1 ENS Live Breaking News

ప్రతి గిరిజన కుటుంబానికి రెండెకరాల భూమి

విశాఖ ఏజెన్సీలో భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి కనీసం రెండెకరాల భూమికి హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని పాడేరు ఐటిడిఏపీఓ  డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. మంగళవారం జి.కె.వీధి మండలం దామనాపల్లి పంచాయతీ దొడ్డికొండ ,కట్టుపల్లి  సంకాడ పంచాయతీ చిన్న జాడమూరు గ్రామాల గిరిజన రైతులు సాగుచేస్తున్న అటవీ భూములను పరిశీలించారు. కాపీ తోటల్లో పర్యటించి  ఆర్వో ఎఫ్ ఆర్ భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. కట్టుపల్లి గ్రామంలో కూడ సన్యాసిరావు ,చిన్న జాడమూరు గ్రామంలో దేసగిరి యుగంధర్ కాఫీ తోటల్లో పర్యటించి భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడుతూ కాఫీ, మిరియాలసాగు పై వస్తున్న దిగుబడి,  ఆదాయాలను అడిగితెలుసుకున్నారు. కాఫీ రైతులకు కాఫీ పల్పర్ యంత్రాలను సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామంలో తాగునీటి సమస్యలు, అంగన్వాడీ సేవలపైనా, రైతుభరోసా రైతులకు వచ్చిందా ని ఆడిగితెలుసుకున్నారు. చిన జాడమూరు గ్రామంలో పర్యటించి దేశగిరి యుగంధర్ కాఫీ తోటలు పరిశీలించారు. కాపీరైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఐటీడీఏ నుంచి పసుపు విత్తనాలు పొంది సాగు చేస్తున్న పసుపురైతు  ఒలం బాబూరావు పసుపు తోటను సందర్శించారు. అనంతరం చాపరాతి పాలెం నుండి రాజేంద్రపాలెం వరకు రూ.785.40 లక్షలు వ్యయంతో పి.ఎం.జి.ఎస్ వై లో నిర్మిస్తున్న రోడ్ పనులను, పెడవలస గ్రామ పంచాయతీ, రైతు భరోసా కేంద్రం నిర్మాణపు  పనులు తనిఖీ చేశారు.  నిర్మాణాల్లో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి.కె.వీధి తహసీల్దార్, వి.రాజ్ కుమార్ ,పి.ఆర్ ఏ ఈ కె.జ్యోతిబాబు వి.ఆర్వో పద్మ తదితరులు పాల్గొన్నారు.

గూడెంకొత్తవీధి

2020-09-15 15:44:39

హోమ్ ఐసోలేషన్ ద్వారానే కరోనా నుంచి రక్షణ..

శంఖవరం పీహెచ్సీలో సోమవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 10 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలి యజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 98 మందికి పరీక్షలు చేయగా 10 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖ వరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకొని మందులు వాడటం ద్వారా వైరస్ నియంత్రణ జరుగుతుందన్నారు. ప్రజలంతా ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

Sankhavaram

2020-09-14 19:48:29

సర్వే నివేధికలు సమర్పించండి.. కాంతిలాల్ దండే

విశాఖ ఏజెన్సీలోని భూమి లేని గిరిజన కుటుంబాలను గుర్తించడానికి చేపట్టిన సర్వే ప్రగతి నివేధకలు సమర్పించాలని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే సూచించారు. ఈనెల 28 వతేదీలోగా కనీసం రెండు ఎకరాల భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి వచ్చేనెల 2వతేదీన పట్టాలు పంపిణీకి సిద్దం కావాలని స్పష్టం చేసారు. సోమవారం విజయవాడ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు కార్యాలయం నుంచి ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేని కుటుంబాలు ఎన్ని, రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి రెండు ఎకరాల భూమి పంపిణీ చేయడానికి భూములు గుర్తించి డి ఎల్ సి అనుమతులు పొందాలని స్పష్టం చేసారు. మన బడి నాడు నేడు పనుల ముఖ్యమంత్రి సలహాదారు మురళీ మాట్లాడుతూ నాడు నేడు పనులను ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. పాఠశాలల్లో నాడు నేడు లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. విద్యుత్తు, తాగునీరు,మరుగుదొడ్ల నిర్మాణాలు, ప్రహారీగోడలు నిర్మాణాలు వేగంగాపూర్తి చేయాలన్నారు. భవనాలు లేని పాఠశాలలకు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల నిర్మాణపు పనులు పూర్తియిన వెంటనే రంగువేయడానికి సిద్దం చేసామన్నారు. విద్యుత్తు లేని పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఐటి డి ఏ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ 1 లక్ష 7 వేల కుటుంబాలను సర్వే చేసామని చెప్పారు. 14 వేల రెండు వందల కుటుంబాలకు కనీసం భూమి లేదన్నారు. ఈనెల 24 వతేదీన జిల్లా స్దాయి కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులు తీసుకుంటామన్నారు. పాడేరు డివిజన్ పరిధిలో 367 పాఠశాలల్లో నాడు నేడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వాటిలో 85 పాఠశాలలను తనిఖీ చేసామన్నారు. గ్రామ సచివాలయాలకు నెట్ వర్క్ సౌకర్యంలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,పాడేరుకు 19 మొబైల్ టవర్లు మంజూరు చేసారని ఇంకా మరికొన్ని టవర్లు మంజూరు చేయాలని కోరారు.

