1 ENS Live Breaking News

విశాఖ మన్యంలో ముగ్గురు మావోయిస్టులు అరెస్టు..

విశాఖరూరల్ జిల్లా పోలీసులు మావోయిస్టుల ఏరివేతలో పురోగతి సాధిస్తున్నారు. అంతేకాదు దళంలో ఉన్న సభ్యులను, ప్రాంతాల నాయకులను లొంగిపోవాలని సూచన చేస్తున్నారు. ఈ తరుణంలోనే జిల్లాలోనే చింతపల్లి మండలం అన్నవరం పోలీసులు  మావోయిస్టు పార్టీకి చెందిన బోనంగి నాగేశ్వరరావు(34), గడుతూరి రామచంద్ర పడాల్ (35), సింద్రి అప్పారావు(31)‌ను అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్​కు తరలించామని చింతపల్లి, పాడేరు సీఐలు శ్రీను, పైడపు నాయుడు తెలిపారు. పలు కేసుల్లో వీరు ప్రధాన నిందితులని సీఐ శ్రీను తెలిపారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులపై ఎటువంటి కేసులు నమోదు చేయమన్న పోలీసులు అలాంటి  మావోయిస్టులకు పునరావాసం ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని సీఐలు శ్రీను, పైడపునాయుడు తెలిపారు. మావోయిస్టుల అగ్రనేతలు లొంగిపోతున్నారంటూ మీడితో ప్రచారం జరుగుతున్న తరుణంలో మావోయిస్టుల అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అంతేకాదు విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులను పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది...

Chinthapally

2020-09-05 13:41:23

ఇంజనీరింగ్ అధికారుల మైండ్ సెట్ మారాలి..కలెక్టర్

ఏజెన్సీలో నిర్మాణాలు యుద్ద ప్రాతిపధికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏజెన్సీ పర్యటనలో భాగంగా పాడేరు ఐటిడి ఏ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు సకాలంలో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారుల మైండ్ సెట్ మార్చుకోవాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌లు, నాడు నేడులో ప్రహారీ గోడలు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఐదు పనులపై వారం వారం సమీక్షిస్తున్నారని చెప్పారు. ఐదు పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేసే బాధ్యత ఇంజనీరింగ్ అధికారులపైనే ఉందన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి అనుమతి లేకుండా మైదాన ప్రాంతానికి వస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మన్యంలోనే నివాసం ఉండాలని చెప్పారు. ఏ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా సంబంధిత మండల కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని అన్నారు. రేపు చేయవలసిన పనిని ఈరోజే చెయ్యాలని, ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయాలని సూచించారు. ఉపాధిహామీ పధకం లో చేపట్టిన పనులు పర్యవేక్షణకు పాడేరు నియోజక వర్గానికి గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కుమార్‌ను,పంచాయతీరాజ్ ఈ ఈని కుసుమ భాస్కర్‌ను బాధ్యులుగా నియమించినట్లు చెప్పారు. అరకువేలీ నియోజక వర్గానికి గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ జి.మురళి, పంచాయతీరాజ్ (పి ఐ యు) ఈ ఈ శ్రీనివాస్‌రావును బాధ్యులుగా నియమించామన్నారు. పనులను ప్రతీరోజు తనిఖీ చేసి ఇంజనీర్లతో సమీక్షించాలని ఈ ఈలను ఆదేశించారు. పనులను సవాల్‌గా తీసుకుని పూర్తి చేయాలన్నారు. ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ ఇంజనీర్లకు లక్ష్యాలను నిర్దేశించామని చెప్పారు. మార్చి 31 వతేదీలో రైతు భరోసా కేంద్రాలు , అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం రూ.9.61 కోట్ల పనులు జరగాలని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్. ఇ జి.సుధాకరరెడ్డి, ఎస్ ఎస్ ఎ పి. ఓ మల్లిఖార్జున రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ కుసుమ భాస్కర్, డ్వమా పి డి సందీప్ 11 మండలాల డి. ఇలు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-04 18:13:32

