉండరంటారు.. కానీ జనసేన ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ విషయంలో మాత్రం ఆ రెండింటికీ ఆపోజిట్ లోనే జరిగింది.. కాదు కాదు.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తన దమ్ము నిరూపించుకున్నాడు ఎమ్మెల్యే వంశీ.. అవును ఏంటా రిటర్న్ గిఫ్ట్ అనుకుంటున్నారా.. తనని మేయర్ సీట్ పై కూర్చోబెడతానని ఎమ్మెల్యేస్థాయి వ్యక్తిని కార్పోరేటర్ గా నిలిబెట్టి.. అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ ను చేసింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఆ సమయంలోనే యాదవులు, వంశీ వర్గీయులంతా వైఎస్సార్సీపీపై కారాలు మిరియాలు నూరారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వంశీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. రెండుమూడేళ్లు పదవిని అనుభవించిన వంశీ.. ఎందకనో ఆ పదవిలో ఉండకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి 2024 ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.. కట్ చేస్తే.. వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇచ్చారనేది ఒక్కసారి పరిశీలిస్తే.. 

తనను విశాఖ మేయర్ ని చేస్తానని ఎమ్మెల్యేస్థాయి వ్యక్తిని కార్పోరేటర్ గా నిలబెట్టి.. ఆపై వైఎస్సార్సీపీ విశాఖ మేయర్ స్థానాన్ని గొలగాని హరివెంకట కుమారికి కట్టబెట్టింది. ఆనాడే తాను యాదవుడని.. తనను నమ్మించి మోసం చేస్తారా..? తన ఉసురు తప్పక తగుతులుందని తన వర్గీలయుంతా అలకబూనారు. అయితే మంచి పదవి ఇస్తే ఆ అలకపోతుందని భావించిన వైఎస్సార్సీపీ  ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయినా తనకి జీవిఎంసీ మేయర్ విషయంలో జరిగిన అవమానం మాత్రం వంశీక్రిష్ణ మదిలో అలాగే ఉండిపోయి వుంటుందని నేటి అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత తెరపైకి వచ్చిన హాట్ టాపిక్ విశ్లేషకుల అంచనాలకు వార్తగా మారింది. చులకైన చోటే చక్రం తిప్పి.. అదే వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేసిన గ్రౌండ్ లెవల్ నెట్వర్క్ ఇపుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. అంటే ఒక పార్టీలో అవమానం జరిగితే.. అవకాశం వచ్చినపుడు అవమానించిన పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చు అనే విషయాన్ని వంశీ ఎత్తుడ ద్వారా మరోసారి రాజకీయ పార్టీలకు తెలిసి వచ్చినట్టు అయ్యింది. 

ఆ నాడు కార్పోరేటర్ గా నిలబెట్టి మేయర్ ఇవ్వకుండా అవమానించిన అదే వైఎస్సార్సీపీ అభ్యర్ధిని అవిశ్వాసంతో క్రిందికి దించి వంశీ తన సత్తాను వైఎస్సార్సీపీ తెలియజేశాడని... అంటే ఈ లెక్కన రాజకీయపార్టీలు ఎపుడైనా నమ్ముకున్న పార్టీలు, పార్టీలోని వ్యక్తులు మోసం చేస్తే.. ఎప్పటికైనా రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం తప్పదనే సంకేతాన్ని వంశీల జివిఎంసీ మేయర్ అవిశ్వాసం నెగ్గిన తరువాత ఇచ్చినట్టు అయ్యింది. ఇదే విషయాన్ని అటు వైఎస్సార్సీపీలో కూడా పార్టీనేతలు చర్చించినట్టు తెలిసింది. నాడు మనం అవమానించిన ఫలితం...నేడు కార్పోరేటర్లను, మేయర్ స్థానాన్ని కోల్పోయామని.. కానీ వంశీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇంత చేస్తాడని అనుకోలేదని వైఎస్సార్సీపీలోని ఒక నేత అవిశ్వాసం నెగ్గిన తరువాత వ్యక్తం చేశారట. ఆ విషయం తెలిసిన వారు కూడా ఇద్దరికే చెప్పడం మొదలు పెట్టారు(ఒకటి అడిగిన వారికి రెండు అడగని వారికి) దీనితో అందరినోటా ఆ విషయం చర్చనీయాంశం అయ్యింది.  అంతేకాదు ఒక దశలో కూటమికి కార్పోరేటర్ల కూర్పు తగ్గినపుడు కూడా వంశీ వేసిన ఎత్తుగడ, ఆడిన రాజకీయపాచికలు మామూలువి కావు.  