Paderu

2020-09-14 18:58:02

ఆ ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి..

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలోని... ఎస్.రాయవరం గ్రామం నుంచి గుండ్రబిల్లి వెళ్లే మార్గమధ్యలో సర్వే నెంబరు 58, ఖాతా నెంబరు 20000102లోని 76 సెంట్ల ప్రభుత్వ భూమిని తక్షణమే అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సమాచారహక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డికి మౌర్యకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు సర్వే చేస్తుందని, కానీ అక్రమార్కుల చెరలో వున్న భూములను మాత్రం పట్టించుకోకుండా కొంతమంది అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వ భూములు వెతుకుతున్న ప్రభుత్వం పక్కా ఆధారాలతో ఆక్రమణలో ఈ భూమిని స్వాధీనం చేసుకుంటే ఈ ప్రాంతంలో మరిన్ని అన్యాక్రాంతం అయిన భూములు వివరాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు. కేవలం రెవిన్యూ అధికారుల అండదండలతో అధికార పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ భూములను ఖబ్జాచేసి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఖబ్జా చేసిన భూములను అక్రమార్కులు యధేచ్చగా సాగుచేస్తున్న విషయాన్ని స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని,అయితే సదరు అధికారులు ఆక్రమణదారులకు కొమ్ముకాయడంతో సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్టు సోమిరెడ్డి మీడియాకి వివరిస్తూ, ఆక్రమణకు గురైన భూముల వివరాలు, సర్వే నెంబర్లు, ఫోటోలను విడుదల చేశారు.

ఎస్.రాయవరం

2020-09-14 14:25:59

2020-09-13 09:07:43

చిన్నారికి సీఎం రిలీఫ్ అండ్ అందజేసిన ఎమ్మెల్యే గణష్

గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన ఓచిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడిన సంఘటన పై గొలుగొండ వైఎస్సార్సీపీ నాయకులు తక్షణమే స్పందించారు. ఆ చిన్నారికి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో మండల నాయకులు, గిరిబాబు, నాయుడు తదితరులు తమ సొంత నిధులతో వైజాగ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఎమ్మెల్యే  పెట్ల ఉమ శంకర్ గణేష్ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడంతో అక్కడి నుంచి కూడా రూ.10వేలు ఆర్ధిక సహాయం మంజూరైంది. ఈ మొత్తాన్ని చిన్నారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శనివారం తన కార్యాల యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి నిరుపేదను ఆదుకుటుందని చెప్పారు. అదే సమయంలో నాయకులు గిరిబాబు, నాయుడు ఒక చిన్నారి ప్రాణాలను కాపాడటంతో చూపిన చొరవను అభినందించారు. ప్రతీ నాయకుడూ వారి ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా తన ద్రుష్టికి తీసుకురావచ్చొని ఎమ్మెల్యే భోరాసా ఇచ్చారు. కార్యక్రమంలో గొలుగొండ మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Narsipatnam

2020-09-12 12:46:07

శంఖవరం మండలంలో 4 కరోనా పాజిటివ్ కేసులు..

శంఖవరం పీహెచ్సీలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 4 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలి యజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 41 మందికి పరీక్షలు చేయగా అందులో 4(శంఖవరం-1, శ్రుంగవరం-1, గిడిజాం-1, రౌతుల పూడి-1) మాత్రమే పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలా అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