మౌళిక వసతుల కల్పనలో రాజీపడొద్దు..జిల్లా కలెక్టర్

విశాఖ ఏజెన్సీలో చేపడుతున్న పాఠశాల నిర్మాణంలో మౌళిక సదుపాయాల కల్పనలో రాజీపడరాదని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. శుక్రవారం వి. మాడుగుల మండలం డి. సురవరం గ్రామంలో నిర్మించిన నాడు – నేడు డెమో పాఠశాలను (కె.జి.బి.వి. విద్యాలయాన్ని) ఆయన పరిశీలించారు. సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించిన కాంపౌండ్ వాల్, పెయింటింగ్, మరుగుదొడ్లు, త్రాగునీరు, తదితర 9 రకాల నాడు-నేడు పనుల ను ఆయన క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు.  నిధులను సక్రమంగా వినియోగించుకున్నది లేనిది సర్వశిక్ష అభియాన్ పి.ఓ. మళ్లిఖార్జునరెడ్డిని అడిగి తెలుసుకు న్నారు.  గ్రూపు కమిటీ సభ్యులలోని ఒకరితో మాట్లాడుతూ ఇంకా ఏమైనా సౌకర్యాలకు నిధులు అవసరమని ఆయనను అడిగి తెలుసుకున్నారు.  డైనింగ్ రూం, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, తదితర వాటిని ఆయన క్షణ్ణంగా పరిశీలించి నాణ్యతలో లోపం ఉండకూడదన్నారు.  ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

వి.మాడుగుల

2020-09-04 18:02:49

పొలం బడితో రైతులకు మేలైన సూచనలు, సలహాలు

రైతులు పొలం నిర్వహణలో మిత్ర పురుగుల యొక్క లాభాలు తెలుసుకోవడం ద్వారా పంటల యాజమాన్యం సులువు అవుతుందని వ్యవసాయాధికారి కెజె చంద్రశేఖ ర్ సూచించారు. గురువారం శంఖవరం మండలం అన్నవరంలో రైతులకు పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు యాజమాన్య పద్దతులపై సూచనలు సలహాలు చేశారు. అంతేకాకుండా పంటలకు ఎలుకలు ఏ విధంగా నష్టం కలిగిస్తాయో వివరిస్తూ, వాటిని నియంత్రించే పద్దతులను కూడా రైతులకు తెలియజేశారు. రైతులు నిత్యం పొలం బడి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంచి యాజమాన్య పద్దతులు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వం అందించే పలు పథకాల కోసం కూడా తెలుసుకోవడానికి వీలుపడుతుందన్నారు. గ్రామాల్లో రైతులకు ఏ అవసరం వచ్చినా ప్రతీగ్రామంలోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తే అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు తగు సూచనలు సలహాలు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రంలో ఏఈఓ వై.రాబిన్ సుదర్శన్, వివిఏ మణికంఠ, రైతులు పాల్గొన్నారు...

Annavaram

2020-09-03 19:06:49

కోవిడ్ కేంద్రాలను పరిశుభ్రం ఉంచాలి..ఆర్డీఓ

 విశాఖ ఏజన్సీ లోని కోవిడ్ కేంద్రాలు పరి శుభ్రంగా ఉంచాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మి శివజ్యోతి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం పాడేరు లో ని కోవిడ్ కేంద్రాన్ని గారు ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, కోవిడ్ కేసులున్న ఏరియాలో కంటైన్మెంటు జోన్స్ ఏర్పాటు చేయాలన్నారు. చుట్టుపక్కల బార్కేట్స్ ఏర్పాటు చేసి ఒకప్రక్క మార్గం వుండేటట్లు చూడాలని, ఈ కోవిడ్  కేంద్రాలకు సంబంధించి పంచాయితీ  సెక్రటరీ లు, విలేజ్ వాలంటీర్లు కంటైన్మెంటు జోన్స్ లోకి బయట వారిని రానివ్వకుండా చూడాలన్నారు.  కోవిడ్ సెంటర్స్ ను ఎంపి.డి.ఓ లు,వైద్య సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ 200 మీటర్ల పరిధిలో కోవిడ్ కేసులు వచ్చినచో కంటైన్మెంటు జోన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. కంటైన్మెంటు జోన్ 28 రోజులు వుంచి అధికారులు ఆదేశాలు ఇచ్చేవరకు బార్కేట్స్ ని తొలగించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎడిషనల్ డియమ్ హెచ్. ఓ.లీలాప్రసాద్,మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్, కోవిడ్ నూడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ వర్మ,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Paderu