అవిశ్వాసంలో కూటమి మొత్తం శ్రమించినా.. అందులో అగ్రభాగం మాత్రం వంశీ మాత్రమే చేశారనే విషయం అవిశ్వాసం తరువాత తేటతెల్లమైంది. అనుకున్న స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయపార్టీలు ఏమైనా చేస్తాయనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కానీ అదే రాజకీయంలో మనసులో గూడుకట్టుకున్న సంఘటనలు సమయం వచ్చినపుడు అలా చేసిన పార్టీలకు, వ్యక్తులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా చేస్తాయనే విషయం ఇపుడు ఎమ్మెల్యే వంశీ విషయంలో రుజుంవైందని మాత్రం విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి నెగ్గడానికి కార్పోరేటర్ల కూర్పులో తెరవెనుక చాలా మంది టిడిపి నేతలు హస్తం వున్నా.. ఆ విషయం బయటకు రాలేదు. కావాలనే కూటమిలో ని కొందరు నేతలు బయటపెట్టలేదు. ఆ విషయంలో పలువురు టిడిపినేతలు అలకబూనారు కూడా. మనం ఎంతచేసినా పార్టీలో విలువలేకుండా పోతుందని కూడా సమావేశాలు పెట్టి చర్చలకి తెరలేపారు. ఎన్నిచేసినా.. ఏం చేసినా ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ విషయంలో జరిగిన జివిఎంసీ మేయర్ ఎపిసోడ్.. కూటమి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో తెరపైకి మాత్రం వంశీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంతో సఫలీకృతుడు అయ్యాడనేది మాత్రమే చర్చనీయాంశం అయ్యింది..?!

visakhaptanam

2025-04-19 14:35:25

జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు..! ఆపై లాంగ్ లీవ్ పై వెళ్లిపోయిన డాఝాన్సీలక్ష్మీభాయ్

విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలోని దళిత ఉద్యోగిని సుష్మాపై చేయిచేసుకోవడంతోపాటు కులం పేరుతో దూషించడంతో ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీనితో కేసు నమోదు విషయంలో జరిగిన హైడ్రామాకి తెరపడింది. నాలుగురోజుల పాటు అటు పోలీసులు, ఇటు రెవిన్యూ అధికారులు బెదిరించైనా కేసు నమోదు కాకుండా రాజీ చేయాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈరోజు-ఈఎన్ఎస్ లో వరుస కథనాలు రావడం, దళిత సంఘాలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం, బాధితురాలు కేసు కట్టాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టక తప్పలేదు. ఈ సమయంలో కేసు పెట్టకుండా ఉండేం దుకు ఇన్చార్జి ఆర్డీ ఆయుష్ కమిషనరేట్ నుంచి కమిషనర్ మొదలు కొని రాజకీయంగా తనకున్న పలుకుబడి మొత్తం వినియో గించినా ఫలితం లేకుండా పోయింది. అదేసమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించిన మీడియాలో దళిత ఉద్యోగినే తనను కొట్టిందని అనుకూల వార్తలు రాయించినా కూడా కేసు ఎఫ్ఐఆర్ కాకుండా ఆపలేకపోయాయి. 