Sankhavaram

2020-09-11 16:05:04

వైఎస్సార్ ఆసరాతో మహిళలకు ఆర్ధికాభివ్రుద్ధి.. దత్తుడు

రాష్ట్రంలోని మహిళలకు పెద్దన్నగా నిలవాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్క నిరుపేదకి చేరుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రాజాసాగి దత్తుడుబాబు అన్నారు. శుక్రవారం కోటవురట్ల మండలం తంగేడు గ్రామ గ్రామసచివాలయంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా సంబరాల కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి ఆయనతోపాటు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దత్తుడుబాబు మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయ సాధనకు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజా సంక్షేమమ కార్యాక్రమాలు జనరంజకంగా వున్నాయనే భావన ప్రతీ మహిళలోనూ కలుగుతుందన్నారు. దీనిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నా వాటిని ప్రజలే తిప్పికొడుతున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమలు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్ ఆసరాతో డ్వాక్రా మహిళలకు ఎంతో మేలు జరుగుతందన్నారు. కార్యక్రమంలో సచివాలయ వ్యవసాయ సహాయకులు కోసూరు సత్యన్నారాయణ, గ్రామంలోని డ్వాక్రా మహిళలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తంగేడు

2020-09-11 13:07:05

ఆక్రమణ స్థలం క్రమబద్దీకరణ కోసం.. చెరువు గర్భంలో సచివాలయం

కాదేదీ కోర్టు దిక్కారణకు అనర్హం... కాదేదీది ఆక్రమణలకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు చెరువు గర్భం.. అధికారులు చేతిలో వుంటే చెరువు గర్భంలోనేకాదు ...ఏకంగా చెరువులోనే గ్రామసచివాలయ భవనాలు నిర్మించొచ్చు. లాయరు నోటీసులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేయొచ్చు...సరిగ్గా అలాగే జరుగుతుంది ఎస్.రాయవరంలోని కొత్తగా మంజూరైన ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్న మండల అధికారుల తీరు. ప్రభుత్వం గ్రామసచివాలయం, వెలనెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు రూ.75 లక్షలు ఎస్.రాయవరం గ్రామపంచాయతీకి కేటాయించింది. కాగా అధికారపార్టీకి చెందిన నేతలు అధికారులను ప్రసన్నం చేసుకొని, ఆ నిర్మాణాలు కాస్త గ్రామంలో కేటాయించిన ఎస్.రాయవరంలో కాకుండా, పక్క రెవిన్యూ గ్రామమైన కర్రివానిపాలెం రెవిన్యూ విలేజిలోని చెరువు గర్భంలో నిర్మిస్తున్నారు. వాస్తవానికి చెరువు గర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడని ఇప్పటికై హైకోర్టులో ప్రభుత్వ వాదనలు నడుస్తున్నాయి. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, గ్రామంలోకాకుండా మరొక రెవిన్యూ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై స్థానికులు కోర్టు నోటీసులు ఇటు జిల్లా పంచాయతీ అధికారికి, స్థానిక ఎంపీడీఓ, గ్రామ సచివాలయానికి పంపారు. అయినప్పటికీ వాటిని పక్కనపెట్టి యధేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే విషయమై లాయరు నోటీసు అందుకున్న జిల్లా పంచాయతీ అధికారి(తేది 18-8-2020న) స్థానిక ఈఓపీఆర్డీకి చెరువు గర్భంలోని నిర్మాణాల విషయమై విచారణ చేసి నివేదిక పంపాలని, లాయరు నోటీసుకి బదులు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, నిర్మాణాలన్నీ సజావుగానే సాగుతున్నట్టుగా జిల్లా అధికారులను నమ్మించారు స్థానిక అధికారులు. అసలు మంజూరైన గ్రామంలో కాకుండా కర్రివానిపాలెం రెవిన్యూ విలేజిలో చెరువు గర్భంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం చేపడుతున్న నిర్మాణాలు ఏవిధంగా చేస్తున్నారు, ఏ అధికారంతో చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకొని చేస్తున్నారు, అసలు గ్రామంలో కాకుండి పక్క రెవిన్యూ గ్రామంలో ఎందుకు చేస్తున్నారు? ఇలా చాలా అనుమానాలే ఉన్నాయిక్కడ. అంతేకాదు ఎవరు వెళ్లి చూసినా ఇక్కడ ప్రభుత్వాన్ని, అటు కోర్టు ఆదేశాలను దిక్కరిస్తున్నారని అర్ధమవుతుంది.  అధికారపార్టీచెందిన నేతలు అదే ప్రాంతంలో కొన్ని స్థలాలు గతంలోనే ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే ప్రాంతలో చేపడిపతే తమ ఆస్తులన్నీ క్రమబద్ధీకరణ జరుగుతాయనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ నిర్మాణాలపై అధికారులు కనీసం విచారణ చేపట్టకపోవడం, నిబంధనలకు విరుద్దంగా గ్రామంలో కాకుండా ఈ రెవిన్యూ గ్రామంలోని చెరువు గర్భంలో నిర్మాణాలు యధేచ్ఛగా చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రారంభంలో ఉన్న నిర్మాణాల చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయని న్యాయవాది అన్నపూర్ణయ్య ఈ నోటీసులు పంపారు. నోటీసు బుట్టదాఖలై ప్రభుత్వ కార్యాలయాలు మంజూరైన గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో యధేచ్చగా సాగిపోతున్నాయి. ఎప్పుడైనా భారీ వరదలు వస్తే గ్రామంలోని నిరు, చుట్టు ప్రక్కల ప్రాంతాల నీరు ఈ నిర్మాణాలనే తాకుతుంది అయినప్పటికీ, ఆ విషయాలను పట్టించుకోకుండా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారు. మరి ఈ నిర్మాణాలపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి...