2020-09-03 18:48:28

విశాఖ మన్యంలో రూ.188.50 కోట్లతో ఉపాది పనులు..

విశాఖ మన్యంలో రూ.188 కోట్ల 50 లక్షలతో జరుగుతున్న నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డాక్టర్ వేంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. గురువారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమశాఖ, ప్రత్యేక నీటి పారుదల, రహదారులు భవనా లు,గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఉపాధిహామీ కన్వర్జన్స్ పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధిహామీ పనులు పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం నేతృత్వంలో జరుగున్నాయని, పనిభారం పెరిగి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని, జిల్లా కలెక్టర్ అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులను బాధ్యులను చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారన్నారు. ప్రతీ మండలానికి ఒక ఉపకార్య నిర్వహక ఇంజనీరు,4 సహాయక ఇంజనీర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఈపనులు మావికావు అనే భావన విడనాడి సమన్వంతో మార్చి నెలాఖరునాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన్యంలో పెద్ద ఎత్తున ఉపాధి నిధులు ఖర్చు చేయాలన్నారు. 11 మండలాలలో 1629 పనులు జరుగుతున్నాయన్నారు. వీటిలో 1600 ల భవన నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఇంజనీర్లకు అప్పగించిన పనిని నిర్దష్టమైన గడువులోగా పూర్తి చేయాలన్నారు. వారానికి రూ.9.61 కోట్ల ఖర్చు చేయాలన్నారు. ప్రతీ వారం పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. ప్రహారీ గోడల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్మాణానికి పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  పంచాయతీ రాజ్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ జి. సుధాకర రెడ్డి మాట్లాడుతూ, రూ.84.56 కోట్ల తో 212 గ్రామ సచివాలయ భవనాలు, రూ.45.56 కోట్లతో 209 రైతు భరోసా కేంద్రాలు, రూ.20.18 కోట్ల తో 135 వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌లు, రూ.38.28 కోట్లతో 382 అంగన్వాడీ భవన నిర్మాణాలు జరుగు తున్నాయన్నారు. భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇలు కెవి ఎస్ ఎన్ కుమార్, జి.మురళి, పంచాయతీ రాజ్ ఇ ఇ. ఆర్ కె భాస్కర్, పి ఐ యు ఇ ఇ శ్రీనివాస్, అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

పాడేరు

2020-09-03 16:05:13

స్థానిక నివాసం లేకపోతే ఇంటికి పంపిస్తా..ఐటిడిఏ పిఓ

పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండకపోతే చర్యలు తీసుంటామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల తీవ్రంగా హెచ్చరించారు. గురువారం ఈమేరకు అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. గవర్న మెంట్ జి.ఓ.57 ప్రకారం స్థానికంగా ఉండని అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏజెన్సీ నుంచి  అధికారులు మైదాన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అనుమతిపొంది వెళ్లాలని చెప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఘాటుగా హెచ్చరించారు. పీఓ జారీచేసిన ఉత్త ర్వులతో స్థానికంగా ఉండని అధికారులు ఖచ్చితంగా స్థానికంగా ఉండాల్సిందే. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్, గ్రామసచివాలయ సిబ్బంది మైదాన ప్రాంతాల నుంచి అధికంగా రాకపోకలు సాగిస్తున్నారు. మన్యంలో బయోమెట్రిక్ లేని ప్రాంతాల్లో కొంతమంది సిబ్బంది 15 రోజులకి ఒకసారి కూడా ప్రభుత్వ కార్యాల యాలకు రాకుండా కొందరు అధికారుల అండదండలతో ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్నారు. పీఓ జారీ చేసిన ఉత్తర్వులతో ఖచ్చితంగా స్థానికం నివాసం లేకపోతే చర్యలు తప్పేట్టు లేవు...