అదే సమయంలో విశాఖ సిపీ శంఖబ్రత బాగ్జీ చొరవ తీసుకోవడం కూడా దళిత మహిళా ఉద్యోగిని విషయంలో కేసు నమోదు కావడానికి ఉపయోగపడింది. గత కొద్దిరోజులుగా అన్ని వ్యవహారాల్లోకి తలదూర్చి తనను ఎవరూ ఏమీ చేయలేరని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేరని బీరాలు పోయి అటు దళిత వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని కూడా బెదిరించి మరీ నాలుగు రోజుల పాటు కేసు నమోదు కాకుండా ఆపించుకున్నారు. అయితే అన్నిరకాలుగా బాధిత దళిత ఉద్యోగిని వైపే వాస్తవాలు కనిపించడం, అదే సమయంలో దళిత ఉద్యోగులు కూడా తమను మాలనాకొడకా.. మాదిగ నా కొడకా అని కులం పేరుతో దూషించిన ఫిర్యాదు ఆయుష్ కమిషనర్ కి చేరడం, విమ్స్ ఆసుపత్రిలోకి ఆర్డీడి కార్యాలయం తరలింపు విషయంలో ఈ గొడవలు మొత్తం విమ్స్ డైరెక్టర్ కి తెలిసి ఆయన విమ్స్ లోనికి రానీయ కుండా అడ్డుకోవ డంతో.. ప్రాధమికంగా జరిగిన విచారణలో ఆర్డీడికి అన్నీ వ్యతిరేక అంశాలు కనిపించడంతో ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయక తప్పలేదు.

-ముందే పసిగట్టి వార్నింగ్ ఇచ్చిన ఆయుష్ కమిషనర్
విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అవుతుందని ముందుగానే భావించిన కమిషనర్ డి.మంజుల ఇన్చార్జీ ఆర్డీడిని లాంగ్ లీవ్ పై వెళ్లమని ఆదేశించారట. అయితే తాను ఎలాగైనా ఎస్సీ, ఎస్టీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చూసుకుంటానని, అదే సమయంలో తనను లైంగికంగా వైద్యులు కూడా వేధించారని కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు. మీడియాలో వరుస కథనాలు ఇన్చార్జి ఆర్డీడికి వ్యతిరేకంగా రావడంతో ఆఖరిసారిగా శనివారం కమిషనరేట్ నుంచి ఫోన్ చేసి హెచ్చరించడంతో రాత్రికి రాత్రికి ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారు. అదీ కూడా ఉదయం తనపై ఫిర్యాదు చేసిన దళిత వైద్యుడు పనిచేసే సింహాచలం డిస్పెన్సరీకి ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం.. అక్కడ ఎవరూ లేకపోవడంతో రిజిస్టర్లు తనిఖీలు చేసి ఆ రిపోర్టుని కూడా కమిషనరేట్ కి పంపించిన తరువాత మాత్రమే  ఆమె లాంగ్ లీవ్ లోకి వెళ్లడం విశేషం. 

అంతేకాదు.. తనపై వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులను కానీ,  తనపై ఫిర్యాదులు చేసిన ఆయుష్ సిబ్బందిని, వైద్యులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని చెప్పి మరీ లాంగ్ లీవ్ లోకి వెళ్లిపోయారు. విశేషం ఏంటంటే సీనియారిటీ లిస్టుని, రోస్టర్ పాయింట్స్ ను కాదని ఇన్చార్జి ఆర్డీడి విధుల్లోకి చేరిన దగ్గర నుంచి సీనియర్ వైద్యులను, సిబ్బందిని ఇబ్బందులు పెట్టడంతో మొత్తమంతా ఏకమై కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దానిని మనసులో పెట్టుకున్న ఇన్చార్జి ఆర్డీడి అందరినీ విధులకు సక్రమంగా రావడం లేదనే కారణం చూపి వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే దళిన ఉద్యోగిని సుష్మాపై చేయిచేసుకోవడంతోపాటు కార్యాలయ సిబ్బంది అందరి ముందు వార్నింగ్ ఇచ్చి ఇకపై టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తానని కూడా బెదిరింపులకు దిగారు. అన్నీ వెరసి ఎస్సీ, ఎస్టీ కేసుకు దారితీశాయి. కొసమెరుపు ఏంటంటే ఆయుష్ లోని డాక్టర్లుగా విధులు నిర్వహిస్తూనే.. విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చాలా మంది డ్యూటీ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని రెడ్ హేండెడ్ గా పట్టుకోవాలని ముందస్తు సమాచారం ఆకస్మిక తనిఖీలు చేసే సమయంలోనే కొందరు వైద్యులు తమను వేధిస్తున్నారంటూ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