ఎస్.రాయవరం

2020-09-11 12:41:53

శంఖవరంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

శంఖవరం మండలకేంద్రంలో ఈ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. మంగ ళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిం చినట్టు ఆయన వివరించారు. మొత్తం 72 మందికి స్వాబ్ ర్యాపిడ్ టెస్టులు చేయగా  అందులో 10 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ జె.రాంబాబు, తహశీల్దార్, సుబ్రమణ్యం, మూడు గ్రామసచివాలయాలకు చెందిన కార్యదర్శిలతో పాటు ఇతర అధికారులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.

Sankhavaram

2020-09-09 18:38:43

పెద్ద సారూ మా రోడ్డు పరిస్థితి ఓసారి చూద్దురు..

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలో మద్దాలవీధి లింగరాజుపాలెం రహదారి చాలా దారుణంగా తయారైంది. రోడ్డు మొత్తం గతుకుల మయంగా మారింతి. చిన్న వర్షంగా పడినా గోతులన్నీ మురుగు నీటిత నిండిపోయి ప్రయాణానికే ఇబ్బందులు ఏర్పాడుతున్నాయి. దీంతో ఈ ప్రధాన రహదారిలో ప్రయాణించడానికి వాహన చోదకులు తీవ్రవ ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని ప్రభుత్వ అధికారులు స్వయంగా చూస్తే తప్పా తాము పడుతున్న ఇబ్బందులు తెలియవని సామాజివేత్త, సహచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు తెలియజేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి రాళ్లు పైకి తేలిపోవడంతో ఈహదారిలో ప్రాయాణం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ఎంపీడీఓ ద్రుష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్తరోడ్డు వేయకపోయినా రోడ్డులో పడ్డ భారీ గుంతలను పూడ్చినా కాస్త ఉపసమనం లభిస్తుందని ఆయన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నరేగా నిధులతో ఈ ప్రాంతంలో కొత్తరోడ్డు వేస్తే ప్రధాన రహదారి ఇబ్బందులు తొలగుతాయని రాజు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎస్.రాయవరం

2020-09-06 12:14:09

శంఖవరంలో తగ్గని కరోనా పాజిటివ్(ఈరోజు 17)కేసులు

శంఖవరం మండలకేంద్రంలో ఈ ఒక్కరోజే అత్యధికంగా17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 150 మందికి స్వాబ్ ర్యాపిడ్ టెస్టులు చేయగా  అందులో 17 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరంలో విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.

శంఖవరం

2020-09-05 19:12:13

త్వరితగతిన సచివాలయాలు పూర్తికావాలి.. జిల్లాకలెక్టర్

విశాఖజిల్లాలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసురావాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పంచాయితీరా జ్ ఎస్.ఇ. ని ఆదేశించారు. శనివారం అచ్యుతాపురం మండలంలో పర్యటించి హరిపాలెం గ్రామం, కొండకర్ల ఆవ, చీమలాపల్లి గ్రామాలను ఆయన సందర్శించి నాడు – నేడు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హరిపాలెం గ్రామంలో   కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కన్న కలలకు దగ్గరగా గ్రామ సచివాలయం ఉందన్నారు.  గ్రామ సచివాలయం  భవనం వలె రైతు భరోసా కేంద్రంను నిర్మించాలని తెలిపారు.  రైతు భరోసా కేంద్ర నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి వస్తుందని పంచాయితీ రాజ్ ఎస్.ఇ సుధాకర్ రెడ్డి.ని అడిగి తెలుసుకున్నారు.  నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సీతారామారావు, పంచాయితీ రాజ్ ఎస్.ఇ సుధాకర్ రెడ్డి, ఎస్.ఎస్.ఎ. పి.ఓ మల్లిఖార్జున రెడ్డి, తహసిల్థార్   నారాయణరావు, ఎంపిడిఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Acchutapuram

2020-09-05 18:51:03