Paderu

2020-09-03 13:11:40

భద్రాద్రి మన్యంలో ఎన్ కౌంటర్ ఒకరు మ్రుతి...

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవల గూడెం వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదరుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో  ఒకరు మృతి చెందగా.. మరో మావోయిస్టు తప్పించుకున్నారని జిల్లా ఎస్పీ సునీల్ స్పష్టంచేశారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ పోలీసులకు వెళ్లి సందర్శించారు. సంఘటనా స్థలం నుంచి ఒక వ్యక్తి మృత దేహాన్ని స్వాధీనం  చేసుకున్నామని...  పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ చెప్పారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి, పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌తో పాటు మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొండపల్లి సీతారామయ్య హయాంలో గణపతి, మల్లోజులతో పాటు పార్టీలో చేరిన కటకం సుదర్శన్ కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..ఈ క్రమంలోనే జరిగిన ఎన్ కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, అదే మావోయిస్టులతో ఎన్ కౌంటర్ తో గిరిజన పల్లెలు భయాందోళనతో ఒణికిపోతున్నాయి.

దేవలగూడెం

2020-09-03 12:23:24

దారకొండ ఆలయ అవకతవకలపై ఏసి కె.శాంతి దర్యాప్తు..

విశాఖ జిల్లా దారకొండ దారాలమ్మ అమ్మవారి దేవస్ధానంలో అవకతవకలు జరిగినట్లు దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదు లు రావడంతో బుధవారం విచారణ చేపట్టారు.  ఈ సందర్భంగా భక్తులను, దేవాలయం కమిటీ సభ్యులను, అర్చకుడిని, దేవాలయ ఉద్యోగులను దేవాదాయ‌శాఖ స‌హాయ క‌మిష‌న‌ర్ కె.శాంతి విచారించారు. హుండీ ద్వారా వచ్చే ఆదాయం, భక్తులకు ఇచ్చే వసతి గృహాల అద్దెలు, గుడి ప్రాంగణంలోని దుకాణాల అద్దెలు ఏమ వుతున్నాయ‌ని, ఎవరెవరు ఈ ఆదాయాన్ని స్వాహాచేస్తున్నారు అనే విషయాలపై విచార‌ణ చేశారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి నిత్యం వంద‌లాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. నిత్యం ర‌ద్దీగా ఉండే ఆల‌యం నిర్వ‌హ‌ణ‌పై భ‌క్తులు దేవాదాయశాఖాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఆధారాలు ఆధారంగా నింధితులపై చర్యలు తీసుకుంటామని సహాయ కమిషనర్ శాంతి వివరించారు.  కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ తో పాటు, ఆల‌య‌ సిబ్బంది పాల్గొన్నారు.

Darakonda

2020-09-02 17:52:14

కరోనా ద్రుష్ట్యా యూనివర్శిటీ పరీక్షలు రద్దు చేయాలి..