visakhapatnam

2025-02-23 05:50:59

ప్రధాని మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకం - డా.కంచర్ల

ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకమనే విషయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ఉదాహరణ అని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) గౌరవాధ్యక్షలు డా.కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీ విజ యం ప్రధాని మోడీ  పాలన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి తిరుగులేని సంకేతమన్నారు. అంతేకాకుండా అవినీతి, కుంభకోణా ల్లో కూరుకుపోయిన ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఓటమి చెందడం ఆ పార్టీపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతకు చెంపపెట్టని అభివర్ణించా రు. ఢిల్లీ వాసులు ఆప్ పరిపాలనపై ఎంత విసుగు చెందారో చెప్పడానికి వచ్చిన ఫలితాలేనని చెప్పుకొన్నారు. దానికితోడు ఢిల్లీలో తెలుగు ప్రజ లున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రచారం అద్భుతమైన ఫలితానిచ్చిందనడానికి ఇంతకు మించి ప్రధాన ఉదా హరణ మరొక్కటి ఉండదన్నారు. 2025 కూటటి విజయాల పరంపర డిల్లీ వరకూ పాకిందన్నారు. ఇదే ఊపుతో అన్ని రాష్ట్రాల్లో కూటమి విజ య దుందుబి మోగిస్తుందనే ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిల్లీలో బీజేపీ మిత్రపక్ష విజయం పట్ల డా. కంచర్ల హర్షం వ్యక్తం చేశా రు. 

visakhapatnam

2025-02-08 16:54:06

కరక రంగురాళ్ల క్వారీపై రాజస్థాన్ రిపోర్ట్..?!

గొలుగొండ మండంలోని కరక రంగు రాళ్ల క్వారీలో లభ్యమవుతున్న అలెక్స్ సిసలైన పచ్చవైడూర్యం మామూలు రాయి కాదు.. దేశంలోనే అత్యంత విలువైన రాయి.. ఈ రాయిని మిషన్ పై కోతవేసి రూపు రాళ్లకి మరింత గిరాకీ.. ఇక్కడ సంపదను వెలికి తీస్తే భారత దేశం అగ్రరా జ్యం అమెరికాను మించిపోతుంది.. అత్యంత సంపన్నమైన దేశంలా మారుతుంది.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ.. కరక రంగు రాళ్ల క్వారీలోని రంగురాయిని నవరత్నాల ల్యాబులో పరిశీలించిన నిపుణులు.. ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసి మరీ రాయి నాణ్య తను పరిశీలన చేయించారట.. దానితో కరక ప్రాంతం మొత్తం వసమైతే రాత్రి రాత్రికి దేశంలోని అత్యంత సంపన్నులు అయిపో వాలనేది వ్యాపా రుల లక్ష్యం.. అంతే రంగంలోకి గనులు భూగర్భ శాఖ అధికారులను రంగంలోకి దించారు.. విషయం ఏంటంటే సుమారు 20 హెక్టార్ల కొండ ప్రాంతాన్ని పదేళ్లకు లీజుకి తీసుకోవడానికి.. కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది.. రంగురాయి వ్యవహారం బగ్గుమంది..?!

అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలంలోని కరక రంగురాళ్ల క్వారానీ ఎలాగైనా లీజుకి అధికారికంగా కాజేయాలనే రంగురాళ్ల వ్యాపారుల ప్రయత్నం బెడిసి కొట్టింది. దేశంలోనే అత్యంత విలువైన రంగురాళ్లు లభ్యమయ్యే రంగురాళ్ల క్వారీని కొందరు ప్రజాప్రతినిధుల అండతో లీజు రూపంలో కొట్టేయాలని చూసిన ప్రయత్నం వెనుక వేల కోట్ల రూపాయల ప్లాన్ దాగి వుందంటే అతిశయోక్తి కాదేమో. అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. కరక రంగు రాళ్ల క్వారీ కోసం తెలియని దేశం లేదు.. ఇక్కడ దొరికే అత్యంత విలువైన రంగురాళ్లని కొనని రంగురాళ్ల వ్యాపారీ లేడు. అంతెందుకు ఇక్కడ వ్యపారం చేసిన గేదెలను కాసే రైతు నర్సీపట్నంలో కోటీశ్వరుడయ్యాడు.. టీ షాపు నిర్వహించే ఛాయ్ వాలా సూపర్ మార్కెట్ ఓనర్ అయ్యాడు.. ఇపుడు ఏకంగా అంతకుమించి ఆదాయం మళ్లీ అదే రంగు రాయి నుంచి వస్తుంటే ఎవరు మాత్రం వదిలేస్తారు చెప్పండి.

 దానికోసమే.. రంగురాళ్ల వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి కరక రంగు రాళ్ల కొండ కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. గనులు భూగర్భ శాఖ ద్వారానే అధికారికంగా లీజు తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అంతా అఫిషియల్ గానే పావులు కదిపారు. దీనితో నిషేధిత అటవీ ప్రాంతంలోకి గనులు భూగర్భ శాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు మోకాలు అడ్డుపెట్టారు. ప్రభుత్వ సమాచారం, అధికారిక లేఖ లేకుండా ఏవిధంగా రిజర్వు ఫారెస్టులోకి అడుగు పెడతారని.. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్న ప్రాంతంలో సర్వేలు ఎలా చేస్తారంటూ అనధికార వ్యవహారం నడుపుతున్న వారిని అదపులోకి తీసుకున్నారు. అయితే సాధారణ సర్వే అనే అందరికీ తెలిసినా విషయం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ జరిగిన రంగు రాళ్ల వ్యాపారుల సమావేశం కాస్త బయటకి వచ్చేసింది. దీనితో పక్కా ప్లాన్ ప్రకారమే మైనింగ్ అధికారులు కరక రంగురాళ్ల కార్వీలోకి అడుగుపెట్టినట్టు తేలిపోయింది. 

అయినా రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లాలంటే ముందుగా అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. లేదంటే జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతి అయినా తప్పని సరి.. అవేవీ లేకుండా  నర్సీపట్నం భూగర్భ గనుల శాఖకు చెందిన రాయల్టీ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి ని, ఆశాఖ ఉన్నతాధికారులు సర్వేకి వెళ్ళమని ఆదేశించారని.. ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొనడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. ఎన్నికల ముందు జరిగిన రంగురాళ్ల వ్యాపారుల సిండికేట్ వ్యవహారం ప్రభుత్వం ఏర్పాటు కాగానే లీజు దక్కించుకునేందు తెరవెనుక ఉన్న వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సీఎఓం స్థాయిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే  మైనింగ్ అధికారులతో పాటు గతంలో రంగురాళ్ల స్మగ్లింగ్  కేసులు ఉన్న కొందరు వ్యక్తులు కూడా, రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీస్తున్నది. 

మైనింగ్ అధికారి వెంట  మరో ఆరుగురు వ్యక్తులు  కరక కొండపైకి వెళ్లడం చర్చనీయాంశం అవుతున్నది. కాగా ఈ వ్యహారం నడిపించేందుకు కొందరు వ్యాపారులు రూ.35 లక్షలు ఖర్చుచేసి అధికారికంగా మైనింగ్ అధికారులను కరక క్వారీపై సర్వేకి పంపినట్టు తెలిసింది.  కరక కొండపై సుమారు 20 హెక్టార్లు  విస్తీర్ణంలో రంగురాళ్ల తవ్వకాల కోసం అనుమతులు తీసుకుంటామని, ముందుగా రంగురాళ్లు లభించే ప్రాంతం కోసం సర్వే చేయాలని వీరు మైనింగ్ అధికారులతో కలిసే రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారని తెలిసింది.  కరక రంగురాళ్ల క్వారీలో అక్రమంగా  కొన్ని ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. ఇక్కడ క్వారీలో జరిగిన ప్రమాదాల్లో  పలువురు చనిపోవడంతో ప్రభుత్వం అక్రమ తవ్వకాలను నిరోధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రంగురాళ్ల వ్యాపారులు తెలివిగా మైనింగ్ అధికారులను రంగంలోకి దించారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు దరఖాస్తు లేనప్పుడు మైనింగ్ అధికారులు సర్వేకి ఎలా వస్తారని అటవీశాఖ ప్రశ్నిస్తోంది.  

రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ అనుమతి లేకుండా ప్రవేశించడం నిషిద్ధమని.. ఈ విషయాన్ని తాము అటవీశాఖ ముఖ్య అధికారులకు తెలియజేశామని చెబుతున్నారు.   గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి తో పాటు గొలుగొండ మండలం సారిక మల్లవరం గ్రామానికి చెందిన రంగురాళ్ల వ్యాపారి కొల్లాన కొండలరావు, ఎల్లవరం గ్రామానికి ఆల్లు నూకరాజు రాజు , చోడవరం ప్రాంతానికి చెందిన పోతి శివకుమార్, కూర్మ దాసు అప్పలనాయుడు, ఒంటెద్దు వీర నాగేశ్వరరావు, రామచంద్రరావు అనేవారిని అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని నర్సీపట్నం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీ నర్సు చెప్పారు. రిజర్వ్ ఫారెస్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నా మన్నారు. తేడాలు బయట పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రేంజర్ చెప్పారు. కానీ.. తెరవెనుక జరిగిన వ్యవహారాన్ని మాత్రం ఇటు అటవీశాఖ అధికారులు కూడా దాచిపెడుతున్నట్టు తెలిసింది. గనులశాఖకు ముందుగా లక్షల్లో కమిషన్లు ఇచ్చారని.. అంటే చాలా పెద్ద స్థాయిలోనే కరక రంగురాళ్ల క్వారాని తిరిగి అధికారికంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నారని తేలిపోయింది. చూడాలి..ఈ విషయంలో తెరవెనున్న ఉన్నవారిని ఏ ప్రభుత్వశాఖ బయటపెడుతుందో..?!

golugonda

2025-02-01 14:52:02

విశాఖలోని రుషికొండ పేలస్ లోపలా ఎలా ఉందో చూశారా..?

వైఎస్సార్సీపీ ప్రజాధనాన్ని వందల కోట్లలో వెచ్చించి మరీ నిర్మించిన రుషికొండ చాలా కాలం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడిం ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు మొత్తం రుషికొండ మొత్తం ప్రత్యే కంగా షూట్ చేయించింది. ఆ వీడియో కాస్త దేశవ్యాప్తంగా ఇపుడు వైరల్ అవుతున్నది.

visakhapatnam

2025-01-26 15:56:09

విశాఖలో రోడ్డెక్కిన సచివాలయ సిబ్బంది..