దేశంలో,రాష్ట్రంలో కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పరీక్షలు పెట్టి  వారి ప్రాణాలతో ఆటలు అడుతోందని ఎస్ఎఫ్ఐ మండలఎం.గంగాసూరిబాబు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ అల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు స్థానిక శంఖవరం తహశీల్దార్ కార్యలయం విద్యార్ధులు  నిరసన తెలియజేయజేశారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షుడు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితి లో దేశ వ్యాప్తంగా జరుగుతున్న జెఈఈ పరిక్షలకి మన రాష్ట్ర లో 30శాతం మంది పైగా విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. పరిక్ష రాయడానికి కూడా సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారుని ఆరోపించారు.  దేశ వ్యాప్తంగా జరగబోయే నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షలను కూడా తక్షణమే నిలుపుద చేయాలన్నారు.   జిల్లా లో కరోనా కేసులు పెరుగుతున్న పట్టించుకోకుండా  పరిక్షలు నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వుంటుందన్నారు.  అనంతరం శంఖవరం మండలం తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శి బి.శివరాజు, సహయకార్యదర్శి పి.శివ మాదవ్, ఉపాద్యక్షులు పి.కుశరాజు, తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2020-09-02 16:54:37

వార్త ప్రసాద్ కుటుంబానికి రూ.2.12లక్షల ఆర్థిక సహాయం.

విశాఖజిల్లాలోని గాజువాకలో వార్త దినపత్రికలో పనిచేస్తూ మరణచించిన ప్రసాద్ కుటుంబానికి  గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇంచార్జ్ దేవన్ రూ.2.12లక్షలు ఆర్దిక సహాయం అందజేశారు. బుధవారం ఈ మేరకు ఆ మొత్తాన్ని ప్రసాద్ కుటుంబానికి వీరు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రసాద్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎంతో చక్కగా వ్యవహరిస్తూ,  ప్రజా సమస్యలపై మంచి వార్తా కధనాలు రాసేవారన్నారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మరణిచండం ఎంతగానో కలచివేసిందన్నారు. ఆర్ధిక సహాయంలో గాజువాక నియోజకవర్గ జర్నలిస్టులు రూ. 67500 ,అలాగే  ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పిలుపుతో వ్తెఎస్సార్సీపి కార్పొరేటు అభ్యుర్దులు, నాయకులు స్పందించి రూ. 1.15 లక్షలు, బిజేపి నాయకులు రూ.15వేలు, జనసేన ఐదువేలు,బయట వ్యక్తులు రూ.10 వేలు సహాయం అందించారు. అంతేకాకుండా  ఎమ్మెల్యే స్పందిస్తూ, జర్నలిస్ట్  ప్రసాదు పిల్లలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.  అలాగే తిప్పల దేవన్ రెడ్డి,వైసీపీ నాయకులు దర్మాల శ్రీను, గౌస్, జర్నలిస్టులు మూల. గిరిబాబు, సాక్షి శశి, శేషు, పరశురాము,గుప్తా,మూర్తి, సాయి, శిరీష, సందీప్.గోవింద్, కృష్ణ, కృష్ణశ్రీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2020-09-02 16:51:20

పేదల గుండెల్లో నిలిచిన మహా మనిషి డా. వైఎస్సార్...

మహానేత స్వర్గీయ డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలు మరువలేని మహా మనిషి అని  గాజువాక నియోజకవర్గం  ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. డా.వై ఎస్సార్  11 వ వర్ధంతి కార్యక్రమాన్ని  87 వ వార్డు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి కార్పోరేటర్ అభ్యర్థి బొడ్డ గోవింద్ ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  దేవన్ రెడ్డి మాట్లాడుతూ, మరణం లేని మహనీయుడు మన ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ మాత్రమేనన్నారు.  అనంతరం వృద్ధులకు, నిరుపేదలకు పండ్లు,  రొట్టెలు, దుస్తులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ, వడ్లపూడి ఈశ్వరరావు, బొడ్డ వెంకటసూరి, దుగ్గపు సూరిబాబు, గెద్దాడ చిన్న అప్పన్న, దరిగి రవి, దుగ్గపు సత్యనారాయణ, దొడ్డి వెంకటసత్యనారాయ, నరసింహ మూర్తి,  పిన్నింటి సంతోష్, చిత్రాడ రాజు, హరీష్ వర్మ, కాండ్రేగుల కనక లక్ష్మి,  గాలి నూకరాజు, ఇర్ని వెంకట్రావు, అప్పారావు, బద్దెమ్ ప్రసాద్, డి ఎన్ మూర్తి, కణితి శ్రీను, రాజు, గురుగుబెల్లి అప్పలస్వామి, బొడ్డ దామోదర్, గేదల ఆరుద్ర,  ఎన్ శంకర్, పి ఆనందరావు, పి మురళి, రాజకుమార్, శ్రీనివాస్, రమణ, ఎన్ వి రమణ, ప్రసాద్, లక్ష్మణ రావు, సూరిబాబు, అజయ్, శ్రీను, ఝాసువా, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.