విశాఖలో వార్డు సచివాలయ సిబ్బంది రోడ్డెక్కారు. టిడిపికి చెందిన ఒక కార్పోరేటర్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు నిరసన ఉద్యోగులంతా రోడ్డెక్కారు. జీవిఎంసి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ప్రజాప్రతినిధులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

visakhapatnam

2025-01-26 15:53:03

అనకాపల్లిలో దాడి మౌనం దేనికి సంకేతం..?!

అనకాపల్లి రాజకీయాల్లో దాడివీరభద్రరావుది ప్రత్యేక స్థానం.. పాత్ర.. క్యాడర్ కు దిశా నిర్ధేశం.. చిటికెవేస్తే క్యాడర్ మొత్తం కళ్లముందుంటారు.. ఆదేశించిన పనిని ఐదునిమిషాల్లో చేయిస్తారు.. ప్రజల మనిషిగా.. పార్టీ నేతగా ఎంతో పేరు, హోదా, హుందా ఉన్న నేత ఇపుడు ఎందకనో మౌనం పాటిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంతోపాటు, ఇతర నియోజవర్గాల్లోనే దాడి పాచికలు ఎంతగానో పనిచేశాయి. క్యాడర్ కూడా గట్టిగా పనిచేశారు. మంచి విజయాన్ని సాధించారు. అపుడే అంతా దాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని. కానీ ఆ ఊసే లేదు తెలుగుదేశం పార్టీలో. ప్రధాన కార్పోరేషన్ పదవులు.. చరిష్మా ఉన్న పదవులన్నీ చాలా మంది జూనియర్లకే కట్టబెట్టేస్తోంది టిడిపి. అపుడు కూడా దాడి ఊసుగానీ.. మాట గానీ లేదు. అలాగని పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా దాడి ప్రస్తావనే ఉండటం లేదు. చోట నాయకులు స్టేజీల మీద హుందా కనిపిస్తుంటే ఎంతో సీనియర్, పార్టీకోసం శ్రమించిన వ్యక్తి విషయంలో పార్టీ వెనకడుగువేస్తుందా.. లేదంటే కూటమి నేతలే ప్రక్కన పెట్టారా..? 

అసలు ఏం జరుగుతందని అనకాపల్లి నియోజకవర్గంలో దాడి మౌనంగా ఉంటున్నారనే విషయం ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా.. ఏమవుతున్నా.. ఇటు దాడి వీరభద్రరావు సైతం మౌనాన్ని వీడి అసలు ఏం జరుగుతుంది.. ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని క్యాడర్ తో కూడా చర్చించడం లేదు. దీనితో ఆయనకోసం, పార్టీ సూచించిన అభ్యర్ధుల గెలుపు కోసం పనిచేసి వారంతా ఇపుడు డీలా పడిపోతున్నారు. అధినేత యాక్టివ్ గా లేకపోవడంతో.. కూటమి నేతల కార్యక్రమాలకు కూడా కొందరు దూరంగానే వుంటున్నారు. తమ నాయకుడిని పార్టీ గుర్తించలేదన్నట్టుగానే క్యాడర్ మొత్తం నిరాశగా ఉన్నారు. పండుగలు, పబ్బాలు, ఎన్నికలే కాదు ఏ విషయంలోనైనా దాడి వీరభద్రరావుది జిల్లాలో ప్రత్యేక స్థానం.