Kurmannapalem

2020-09-02 16:07:06

మోడ్రన్ టెక్నాలజీపై సర్వేయర్లకు శిక్షణ..ఆర్డీఓ

సర్వేయర్లు నూతన సాంకేతిక విధానాల ద్వారా సర్వే చేయడం నేర్చుకుంటే రాబోయే  భూసర్వేకి ఎంతో ఉపయుక్తంగా వుంటుందని పాడేరు ఆర్డీఓ కె.లక్ష్మి శివజ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం మోడరన్ టెక్నాలజీ మీద గ్రామ సర్వేయర్ లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదటి దశ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వేయర్లకు నూతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చిన అన్ని అంశాల్లో వీరిని సమర్ధవంతంగా తయారు చేయాలని భావించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశ లో భాగంగా తేదీ 02-09-2020 నుండి 01-10-2020 వరకు పి.ఎమ్.ఆర్. సి. లో జరుగుతుందని ఆమె చెప్పారు. ఈశిక్షణలో సర్వేయర్లు పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకొని ప్రభుత్వ సర్వేకి అనుగుణంగా తయారు కావాలన్నారు. కొత్తగా టెక్నాలజీపై ఇచ్చే శిక్షణ పూర్తిస్థాయిలో పొందడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ కార్యక్రమం లో బి.య న్. ప్రసాద్ ( డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వేయర్) మరియు పి.శ్యామ్ ప్రసాద్ ( ఏ.ఓ.) తదితరులు పాల్గొన్నారు.    

Paderu

2020-09-02 15:10:51

దేశంలోనే తిరుగులేని నేత దివంగత వైఎస్సార్...పర్వత

దేశంలోనే తిరుగులేని నేతగా దివంగ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరెడ్డి ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండి పోతారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని శంఖవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన మార్గదర్శకంలో జీవితాంతం కొనసాగుతామని చెప్పిన ఆయన అదే స్పూర్తిని నేడు ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహనరెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పారు. 108, ఉచిత విద్య, పేదవాడికి గూడు లాంటి పథకాలు కల్పించిన దేవుడు వైఎస్సార్ అని, అందుకే తెలుగు ప్రజలు ఆయనను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని అన్నారు. ఆ మహానేత మనలో లేకపోయినా ఆయన ప్రవేశ పెట్టిన పథకాల్లో ఎల్లప్పుడూ బతికే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శంఖవరం

2020-09-02 11:19:53

మడమతిప్పని..మాట తప్పని నాయకుడు వైఎస్సార్

దివంగత నేత వైఎస్సార్ గారి 11వ వర్ధంతిని బుధవారం గొలుగొండ మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు ఆధ్వర్యంలో ఏఎల్ పురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ అమర్ రహే,వైఎస్సార్ లాంగ్ లివ్, జోహార్ రాజన్న అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాస్కరనాయుడు మాట్లాడుతూ, మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు ఒకే ఒక్కడు వైఎస్సార్ అని కొనియడారు. ఆయన దయతో ఎంతో మందివిద్యార్ధులు ఉచితంగా చదువుకోవడానికి వీలుపడిందన్నారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడే ఆపద్భాందవి 108 అంబులెన్సుని  ప్రవేశ పెట్టిన మహనీయుడని, ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో  వైసీపీ నాయకులు రుత్తల రామకృష్ణ మహిళలు నాయకులు ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

ఏఎల్ పురం

2020-09-02 11:01:25