 అలాంటిది ఎన్నికల్లో ఎంతో గట్టిగా పనిచేసిన ఈయన ఒక్కసారి తెరమరుగు అయిపోయినట్టుగా కనీసం ఎక్కడా కనిపించ కుండా తిరుగుతుండటం దేనికి సంకేతమో ఎవరీ అర్ధం కావడం లేదు. అలాగని పార్టీలో ఎంతో కీలకంగా పనిచేసిన దాడి ఇద్దరు తనయులు కూడా తండ్రి బాటలోనే నెమ్మదైపోయారు. ఎప్పుడూ మీడియా వేదికగా అన్ని విషయాలు చర్చించే దాడి కుటుంబం అధికారిక కార్యక్రమాలకు దూరమవడం, ప్రభుత్వం కూడా కీలకమై పదవుల్లో వీరిని గుర్తించి పదవులు కట్టబెట్టకపోవడం కూడా క్యాడర్ కి రుచించడం లేదు. ఎన్నికల ముందు బాహాటం వైఎస్సార్సీపీని కాదని సొంత పార్టీ టీడిపిలోకి వచ్చి. నియోజవకర్గంలో తన పట్టుని నిలబెట్టిమరీ కూటమి అభ్యర్ధుల గెలుపు విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. 

ఎన్నికల సమయంలో దాడి సహకారం కోరిన ఎమ్మెల్యే కొణతాల.. ఎంపీ సీఎం రమేష్ లు సైతం ఇపుడు ఎక్కడా ఎప్పుడూ దాడి ఊసెత్తకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. పార్టీలోని యాక్టివ్ గా పనిచేసే నాయకులు తటస్థంగా ఉన్నా.. మౌనంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పార్టీలో ఒక వ్యతిరేక సంకేతం వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది క్యాడర్ కూడా దాడి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వీళ్లు కూడా వెళ్లడం మానేస్తున్నారు. అలాగని నేతలు కూడా ఈయనను పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ ఇదంతా పార్టీ ఆదేశమా..? లేదంటే కావాలని చేస్తున్నారా..? అదీ కూడదంటే పదవులు ఇవ్వాల్సి వస్తుందని ఈ రకంగా చేస్తున్నారో తెలియడం లేదుంటున్నారు నియోజకవర్గంలోని క్యాడర్. 

మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా అనకాపల్లి రాజకీయాలను శాసించిన దాడి ఇపుడు ఒక యోగిలా మౌనం వహించడం మాత్రం రానున్న రోజుల్లో పెను మార్పులకే సంకేతం అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో స్వయంగా దాడి గానీ.. లేదంటే టిడిపి.. అదీ కాదంటే కూటమి నేతలే ఈయన మౌనం వెనుక అసలు విషయాన్ని క్యాడర్ కి చెప్పాల్సిన సమయం ఆశన్నమైంది. లేదంటే ప్రస్తుతం ఉన్న క్యాడర్ కూడా పకి పనిచేస్తున్నట్టు నటించి.. తమ నేతను ప్రక్కన పెట్టేస్తే తామెందుకు పనిచేస్తామని అనుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ఫలితాలు స్పష్టంగా కనిపించే అశకాశం ఉంది. చూడాలి రాజకీయ విశ్లేషకులకు కూడా అందని దాడి మౌనం వెనుక అసలు రహస్యం ఏమై వుంటుందనేది..!

anakapalli

2025-01-16 16:05:10

అంతర్ రాష్ట్ర దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త-ఎస్ఐ

అంతర్ రాష్ట్ర దొంగలు(నార్త్ ఇండియా గ్యాంగ్) గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని క్రిష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు సూచించారు. ఈ మేరకు ఆయన నర్సీపట్నం డీఎస్పీ సూచనలు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నార్త్ ఇండియా గ్యాంగ్ రాత్రి సమయంతోపాటు పగటి పూట కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ప్రజలు, గ్రామాల్లోని యువత అప్ర మత్తంగా ఉండాలన్నారు. గ్రామానికి చెందిన వారు కాకపోయినా.. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచా రం అందించాలన్నారు. గ్రామాల్లోని పెద్దలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఇంట్లో పడుకునే సమ యం లో తలుపులు గట్టిగా వేసుకోవాలని హెచ్చరించారు.  ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు, సామాన్లు వెంటతీసుకు వెళ్లాలని ఎస్ఐ సూచించారు.

krishnadevipeta

2025-01-16 14:42:33